న్యూఢిల్లీ: విమానయాన చార్జీలపై పరిమితులు విధించడం ద్వారా స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే యోచనేది ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ స్పష్టం చేశారు. ‘ప్రాథమికంగా చార్జీలపై పరిమితులు విధించడం, మార్కెట్ ఎకానమీ లో జోక్యం చేసుకోవడం అనేవి సరికాదు. ప్రభు త్వం ఈ విషయంపై సానుకూలంగా లేదు. ఇటు కనిష్ట అటు గరిష్ట చార్జీల పరిమితి విధించాలను కోవడం లేదు. స్వేచ్ఛాయుత మార్కెట్ ఎకానమీలో అసలు ప్రభుత్వం జోక్యమే చేసుకోకూడదనేది నా అభిప్రాయం‘ అని ఆయన చెప్పారు.
అయితే, ప్రయాణికులపై అత్యంత భారీ చార్జీల భారం పడ కుండా, వారు ఇబ్బంది పడకుండా చూసేందుకు ఎయిర్‌లైన్స్‌తో ప్రభుత్వం చర్చించినట్లు బన్సల్ చెప్పారు. చాలా మటుకు రూట్లలో ప్రస్తుతం కనిష్ట చార్జీలు.. దాదాపు ఏసీ రైలు చార్జీల స్థాయిలోనే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులు విధించాలని, ఆ విషయంలో స్వేచ్ఛా మార్కెట్ ఎకానమీ పేరుతో పోటీ సంస్థలను దెబ్బతీసేలా ఎయిర్‌లైన్స్ వ్యవహరించకుండా చూడాలని పౌర విమానయాన శాఖకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసిన నేపథ్యంలో బన్సల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment