కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమే | Supreme Court deems all coal blocks allocated since 1993 as illegal | Sakshi
Sakshi News home page

కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమే

Published Tue, Aug 26 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమే

కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమే

కోల్‌గేట్‌పై సుప్రీంకోర్టు తీర్పు
     
218 గనులు, రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల భవితవ్యం ప్రశ్నార్ధకం
1993-2010 లలో చేసిన కేటారుుంపులన్నీ నిర్హేతుకమన్న ధర్మాసనం
{స్కీనింగ్ కమిటీ ఆలోచన లేకుండా వ్యవహరించిందని వ్యాఖ్య
{పజా ప్రయోజనాలు భారీగా దెబ్బతిన్నాయని స్పష్టీకరణ
బొగ్గును నల్ల వజ్రమనడంలో అతిశయోక్తి లేదని వెల్లడి

 
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటారుుంపులను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.  వేలం విధానం ప్రవేశపెట్టక మునుపు, 1993 నుంచి 2010 మధ్యకాలంలో పలు ప్రభుత్వాల హ యూంలో చేసిన బొగ్గు గనుల కేటారుుంపులన్నీ చట్టవిరుద్ధం, నిర్హేతుకమని సోమవారం తీర్పు చెప్పింది. తాత్కాలికమైన, ఆషామాషీ పద్దతుల్లో, ఏమాత్రం ఆలోచన చేయకుండా గనులు కేటారుుంచారని అభిప్రాయపడింది. 1993 మొదలు 36 స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు అవలంభించిన విధానాలను ఖండించేందుకు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం దాదాపు అన్ని పదాలను ఉపయోగించింది. అరుుతే ఈ కేటారుుంపుల్ని రద్దు మాత్రం చేయని  న్యాయమూర్తులు మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన బెంచ్.. కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిణామాలేమిటన్న అంశమే తమ ముందు మిగిలి ఉందని పేర్కొంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో 218 బొగ్గు బ్లాకులు, వాటి ఆధారంగా పెట్టిన సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తం 218 బొగ్గు బ్లాకుల కేటారుుంపులను పరిశీలించిన ధర్మాసనం 163 పేజీల తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 1న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ, కామన్ కాజ్ అనే ప్రభుత్వేతర సంస్థ 2012లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రీం సుదీర్ఘంగా విచారించింది.

ధర్మాసనం ఇంకా ఏమన్నదంటే..

ఇటు స్క్రీనింగ్ కమిటీ మార్గాన, అటు ప్రభుత్వ పంపిణీ మార్గంలో.. రెండు పద్దతుల్లోనూ నిర్హేతుకంగా, చట్టవిరుద్ధంగా కేటారుుంపులు జరిగారుు.1993 జూలై 14 మొదలు 36 సమావేశాలలో స్క్రీనింగ్ కమిటీ సిఫారసుల మేరకు యూవత్ కేటారుుంపులు చట్టవిరుద్ధంగా జరిగింది.{స్కీనింగ్ కమిటీ స్థిరంగా వ్యవహరించలేదు. మార్గదర్శకాలను తక్కువగా పాటించారు. పారదర్శకత లేదు. విజ్ఞతఉపయోగించలేదు.వాణిజ్య ప్రయోజనాల కోసం బొగ్గు తవ్వకాలు జరిపే అర్హత ఏ రాష్ట్రానికీ లేదా దాని పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థకు లేదు.

వీటివల్ల జాతి సంపద, పరిశ్రమల ప్రభువ రుున బొగ్గుఅన్యాయంగా పంపిణీ అరుుంది.  బొగ్గును నల్ల వజ్రంగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. చాలా దేశాలలో బొగ్గు ఆధారంగానే పారిశ్రామిక ప్రగతి చోటు చేసుకుంది.మన దేశంలో ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే బొగ్గు గని కేటారుుంపు కంపెనీలపై ఉదారతకు సంబంధించిన వ్యవహారమయింది.పరిపాలన మార్గం ద్వారా కేటారుుంపు జరిపేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానం ఇప్పటికే ఉన్న చట్టానికి అనుగుణంగా లేదు.  

యూఎంపీపీలు బొగ్గును మళ్లించకూడదు

అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల (యూఎంపీపీలు) నుంచి బొగ్గును వేరే అవసరాలకు మళ్లించేందుకు కొన్ని కేసుల్లో ప్రభుత్వం అనుమతించడాన్ని నిరోధించాలన్న ఎన్జీవో వాదనను సుప్రీం అంగీకరించింది. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులకు (యూఎంపీపీలు) తక్కువ ధరకు బొగ్గు గనులు కేటారుుంచడంపై ఎలాంటి సవాలూ తమ ముందు లేదని బెంచ్ స్పష్టం చేసింది.  యూఎంపీపీలకు కేటారుుంచిన క్షేత్రాలను వాటి నిమిత్తమే ఉపయోగించాలని. బొగ్గును మళ్లించడం కానీ వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడం కానీ చేయరాదని ఆదే శాలిచ్చినట్టు తెలిపింది. గనుల కేటారుుంపు కోసం ఏళ్ల తరబడి కాంపిటీటివ్ బిడ్డింగ్‌ను అనుసరించకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఈ విషయంలో కోర్టు జోక్యం అవసరమైనంత నిర్హేతుకంగా ఉందని, అర్ధరహితంగా ఉందని  చెప్పజాలమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బొగ్గు క్షేత్రాలకు సంబంధించిన గణాంకాలను అటార్నీ జనరల్ ఇచ్చినప్పటికీ, వాటిని సరిచూడలేదని తీర్పు అనంతరం ధర్మాసనం మౌఖికంగా చెప్పింది. వీటిని పరిశీలించాల్సి ఉందని, తీర్పు వల్ల తలెత్తే పరిణామాలను నిర్ధారించేందుకు మరింత విచారణను సెప్టెంబర్ 1వ తేదీన చేపడతామని తెలిపింది.

 యూపీఏపై ఆరోపణలు

యూపీఏ హయూంలో కేటారుుంచిన 194 బొగ్గు బ్లాకులకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు పిటిషనర్లు అరోపించారు.సుప్రీం తన విచారణను 1993జూలై 14 నుం చి జరిగిన కేటారుుంపులకు పొడిగించింది. {Oపెవేటు కంపెనీలు, పార్టీలకు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఎంపీ రాష్ట్రాల్లో గనులు కేటారుుంచారు. కేసు విచారణకు వచ్చినప్పుడు కేంద్రం 218 క్షేత్రాల సమాచారం అందజేసింది.  2012లో పిటిషన్ దాఖలైనప్పుడు.. గనుల కేటారుుంపుల్లో రూ.1.64 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాగ్ అంచనా వేసిందన్నారు.కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును సైతం పర్యవేక్షించింది. దాఖలయ్యే కేసుల ప్రాసిక్యూషన్ కోసం ప్రత్యేక కోర్టును సైతం నెలకొల్పారు.
 
కోల్‌గేట్ ప్రస్థానం
 
 జూలై 1992:బొగ్గు బ్లాకుల కేటాయింపుల కో సం వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు. జూలై 14న సింగరేణి కాలరీస్, కోల్‌ఇండియా లిమిటెడ్‌ల ఉత్పత్తి ప్రణాళికల్లో లేని  బ్లాకుల గుర్తింపు. 1993- 2010: 1993-2005 మధ్య 70 బ్లాకులను, 2006లో 53 బ్లాకులను, 2007లో 52 సహా మొత్తం 216 బ్లాకుల కేటాయింపు. వాటిలో నుంచి 24 బ్లాకుల కేటాయింపును రద్దు చేశారు.మార్చి 2012: 2004-2009 మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రభుత్వం అసమర్ధంగా వ్యవహరించిందని, దానివల్ల కేటాయింపులు పొందిన కంపెనీలు రూ. 10.7 లక్షల కోట్లు ఆర్జించారని కాగ్ ముసాయిదా నివేదిక వెల్లడి. మే 31, 2012: సీబీఐ విచారణకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఆదేశాలు
 
జూన్ 2012: బొగ్గు బ్లాకుల కేటాయింపుపై సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, అనంతరం 80 బ్లాకుల కేటాయింపు ఉపసంహరణ,
ఆగస్ట్, 2012: పార్లమెంట్లో కాగ్ రిపోర్ట్. ఖజానాకు రూ. 1.86 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడి. మైనింగ్ ప్రారంభం కాకుండానే నష్టం జరిగిందని ఎలా చెబుతారని ప్రభుత్వ అభ్యంతరం.

సెప్టెంబర్, 2012: బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్. సీబీఐ దర్యాప్తుపై సుప్రీం పర్యవేక్షణ ప్రారంభం.

మార్చ్, 2013: దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి చెప్పొద్దంటూ సీబీఐకి సుప్రీం ఆదేశాలు.

జూన్ 11, 2013: నవీన్ జిందాల్, దాసరి నారాయణ రావులపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన సీబీఐ. అక్టోబర్‌లో కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి కేసీ పరేఖలపై ఎఫ్‌ఐఆర్ నమోదు.

జూలై, 2014: కేసుల విచారణ కోసం ప్రత్యేక సీబీఐ కోర్టును ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement