parliamentary committee
-
ఆర్థిక నేరగాళ్లకు బేడీలు వేయొద్దు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి బేడీలు వేయరాదని, హత్య, అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన వారితో కలిపి జైలులో ఉంచరాదని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. బేడీలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు తప్పించుకోకుండా నిరోధించడానికి, అరెస్ట్ సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది భద్రత కోసమే పరిమితమని వివరించింది. అలాగే, నిందితులను అరెస్టయిన తర్వాత 15 రోజులకు మించి పోలీస్ కస్టడీలో ఉంచరాదన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్)లో నిబంధనపై సవరణలను సూచించింది. -
377, 497 సెక్షన్లు మళ్లీనా?
కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్.. పలు కీలకాంశాలపై ముఖ్యమైన సవరణలను తెరపైకి తెచ్చింది. స్వలింగ సంపర్కం (సెక్షన్ 377, వివాహేతర సంబంధాలు (సెక్షన్ 497)లను మళ్లీ నేరాలుగా పరిగణించే అంశాన్ని పరిశీలించేలా ముసాయిదా నివేదికను రూపొందించింది. ఈ రెండు సెక్షన్లను గతంలో సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి విదితమే. బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు తెచ్చేంiదుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో.. ఐపీసీలో సెక్షన్ 497ను రీ క్రిమినలైజ్ చేయాలని.. ఈ మేరకు ఇప్పుడున్న ఐపీసీకి సవరణ చేయాలని సదరు ప్యానెల్ ప్రతిపాదించింది. అంతేకాదు.. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నిబంధనను ప్రవేశపెట్టడం కూడా ఉంది. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మగవారు మహిళలను తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉంది, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. అయితే.... వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది. వివాహేతర సంబంధాన్ని సామాజిక తప్పుగా పరిగణించడాన్ని కొనసాగించాలని, వివాహ రద్దు లేదా విడాకులకు దానిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది. సెక్షన్ 497 ఏం చెప్పింది భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంది. ‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం’ అని ఆ సెక్షన్ నిర్వచిస్తోంది. ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా.. లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు. 2023లో సవరణ.. అయితే.. 2023లో సెక్షన్ 497 రద్దు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. సాయుధ దళాల సిబ్బందిలో వ్యభిచారాన్ని నేరంగానే పరిగణించవచ్చునని తీర్పునిచ్చింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మునుపటి తీర్పునకు సవరణ చేసింది. ఐపీసీ 377 సెక్షన్ కూడా.. భారత న్యాయసంహిత ముసాయిదా నివేదికలో.. ఐపీసీ 377 సెక్షన్ నేరంగా పరిగణించే అంశాన్ని పునరుద్ధరించడంపై కూడా స్టాండింగ్ కమిటీ ప్రతిపాదన చేసింది. 2018లో సుప్రీం కోర్టు 377 సెక్షన్ చెల్లుబాటు కాదంటూ సంచలన తీర్పు ఇచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2018)లో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. * ఇద్దరు మేజర్ల మధ్య స్వలింగ సంపర్కం నేరంగా పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377 చెల్లుబాటు కాదు. * ఇద్దరు మేజర్ల మధ్య ఇష్టపూర్వక స్వలింగ సంపర్కం తప్పు కాదు. * రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 21 ప్రకారం లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ)లకు తమకు ఇష్టమైన లైంగిక ధోరణులను అనుసరించే స్వేచ్ఛ ఉంది. 377 సెక్షన్ రద్దు తర్వాత.. ఆ తరహా నేరాల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో.. పురుషులు, మహిళలు, ట్రాన్స్‌పర్సన్‌లతో కూడిన అంగీకారరహిత లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణించాలని పార్లమెంట్ ప్యానెల్ తాజాగా సిఫార్సు చేసింది. అలాగే పశుత్వ చర్యలను (అసహజ శృంగారం) కూడా నేరంగా పరిగణించాలని సిఫార్సు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
క్రిమినల్ బిల్లుల పరిశీలనకు మరింత సమయం
న్యూఢిల్లీ: ప్రస్తుత క్రిమినల్ చట్టాల స్థానంలో ప్రతిపాదించిన మూడు కొత్త బిల్లులపై హోం శాఖ కార్యకలాపాల పార్లమెంటరీ కమిటీ భేటీ శుక్రవారం అసంపూర్తిగా ముగిసింది. బిల్లుల డ్రాఫ్ట్‌ల అధ్యయనానికి మరింత సమయం కావాలని కమిటీలోని విపక్ష సభ్యులు కోరారు. స్వల్పకాలిక ఎన్నికల లబ్ధి కోసం వాటిని హడావుడిగా ఆమోదించొద్దని కమిటీ చైర్పర్సన్ బ్రిజ్ లాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ నవంబర్ 6న భేటీ అయ్యే అవకాశముందని చెబుతున్నారు. విపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఆ రోజు వాటిని కమిటీ ఆమోదిస్తుందని సమాచారం. బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ చట్టాలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు మూడు కొత్త బిల్లులను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టడం తెలిసిందే. అనంతరం వాటిని పరిశీలన కమిటీకి పంపారు. వాటిపై పరిశీలనకు మరింత కావాలంటూ కమిటీలోని విపక్ష సభ్యులు పి.చిదంబరం (కాంగ్రెస్), డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ) చైర్మన్‌కు లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రతిపాదిత చట్టాలకు హిందీ పేర్లు పెట్టడాన్ని డీఎంకే వంటి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటిని పట్టించుకోరాదని కేంద్రం నిర్ణయించినట్టు చెబుతున్నారు. -
బోరిస్ కావాలనే తప్పుదోవ పట్టించారు
లండన్: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పార్లమెంట్‌ను ఉద్దేశపూర్వకంగా పదేపదే తప్పుదోవ పట్టించారని పార్లమెంటరీ కమిటీ ఆరోపించింది. ప్రధానిగా ఉండగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ డౌనింగ్ స్ట్రీట్‌లోని అధికార నివాసంలో జరిగిన విందుల గురించి తనకు తెలియదనడంపై ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ సమయంలో జరిగిన విందులనే పార్టీ గేట్ కుంభకోణంగా పేర్కొంటున్నారు. ‘సభను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించిన జాన్సన్ తీవ్రమైన ధిక్కారానికి పాల్పడ్డారని భావిస్తున్నాం. ఈ ధిక్కారం మరింత తీవ్రమైంది’అని పార్లమెంట్ హక్కుల కమిటీ పేర్కొంది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ జాన్సన్ ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జాన్సన్ చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు ఆయన్ను 90 రోజుల పాటు బహిష్కరించాలని సూచించింది. రాజీనామా చేసినందున..మాజీ సభ్యులకిచ్చే పాస్‌ను జాన్సన్‌కు ఇవ్వొద్దని పేర్కొంది. -
విమానచార్జీలపై పరిమితి విధించే యోచన లేదు
న్యూఢిల్లీ: విమానయాన చార్జీలపై పరిమితులు విధించడం ద్వారా స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే యోచనేది ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ స్పష్టం చేశారు. ‘ప్రాథమికంగా చార్జీలపై పరిమితులు విధించడం, మార్కెట్ ఎకానమీ లో జోక్యం చేసుకోవడం అనేవి సరికాదు. ప్రభు త్వం ఈ విషయంపై సానుకూలంగా లేదు. ఇటు కనిష్ట అటు గరిష్ట చార్జీల పరిమితి విధించాలను కోవడం లేదు. స్వేచ్ఛాయుత మార్కెట్ ఎకానమీలో అసలు ప్రభుత్వం జోక్యమే చేసుకోకూడదనేది నా అభిప్రాయం‘ అని ఆయన చెప్పారు. అయితే, ప్రయాణికులపై అత్యంత భారీ చార్జీల భారం పడ కుండా, వారు ఇబ్బంది పడకుండా చూసేందుకు ఎయిర్‌లైన్స్‌తో ప్రభుత్వం చర్చించినట్లు బన్సల్ చెప్పారు. చాలా మటుకు రూట్లలో ప్రస్తుతం కనిష్ట చార్జీలు.. దాదాపు ఏసీ రైలు చార్జీల స్థాయిలోనే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులు విధించాలని, ఆ విషయంలో స్వేచ్ఛా మార్కెట్ ఎకానమీ పేరుతో పోటీ సంస్థలను దెబ్బతీసేలా ఎయిర్‌లైన్స్ వ్యవహరించకుండా చూడాలని పౌర విమానయాన శాఖకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసిన నేపథ్యంలో బన్సల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
విదేశీ బ్లాక్స్‌పై కోల్ ఇండియా కన్ను
న్యూఢిల్లీ: ప్రస్తుతం విదేశాలలో ఎలాంటి కోల్ బ్లాకులూలేని పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాకు త్వరలో ఈ అవకాశాలు లభించనున్నాయి. తాజాగా ఇందుకు పార్లమెంటరీ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇకపై విదేశాలలో బొగ్గు గనుల కొనుగోలు అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే ఇందుకు ఆయా క్షేత్రాలపట్ల పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టవలసి ఉంటుంది. ప్రధానంగా తక్కువ యాష్గల కోకింగ్ కోల్ బ్లాకుల కొనుగోలుకి అనుమతించనున్నారు. దీంతో శిలాజ ఇంధనలాకు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమేకాకుండా విదేశాలలో మైనింగ్‌పై కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుంటుందని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న బొగ్గు వనరులను పరిగణిస్తూ విదేశాలలో కోల్ బ్లాకులను కొనుగోలు చేసేందుకు కమిటీ సిఫారసు చేస్తోంది. బొగ్గు శాఖ లేదా కోల్ ఇండియా ఇందుకు సిద్ధపడవచ్చని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో బొగ్గు, గనులు, స్టీల్‌పై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ పేర్కొంది. 2009లో.. పూర్తి అనుబంధ సంస్థ కోల్ ఇండియా ఆఫ్రికానా లిమిటాడా ద్వారా నిజానికి 2009లోనే కోల్ ఇండి యా మొజాంబిక్‌లోని కోల్ బ్లాకుల కొనుగోలుకి ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను సొంతం చేసుకుంది. లోతైన అన్వేషణ, జియోలాజికల్, మైనింగ్ అవకాశాల నివేదికను అధ్యయనం చేశాక బొగ్గు నాణ్యత విషయంలో వెనకడుగు వేసింది. ఇక్కడ బొగ్గు వెలికితీత వాణిజ్యపంగా ఆచరణ సాధ్యంకాదని గుర్తించింది. ఫలితంగా బొగ్గు గనుల కొను గోలు లాభదాయకంకాదని 2016లో ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను తిరిగి మొజాంబిక్ ప్రభుత్వానికి దాఖలు చేసింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండి యా 80 శాతాన్ని ఆక్రమిస్తున్న విషయం విదితమే. -
గ్లోబల్ టెక్ దిగ్గజాలకు సమన్లు
న్యూఢిల్లీ: పోటీని అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్న ఆరోపణలతో పలు గ్లోబల్ టెక్ దిగ్గజాలకు సమన్లు జారీ కానున్నాయి. ఇందుకు గురువారం పార్లమెంటరీ కమిటీ నిర్ణయాన్ని తీసుకుంది. వెరసి గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ట్విటర్ తదితరాలకు సమన్లు జారీ కానున్నాయి. తద్వారా ఆయా కంపెనీల పోటీతత్వ విధానాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై తదుపరి సమావేశాన్ని పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల 12న నిర్వహించే అవకాశముంది. పలు టెక్ దిగ్గజాలు పోటీ నివారణా పద్ధతులు అవలంబిస్తున్న ఆరోపణలపై ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూలంకషంగా చర్చించింది. చదవండి: హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్, యువతకు ఐటీ ఉద్యోగాల రూప కల్పనే లక్ష్యంగా! ఆపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు ఈ అంశాలను నివేదించింది. కాగా.. పోటీ నివారణ పద్ధతులపై సరైన రీతిలో స్పందించేందుకు వీలుగా డిజిటల్ మార్కెట్స్ అండ్ డేటా యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు సీసీఐ పేర్కొంది. తద్వారా గ్లోబల్ టెక్ దిగ్గజాలపై యాంటీకాంపిటీషన్ చర్యలు చేపట్టేందుకు సీసీఐ చట్ట సవరణల కోసం కొత్త బిల్లును తీసుకురానున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా డిజిటల్ విభాగంలో పలు పరిశోధనలను చేపట్టినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, యాపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మేక్మైట్రిప్–గోఐబిబో, స్విగ్గీ, జొమాటో తదితరాలున్నట్లు పేర్కొంది. -
జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లే
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వద్ద వెయ్యికి పైగా కేసులు పెండింగ్‌లో ఉండడం పట్ల పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో 66 కేసులు గత ఐదేళ్లకుపైగా పెండింగ్‌లోనే ఉండిపోవడం ఏమిటని ప్రశ్నించింది. న్యాయం చేకూర్చడంలో జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లేనని ఉద్ఘాటించింది. కేసుల విచారణను సుదీర్ఘకాలం కొనసాగించడం సరైంది కాదని పేర్కొంది. పెండింగ్ కేసుల పరిష్కారంపై ఒక కచ్చితమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలని సీబీఐకి సూచించింది. ఈ మేరకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్ మోదీ నేతృత్వంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తాజాగా తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి 1,025 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు, ఇందులో 66 కేసులు ఐదేళ్లకుపైగా పెండింగ్ ఉన్నట్లు సీబీఐ లిఖితపూర్వకంగా తెలిపిందని నివేదికలో పేర్కొంది. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి సీబీఐలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. డిప్యూటేషన్లపై ఆధారపడడం తగ్గించుకోవాలని, స్వస్తి పలకాలని, కనీసం డీఎస్పీ స్థాయి వరకు అధికారులను శాశ్వత ప్రాతిపాదికన నియమించుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సీబీఐకి పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. -
వివక్ష కాదు వైద్యం కావాలి
భారతదేశంలో ప్రతి పదిమంది స్త్రీలలో ఒకరు క్షయ వ్యాధి బారిన పడుతున్నారని అంచనా. పురుషుడికి ఆ వ్యాధి వస్తే వైద్యం దొరుకుతుంది. కాని స్త్రీకి వస్తే దానిని గుర్తించడంలో ఆలస్యం. వైద్యంలో నిర్లక్ష్యం. వ్యాధి వచ్చిందని తెలిస్తే వివక్ష. దానిని సాకుగా తీసుకుని వదిలిపెట్టే భర్తలు, గదిలో పెట్టే కుటుంబాలు ఉన్నాయి. స్త్రీ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం. ఆమె దగ్గుతూ వుంటే అది పోపు వల్ల వచ్చిన దగ్గు అనుకోకండి. వెంటనే వైద్యం చేయించండి. ఇది జరిగింది. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. మరో పదిరోజుల్లో పెళ్లి అనగా ఆ అమ్మాయికి టీబీ బయటపడింది. డాక్టర్లు వెంటనే వైద్యం మొదలెట్టాలని, ఆరునెలలు తప్పనిసరిగా నాగా పడకుండా మందులు వాడాలని చెప్పారు. దాంతో ఆ అమ్మాయికి, ఆమె కుటుంబానికి గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే ఆమెకు టి.బి. అని తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్లయినా ఆ మందులు అందరి ముందు వాడితే జబ్బు సంగతి బయటపడుతుంది. పెళ్లి ఆగడానికి లేదు. అలాగని ముందుకు వెళ్లడానికీ లేదు. డాక్టర్లు చెప్పింది ఏమిటంటే– మందులు సక్రమంగా వాడితే హాయిగా మునుపటి జీవితం గడపవచ్చు అని. అమ్మాయి ధైర్యం చేసింది. పెళ్లి చేసుకుంది. కాని ఆరు నెలల పాటు ఏదో వ్రతం చేసినట్టుగా ఎంతో జాగ్రత్తగా అత్తమామల దృష్టి భర్త దృష్టి పడకుండా మందులు వాడింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యవంతురాలైంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఇదే పని అత్తమామల ఆదరంతో కూడా చేయవచ్చు. అలాంటి ఆదరం మగవాడికి దొరికినట్టుగా స్త్రీకి దొరకదు. అదే ఈ జబ్బులో ఉన్న అనాది వివక్ష. 2020లో మన దేశంలో పదిహేను లక్షల మంది టీబీతో మరణించారు. వీరిలో 5 శాతం మంది స్త్రీలు. వీరంతా 30 నుంచి 69 మధ్య వయసు ఉన్నవారు. అంతే దాదాపుగా గృహిణులు, తల్లులు, అమ్మమ్మలు, అవ్వలు. వీరు ఈ మరణాలకు ఎలా చేరుకుని ఉంటారు. తెలియనితనం వల్ల, కుటుంబ నిర్లక్ష్యం వల్ల, ఒకవేళ జబ్బు సంగతి తెలిస్తే సక్రమంగా మందులు తెచ్చివ్వకపోవడం వల్ల, కసురుకుంటూ చిన్నబుచ్చుతూ వారిని మానసికంగా కుంగదీయడం వల్ల, అందరికీ దూరం చేయడం వల్ల... ఇలా అన్నీ ముప్పిరిగొని ప్రాణాలు పోయే స్థితికి వచ్చి ఉంటారు. టీబీ పై స్త్రీ విజయం సాధించాలంటే 2021 డిసెంబర్లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ‘విమెన్ విన్నింగ్ ఎగనెస్ట్ టీబీ’ అనే పేరుతో ఒక పార్లమెంటరీ సమావేశం నిర్వహించింది. స్త్రీలు టీబీపై విజయం సాధించడానికి కలుగుతున్న ఆటంకాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో స్త్రీ స్థానం ఆమెకు తన జబ్బు మీద పోరాడటానికి తగినంత శక్తి, సమయం ఇవ్వడం లేదన్న అభిప్రాయం వెల్లడైంది. స్త్రీలు టిబిపై విజయం సాధించాలంటే ముందు ప్రజా ప్రతినిధులు, పాలనా వ్యవస్థ ఎడతెగని ప్రచార, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఒకసారి టీబీ బయటపడ్డాక అలాంటి మహిళా పేషెంట్లు ఉన్న ఇళ్లను గుర్తించి వారికి వైద్య సహాయం మాత్రమే కాదు మానసిక నిబ్బరం కలిగించే కౌన్సిలింగ్ వ్యవస్థ బలపడాలి. ఈ వ్యవస్థ ఆ మహిళలకే కాదు కుటుంబానికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. మరొకటి– పౌష్టికాహారం. రెగ్యులర్‌గా మందులు వాడుతూ, విశ్రాంతి తీసుకుంటూ, తగిన పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే టీబీ సులభంగా నయం అయిపోతుంది. కాని భారతీయ కుటుంబాలలో ఇంటి చాకిరీ అంతా స్త్రీలే చేయాలి. విశ్రాంతి అనేది దొరకదు. ఇక అందరూ తిన్నాక ఆమె తినాలి. మరీ విషాదం ఏమిటంటే స్త్రీకి ప్రత్యేకంగా పౌష్టికాహారం ఇవ్వడం ఆమెను గొప్ప చేయడంగా కూడా భావిస్తారు. కాని ఇవన్నీ తప్పు. ఇలాంటి అవివేక ఆలోచనల వల్లే స్త్రీలు టీబీ కోరల నుంచి సులభంగా బయటకు రాలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘నిక్షయ్ పోషణ్ యోజన’ కింద టీబీ సోకిన పేషెంట్స్‌కు పౌష్టికాహారం కోసం నెలకు 500 ఇస్తుందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. సమాజం బాధ్యత కొన్ని కుటుంబాలు కలిసి ఒక సమాజాన్ని ఏర్పరుస్తాయి. టీబీని సాకుగా చేసుకుని స్త్రీలను ఇబ్బంది పెట్టడాన్ని సమాజం అంగీకరించరాదు. కుటుంబంకాని, సమాజం కాని వెలి, వివక్షను పాటించక టీబీ ఉన్న స్త్రీల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇది సులభంగా తగ్గిపోయే జబ్బు అన్న అవగాహన కలిగించి పేషెంట్స్‌కు ధైర్యం చెప్పాలి. వారు మందులు తీసుకునేలా చూడాలి. అలాంటి స్త్రీలను ఇదే సాకుగా వదిలించుకోవాలని చూసే మగాళ్లకు బుద్ధి చెప్పాలి. దగ్గు మొదలైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లని, చూపించుకోవడానికి డబ్బులివ్వని మగవారిని మందలించాలి. ఆర్థికంగా ఆధారపడే స్త్రీకి తండ్రి, భర్త, కుమారుడి నుంచి సరైన వైద్యం ఇప్పించడానికి ఇరుగు పొరుగు చొరవ చూపాలి. స్త్రీల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సందర్భంగా ప్రతి కుటుంబం అక్కర చూపుతుందని ఆశిద్దాం. -
ఓటరు నమోదుకు ఏడాదిలో 4 కటాఫ్ తేదీలు
న్యూఢిల్లీ: కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల చట్టంలో సవరణలు చేయనుంది. దీనివల్ల దేశంలో జరిగే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగపడే ఉమ్మడి ఓటరు జాబితా రూపకల్పనకు వీలవుతుంది. యువజన ఓటర్లు మరింత మందిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి కూడా ఈ ప్రయత్నం తోడ్పడుతుందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుతం జనవరి ఒకటో తేదీన, అంతకంటే ముందు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఆ ఏడాది తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు. ఆ ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే, జనవరి 2 జన్మించినా వారు మళ్లీ ఏడాదిదాకా ఆగాల్సిందే. అందుకే, ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను జత చేస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14(బి)ని సవరించాలని యోచిస్తున్నట్లు న్యాయశాఖ తెలిపింది. సంవత్సరంలో.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లను కటాఫ్ తేదీలుగా మార్చే ప్రతిపాదనలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని కేంద్రం తెలిపింది. -
రెండో డోసు పూర్తైన 9 నెలలకు బూస్టర్!
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న 9 నెలల అనంతరం కరోనా టీకా బూస్టర్ డోసును ఇవ్వవచ్చని పార్లమెంటరీ కమిటీకి ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) సూచించింది. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు పూర్తి చేసుకున్న 9నెలల తర్వాత అదనపు డోసును ఇవ్వవచ్చని ఐసీఎంఆర్ బలరామ్ భార్గవ అభిప్రాయపడ్డారు. కోవీషీల్డ్ టీకాను డెల్టా ఉత్పరివర్తనాలను ఎదుర్కోవడానికి బూస్టర్ డోసుగా ఇవ్వడం వల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించినట్లు ఐసీఎంఆర్ సైంటిస్టుల బృందం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే! మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌పై భయాందోళనలు రేకెత్తకుండా జాగ్రత్త వహించాలని మీడియాను భార్గవ కోరారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెంచలేదన్నారు. ఈ వేరియంట్‌కు కూడా పాత చికిత్సా విధానాలే పనిచేస్తాయన్నారు. బూస్టర్ డోసులపై దేశంలో రెండు నిపుణుల బృందాలనుంచి సూచనలు తీసుకుంటామని, అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని ఆరోగ్యమంత్రి ప్రకటించారు. దేశంలో 86 శాతం మందికి కనీసం ఒక్కడోసు పూర్తైందన్నారు. ఒమిక్రాన్ 50కిపైగా దేశాల్లో కనిపించిందని, దీని ప్రభావాన్ని సైంటిస్టులు పరిశోధిస్తున్నారని చెప్పారు. దేశంలో కోవిడ్ టీకాల సంఖ్య, ఒమిక్రాన్ కలకలం తదితర అంశాలపై శనివారం కేబినెట్ కార్యదర్శి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 32కు చేరిన ఒమిక్రాన్ కేసులు దేశంలో కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. 32కు చేరుకున్నట్లు కేంద్రం శుక్రవారం తెలిపింది. పుణెకు చెందిన మూడున్నరేళ్ల చిన్నారి సహా మహారాష్ట్రలో కొత్తగా ఏడు కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్రం తెలిపింది. ఒమిక్రాన్ కేసుల్లో ఎక్కువగా స్వల్ప లక్షణాలే ఉన్నాయని పేర్కొంది. వైద్యపరంగా చూస్తే ఈ కేసులు దేశ ఆరోగ్య వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది. అయినప్పటికీ, ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సూచనల మేరకు అప్రమత్తత కొనసాగిస్తున్నట్లు వివరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటి వరకు బయటపడిన కేసుల్లో అతి పిన్న వయస్కురాలు పుణె బాలికేనని వారు తెలిపారు. సెకండ్ వేవ్‌కు ముందున్న మాదిరిగానే ప్రస్తుతం కూడా ప్రజలు మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యం ఉంటున్నారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ కూడా గుర్తించిందని చెప్పారు. ఇదే ధోరణి కొనసాగినట్లయితే మరోసారి ప్రమాదకర జోన్లోకి వెళ్లినట్లేనని హెచ్చరించారు. దేశంలోని అర్హులైన వయోజనుల్లో 53.5%మందికి రెండు డోసులు అందాయన్నారు. -
పర్సనల్ డేటా ప్రొటెక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2019 (పీడీపీ)’ ముసాయిదాకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఉభయ సభల ముందుకు రానుంది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబర్లో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆనాడు ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు నివేదించారు. దీనిపై పలువురు విపక్ష ఎంపీలు తమ అసమ్మతి తెలుపుతూ జేపీసీ చైర్మన్ చౌదరికి లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, వివేక్ టాంకా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా, బిజూ జనతాదళ్ ఎంపీ అమర్ పట్నాయక్ జేపీసీ నిర్ణయంతో విభేదించారు. వేర్వేరుగా తమ అసమ్మతి నోట్లను ప్యానెల్ ఛైర్మన్‌కు పంపారు. ఏదైనా నేరం జరిగే ఆస్కారం ఉందని భావించినా దాన్ని నిరోధించడానికి, ఆ విషయంలో తదుపరి దర్యాప్తు చేయడానికి, సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడానికి వ్యక్తిగత డాటాను విశ్లేషించే అధికారాన్ని ఈ చట్టంలో దర్యాప్తు సంస్థలకు వీలు కల్పించారు. ఈడీ, సీబీఐలతో సహా తమ దర్యాప్తు సంస్థలకు వ్యక్తిగత గోప్యత రక్షణ హక్కు చట్టం నుంచి మినహాయించే అపరిమిత అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడాన్ని విపక్షాలు తీవ్రం ఆక్షేపించాయి. ఇలా మినహాయింపు ఇవ్వడానికి పార్లమెంటు ఆమోదం తీసుకోవాలని, అప్పుడే సిసలైన జవాబుదారీతనం ఉంటుందని విపక్షాలు కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. చట్టం స్ఫూర్తికే దెబ్బ.. కమిటీ సిఫార్సుల్లో రెండు మినహా మిగతా అంశాలపై అభ్యంతరం లేదని జైరాం రమేశ్ పేర్కొన్నారు. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో సంబంధాలు, శాంతిభద్రతలకు సంబంధించి కేంద్రం, ప్రభుత్వ ఏజెన్సీలు తమని తాము మినహాయించుకోవడానికి అనుమతించే బిల్లులోని క్లాజ్ 35ను పలువురు విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ చట్టబద్ధ సంస్థలకు(పోలీసులు, సీబీఐ, ఈడీ, రా, ఐబీ, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మినహాయింపు లభించనుంది. ట్విట్టర్, ఫేసుబుక్ వంటి వాటిని సామాజిక ప్రసార మాధ్యమ వేదికలుగానే పరిగణించాలని తేల్చిచెప్పింది. వాటికి మధ్యవర్తిత్వ హోదా (ఇంటర్మీడియటరీ హోదా... ఎవరైనా వినియోగదారుడు సదరు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకమైన అంశాలను పోస్టు చేసే వాటికి ఈ సోషల్ మీడియా సంస్థ బాధ్యత ఉండదు) తొలగించి వాటిని సైతం ఈ చట్టం కిందికి తీసుకురావాలని సూచించింది. బిల్లులోని క్లాజ్ 35 ప్రకారం.. పౌరుల అనుమతి లేకుండానే వారి వ్యక్తిగత డేటాను ప్రభుత్వం, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విశ్లేషించవచ్చు. ఐటీ శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా మినహాయింపు ఇవ్వాలని జేపీసీ పేర్కొంది. -
వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. 31 మంది ఎంపీలతో కమిటీ ఏర్పాటైంది. రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యునిగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ నియమితులయ్యారు. చదవండి: రేపు అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
ఏపీకి పార్లమెంట్ కమిటీ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీపై పార్లమెంట్ మహిళా భద్రత, సాధికారిత కమిటీ ప్రశంసలు కురిపించింది. విశాఖలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను పార్లమెంట్ కమిటీ శనివారం సందర్శించింది. కమిటీకి దిశ పీఎస్ పనితీరును దిశ స్పెషల్ అధికారి డీఐజీ రాజకుమారి, సీపీ మనీష్‌కుమార్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశ పోలీస్‌స్టేషన్ పనితీరు అద్భుతమని పార్లమెంట్ కమిటీ ప్రశంసించింది. చదవండి: Disha App: ‘దిశ’ యాప్ కేరాఫ్ మన అన్న.. భద్రతకు ‘దిశ’ నిర్దేశం -
జేసీ బ్రదర్స్‌కు టీడీపీ ఝలక్
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: టీడీపీ అధిష్టానం జేసీ వర్గానికి ఝలక్ ఇచ్చింది. బుధవారం రాత్రి ప్రకటించిన పార్టీ అనంతపురం పార్లమెంటు కమిటీలో కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. ‘రాయలసీమ ప్రాజెక్టులపై సీమ నేతల సదస్సు’లో పురుడుపోసుకున్న విభేదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నాయకులు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, కార్యకర్తల గురించి పట్టించుకోవడం లేదని సదస్సులో జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు) మంగళవారం కూడా కార్యకర్తల సమావేశం నిర్వహించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇదే విషయాన్ని మరోసారి తేల్చిచెప్పారు. దీంతో అనంత టీడీపీ నేతలు విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. రెండు నెలల క్రితమే వేసిన పార్లమెంట్ కమిటీని రద్దు చేసి బుధవారం రాత్రి ఆఘమేఘాలపై కొత్త కమిటీని నియమించింది. ఇందులో జేసీ వర్గానికి ఏమాత్రమూ ప్రాధాన్యత ఇవ్వలేదు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అధ్యక్షునిగా, ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన శ్రీధర్ చౌదరిని ప్రధాన కార్యదర్శిగా 40 మందితో కమిటీని ప్రకటించింది. ఇందులో తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చింది. వారు కూడా ఎప్పటినుంచో టీడీపీలో ఉన్నవారేనని, జేసీ వర్గంతో సంబంధం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: అబద్ధాల్లో అపూర్వ సోదరులు -
పార్లమెంటరీ కమిటీలను చిన్న చూపు చూస్తే..!
పార్లమెంటరీ కమిటీలు కేంద్ర చట్టసభల్లో అత్యంత కీలకమైనవి. ఏ ప్రభుత్వమైనా అవసరమైన బిల్లులను రూపొందించి వాటికి శాసన రూపం ఇచ్చేముందు పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు పంపిస్తుంటుంది. వాస్తవానికి వివిధ స్థాయీ కమిటీల ద్వారానే మన పార్లమెంట్ పనిచేస్తుంది. ప్రభుత్వ, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో వీటిని ఏర్పరుస్తారు. ప్రభుత్వ బిల్లులకు బడ్జెట్ అంచనాలకు తుదిరూపం ఇవ్వడానికి ఉభయసభల సెషన్లు జరగని సమయంలో కూడా ఈ పార్లమెంటరీ కమిటీలు సంవత్సరం పొడవునా పనిచేస్తూనే ఉంటాయి. అయితే తాను రూపొందించిన బిల్లులను కమిటీలకు పంపించాల్సిన అవసరం చట్టపరంగా ప్రభుత్వాలకు ఉండకపోవచ్చు. కానీ అలాచేయడమే ఉత్తమ ప్రజాస్వామిక ఆచరణ. కమిటీల వ్యవస్థను చిన్నచూపు చూడడం అంటే భారత ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన పార్లమెంటును చిన్నబుచ్చడమే అవుతుంది. కొన్ని నిర్దిష్ట రంగాలపై శాసనాలను ఖరారు చేయడానికి ఆయా పార్లమెంటరీ కమిటీలు ఆ రంగాలకు సంబంధించిన నిపుణులను కూడా పిలిపిస్తుంటాయి. చివరగా ఈ కమిటీలు తమ నివేదికను చట్టసభకు సమర్పిస్తాయి. కమిటీల ప్రతిపాదనను దాదాపుగా ప్రభుత్వాలు ఆమోదించి నూతన చట్టాలను రూపొందిస్తాయి. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని తొలి హయాంలో 27 శాతం బిల్లులను వివిధ పార్లమెంటరీ కమిటీలకు పంపించింది. ప్రస్తుతం కోవిడ్–19 ప్రత్యేక సందర్భం, పార్లమెంట్ సమావేశాల కుదింపును ప్రస్తావించనవసరం లేదు కానీ వివిధ రాజకీయ పక్షాల సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటీలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చడం ఇప్పుడు స్పష్టంగానే కనిపిస్తోంది. గతంలో యూపీఏ–1 పాలనలో 60 శాతం బిల్లులను కమిటీలకు పంపిస్తే యూపీఏ–2 పాలనలో 71 శాతం బిల్లులను వివిధ కమిటీలకు పంపిం చిన విషయం గుర్తుంచుకోవాలి. ప్రత్యేకించి, 2019లో గెలుపు సాధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన చట్టాలను ఏ కమిటీకి కూడా పంపించడం జరగలేదు. దీని పర్యవసానాలను మనందరం చూస్తూనే ఉన్నాం. ఉదా‘‘ ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూకశ్మీర్ ప్రతిపత్తిని మార్చివేసిన మౌలిక చట్టాలను తీసుకురావడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం దీనికి పరాకాష్ఠ. ఇది బీజేపీ సైద్ధాంతిక ఎజెం డాలో భాగం కాబట్టి ఎలాంటి సంప్రదింపులూ లేకుండానే ఒక్క కలంపోటుతో ఇంత కీలక మార్పును తీసుకొచ్చారు. అలాగే గత సెప్టెంబర్‌లో వ్యవసాయ చట్టాలను ఆదరాబాదరాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పర్యవసానానికి దేశం మొత్తం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది. అప్పటినుంచి దేశ రాజధాని సమీపంలో ప్రారంభమైన రైతాంగ నిరసనలు ఇప్పటికీ ఆగిపోలేదు. అంతేకాకుండా ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను నోటిఫై చేయడం కూడా సాధ్యంకాని పరిస్థితిలో కూరుకుపోయింది. రాజ్యసభలో మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదిం పజేసుకున్నప్పుడు ఏంజరిగిందో తిరిగి మననం చేసుకుందాం. మొదటగా ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. రైతు లాబీలు, వ్యవసాయ వ్యవస్థలోని ఇతరుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ముందుకు కదలాలని కేంద్రానికి సూచించాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది. తర్వాత ఈ బిల్లులపై డివిజన్ పెట్టాలని లేదా సభ్యుల ఓట్లను లెక్కించాలని ప్రతిపక్షం కోరింది. దాన్నీ ప్రభుత్వం తోసిపుచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మూజు వాణీ ఓటు ద్వారా వ్యవసాయ చట్టాలకు ఆమోదముద్ర వేశారు. దాంతో సభలో తీవ్ర గలాభా చెలరేగింది. ప్రతిపక్ష ఎంపీలు రూల్ బుక్‌ని హరివంశ్ మీదికి విసిరేశారు. దీంతో 8 మంది ఎంపీలను వారంపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. నిజానికి మన ప్రజాస్వామ్య చరిత్రలో అది ఒక చీకటిదినం. ఎలాంటి విచారణ జరపకుండానే, ప్రభుత్వం తాను కోరుకుం టున్న చట్టాలను ఆమోదింపచేసుకునే ఒక లాంఛనప్రాయమైన పరిష్కార గృహంగా పార్లమెంట్ మారిపోయిం దని ప్రతిపక్ష పార్టీలు ఆనాటి నుంచి చెబుతూ వస్తున్నాయి. పార్లమెంటును ఎంతగానో గౌరవించిన పాతతరం సభ్యుల ఆచరణను తోసిపుచ్చడంలో పాలకపార్టీ వైఖరిని మరొక అంశం కూడా ఎత్తి చూపుతుంది. ఉదాహరణకు బీజేపీ తొలి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఉత్తమ పార్లమెంటేరియన్. సభకు సంబంధించిన అన్ని నియమాలు, సంప్రదాయాలను పాటించడంలో ఆయన పేరెన్నికగన్న వ్యక్తి. పార్లమెంట్ అనేది బాక్సింగ్ రింగులో ప్రత్యర్థిని నాకౌట్ చేయడమే లక్ష్యంగా చూపే టెలి విజన్‌లో ప్రసారమయ్యే మ్యాచ్ లాంటిది కాదని ఆయన పదేపదే చెప్పేవారని గుర్తుంచుకోవాలి. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఒక విశిష్టమైన సంస్థ కాబట్టి మన ప్రజాజీవితంలో ప్రజాస్వామిక చర్చను అది తిరిగి తీసుకొస్తుందని మనం ఆశిద్దాం. అసమ్మతి స్వరాలు పార్లమెంటులో వినిపిస్తాయని, ముఖ్యమైన అంశాలను సభ స్వీకరిస్తుందని ఆశిద్దాం. సబా నఖ్వీ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ విధానంపై బుధవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో హైడ్రామా చోటు చేసుకుంది. వ్యాక్సిన్ విధానంపై చర్చించడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొంటూ పలువురు బీజేపీ ఎంపీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారు విజయ రాఘవన్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ వీకే భార్గవ, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయిసంఘం ముందు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ అధ్యక్షత వహించారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం, జినోమ్ సీక్వెన్సింగ్ (వైరస్ వేరియంట్ల జన్యుక్రమ విశ్లేషణ నమోదు)పై సమావేశంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై, రెండు టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచాలన్న నిర్ణయంపై పలువురు విపక్ష ఎంపీలు ప్రశ్నించాలనుకోగా, అధికార బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. దేశంలో టీకా కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో అనవసర అనుమానాలు రేకెత్తించడం సరికాదన్నారు. సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వాయిదా వేయాలన్న డిమాండ్‌పై ఓటింగ్ జరపాలని బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పలువురు బీజేపీ ఎంపీలు వాకౌట్ చేశారు. దాదాపు అరగంట పాటు ఈ డ్రామా కొనసాగింది. మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో వైద్య, శాస్త్ర, పరిశోధన రంగం చేసిన కృషిని కమిటీ ఈ సందర్భంగా ఘనంగా కొనియాడింది. చదవండి: వైరల్: నెటిజన్లు మెచ్చిన పసి హృదయం -
ట్విటర్‌కు మరోసారి నోటీసులు
సాక్షి,న్యూ ఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం మరోసారి ట్విటర్‌పై గురిపెట్టింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 18న హాజరుకావాలని ట్విటర్‌కు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కొత్త ఐటీ నిబంధనలు పాటించకపోవడంపై ట్విటర్‌పై మరోసారి కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇటీవల తుది నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. పదే పదే నోటిసులిచ్చినా తగిన వివరణ ఇవ్వడంలో ట్విటర్ విఫలమైందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) లోని సైబర్ లా గ్రూప్ కోఆర్డినేటర్ రాకేశ్ మహేశ్వరి ట్విటర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వార్తలను దుర్వినియోగంపై కమిటీ తాజా నోటీసులిచ్చింది. జూన్ 18, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, ఫేక్‌న్యూస్ నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చదవండి : కొత్త సీపాప్ మెషీన్: కరోనా బాధితులకు వరం? -
సురక్షిత తాగునీటి సరఫరాలో ఏపీ భేష్
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలు, అంగన్వాడీలు, గిరిజన వసతి పాఠశాలల్లోని చిన్నారులకు సురక్షిత తాగునీరు సరఫరాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నూటికి నూరు శాతం ప్రగతి కనబరచడంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సంతృప్తి వ్యక్తంచేసింది. ‘చిన్నారులకు సురక్షిత తాగునీరు’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 2, 2020న చేపట్టిన కార్యక్రమంపై సంఘం తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 42,655 అంగన్వాడీ కేంద్రాలు, 41,619 పాఠశాలలకు నూటికి నూరు శాతం పంపు కనెక్షన్లు ఇచ్చినట్లు స్థాయీ సంఘం గుర్తించింది. తెలంగాణ కూడా 27,310 అంగన్వాడీలు, 22,882 పాఠశాలల్లో నూరు శాతం లక్ష్యాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే ఈ రెండు విభాగాల్లో నూరు శాతం లక్ష్యాన్ని సాధించాయి. వ్యర్థాల నిర్వహణలోనూ ఏపీకి గుర్తింపు మరోవైపు.. గ్రామ పంచాయతీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు తగిన మౌలిక వసతులను సమకూర్చుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు చక్కటి పనితీరు కనబరిచాయని స్థాయీ సంఘం గుర్తించింది. అయితే, ఏపీలో 2018–19, 2019–20లో స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) పథకం ద్వారా కేంద్రం నుంచి వచి్చన నిధుల్లో వరుసగా రూ.987.39 కోట్లు, రూ.1,034 కోట్లు ఖర్చుకాలేదని.. అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని, దీనిపై జల్‌జీవన్ మిషన్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని స్థాయీ సంఘం పేర్కొంది. రాష్ట్రాలతో సమన్వయం చేస్తూ త్వరితగతిన నిధులు పూర్తిగా వినియోగమయ్యేలా చూడాలని సూచించింది. తెలంగాణ, గోవాలకు ప్రశంసలు జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ నీటి కుళాయిలు ఏర్పాటుచేయడంలో తెలంగాణ, గోవా నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించడంపై కూడా స్థాయీ సంఘం ప్రశంసించింది. అయితే, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణంలో తెలంగాణ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ వెనకబడ్డాయని వ్యాఖ్యానించింది. చదవండి: సంక్షేమ ప్రభుత్వాన్ని దీవించండి ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు -
తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘చిన్నారులకు సురక్షిత తాగునీరు’ నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నూటికి నూరు శాతం ప్రగతి కనబర్చడంపై జల వనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశా లలు, అంగన్వాడీలు, గిరిజన వసతి గృహాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై 2020, అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని నిర్దేశించింది. స్థాయీ సంఘం తన 11వ నివేదికను సోమవారం పార్లమెంటుకు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 42,655 అంగన్వాడీ కేంద్రాలకు, 41,619 పాఠశాలలకు నూటికి నూరు శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు గుర్తించింది. 27,310 అంగన్వాడీలు, 22,882 పాఠశాలల్లో కనెక్షన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణ నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించింది. ఈ రెండు విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే లక్ష్యాన్ని సాధించాయి. గ్రామ పంచాయతీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు తగిన మౌలిక వసతులను సమకూర్చుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు చక్కటి పనితీరు కనబరిచాయని గుర్తించింది. అయితే ఏపీలో 2018-19, 2019-20లో స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) పథకం ద్వారా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో వరసగా రూ. 987.39 కోట్లు, రూ. 1,034 కోట్లు ఖర్చు కాలేదని, అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. తెలంగాణ, గోవాలకు ప్రశంసలు జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయడంలో తెలంగాణ, గోవా నూటికి నూరుశాతం లక్ష్యాన్ని సాధించడాన్ని స్థాయీ సంఘం ప్రశంసించింది. అయితే కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణంలో తెలంగాణ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు వెనుకబడ్డాయని వ్యాఖ్యానించింది. -
‘డబుల్’పై ప్రభుత్వాన్ని నిలదీసిన స్థాయి సంఘం
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను ఎందుకు పెట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం నిలదీసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కలిపి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని స్పష్టం చేసింది. గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయి?.. ఈ ప్రాజెక్టులకు కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దారి మళ్లించింది?.. ఎందుకు ఆలస్యంగా విడుదల చేసింది?.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఎప్పుడు విడుదల చేస్తుంది?.. అని ప్రశ్నల వర్షం కురిపించింది. లోక్‌సభ ఎంపీ జగదాంబిక పాల్ నేతృత్వంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్లమెంటరీ స్థాయి సంఘం మంగళవారం నగరంలోని ఓ హోటల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు మొత్తం రూ.1500 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎందుకు విడుదల కాలేదని స్థాయి సంఘం సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా ఇతర సభ్యులు తెలంగాణ అధికారులను నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ అడ్వైజరీ కమిటీ వేశారా? మూడు నెలలకోసారి ఈ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయా? ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో చేపట్టాల్సిన పనులను ఇంకా ఎందుకు ప్రారంభించలేదు? అని అధికారులను ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ లేఖలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ఇప్పటి వరకు కేంద్రం మంజూరు చేసిన నిధులను సమానంగా రూ.392 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను ఇప్పటికే విడుదల చేశామని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ బదులిచ్చినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 80 వేలకు పైగా గృహాలను ఎందుకు లబ్ధిదారులకు కేటాయించడం లేదని సభ్యులు ప్రశ్నించగా, వీటికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. -
ట్విట్టర్‌పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమం ట్విట్టర్ తన లొకేషన్ సెట్టింగ్‌లలో లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతాన్ని చైనాలో అంతర్భాగంగా చూపించడంపై ఇచ్చిన వివరణ సరిగా లేదని పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో బుధవారం ట్విట్టర్ అధికారుల్ని ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ లేహ్ ప్రాంతాన్ని అలా చూపించడం దేశ ద్రోహం కిందకి వస్తుందని తెలిపింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన ట్విట్టర్ అధికారుల్ని కమిటీ సభ్యులు దాదా పుగా రెండు గంటల సేపు ప్రశ్నించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన సున్నితమైన ఈ అంశాన్ని తాము గౌరవిస్తామని ట్విట్టర్ అధికారులు తెలిపారు. తాము చేసిన పొరపాటుకు క్షమాపణ కూడా కోరారు.ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించామని అన్నారు. తమ సంస్థ అత్యంత పారదర్శకంగా పని చేస్తుందని, ఎప్పటికప్పుడు కేంద్రానికి తాము సరి చేసిన అంశాలను తెలియజెప్పామన్నారు. -
నవంబర్ 18 నుంచి పార్లమెంట్!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలు సమావేశాలు నవంబర్ 18న ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాలు సంకేతాలిచ్చాయి. డిసెంబర్ 13 వరకు జరిగే అవకాశముందన్నాయి. పార్లమెంటు తేదీల ఖరారుపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం కమిటీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో భేటీ అయింది. సమావేశాల తేదీలపై వచ్చే వారంలో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. పెద్దల సభలో ఇక సులువే! విపక్ష పార్టీల ఎంపీల రాజీనామాలతో ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలోనూ సానుకూల పరిస్థితి నెలకొంటోంది. బుధవారం కాంగ్రెస్‌కు మరో ఎంపీ దూరమయ్యారు. శీతాకాల సమావేశాలు మొదలయ్యేలోపు విపక్షాల నుంచి మరి కొందరూ రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు అంటున్నా యి. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కేసీ రామమూర్తి బుధవారం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 45కి తగ్గింది. 243 (ఇద్దరు నామినేటెడ్ సభ్యులను మినహాయించి) సభ్యుల రాజ్యసభలో ఎన్డీయేకు 106 మంది సభ్యుల మద్దతుంది. మిత్ర పక్షాలుగా భావించే అన్నాడీఎంకేకు 11 మంది, బీజేడీకి ఏడుగురు సభ్యులున్నారు. దీంతో రాజ్యసభలో బిల్లులను విపక్షాలు అడ్డుకునే పరిస్థితులు ఉండవని భావిస్తున్నారు. -
‘బాలాకోట్’ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద క్యాంపుపై భారత వాయుసేన జరిపిన దాడికి కారణాలను వివరించాల్సిందిగా పార్లమెంటరీ కమిటీ కేంద్రాన్ని కోరింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో విదేశీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఘటన తర్వాత భారత్, పాక్‌ల మధ్య చోటుచేసుకున్న సంఘటనలను విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం వివరిం చారు. ఈ సందర్భంగా బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన దాడి ఘటనను, ఆ తర్వాత పాకిస్తాన్ జెట్ విమానాలు భారత భూభాగంలోకి వచ్చిన అంశాన్నీ చెప్పారు. భారత్‌లోని మిలటరీ స్థావరాలపై దాడికి పాకిస్తాన్ వాయుసేన ప్రయత్నిం చిందని, అయితే భారత్ ఆ దేశ విమానాలను చాకచక్యంగా తిప్పికొట్టిందని తెలిపారు. ఆ విమానాలను వెనక్కి పంపే క్రమంలో భారత్‌కు చెందిన ఓ విమానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. పాక్‌లోని ఉగ్రవాద క్యాంపుపై దాడి చేయ డానికి గల కారణాలు చెప్పాలని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, ఈ విషయంలో రక్షణశాఖ సరైన సమాధానం చెప్పగలదని గోఖలే పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇస్లామిక్ సమాఖ్య సభ్య దేశాలు ఈ విషయంలో భారత్‌కు మద్దతివ్వడాన్ని ఈ సందర్భంగా చెప్పారు. ఐఏఎఫ్తో పాటు భద్రతా బలగాలను కమిటీ సభ్యులు కొనియాడారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్‌ను ఎంతో ఘనమైన, పరాక్రమమైన దాడిగా అభివర్ణించారు. పాక్ కాల్పుల ఉల్లంఘన.. ముగ్గురు దుర్మరణం జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ వరుసగా 8వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడింది. మోర్టార్ షెల్స్‌తో దాడికి తెగబడింది. దీంతో పూంచ్ జిల్లా సలోట్రి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాక్ రేంజర్ల దాడిలో రుబానా కోసర్(24), ఆమె కుమారుడు ఫజాన్(5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె షబ్నమ్ చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్ గాయాలతో బయటపడ్డాడని వెల్లడించారు. పాక్ జరిపిన మోర్టార్ల దాడితో పూంచ్ జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యా యని పేర్కొన్నారు. అంతకుముందు పాక్ కాల్పుల్లో నసీమ్ అక్తర్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు. పాక్ రేంజర్ల దాడిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని తెలిపారు. గత వారం రోజు ల్లో పాక్ 60 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఎల్వోసీకి 5కి.మీ పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటిని మూసివేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. గతేడాది పాక్ 2,936 సార్లు కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఓ సరిహద్దు గ్రామంలో పాక్ మోర్టార్లు దాడిలో ధ్వంసమైన ఇల్లు వీరుడి తల్లిదండ్రులకు జేజేలు... న్యూఢిల్లీ: మృత్యువు ముంచుకొస్తోందని తెలిసినా కళ్లల్లో ధీరత్వం, అల్లరి మూక చావబాదుతున్నా స్థిరచిత్తంతో కూడిన మనో నిబ్బరం, మన దేశ రహస్యాలు శత్రువులకు చిక్కకూడదని డాక్యుమెంట్లు, మ్యాప్‌లు నమిలి మింగేసే సాహసం.. ఎంత మంది ఇలా చేయగలరు ? పాకిస్తాన్ చెరలో ఉన్న వైమానిక పైలట్ అభినందన్ వర్ధమాన్ నిజమైన హీరో. ఆ వీరుడి తల్లిదండ్రులకు ఢిల్లీ విమానాశ్రయంలో తోటి ప్రయాణికులు జేజేలు పలికారు. చెన్నై నుంచి బయల్దేరిన విమానం గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రాజధాని ఢిల్లీ చేరుకుంది. కన్న కొడుక్కి స్వాగతం పలకడానికి వాఘా సరిహద్దుకు వెళ్లేందుకు అభినందన్ తల్లిదండ్రులు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్, డాక్టర్ శోభ వర్ధమాన్లు ఆ విమానంలోనే ప్రయాణించారు. ఢిల్లీలో వారు విమానం దిగే ముందు తోటి ప్రయాణికులంతా గౌరవసూచకంగా లేచి కరతాళ ధ్వనులతో వర్ధమాన్ దంపతులే మొదట దిగడానికి దారిచ్చారు. వారు విమానంలో నడుస్తుంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. తామే తొందరగా దిగాలని, లగేజీని తీసుకోవాలనే ఆత్రుత ప్రయాణికుల్లో కనిపించలేదు. కొందరు యువతీ యువకులు అభినందన్ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కారాలు చేశారు. మరికొందరు వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వాయు మార్గంలో కుదరదు: పాక్ న్యూఢిల్లీ: వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను అత్తారీ–వాఘా సరిహద్దులో కాకుండా వాయు మార్గంలో అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. అభినందన్‌ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన తరువాత, ఆయన్ని వాయు మార్గంలో అప్పగించాలని భారత్ కోరింది. కానీ అభినందన్‌ను రోడ్డు మార్గం ద్వారా అత్తారీ–వాఘా సరిహద్దులోనే అప్పగిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ అంగీకరిస్తే అభినందన్‌ను తీసుకొచ్చేం దుకు ప్రత్యేక విమానం పంపాలని రక్షణ శాఖ ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. మిగ్ విమానం కూలిపోయి పాకిస్తాన్ చెరలో ఉన్న మన పైలట్ అభినందన్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి.. ఇస్లామాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకురావడం. రెండోది..వాఘా సరిహద్దులో స్వాగతం పలకడం. రెండో మార్గంలో అయితే వాఘా సరిహద్దులో జనసందోహాన్ని నియంత్రించడం కష్టమవుతుందని, మీడియా కంటపడకుండా అభినందన్‌ను విమానంలో తీసుకురావడమే ఉత్తమమని భారత్ భావించింది. ఇదే విషయమై పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. -
ఈసీతో టచ్‌లో ఉండండి
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అవసరమైనప్పుడు వెంటనే స్పందించాలని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను పార్లమెంటరీ కమిటీ కోరింది. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జోక్యాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను తమకు వివరించాలంటూ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు నోటీసులు జారీ చేసింది. రాబోయే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారత్‌లో త్వరలో జరిగే ఎన్నికల్లో అంతర్జాతీయంగా ఎటువంటి జోక్యం ఉండకుండా చూసుకుంటామని ట్విట్టర్ ప్రతినిధులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కమిటీ సంధించిన పలు ప్రశ్నలకు పది రోజుల్లో రాత పూర్వకంగా సమాధానం అందజేసేందుకు అంగీకరించారు. సానుకూలంగా స్పందించిన ఫేస్బుక్ ఫేస్‌బుక్‌తోపాటు అనుబంధ సంస్థలైన వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ల తరఫున ఫేస్బుక్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ జోయెల్ కప్లాన్ హాజరుకానున్నట్లు సమాచారం. ఈయనతోపాటు ఫేస్బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ హాజరవుతారని భావిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ ఎదుట మార్చి 6వ తేదీన వీరు హాజరుకానున్నారు. వినియోగదారుల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఫేస్బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
పీటీఐ ప్రధాని అభ్యర్థిగా ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్లమెంటరీ కమిటీ ఇమ్రాన్ ఖాన్‌ను తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. పాక్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీటీఐ అత్యధిక సీట్లు గెల్చుకోవడం తెల్సిందే. పీటీఐ పార్లమెంటరీ కమిటీ ఇస్లామాబాద్‌లో సోమవారం సమావేశమైంది. పార్టీ పార్లమెంటరీ లీడర్‌గా ఇమ్రాన్‌ను పీటీఐ‡ నేత ఖురేషీ ప్రతిపాదించగా.. మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. తనను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్న సభ్యులందరికీ ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ప్రమాణ స్వీకార తేదీ వెల్లడి కాకపోయినా.. పాక్ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీన ప్రమాణం చేసే అవకాశాలున్నట్లు సమాచారం. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుండగా, అందులో 272 మందిని నేరుగా ఎన్నుకుంటారు. అధికారంలోకి రావాలంటే ఏదైనా పార్టీ కనీసం 172 సీట్లు గెలవాలి. 116 సీట్లతో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తమకు 174 మంది సభ్యుల మద్దతు ఉందని పీటీఐ తెలిపింది. -
ఎన్నారై వివాహాలపై చట్టాలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వివాహాల వివాదాల అంశంలో గోయల్ సిఫార్సుల అమలుతో పాటు ట్రిపుల్ తలాక్ క్రిమినల్ కోడ్ అమలు చేసే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయ ణ తదితరులు గురువారం ఢిల్లీలో పార్లమెంటరీ కమిటీ చైర్మన్ బండారు దత్తాత్రేయ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి లోకముద్ర మహంతి, విదేశాంగ శాఖ కార్యదర్శి మనోజ్ మహాపాత్రలను వేర్వేరుగా కలసి వినతిపత్రాన్ని అందిం చారు. ఎన్నారై వివాహాల్లో వివాదాలు తలెత్తితే వాటి పరిష్కారం క్లిష్టంగా మారుతోందని, దీంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఓట్లా.. ఓట్ల శాతమా?
రాజకీయ పార్టీల అభిప్రాయం కోరిన పార్లమెంటరీ కమిటీ న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో అనుసరిస్తున్న ఎక్కువ ఓట్లను సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటించే ‘ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ (ఎఫ్‌పీటీపీ) ఎన్నికల విధానంపై అభిప్రాయాలు తెలపాల ని న్యాయ, మానవ వనరులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల్ని కోరింది. ఎఫ్‌పీటీపీ విధానం సరైంది కాదేమోననే సందేహాలు వ్యక్తం చేసింది. అందుకు ఈ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల్ని ఉదాహ రణగా పేర్కొంది. యూపీలో 39 శాతం ఓట్లు వచ్చిన బీజేపీకి 312 సీట్లు రాగా, 22 శాతం వచ్చిన సమాజ్‌వాదీ పార్టీకి 47 సీట్లు, 21 శాతం వచ్చిన బీఎస్పీకి కేవలం 19 సీట్లే వచ్చాయి. ఈ విధానంలో సాధించిన ఓట్ల శాతంతో సంబంధం లేకుండా ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి గెలిచినట్లు. ఓట్ల శాతానికి ప్రాతినిధ్య విధానం సహా మరికొన్ని ఎన్నికల వ్యవస్థల గురించి కమిటీ ప్రస్తావించింది. అలాగే రాజకీయ పార్టీలకు వ్యక్తిగత నగదు విరాళాల్ని రూ. 2 వేలకు పరిమితం చేయడం సహేతుకమా? కాదా? అన్న అంశంపై స్పందించాలని పార్టీల్ని కమిటీ కోరింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలిచ్చే వారి వ్యక్తిగత గోపత్యకు ఏమైనా ప్రమాదముం టుందా అని కూడా ప్రశ్నించింది.ఎన్నికల సంస్కరణలపై ఆర్థిక బిల్లులో సూచించిన సిఫార్సుల్ని పరిశీలించిన కమిటీ ఆ మేరకు పార్టీలకు ప్రశ్నావళిని పంపింది. నగదు లావాదేవీల వాడకం తగ్గిం చడం, రాజకీయ పార్టీలకు విరాళాల విష యంలో పారదర్శకత కోసం ఆర్థిక బిల్లు, 2017లో ఆదాయపు పన్ను చట్టానికి సవరణ లు సూచించారు. పార్టీలకు ఇచ్చే వ్యక్తిగత నగదు విరాళాలు రూ.2వేలు మించకూడదని అందులో పేర్కొన్నారు. అయితే రూ.2వేల పరిమితి ప్రస్తుతం దేశ ద్రవ్యోల్బణ దృష్ట్యా మార్కెట్ పరిస్థితులకనుగుణంగా ఉందా అని ప్రశ్నావళిలో కమిటీ పేర్కొంది. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలు, మీడియా/పార్టీ ప్రచారా నికి ఉచిత ప్రచార సమయం, రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం తదితర అంశాలపై పార్టీల అభిప్రాయాల్ని కోరింది. అభియోగాలు దాఖలైతే అనర్హత వేటుపై ఆందోళన కోర్టులో అభియోగాలు దాఖలు చేసే రోజు నుంచే ఎన్నికల్లో పోటీ చేయ కుండా అనర్హుల్ని చేయాలన్న ప్రతిపాద నపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ చట్టం అమల్లోకి వస్తే అధికారంలో ఉన్న పార్టీ దుర్వినియోగం చేసే అవకాశముం దని, ఈ అంశంపై పార్టీలు తమ అభిప్రా యాలు తెలపాలని కోరింది. ప్రస్తుతం కేసులో దోషిగా తేలితేనే అనర్హత వేటు వేస్తున్నారు. -
ఉర్జిత్‌ను కాపాడిన మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పద్దని ఉర్జిత్ పటేల్‌కు సలహా ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే సెంట్రల్ బ్యాంకు స్వతంత్రతకు ముప్పు వస్తుందంటూ హెచ్చరించారట. అయితే ఆ ప్రశ్నలేమిటో తెలుసా? నగదు విత్డ్రాయల్స్పై ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆంక్షలను ఒకవేళ తొలగిస్తే గందరగోళాలన్నీ తొలగిపోతాయా.. 50 రోజుల్లో ఎన్ని పాత కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బుధవారం ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నిస్తూ ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రయత్నించింది. పార్లమెంటరీ కమిటీ ఈ ప్రశ్నలు అడిగిన వెంటనే మధ్యలో కల్పించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని ఉర్జిత్‌కు మన్మోహన్ సింగ్ సలహా ఇచ్చారట. హఠాత్తుగా నోట్లను రద్దు చేసిన అనంతరం తలెత్తిన పరిణామాలపై వివరణ ఇవ్వడానికి ఉర్జిత్పటేల్, ఆర్థికశాఖ అధికారులు నేడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ అడిగిన ఈ ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వద్దని మన్మోహన్ సూచించారని తెలిసింది. సెంట్రల్ బ్యాంకు టాప్ బాస్‌గా పనిచేసిన మన్మోహన్, అనుభవపూర్వకంగా ఉర్జిత్‌ను ఆదుకున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించిన మన్మోహన్, ఈ మేరకు సలహా ఇవ్వడం విశేషం. మన్మోహన్ సలహా మేరకు రద్దయిన ఎన్నినోట్లు వెనక్కి వచ్చాయి? నగదు పరిస్థితి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందనే దానిపై ఉర్జిత్ పటేల్ సమాధానం ఇవ్వలేదు. -
‘నోట్ల రద్దు’ ప్రభుత్వ సలహానే!
• నకిలీ నోట్లు, నల్లధనం అంతానికి • నోట్లరద్దు అవసరమన్న ప్రభుత్వం • పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ వివరణ న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంపై నెలకొన్న అనుమానాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెరదించింది. పెద్ద నోట్ల చలామణిని నిలిపేయాలన్న సలహాను కేంద్ర ప్రభుత్వమే తమకు ఇచ్చిందని స్పష్టం చేసింది. నకిలీ నోట్లు, నల్లధనం, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం.. దేశాభివృద్ధికి అడ్డుగా మారిన ఈ మూడింటిని అంతమొందించేందుకు నోట్ల రద్దు ఆవశ్యకమని ప్రభుత్వం పేర్కొందని ఆర్బీఐ వెల్లడించింది. నవంబర్ 7న ప్రభుత్వం తమకిచ్చిన ఆ సలహా మేరకు.. ఆ మర్నాడు రూ. 500, రూ. 1000 నోట్ల రద్దును తాము ప్రభుత్వానికి సిఫారసు చేశామని తెలిపింది. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి ఈ మేరకు ఆర్బీఐ 7 పేజీల నివేదికను అందజేసింది. ‘రూ. 500, రూ. వెయ్యి నోట్ల రద్దుపై నవంబర్ 7న కేంద్ర ప్రభుత్వం మాకు సలహా ఇచ్చింది. ఆ తర్వాతి రోజున ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశమై పెద్ద నోట్ల రద్దును సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశా’ అని కాంగ్రెస్ నేత ఎం.వీరప్ప మెయిలీ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ తెలిపింది. నవంబర్ 7న కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌బ్యాంకు అభిప్రాయం కోరిందని, నకిలీ నోట్లు, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, నల్లధనానికి చెక్ పెట్టేందుకు రూ. 500, రూ. వెయ్యినోట్ల చెల్లుబాటును రద్దు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తమకు సూచించిందని పేర్కొంది. ప్రభుత్వ సూచనపై సుదీర్ఘ చర్చల అనంతరం పెద్ద నోట్ల చెల్లుబాటు రద్దయ్యేలా వాటిని వెనక్కి తీసుకోవాలని సిఫార్సు చేస్తూ కేంద్రానికి సమాధానం పంపినట్లు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ సిఫార్సు అందిన కొద్ది గంటల్లోపే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమై రూ. 500, రూ. వెయ్యి నోట్లను రద్దు చేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ సిఫార్సుల మేరకే నోట్ల రద్దుపై కేంద్రం చర్యలు తీసుకున్నట్లు కేబినెట్లోని పలువురు మంత్రులు భావించడం గమనార్హం. కొత్త కరెన్సీపై చాన్నాళ్లుగా కసరత్తు ‘నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు మెరుగైన భద్రతా ప్రమాణాలతో కొత్త కరెన్సీ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వం నల్లధనం, ఉగ్రవాదంపై పోరులో చర్యలు చేపట్టిందని’ కమిటీకి పంపిన నివేదికలో వెల్లడించింది. భారీగా పెద్ద నోట్ల లభ్యతతో నల్లధనం కూడబెట్టడం సులభంగా మారిందని, ఉగ్రవాదులకు సాయం చేసేందుకు పెద్ద నోట్ల రూపంలో నకిలీ కరెన్సీ వాడుతున్నట్లు నిఘా, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల నివేదికలు స్పష్టం చేశాయని చెప్పింది. పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా నల్లధనం, నకిలీ నోట్ల చలామణీ, ఉగ్రవాదానికి ఆర్ధిక సాయం అడ్డుకునేందుకు అరుదైన అవకాశం దొరికిందని, ఆ అదృష్టం కేంద్రానికి, తమకు దక్కిందంటూ ఆర్బీఐ వ్యాఖ్యానించింది. రూ. 5 వేలు, రూ. 10 వేలు నోట్లు సిఫార్సు చేసిన ఆర్బీఐ రూ. 5 వేలు, రూ 10 వేల నోట్లను ప్రవేశపెట్టాల్సిన అవసరముందంటూ అక్టోబర్ 7, 2014న కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచించిందని, ద్రవ్యోల్బణం నేపథ్యంలో, చెల్లింపుల్ని సులభతరం చేసేందుకు, సమర్ధంగా కరెన్సీ సరఫరా నిర్వహణ కోసం అప్పట్లో ఆ సూచనలు చేసినట్లు తెలిపింది. ‘అయితే ప్రభుత్వం మాత్రం మే 18, 2016న రూ. 2 వేల నోట్లను ప్రవేశపెట్టేందుకు అంగీకరించింది. మే 27, 2016న కొత్త నమూనా, సైజు, రంగు, థీమ్‌తో కొత్త సీరిస్ కరెన్సీ విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. కొత్త కరెన్సీ సీరిస్‌లో రూ. 2 వేల నోటు కూడా ఉంది’ అని వెల్లడించింది. జూన్ 7, 2016న కొత్త సీరిస్ కరెన్సీ విడుదలకు ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిందని, జూన్ 2016లో ముద్రణ ప్రారంభించాలంటూ కరెన్సీ ప్రెస్సులకు సూచించామంది. నోట్ల రద్దుపై ఆర్బీఐ మొదటి నుంచి గట్టి నిర్ణయం తీసుకోనప్పటికీ... కొత్త సీరిస్ నోట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు మాత్రం కొనసాగించిందని, అది తప్పనిసరి పక్రియని నోట్లో వెల్లడించింది. కొత్త నోట్ల ముద్రణ తగిన స్థాయికి చేరుకున్నాక... నోట్ల రద్దు నిర్ణయం చేయవచ్చంటూ ప్రభుత్వానికి చెప్పామంటూ మెయిలీ కమిటీకి తెలిపింది. -
కొలీజియంకు పార్లమెంటరీ కమిటీ మద్దతు
న్యూఢిల్లీ: జడ్జీల నియామక ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయి దాలో వివాదాస్పద నిబంధనపై న్యాయవ్యవస్థకు పార్లమెంటరీ కమిటీ బాసటగా నిలిచింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనం దృష్ట్యా జడ్జి పదవికి అభ్యర్థిని తిరస్కరించే అధికారం ఈ నిబంధన ప్రభుత్వానికి కల్పిస్తోంది. ఈ నిబంధన వీటో అధికారంతో సమానమని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమంటూ న్యాయ, వ్యక్తిగత వ్యవహారాలపై ఏర్పాౖటెన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలపై తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనం పేరుతో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల్ని తిరస్కరించాలంటూ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తమకు అర్థమైందని కమిటీ పేర్కొంది. ఇది న్యాయ వ్యవస్థపై ప్రభుత్వం పెత్తనం చేయడమే అవుతుందని, కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించింది. -
జడ్జీల నియామకం ప్రభుత్వ విధి
పార్లమెంటరీ కమిటీ స్పష్టీకరణ ► రాజ్యాంగ వక్రీకరణలను మార్చాలని ప్రభుత్వానికి సిఫారసు న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కార్యనిర్వాహక విధిలోకి వస్తుందని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. రాజ్యాంగ ఆదేశాలను సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా వక్రీకరించిందని.. ఫలితం గానే కొలీజియం వ్యవస్థ తెరపైకి వచ్చిందని పేర్కొంది. ఈ ‘వక్రీకరణల’ను రాజ్యాంగ ఆదేశాలకు అనుగుణంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. జడ్జీల నియామకాలపై ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యం లో పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. న్యాయమూర్తులే న్యాయమూర్తుల్ని నియమించుకునే కొలీజి యాన్ని రద్దు చేయాలంటూ తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు కిందటేడాది రద్దు చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ సవరణ చెల్లుబాటుకు సంబంధించిన కేసులను ఐదుగురు కాకుండా 11 మంది సుప్రీం జడ్జీలు విచారించాలని కమిటీ సూచించింది. రాజ్యాంగానికి భాష్యం చెప్పే కేసులను ఏడుగురు సుప్రీం న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనమే విచారించాలని కమిటీ సిఫారసు చేసింది. సీజేలకు కనీస పదవీకాలం ఉండాలి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తు (సీజే)లకు ‘కనీస పదవీకాలం’ఉండేలా చూడాలని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల పదవీకాలం అత్యంత తక్కువగా ఉంటోందని ఆక్షేపించింది. గత 20 ఏళ్లలో 17 మంది సీజేఐలు నియమితులైతే.. వారిలో కేవలం ముగ్గురికి మాత్రమే రెండేళ్ల పదవీకాలం ఉందంది. చాలామంది పదవీకాలం ఏడాది కంటే తక్కువగానే ఉంటోందని తెలిపింది. చాలామంది హైకోర్టు సీజేల పదవీకాలం కూడా రెండేళ్ల కంటే తక్కువగానే ఉంటోందని పేర్కొంది. సీజేలకు కనీస పదవీకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలని న్యాయ మంత్రిత్వ శాఖను కోరింది. హైకోర్టుల్లో ఖాళీల భర్తీకి తీవ్ర జాప్యం జరగడంపై ప్రభుత్వంతో పాటు న్యాయవ్యవస్థనూ తప్పుబట్టింది. జడ్జీల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా చూడాలంది. -
లాభాపేక్ష పదవుల జాబితాతో బిల్లు
న్యాయ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూఢిల్లీ: లాభాపేక్ష పదవుల్లో కొనసాగడం వల్ల ఎంపీలు అనర్హత ముప్పును ఎదుర్కోవడం తెలిసిందే. అయితే ఏ ఏ పదవుల్లో ఉంటే అనర్హతకు గురవుతారోనన్న వివరాలతో బిల్లు రూపొందించాలని న్యాయ శాఖను పార్లమెంట్ ఉమ్మడి కమిటీ కోరింది. ఏ పదవుల్లో కొనసాగితే సభ్యతం కోల్పోతారన్నది రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు, పార్లమెంటు చట్టం(అనర్హత నిరోధం), హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా పేర్కొనలేదని తన తాజా నివేదికల్లో పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ఏఏ విభాగాలు, ఆఫీసులు అనర్హత కిందకు వస్తాయో, ఏవి రావో పేర్కొంటూ నమూనా బిల్లును రూపొందించాలని కమిటీ సూచించింది. పార్లమెంట్ షెడ్యూల్లో అనర్హత వర్తించే విభాగాల జాబితా ఉన్నా... చాలా విభాగాలు అందులో లేవని కమిటీ అభిప్రాయపడింది. -
‘తప్పుడు ఆదాయ’ టెలికం కంపెనీలపై దాడులు !
పార్లమెంటరీ కమిటీ సిఫార్సు న్యూఢిల్లీ: తప్పుడు ఆదాయాన్ని చూపించిన టెలికం కంపెనీలపై దాడులు చేయాలని, ఎప్పటికప్పుడు ఆడిట్లు నిర్వహించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సుచేసింది. కొద్ది సంవత్సరాల క్రితం తక్కువ ఆదాయాన్ని చూపించిన ఆరు టెలికాం కంపెనీలపై కాగ్ రూపొందించిన నివేదికను పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా కేవీ థామస్ నేతృత్వంలో ఇటీవల సమావేశమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో పై సిఫార్సులు చేశారు. 2006-07-2009-10 మధ్యకాలంలో ఎయిర్టెల్, వొడాఫోన్, ఆర్‌కామ్‌లతో సహా 6 టెలికాం కంపెనీలు తక్కువ ఆదాయాన్ని ప్రకటించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 12,488 కోట్ల నష్టాన్ని కల్గించాయంటూ కాగ్ నివేదిక వెల్లడించింది. -
మందగమనం వల్లే మొండి బకాయిల సెగ
పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ గవర్నర్ రాజన్ వివరణ... న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు(ఎన్పీఏ) ఘోరంగా పెరిగిపోవడానికి ఆర్థిక వ్యవస్థ మందగమనమే ప్రధాన కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ)కి ఇచ్చిన వివరణ నివేదికలో ఎన్పీఏలు ఎగబాకడానికి గల కారణాలను వివరించారు. పీఏసీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ నేత కేవీ థామస్ పదవీకాలం ముగియడంతో కొత్తగా ఏర్పాటయ్యే కమిటీ ఈ వివరణను పరిశీలించేందుకు రాజన్‌ను హాజరుకావాల్సిందిగా కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)ల చీఫ్‌లను కూడా పిలిపించి వాటి మొండిబకాయిల వివరాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఆరు కారణాలు... డిసెంబర్ చివరినాటికి పీఎస్‌బీల ఎన్పీఏలు రూ.3.61 లక్షల కోట్లకు ఎగియడంతో స్వచ్చంధంగా(సుమోటో) ఈ అంశాన్ని పీఏసీ పరిశీలిస్తోంది. పీఎస్బీలకు డిసెంబర్ ఆఖరికల్లా రూ.100 కోట్లకు మించి బాకాయిపడ్డ ఖాతాలు 701 వరకూ ఉండగా.. మొత్తం విలువ రూ.1.63 లక్షల కోట్లుగా అంచనా. ‘చాలా ఎన్పీఏలకు సంబంధించి గతం లో రుణాన్ని మంజూరు చేసిన అధికారులే మళ్లీ వాటిని రికవరీ చేసుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అంశాన్ని పీఏసీ తన పరిశీలనలో గుర్తించింది. దీన్నిబట్టి చూస్తే.. రికవరీకి తగిన యంత్రాంగం లేదని తేలుతోంది’ అని పీఏసీలోని ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగ బ్యాంకుల మొత్తం ఎన్పీఏలు 2.2% ఉండగా.. పీఎస్బీలకు సంబంధించి 5.98%కి పెరిగిపోవడమేంటని పీఏసీ రాజన్‌ను ప్రశ్నించింది. దీనికి 6 కీలక అంశాలను ఆర్బీఐ గవర్నర్ ప్రస్తావించారు. దేశీ, ప్రపంచవ్యాప్త ఆర్థిక మందగమనం ప్రధాన కారణమని చెప్పారు. ప్రాజెక్టులకు అనుమతుల జాప్యం, ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు ఎడాపెడా రుణాలు తీసుకున్న కార్పొరేట్లు పరిస్థితులు బాగోలేకపోవడంతో చేతులెత్తేస్తున్నాయని పేర్కొన్నారు. ఇంకా క్రెడిట్ రిస్కులు, ప్రాజెక్టులకు సంబంధించి సరైన మదింపు లేకపోవడం కూడా ఎన్పీఏలను ఎగదోస్తోందన్నారు. కొన్ని కేసుల్లో రుణాల మంజూరులో అవినీతి, మోసాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలూ ఎన్పీఏలను పెంచుతున్నాయని రాజన్ వివరించారు. -
ఆర్బీఐ, బ్యాంకుల పనితీరు.. ప్చ్!
♦ మొండి బకాయిలపై పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి ♦ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి విఘాతమని విశ్లేషణ ♦ పార్లమెంటుకు నివేదిక సమర్పించిన స్థాయీ సంఘం న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకుల పనితీరుపై పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పెద్ద భారంగా మారిన మొండిబకాయిల సమస్య- సంబంధిత నిర్వహణా యంత్రాంగం విశ్వసనీయతనే ప్రశ్నిస్తోందని, బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి ముప్పుగా ఉందని నివేదిక పేర్కొంది. మొండి బకాయిల పరిష్కారం దిశలో తన నిబంధనల అమలులో ఆర్బీఐ అంతగా విజయం సాధించలేదని పేర్కొంది. 2015 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర మొండిబకాయిల విలువ రూ.2,05,024 కోట్లుకాగా, స్థూలంగా ఇవి రూ.3,69,990 కోట్లుగా నమోదైంది. 2014 మార్చి నాటికి మొండిబకాయిలుగా మారే అవకాశం ఉన్న రుణాల పరిమాణం 10 శాతంగా ఉంటే... 2015 మార్చి నాటికి ఇది 11 శాతానికి పెరిగింది. 2015 సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాది కాలంలో మొండిబకాయిలుగా మారే అవకాశాలు ఉన్న రుణ పరిమాణం రూ.5.91 లక్షల కోట్ల నుంచి రూ.6.8 లక్షల కోట్లకు ఎగసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలో... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌సహా 31 మంది సభ్యులతో కూడిన స్థాయీ సంఘం ఇచ్చిన నివేదికలో ముఖ్యాంశాలు ... ♦ {పస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) ముగిసే నాటికి స్థూలంగా మొండి బకాయిలు రూ.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని వెలువడుతున్న కొన్ని అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం, ఆర్బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ బకాయిలు పెరిగిపోతుండడం ఆందోళనకు ప్రధాన కారణం. ♦ దేశం వేగంగా వృద్ధి చెందుతోందని, అభివృద్ధి చెందిన దేశాలకు పోటీపూర్వకంగా మారుతోందని ఒకపక్క చెప్పుకుంటున్నాం. అయితే మరోవైపు నెలకొన్న మొండిబకాయిల తీవ్రత ‘వృద్ధి కథనాన్ని’ దెబ్బతీస్తోంది. ♦ మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ఆర్బీఐ ఇస్తున్న మార్గదర్శకాలు లక్ష్యాలను సాధించడం లేదు. సమస్యపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. సవాలును ఎదుర్కొనే అంశాన్ని బ్యాంకుల బోర్డు డెరైక్టర్ల నిర్ణయానికి వదిలివేయకుండా ఆర్బీఐ తనకుతాను కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ♦ ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా, సకాలంలో సమస్య పరిష్కారం తీసుకోకపోతే... పరిస్థితి మరింత తీవ్రతకు దారితీస్తుంది. ♦ ఈ మొత్తం అంశాన్ని పరిశీలించడానికి, తగిన నిర్ణయాలు తీసుకోడానికి ఆర్బీఐ, బ్యాంకులు, రుణ గ్రహీత స్థాయిల్లో మూడు ప్రత్యేక సాధికార కమిటీలను ఏర్పాటు చేయాలి. ♦ సమస్య విషయంలో బ్యాంకు బోర్డుల్లో ఆర్బీఐ, ఆర్థికమంత్రిత్వశాఖ నామినీ డెరైక్టర్లు, సీఎండీ, ఎండీలను కూడా బాధ్యులుగా చేయాలి. ♦ మంజూరీ నిబంధనల్లో లోపాల వల్ల రుణాలు తీసుకున్న కొందరు ప్రమోటర్లు ఈ నిధులను వ్యాపారేతర కార్యకలాపాలకు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. మొండిబకాయిలు తీవ్రంగా పెరగడానికి కారణం ఇదేనన్న వాదనా ఉంది. ఈ పరిస్థితుల్లో రుణ తీరుపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి. ♦ రుణ పునర్వ్యవస్థీకరణ కోరుకుంటున్న కంపెనీలు ఆయా అంశాలను బహిరంగపరచాలి. వీటిని రహస్యంగా ఉంచడంలో ఎటువంటి అర్థం లేదు. ఎస్బీఐలో ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు రూ.11,700 కోట్లు! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో దాదాపు 1,164 ఖాతాల విషయంలో ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి మొండిబకాయిలుగా మారిన మొత్తం రుణ విలువ 2015 సెప్టెంబర్ నాటికి రూ.11,700 కోట్లు. ఆర్థిక మంత్రిత్వశాఖ సమీకరించిన గణాంకాలు ఈ అంశాన్ని పేర్కొన్నాయి. సర్వీసులు నిలిచిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వాటా ఇందులో రూ.1,600 కోట్లు. ఈ రుణ మొత్తానికి గ్యారెంటార్లుగా యూబీ హోల్డింగ్స్, విజయ్‌మాల్యాలు ఉన్నారు. ఎస్బీఐ ఐదు అనుబంధ బ్యాంకుల్లో విల్‌ఫుల్ డిఫాల్టర్ల సంఖ్య అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కలిగిఉంది. బ్యాంకుకు సంబంధించి 197 కేసుల్లో రూ.2,088 కోట్ల బకాయిలు ఉన్నాయి. తరువాతి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్లు ఉన్నాయి. ఎస్బీఐ స్థూల మొండిబకాయిల మొత్తం డిసెంబర్ నాటికి రూ.72,792 కోట్లు. పీఎస్‌యూ బ్యాంకులకు రేటింగ్ ముప్పు ♦ బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు లేకపోతే కష్టం ♦ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరిక న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) మరింత మూలధనం అందించేందుకు రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని పక్షంలో వాటి రేటింగ్స్‌పై ప్రతికూల ప్రభావం పడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. నిరర్ధక ఆస్తుల (ఎన్పీఎల్)కు ముందస్తుగా ప్రొవిజనింగ్ చేయడం వల్ల పీఎస్బీలకు మరింత అధికంగా మూలధనం సమకూర్చాల్సిన అవసరం ఉంటుందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ వడ్లమాని తెలిపారు. దేశీయంగా 11 పీఎస్బీలకు మూడీస్ రేటింగ్స్ ఇస్తోంది. సంస్థ అంచనా ప్రకారం 2019 మార్చి 31తో ముగిసే నాలుగేళ్ల వ్యవధిలో ఈ బ్యాంకులకు కనీసం రూ. 1.45 లక్షల కోట్లు అవసరమవుతాయి. వేల్యుయేషన్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో పీఎస్‌బీలు సమీప భవిష్యత్‌లో క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించగలిగే అవకాశాలు తక్కువేనని మూడీస్ పేర్కొంది. దీంతో రాబోయే 18 నెలల్లో మరిన్ని నిధుల కోసం ఈ బ్యాంకులు ప్రభుత్వం వైపే చూడొచ్చని వివరించింది. 2019 మార్చి నాటికి పీఎస్బీలకు దాదాపు రూ. 70,000 కోట్లు మూలధనం సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో 2015-16, 2016-17లో రూ. 25,000 కోట్లు చొప్పున, అటు పైన రెండేళ్లు ఏడాదికి రూ. 10,000 కోట్లు చొప్పున అందించనుంది. -
పన్ను వసూళ్లలో కఠిన వైఖరులు వద్దు
పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులు న్యూఢిల్లీ: పన్నుల బకాయిలు రాబట్టడంలో బలవంతంగా, కఠినంగా ఉండే విధానాలను ప్రయోగించకుండా ప్రభుత్వం సంయమనంగా వ్యవహరించాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. వివాదాల పరిష్కారానికి ఇతరత్రా మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని పేర్కొంది. వ్యాపారాల నిర్వహణ సరళతరం చేసే అంశంపై రూపొందించిన నివేదికలో పార్లమెంటరీ స్థాయీ సంఘం (వాణిజ్య శాఖ) ఈ మేరకు పలు సూచనలు చేసింది. వొడాఫోన్, షెల్ వంటి బహుళజాతి కంపెనీలతో పన్ను వివాదాల్లో కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ప్రతికూలంగా తీర్పు రావడం తదితర అంశాలు అంతిమంగా పన్నుల విషయంలో భారత్‌కు చెడ్డ పేరు తెచ్చాయని కమిటీ పేర్కొంది. ఇక, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల క్యాపిటల్ గెయిన్స్‌పై కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు వివాదం ప్రతిష్టను మరింత మసకబార్చిందని తెలిపింది. ప్రస్తుత ట్యాక్సేషన్ విధానం అత్యంత సంక్లిష్టంగా ఉందని, మేకిన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు విజయవంతం కావాలంటే... ఇది స్థిరంగా, అనూహ్య మార్పులకు లోను కాని విధంగా ఉండాలని కమిటీ సూచించింది. -
ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు!
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. ‘లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు గల సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై రూపొందించిన నివేదికను గురువారం పార్లమెంటుకు సమర్పించింది. ప్రతి ఐదేళ్లకు లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కుదరకపోవచ్చని.. అయితే దశల వారీగా భవిష్యత్తులో సాధ్యపడుతుందని పేర్కొంది. తొలుత ఎన్నికలను రెండు దశల్లో జరపాలని.. కొన్ని అసెంబ్లీలకు లోక్‌సభ సగకాలం పూర్తయ్యాక, మిగిలిన వాటికి లోక్‌సభ గడువు పూర్తయ్యాక నిర్వహించాలని తెలిపింది. ఈ లెక్క ప్రకారం 2016 నవంబర్‌లో తొలి దశ ఎన్నికలు జరగాలంది. మధ్యవర్తిత్వ బిల్లుకు ఆమోదం: వాణిజ్య వివాదాలకు సంబంధించి మధ్యవర్తిత్వ కేసుల్లో సత్వర పరిష్కారం కోసం ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అది అనర్హత కాదు: ఇల్లులేని కారణంగా వ్యక్తి ఓటరుగా పేరు నమోదుచేసుకోవడానికి అనర్హుడు కాడని కేంద్రం లోక్‌సభలో స్పష్టంచేసింది. ఓటర్‌గా దరఖాస్తు చేసుకున్న ఇల్లులేని వ్యక్తి.. ఫామ్6లో పేర్కొన్న అడ్రస్లోనే నివసిస్తున్నాడో లేడో తెల్సుకునేందుకు బూత్‌స్థాయి అధికారులు స్వయంగా వెళ్లి నిర్ధారించుకోవాలని ఈసీ నిబంధనల్లో ఉందని లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. భూబిల్లుపై నివేదికకు మరింత గడువు: భూసేకరణ బిల్లుపై ఏర్పాటైన జేఏసీ తన నివేదికను సమర్పించటానికి బడ్జెట్ సమావేశాల తొలివారం వరకూ గడువు పొడిగించాల్సిందిగా పార్లమెంటును కమిటీ కోరాలని గురువారం నిర్ణయించింది -
న్యాయ క్రియాశీలత సరికాదు
తప్పుపట్టిన పార్లమెంటరీ కమిటీ ♦ కిందిస్థాయి కోర్టుల పనిని కూడా సుప్రీం, హైకోర్టులే చేస్తున్నాయి ♦ సీబీఐ దర్యాప్తులను నేరుగా పర్యవేక్షిస్తున్నాయి ♦ నిబంధనలకు విరుద్ధంగా రోజువారీ నివేదికలు కోరుతున్నాయి ♦ జిల్లాల్లో సీబీఐ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో ద్వంద్వ న్యాయ వ్యవస్థ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు అనేక కేసుల్లో జోక్యం చేసుకుంటూ, సీబీఐ దర్యాప్తులను నేరుగా పర్యవేక్షిస్తుండడం, దర్యాప్తు సంస్థకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టింది. సుప్రీంకోర్టు సహా అనేక హైకోర్టులు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే కేసులను నేరుగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నాయని, ఈ తరహా న్యాయ క్రియాశీలత సరికాదని పేర్కొంది. నేర న్యాయ వ్యవస్థ ప్రకారం కిందిస్థాయి క్రిమినల్ కోర్టులు నిర్వర్తించాల్సిన విధులను సైతం పై స్థాయి కోర్టులే నిర్వర్తిస్తున్నాయని ఆక్షేపించింది. నేరశిక్షా స్మృతి 1973లోని సెక్షన్ 172, సెక్షన్ 173లను పక్కనపెట్టి, చాలా కేసుల్లో రోజువారీ దర్యాప్తు పురోగతిని వివరిస్తూ సీల్డ్ కవర్లో నివేదికలు ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తున్నాయంది. దీంతో బాధితులు నేర న్యాయ వ్యవస్థలో తమకు ఉన్న హక్కులు, ఉపశమన అవకాశాలను కోల్పోతున్నారని వివరించింది. సిబ్బంది, ప్రజా ఇబ్బందులు, చట్టం, న్యాయ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు తన నివేదికలో పేర్కొంది. 2జీ, బొగ్గు స్కాం, వ్యాపమ్ వంటి అనేక కేసులను సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. సీబీఐ ప్రత్యేక కోర్టులపై.. వివిధ జిల్లాల్లో సీబీఐ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడాన్ని కూడా పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టింది. ఇది ద్వంద్వ న్యాయవ్యవస్థకు దారితీస్తుందని పేర్కొంది. ఇందుకు రాజ్యాంగం సమ్మతించబోదని తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే.. రాజ్యాంగం నిర్దేశించిన ‘పిరమిడ్’ నిర్మాణ తరహా పాలన కాస్త తలకిందులయ్యే ప్రమాదం ఉందని, వ్యవస్థల మధ్య అధికారాల సంఘర్షణకు దారి తీయొచ్చని, రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయొచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. అన్ని కేసుల దర్యాప్తును సీబీఐకే అప్పగించడం వల్ల రాష్ట్ర పోలీసు విభాగాలు హోంగార్డుల స్థాయికే పరిమితమవుతాయని పేర్కొంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్(డీఎస్పీఈ) చట్టం-1946 ప్రకారం సీబీఐని నెలకొల్పారని, అయితే ప్రస్తుతం ఆ చట్టం పరిధిని దాటి సీబీఐ చాలా విసృ్తతమైందని తెలిపింది. -
వచ్చేవారం లోక్‌సభ ముందుకు భూబిల్లు!
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన భూ సేకరణ సవరణ బిల్లు- 2015 వచ్చేవారం లోక్‌సభ ముందుకు రానుంది. 70 శాతం రైతుల అనుమతి తప్పనిసరి, సామాజిక ప్రభావ అంచనా... తదితర కీలకాంశాలపై ప్రభుత్వం వెనక్కితగ్గి యూపీఏ 2013లో తెచ్చిన చట్టంలో నిబంధనలను యథాతథంగా ఉంచడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీలోని 11 మంది బీజేపీ సభ్యులు మంగళవారం సవరణలు ప్రతిపాదించారు. ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో నివేదిక సమర్పించేందుకు 11వ తేదీ వరకు గడువు పొడిగించాలని కమిటీ కోరగా లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది. 10వ తేదీ ఉదయం సమావేశమై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదికకు తుదిరూపు ఇవ్వనుంది. వచ్చేవారం పార్లమెంటు ముందుకు వచ్చే ముఖ్యమైన బిల్లుల్లో భూ సేకరణ బిల్లు కూడా ఒకటని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ శుక్రవారం తెలిపారు. లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే పార్లమెంటరీ కమిటీ చేసిన సవరణలను కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. అంటే ఈనెల 11 లేదా 12వ తేదీన కేబినెట్ భేటీ జరగొచ్చు. -
లెక్క తేలింది!
- 1,923 ఎకరాలు పరాధీనం భూదాన్ పెద్దలే అక్రమార్కులు చేతులు మారిన పేదల భూములు రూ.కోట్లు విలువ చేసే భూమి ఆక్రమణ ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ భూముల లెక్క తేలింది. అన్యాక్రాంతమైన భూముల చిట్టాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో భూముల వినియోగంపై రూపొందించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇటీవల శాసనసభా కమిటీ భూదాన్ యజ్ఞబోర్డు భూముల ధారాదత్తంపై లోతుగా చర్చించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో పరాధీనమైన భూముల వివరాలను కూడా సేకరించిన రెవెన్యూ యంత్రాంగం.. ఆక్రమణల జాబితాను కూడా తయారు చేసింది. అయితే.. భూదాన్ బోర్డు లెక్కలకు, రెవెన్యూ రికార్డులకు భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పట్లో భూములను దానం చేస్తున్నామని ప్రకటించినప్పటికీ, చాలా చోట్ల ఆ భూములు బోర్డు స్వాధీనంలోకి రాలేదని, కొన్నిచోట్ల ఇప్పటికీ ఆయా కుటుంబాల పొజిషన్లోనే అవి ఉన్నట్లు యంత్రాంగం తేల్చింది. దీంతో 2,673 ఎకరాల మేర తేడా వచ్చింది. భూదాన్‌బోర్డు లెక్కల మేరకు 13693.25 ఎకరాలుండగా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 11020.23 ఎకరాలుగా తేలింది. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం కూడా విస్తీర్ణంలో పొంతన కుదరకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వే.. భూదాన్ బోర్డు పాలకవర్గం పాపాల పుట్టను తవ్విన సర్కారు... చేతులు మారిన భూముల చిట్టాను తయారు చేసింది. పాలకవర్గం ముసుగులో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చింది. క్షేత్రస్థాయిలో 10717.34 ఎకరాలున్నట్లు తేల్చిన అధికారులు.. దీంట్లో 6625.08 ఎకరాలు భూమిలేని పేదలకు అసైన్డ్ చే యగా, మిగతా దాంట్లో చాలావరకు పరాధీనమైనట్లు సర్వేలో గుర్తించింది. ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు భూదానోద్యమంలో దాతలు విరివిగా భూ వితరణ చేశారు. వీటిని నిరుపేదలకు పంపిణీ చేయకుండా.. భూములను కాపాడాల్సిన యజ్ఞ బోర్డే కంచే చేను మేసిన ట్లు కొల్లగొట్టింది. అసైన్డ్‌దారుల సాగుబడిలో 4395.18 ఎకరాలుండగా, 1049.24 ఎకరాలు ఇతరులకు అసైన్ చేశారు. కాగా, మిగతాదాంట్లో 1923.13 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తేలింది. రూ.కోట్ల భూములకు ఎసరు! పేదలకు జీవనోపాధి కల్పించాలనే సదుద్దేశంతో దానం చేసిన భూములు ల్యాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయాయి. భూదాన్ బోర్డే రియల్టర్ అవతారమెత్తడంతో రూ.కోట్ల విలువైన భూములకు రెక్కలొచ్చాయి. శివార్లలో విలువైన భూముల్లో ఆక్రమణలు వెలిశాయి. మరీ ముఖ్యంగా సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 1015.23 ఎకరాలు పరాధీనమయ్యాయి. దీంట్లో కాలేజీలు, ఫాంహౌస్‌లు, గోడౌన్లు, లే అవుట్లు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. బోర్డు సభ్యులు కొందరు సొంత ప్రయోజనాలకు భూములను మళ్లించుకున్నారు. బ డాబాబులు సైతం భూదాన్ భూములపై కన్నేయడం కూడా భూములు కరిగిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా దాదాపు 400 ఎకరాల పైచిలుకు భూములపై న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. వీటిని స్వాధీనం చేసుకోవడం సర్కారుకు తలనొప్పిగా మారింది. ఇటీవల భూదాన్ బోర్డును రద్దు చేసి... రికార్డులను స్వాధీనం చేసుకున్నప్పటికీ.. అన్యాక్రాంతమైన భూముల విషయంలో మాత్రం ముందడుగు వేయలేకపోయింది. -
నెలకో విమానం కూలిపోతోందట?!
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన విమానాలు తరచూ ఎక్కడో ఒక చోట కూలాయన్న వార్తలు సర్వసాధారణంగా మారాయి. ఈ ప్రమాదాల కారణాల అధ్యయనానికి ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ తన నివేదికని సిద్ధం చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన జాగ్వార్ యుద్ధవిమానం మంగళవారం ఉదయం ఉత్తర్ ప్రదేశ్‌లోని అలహాబాద్ సమీపంలో కూలిన విషయం తెలిసిందే. దీనితో కలుపుకొని 2007 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన 86 విమానాలు కూలిపోయాయని పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికలో తేల్చిచెప్పింది. గత ఎనిమిదేళ్లలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు సరాసరిన నెలకు ఒకటి కూలిపోతోందని ఈ నివేదికలో పేర్కొంది. సాంకేతిక కారణాలతో 34 విమానాలు ప్రమాదాలకు గురవ్వగా, మరో 30 విమానాలు పైలట్ తప్పిదాల వల్ల కూలాయని తెలిపింది. మరికొన్ని ప్రమాదాలు సాంకేతిక కారణాలు, పైలట్ తప్పిదాలు రెండింటి వల్ల సంభవించాయని వివరించింది. మానవతప్పిదాలలో ముఖ్యంగా కొత్తగా అప్డేట్ అయిన మ్యాప్‌లను ఉపయోగించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని తెలిపింది. -
టీడీపీ, కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగనున్న తరుణంలో తమ పార్టీ వైఖరిపై సభ్యులతో చర్చించేందుకు కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంటరీ కమిటీ కూడా భేటీ అయింది. పార్టీ ఎంపీలతో జరిగే ఈ భేటీలో పార్లమెంట్ లో చర్చ సందర్భంగా తమ పార్టీ వ్యూహం, ఎత్తుగడలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
వ్యవ‘సాయా’నికి అంత తక్కువ నిధులా?
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించడాన్ని వ్యవసాయ రంగంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతమిచ్చేందుకు నిధుల కేటాయింపులను భారీగా పెంచాలని పార్లమెంటుకు అందించిన నివేదికలో సూచించింది. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌లో 60%పైగా జనాభా సాగుపై ఆధారపడిన సమాజంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అరకొర నిధులందించడాన్ని ఆక్షేపించింది. ఇతర రంగాలతో పోలుస్తూ తాజా బడ్జెట్లో వ్యవసాయ కేటాయింపులను వివరించింది. కాగా, ప్రకృతి ప్రకోపానికి బలైన రైతాంగ దుస్థితిపై పార్లమెంట్లో పార్టీలకతీతంగా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రైతులకు సాయం అందించడాన్ని, రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని విపక్ష సభ్యులు లోక్‌సభలో కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని బీజేపీ సభ్యుడు బాబూలాల్ చౌధరి, రూ. 250 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని దుష్యంత్‌చౌతాలా(ఐఎన్ఎల్డీ) డిమాండ్ చేశారు. -
‘పార్లమెంటరీ’ కమిటీ చైర్మన్‌గా జేసీ దివాకర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆహారం, వినియోగదారుల వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా టీడీ పీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ప్రకటించగా, ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు కూడా సభ్యులుగా స్థానం దక్కింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఐదు స్టాండింగ్ కమిటీలకు నేతృత్వం వహించే అవకాశం లభించగా... మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా ఓ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరించనుండడం విశేషం. కాంగ్రెస్ ఎంపీలు వీర ప్ప మొయిలీ, శశిథరూర్, పి.భట్టాచార్య ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, హోంశాఖ వ్యవహారాల స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మొయిలీ ఆర్థిక కమిటీకి చైర్మన్‌గా, మన్మోహన్సింగ్ సభ్యుడిగా వ్యవహరించనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యాయ, సిబ్బంది వ్యవహారాల పార్లమెంటరీ కమిటీల చైర్మన్ పదవులు కూడా కాంగ్రెస్‌కు లభించాయి. ఇక, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ప్రభుత్వరంగ సంస్థల కమిటీల్లో సభ్యుడిగా బీజేపీ అగ్రనేత అద్వానీ నియమితులయ్యారు. -
రుణ మాఫీ.. ఓ వైఫల్యం
న్యూఢిల్లీ: రూ.65 వేల కోట్లతో 2008లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ రుణ మాఫీ పథకం తప్పుల తడకగా సాగిందని పార్లమెంటరీ కమిటీ ఒకటి విమర్శించింది. పథకం అమల్లో చాలా లోపాలున్నాయని, ఈ పథకం ఎందుకు విఫలమైందో ఆర్థిక సర్వీసుల విభాగం కనుక్కోవాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులను కఠినంగా శిక్షించాలని సూచించింది. ఈ మేరకు ప్రజా పద్దుల కమిటీ నివేదిక రూపొందించింది. ‘వ్యవసాయ రుణాల రద్దు, రుణ ఉపశమన పథకం-2008’ లక్ష్యం ప్రశంసించదగినదైనప్పటికీ.. దాన్ని అమలు చేసిన తీరు చాలా చెత్తలా ఉంది.. దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది’ అని పేర్కొంది. నివేదికను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోని కమిటీ ఈ నివేదిక రూపొందించింది. అందులో ముఖ్యాంశాలివీ.. - లబ్ధిదారుల పేర్ల మార్పులు, చేర్పుల్లో తప్పులు, పత్రాలు పూరించడంలో నిర్లక్ష్యం, రికార్డులు తారుమారు చేయడం లాంటి కారణాల వల్ల పథకం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. - చాలా కేసుల్లో అర్హులైన రైతులకు లబ్ధి చేకూరలేదు. పథకం మార్గదర్శకాలకు విరుద్ధంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రీయింబర్స్ చేశారు. - పథకం అమలు పర్యవేక్షణ చాలా అసమర్థంగా ఉంది. - అమలులో చాలా లోపాలున్నాయని గతంలో కాగ్ కూడా తప్పు బట్టింది. - పర్యవేక్షణ బాధ్యతలు చూడాల్సిన ‘డీఎఫ్ఎస్’.. 2008లో మార్గదర్శకాలు విడుదల చేశాక పథకం అమలును పట్టించుకోవడం మానేసింది. -
పార్లమెంటరీ స్థాయీ సంఘానికి 'జేఏసీ' బిల్లు
న్యాయమూర్తుల నియామకాల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ నియామకాల కమిషన్ (జేఏసీ) ఏర్పాటుకు వెసులుబాటు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపారు. తదుపరి సంప్రదింపులు కోసం దీన్ని స్థాయి సంఘానికి అప్పగించారు. ప్రజలు, బిల్లుతో సంబంధం కలిగిన వారిని అభిప్రాయాలు, సలహాలను స్థాయీ సంఘం తీసుకోనుంది. ఈ బిల్లును ఆగస్టు 29న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జడ్జిల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం విధానాన్ని మార్చాల్సిందేనని రాజకీయ పార్టీలు పట్టుబడుతున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులో జడ్జిల నియామకంలో ఏమాత్రం పారదర్శకత లేదని, న్యాయ వ్యవస్థలో బంధుప్రీతి కొనసాగుతూనే ఉందని, దీన్ని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాయి.