
‘తప్పుడు ఆదాయ’ టెలికం కంపెనీలపై దాడులు !
పార్లమెంటరీ కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ: తప్పుడు ఆదాయాన్ని చూపించిన టెలికం కంపెనీలపై దాడులు చేయాలని, ఎప్పటికప్పుడు ఆడిట్‌లు నిర్వహించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సుచేసింది. కొద్ది సంవత్సరాల క్రితం తక్కువ ఆదాయాన్ని చూపించిన ఆరు టెలికాం కంపెనీలపై కాగ్ రూపొందించిన నివేదికను పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా కేవీ థామస్ నేతృత్వంలో ఇటీవల సమావేశమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో పై సిఫార్సులు చేశారు. 2006-07-2009-10 మధ్యకాలంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఆర్‌కామ్‌లతో సహా 6 టెలికాం కంపెనీలు తక్కువ ఆదాయాన్ని ప్రకటించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 12,488 కోట్ల నష్టాన్ని కల్గించాయంటూ కాగ్ నివేదిక వెల్లడించింది.