
న్యూఢిల్లీ: టాటా టెలీ, జియో సహా అయిదు టెలికం సంస్థలు లెక్కల్లో దాదాపు రూ. 14,814 కోట్ల మేర ఆదాయాలను తక్కువగా చేసి చూపాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించింది. దీనివల్ల ఖజానాకు సుమారు రూ. 2,578 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. 2014–15 దాకా ఈ 5 కంపెనీలు తమ ఆదాయాలను రూ. 14,814 కోట్ల మేర తక్కువ చేసి చూపించినట్లు ఆడిటింగ్‌లో తేలిందని కాగ్ వివరించింది.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ప్రకారం.. టాటా టెలీ, టెలినార్, వీడియోకాన్ టెలికామ్, క్వాడ్రాంట్ (వీడియోకాన్ గ్రూప్ సంస్థ), రిలయన్స్ జియో సంస్థల నుంచి ప్రభుత్వానికి లైసెన్సు ఫీజు కింద రావాల్సిన మొత్తంలో రూ. 1,015 కోట్లు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు రూ. 512 కోట్లు, చెల్లింపుల్లో జాప్యంపై వడ్డీ కింద మరో రూ. 1,052 కోట్లు తక్కువ వచ్చింది. మొత్తం మీద లైసెన్సు ఫీజు, ఎస్‌యూసీ, వడ్డీ కింద చెల్లించాల్సిన దాంట్లో టాటా టెలీసర్వీసెస్ నుంచి రూ. 1,894 కోట్లు, టెలినార్ రూ. 604 కోట్లు, వీడియోకాన్ రూ. 48 కోట్లు, క్వాడ్రాంట్ రూ. 27 కోట్లు, రిలయన్స్ జియో రూ. 7 కోట్ల మేర తక్కువగా కట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment