manipulated
-
అది బెదిరింపు చర్య
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌ల్లోని తమ కార్యాలయాలకు వచ్చి నోటీసులు జారీ చేయడంపై ట్విట్టర్ స్పందించింది. అది ఒకరకంగా తమను బెదిరించే చర్య అని భావిస్తున్నట్లు పేర్కొంది. తమ ఉద్యోగుల గురించి, భావ వ్యక్తీకరణకు ఎదురయ్యే ముప్పు గురించి ఆందోళన చెందుతున్నామంది. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తూ విపక్షం సర్క్యులేట్ చేసినట్లు భావిస్తున్న డాక్యుమెంట్‌ను విమర్శిస్తూ.. అధికార బీజేపీ నేతలు చేసిన ట్వీట్లకు ట్విట్టర్ ఇటీవల ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ ట్యాగ్‌ను తగిలించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ కార్యాలయాలకు వెళ్లి సంస్థ బారత విభాగం ఎండీకి నోటీసులు జారీ చేశారు. దీనిపై గురువారం ట్విట్టర్ అధికారికంగా స్పందించింది. పారదర్శకతతో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. భారత్ తమకు అత్యంత ప్రధానమైన మార్కెట్ అని, భారత్‌లో అమల్లో ఉన్న చట్టాలను గౌరవిస్తామని పేర్కొంది. అయితే, స్వేచ్చాయుత ప్రజాభిప్రాయానికి భంగం కలిగించే నిబంధనలను మార్చాలని కోరుతామని స్పష్టం చేసింది. కొత్త ఐటీ నిబంధనల్లోని కీలకమైన మౌలిక అంశాలపై, సంస్థ ఉద్యోగుల కార్యకలాపాలను అడ్డుకునే పోలీసుల బెదిరింపు చర్యలపై తమతో పాటు, భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోందని పేర్కొంది. భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతాయని ట్విట్టర్ పేర్కొంది. ప్రజాప్రయోజన పరిరక్షణ కోసం ప్రజా ప్రతినిధులు, పరిశ్రమ వర్గాలు, పౌరసమాజం కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉందని సూచించింది. అభ్యంతరకర పోస్ట్‌లకు తమ కంప్లయన్స్ ఆఫీసర్‌ను బాధ్యుడిని చేసి, క్రిమినల్ చర్యలకు అవకాశం కల్పించడాన్ని ట్విట్టర్ తప్పుబట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ, వినియోగదారుల సమాచారాన్ని గంపగుత్తగా కోరడం కూడా తమకు ఆమోదనీయం కాదని పేర్కొంది. ఇవి స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపింది. నిరాధార ఆరోపణలు పోలీసులు తమ కార్యాలయాలకు రావడం బెదిరింపు చర్య అన్న ట్విట్టర్ ఆరోపణలను కేంద్రం ఖండించింది. అవి నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. అవి భారత్ ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించింది. ట్విట్టర్ లేదా, మరే ఇతర సోషల్‌మీడియాకు చెందిన ప్రతినిధులకు కానీ భారత్ సురక్షిత దేశమని స్పష్టం చేసింది. వారి భద్రతకు, వ్యక్తిగత రక్షణకు ఎలాంటి ప్రమాదం కలగబోదని కేంద్ర ఐటీ శాఖ గురువారం తెలిపింది. చర్యలు, ఉద్దేశపూర్వక సమర్ధనలతో భారత చట్ట వ్యవస్థను తక్కువ చేయాలని ట్విట్టర్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. -
వైరల్ వీడియో.. నిజం తెలిస్తే షాకవుతారు
ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం పెరిగాక సమాచారం క్షణాల్లో తెలిసిపోతుంది. అయితే నిజమో కాదో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్లో కనిపించే ప్రతీది వాస్తవం కాదు. టెక్నాలజీ సాయంతో గోరంతను కొండంతలు చేసి.. మనల్ని వెర్ని వాళ్లని చేస్తుంటారు కొందరు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. దీనిలో సినిమాల్లో మాత్రమే కనిపించే భారీ సైజు అనకొండను ఎర వేసి పట్టుకున్నారు. ‘కోళ్ల దొంగను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ నీటి మడుగు బయట నీల రంగు డ్రమ్మును ఉంచారు. దాని ముందు కోడిని ఎరగా ఉంచారు. ఇంతలో నీటిలో నుంచి ఓ అనకొండను కోడిని మింగడానికి బయటకు వచ్చి డ్రమ్ములో దూరుతుంది. బయటకు రావడానికి మార్గం లేక గిజగిజా తన్నుకుంటుంది. ఇక వీడియోలోని అనకొండను చూస్తే భయం, ఆశ్చర్యం రెండు ఒకేసారి కలుగుతాయి. ఎందుకంటే ఇంత పెద్ద అనకొండను సినిమాల్లో తప్ప రియల్‌గా చూసి ఉండరు. 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని 24 గంటల వ్యవధిలో 1.2మిలయన్ల మంది వీక్షించారు. (జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్) ఇక ఈ వీడియో నిజమా కాదా తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ‘స్నోప్స్’ రంగంలోకి దిగింది. తన పరిశోధనలో తేలింది ఏంటంటే.. ఇది మానిప్యులేటెడ్ వీడియో. అంతేకాక ఇది రెండు సంవత్సరాల క్రితం నాటిది అని తేల్చేసింది. ఇక ఒరిజనల్ వీడియోలో కనిపించే పాము కూడా పెద్దదే కానీ మరీ అనకొండంత భార సైజుది మాత్రం కాదు. అలానే నీలం రంగు పైపుని కూడా భారీ డ్రమ్ముగా మార్చారు. I thought the snake in anaconda was an exaggeration, then i saw this video https://t.co/PmL1qJ2fzP — Tony Digs (@ToneDigz) July 20, 2019 -
స్వతంత్ర డైరెక్టర్లు.. గుడ్‌బై!!
దేశీ కార్పొరేట్ రంగంలో తాజాగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు, అవకతవకలు... బోర్డు రూమ్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. స్కామ్‌ల పాపం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో కంపెనీల నుంచి వైదొలగుతున్న ఇండిపెండెంట్ డైరెక్టర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో మొత్తం 126 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆ సంఖ్య రెట్టింపై 291కి పెరగడం తాజా పరిస్థితికి నిదర్శనం. ఈ వివరాలను ఎన్ఎస్ఈఇన్ఫోబేస్ డాట్‌కామ్ వెల్లడించింది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్(ఎన్ఎస్ఈ), ప్రైమ్ డేటాబేస్ కలసి ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. తాజా నివేదికలో స్వతంత్ర డైరెక్టర్ల విషయమై కీలకాంశాలు వెలుగుచూశాయి. సాధారణంగా ఒక కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌లో మూడో వంతు ఇండిపెండెంట్(స్వతంత్ర) డైరెక్టర్లుంటారు. కంపెనీలను వదిలిపోతున్న ఇండిపెండెంట్ డైరెక్టర్లలో సగం మంది వారి పదవీకాలం పూర్తవ్వడంతో వైదొలుగుతున్నారు. ఆరోగ్య, వ్యక్తిగత లేదా ఇతర వృత్తులు, వ్యాపకాల్లో స్థిరపడటం వంటి కారణాలతో చాలా మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 291 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. దీంట్లో 146 మంది తమ పదవీ కాలం పూర్తవ్వడంతో రాజీనామా చేయగా, మళ్లీ ఆ పదవిలో కొనసాగడం ఇష్టం లేదంటూ 36 మంది వైదొలిగారు. ఇతర వృత్తుల్లో స్థిరపడేందుకు రాజీనామా చేసిన వారి సంఖ్య 26గా ఉంది. సెబీ, కంపెనీల చట్టం ప్రకారం తగిన అర్హతలు లేకపోవడంతో 17 మంది రాజీనామా చేశా రు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, ఆసక్తి లేదంటూ రాజీనామా చేసిన వాళ్ల సంఖ్య 40. యాజమాన్యం మారడంతో ఆరుగురు రాజీనామా చేశారు. కాగా, జెట్ ఎ యిర్‌వేస్ కంపెనీలో ఇబ్బందులు తలెత్తగానే పలువు రు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నుంచి కూడా ఇండిపెండెట్ డైరెక్టర్లు వైదొలిగారు. ఇష్టపడని పదవి.. గతంలో ఇతర కంపెనీలకు ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేసిన వాళ్లు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవులు నిర్వహించినవాళ్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా రావడానికి ఇష్టపడటం లేదు. కంపెనీల్లో అవకతవకలు ఉంటాయేమోనన్న అనుమానాలతో ఈ పదవులను వారు తిరస్కరిస్తున్నారు. కంపెనీ ప్రమోటర్లు, యాజమాన్యం తీసుకునే నిర్ణయాలకు బలికావలసి వస్తుందనే భయాలతో పలువురు ఈ పదవులను నిరాకరిస్తున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా చేరితే, ఒకవేళ కంపెనీ లోటుపాట్లు వెల్లడైన పక్షంలో, అప్పటివరకూ తాము సంపాదించుకున్న పేరు, నమ్మకం అన్నీ కోల్పోవలసి వస్తుందని, న్యాయ వివాదాలు ఎదుర్కోవలసి వస్తుందని, అందుకే ఈ పదవులకు దూరంగా ఉంటున్నామని పలువురు పేర్కొన్నారు. ఇదిలాఉంటే... భారత్‌లో పలు కంపెనీలు కుటుంబాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దీంతో ఇండిపెండెంట్ డైరెక్టర్లు ప్రమోటర్ల దయ మీదనే ఆధారపడక తప్పటం లేదు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పితే.. ప్రత్యేక తీర్మానం ద్వారా వీరిని సాగనంపే అవకాశాలున్నాయి. ఒకవేళ కంపెనీ అవకతవకల విషయమై తెలిసి కూడా స్పందించకపోతే, వీరి ఆస్తులను కూడా కంపెనీల వ్యవహారాల శాఖ స్తంభింపజేసే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్ల పదవి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని విశ్లేషకులంటున్నారు. వంద శాతం పూర్తిగా నమ్మకం కుదిరితేనే ఈ పదవికి ముందుకొస్తున్నారని చెబుతున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ విధులేంటి? ► ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్...తన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కంపెనీ, వాటాదారులు ముఖ్యంగా మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం బాథ్యతాయుతంగా మెలగాలి. ► తన హోదాను స్వలాభం కోసం దుర్వినియోగం చేయకూడదు. అలాగే తన స్వలాభం కోసం కంపెనీకి నష్టం వచ్చేలా ప్రవర్తించకూడదు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సవ్యంగా సాగేలా తగిన తోడ్పాటునందించాల్సి ఉంటుంది. ► కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ► ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలాగా కంపెనీ రోజువారీ కార్యకలాపాలను ఇండిపెండెంట్ డైరెక్టర్లు చూడాల్సిన పని ఉండదు. వారికి అధికారాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. ► డైరెక్టర్ల సమావేశాలకే కాకుండా బోర్డ్ నియమించే కమిటీల్లో సభ్యుడిగా ఉంటూ, ఈ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కావలసి ఉంటుంది. కంపెనీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే వాటిని వెలుగులోకి తేవలసి ఉంటుంది. ► కంపెనీకి సంబంధించిన రహస్యాలను (టెక్నాలజీ, భవిష్యత్తు నిర్ణయాలు, ఇతర కంపెనీలతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు తదితర అంశాలను) లీక్ చేయకూడదు. ఇక ప్రత్యేక తీర్మానం ద్వారానే ఇండిపెండెంట్ డైరెక్టర్లను తొలగించే వీలుంది. ప్రశ్నించే అధికారం ఉండాలి... ప్రమోటర్లు, వాటాదారుల ఆధిపత్యం ఉన్న కంపెనీల్లో ‘నిజమైన’ ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఎవరూ ఉండరు. ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాను పునఃపరిశీలించాలి. భారత కుటుంబ వ్యాపారాల్లో మెజార్టీ వాటా ప్రమోటర్ గ్రూప్‌దే. ఇలాంటి కంపెనీల్లో డైరెక్టర్ల స్వతంత్రత చాలా కష్టసాధ్యమైన విషయం. మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ ఇండిపెండెంట్ డైరెక్టర్ల బాధ్యత అయినప్పటికీ, ప్రమోటర్ గ్రూప్ చర్యలను, నిర్ణయాలను ప్రశ్నించే అధికారం వారికి ఉండాలి. – ప్రణవ్ హల్దియా, ఎమ్డీ, ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ సత్యం స్కామ్ నుంచి... సత్యం కంప్యూటర్స్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర కీలకమైందని ప్రభుత్వం గుర్తించింది. అప్పటి వరకూ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఉత్సవ విగ్రహాలేనని చెప్పవచ్చు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 2013 నాటి కంపెనీల చట్టంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనల విషయమై పలు మార్పులు, చేర్పులు చేసింది. మరోవైపు ఇండిపెండెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉన్న రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ తరచుగా సమావేశాలు జరుపుతూ, కంపెనీ స్థితిగతులపై చర్చించాల్సి ఉంటుంది. కానీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీలో నాలుగేళ్ల కాలంలో ఇలాంటి ఒక్క సమావేశం కూడా జరగలేదంటే కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇక లిస్టైన కంపెనీల్లో మొత్తం డైరెక్టర్లలో మూడు నుంచి ఐదో వంతు వరకూ ఇండిపెండెంట్ డైరెక్టర్లుండాలి. టాప్1000 కంపెనీల్లో కనీసం ఒక మహిళ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండితీరాలి. -
చర్యలు మొదలు
ఆర్డీడీతో సహా 10మందికి చార్జిమెమోలు 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచన టైటల్ డీడ్-1180 సర్వేపై నిగ్గుతేల్చిన విజిలెన్స్ ఆర్డీడీతో సహా అందరూ బాధ్యులేనని నిర్ధారణ విశాఖపట్నం: టైటిల్ డీడ్ నెం-1180 సర్వే వ్యవహారంలో అవకతవకలు జరిగిన మాట వాస్తమేనని రెవెన్యూ విజిలెన్స్‌శాఖ నిగ్గుతేల్చింది. రికార్డులను టాంపరింగ్ చేయడంతో పాటు పిటీషనర్లకు లాభం చేకూర్చేలా సర్వేచేశారనినిర్ధారణకు వచ్చారు. ఈ అవినీతి భాగోతంపై సీసీఎల్ఎ నియమించిన కమిటీ సిఫార్సు మేరకు ఇప్పటికే సస్పెండ్కుగురైనసర్వే అండ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ (కాకినాడ ) కె.వెంకటేశ్వర రావుతో సహా 10 మందిపై ప్రభుత్వం చార్జీమెమోలు జారీ చేసింది. పదిరోజుల్లో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలకు ఉపక్రమిం చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ బుధవారం జీవో-118ను జారీ చేశారు. ఈ అవినీతి వ్యవహారానికి చెందిన కధాకమామిషు ఇలా ఉంది.గ్రేటర్ మహా విశాఖ(జీవీఎంసీ)విలీనమైన చినగదిలి మండలం అడవివరం పంచాయతీ పరిధిలోని విజయరామపురం అగ్రహారంలో 30ఎకరాల సర్వే కోసం 2006లో కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ భూమి పక్కనే మరో 94 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.ఆ సమయంలో విశాఖ ఏడీగా పనిచేసిన కె.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో సర్వే చేయించారు. రికార్డుల్లో 30 ఎకరాలను 80 ఎకరాలుగా టాంపరింగ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న 94 ఎకరాలను కలిపి 124 ఎకరాలను సర్వే చేసి ఒకే టైటిల్ డీడ్-1180కింద మార్చేశారు. ఆ తర్వాత ఈ భూములు పలువురు చేతులు కూడా మారిపోయాయి. ఏడీ వెంకటేశ్వర రావు మూడొంతుల మేర సర్వే పూర్తిచేయగా, ఆ తర్వాత వచ్చిన మరో ఏడీ డిఎల్బీఎల్ కుమార్ పూర్తి చేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న పలువురు ప్రభుత్వ పెద్దలు కూడా అప్పట్లో ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్టు విమర్శలు విన్పించాయి. 2013-14లో జేసీగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ ఈ అవకతవకలను గుర్తించి ఏడీ కుమార్‌ను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 2014 నవంబర్‌లో ఏడీ కుమార్ సమర్పించిన నివేదికపై విచారణకు ఆదేశించాలని కమిషనర్‌కు జేసీ లేఖ రాశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎల్ఎ ఒక విజిలెన్స్ కమిటీని నియమించింది. జేసీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ కమిటీలో హెడ్‌క్వార్టర్స్ డీడీ సీహెచ్వి సుబ్బారావు, విజిలెన్స్ అసిస్టెంట్ సెక్రటరీ కృష్ణభారతిలతో కూడిన కమిటీ ప్రాధమిక విచారణ అనంతరం ప్రభుత్వ భూమిని అప్పనంగా దారాదత్తంచేసినట్టుగా నిర్ధారణ కావడంతో ఆర్డీడీగా పదోన్నతిపై కాకినాడలో పనిచేస్తున్న వెంకటేశ్వరరావుపై గతేడాది డిసెంబర్లో సస్పెన్షన్ వేటు వేశారు. కాగా ఆ తర్వాత ఏడీగాపనిచేసి బదిలీపై పశ్చిమగోదావరి వెళ్లిన ఏడీ డీఎల్‌బీఎల్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కేసులో సస్పెండ్‌కు గురయ్యారు. మిగిలిన వారంతా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఈ అవినీతి భాగోతంలో భాగస్వాములైన వారందరికి చార్జిమెమోలూ జారీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్‌కు గురైన ఆర్డీడీ వెంకటేశ్వరరావు, ఏడీ డిఎల్బీఎల్ కుమార్‌లతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ పట్నం ఏడీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తు న్న కె.రాంబాబు, పోర్టుట్రస్ట్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌గా పనిచేస్తున్న వి.కొండలరావు, డిప్యుటేషన్‌పై విశాఖఅర్బన్ మండల సర్వేయర్(మాకవరపాలెం మండల సర్వేయర్) బి.సత్యనారాయణ, విశాఖ అర్బన్ సర్వేయర్ కె.సింహాచలం, ఆనందపురం మండల సర్వేయర్ ఆర్.చిరంజీవి, శ్రీకాకుళం సీడీ గ్రేడ్-1గా పనిచేస్తున్న జి.నాగేశ్వరరావులతో పాటు ఇటీవల రిటైర్ అయిన జి.రమణయ్య (విశాఖ), బి.రామారావు (శ్రీకాకుళం)లపై క్రమశిక్షణచర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వారి నుంచి ఏపీ సివిల్‌సర్వీసెస్ రూ ల్స్ 1991, రూల్-9లకనుగుణంగా భారీ ఫెనాల్టీ విధించాలని ఆదేశించింది. అయితే క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పుకునేందుకు వీరికి 10 రోజుల పాటు అవకాశమిచ్చారు. ఈలోగా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం పట్ల సంతృప్తి చెందని పక్షంలో తదుపరి చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. -
కూలీల డబ్బులు ‘నొక్కిందెవరు’?
కందుకూరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు సంబంధించిన నిధుల స్వాహాపై విచారణ మొదలైంది. ఈ పథకం కింద పనిచేసిన కూలీలకు డబ్బులు చెల్లించే క్రమంలో భారీగా అవకతవకలు జరిగాయి. దాదాపు 11వేల మంది కూలీలకు చెల్లించాల్సిన రూ.2కోట్లు డ్వామా అధికారులు యాక్సిస్ బ్యాంకుకు విడుదల చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం కూలీలకు పంపిణీ చేయలేదు. దీంతో ఆగ్రహించిన కూలీలు పలుమార్లు డ్వామా అధికారులను నిలదీయడం, మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. దీనికి స్పందించిన అధికారులు అవకతవకలపై విచారణ జరిపారు. డబ్బుల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు ఉపక్రమించారు. ఇలా దారితప్పాయి.. 2012-13 ఆర్థిక సంవత్సరం చివ రలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి కూలీ డబ్బులను గ్రామీణాభివృద్ధి శాఖ నేరుగా యాక్సిస్ బ్యాంకుకు విడుదల చేసింది. ఈ నిధులను అప్పటి సర్వీస్ ప్రొవైడర్ ఫినో సంస్థకు విడుదల చేయగా.. అందులో దాదాపు 11వేల మంది కూలీలకు ఇవ్వాల్సిన రూ.2కోట్లు అట్టిపెట్టుకున్నాయి. ఆ నిధులు గతేడాది జూన్ నాటికి కూడా కూలీలకు చెల్లించలేదు. అదేవిధంగా చెల్లింపుల ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తున్నం దున సర్వీస్ ప్రొవైడర్ ఫినో సంస్థను బాధ్యతల నుంచి తొలగిస్తూ కొత్తగా మణిపాల్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. దీంతో కూలీలకు చెల్లించాల్సిన నిధుల్లో అవకతవకలు బయటపడ్డాయి. అయితే కూలీలకు ఇవ్వని నిధులు ఏమయ్యాయనే కోణంలో అధికారులు ఆరాతీశారు. దీంతో నిధులు దారితప్పినట్లు గుర్తించిన డ్వామా అధికారులు పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. ఈనేపథ్యంలో కూలీడబ్బులు అందక జిల్లావ్యాప్తంగా 11వేల మంది ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. విచారణ షురూ.. డ్వామా అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీ సులు దర్యాప్తునకు ఉపక్రమించారు. ఈ క్రమంలో శుక్రవారం సీసీఎస్ ఏసీపీ జోగయ్య బృందం కందుకూరు, యా చారం మండలాల్లోని వివిధ గ్రామాల్లో పర్యటించింది. అనంతరం ఉపాధిహామీ కార్యాలయాల్లో సైతం విచారణ జరిపింది. కూలీలతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంది. ఈ సందర్భంగా ఏసీపీ జోగయ్య మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు అందాల్సిన సొమ్ము పంపిణీ చేయకుండా యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది దారిమళ్లించినట్లు పేర్కొన్నారు. నిరుపేదలకు చెందాల్సిన డబ్బు స్వాహా చేయడంలో యాక్సిస్ బ్యాంక్ అధికారి సంగీత, సీనియర్ మేనేజర్ పీయూష్ హస్తం ఉందన్నారు. వారిద్దరితోపాటు ఫినో సంస్థకు చెందిన బిష్వజిత్సిన్హా, మణిపాల్ సంస్థకు చెందిన అనుపమ్గుప్తాపై ఐపీసీ 403, 405, 420 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అన్ని మండలాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
సీఎం సిద్ధుకు హైకోర్టు నోటీసులు
బెంగళూరు: కనకపుర యోజన ప్రాధికార సభ్యుల నియామకంలో అవకతవకలు జరిగాయన్న విషయానికి సంబంధించి హైకోర్టు ము ఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నోటీసులు జారీచేసింది. సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్, సీబీఐకి శుక్రవా రం నోటీసులు జారీచేసింది. వివరాలు... తా ను సూచించిన వారిని కనకపుర యోజన ప్రాధికారలో సభ్యులుగా నియమించాలని ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. దాని ప్రకారమే సిద్ధరామయ్య నియామకాలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన దాఖలాలను ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ సంపాదిం చారు. వాటిని మొదట సీబీఐ అధికారులు ముందు ఉంచి.. కేసు నమోదు చేయాలని కోరారు. అందుకు వారు నిరాకరించడంతో ఆయన దీనిపై హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు మంత్రి డీకే శివకుమార్, సీబీ ఐ సంస్థలను రవికుమార్ ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. -
‘ఉపాధి’ అక్రమాలపై కొరడా
ఖమ్మం మయూరిసెంటర్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఓపెన్‌ఫోరం, సోషల్ ఆడిట్లో బయటపడిన అవకతవకలు, అక్రమాలపై ఈనెల 22 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ు మండలాల వారీగా వ్యక్తిగత విచారణ చేపడుతున్నట్లు డ్వామా అధికారులు తెలిపారు. 22న అశ్వాపురం, చర్ల, కుక్కునూరు, వాజేడు, 24న భద్రాచలం, ఏన్కూర్, కొణిజర్ల, వైరా, 27న గార్ల, కూనవరం, ములకలపల్లి, 29న కల్లూరు, మధిర, డిసెంబర్ ఒకటిన మణుగూరు, పాల్వంచ మండలాల్లో విచారణ చేపడుతున్నట్లు వివరించారు. అశ్వాపురం మండలంలో ఏడో విడత ఉపాధి పనుల్లో రూ.25,187 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 11 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, చర్ల మండలంలోని ఆరో విడత పనుల్లో రూ. లక్ష 80 వేల 984 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 14 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కుక్కునూరు మండలంలో ఏడో విడత పనుల్లో రూ.45, 692 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 18 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వాజేడు మండలంలో ఐదో విడతలో రూ.41,990 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, భద్రాచలం మండలంలో ఏడో విడతలో రూ.45, 408 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 24 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏన్కూర్ మండలంలో ఏడో విడతలో రూ. 7,399 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కొణిజర్ల మండలంలోని ఏడో విడత రూ.7, 948 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 9 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వైరా మండలంలోని ఏడో విడతలో రూ. 39, 288 మేర అభియోగాలపై ఏపీఓ, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, గార్ల మండలంలోని ఆరో విడతలో రూ. 3,09,811 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కూనవరం మండలంలోని ఆరో విడతలో రూ. 81,131 మేరకు అక్రమాలపై ఏపీఓ, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ములకలపల్లి మండలంలో ఏడో విడతలో రూ. 38, 009 మేర అ క్రమాలపై ఏపీఓ, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, 10 మం ది ఫీల్డ్ అసిస్టెంట్లు, కల్లూరు మండలంలో ఏడో విడతలో రూ. 7, 382 మేర అక్రమాలపై ఏపీఓ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, మధిర మండలం ఏడో విడతలో రూ. 29,984 మే అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 23 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, మణుగూరు మండలంలో ఏడో విడతలో రూ. 19, 460 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, పాల్వంచలో ఐదో విడతలో రూ. 25, 458 మేర అక్రమాలపై ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏడో విడతలో రూ. 42, 951 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి వ్యక్తి గత విచారణ నిర్వహించనున్నట్లు డ్వామా అధికారులు తెలిపారు. -
పంటల బీమా అవకతవకలపై ముగిసిన విచారణ
సిద్దిపేట రూరల్ : రైతులు పంటల బీమా కోసం చెల్లించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు స్వాహా చేసినట్లు తేలింది. దీంతో సిద్దిపేట మండలం తోర్నాల గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న పంటలబీమా అవకతవకల విచారణ బుధవారం తెరపడింది. రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద రైతుల సమక్షంలో విచారణ జరుపగా, గ్రామంలో 232 మంది రైతులు 43 హెక్టార్లకు చెల్లించిన బీమా డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. ఆదర్శ రైతులు పంటల బీమా పేరుతో చిన్న, సన్నకారు రైతుల నుంచి వసూలు చేసిన రూ.22,490, పెద్ద రైతుల నుంచి వసూలు చేసిన రూ. 3,200 వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ సందర్భంగా ఏఈఓ హన్మంతారెడ్డి మాట్లాడుతూ, పంటల బీమా డబ్బుల అవకతవకలపై నాలుగు రోజులుగా విచారణ చేయగా, ఆదర్శరైతుల బండారం బయట పడిందన్నారు. గ్రామంలో 373 మంది రైతులు మొక్కజొన్న పంటకు బీమా చేయించుకోగా, ఆదర్శ రైతులు చిన్న, సన్నకారు రైతుల నుంచి రూ. 237, పెద్ద రైతుల నుంచి రూ. 263 చొప్పున వసూలు చేశారు. అయితే పంటల బీమా కోసం రైతులు చెల్లించిన డబ్బులను డీడీ తీయాల్సిన ఆదర్శరైతులు అవకతవకలకు పాల్పడ్డారు. రైతుల పొలం విస్తీర్ణాన్ని తక్కువగా చూసి బీమా డబ్బు చెల్లించారని ఏఈఓ తెలిపారు. ఈ అవకతవకలన్నీ బయటపడడంతో ఆదర్శ రైతులు తమ తప్పులు ఒప్పుకుని స్వాహా చేసిన సొమ్ము తిరిగి చెల్లిస్తామని ఒప్పుకున్నట్లు ఏఈఓ పేర్కొన్నారు. అంతకుముందు గ్రామ పంచాయతీ వద్ద జరిగిన విచారణలో సందర్భంగా గ్రామానికి చెందిన శీలం బాబు అనే వ్యక్తి గ్రామ ఎంపీటీసీ యొదుల్ల నర్సింలును బహిరంగంగా దూషించారని, దీంతోఎంపీటీసీ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరమేశ్వర్‌గౌడ్ ఉన్నారు. -
కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమే
కోల్గేట్పై సుప్రీంకోర్టు తీర్పు 218 గనులు, రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల భవితవ్యం ప్రశ్నార్ధకం 1993-2010 లలో చేసిన కేటారుుంపులన్నీ నిర్హేతుకమన్న ధర్మాసనం {స్కీనింగ్ కమిటీ ఆలోచన లేకుండా వ్యవహరించిందని వ్యాఖ్య {పజా ప్రయోజనాలు భారీగా దెబ్బతిన్నాయని స్పష్టీకరణ బొగ్గును నల్ల వజ్రమనడంలో అతిశయోక్తి లేదని వెల్లడి న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటారుుంపులను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వేలం విధానం ప్రవేశపెట్టక మునుపు, 1993 నుంచి 2010 మధ్యకాలంలో పలు ప్రభుత్వాల హ యూంలో చేసిన బొగ్గు గనుల కేటారుుంపులన్నీ చట్టవిరుద్ధం, నిర్హేతుకమని సోమవారం తీర్పు చెప్పింది. తాత్కాలికమైన, ఆషామాషీ పద్దతుల్లో, ఏమాత్రం ఆలోచన చేయకుండా గనులు కేటారుుంచారని అభిప్రాయపడింది. 1993 మొదలు 36 స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు అవలంభించిన విధానాలను ఖండించేందుకు చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం దాదాపు అన్ని పదాలను ఉపయోగించింది. అరుుతే ఈ కేటారుుంపుల్ని రద్దు మాత్రం చేయని న్యాయమూర్తులు మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్‌లతో కూడిన బెంచ్.. కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్పన్నమయ్యే పరిణామాలేమిటన్న అంశమే తమ ముందు మిగిలి ఉందని పేర్కొంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో 218 బొగ్గు బ్లాకులు, వాటి ఆధారంగా పెట్టిన సుమారు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తం 218 బొగ్గు బ్లాకుల కేటారుుంపులను పరిశీలించిన ధర్మాసనం 163 పేజీల తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 1న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ, కామన్ కాజ్ అనే ప్రభుత్వేతర సంస్థ 2012లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రీం సుదీర్ఘంగా విచారించింది. ధర్మాసనం ఇంకా ఏమన్నదంటే.. ఇటు స్క్రీనింగ్ కమిటీ మార్గాన, అటు ప్రభుత్వ పంపిణీ మార్గంలో.. రెండు పద్దతుల్లోనూ నిర్హేతుకంగా, చట్టవిరుద్ధంగా కేటారుుంపులు జరిగారుు.1993 జూలై 14 మొదలు 36 సమావేశాలలో స్క్రీనింగ్ కమిటీ సిఫారసుల మేరకు యూవత్ కేటారుుంపులు చట్టవిరుద్ధంగా జరిగింది.{స్కీనింగ్ కమిటీ స్థిరంగా వ్యవహరించలేదు. మార్గదర్శకాలను తక్కువగా పాటించారు. పారదర్శకత లేదు. విజ్ఞతఉపయోగించలేదు.వాణిజ్య ప్రయోజనాల కోసం బొగ్గు తవ్వకాలు జరిపే అర్హత ఏ రాష్ట్రానికీ లేదా దాని పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థకు లేదు. వీటివల్ల జాతి సంపద, పరిశ్రమల ప్రభువ రుున బొగ్గుఅన్యాయంగా పంపిణీ అరుుంది. బొగ్గును నల్ల వజ్రంగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. చాలా దేశాలలో బొగ్గు ఆధారంగానే పారిశ్రామిక ప్రగతి చోటు చేసుకుంది.మన దేశంలో ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే బొగ్గు గని కేటారుుంపు కంపెనీలపై ఉదారతకు సంబంధించిన వ్యవహారమయింది.పరిపాలన మార్గం ద్వారా కేటారుుంపు జరిపేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానం ఇప్పటికే ఉన్న చట్టానికి అనుగుణంగా లేదు. యూఎంపీపీలు బొగ్గును మళ్లించకూడదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల (యూఎంపీపీలు) నుంచి బొగ్గును వేరే అవసరాలకు మళ్లించేందుకు కొన్ని కేసుల్లో ప్రభుత్వం అనుమతించడాన్ని నిరోధించాలన్న ఎన్జీవో వాదనను సుప్రీం అంగీకరించింది. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులకు (యూఎంపీపీలు) తక్కువ ధరకు బొగ్గు గనులు కేటారుుంచడంపై ఎలాంటి సవాలూ తమ ముందు లేదని బెంచ్ స్పష్టం చేసింది. యూఎంపీపీలకు కేటారుుంచిన క్షేత్రాలను వాటి నిమిత్తమే ఉపయోగించాలని. బొగ్గును మళ్లించడం కానీ వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడం కానీ చేయరాదని ఆదే శాలిచ్చినట్టు తెలిపింది. గనుల కేటారుుంపు కోసం ఏళ్ల తరబడి కాంపిటీటివ్ బిడ్డింగ్‌ను అనుసరించకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఈ విషయంలో కోర్టు జోక్యం అవసరమైనంత నిర్హేతుకంగా ఉందని, అర్ధరహితంగా ఉందని చెప్పజాలమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బొగ్గు క్షేత్రాలకు సంబంధించిన గణాంకాలను అటార్నీ జనరల్ ఇచ్చినప్పటికీ, వాటిని సరిచూడలేదని తీర్పు అనంతరం ధర్మాసనం మౌఖికంగా చెప్పింది. వీటిని పరిశీలించాల్సి ఉందని, తీర్పు వల్ల తలెత్తే పరిణామాలను నిర్ధారించేందుకు మరింత విచారణను సెప్టెంబర్ 1వ తేదీన చేపడతామని తెలిపింది. యూపీఏపై ఆరోపణలు యూపీఏ హయూంలో కేటారుుంచిన 194 బొగ్గు బ్లాకులకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు పిటిషనర్లు అరోపించారు.సుప్రీం తన విచారణను 1993జూలై 14 నుం చి జరిగిన కేటారుుంపులకు పొడిగించింది. {Oపెవేటు కంపెనీలు, పార్టీలకు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఎంపీ రాష్ట్రాల్లో గనులు కేటారుుంచారు. కేసు విచారణకు వచ్చినప్పుడు కేంద్రం 218 క్షేత్రాల సమాచారం అందజేసింది. 2012లో పిటిషన్ దాఖలైనప్పుడు.. గనుల కేటారుుంపుల్లో రూ.1.64 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాగ్ అంచనా వేసిందన్నారు.కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును సైతం పర్యవేక్షించింది. దాఖలయ్యే కేసుల ప్రాసిక్యూషన్ కోసం ప్రత్యేక కోర్టును సైతం నెలకొల్పారు. కోల్గేట్ ప్రస్థానం జూలై 1992:బొగ్గు బ్లాకుల కేటాయింపుల కో సం వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు. జూలై 14న సింగరేణి కాలరీస్, కోల్ఇండియా లిమిటెడ్‌ల ఉత్పత్తి ప్రణాళికల్లో లేని బ్లాకుల గుర్తింపు. 1993- 2010: 1993-2005 మధ్య 70 బ్లాకులను, 2006లో 53 బ్లాకులను, 2007లో 52 సహా మొత్తం 216 బ్లాకుల కేటాయింపు. వాటిలో నుంచి 24 బ్లాకుల కేటాయింపును రద్దు చేశారు.మార్చి 2012: 2004-2009 మధ్య బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రభుత్వం అసమర్ధంగా వ్యవహరించిందని, దానివల్ల కేటాయింపులు పొందిన కంపెనీలు రూ. 10.7 లక్షల కోట్లు ఆర్జించారని కాగ్ ముసాయిదా నివేదిక వెల్లడి. మే 31, 2012: సీబీఐ విచారణకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఆదేశాలు జూన్ 2012: బొగ్గు బ్లాకుల కేటాయింపుపై సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, అనంతరం 80 బ్లాకుల కేటాయింపు ఉపసంహరణ, ఆగస్ట్, 2012: పార్లమెంట్లో కాగ్ రిపోర్ట్. ఖజానాకు రూ. 1.86 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడి. మైనింగ్ ప్రారంభం కాకుండానే నష్టం జరిగిందని ఎలా చెబుతారని ప్రభుత్వ అభ్యంతరం. సెప్టెంబర్, 2012: బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్. సీబీఐ దర్యాప్తుపై సుప్రీం పర్యవేక్షణ ప్రారంభం. మార్చ్, 2013: దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి చెప్పొద్దంటూ సీబీఐకి సుప్రీం ఆదేశాలు. జూన్ 11, 2013: నవీన్ జిందాల్, దాసరి నారాయణ రావులపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన సీబీఐ. అక్టోబర్‌లో కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి కేసీ పరేఖలపై ఎఫ్ఐఆర్ నమోదు. జూలై, 2014: కేసుల విచారణ కోసం ప్రత్యేక సీబీఐ కోర్టును ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. -
ఇప్పుడేమంటారు?!
రెండేళ్లక్రితం వెల్లడై జాతి మొత్తాన్ని దిగ్భ్రమపరిచిన బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో ఆద్యంతమూ అవకతవకలు చోటుచేసుకు న్నాయని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది. రెం డేళ్లక్రితం ఆనాటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) 195 బొగ్గు క్షేత్రాల కేటాయింపులో లక్షా 86 వేల కోట్ల స్కాం జరిగిందని వెల్లడించి నప్పుడు యూపీఏ పెద్దలు ఇంతెత్తున లేచారు. ఆయన కావాలని సంచలనం కోసం పెద్ద పెద్ద అంకెలను చూపుతున్నారని కపిల్ సిబల్ వంటి నేతలు దుయ్యబట్టారు. దేశంలో నీరసించివున్న మౌలిక సదుపా యాల రంగాన్ని పట్టాలెక్కించి...అటు ఉత్పాదకతనూ, ఇటు ఉపాధిని పెంచే ఉద్దేశంతో తీసుకున్న కీలక నిర్ణయాలను అనవసరంగా తప్పుబ డుతున్నారని ఆరోపించారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో తాము అంతక్రితంనాటి ఎన్డీయే సర్కారు విధానాన్నే అనుసరించాం తప్ప కొత్తదేమీ సృష్టించలేదని దబాయించారు. కానీ ఎవరు చేసినా తప్పు తప్పే. ఈ కేటాయింపులు రెండు విధాలుగా జరిగాయి. తొలుత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుతో కేటాయిస్తే, ఆ తర్వాత కేంద్రం లోని వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ ద్వారా కొనసాగాయి. ఈ రెండు విధానాల్లోనూ పారదర్శకత లోపించడమేగాక, అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని....కనుక ఎన్డీయే, యూపీఏ పాలకులు పంచిపెట్టిన 218 బొగ్గు క్షేత్రాలూ చట్టవిరుద్ధమైనవేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. సహజ వనరుల వినియోగం విషయంలో ప్రభుత్వాలు వ్యవహరి స్తున్న తీరులో చట్టవిరుద్ధత ఉంటున్నదని, అవి ఎలాంటి మార్గదర్శకా లనూ అనుసరించడంలేదని పర్యావరణవేత్తలనుంచి, స్వచ్ఛంద సంస్థ లనుంచి చాన్నాళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వప్రయోజనా లంటూ లేకపోతే పాలకులు వీటిని పట్టించుకునేవారు. తమ విధానా లను సమీక్షించుకుని సరిదిద్దుకునేవారు. దేశంలో మౌలిక సదుపా యాల రంగం బలహీనంగా ఉందన్నది నిజమే. ముఖ్యంగా సిమెంటు, విద్యుత్తు, ఉక్కు పరిశ్రమలకు అవసరమైన బొగ్గును కోల్ ఇండియా అందించలేకపో తున్నదని, విదేశాలనుంచి దిగుమతి చేసు కుంటే ఆయా పరిశ్రమలకు తడిసిమోపెడవుతున్నదని ఆ రంగంలోని వారు మొరపెట్టుకున్నారు. మౌలిక సదుపాయాల రంగం పటిష్టం కావాలంటే ఈ పరిశ్రమలకు బొగ్గు క్షేత్రాలు కేటాయించడం ఉత్తమ మన్న నిర్ణయానికి పాలకులు వచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకూ, సంస్థలకూ కేటాయించి నప్పుడు అత్యంత జాగురూకతతో వ్యవహరించాలన్న సంగతిని వారు విస్మరించారు. బొగ్గు క్షేత్రాలను స్వీయావసరాల కోసం వినియోగించు కోవాలి తప్ప బయటివారికి అమ్మరాదన్న షరతు పెట్టడం మినహా ఇతర నియమాలేవీ పాటించలేదు. వచ్చిన దరఖాస్తుల్లో వేటిని ఎందుకు అనుమతిస్తున్నారో, ఎందుకు నిరాకరిస్తున్నారో స్క్రీనింగ్ కమిటీ సభ్యులే చెప్పలేని స్థితి నెలకొన్నది. బొగ్గు క్షేత్రం కావాలని కోరిన సంస్థకు అందుకు అవసరమైన అర్హతలున్నాయో లేదో చూసే నాథుడు లేడు. నిజానికి యూపీఏ అధికారానికొచ్చిన కొత్తలో ఈ కేటాయింపులకు అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని తలపోసింది. నిజాయితీ అధికారిగా పేరొందిన పీసీ పరేఖ్ అందుకోసం ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. దేశంలో బొగ్గు క్షేత్రాలు తగినంతగా లేనపుడూ...వాటి కోసం విపరీతమైన పోటీ ఉన్నప్పుడూ సొమ్ముకు ఆశపడి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుందని, కనీసం అలా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తే అవకాశం ఉన్నదని పరేఖ్ గుర్తిం చారు. అందుకోసం పారదర్శకంగా ఉండేలా పోటీ వేలం విధానం అనుసరిస్తే బాగుంటుందని సూచించారు. ఇదంతా 2004నాటి మాట. స్క్రీనింగ్ కమిటీ విధానాన్ని రద్దు చేయాలని ఆనాటి ప్రధాని మన్మోహ న్సింగ్ కూడా భావించారు. అందుకోసం వెనువెంటనే ఆర్డినెన్స్ తీసుకురావడం మంచిదా... లేక సవివరమైన బిల్లు రూపొందించి చట్టం చేస్తే మంచిదా అన్న విచికిత్స కూడా జరిగింది. ఏమైందో ఏమో... ఈలోగా పాత విధానమే అమలవుతూ వచ్చి చివరకు అదే ఖరారైపోయింది! బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై ఆరోపణలొచ్చిన కాలంలో నాలుగేళ్లపాటు ప్రధాని మన్మోహన్సింగే బొగ్గు శాఖను స్వయంగా పర్యవేక్షించారు. మంచిగా ఉండటం, మౌనంగా మిగలడం సుగుణం కావచ్చేమోగానీ తాను స్వయంగా పర్యవేక్షిస్తున్న శాఖలో భారీయెత్తున అవకతవకలు సాగుతున్నాయని తెలిసినప్పుడైనా సరిచే ద్దామని చూడకపోవడం మన్మోహన్ తప్పిదం. పైగా ఈ కుంభ కోణాన్ని కాగ్ బయటపెట్టినప్పుడు అంతా సవ్యంగానే ఉందంటూ సమర్ధించబోవడం మరింత దారుణం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యక్తిగతంగా మన్మోహన్పై కూడా అభిశంసనే. ఇంతకూ బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నీ రద్దవుతాయా? కేటాయింపుల ప్రక్రియ పరమ అవకతవకలతో నడిచిందని ధర్మాసనం చెప్పినా బొగ్గు క్షేత్రాలనూ ఆయా సంస్థలనుంచి వెనక్కి తీసుకోవాలా లేదా అన్న విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. కేటాయింపు వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండటంతో బొగ్గు క్షేత్రాల్లో పనులు గత రెండేళ్లుగా నిలిచిపోయాయి. పర్యవసానంగా పరిశ్రమలకు అవసరమైన విద్యుదుత్పాదన సాధ్యంకాలేదు. కనుక ఉత్పాదన, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. బొగ్గు క్షేత్రాల్లో పెట్టుబడులకు రుణాలిచ్చిన బ్యాంకులు సైతం బేలగా మారాయి. ఇన్నివిధాల దేశాన్ని భారీగా నష్టపరిచిన నేతలపై చర్య తీసుకోవడంతోపాటు భవిష్యత్తులో ఈ తరహా స్కాంలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించవలసిన అవసరం ఉన్నది. -
జీహెచ్ఎంసీకి ‘ఆడిట్’ అక్షింతలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అంటేనే అక్రమాలకు నెలవనే ప్రచారం ఉంది. దానికి మరింత బలాన్నిస్తూ.. 2010-11 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీలోని ఆయా విభాగాల్లో పలు అవకతవకలు జరిగినట్లు ఆడిట్ విభాగం పేర్కొంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంది. ఆడిట్ విభాగం తప్పుబట్టిన అంశాలివే.. గోషామహల్లో అనుమతి పొందిన లేఔట్, అవసరమైన ఎల్ఆర్ఎస్ లేకున్నా బీపీఎస్ ద్వారా కొన్ని భవనాల్ని క్రమబద్ధీకరించారు. తద్వారా జీహెచ్ఎంసీకి ఫీజుల రూపేణా రూ. 12,95,092 నష్టం వాటిల్లింది మల్కాజిగిరి సర్కిల్లో బీపీఎస్/ఎల్ఆర్ఎస్ ఫైళ్ల క్లియరెన్స్ కోసమని అదనపు సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్నారు. దాని కాంట్రాక్టును ఎస్వీఎస్ఎస్ అనే ఏజెన్సీకి అప్పగించి, రూ.4,59,100 చెల్లించారు. బీపీఎస్/ఎల్ఆర్ఎస్ ఫైళ్లలో ఎన్ని ఫైళ్లు సర్కిల్‌కు అందాయో, ఎన్ని పెండింగ్‌లో పడ్డాయో వివరాల్లేవు. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి ఇతర వివరాలూ లేవు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ రిజర్వాయర్ నుంచి 10 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను ఆర్నెళ్లపాటు కాంట్రాక్టరు బి.శ్రీనివాసరావుకు అప్పగించారు. ట్రిప్పుకు రూ. 116 చొప్పున చెల్లించారు. కానీ, ఏయే ప్రాంతాలకు నీళ్లు సరఫరా చేశారు?, నీటి కొరత ఉన్న ప్రాంతాలకే సరఫరా చేశారా? తదితర వివరాలేవీ లేవు. రూ.22,36,857 మేరకు చెల్లింపులపై అనుమానాలున్నాయి ఆస్తిపన్ను, వివిధ ఫీజులు, ట్యాక్సుల కింద జీహెచ్ఎంసీ స్వీకరించిన చెక్కుల్లో కొన్ని బౌన్స్ అయ్యాయి. మరికొన్ని చెక్కుల మొత్తం ఖజానాకు చేరలేదు. తద్వారా జీహెచ్ ఎంసీకి రూ. 28,55,133 నష్టం వాటిల్లింది. కాప్రా, అబిడ్స్ సర్కిళ్లలో ఈ తతంగం జరిగింది ఆబిడ్స్ సర్కిల్లో పావలావడ్డీ పథకం కింద రూ. 51,15, 538 మేర జీహెచ్ఎంసీ సాధారణ నిధులను వ్యయం చేయడం ఆక్షేపణీయం.