ఖమ్మం మయూరిసెంటర్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఓపెన్‌ఫోరం, సోషల్ ఆడిట్‌లో బయటపడిన అవకతవకలు, అక్రమాలపై ఈనెల 22 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ు మండలాల వారీగా వ్యక్తిగత విచారణ చేపడుతున్నట్లు డ్వామా అధికారులు తెలిపారు. 22న అశ్వాపురం, చర్ల, కుక్కునూరు, వాజేడు, 24న భద్రాచలం, ఏన్కూర్, కొణిజర్ల, వైరా, 27న గార్ల, కూనవరం, ములకలపల్లి, 29న కల్లూరు, మధిర, డిసెంబర్ ఒకటిన మణుగూరు, పాల్వంచ మండలాల్లో విచారణ చేపడుతున్నట్లు వివరించారు.
అశ్వాపురం మండలంలో ఏడో విడత ఉపాధి పనుల్లో రూ.25,187 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 11 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, చర్ల మండలంలోని ఆరో విడత పనుల్లో రూ. లక్ష 80 వేల 984 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 14 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కుక్కునూరు మండలంలో ఏడో విడత పనుల్లో రూ.45, 692 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 18 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వాజేడు మండలంలో ఐదో విడతలో రూ.41,990 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, భద్రాచలం మండలంలో ఏడో విడతలో రూ.45, 408 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 24 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏన్కూర్ మండలంలో ఏడో విడతలో రూ. 7,399 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కొణిజర్ల మండలంలోని ఏడో విడత రూ.7, 948 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 9 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వైరా మండలంలోని ఏడో విడతలో రూ. 39, 288 మేర అభియోగాలపై ఏపీఓ, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, గార్ల మండలంలోని ఆరో విడతలో రూ. 3,09,811 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కూనవరం మండలంలోని ఆరో విడతలో రూ. 81,131 మేరకు అక్రమాలపై ఏపీఓ, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ములకలపల్లి మండలంలో ఏడో విడతలో రూ. 38, 009 మేర అ క్రమాలపై ఏపీఓ, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, 10 మం ది ఫీల్డ్ అసిస్టెంట్లు, కల్లూరు మండలంలో ఏడో విడతలో రూ. 7, 382 మేర అక్రమాలపై ఏపీఓ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, మధిర మండలం ఏడో విడతలో రూ. 29,984 మే అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 23 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, మణుగూరు మండలంలో ఏడో విడతలో రూ. 19, 460 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, పాల్వంచలో ఐదో విడతలో రూ. 25, 458 మేర అక్రమాలపై ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏడో విడతలో రూ. 42, 951 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి వ్యక్తి గత విచారణ నిర్వహించనున్నట్లు డ్వామా అధికారులు తెలిపారు.
‘ఉపాధి’ అక్రమాలపై కొరడా
Published Fri, Nov 21 2014 3:19 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM
Advertisement
Advertisement