coal block
-
విదేశీ బ్లాక్స్‌పై కోల్ ఇండియా కన్ను
న్యూఢిల్లీ: ప్రస్తుతం విదేశాలలో ఎలాంటి కోల్ బ్లాకులూలేని పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాకు త్వరలో ఈ అవకాశాలు లభించనున్నాయి. తాజాగా ఇందుకు పార్లమెంటరీ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇకపై విదేశాలలో బొగ్గు గనుల కొనుగోలు అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే ఇందుకు ఆయా క్షేత్రాలపట్ల పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టవలసి ఉంటుంది. ప్రధానంగా తక్కువ యాష్గల కోకింగ్ కోల్ బ్లాకుల కొనుగోలుకి అనుమతించనున్నారు. దీంతో శిలాజ ఇంధనలాకు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమేకాకుండా విదేశాలలో మైనింగ్‌పై కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుంటుందని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న బొగ్గు వనరులను పరిగణిస్తూ విదేశాలలో కోల్ బ్లాకులను కొనుగోలు చేసేందుకు కమిటీ సిఫారసు చేస్తోంది. బొగ్గు శాఖ లేదా కోల్ ఇండియా ఇందుకు సిద్ధపడవచ్చని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో బొగ్గు, గనులు, స్టీల్‌పై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ పేర్కొంది. 2009లో.. పూర్తి అనుబంధ సంస్థ కోల్ ఇండియా ఆఫ్రికానా లిమిటాడా ద్వారా నిజానికి 2009లోనే కోల్ ఇండి యా మొజాంబిక్‌లోని కోల్ బ్లాకుల కొనుగోలుకి ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను సొంతం చేసుకుంది. లోతైన అన్వేషణ, జియోలాజికల్, మైనింగ్ అవకాశాల నివేదికను అధ్యయనం చేశాక బొగ్గు నాణ్యత విషయంలో వెనకడుగు వేసింది. ఇక్కడ బొగ్గు వెలికితీత వాణిజ్యపంగా ఆచరణ సాధ్యంకాదని గుర్తించింది. ఫలితంగా బొగ్గు గనుల కొను గోలు లాభదాయకంకాదని 2016లో ప్రాస్పెక్టింగ్ లైసెన్సులను తిరిగి మొజాంబిక్ ప్రభుత్వానికి దాఖలు చేసింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండి యా 80 శాతాన్ని ఆక్రమిస్తున్న విషయం విదితమే. -
ఆ గనులు మాకిచ్చేయండి.. వాడనప్పుడు మీ దగ్గర ఎందుకు - కేంద్రం
తమకు కేటాయించిన గనుల్లో ఇప్పటి వరకు కార్యకలాపాలు ప్రారంభినట్టయితే ఎటువంటి జరిమానా లేకుండా వాటిని తిరిగి ఇవ్వాలంటే కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు ఉత్పత్తి సంస్థలకు తెలిపింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కెబినేట్ కమిటీ ఆన్ ఎకామికల్ ఎఫైర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనేక సంస్థలు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో కోలిండియా పరిధిలో 9 సంస్థలు ఉండగా దక్షిణ భారత దేశంలో సింగరేణితో పాటు నైవేలీ కోల్‌ఫీల్డ్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు గతంలో కేంద్రం పలు బ్లాకులను బొగ్గు ఉత్పత్తి కోసం కేటాయించింది. వివిధ కారణాల వల్ల చాలా సంస్థలు తమకు కేటాయించిన బ్లాకులలో బొగ్గును ఉత్పత్తి చేయడం లేదు. కొన్ని బ్లాకులకు ఫీజుబులిటీ లేకపోవడం వంటి సమస్యలు ఉండగా మరికొన్ని బ్లాకులకు ఫారెస్ట్ అనుమతులు, నిధుల కొరత, భూసేకరణ తదితర సమస్యలు ఉన్నాయి. ఇలా మొత్తం 73 బ్లాకులు కేటాయించగా ఇందులో 45 బ్లాకులతో ఉత్పత్తి జరగడం లేదు. ప్రస్తుతం బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్లాంట్లలో కరెంటు ఉత్పత్తి తగ్గిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు నిరుపయోగంగా ఉన్న బొగ్గు బ్లాకులను తిరిగి తమకు సరెండర్ చేయాలని కేంద్రం కోరింది. ఇలా సరెండర్‌లో వచ్చిన బ్లాకులను ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలకు కేటాయించనున్నారు. ఈ స్వచ్చంధ సరెండ్ పథకం కింద బొగ్గు బ్లాకులు కేటాయించే సంస్థలకు పెనాల్టీ, వివరణల నుంచి మినహాయింపు ఇచ్చారు. చదవండి: కియాకు మరిన్ని మెరుగులు.. కొత్త ఫీచర్లు ఇవే! -
బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయండి
సాక్షి, హైదరాబాద్: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వెంటనే ఆ బ్లాకులను సింగరేణి సంస్థకే అప్ప గించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కోయ గూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి, కల్యాణి బ్లాక్‌ల వేలాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతోందని, ఈ వేలం ద్వారా తమ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందనే ఆందోళనలో కార్మికలోకం ఉందని పేర్కొన్నారు. మేమొస్తే్త ఎస్సీల్లోకి దళిత క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేరుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. టీపీసీసీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్.. కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల విభజనలో స్థానికతకు ప్రాధా న్యం ఇవ్వాలని, ఆ మేరకే ఉమ్మడి జిల్లాల్లోని ఉపాధ్యాయులను నూతన జిల్లాలకు కేటాయించాలని రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు రేవంత్‌ను కలసి తమ సమస్యలను వివరించారు. -
సింగరేణి చేతికి ‘న్యూ పాత్రపాద’
సాక్షి, హైదరాబాద్ : వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఒడిశాలో ఇప్పటికే 3,500 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్న ‘నైనీ’ బ్లాకును పొందిన సింగరేణి, తాజాగా దీనికన్నా 3 రెట్లు పెద్దదైన ‘న్యూ పాత్రపాద’అనే కొత్త బ్లాకును దక్కించుకుంది. ఒడిశాలో తమకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాకుతో పాటు మరికొన్ని కొత్త బ్లాకులు కేటాయించాలని సింగరేణి సంస్థ విజ్ఞప్తి చేయగా కేంద్ర బొగ్గు శాఖ సానుకూలంగా స్పందించింది. ‘న్యూ పాత్రపాద’బ్లాకును వారం రోజుల కింద సింగరేణికి కేటాయించింది. ఛండిపడ తహశీల్ పరిధిలోని అనేక బొగ్గు బ్లాకుల్లో ‘న్యూ పాత్రపాద’ఒకటి. నైనీ బ్లాకుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనుమతులన్నీ లభించిన తర్వాత బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తే దేశంలోని అతిపెద్ద గనుల్లో ఒకటిగా నిలవనుంది. సింగరేణి సంస్థ తన 48 గనుల నుంచి ఏటా 680 లక్షల టన్నుల బొగ్గు తీస్తుండగా, ఈ ఒక్క గని నుంచి 200 లక్షల టన్నుల బొగ్గు తీసే అవకాశం ఉంది. -
ఎవరినీ ఒత్తిడి చేయలేదు
హిందాల్కోకు బొగ్గుబ్లాకు కేటాయింపుపై మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వెల్లడి కుమార మంగళం బిర్లా లేఖను కేవలం పరిశీలనకోసమే బొగ్గుశాఖకు పంపా న్యూఢిల్లీ : ఒడిశాలోని తలబిరా-2 బొగ్గుబ్లాకును హిందాల్కో కంపెనీకి కట్టబెట్టడానికి తాను ఎవరిపైనా ఒత్తిడి తీసుకురాలేదని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బొగ్గు స్కాంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐకి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి తొందరపాటూ లేదని స్పష్టంచేశారు. హిందాల్కోకు గని కేటాయింపుపై పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లాకు తాను ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. 2005లో మన్మోహన్ బొగ్గు శాఖనూ నిర్వహించడం తెలిసిందే. అయితే ఈ గని కేటాంచాలని కోరుతూ బిర్లా రాసిన లేఖను, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ రాసిన లేఖను ‘శ్రద్ధగా పరిశీలించాలి’ అని మాత్రమే బొగ్గు శాఖ అధికారులకు పంపానని ఆయన తెలిపారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శి ఇలాంటి వాటిని పంపడం పరిపాటేనని, పరిపాలనలో ఇది సాధారణంగా జరిగేదేనన్నారు. ఇలాంటివాటిని ప్రధాని స్థాయివ్యక్తి పెద్దగా పట్టించుకోరని తెలిపారు. ఈ విషయంలో రిమైండర్లు పంపాల్సిందిగా తానెవరికీ చెప్పినట్లు గుర్తులేదన్నారు. హిందాల్కోకు గనిని కేటాయించాలని బొగ్గుశాఖ చేసిన సిఫారసులను తాను ఆమోదించానని తెలిపారు. ఈ స్కాం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మన్మోహన్‌కు నిందితునిగా సమన్లు జారీ చేయడం తెలిసిందే. ఈ మేరకు ఆయన శుక్రవారం సీబీఐకి లిఖితపూర్వకంగా వివరాలు వెల్లడించారు. 25వ స్క్రీనింగ్ కమిటీ మినిట్స్‌కు ఆమోదం తెలపాల్సిందిగా బొగ్గు కార్యదర్శికి తాను ఫైలు పంపిన విషయం తనకు తెలుసన్నారు. బిర్లా లేఖను, నివేదిక రూపొందించాల్సిందిగా సూచిస్తూ సాధారణ పరిశీలనకే బొగ్గుశాఖకు పంపానని, ఈ విషయంలో ఆయనకు హామీ ఇవ్వలేదన్నారు. కాగా, మన్మోహన్‌తో పాటు బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్.. మరికొందరికి ప్రత్యేకకోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు ఏప్రిల్ 1న స్టే జారీ చేసింది. తొలుత హిందాల్కోకు కేటాయింపులను నిరాకరించి, తర్వాత కేటాయించడం వివాదాస్పదమైంది. ప్రభుత్వరంగ సంస్థకు ఇవ్వాల్సిన బొగ్గుబ్లాకును బిర్లా కంపెనీకి కట్టబెట్టడంపై ఆరోపణలు వచ్చాయి. తమ సంస్థకు బొగ్గుబ్లాకును కేటాయించకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతూ బిర్లా లేఖలు రాశారు. ఒడిశా సీఎం పట్నాయక్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ లేఖరాశారు. -
బొగ్గు క్షేత్రాల వేలానికి రంగం సిద్ధం..!
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల తాజా వేలం ప్రక్రియకు తొలి అడుగు పడింది. వచ్చే యేడాది ఫిబ్రవరి 11వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏకపక్షం, చట్ట విరుద్ధంగా పేర్కొంటూ 1993 నుంచీ జరిగిన 204 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడం తెలిసిందే. వీటిలో మొదటి విడతగా 74 క్షేత్రాలకు తాజాగా ఈ-వేలం ప్రక్రియ ఫిబ్రవరి 11న ప్రారంభమవుతుందని బొగు ్గశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ అంశంపై ముసాయిదా మార్గదర్శకాలను కేంద్రం బుధవారం విడుదల చేసింది. నవంబర్ 24వ తేదీ లోపు ఈ ముసాయిదా నిబంధనలపై సంబంధిత వర్గాల స్పందనలను తెలియజేయాల్సి ఉంటుంది. వీటి వివరాలను స్వరూప్ మీడియాకు తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని స్వరూప్ తెలిపారు. కేవలం సొంత అవసరాలకు వినియోగించుకునే (క్యాపిటివ్) వారికి మాత్రమే బొగ్గు గనులను కేటాయించడం జరుగుతుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. నిర్దేశించిన ప్రాజెక్టు మినహా ఒక కంపెనీ సంబంధిత బొగ్గు క్షేత్రాన్ని మరే ప్రాజెక్టుకూ వినియోగించరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఏదైనా మార్పు చేయాలనుకుంటే అందుకు సంబంధించి వివరాలను అంతకుముందే తప్పనిసరిగా కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. బొగ్గు క్షేత్రాల వేలం తరువాత విద్యుత్ చార్జీలు పెరిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చూస్తుందని కూడా స్వరూప్ సూచనప్రాయంగా తెలిపారు. ఎన్ని క్షేత్రాలకు ఒక కంపెనీ బిడ్ దాఖలు చేయవచ్చన్న అంశంపై ఒక పరిమితి ఉంటుందని స్వరూప్ తెలిపారు. గుత్తాధిపత్యాన్ని నిరోధించడమే ఈ విధాన లక్ష్యమని వెల్లడించారు. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్స్గా రెండు దశల టెండర్ ప్రక్రియలో బొగ్గు క్షేత్రాల ఈ-ఆక్షన్ జరుగుతుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వేలానికి సిద్ధం చేసే బొగ్గు గనుల గుర్తింపు, వీటిలో ప్రభుత్వ కంపెనీలకు ఏ గనులను కేటాయించాలి వంటి అంశాల నిర్ణయ బాధ్యతలను కేంద్రం నామినేటెడ్ అథారిటీకి అప్పగించనుంది. నామినేటెడ్ అథారిటీగా బొగ్గు వ్యవహారాల జాయింట్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్‌ను ఇప్పటికే కేంద్రం నియమించింది. విద్యుత్, స్టీల్, ఇనుము, సిమెంట్ రంగాల ప్రాజెక్టుల్లో వినియోగానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ అమలవుతుంది. పరిహారం ప్రక్రియ... తాజా ఆక్షన్‌లో ఒక బొగ్గు క్షేత్ర కేటాయింపుదారు గతంలో కూడా అదే క్షేత్రం చెందిన కేటాయింపుదారుకాని పక్షంలో, గత కేటాయింపుదారుకు పరిహారం అందుతుంది. సంబంధిత క్షేత్ర మౌలిక అభివృద్ధికి గతంలో సంబంధిత కంపెనీ వ్యయం తత్సంబంధ అంశాల ప్రాతిపదికన ఈ తరహా పరిహారాన్ని నామినేటెడ్ అథారిటీ నిర్ణయిస్తుంది. క్షేత్రాల వేలం రిజర్వ్ ధరపై అధికారులు ప్రస్తుతం మదింపు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీ లోపు దీనిని నిర్ణయించే అవకాశం ఉంటుందని స్వరూప్ వెల్లడించారు. కేటాయింపులకు సంబంధించి టెక్నికల్ బిడ్స్‌ను 2015 మార్చి 3న ఓపెన్ చేయాలని మంత్రిత్వశాఖ భావిస్తోంది. మార్చి 16వ తేదీలోపు లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేయాలన్న సంకల్పంతో బొగ్గు మంత్రిత్వశాఖ ఉంది. తొలుత 72 కోల్ బ్లాక్‌లకు వేలం నిర్వహిస్తారు. వీటిలో 42 బ్లాకుల్లో ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఉత్పత్తిని కొనసాగించేందుకు మార్చి 31 వరకూ సుప్రీంకోర్టు అనుమతించింది. మిగిలిన 32 బ్లాకులు ఉత్పత్తికి సిద్ధంగా వున్నాయి. 42 ఉత్పాదక బ్లాకుల్లో ప్రస్తుతం ఏడాదికి 9 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తవుతుండగా, ఉత్పత్తికి సిద్ధంగా వున్న 32 బ్లాకులు మరో 12 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేయగల సామర్థ్యంతో వున్నాయి. ఈ గనుల్ని నిర్వహిస్తున్న ప్రస్తుత కంపెనీ ఆ బ్లాకులో చేసిన పెట్టుబడికి తగిన విలువను పొందుతుందని బొగ్గుశాఖ కార్యదర్శి వివరించారు. -
కోల్ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఓకే
కేంద్ర, రాష్ట్ర పీఎస్‌యూలకు నేరుగా గనుల కేటాయింపునకు అవకాశం ఈ-ఆక్షన్‌తో ప్రైవేటు కంపెనీలకు చాన్స్ 4 నెలల్లో పరిస్థితి చక్కదిద్దుతావున్న అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: విద్యుత్ రంగం సంస్కరణల్లో భాగంగా కేంద్రప్రభుత్వం మరో ముందడుగువేసింది. అవకతవకల కారణంగా, సుప్రీంకోర్టు ఉత్తర్వుతో కేటాయింపులు రద్దయిన 214 బొగ్గు బ్లాకులను ఈ-ఆక్షన్ ద్వారా వేలంవేయూలన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రివర్గం సోవువారం ఆమోదం తెలిపింది. బొగ్గు బ్లాకులను ప్రైవేటు కంపెనీలకోసం వేలం వేసేందుకు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రభుత్వ రంగం సంస్థ(పీఎస్‌యూ)లకు నేరుగా కేటాయించేందుకు వీలుగా మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. అవకతవకలు జరిగాయున్న కారణంతో 1993నుంచి వివిధ కంపెనీలకు కేటాయింపులు జరిపిన 218 బొగ్గు బ్లాకుల్లో 214 బ్లాకులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గత నెలలో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో, రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనకు మంత్రివర్గం నిర్ణయుం తీసుకున్నట్టు కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ నిర్ణయుంతో ప్రభుత్వ రంగం అవసరాలను నెరవేర్చవచ్చని, జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (ఎన్టీపీసీ)సహా, పలు పీఎస్‌యూలకు, వివిధ రాష్ట్రాల విద్యుత్ బోర్డులకు బొగ్గు గనులను కేటాయించేందుకు వీలుకలుగుతుందని చెప్పారు. సిమెంట్, ఉక్కు, విద్యుత్ ఉత్పత్తి రంగాలలో బొగ్గును వినియోగిస్తూ, బొగ్గుగనులకోసం దరఖాస్తు చేసుకునే ప్రైవేటు కంపెనీలకోసం గనులను ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు ఈ ఆర్డినెన్స్ దోహపడుతుందన్నారు. వేలం ప్రక్రియు మూడునెలలనుంచి నాలుగు నెలల వ్యవధిలోగా పూర్తి అవుతుందని, గనులు ఉంటున్న ప్రాంతానికి చెందిన ఆయూ రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రక్రియు జరుగుతుందని జైట్లీ చెప్పారు. ప్రస్తుతం ఏటా దిగువుతి చేసుకుంటున్న రూ.122.27కోట్ల బొగ్గును ఈ చర్యద్వారా దేశంలోనే భర్తీ చేయువచ్చని అన్నారు. ఆరోపణలున్న కంపెనీలను అనువుతించం అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపణలున్న కంపెనీలపై తప్పనిసరిగా నిషేధం ఉంటుందని బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. గనుల వాణిజ్య వినియోగంకోసం 1973సంవత్సరపు బొగ్గు గనుల జాతీయూకరణ చట్టాన్ని సవరిస్తామన్నారు. పలు రాష్ట్రాలకు ప్రయోజనం బొగ్గు బ్లాకుల వేలంపై ఆర్డినెన్స్‌కోసం తీసుకున్న తాజా చర్యతో జార్ఖండ్, ఒడిశా, పశ్చివు బెంగాల్, చత్తీస్‌గఢ్ ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని, ఆంధ్రప్రదేశ్, వుహారాష్ట్ర, వుధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని జైట్లీ చెప్పారు. బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న తూర్పు రాష్ట్రాలు ఆర్థికంగా వురింత బలపడతాయుని, లక్షలాది వుంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. బొగ్గు బ్లాకులపై ఆర్డినెన్స్ జారీకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయుంపట్ల బీజేపీ సోవువారం హర్షం వ్యక్తంచేసింది. -
బొగ్గు బ్లాకులు ఒకేరాష్ట్రానికి ఇవ్వలేం
కేంద్రం స్పష్టీకరణ హైదరాబాద్: ఒడిశా, మధ్యప్రదేశ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన బొగ్గు బ్లాకులను ఇప్పుడు కేవలం ఏపీకే కేటాయిం చడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పింది. ఇరు రాష్ట్రాలు జాయింట్ వెంచర్‌గా నైనా ఏర్పడాలని, లేకుంటే ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీకి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సమాచారం పంపింది. అదేవిధంగా బొగ్గు బ్లాకులను ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని సెప్టెంబర్ ఆఖరులోగా సమాచారం అందించాలని ఇరు రాష్ట్రాలకు తాజాగా సూచించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా ఒడిశాలోని నవ్‌గావ్-తెలిసాహీ బ్లాకు (900 మిలియన్ టన్నులు) తో పాటు మధ్యప్రదేశ్‌లో సులియారీ-తెల్వార్ బ్లాకుల(150 మిలియన్ టన్నులు)ను కేంద్రం కేటాయించింది. ఈ రెండు బ్లాకులను రెండురాష్ట్రాలు చెరి సగం పంచుకోవాల్సిందేనని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ జారీచేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. -
కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమే
కోల్గేట్పై సుప్రీంకోర్టు తీర్పు 218 గనులు, రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల భవితవ్యం ప్రశ్నార్ధకం 1993-2010 లలో చేసిన కేటారుుంపులన్నీ నిర్హేతుకమన్న ధర్మాసనం {స్కీనింగ్ కమిటీ ఆలోచన లేకుండా వ్యవహరించిందని వ్యాఖ్య {పజా ప్రయోజనాలు భారీగా దెబ్బతిన్నాయని స్పష్టీకరణ బొగ్గును నల్ల వజ్రమనడంలో అతిశయోక్తి లేదని వెల్లడి న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటారుుంపులను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వేలం విధానం ప్రవేశపెట్టక మునుపు, 1993 నుంచి 2010 మధ్యకాలంలో పలు ప్రభుత్వాల హ యూంలో చేసిన బొగ్గు గనుల కేటారుుంపులన్నీ చట్టవిరుద్ధం, నిర్హేతుకమని సోమవారం తీర్పు చెప్పింది. తాత్కాలికమైన, ఆషామాషీ పద్దతుల్లో, ఏమాత్రం ఆలోచన చేయకుండా గనులు కేటారుుంచారని అభిప్రాయపడింది. 1993 మొదలు 36 స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు అవలంభించిన విధానాలను ఖండించేందుకు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం దాదాపు అన్ని పదాలను ఉపయోగించింది. అరుుతే ఈ కేటారుుంపుల్ని రద్దు మాత్రం చేయని న్యాయమూర్తులు మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన బెంచ్.. కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిణామాలేమిటన్న అంశమే తమ ముందు మిగిలి ఉందని పేర్కొంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో 218 బొగ్గు బ్లాకులు, వాటి ఆధారంగా పెట్టిన సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తం 218 బొగ్గు బ్లాకుల కేటారుుంపులను పరిశీలించిన ధర్మాసనం 163 పేజీల తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 1న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ, కామన్ కాజ్ అనే ప్రభుత్వేతర సంస్థ 2012లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రీం సుదీర్ఘంగా విచారించింది. ధర్మాసనం ఇంకా ఏమన్నదంటే.. ఇటు స్క్రీనింగ్ కమిటీ మార్గాన, అటు ప్రభుత్వ పంపిణీ మార్గంలో.. రెండు పద్దతుల్లోనూ నిర్హేతుకంగా, చట్టవిరుద్ధంగా కేటారుుంపులు జరిగారుు.1993 జూలై 14 మొదలు 36 సమావేశాలలో స్క్రీనింగ్ కమిటీ సిఫారసుల మేరకు యూవత్ కేటారుుంపులు చట్టవిరుద్ధంగా జరిగింది.{స్కీనింగ్ కమిటీ స్థిరంగా వ్యవహరించలేదు. మార్గదర్శకాలను తక్కువగా పాటించారు. పారదర్శకత లేదు. విజ్ఞతఉపయోగించలేదు.వాణిజ్య ప్రయోజనాల కోసం బొగ్గు తవ్వకాలు జరిపే అర్హత ఏ రాష్ట్రానికీ లేదా దాని పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థకు లేదు. వీటివల్ల జాతి సంపద, పరిశ్రమల ప్రభువ రుున బొగ్గుఅన్యాయంగా పంపిణీ అరుుంది. బొగ్గును నల్ల వజ్రంగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. చాలా దేశాలలో బొగ్గు ఆధారంగానే పారిశ్రామిక ప్రగతి చోటు చేసుకుంది.మన దేశంలో ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే బొగ్గు గని కేటారుుంపు కంపెనీలపై ఉదారతకు సంబంధించిన వ్యవహారమయింది.పరిపాలన మార్గం ద్వారా కేటారుుంపు జరిపేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానం ఇప్పటికే ఉన్న చట్టానికి అనుగుణంగా లేదు. యూఎంపీపీలు బొగ్గును మళ్లించకూడదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల (యూఎంపీపీలు) నుంచి బొగ్గును వేరే అవసరాలకు మళ్లించేందుకు కొన్ని కేసుల్లో ప్రభుత్వం అనుమతించడాన్ని నిరోధించాలన్న ఎన్జీవో వాదనను సుప్రీం అంగీకరించింది. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులకు (యూఎంపీపీలు) తక్కువ ధరకు బొగ్గు గనులు కేటారుుంచడంపై ఎలాంటి సవాలూ తమ ముందు లేదని బెంచ్ స్పష్టం చేసింది. యూఎంపీపీలకు కేటారుుంచిన క్షేత్రాలను వాటి నిమిత్తమే ఉపయోగించాలని. బొగ్గును మళ్లించడం కానీ వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడం కానీ చేయరాదని ఆదే శాలిచ్చినట్టు తెలిపింది. గనుల కేటారుుంపు కోసం ఏళ్ల తరబడి కాంపిటీటివ్ బిడ్డింగ్‌ను అనుసరించకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఈ విషయంలో కోర్టు జోక్యం అవసరమైనంత నిర్హేతుకంగా ఉందని, అర్ధరహితంగా ఉందని చెప్పజాలమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బొగ్గు క్షేత్రాలకు సంబంధించిన గణాంకాలను అటార్నీ జనరల్ ఇచ్చినప్పటికీ, వాటిని సరిచూడలేదని తీర్పు అనంతరం ధర్మాసనం మౌఖికంగా చెప్పింది. వీటిని పరిశీలించాల్సి ఉందని, తీర్పు వల్ల తలెత్తే పరిణామాలను నిర్ధారించేందుకు మరింత విచారణను సెప్టెంబర్ 1వ తేదీన చేపడతామని తెలిపింది. యూపీఏపై ఆరోపణలు యూపీఏ హయూంలో కేటారుుంచిన 194 బొగ్గు బ్లాకులకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు పిటిషనర్లు అరోపించారు.సుప్రీం తన విచారణను 1993జూలై 14 నుం చి జరిగిన కేటారుుంపులకు పొడిగించింది. {Oపెవేటు కంపెనీలు, పార్టీలకు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఎంపీ రాష్ట్రాల్లో గనులు కేటారుుంచారు. కేసు విచారణకు వచ్చినప్పుడు కేంద్రం 218 క్షేత్రాల సమాచారం అందజేసింది. 2012లో పిటిషన్ దాఖలైనప్పుడు.. గనుల కేటారుుంపుల్లో రూ.1.64 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాగ్ అంచనా వేసిందన్నారు.కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును సైతం పర్యవేక్షించింది. దాఖలయ్యే కేసుల ప్రాసిక్యూషన్ కోసం ప్రత్యేక కోర్టును సైతం నెలకొల్పారు. కోల్గేట్ ప్రస్థానం జూలై 1992:బొగ్గు బ్లాకుల కేటాయింపుల కో సం వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు. జూలై 14న సింగరేణి కాలరీస్, కోల్ఇండియా లిమిటెడ్‌ల ఉత్పత్తి ప్రణాళికల్లో లేని బ్లాకుల గుర్తింపు. 1993- 2010: 1993-2005 మధ్య 70 బ్లాకులను, 2006లో 53 బ్లాకులను, 2007లో 52 సహా మొత్తం 216 బ్లాకుల కేటాయింపు. వాటిలో నుంచి 24 బ్లాకుల కేటాయింపును రద్దు చేశారు.మార్చి 2012: 2004-2009 మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రభుత్వం అసమర్ధంగా వ్యవహరించిందని, దానివల్ల కేటాయింపులు పొందిన కంపెనీలు రూ. 10.7 లక్షల కోట్లు ఆర్జించారని కాగ్ ముసాయిదా నివేదిక వెల్లడి. మే 31, 2012: సీబీఐ విచారణకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఆదేశాలు జూన్ 2012: బొగ్గు బ్లాకుల కేటాయింపుపై సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, అనంతరం 80 బ్లాకుల కేటాయింపు ఉపసంహరణ, ఆగస్ట్, 2012: పార్లమెంట్లో కాగ్ రిపోర్ట్. ఖజానాకు రూ. 1.86 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడి. మైనింగ్ ప్రారంభం కాకుండానే నష్టం జరిగిందని ఎలా చెబుతారని ప్రభుత్వ అభ్యంతరం. సెప్టెంబర్, 2012: బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్. సీబీఐ దర్యాప్తుపై సుప్రీం పర్యవేక్షణ ప్రారంభం. మార్చ్, 2013: దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి చెప్పొద్దంటూ సీబీఐకి సుప్రీం ఆదేశాలు. జూన్ 11, 2013: నవీన్ జిందాల్, దాసరి నారాయణ రావులపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన సీబీఐ. అక్టోబర్‌లో కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి కేసీ పరేఖలపై ఎఫ్ఐఆర్ నమోదు. జూలై, 2014: కేసుల విచారణ కోసం ప్రత్యేక సీబీఐ కోర్టును ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. -
'హిందాల్కో' వ్యవహారంలో మన్మోహన్ తప్పులేదు: పీఎంఓ
బొగ్గు గనుల కేటాయింపులపై ప్రధాని కేంద్ర బిందువుగా తీవ్ర విమర్శలు రావడంతో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) మౌనం వీడింది. 'హిందాల్కో' కంపెనీకి గనుల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పీఎంఓ శనివారం వివరణ ఇచ్చింది. కేటాయింపులకు సంబంధించి తన ముందుంచిన ఫైళ్లను పరిశీలించి అర్హతను బట్టే ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదించారని స్పష్టం చేసింది. 2005లో బొగ్గు మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనలను ప్రధాని సాధికారిక అధికారంతో ఆమోదించినట్టు వివరించింది. బొగ్గు కుంభకోణంలో ప్రధాని పాత్రపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్‌ల పేర్లను సీబీఐ ఆ ఎఫ్ఐఆర్లో చేర్చింది. పీసీ పరేఖ్.. మన్మోహన్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే.. తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్ర దారేనన్నారు. ఈ నేపథ్యంలో పీఎంఓ స్పందించి వివరణ ఇచ్చింది.