న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి బేడీలు వేయరాదని, హత్య, అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన వారితో కలిపి జైలులో ఉంచరాదని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది.
బేడీలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు తప్పించుకోకుండా నిరోధించడానికి, అరెస్ట్ సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది భద్రత కోసమే పరిమితమని వివరించింది. అలాగే, నిందితులను అరెస్టయిన తర్వాత 15 రోజులకు మించి పోలీస్ కస్టడీలో ఉంచరాదన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్)లో నిబంధనపై సవరణలను సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment