న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన విమానాలు తరచూ ఎక్కడో ఒక చోట కూలాయన్న వార్తలు సర్వసాధారణంగా మారాయి. ఈ ప్రమాదాల కారణాల అధ్యయనానికి ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ తన నివేదికని సిద్ధం చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన జాగ్వార్ యుద్ధవిమానం మంగళవారం ఉదయం ఉత్తర్ ప్రదేశ్లోని అలహాబాద్ సమీపంలో కూలిన విషయం తెలిసిందే. దీనితో కలుపుకొని 2007 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన 86 విమానాలు కూలిపోయాయని పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికలో తేల్చిచెప్పింది.
గత ఎనిమిదేళ్లలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు సరాసరిన నెలకు ఒకటి కూలిపోతోందని ఈ నివేదికలో పేర్కొంది. సాంకేతిక కారణాలతో 34 విమానాలు ప్రమాదాలకు గురవ్వగా, మరో 30 విమానాలు పైలట్ తప్పిదాల వల్ల కూలాయని తెలిపింది. మరికొన్ని ప్రమాదాలు సాంకేతిక కారణాలు, పైలట్ తప్పిదాలు రెండింటి వల్ల సంభవించాయని వివరించింది. మానవతప్పిదాలలో ముఖ్యంగా కొత్తగా అప్డేట్ అయిన మ్యాప్లను ఉపయోగించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని తెలిపింది.
నెలకో విమానం కూలిపోతోందట?!
Published Wed, Jun 17 2015 4:11 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement
Advertisement