Offenses
-
ఆర్థిక నేరగాళ్లకు బేడీలు వేయొద్దు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి బేడీలు వేయరాదని, హత్య, అత్యాచారం వంటి నేరాలకు పాల్పడిన వారితో కలిపి జైలులో ఉంచరాదని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. బేడీలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు తప్పించుకోకుండా నిరోధించడానికి, అరెస్ట్ సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది భద్రత కోసమే పరిమితమని వివరించింది. అలాగే, నిందితులను అరెస్టయిన తర్వాత 15 రోజులకు మించి పోలీస్ కస్టడీలో ఉంచరాదన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్)లో నిబంధనపై సవరణలను సూచించింది. -
పీటీ వారంట్!
అటాచ్ చేయనున్న ఆస్తుల వివరాలు.. ఏ–1 చంద్రబాబు కరకట్ట నివాసం (లింగమనేని రమేశ్ కుటుంబం పేరిట ఉన్న ఈ నివాసాన్ని చంద్రబాబు క్విడ్ ప్రో కో కింద పొందారు) ఏ–2 పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరిట అమరావతిలో ఉన్న 75,888 చదరపు గజాల ఇళ్ల స్థలాలు. ఏ–2 నారాయణ భార్య పొత్తూరి ప్రమీల, కుటుంబ సభ్యులు, బంధువులు రాపూరి సాంబశివరావు, ఆవుల మునిశంకర్, వరుణ్ కుమార్ ఇప్పటివరకు పొందిన కౌలు మొత్తం రూ.1,92,11,482. సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన కుంభకోణాలపై దృష్టి సారించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ భావిస్తోంది. ఈ కేసులో పూర్తి ఆధారాలతో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌తోపాటు వారి బినామీలైన లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజినీ కుమార్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఇంతవరకు వారిని అరెస్ట్ చేయలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును ఇందులోనూ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ నిర్ణయించింది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో కూడా రిమాండ్ ఖైదీగా పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరాలని నిర్ణయించి పీటీ వారంట్ దాఖలు చేసింది. అందుకు న్యాయస్థానం అనుమతిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా చంద్రబాబు అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఆ కేసులో కూడా ఆయన్ని విచారించేందుకు తమ కస్టడీకి కోరనుంది. దీంతో కేసు దర్యాప్తులో మరింత పురోగతి సాధించవచ్చని సీఐడీ భావిస్తోంది. చంద్రబాబు, చినబాబు భూ దోపిడీ టీడీపీ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలకు మరో ఉదాహరణ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ కలసి అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. వారి బినామీ లింగమనేని రమేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఇష్టానుసారంగా మెలికలు తిప్పి సింగపూర్ కన్సల్టెన్సీ రూపొందించినట్లు మభ్యపుచ్చారు.అప్పటివరకు రూ.177.50 కోట్లుగా ఉన్న తమ 148 ఎకరాల మార్కెట్ విలువను అమాంతం రూ.877.50 కోట్లకు పెంచుకున్నారు. అమరావతి రాజదాని నిర్మాణం పూర్తయితే ఆ భూముల మార్కెట్ విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు పెరిగేలా పథకం వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములు వీటికి అదనం. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా చంద్రబాబు వాటా కల్పించారు. ఆ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉండటం గమనార్హం. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను కొనుగోలు చేసినట్లు చూపించి ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించారు. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ,ఏ–6 లోకేశ్ ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణాన్ని సిట్ పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్‌ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్ ఏ–4గా, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్‌ను ఏ–5గా పేర్కొంది. చంద్రబాబు, నారాయణ ఆస్తుల అటాచ్ ఈ కేసులో చంద్రబాబు, నారాయణ బినామీల ద్వారా పొందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఆ మేరకు సీఐడీ ప్రతిపాదనను ఆమోదిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్విడ్ ప్రోకో కింద లింగమనేని రమేశ్ నుంచి చంద్రబాబు పొందిన కరకట్ట నివాసంతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తులను అటాచ్ చేయనుంది. -
‘స్కిన్ టు స్కిన్’ కాకపోయినా నేరమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద చిన్నారులపై లైంగిక వేధింపుల నేరాన్ని బాధితుల దృష్టి కోణం నుంచి నిర్వచించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే లైంగికంగా వేధించినట్లు భావిస్తే.. శరీరానికి శరీరం (స్కిన్ టు స్కిన్) తాకకపోయినా నేరంగానే నిర్ధారించాలని పేర్కొంది. లైంగిక నేరాన్ని నిర్ధారించడంలో స్కిన్ టు స్కిన్ కాంటాక్టు తప్పనిసరి అని చెబితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. లైంగిక నేరం వెనుక ఉద్దేశాన్ని కచ్చితంగా గుర్తించాలని సూచించింది. బాధితురాలికి, నిందితుడికి మధ్య స్కిన్ టు స్కిన్ కాంటాక్టు జరగలేదు కాబట్టి పోక్సో చట్టం కింద లైంగిక నేరంగా నిర్ధారించలేమంటూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ రెండు పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 7ను ధర్మాసనం క్షుణ్నంగా పరిశీలించింది. లైంగిక వాంఛతో చిన్నారుల శరీర భాగాలను తాకితే.. దాన్ని లైంగిక వేధింపులుగానే భావించాలని ఈ సెక్షన్ చెబుతోంది. -
ఔట్‌గోయింగ్ కాల్
నేరం చీకటి పొదలాంటిది. మనసును తన వైపు లాగుతుంది. ఎవరూ చూడరని ఎవరికీ కనిపించదని మనసును తన వైపు పురిగొల్పుతుంది.కాని చివరకు క్లూ అనే వెలుతురుకు దొరికిపోతుంది. 2015, వేసవి మొదటి నెల, కాకినాడ.ఇన్స్పెక్టర్కి ఉబ్బరింతగా ఉంది. చెమటతో యూనిఫామ్ తడిసిపోయి ఉంది. రాత్రి పదిన్నర దాటిపోవడంతో టీ దొరికే మార్గం కూడా లేదు. గవర్నమెంట్ ఆస్పత్రి కాంపౌండ్‌లో చాలాసేపుగా ఉన్నాడు. మళ్లీ ఎమర్జన్సీ వార్డు దగ్గరకు వెళ్లాడు.‘ఎలా ఉంది?’ డాక్టర్ని అడిగాడు.‘ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. అతడు ఔట్ ఆఫ్ డేంజర్ అనుకుంటున్నాము’వాళ్లు స్పృహలోకి రావడం ఇంపార్టెంట్. స్పృహలోకి వచ్చి ఏం జరిగిందో చెబితే తప్ప జరిగిందేమిటో పూర్తి పిక్చర్ రాదు.ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్ చూడలేదు. ఇంతటి చిక్కుముడి కూడా. అప్పటికే టౌన్ ఔట్స్కర్ట్స్లో పెట్రోలింగ్ పెట్టాడు. అనుమానంగా ఎవరూ దొరకలేదు.మరి దాడి చేసిందెవరు? కొద్ది సేపటి ముందు.పోలీస్ స్టేషన్‌కు ఫోన్ వచ్చింది. ‘సార్... కాకినాడ– శొంఠివారిపాకల రూట్లో పొదల్లో ఒక జంట చావుబతుకుల్లో పడి ఉంది. భార్యాభర్తలు కావచ్చు. మీరు వెంటనే రండి’‘మీరెవరు?’‘ఆ దారిన వెళ్లే గ్రామస్తులమండీ’వెంటనే ఇన్స్పెక్టర్ అక్కడకు వెళ్లాడు. చుట్టూ చీకటి. సన్నని మట్టి రోడ్డు. కొద్ది దూరంలో ఇద్దరు ముగ్గురు గ్రామస్తులు నిలబడి పొదలవైపు చూపించారు.పొదల్లోంచి మూలుగులు వినిపిస్తున్నాయి. సెల్‌ఫోన్ లైట్లో చూశాడు ఇన్స్పెక్టర్. ఓ యువతి, యువకుడు తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. భార్యాభర్తలని అనిపించింది. ఆమె నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. రోడ్డు పక్కనే మోటారు సైకిల్ పడి ఉంది. మరో వైపు బీరుబాటిళ్లు పగిలి పడున్నాయి. బీరుబాటిళ్లను పగలగొట్టి పొడిచినట్టున్నారని అర్థమైంది. గాజు ఒంట్లో దిగితే చాలా ప్రమాదం.చాలా త్వరగా వాళ్లను ఆస్పత్రికి చేర్చే ఏర్పాటు చేశాడు ఇన్స్పెక్టర్. అతడి జేబులో దొరికిన సెల్‌ఫోన్ ద్వారా సంబంధీకులకు సమాచారం కూడా చేరవేశాడు. టైమ్ పదకొండున్నర.ఇద్దరూ స్పృహలోకి రాలేదు.ఏం జరిగిందో తెలియడం లేదు. ఈ పరిస్థితికి ఉబ్బరింత తోడై విసుగ్గా ఉంది. దూరంగా వయసు మీరిన భార్యాభర్తలు దిగులుగా నిలబడి ఉన్నారు. మధ్య మధ్య ఏడుస్తున్నారు. ఇన్స్పెక్టర్ వాళ్లను కలిశాడు.‘వాళ్లు మీకు ఏమవుతారు?’‘నా కొడుకండీ. పెళ్లయి పదిహేను రోజులవుతోంది. అమ్మాయి మా ఆడపడుచు కూతురు. బయటి సంబంధం ఎందుకు అని చేసుకున్నాం. వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా మావాడు వయసులో పెద్ద కనుక కొంచెం బెరుగ్గా దూరంగా ఉండేదా అమ్మాయి. పెళ్లయ్యాక కూడా ఆ బెరుకు పోలేదు. కాస్త అలా షికారుకు తీసుకెళితే మాటల్లో పడి బెరుకు పోతుందని సాయంత్రం తీసుకువెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో మేం కంగారు పడుతుంటే మీ వాళ్ల నుంచి ఫోన్ వచ్చింది’ ఏడుస్తూ చెప్పిందామె.‘మీకెవరైనా శత్రువులున్నారా?’‘లేరండీ’‘అమ్మాయి ఒంటి మీద బంగారం ఉండాలి. అది లేదు. దొంగలే ఈ పని చేసి ఉండాలి’ అన్నాడు ఆ పెద్దాయన.ఇన్స్పెక్టర్కు కూడా అదే అనిపిస్తోంది. రాత్రి రెండు మూడు దాక కూడా ఇద్దరికీ స్పృహ రాలేదు.ఇన్స్పెక్టర్ కాసేపైనా నిద్రపోయి వద్దామని ఇంటికి వెళ్లి తిరిగి తెల్లవారుజామున ఆరు గంటలకు వచ్చాడు. ‘స్పృహ వచ్చిందా’ కాపలా ఉన్న కానిస్టేబుల్స్‌ని అడిగాడు.‘ఆమెకు ఇప్పుడే వచ్చిందని డాక్టర్లు చెప్పారు. అతనికి ఇంకా రాలేదు’ నేరుగా ఆమె దగ్గరకు వెళ్లాడు. భయంతో భీతితో హడలిపోయి ఉంది. కొనప్రాణంతో మాట్లాడినట్టుగా మాట్లాడింది. ‘నా పేరు జయ. నా భర్త పేరు సురేశ్. కొత్తగా పెళ్లయ్యింది. నన్ను షికారుకు తీసుకెళదామని మేట్నీకి తీసుకెళ్లాడాయన. సినిమా అయ్యాక పార్క్‌లో చల్లగాలికి కాసేపు కూర్చున్నాం. ఇక ఇంటికి వెళ్లిపోదామనుకుంటుండగా ఆయనకు బీచ్‌కు తీసుకెళదామనిపించింది. బీచ్‌లో షికారు చేసి హోటల్లో భోజనం చేసుకుని ఇల్లు చేరుకుందాం అనుకున్నాం. బీచ్‌లో తొమ్మిది దాకా ఉన్నాం. తిరిగి బయలుదేరాక ఆయన దారిలో పొదల దగ్గర యూరిన్ కోసమని ఆగాడు. నేను బైక్ దిగి కొంచెం పక్కన నిలుచున్నాను. ఇంతలో ఓ మోటారు సైకిల్ వేగంగా వచ్చింది. దాని మీద ముగ్గురు ఉన్నారు. వాళ్లు రావడంతోటే మా మీద దాడికి దిగారు. ఇద్దరు సురేశ్‌ను కొడుతున్నారు. మూడో అతను నా ఒంటిపై ఉన్న నగలు ఇవ్వాలని బెదిరించాడు. నేను ఇవ్వను అనడంతో దగ్గరున్న బీరు సీసాలతో బాగా కొట్టాడు.మరొకడు పగిలిన బీరుసీసాతో నన్ను పొడిచాడు. అంతే నాకు మైకం కమ్మేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు.’చాలా అనుభవం ఉంది ఇన్స్పెక్టర్కు. ఆమె చెప్పింది అబద్ధం అనిపించలేదు.ఆమె భర్తకు స్పృహ వస్తే ఇంకొంత సమాచారం తెలుస్తుందనిపించింది.ఎనిమిది గంటలప్పుడు భర్తకు స్పృహ వచ్చింది.ఇన్స్పెక్టర్ మాట్లాడితే భార్య చెప్పిందే అటు ఇటూగా చెప్పాడు. అదనంగా ఏమీ తెలియడం లేదు. ఈ కేస్‌ని ఛేదించాలంటే క్లూ ఏమిటి? ఉదయం పదిన్నరకు రాత్రి ట్రీట్ చేసిన డాక్టర్ వచ్చాడు.‘సారీ... కొంచెం లేటయ్యింది. ఇప్పుడే వాళ్లను చూసి వస్తున్నాను. దే ఆర్ వెల్. బయటపడిపోయారు’ ‘క్లూ ఏమీ దొరకడం లేదు డాక్టర్. మీకేం అనిపి స్తోంది’‘అనిపించేది ఏముంది బ్రూటల్ ఎటాక్. నగల కోసమో మరెందుకో అయి ఉండాలి. రేప్ అటెంప్ట్ మాత్రం లేదు’‘అదే అనుకున్నాను. కాని ఆమె కళ్లు తెరుస్తుందనుకోలేదు. ఉదయానికి స్పృహ వచ్చింది.ఆమెకు వచ్చాకే అతనికి వచ్చింది’‘వాట్? అంతేం లేదే. అతనికి రాత్రే స్పృహ రావాలే.’ అన్నాడు డాక్టర్.‘అవునా?’‘హెడ్ ఇంజ్యురీ ఏమీ లేదు కదా ఆఫీసర్. పైదెబ్బలు మాత్రమే తగిలాయి. అతడికి రాత్రే స్పృహ వచ్చి ఉండాలి’.ఇన్స్పెక్టర్ తల పంకించాడు. సురేశ్ కాల్‌డేటాలో లాస్ట్ కాల్ నాగబాబు అని ఉంది.ఎంక్వయిరీ చేస్తే అది సురేశ్ తమ్ముడి వరుసయ్యే వ్యక్తిది. క్యాజువల్ కాల్ కావచ్చు. ఎందుకైనా మంచిదని నాగబాబును పట్టుకొచ్చారు పోలీసులు. అతడు బాగా భయపడిపోయాడు.‘సార్ నాకేం తెలియదు. నేనసలు ఊళ్లోనే లేను. ఊరికే కాల్ చేశాను. అన్నయ్య ఎక్కడ ఉన్నాడో కనుక్కుందామని. అంతే’ అన్నాడు.ఇన్స్పెక్టర్ తల ఆడించి ‘సరే వెళ్లు’ అనబోయి మళ్లీ ఆగాడు. సురేశ్ కాల్‌డేటాలో ఉన్నది ఔట్ గోయింగ్. ఇతనేమో తనే ఫోన్ చేశాను అంటున్నాడు.‘ఒక్క నిమిషం’ అని ఆపాడు ఇన్స్పెక్టర్.ఆ తర్వాత కానిస్టేబుల్ వైపు తిరిగి ‘లాఠీ తీసుకురా’ అన్నాడు. ‘సార్... పెళ్లికి ముందే సురేశ్‌కి ఇంకో అమ్మాయితో సంబంధం ఉంది. కాని పెద్దవాళ్లు బలవంతం చేశారని మరదలిని పెళ్లి చేసుకున్నాడు. కాని మొదటి అమ్మాయిని వదులుకోలేకపోయాడు. ఇంకో వైపు అతనికి అప్పులున్నాయి. వీటన్నింటి నుంచి బయటపడటానికి భార్యను చంపేయడమే కరెక్ట్ అని నన్ను కాంటాక్ట్ చేశాడు’ అన్నాడు నాగబాబు.‘ఏంటి ప్లాన్’ అడిగాడు ఇన్స్పెక్టర్.‘మొదట కిరాయి హంతకులతో హత్య చేయించాలని పథకం వేశాడు. కాని వాళ్లు ఎక్కడ ఉంటారో తెలియలేదు. అందుకని నన్ను కలసి ఈ పని చేస్తే యాభై వేలు ఇస్తానని చెప్పాడు. నేను గోకవరం దగ్గర కొత్తపల్లి సమీపంలోని ఏజన్సీ ప్రాంతానికి చెందిన ఇంకో ఇద్దరిని కలుపుకున్నాను’‘వాళ్లకు ఎంతిస్తానన్నావు?’‘మనిషికి 1500’‘తర్వాత’‘సురేశ్ ముందే నిర్ణయించుకున్న విధంగా భార్యను టౌన్లో సినిమాకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత బీచ్‌కు తీసుకు వచ్చాడు. అక్కడ ఒక చోట బండి ఆపుతానని వెంటనే దాడి చేసి భార్యను హత్య చేయాలని, ఎవరికీ అనుమానం రాకుండా తనపై కూడా స్వల్పంగా దాడి చేయాలని, అలాగే ఆమె వేసుకున్న నగలు తీసి తనకు ఇవ్వాలని సురేశ్ మాకు ముందే చెప్పాడు. సరే అన్నాం. రాత్రి 9 గంటల సమయంలో కొత్తపల్లి మండలం శొంఠివారిపాకలు సమీపంలోకి వచ్చే సరికి యూరిన్ విషయం చెప్పి బండిని ఓ వైపుగా ఆపిన సురేశ్ పొదల దగ్గరకు వెళ్లాడు. అప్పటికే మాకు కాల్ చేసి చెప్పడంతో ఫాలో అయ్యి బండి దగ్గర నుంచుని ఉన్న జయపై ఒక్కసారిగా అటాక్ చేశాం. అప్పటికే బీరు తాగుతున్నాం.బాటిల్స్ చేతిలో ఉన్నాయి. నేను ఆ సీసాను పగలగొట్టి ఆమెను పొడిచాను. జయ స్పృహæతప్పి పడిపోవడంతో చనిపోయిందనుకుని, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, ఉంగరాలు, కాళ్లపట్టీలు లాక్కున్నాం. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ ప్రకారం సురేశ్ మెడలో ఉన్న చైన్ కూడా లాక్కొని అతడి ఒంటిమీద బీరు సీసాలతో అక్కడక్కడా చిన్న చిన్న గాట్లు పారిపోయాం’ అని ముగించాడు నాగబాబు.నేరం దాగదు. క్లూ తప్పక పట్టి ఇస్తుంది. క్లూ కథనాలు పంపండి రెండు రాష్ట్రాలలో ఎందరో గొప్ప పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎన్నో గొప్ప కేసులను క్లూల ద్వారా సాల్వ్ చేసి ఉంటారు. అలాంటి ఆఫీసర్లకు ఇదే మా ఆహ్వానం. మీరు సాల్వ్ చేసిన కేసులను సాక్షి పాఠకులతో పంచుకోండి. నేరస్తుడు తప్పించుకోలేడన్న భావన నేరాన్ని సగం నిరోధిస్తుంది. నేరం లేని సమాజం కోసం సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహకారాన్ని ఆశిస్తూ... మీరు సాల్వ్ చేసిన కేసు వివరాలు పంపాల్సిన ఈ మెయిల్: sakshiclue@gmail.com – వీఎస్‌వీఎస్ వరప్రసాద్. సాక్షి, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. -
నేర నియంత్రణకు.. క్రిమినాలజిస్ట్
దేశంలో జనాభా పోటెత్తుతోంది. నేరాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోవైపు తీవ్రవాదం పంజా విసురుతోంది. ఉగ్రవాదం ఉరుముతోంది. వీట న్నింటితో ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతోంది. అంతిమం గా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో నేర నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవస రం ఏర్పడింది. అందుకే క్రిమినాలజిస్ట్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని కెరీర్‌గా మార్చుకుంటే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన ఆదాయం మెండుగా ఉంటాయి. సవాళ్లతో కూడిన ఉత్సాహభరితమైన కెరీర్‌ను ఇష్టపడేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల్లో కొలువులు క్రిమినాలజిస్ట్‌లు సమాజంలో నేరాలకు గల కారణాలు, నేరస్తుల స్వభావం, నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోలీసు, న్యాయ వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ, సెమినార్ల ద్వారా అవగాహన కల్పించాలి. క్రిమినాలజీ కోర్సులను పూర్తిచేసినవారు యూనివర్సిటీ/కాలేజీల్లో లీగల్ స్టడీస్, లా అండ్ సోషియాలజీ, క్రిమినాలజీ ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. నేడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కంపెనీలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు నిపుణులైన క్రిమినాలజిస్ట్‌ల కొరత ను ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటిపై విచారణ జరిపే సంస్థల్లో వీరికి అధిక డిమాండ్ ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. క్రిమినాలజీలో కార్పొరేట్ క్రైమ్, ఎన్విరాన్మెంటల్ క్రైమ్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఆర్థిక నేరాలను అరికట్టేందుకు బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు కూడా క్రిమినాలజిస్ట్లను నియమించుకుంటున్నాయి. కార్పొరేట్ రంగంలో చేరితే అధిక వేతనాలు అందుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: క్రిమినాలజిస్ట్కు విశ్లేషణాత్మక దృక్పథం అవసరం. ప్రతి విషయాన్ని తర్కబద్ధంగా ఆలోచించగలగాలి. డేటా కలెక్షన్, అనాలిసిస్‌పై మంచి పరిజ్ఞానం ఉండాలి. సైకాలజీ, సోషియాలజీపై అవగాహన పెంచుకోవాలి. కష్టపడి పనిచేసే గుణం ఉండాలి. ఒత్తిళ్లు, సవాళ్లను తట్టుకొని పనిచేసే నేర్పు చాలా ముఖ్యం. అర్హతలు: మన దేశంలో వివిధ విద్యాసంస్థలు క్రిమినాలజీలో అండర్గ్రాడ్యుయేట్(బీఏ/బీఎస్సీ), పోస్టుగ్రాడ్యుయేట్(ఎంఏ/ఎంఎస్సీ) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైనవారు అండర్గ్రాడ్యుయేట్ కోర్సులో చేరొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించి, పోస్టుగ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు అవకాశం ఉంటుంది. వేతనాలు: క్రిమినాలజిస్ట్‌లు తమ హోదాలను బట్టి వేతనాలు అందుకోవచ్చు. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు పొందొచ్చు. ఆ తర్వాత పనితీరు, అనుభవం, పదోన్నతుల ద్వారా వేతనంలో పెరుగుదల ఉంటుంది. కోర్సులను అందిస్తున్న సంస్థలు: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్(ఎన్‌ఐసీఎఫ్‌ఎస్)-న్యూఢిల్లీ వెబ్సైట్: http://nicfs.nic.in/ ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: www.andhrauniversity.edu.in బెనారస్ హిందూ యూనివర్సిటీ వెబ్సైట్: www.bhu.ac.in లక్నో యూనివర్సిటీ వెబ్సైట్: www.lkouniv.ac.in యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వెబ్సైట్: www.unom.ac.in -
మొన్న చిన్నాన్న, నిన్న అక్క కుమార్తె
- రితిభ హంతకుడి కొత్త కోణం - 2013లో చిన్నాన్నను హత్య చేసిన సల్మాన్ - పోలీసుల దర్యాప్తులో బయటపడిన వాస్తవాలు - డబ్బు కోసం నేరాలు - పోలీస్ కమిషనర్ ఔరాద్కర్ బెంగళూరు : ఐదురోజుల క్రితం సొంత అక్క కుమార్తెను డబ్బు కోసం కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన సల్మాన్‌ను విచారణ చేసిన పోలీసులకు మరో హత్య విషయం వెలుగు చూడటంతో కంగుతిన్నారు. నిందితుడు సొంత చిన్నాన్ననే హత్య చేసినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 9న సొంత అక్క కుమార్తె రితిభను కిడ్నాప్ చేసిన నిందితుడు సల్మాన్ తన భార్య షబరీన్‌తో కలిసి సొంత చిన్నాన్న హఫీజ్ శంషుల్ను హత్య చేశాడని ఔరాద్కర్ వివ రించారు. వివరాలు... హతుడు హఫీజ్ ఓ ఉర్ధూ వార పత్రిక ఎడిటర్. ఈయనకు ట్యాన రీ రోడ్డులోని ఈద్గా కాంప్లెక్స్‌లో ఆల్ ఖుద్దున్ మైనార్టీ కో-ఆపరేటివ్ సొసైటీ కూడా ఉంది. ఇదిలా ఉంటే హఫీజ్‌కు వరుసకు కుమారుడైన సల్మాన్ 2010లో నగరానికి చెందిన షబరిన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం అక్కడే కొన్నాళ్లు ఉండి బెంగళూరు చేరుకున్నాడు. షబరిన్ తల్లి ఇంటిలోనే కాపురం పెట్టారు. జులాయిగా తిరుగుతున్న సల్మాన్ వ్యవహారం నచ్చక అత్త కుమార్తెతో పాటు అల్లుడిని కూడా బయటకు పంపింది. దీంతో వీరు శివాజీనగర్‌లో నివాసముంటున్నారు. ఇదిలా ఉంటే సల్మాన్ ఇంటి ఖర్చుల కోసం చిన్నాన్న హఫీజ్ వద్దకు వచ్చేవాడు. చిన్నాన్న వద్ద డబ్బు అధికంగా ఉందని భావించిన సల్మాన్ అతడిని హత్య చేయాలని పథకం వేశాడు. ఇందుకు భార్యకు కూడా సహకరించడంతో 2013 జూన్ 3న ఉదయం 7 గంటల సమయంలో హఫీజ్ సొసైటీ కార్యాలయంలో ఉండగా అప్పటికే అక్కడికి చేరుకున్న సల్మాన్ దంపతులు డబ్బు కావాలని హఫీజ్‌ను డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం బీరువాలో ఉన్న రూ. 60 వేల న గదు ఎత్తుకెళ్లారు. పోలీసుల చిక్కిపోతామని భావించి హైదరాబాద్ చేరుకున్నారు. హఫీజ్ హత్య కేసులో పోలీసులు 127 మందిని విచారణ చేశారు. అయినా నిందితులు చిక్కలేదు. ఇదే అదునుగా భావించిన సల్మాన్ భార్యతో సహా బెంగళూరు చేరుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన సల్మాన్ డబ్బు కోసం చివరకు అక్క కుమార్తెను హత్య చేసి పోలీసుల విచారణలో చిన్నాన్న హఫీజ్‌ను కూడా హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని ఔరాద్కర్ చెప్పారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను రాఘవేంద్ర ఔరాద్కర్ అభినందించారు. -
మాకూ వీక్లీ ఆఫ్ కావాలి...
- తెలంగాణ తరహాలో వారాంతపు సెలవు కోరుతున్న పోలీసులు - ప్రతిపాదనలున్నాయి... ప్రభుత్వ నిర్ణయమే తరువాయంటున్న ఎస్పీ శ్రీకాకుళం క్రైం: నిత్యం నేరాలు ఘోరాలతో సావాసం... రాత్రనక పగలనక తిండి తిప్పలు లేక విధి నిర్వహణ... ప్రజాప్రతినిధుల రక్షణలో కీలక పాత్ర... ప్రజల మాన, ప్రాణ, ఆస్తుల రక్షణలో నిమగ్నం... ఇవన్నీ చెబుతున్నది ఎవరి గురించో అర్ధమయ్యేవుంటుంది.. వారే మన పోలీసులు. రోజంతా ప్రజల కోసం శ్రమిస్తారు. కాని ఆ పోలీసుల ఆరోగ్య రక్షణ, వారి కుటుంబ సరదాలను ఎవ్వరూ పట్టించుకోరు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు వారంలో ఒక రోజును వారాంతపు సెలవుగా ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్ర పోలీసుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే తరహాలో మన రాష్ట్ర పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్ మంజూరు ేయాలన్న ఆలోచన మొదలైంది. జిల్లాలో ఎస్పీ, ఇద్దరు ఓఎస్డీలు, నలుగురు డీఎస్పీలు, 56 మంది సీఐలు, నలుగురు ఆర్ఐలు, 11 మంది ఆర్ ఎస్సైలు, 111 మంది ఎస్సైలు, 81 మంది ఏఎస్సైలు, 251 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 982 మంది కానిస్టేబుళ్లు, 400 మంది ఎ.ఆర్.ఎస్సైలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ శాఖలో పనిచేసిన వారికైనా వారాంతపు సెలవు ఉంటుంది గానీ, ఒక్క పోలీసులకు మాత్రం ఇంత వరకు ఆ భాగ్యం దక్కలేదు. దీని కారణంగా చాలా మంది పోలీసులు ఒత్తిడికి గురై అనారోగ్యానికి లోనవుతున్నారు. అంతేకాకుండా కుటుంబసభ్యులతో సరదాగా గడిపే ఆనందాన్ని కూడ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ భావనను దూరం చేయాలంటే కచ్చితంగా వారాంతపు సెలవు కావల్సిందేనన్నది పోలీసు ఉన్నతాధికారుల భావన.ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. అయితే వారాంతపు సెలవు వల్ల విధులకు భంగం రాకుండా కొత్త నియామకాలు చేపట్టి సిబ్బందిని పెంచాల్సివుంటుంది.