టెలికం రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 1జీ మొదులుకొని 2జీ, 3జీ, 4జీ అంటూ కొత్త కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. వినియోగదారుల జీవన విధానాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. త్వరలో 4జీ కంటే 10రెట్ల వేగంతో పనిచేసే 5జీ అందుబాటులోకి తేనున్నాయి.
ఈ తరుణంలో టెలికం రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, లేటెస్ట్ టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చేందుకు అనుసరిస్తున్న ఆధునిక పద‍్ధతుల్ని..ఆకళింపు చేసుకుంటున్న స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇందులో భాగంగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌లలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. తొలిసారి యాపిల్ ఈ శాటిలైట్ ఫీచర్‌పై వర్క్ చేస్తుండగా..ఇప్పుడు అదే దారిలో గూగుల్‌తో పాటు ఇతర సంస్థలు సైతం ఈ సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందించనున్నాయి.
గూగుల్ సైతం
గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్ డెవెలప్‌మెంట్ టీంలో కీలకంగా పనిచేస్తున్న Hiroshi Lockheimer యాపిల్ తన ఐఫోన్‌లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఎనేబుల్ చేయడంపై స్పందించారు. ఈ ఫీచర్ ఐఫోన్‌లలోనే కాకుండా.. వచ్చే ఏడాది విడుదల కానున్న ఆండ్రాయిడ్ 14లో ఎనేబుల్ చేసేందుకు గూగుల్, గూగుల్‌తో ఒప్పందమైన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అయితే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి వస్తే ఆండ్రాయిడ్ 13 కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి, పాత వెర్షన్‌లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలన్ మస్క్ మహిమ
ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ ఫోన్‌లలో శాటిలైట్ కనెక్టివిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఈ ఫీచర్ సాయంతో స్మార్ట్ ఫోన్ యూజర్లు నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో సైతం టెక్ట్స్, కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంది. శాటిలైట్ కనెక్టివిటీ ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. శాటిలైట్ నెట్ వర్క్‌లను ఆపరేట్ చేసేందుకు, వినియోగదారులకు అందుబాటులో తెచ్చేందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుందా? లేదా అని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి👉 సముద్రంలో పడిన ఐఫోన్, 'బ్రాండ్' బాబుకు దొరికిందోచ్!
Comments
Please login to add a commentAdd a comment