ఖమ్మం మయూరిసెంటర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పథకం 5, 7 విడత సోషల్ అడిట్‌లో బయటపడిన అక్రమాలపై జిల్లా విజిలెన్స్ అధికారిని బానుశ్రీ సోమవారం డ్వామా కార్యాలయంలో వ్యక్తి గత విచారణ నిర్వహించారు. జిల్లాలోని నేలకొండపల్లి, దుమ్ముగూడెం, రఘునాథపాలెం మండలాల్లో 5,7 విడత సోషల్ అడిట్, ఓపెన్ ఫోరంలో బ యటపడిన అక్రమాలపై విచారణ చేపట్టారు.
నేలకొండపల్లిలో ఇటీవల జరిగిన 7వ విడత ఓపెన్‌ఫోరంలో 30మంది సిబ్బందిపై రూ. 61,259 స్వాహా చేసినట్లు అభియోగాలు వ చ్చాయి. అందులో ఏపీఓ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు, 22 మంది ఫీల్డ్‌అసిస్టెంట్లను వ్యక్తిగతంగా విచారించారు. దుమ్ముగూడం మండలంలోని ఐదో విడత జరిగిన ఓపెన్ ఫోరంలో 31 మంది సి బ్బందిపై రూ.94,576 నిధుల స్వాహాపై అభియోగాలు వచ్చాయి.
అందులో ఏపీఓ, ఈసీ, ఆ రుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, నలుగురు కం ప్యూటర్ ఆపరేటర్లు, 19మంది ఫీల్డ్‌అసిస్టెంట్ల ను విచారించారు. రఘునాథపాలెం మండలం లో ఏడో విడత ఓపెన్ ఫోరంలో 23 మంది సి బ్బందిపై రూ. 69,420 అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయి. అందులో ఇద్ద రు ఏపీఓలు, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెం ట్లు, కంప్యూటర్ ఆపరేటర్, 15 మంది ఫీల్డ్‌అసిస్టెంట్లులపై అభీయోగాలు రావడంతో వ్యక్తి గత విచారణ నిర్వహించారు. అసిస్టెంల్ విజిలెన్స్ అధికారి ఉపేంద్ర స్వామి పాల్గొన్నారు.
‘ఉపాధి’ అక్రమాలపై విచారణ
Published Tue, Nov 11 2014 3:19 AM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM
Advertisement