బెంగళూరు: కనకపుర యోజన ప్రాధికార సభ్యుల నియామకంలో అవకతవకలు జరిగాయన్న విషయానికి సంబంధించి హైకోర్టు ము ఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నోటీసులు జారీచేసింది. సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్, సీబీఐకి శుక్రవా రం నోటీసులు జారీచేసింది. వివరాలు... తా ను సూచించిన వారిని కనకపుర యోజన ప్రాధికారలో సభ్యులుగా నియమించాలని ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. దాని ప్రకారమే సిద్ధరామయ్య నియామకాలు చేపట్టారు.
ఇందుకు సంబంధించిన దాఖలాలను ఆర్‌టీఐ కార్యకర్త రవికుమార్ సంపాదిం చారు. వాటిని మొదట సీబీఐ అధికారులు ముందు ఉంచి.. కేసు నమోదు చేయాలని కోరారు. అందుకు వారు నిరాకరించడంతో ఆయన దీనిపై హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు మంత్రి డీకే శివకుమార్, సీబీ ఐ సంస్థలను రవికుమార్ ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
సీఎం సిద్ధుకు హైకోర్టు నోటీసులు
Published Sat, Dec 20 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement