న్యూఢిల్లీ: ప్రస్తుతం విదేశాలలో ఎలాంటి కోల్ బ్లాకులూలేని పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాకు త్వరలో ఈ అవకాశాలు లభించనున్నాయి. తాజాగా ఇందుకు పార్లమెంటరీ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇకపై విదేశాలలో బొగ్గు గనుల కొనుగోలు అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే ఇందుకు ఆయా క్షేత్రాలపట్ల పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టవలసి ఉంటుంది. ప్రధానంగా తక్కువ యాష్‌గల కోకింగ్ కోల్ బ్లాకుల కొనుగోలుకి అనుమతించనున్నారు.
దీంతో శిలాజ ఇంధనలాకు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమేకాకుండా విదేశాలలో మైనింగ్‌పై కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుంటుందని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న బొగ్గు వనరులను పరిగణిస్తూ విదేశాలలో కోల్ బ్లాకులను కొనుగోలు చేసేందుకు కమిటీ సిఫారసు చేస్తోంది. బొగ్గు శాఖ లేదా కోల్ ఇండియా ఇందుకు సిద్ధపడవచ్చని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో బొగ్గు, గనులు, స్టీల్‌పై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ పేర్కొంది.
2009లో..
పూర్తి అనుబంధ సంస్థ కోల్ ఇండియా ఆఫ్రికానా లిమిటాడా ద్వారా నిజానికి 2009లోనే కోల్ ఇండి యా మొజాంబిక్‌లోని కోల్ బ్లాకుల కొనుగోలుకి ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను సొంతం చేసుకుంది. లోతైన అన్వేషణ, జియోలాజికల్, మైనింగ్ అవకాశాల నివేదికను అధ్యయనం చేశాక బొగ్గు నాణ్యత విషయంలో వెనకడుగు వేసింది. ఇక్కడ బొగ్గు వెలికితీత వాణిజ్యపంగా ఆచరణ సాధ్యంకాదని గుర్తించింది. ఫలితంగా బొగ్గు గనుల కొను గోలు లాభదాయకంకాదని 2016లో ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను తిరిగి మొజాంబిక్ ప్రభుత్వానికి దాఖలు చేసింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండి యా 80 శాతాన్ని ఆక్రమిస్తున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment