chief minister siddaramaiah
-
కన్నడనాట స్థానిక రగడ!
సాక్షి బెంగళూరు: కర్నాటకలో మరోసారి స్థానిక, స్థానికేతర రగడ రాజుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థలన్నింట్లోనూ కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పంచాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రైవేట్ రంగంలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్మెంట్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ఉద్యోగ బిల్లు–2024కు కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ 25 వేల దాకా జరిమానా కూడా విధిస్తారు. అంతేగాక గ్రూప్ సి, డి తరహా చిరుద్యోగాల్లో ప్రైవేట్ కంపెనీలు విధిగా నూటికి నూరు శాతం స్థానికులనే తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు చట్టం చేసేందుకు వీలుగా ఒకట్రెండు రోజుల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఐటీ తదితర పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రస్తుతానికి దీనిపై వెనకడుగు వేసింది. బిల్లును పక్కన పెడుతున్నామని, మరింత అధ్యయనం చేస్తామని సీఎం కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇదీ నేపథ్యం... కర్నాటకవ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాల్లో ఉత్తరాది వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయంటూ కొన్నాళ్లుగా కర్నాటకలో ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానిక వనరులు, మౌలిక వసతులు ఉపయోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు అందుకు తగ్గట్టుగా స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉద్యోగాల బిల్లుకు రూపకల్పన చేసింది. 100 % స్థానికులకేనంటూ సిద్ధు పోస్టుబిల్లుకు మంత్రివర్గ ఆమోదం అనంతరం మంగళవారం సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో పెట్టిన పోస్టు వివాదానికి దారితీసింది. ‘‘మాది కన్నడ ప్రభుత్వం. కన్నడిగుల భద్రత, సంక్షేమానికి పాటుపడటమే మా బాధ్యత. కానీ కన్నడిగులు కన్నడనాడులోనే ఉద్యోగాలు పొందడంలో వెనకబడుతున్నారు. దీన్ని నివారించేందుకు ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. ఇకపై రాష్ట్రంలో అన్ని ప్రైవేటు రంగ పరిశ్రమలు, కర్మాగారాల్లో గ్రూప్ సి, డి ఉద్యోగాలు వంద శాతం కన్నడిగులకే ఇవ్వాల్సిందే’’ అని పోస్టులో సిద్ధు పేర్కొన్నారు. తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు.తీవ్ర వ్యతిరేకతసిద్ధు సర్కారు నిర్ణయాన్ని కర్ణాటకలోని ప్రైవేటు రంగ సంస్థలు, పరిశ్రమలు ము ఖ్యంగా ఐటీ తదితర కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా దీనిపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టెక్ కంపెనీలకు స్థానికత కంటే ప్రతిభే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో కంపెనీలు కర్నాటకకు రావాలంటే భయపడే పరిస్థితి తలెత్తుతుందని సాఫ్ట్వేర్ పరిశ్రమల జాతీయ సంఘం నాస్కామ్ విమర్శించింది. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది వివక్షా పూరితమైన బిల్లంటూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ విమర్శించారు. ‘‘ఇది రాజ్యాంగవిరుద్ధం. టెక్ రంగానికి గొడ్డలిపెట్టు వంటి ఈ ఫాసిస్టు బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. అసోచామ్ కర్నాటక సహధ్యక్షుడు ఆర్కే మిశ్రా తదితరులు కూడా ఇది దూరదృష్టి లేని బిల్లంటూ తీవ్రంగా తప్పుబట్టారు. విపక్ష బీజేపీ కూడా బిల్లును తీవ్రంగా తప్పుబట్టింది. కర్నాటకలో కన్నడిగుల స్వాభిమానాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నడ నేమ్ప్లేట్లు, కన్నడ ధ్వజం, భాష, సంస్కృతి, పరంపర విషయంలో వెనుకంజ ఉండదు. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కలి్పస్తూ బిల్లు తేవడం అందులో భాగమే– బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టిన అనంతరం కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు -
హిజాబ్‌పై ఆలోచిస్తున్నాం
మైసూరు: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంపై మాత్రమే రాష్ట్ర సర్కార్ లోతుగా ఆలోచిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టంచేశారు. రాష్ట్రస్థాయిలో విస్తృతస్థాయిలో సంప్రతింపులు జరిపిన తర్వాతే ఈ అంశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. శనివారం మైసూరులో మీడియాతో ఆయ మాట్లాడారు. ‘ హిజాబ్‌పై నిషేధాన్ని ఇంకా అమల్లోకి తేలేదు. ఈ విద్యాసంవత్సరంలోనే అమలుచేయాలా వద్దా అనే దానిపై ఇంకా సంప్రతింపులు కొనసాగుతున్నాయి’’ అని చెప్పారు. కర్ణాటకవ్యాప్తంగా విద్యాలయాల్లో మతపరమైన వ్రస్తాలు ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవుకదా. అయినా ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి ఆహారం తినాలి అనేది పూర్తిగా వ్యక్తిగతం’’ అని శుక్రవారం వ్యాఖ్యలుచేసిన ఆయన మరుసటిరోజే ఇలా విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ చర్యల ఫలితంగా విద్యాసంస్థల్లోని లౌకక వాతావరణం దెబ్బతినే ప్రమాదముందని బీజేపీ ఆందోళనవ్యక్తంచేసింది. ‘‘ రాష్ట్రాల్లోని విద్యా వాతావరణాన్ని సీఎం చెడగొడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన బుజ్జగింపు రాజకీయలకు పాల్పడుతున్నారు’’ అని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఆరోపించారు. -
డీకే శివకుమార్ వెంట 70 మంది ఎమ్మెల్యేలు..!
అధికార కాంగ్రెస్‌లో ఓ విధమైన వేడి అలముకొంది. ఒకవైపు ఎమ్మెల్యేలను కూడగట్టి సర్కారును పడదోయాలని ప్రతిపక్ష బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపణలు. మరోవైపు తమ నాయకుడు డీకే శివకుమారే, రెండున్నరేళ్ల కాలానికి ఆయనే సీఎం అని కొందరు ఎమ్మెల్యేలు గళమెత్తారు. ఈ రెండింటిని ఎలా ఎదుర్కోవాలా అని సీఎం సిద్దరామయ్య తన సన్నిహిత మంత్రులతో హోంమంత్రి ఇంట్లో మంతనాలు జరిపారు. కర్ణాటక: బెంగళూరులో హోం మంత్రి జీ.పరమేశ్వర్ ఇంటిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కొందరు మంత్రులు విందు సమావేశం కావడం రాజకీయంగా కుతూహలానికి కారణమైంది. సీఎం సిద్దరామయ్య, జీ.పరమేశ్వర్, ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి, సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్.సీ.మహాదేవప్పలు విందు భేటీ జరిపారు. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేకపోవడం ఆయన వర్గాన్ని అసంతృప్తికి గురిచేస్తోంది. రాష్ట్ర సర్కారును పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు, అలాగే డీకే శివకుమార్ సీఎం కావాలని పలువురు ఎమ్మెల్యేల డిమాండ్లు ఇందులో చర్చకు వచ్చినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పోస్టులు తమకూ కావాలని సతీశ్ జార్కిహొళి, పరమేశ్వర్లు అప్పుడప్పుడు చెబుతున్నారు. సర్కారు ఏర్పడి ఇంకా ఆరు నెలలే అయ్యింది. ఇంతలోనే అస్థిరత ఏర్పడినట్లు వదంతులు చెలరేగుతున్నాయి. వాటితో పాటు కాంగ్రెస్‌లోని గందరగోళాలకు తెర దించేందుకు సీఎం, మంత్రులు చర్చించారని తెలిసింది. కాగా, సీఎం స్పందిస్తూ, ఈ విందులో ఎలాంటి రాజకీయ చర్చ జరుపలేదు. పరమేశ్వర్ భోజనానికి ఆహా్వనిస్తే, వెళ్లాం. దీనికి రాజకీయ రంగును పూయవద్దు అన్నారు. పరమేశ్వర్ కూడా ఇదే మాటలు చెప్పడం గమనార్హం. బీజేపీ కుట్రలు ఫలించవు: డీకేశి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జరిపే ప్రయత్నాలు ఫలించవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌కు వెళ్లేముందు ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జరుపుతున్న కుట్ర తెలుసు. దీని వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అయినా కానీ సర్కారును కూల్చలేరు అన్నారు. మొదటి నుంచి బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోందని మండ్య ఎమ్మెల్యే రవి గణిగ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. ప్రలోభాలను అసెంబ్లీలోనే బహిర్గతం చేస్తామన్నారు. కాగా, నేను సీఎం కావాలని ఎవరైనా ఎమ్మెల్యే ప్రకటిస్తే కేపీసీసీ చీఫ్‌గా వారికి క్రమశిక్షణా నోటీస్ జారీ చేయనున్నట్లు డీకే హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నాయకులకు పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడరాదని సూచించామన్నారు. మంత్రి పదవి,రూ. 50 కోట్ల ఆఫర్: గణిగ బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేల వద్ద మాట్లాడిన ప్రలోభాల సాక్ష్యాలను మరో రెండు రోజుల తరువాత మీడియా ముందు పెడతానని మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ తెలిపారు. మండ్యలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి, రూ. 50 కోట్ల ఆఫర్ ఇచ్చారు. సీఎం, డీసీఎంతో మాట్లాడిన రెండు రోజుల తరువాత మీడియా ముందు వస్తానన్నారు. ఒక ఎమ్మెల్సీ, యడియూరప్ప పీఏ సంతో‹Ù, బెళగావి మాజీ మంత్రి ఒకరు బెంగళూరులోని గోల్డ్ ఫించ్ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. డీకేశి వెంట 70 మంది ఎమ్మెల్యేలు: శివగంగ డీసీఎం డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌లో 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని దావణగెరె జిల్లా చన్నగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే శివగంగా బసవరాజ్ అన్నారు. ఈ ఐదేళ్లలో ఆయనను తప్పకుండా ముఖ్యమంత్రిని తప్పకుండా చేస్తామని ప్రకటించి హస్తంలో వేడిని పెంచారు. అధికార పంపకం, పార్టీ, ప్రభుత్వం గురించి ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని శనివారం ఉదయమే సీనియర్లు కఠినమైన హెచ్చరికలు చేశారు. వీటిని బేఖాతరు చేస్తూ శివగంగా విలేకరులతో ఘాటుగా మాట్లాడారు. డీ.కే.శివకుమార్ వంద శాతం సీఎం అవుతారు. పారీ్టలో 60– 70 మంది ఎమ్మెల్యేలు డీకేకి మద్దతుకు ఉన్నామని నేను మామూలుగానే చెప్పాను. ఆ మాటకొస్తే 135 మంది ఎమ్మెల్యేలు డీకేకి అండగా ఉన్నారు అని అన్నారు. అలాగని తాను మరొకరికి వ్యతిరేకం కాదన్నారు. -
అక్కడ పోటీ చేస్తే సీఎం గెలుపు అసాధ్యం?
యశవంతపుర : చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తే గెలవటం అసాధ్యమంటూ ఇంటెలిజెన్స్ విభాగం పేరుతోనున్న ఓ పత్రం వైరల్ కావడం సంచలనం రేగింది. అయితే ఇది నకలీ నివేదిక అని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఈ నివేదికపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీఐజీకి సూచించినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కాగా, అలాంటి నివేదిక ఏదీ ఇంటెలిజెన్స్ వర్గాలు తమ కార్యాలయానికి ఇవ్వలేదని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. తమ విభాగం కన్నడలో మాత్రమే ఇస్తుందని, అయితే నివేదిక ఆంగ్లంలో ఉన్నందున అది నకిలీదని నిఘా అధికారులు ఖండించారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి (వరుణ), బసవకల్యాణ, గంగావతి, శివాజీనగర నియోజకవర్గంలో పోటీ చేస్తే ఏలా ఉంటుందనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు గోప్యంగా నివేదిక చేయించారు. నాలుగు చోట్ల కూడా ఓడిపోతారంటూ నివేదిక శుక్రవారం రాత్రి నుండి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ నివేదికపై జేడీఎస్ నేత కుమారస్వామి సీఎం సిద్ధరామయ్యపై పలు ఆరోపణలు చేశారు. అయన హుబ్లీలో విలేకర్లతో మాట్లాడారు. తను ఎక్కడ నుండి పోటీ చేయాలో సర్వే చేయించి అధికారం దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు కుమార ఆరోపించారు. నేడు ప్యాలెస్ మైదానంలో రాహుల్ సభ సాక్షి, బెంగళూరు: ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ నిర్వహించనుంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొ ంటారు. ఇటీవల జరిగిన ప్రధాని మోదీ సభకు దీటుగా జనాన్ని తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమయ్యారు. ఇందుకోసం మూడు వేలకు పైగా కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులను కేటాయించినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు జ్ఞానభారతి ఆడిటోరియంలో జరిగే సమావేశానికి హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని ప్యాలెస్ మైదానం చేరుకుని సభలో పాల్గొంటారు. -
ఆ సీఎం మళ్లీ హాయిగా కునుకేశారు
బెంగళూరు: ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి ఎంచక్కా కునుకుతీశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ వేణుగోపాల్ మీడియా సమావేంలో మాట్లాడుతున్నారు. వేణుగోపాల్ పక్కను కూర్చున్న సిద్ధరామయ్య మాత్రం ఇవేమీ తనకు పట్టవన్నట్లుగా హాయిగా నిద్రపోవడం చర్చనీయాంశమైంది. అయితే పలు ముఖ్య సందర్భాలలో ఆయన ఇలా నిద్రపోవడం ఇదేం తొలిసారి మాత్రం కాదు. సీఎం తీరుపై సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. 2014లో కర్ణాటక అసెంబ్లీలో ఓ బాలికపై అత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలోనూ సీఎం గారు చక్కగా కునుకుతీసి విమర్శలపాలయ్యారు. గతంలో మైసూరులో జరిగిన ది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 103వ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనూ ఆయన చల్లగా, హాయిగా నిద్రలోకి జారుకున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ శిష్యుడు అయిన సిద్దరామయ్య తన పాత గురువు లక్షణాలు కొన్ని వెంట తెచ్చుకున్నట్లు కనిపిస్తున్నారు. పలు సమావేశాలలో మాజీ ప్రధాని దేవేగౌడ నిద్రపోవడం.. సమావేశం పూర్తయిన తరువాత నిద్రలేవడం అందరికి తెలిసిందే. అయితే సీఎం సిద్ధరామయ్యకు అతినిద్ర జాడ్యం ఉందని.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు యోగా చేస్తున్నారని ప్రచారంలో ఉంది. -
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
త్వరలో వేతన సంఘం సీఎం సిద్ధరామయ్య ప్రకటన బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణలకు సంబంధించి రానున్న బడ్జెట్లో నూతన వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. శాసనమండలిలో గురువారం సిద్ధరామయ్య ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పరిష్కరణకు సంబంధించి చాలా కాలంగా డిమాండ్లు వెల్లువెత్తున్నాయని, ఈ నేపథ్యంలో 2017 బడ్జెట్లో నూతన వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు గణేష్ కార్నిక్, రామచంద్రేగౌడ, అరుణ్ షహాపురలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పరిష్కరణ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఉన్న తారతమ్యాలు, లభిస్తున్న సౌకర్యాలు, రోజువారీ భత్యాలు, పింఛన్లు వంటి అంశాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి వేతన పరిష్కరణను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సైతం పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 25 వేల కోట్ల రూపాయలను వేతనాల రూపంలోనూ, 12 వేల కోట్ల రూపాయలను పించన్ల రూపంలోనూ అందజేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,79,000 ఉద్యోగాలున్నాయని, ఇందులో 2,69,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీఎం తెలిపారు. ఏయే శాఖల్లో ఏయే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటిని భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోం శాఖతో పాటు రెవెన్యూ, విద్యా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. -
సిద్ధుపై స్వపక్షం గరం గరం
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం (సీఎల్పీ) వాడివేడిగా సాగింది. స్వపక్ష నాయకులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని సమాధాన పరచడానికి సీఎం సిద్ధు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సమాచారం. శీతాకాల సమావేశల సందర్భంగా ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన బెళగావిలో బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... సమావేశం ప్రారంభమైన వెంటనే రాష్ట్రంలో కరువు నిర్వహణ పనులు సరిగా సాగడం లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రూపొందించిన నియమ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. ట్యాంకర్ల ద్వారా కనీసం తాగునీటి సరఫరా సాగడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సిద్ధరామయ్య దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎన్ని గోశాలలు, పశుగ్రాసం బ్యాంకులు ఏర్పాటు చేశారన్న విషయంపై ప్రభుత్వ అధికారుల వద్దే సమాధానం లేదన్నారు. ఇక చెరువుల్లో పూడిక తీతకు ఇది సరైన సమయమని అరుుతే ఇన్ఛార్జ్ మంత్రుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ పనులు చాలా చోట్ల ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత మంత్రుల వద్ద మాట్లాడటానికి ప్రయత్నించినా ’సమయం లేదన్న’ సమాచారం అమాత్యుల నుంచి వస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాము నియోజకవర్గాల్లో ఎలా తిరగాలని సిద్ధరామయ్యను నేరుగా ప్రశ్నించాలరు. రుణమాఫీ విషయమై స్పష్టత ఏదీ? రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసి కూడా రుణమాఫీ విషయంపై తీసుకునే నిర్ణయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని సీఎం సిద్ధరామయ్యను నిలదీశారు. మీరు ఒక మాట చెబుతుంటే మంత్రులు మరో మాట చెబుతున్నారంటూ సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్‌ను ఉద్దేశించి కొంతమంది ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కర్ణాటకలో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు అందజేసే పరిహారం విషయంలో కూడా మనం నిర్లక్ష్యంగా వ్యవహరించామని సీఎం సిద్ధరామయ్యతో స్వపక్ష నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి కర్ణాటకకు అందిన నిధుల్లో రూ.67.90 లక్షలను ఎందుకు వెనక్కు పంపించాల్సి వచ్చిందని నిలదీశారు. ఈ విషయం తాము చెబుతున్నది కాదని కంప్ట్రోలర్ అండ్ అడిట్ జనరల్ (కాగ్) నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలు స్పష్టంగా పేర్కొందని ఆయనకు వివరించారు. దీంతో సీఎం సిద్ధరామయ్య అక్కడే ఉన్న మంత్రుల పై కొంత గరం అయ్యారు. క్షేత్రస్థారుులో ఇన్ని ఇబ్బందులు ఉంటే ఎందుకు తన దృష్టికి తీసుకురాలేదని కనీసం మంత్రి మండలి సమావేశాల్లో కూడా ఎందుకు చర్చించలేదని కోపగించుకున్నారు. అటు పై సహచరలను శాంతపరుస్తూ...’సహకార బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అందుకోసమే నివేదిక తయారు చేస్తున్నాం. ఈ విషయంలో ఎంటుంటి అపోహలు వద్దు. ఇక కేంద్రం నుంచి పరిహారం నిధులు వెనక్కు వెళ్లడానికి సదరు పరిహారం అందించడానికి రూపొందించిన నిబంధనలే కారణం. నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు కదా? అరుునా ఇకపై ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుందాం. మన మధ్య పొరపొచ్చలు వద్దూ’ పలు విధాలుగా సహచరులకు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సీఎల్పీ సమావేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇక తన్వీర్ సేఠ్‌ను నీలి చిత్రాలను చూస్తూ దొరికి పోరుున విషయానికి సంబంధించి చట్టసభల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించవచ్చవచ్చునని సీఎల్పీ సమావేశంలో సీఎం సిద్ధు పేర్కొన్నారు. అందువల్ల అందరూ కలిసికట్టుగా ఉంటూ విపక్షాల ఆరోపణలను ఎదుర్కొనాలని ఆయన సహచరులకు దిశానిర్దేశం చేశారు. -
ఇదేమి చోద్యం !
సాక్షి, బెంగళూరు: రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సహకార శాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవ ప్రసాద్ తలోదారిలో ప్రయాణిస్తున్నారా?.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇందుకు మంగళవారం జరిగిన సంఘటనలను విపక్షాలతో పాటు రైతుల సంఘాల నాయకులు ప్రస్తావిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా బెళగావిలో రెండో రోజు మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే శాసనసభలో విపక్ష సభ్యులు కరువుపై చర్చకు పట్టుబట్టాయి. 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తక్షణం వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని పట్టుబట్టారు. కలుగజేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..రైతుల కష్టాలు తమకూ తెలుసన్నారు. సహకార సంఘాల్లో తీసుకున్న పంటరుణాలను మాఫీ చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఈ విషయమై ఇప్పటికే వివిధ మార్గాల్లో నివేదికలు కూడా తెప్పించుకున్నామని పేర్కొంటూ మొదట ప్రశ్నోత్తరాల సమయానికి సహకరించాలని విపక్షాలకు సూచించారు. ఈ సమయంలో స్పీకర్ కోడివాళ కలుగజేసుకోవడంతో కొశ్చన్ అవర్ ప్రారంభమైంది. ఇదిలాఉండగా చెరకు ఫెరుుర్ అండ్ రెమ్యూనిరేటీవ్ (ఎఫ్ఆర్పీ) ధరను పెంచే విషయంతో పాటు బకాయిల చెల్లింపు తదితర విషయాలకు సంబంధించి రైతు సంఘం నాయకులతో సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ బెళగావిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో వ్యసాయ రుణాలను మాఫీ చేస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.9,978 కోట్లు భారం పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ఆర్థికభారాన్ని ప్రభుత్వం మోయలేదని తేల్చిచెప్పారు. అందువల్ల రైతుల రుణాల మాఫీ చేయలేమని స్పష్టం చేశారు. అరుుతే రుణాల వడ్డీలను రీ షెడ్యూల్ చేసే విషయం మాత్రం అలోచిస్తామన్నారు. దీనిపై రాష్ట్ర చెరుకు రైతు సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ స్పందిస్తూ..ఒకే విషయమై బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు విరుద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చర్చలు విఫలం... చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యూనిరేటీవ్ (ఎఫ్ఆర్పీ) పెంపు విషయంతో పాటు బకారుుల చెల్లింపుపై ప్రభుత్వం, రైతు సంఘం నాయకుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంబన తొలగలేదు. ఎఫ్ఆర్పీని టన్నుకు రూ.3,050 వరకు పెంచాలని రైతు సంఘం నాయకులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు చక్కెర కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలనేది వారి మరొక ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ అధ్యక్షతన బెళగావిలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చెరకు రైతు సంఘం నాయకులు, వివిధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, చక్కర కర్మాగార యాజమాన్యం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెరుకు ఎఫ్ఆర్పీ పెంచడం సాధ్యం కాదని మహదేవ ప్రసాద్ రైతులతో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు ’చక్కెర యాజమాన్యం లాబీకి తలొగ్గిన మంత్రికి రైతుల కష్టాలు అర్థం కావడం లేదు. చెరుకు ఎఫ్ఆర్పీ పెంచేంతవరకూ తాము వెనకడుగువేసేది లేదు. వెంటనే బకాయిలను చెల్లించాలి. అప్పటి వరకూ బెళగావిలో వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటాం’ అని పేర్కొంటూ సమావేశం నుంచి అర్థాతరంగా బయటకి వచ్చేశారు. అటుపై మంత్రి మహదేవ్ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ...మంగళవారం జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిసాయన్నారు. ఈ విషమై ఈనెల 24న మరోసారి రైతు సంఘం నాయకులతో చర్చిస్తామన్నారు. సమస్యకు తప్పక పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా ?
భత్యంతో సరిపెట్టారు ! అటకెక్కిన పోలీసుల వేతన పెంపు ఆర్డర్లీ వ్యవస్థ రద్దుతో కొంత ఉపశమనం డిసెంబర్ ఒకటి నుంచి అలవెన్స్ అమలు వచ్చే ఏడాది పే కమిషన్ సీఎం సిద్ధరామయ్య వెల్లడి సాక్షి, బెంగళూరు : పోలీస్ శాఖ సమస్యలు పరిష్కరించడంలో సిద్ధు సర్కార్ ఆచితూచి అడుగులు వేసింది. బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వివిధ రకాల భత్యాలను పెంచుతూ జీతాల పెంపు మాత్రం సాధ్యం కాదని తేల్చేసింది. వేతనాలు భారీగా పెరుగుతాయన్న ఆశతో ఎదురుచూసిన క్షేత్రస్థాయి సిబ్బంది ఈ తాజా నిర్ణయంతో తీవ్ర నిరాశలో పడిపోయారు. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణలో సీఎం సిద్ధరామయ్యతో పాటు హోం మంత్రి పరమేశ్వర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఆ స్థానాల్లో ఉన్న సిబ్బందికి కానిస్టేబుల్ శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటామన్నారు. అయితే ఆర్డర్లీ స్థానంలో ఇతర వ్యక్తులను నియమించాలా లేదా అన్న విషయంపై సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా ఇప్పటి వరకూ సిబ్బందికి ఇస్తున్న యూనిఫాం అలవెన్సును రూ.100 నుంచి రూ.500 పెంపుతో పాటు కొత్తగా ట్రాన్స్ పోర్ట్ అలవెన్సును రూ.600 లు, రిస్క్ అలవెన్సును రూ.1000 గా ఇవ్వనున్నామన్నారు. మొత్తంగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒక్కొక్కరు అలవెన్సుల రూపంలో నెలకు రూ.2000 లు అందుకోనున్నారు. డిసెంబర్ వేతనాలతో తీసుకోవచ్చని సీఎం చెప్పారు. దాదాపు 75 వేల మంది పోలీసు సిబ్బంది, అధికారులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. తాజా నిర్ణయంతో ఖజానాపై ఏడాదికి రూ. 200 కోట్ల భారం పడనుందని సీఎం పేర్కొన్నారు. వేతనాల పెంపు లేదు... వచ్చే ఏడాది ప్రభుత్వం నూతనంగా పే కమిషన్ వేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసు సిబ్బంది వేతనాలు పెంచడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నిత్యం ఒత్తిడితో పనిచేస్తుండటం వల్లే పోలీసులకు 12 నెలలకు బదులు 13 నెలల వేతాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో కానిస్టేబుల్‌గా హోంశాఖలో ఉద్యోగం పొందిన వారు ముప్పై ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రమోషన్ పొందేవారన్నారు. అయితే పదేళ్లకొకసారి తప్పక ప్రమోషన్ అనే విధానం (ఆక్సిలరేటెడ్ ప్రమోషన్) విధానం అమలు చేయాలని నిర్ణయించామని సిద్ధరామయ్య తెలిపారు. దశలవారీగా నియామకాలు... రాష్ట్ర హోంశాఖలో ఖాళీలను దశలవారరీగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. 2016-17 ఏడాదికి గాను 7815 కానిస్టేబుల్, 711 ఎస్ఐ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న వారిలో దాదాపు 5 వేల మంది శిక్షణలో ఉన్నారన్నారు. 2017-18లో 4.561 కానిస్టేబుల్, 333 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయనుండగా 2018-19 ఏడాదిలో 4,045 కానిస్టేబుల్, 312 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. దీని వల్ల రాష్ట్ర హోంశాఖలో క్షేత్రస్థాయి పోస్టులన్నీ భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని సీఎం సిద్ధరామయ్య వివరించారు. ఇక వారానికి ఒకరోజు కచ్చితంగా సెలవు ఇవ్వాలని అధికారులకు సూచించామన్నారు. అటకెక్కిన ప్రతిపాదన జీతాలు పెంచుతామని ఇప్పటివరకు చెబుతూ వచ్చిన సిద్ధు ఔరాద్కర్ నివేదికను అటకెక్కించ్చేసింది. కొన్నినెలల క్రితం జీతాల పెంపు తదితర డిమాండ్లతో పోలీసులు సామూహిక సెలవు ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని చెమటలు పట్టించిన విషయం తెల్సిందే. క్రమశిక్షణ శాఖలో ఇంతటి వ్యతిరేకతను అప్పటికప్పుడు అణచివేయాలని సామూహిక సెలవు నిర్ణయాన్ని అప్పటికెలాగో ఆగిపోయేలా చేసిన ప్రభుత్వం, అనంతరం సీనియర్ ఐపీఎస్ అధికారి ఔరాద్కర్ నేతృత్వంలో ఓ కమిటీని వేసి వివిధ రాష్ట్రాలలో పోలీసుల వేతనాలపై అధ్యయనం చేసింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 24 శాతం జీతం పెంచాలని నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఈ ప్రతిపాదనలు అటకెక్కాయని పోలీసు సిబ్బంది పేర్కొంటున్నారు. సంధులు... సమాధానాలు పోలీసు శాఖ డిమాండ్లపై శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య నవ్వులు పూయించారు. సంధులు సమాధానాలు నాకూ తెలుసు అంటూ గుణసంధి, సువర్ణ దీర్ఘ సంధి గురించి ఉదహరించారు. అంతకు ముందు ఓ విలేకరి పోలీసుల అలవెన్స్ పెంపు విషయంలో ఇప్పటికి మీకు జ్ఞానోదయం అయ్యిందా ? అంటూ ప్రశ్నించారు. సీఎం సమాధానమిస్తూ ‘జ్ఞానం ఉంది... అయితే ఇప్పటి వరకు దాన్ని ఉపయోగించడానికి కుదరలేదు అంటూ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ఇప్పటికి తాము పోలీసుల ఆశలను నెరవేర్చాం..అంటూ సదరు విలేకరికి కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఊరుకోకుండా జ్ఞానం ఎప్పుడు ఉదయించదు.. జ్ఞానం ఎల్లప్పుడు ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకోవాలి’ అని చరుకంటించారు. ఇంతలో పక్కనే ఉన్న మరొకరు జ్ఞాన+ ఉదయం= జ్ఞానోదయం అని పేర్కొంటూ ఇది సవర్ణ దీర్ఘసంధి అని పేర్కొన్నారు. ఇంతలో మరోసారి సిద్ధరామయ్య కలుగచేసుకుని ఇది గుణసంధి అని చెప్పి మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు. -
టిప్పు జయంతికి సర్వం సిద్ధం
అవాంఛనీయ ఘటనలు జరిగితే యడ్డీదే బాధ్యత హెచ్చరించిన సీఎం సిద్ధరామయ్య బెంగళూరు(బనశంకరి): తీవ్ర వ్యతిరేకత మధ్య టిప్పు జయంతి ఆచరణకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గురువారం నిర్వహించే టిప్పు జయంతి సందర్భంగా ఎక్కడైనా బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ కార్యకర్తలు ఇబ్బందులు సృష్టిస్తే నిర్ధాక్షిణ్యంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగదళ్ సంఘాలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుటిల ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. టిప్పు జయంతి సందర్భంగా శాంతిభద్రతలకు అడ్డుతగిలిన వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని సీఎం స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీఎస్.యడ్యూరప్ప నీతినియమాలు వదిలేశారని విమర్శించారు. ఆయన కేజీపీలో ఉండగా టిప్పుసుల్తాన్ను శ్లాఘించారన్నారు. బీజేపీలోకి వచ్చిన అనంతరం టిప్పును వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాజకీయం చేయడానికి టిప్పు జయంతిని యడ్యూరప్ప వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. టిప్పు జయంతి సందర్భంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే యడ్యూరప్పదే బాధ్యత అని సిద్ధరామయ్య హెచ్చరించారు. విపక్షనేత జగదీశ్ షెట్టర్, ఉప నేత ఆర్.అశోక్‌లు టిప్పు ధరించిన టోపీ పెట్టుకొని ఫోజులు ఇచ్చిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. టిప్పు జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు. -
అత్యున్నత దర్యాప్తు అవసరం లేదు
ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలపై సీఎం సిద్దు మైసూరు: ఇటీవల దారుణహత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రుద్రేశ్, మాగళి రవిల హత్య కేసులపై దర్యాప్తును సీబీఐ, ఎన్ఐఏలకు అప్పగించేది లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సోమవారం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి నగరానికి చేరుకున్న ఆయన మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ...గతంలో కూడా ఇటువంటి హత్యలపై విచారణను సీబీకి అప్పగించగా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రుద్రేశ్, మాగళి రవిల హత్యల కేసులను రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేస్తారని తెలిపారు. బెంగళూరులో హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రుద్రేశ్ హత్య వెనుక మంత్రి రోషన్‌బేగ్ హస్తముందంటూ బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపారు. బెళగావిలో త్వరలో జరుగనున్న శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. బీజేపీ తన రాజకీయ లబ్ది కోసం టిప్పు జయంతిని వ్యతిరేకిస్తూ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. టిప్పు చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ ప్రజలకు తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వివాహ వేడుకల్లో అధిక ఖర్చుకు తాను వ్యతిరేకమని, ఈ విషయంపై ప్రత్యేక చట్టం తేవడానికి విధానసభలో చర్చించనున్నామని తెలిపారు. మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ ప్రసాద్ రాజీనామా అనంతరం నం జనగూడుకు జరుగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు. కార్యక్రమంలో విధానపరిషత్ సభ్యుడు ధర్మసేనా, కాంగ్రెస్ జిల్లాధ్యక్షుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వారి సర్టిఫికెట్ అవసరం లేదు
మాజీలపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం మైసూరు: భ్రష్టు పట్టిన కాంగ్రెస్ పార్టీకి చికిత్స చేయాల్సిన అవసముందని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి సీ.ఎం.ఇబ్రహీం ఆయన వ్యాఖ్యలను సమర్థించిన మాజీ ఎంపీ హెచ్.విశ్వనాథ్‌లపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఆదివారం నగర శివార్లలోని మండకళ్లి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పని తీరుపై మాజీ మంత్రి సీ.ఎం.ఇబ్రహీం, మాజీ ఎంపీ హెచ్.విశ్వనాథ్‌ల సర్టిఫికెట్ తమకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడంతో నంజనగూడు నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికలను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్న వార్తలను ఆయన ఖండించారు. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని, నంజనగూడు ఎన్నికను సమర్థవ ంతంగా ఎదుర్కొంటుందని చెప్పారు. నంజనగూడు విధానసభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదని తెలిపారు. మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ ప్రసాద్ తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు తాను స్పందించనని, ఇపుడు ఆయన తమ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో ఆయన ఆరోపణలకు స్పందిచాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ముఖ్యమంత్రి పదవి తరువాత కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా మూడే ళ్లు పదవి అనుభవించిన శ్రీనివాస ప్రసాద్ మంత్రి వర్గ విస్తరణలో పదవి తొలగించగానే రాజీనామా చేయడంపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. టిప్పు సుల్తాన్‌పై కొంత మంది అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఆయన జయంతి వేడుకలను నిషేధించాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. బెంగళూరులో నిర్మించనున్న స్టీల్‌బ్రిడ్జ్ నిర్మాణంపై జూన్‌లో సామాజిక మాధ్యమాలలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించగా 73 శాతం మంది బ్రిడ్జి నిర్మాణానికి అనుకూలంగా అభిప్రాయాలను వెల్లడించారని తెలిపారు. గోవాలో కన్నడిగులపై దాడులు జరుగడం తనను తీవ్రంగా కలచివేసిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోవా రాష్ట్ర ముఖ్య కార్యదర్శితో మాట్లాడారని గోవాలో కన్నడిగులకు భద్రత కల్పించాలని కోరినట్లు సీఎం చెప్పారు. -
టార్గెట్ సిద్ధు
► వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమికి ప్రణాళికలు ► ఆ ఆరుగురి కనుసన్నల్లోనే మంత్రి మండలి పునర్విభజన ► మంత్రి మండలిలో పేమెంట్ సీట్లే ఎక్కువ ! ► హై కమాండ్‌కు డబ్బు మూటలు ► రాజీనామా అనంతరం శ్రీనివాస ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు బెంగళూరు : ‘సీఎం సిద్ధరామయ్య రాజకీయంగా ఎదుగుదల కోసం నా సహకారం తీసుకున్నారు. అయితే చేసిన సహాయాన్ని మరిచి అత్యంత అవమానకరంగా నన్ను మంత్రి మండలి నుంచి తొలగించారు. చాలా బాధగా ఉంది. సిద్ధును వచ్చే ఎన్నికల్లో ఓడించి నా పగను చల్లార్చుకుంటా. ఇందుకు జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తా.’ అని నంజనగూడు ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మంత్రి మండలి పునఃరచనలో భాగంగా శ్రీనివాస్ ప్రసాద్‌ను రెవెన్యూశాఖ మంత్రిగా తప్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సీఎం సిద్ధుపై గుర్రుగా ఉన్న ఆయన తన శాసనసభ సభ్యత్వానికి, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. అన ంతరం తన మద్దతుదారులకు కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్యే లక్ష్యంగా ఆయన ప్రసంగం సాగింది. రాజకీయంగా మునిగిపోయే టైటానిక్ పడవలో ప్రయాణిస్తున్న సిద్ధరామయ్యకు తాను సహాయ హస్తం అందించానని పేర్కొన్నారు. అయితే తనతో ఒక్కమాట కూడా చెప్పకుండానే మంత్రి మండలి నుంచి తొలగించడం ఎంత వరకూ సమంజసమన్నారు. పటిష్టమైన మంత్రి మండలి రచన అని చెబుతూ ఏమాత్రం రాజకీయ అనుభవం, ప్రజాభిమానం లేని నాయకులను మంత్రి మండలిలోకి తీసుకున్నారని విమర్శించారు. మంత్రి మండలి పునఃరచన అంతా ఆ ఆరుగురి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. ఇంతలో ఆ ఆరుగురు ఎవరో చెబుతారా అన్న మీడియా ప్రశ్నకు చెబుతాను నాకు భయం లేదు అంటూ ద్విగ్విజయ్సింగ్, సిద్ధరామయ్య, పరమేశ్వర్, కే.జే జార్జ్, డీ.కే శివకుమార్, మల్లికార్జున ఖర్గే’ అని తెలిపారు. మహదేవప్ప లేరా అన్న మరో ప్రశ్నకు ఆయన సిద్ధరామయ్య ‘జిరాక్స్’ అంటూ వ్యంగ్యంగా అన్నారు. ఇక మంత్రి మండలి మొత్తం పేమెంట్ సీట్లతో నిండిపోయిందని మరో సంచలనం వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా హైకమాండ్‌కు ఇక్కడి నుంచి ‘కప్పాలు’ (డబ్బు మూటలు) వెలుతున్నాయని తన మాట తీవ్రతను పెంచారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. ఇక రాజకీయాల నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలనుకున్న తరుణంలో తాను సహాయం చేసిన వ్యక్తి నుంచే అవమానం ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ‘సిద్ధరామయ్య అండ్ కో’ను ఓడించినప్పుడే తనకు మనఃశాంతి కలుగుతుందని పురరుద్ఘాటించారు. ఇందుకు అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తున్నానని తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తానా? లేక ఏదైనాపార్టీతో కలిసి రాజకీయ రణరంగాన్ని ఎదుర్కొంటాన్న అన్న విషయం ఇప్పుడే చెప్పలేనని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏకపక్ష నిర్ణయాలు ! అంతకు ముందు తన మద్దతుదారులతో కలసి విధానసౌధలోని స్పీకర్ కోడివాళను కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తోందన్న స్పీకర్ కోడివాళ ప్రశ్నకు ‘సిద్ధరామయ్య ఏకపక్ష నిర్ణయాల వల్ల తన మనస్సుకు బాధ కలిగింది. అందువల్లే రాజీనామా చేస్తున్నాను. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి లేదు. సాధ్యమైన ంత త్వరగా అమోదించాలని కోరారు.’ అని పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసే సమయంలో మీడియా ముందు సదరు ప్రజాప్రతినిధిని స్పీకర్ ఎంటువంటి ప్రశ్నలు వేయరు. అయితే తాజా ఘటనలో మాత్రం అందుకు విరుద్ధంగా జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా నిబంధనలను అనుసరించి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటాను అని స్పీకర్ కోడివాళ మీడియాతో పేర్కొన్నారు. రాజీనామా చేసిన వారిని బహిరంగంగా ప్రశ్నించే సంప్రదాయం ఇప్పటి వరకూ లేదు కదా అన్న ప్రశ్నకు ఇక ముందు ఇదే సంప్రదాయమవుతుందని కోడివాళ సమాధానమిచ్చారు. -
స్కర్ట్ బదులు చుడిదార్
ప్రాథమిక విద్యాశాఖలో పదివేల పోస్టుల భర్తీకి చర్యలు మంత్రి తన్వీర్‌సేఠ్ బెంగళూరు: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు 2017-18 విద్యా ఏడాది నుంచి యూనిఫామ్‌గా షర్ట్, స్కర్ట్ బదులు చుడిదార్ పంపిణీ చేయనున్నామని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్‌సేఠ్ తెలిపారు. విద్యార్థినుల భద్రత దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమోదం తెలిపారన్నారు. బెంగళూరులో విధానసౌధలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక విద్యాశాఖలో ప్రస్తుతం 14,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇందులో ఈ ఏడాది 10 వేల పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. మిగిలిన పోస్టులు వచ్చే ఏడాది భర్తీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి యూనిఫామ్‌తో పాటు పుస్తకాలు, షూ, సైకిల్స్ విద్యాఏడాది ప్రారంభానికి ముందే అందజేయనున్నామన్నారు. ఏడాది పాటు షూకు గ్యారెంటీ ఇచ్చే సంస్థలకు మాత్రమే టెండర్లో పాల్గొనేలా నిబంధనలు విధిస్తామన్నారు. -
‘మహదాయి’ పై రాజకీయాలు వద్దు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : మహదాయి విషయంలో భారతీయ జనతా పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. తాగునీటి విషయంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు. సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహదాయి ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈనెల 21న చర్చలు జరపనున్నామన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనెల 19న అఖిల పక్షం సమావేశాన్ని ఏర్పాటు చేస్తోందని గుర్తు చేశారు. అదే విధంగా గోవాలోని అధికార పార్టీ బీజేపీ కూడా అఖిల పక్షం సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేస్తోందన్నారు. అయితే ఆ రాష్ట్రంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తాము కళసాబండూరికి ఒప్పించాలని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ పేర్కొనడం సరికాదన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే విపక్షంలో లేదని శివసేనతో పాటు మరికొన్ని పార్టీలు కూడా విపక్ష స్థానంలో ఉన్నాయన్నారు. ‘అఖిల పక్షం సమావేశంలో ప్రభుత్వం అన్ని పార్టీల నాయకుల సలహాల అనంతరం తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే. ఈ విషయాలు తెలిసి కూడా రాజకీయాలు చేయడం బీజేపీకి తగదు.’ అని సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్‌బ్రిడ్జి పారదర్శకం... చాళుక్య సర్కిల్ నుంచి హెబ్బాళ వరకూ నిర్మించనున్న స్టీల్‌బ్రిడ్జ్ వివరాలన్నీ బీడీఏ వెబ్సైట్లో ఉన్నాయని మీడియాసమావేశంలో పాల్గొన్న బెంగళూరు నగరాభివద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ పేర్కొన్నారు. ఈ విషయంలో అక్రమాలకు తావులేదన్నారు. స్టీల్‌బ్రిడ్జిని ఎస్టీం మాల్ వరకూ పొడగించనున్నామని అందువల్లే ఖర్చు కొంత ఎక్కువగా కనిపిస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయంలో అన్ని విషయాలు పారదర్శకంగా ఉన్నాయని విపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని కే.జే జార్జ్ అసహనం వ్యక్తం చేశారు. -
అగ్రస్థానమే లక్ష్యం
⇔ కర్ణాటక వైమానిక పాలసీ సవరణకు మంత్రి మండలి ఆమోదం ⇔ రూ.14,520 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 33 ప్రతిపాదనలకు అంగీకారం ⇔ 10,584 ఉద్యోగాల సృష్టి’ ⇔ జీఎస్టీ’ ఆమోదానికి 14న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం బెంగళూరు: విమానయాన రంగంలో కర్ణాటకను దేశంలోనే అగ్ర స్థానంలో నిలపడమే లక్ష్యంగా కర్ణాటక వైమానిక విధానాల్లో సవరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం సైతం లభించింది. బుధవారమిక్కడి విధానసౌధలో సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మండలి సమావేశం అనంతరం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. కర్ణాటక రాష్ట్రం ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటక ‘వైమానిక పాలసీ 2013-23’కు సవరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం రూ.14,520 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 33 ప్రతిపాదనలకు మంత్రి మండలి అంగీకారం తెలిపిందని, తద్వారా రాష్ట్రంలో 10,584 ఉద్యోగాల సృష్టి జరగనుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న పారిశ్రామిక విధానంలో వ్యాపారులకు లభించే అన్ని సౌకర్యాలు, రాయితీలు నూతన వైమానిక పాలసీ ద్వారా ఈ రంగంలోని వ్యాపారులకు కూడా లభించనున్నాయని తెలిపారు. ఇక విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాల తయారీ కర్ణాటకలో ఎక్కువగా జరుగుతోందని అన్నారు. ఇదిలాగే కొనసాగితే కర్ణాటక ఏషియాలోనే ఏరోస్పేస్ హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు.... ⇔ ‘జీఎస్టీ’ బిల్లు ఆమోదానికి సెప్టెంబర్ 14న ఒక రోజు పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు మంత్రి మండలి అంగీకారం తెలిపింది. సెప్టెంబర్ 14న ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ⇔ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్యారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మంత్రి మండలి అనుమతించింది. ఒక్కో కళాశాలలో 320 సీట్లు అందుబాటులో ఉంటాయి. ⇔రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ మాజీ అధికారి చలపతిని సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారిగా నియమించేందుకు అంగీకారం ⇔పోలీసు శాఖలో 50 బస్సులు, 200 హొయ్సళ వాహనాల ఖరీదుకు గాను రూ. 14కోట్లను విడుదల చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. -
వణుకు పుట్టాలి
భూ ఆక్రమణదారులపై నాన్‌బెయిలబుల్ కేసులు నేరం రుజువైతే కఠిన శిక్షలు కర్ణాటక భూ ఆక్రమణల నిషేధ ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రారంభించిన సీఎం న్యాయస్థానాన్ని ప్రారంభిస్తున్న సీఎం తదితరులు బెంగళూరు: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. నగరంలోని రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన కర్ణాటక భూ ఆక్రమణల నిషేధ ప్రత్యేక న్యాయస్థానాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై నాన్‌బెయిలబుల్ కేసులను నమోదు చేయాలి, నేరం రుజువైతే కఠిన శిక్షలు విధించాలి. భూముల ఆక్రమణల్లో ఆక్రమణదారులకు కొందరు ప్రభుత్వ అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. వారికి కూడా శిక్షలు పడితేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి’ అని పేర్కొన్నారు. సభా సమితి నివేదిక ప్రకారం ఒక్క బెంగళూరు నగరంలోనే 34వేల భూముల ఆక్రమణల కేసులు నమోదు కాగా, కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని అన్నారు. ఇటీవలి కాలంలో రోజు రోజుకు భూముల ధరలు పెరిగిపోతుండడంతో భూములను కబ్జా చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోందని పేర్కొన్నారు. ‘భూ ఆక్రమణ దారులు తమ వద్ద ఉన్న డబ్బుతో ఏమైనా చేయవచ్చని భావిస్తుంటారు. ఏ వ్యవస్థనైనా తమ దగ్గర ఉన్న డబ్బుతో కొనేయవచ్చని, న్యాయమూర్తులను కూడా తమ డబ్బుతో కొనేయవచ్చని అనుకుంటూ ఉంటారు. అందుకే అలాంటి వారికి కనీసం జామీను కూడా లభించకుండా నాన్ బెయిలబుల్ కేసులను పెట్టాలి. ఈ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినపుడు కొంతమంది ఇందుకు అడ్డుపడేందుకు ప్రయత్నించారు. అలాంటి వారిలో ఇప్పుడిక వణుకు ప్రారంభమైంది’ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. భూ ఆక్రమణలకు సంబంధించిన కేసులు ప్రత్యేక కోర్టులో త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఓ సమితిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆక్రమణదారులను శిక్షించడంతో పాటు నిరపరాధులను రక్షించాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. భూ ఆక్రమణలు పెద్ద మాఫియాలా రూపాంతరం చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలోని కొన్ని లోపాలను ఇలాంటి వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోగలిగామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, రెవెన్యూ శాఖ మంత్రి కాగోడు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చేతిలో మంత్రించిన నిమ్మకాయ !
మైసూరు: తన రాజకీయ ప్రస్థానంలో మూఢనమ్మకాలను నమ్మని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం నగరంలోని రామకృష్ణనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేతిలో నిమ్మకాయతో దర్శనమివ్వడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన పెద్ద కుమారుడు రాకేశ్ సిద్ధరామయ్య మృతితో పుత్రశోకం నుంచి బయటపడడానికి ఆయన కుటుంబంతో కలసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం నగరంలోని టీ.కే.లేఔట్లో తన స్వగృహంలో బస చేసిన సద్ధరామయ్య మంగళవారం మంత్రించిన నిమ్మకాయతో మీడియా సమావేశానికి హాజరుకాడంతో అందరిలోను ఆశ్చర్యం నెలకొంది. -
పెట్టుబడులకు కర్ణాటక అనుకూలం
బెంగళూరు: విమానయాన, శిక్షణ, యంత్రపరికరాల తయారీ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి కర్ణాటక ఉత్తమమైన రాష్ట్రంగా భారతదేశంలోని ఫ్రాన్స్రాయబారి అలెగ్జాండ్రియా ఝుగ్లర్ పేర్కొన్నారు. ఇక్కడి కృష్ణలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ప్రాథమికంగా చర్చించామన్నారు. జనవరిలో తమ దేశపు పారిశ్రామిక వేత్తలతో కలిసి మరోసారి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి వివిధ ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. తమకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..
- తల్లి పేరిట ప్రభుత్వ భూమిని అక్రమంగా కొనుగోలు చేసిన సీఎస్ అరవింద్ జాదవ్ - మీడియాకు దొరకకుండా జారుకున్న వైనం - ఉదంతంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్.. నివేదికకు ఆదేశం బెంగళూరు : అక్రమ మార్గంలో ప్రభుత్వ భూమిని తన తల్లిపేరిట కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) అరవింద్ జాదవ్ విషయమై రెవెన్యూశాఖ నుంచి నివేదిక కోరినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కృష్ణలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. అనేకల్ తాలూకా రామనాయకనహళ్లి సర్వే నంబర్ 29 పరిధిలోని 66 ఎకరాలను గతంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి కేటాయించామన్నారు. అయితే ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారిలో అరవింద్ జాదవ్ తల్లి తారాబాయ్ కూడా ఉందన్నారు. ఆమెకు 8 ఎకరాల 30 గుంటల స్థలం కేటాయించినట్లు మీడియాల్లో వచ్చిన వార్తల వల్ల తెలిసిందని తెలిపారు. ఈ విషయమై రెవెన్యుశాఖ నుంచి సమగ్ర నివేదిక కోరినట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. నివేదిక అందిన తర్వాత తప్పుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీఎస్ అరవింద్ జాదవ్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నగరానికి చెందిన సమాచార హక్కు కార్యకర్త భాస్కరన్ అవినీతి నిరోధక దళానికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ప్రతిస్పందించడానికి సీఎస్ అరవింద్‌జాదవ్ నిరాకరిస్తూ మీడియాకు దొరకకుండా ఆయన విధానసౌధలో మెట్ల ద్వారా పరిగెత్తుకొంటూ వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భూమి కొనుగోలుకు సంబ ంధించి ముఖ్యమైన దస్త్రాలలోని విషయాలను మార్పు చేయడానికి సీఎస్ తెలుస్తోంది. నగరంలోని కందాయ భవన్ (రెవెన్యూ శాఖ ప్రధాన కార్యాలయం)లో ఈ భూమి కొనుగోలుకు సంబంధించి ఐదుగురు అధికారులు విషయాలను మారుస్తున్న విషయం మీడియా దృష్టికి వచ్చింది. మీడియా అక్కడకు చేరుకోగా వారు తలోదిక్కు వెళ్లిపోయారు. ఆ అధికారుల్లో అరవింద్ జాదవ్ పర్సనల్ సెక్రెటరీ సతీష్ ఉండటం గమనార్హం. సీఎస్‌కు అక్షింతలు: అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరవింద్‌జాదవ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలుసుకుని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వివాదాస్పదమైన స్థలాన్ని కొన్న మాట వాస్తవమేనని, అయితే ఎక్కడా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని అరవింద్‌జాదవ్ తెలిపారు. తన పదవీకాలాన్ని పొడగించడాన్ని సహించలేని కొంతమంది ప్రభుత్వ అధికారులు తన పై అనవరసర ఆరోపణలు చేస్తున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే సీఎం సిద్ధరామయ్య మాత్రం ‘ఉన్నత హోదాలో ఉన్నటువంటి మీరు ఇలా చేయడం సరికాదు. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. అయినా నివేదిక తప్పించుకుని అటుపై మీతో మాట్లాడుతా.’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎస్ అరవింద్ జాదవ్ వివరణ ఇచ్చే సమయంలో రెవెన్యూశాఖ మంత్రి కాగోడు తిమ్మప్పతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి వి.శంకర్ అక్కడే ఉన్నారు. ఇక ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలతో సంయమనం కోల్పోయిన కాగోడు తిమ్మప్ప సాకు బిడరప్ప...నాను ‘దడ్డ’. అదిక్కే ఈ విషయబగ్గే తిలుదుకొల్లక్కు ఆగలిల్ల (ఇక చాలు వదిలేయండి...నేడు చేతకాని వాడను. అందుకే ఈ విషయం గురించిన సమాచారం తెలుసుకోవడానికి వీలుకాలేదు.’ అని పేర్కొన్నారు. -
రైతులకు ‘రుణ విముక్తి’
సగం వరకు మాఫీ చేయండి కేంద్రాన్ని కోరిన సీఎం సిద్ధరామయ్య మిగతా సగం మొత్తాన్ని మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని ప్రకటన స్వాతంత్య్ర సమర యోధుల పింఛన్ 20 శాతం పెంపు మాణెక్ షా పరేడ్ గ్రౌండ్స్‌లో అంబరాన్నంటిన స్వాతంత్య్ర సంబరాలు బెంగళూరు: రాష్ట్రంలోని రైతులు జాతీయ బ్యాంకుల్లో రూ.29 వేల కోట్ల వరకు అప్పులు చేశారని, ఇందులో సగం మొత్తాన్ని మాఫీ చేసేందుకు కేంద్రం ముందుకు రావాలని సీఎం సిద్ధరామయ్య కేంద్రాన్ని కోరారు. ఆ మిగతా సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా మాఫీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. నగరంలోని మాణెక్ షా పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం జరిగిన 70వ స్వాతంత్య్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మాణెక్ షా పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అన్నభాగ్య పథకంలో భాగంగా ఇప్పటి వరకు బీపీఎల్ కుటుంబాలకు అందజేస్తున్న బియ్యాన్ని మరో కేజీ అదనంగా అందజేయడంతో పాటు సబ్సిడీ ధరలో కేజీ కందిపప్పును అందజేయాలన్న ఆలోచన ఉందన్నారు. బెంగళూరు నగర జిల్లాలో గత మూడేళ్లుగా 52 వేల కోట్ల రూపాయల విలువ చేసే 4950 ఎకరాల ఆక్రమిత భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని తెలిపారు. నగరంలోని రాజకాలువల ఆక్రమణలను పూర్తిగా తొలగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృఢమైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అక్రమాల్లో భాగస్వాములైన బిల్డర్లు, వారికి సహకారం అందించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నామని ప్రకటించారు. ఇక నమ్మ మెట్రో మొదటి దశ పనులను ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఇప్పటికే మెట్రో రెండో విడత పనులు ప్రారంభమయ్యాయని, మూడో విడత పనులకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. నగరంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను గత రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి నగరస్థాన పథకంలో భాగంగా రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. ఇక క్షీర భాగ్య పధకంలో భాగంగా రాష్ట్రంలోని 1.08 కోట్ల మంది చిన్నారులకు వారంలో ఐదు రోజుల పాటు ఒక్కొక్కరికి 150 మిల్లిలీటర్ల చొప్పున వెన్నతో కూడిన పాలను అందజేస్తున్నామన్నారు. ఆందోళన కలిగించే అంశం.... ఇక ఇటీవలి కాలంలో దేశంలో దళితులు, మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ విషయం అత్యంత ఆందోళన కలిగిస్తోందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సమరం తరహాలోనే పోరాటాన్ని సాగించాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను సమాజానికి అంటుకున్న ఓ కళంకమని పేర్కొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, మతవాదాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. -
సీఎం కుమారుడికి అస్వస్థత
బెంగళూరు: బెల్జియం పర్యటనలో ఉన్న సీఎం సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రాకేష్ సిద్ధరామయ్య ప్యాంక్రియాసిస్‌కు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య.. విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. బెల్జియంలో ఉన్న తన కుమారుడికి ఉత్తమవైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి బెల్జియంలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగులను ఆదేశించాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. తక్షణమే స్పందిన సుష్మాస్వరాజ్ బెల్జియంలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగులతో మాట్లాడి రాకేష్ సిద్ధరామయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. కాగా, రాకేష్ సిద్ధరామయ్య అస్వస్థత విషయం తెలుసుకున్న సీఎం తక్షణం తమ ఫ్యామిలీ డాక్టర్స్ ఇద్దరిని బెల్జియం పంపినట్లు తెలుస్తోంది. సీఎం సిద్దరామయ్య సైతం గురువారం తెల్లవారుజామున 4.30గంటలకు బెల్జియం బయల్దేరి వెళ్లారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాకేష్ ఆరోగ్యం బాగుందన్నారు. అతడు కోలుకుంటున్నాడని, చికిత్సకు స్పందిస్తున్నట్లు చెప్పారు. కాగా రాకేష్ తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు బెల్జియం వెళ్లారు. -
మోదీ జోక్యం చేసుకోవాలి
మహదాయి జలవివాదంపై సీఎం సిద్ధరామయ్య డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించేది లేదని స్పష్టీకరణ మైసూరు: కర్ణాటక, గోవా రాష్ట్రాల మధ్య నెలకొన్న మహదాయి జలవివాదాన్ని పరిష్కరించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. మైసూరు పాలికె సంస్థ ఆధ్వర్యంలో మైసూరులో రూ.5కోట్ల వ్యయంతో నిర్మించిన జయచామరాజ ఒడయార్ విగ్రహాన్ని, కొత్తగా అభివృద్ధి చేసిన హార్డింజ్ సర్కిల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఇదే సందర్భంలో జయచామరాజ ఒడయార్ మైసూరు నగరాభివృద్ధికి చేసిన కృషి గురంచి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. తర్వాత బెంగళూరుకు వెళ్తూ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. మహదాయి నీటి విషయంలో కర్ణాటక రాష్ట్రం నిబంధనలను అతిక్రమిస్తుందని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. జూలై 30వరకు విధానసభ సెషన్స్‌ను జరపడానికి ప్రభుత్వం తీర్మానించిందని, కానీ ప్రతిపక్షాలు డీవైఎస్పీ ఎం.కే.గణపతి ఆత్మహత్య కేసు విషయంలో రాజకీయం చేస్తూ సభను సజావుగా జరుగనివ్వడం లేదన్నారు. డీవైఎస్పీ ఎం.కే.గణపతి ఆత్మహత్య కేసు విచారణను సీఐడీకి అప్పగించామని, అయితే విపక్షాలు, డీవైఎస్పీ కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ చేయిస్తున్నట్లు చెప్పారు. న్యాయమూర్తుల కమిటీ విచారణ చేసి నివేదికలందించడానికి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపారు. విపక్షాలు డీవైఎస్పీ ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పట్టుబడుతండడంలో అర్థం లేదన్నారు. ఎనిమిది కేసుల విచారణను సీబీఐకి అప్పగించగా ఇప్పటివరకు నివేదికలందించలేదన్నారు. అందువల్లే డీవైఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించేది లేదని స్పష్టం చేసారు. మంత్రి జార్జ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ హైకమాండ్‌కు నగదు సరఫరా చేసే సూట్‌కేస్ అని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. హెచ్.డీ.కుమారస్వామి గతంలో ఇలాంటి ఆరోపణలు చేసి రుజువు చేయలేకపోయారని గుర్తు చేశారు. ప్రభుత్వం విపక్షాలను చులకనగా చూస్తుందనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. విపక్షాలు చేస్తున్న పోరాటాలు, కార్యక్రమాలు చులకనగా ఉన్నాయని విమర్శించారు. విధానపరిషత్ విపక్షనాయకుడు కే.ఎస్.ఈశ్వరప్పను సభ నుంచి బయటకు పంపాలని చెప్పే హక్కు తనకు లేదని, కానీ తమది ఖూనీకోరు ప్రభుత్వమని పదేపదే ఆరోపిస్తుండంతో ఆయన్ను సభ నుండి బయటకు పంపించమని కోరారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివరించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో ప్రజాపనుల శాఖమంత్రి హెచ్.సీ.మహదేవప్ప, సహకారశాఖ మంత్రి హెచ్.ఎస్.మహదేవప్రసాద్, విధానపరిషత్ సభ్యుడు ఆర్.ధర్మసేన, మైసూరు పాలికె కమిషనర్ బీ.ఎల్.భైరప్ప,యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ దంపతులు, రాజమాత ప్రమోదాదేవి ఒడయార్,ఎంఎల్ఏ సోమశేఖర్,వాసు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పారంపర్య కట్టడాలు,సర్కిల్లను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నిధుల నుంచి విడుదలైన రూ.100కోట్ల నిధుల నుంచి రూ.5కోట్లను వెచ్చించి చామరాజ ఒడయార్, హార్డింజ్ సర్కిల్‌ను అభివృద్ధి చేసామని పాలికె అధికారులు తెలిపారు. -
‘సూట్‌కేసులు’ మోస్తున్నారు !
సీఎం సిద్ధరామయ్య, మంత్రి జార్జ్‌పై కుమారస్వామి విమర్శలు బెంగళూరు: ‘సీఎం సిద్ధరామయ్య, మంత్రి కె.జె.జార్జ్‌లు హైకమాండ్‌కు కప్పాలు కడుతున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతోనే అప్పుడప్పుడూ ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళుతూ హైకమాండ్‌కు సూట్‌కేసులు మోస్తున్నారు’ అని జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి విమర్శించారు. శుక్రవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మంత్రి కె.జె.జార్జ్ కంటే ముందు సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వం సూట్‌కేస్‌ల ప్రభుత్వమని నేను చెప్పడం కాదు, ఏకంగా ఈ ప్రభుత్వంలో పనిచేసి ఇటీవలే మంత్రి పదవి పోగొట్టుకున్న శ్రీనివాస ప్రసాద్ అన్న మాటలివి. ప్రతి నెలా సిద్ధరామయ్య, కె.జె.జార్జ్‌లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌కు కప్పాలు కట్టి వస్తున్నారు’ అని మండిపడ్డారు. ఇక ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలోని నిజాయితీ పరులైన అధికారులకు రక్షణ ఇవ్వలేకపోతోందని విమర్శించారు. దళితురాలైన ఓ జిల్లాధికారికే (మైసూరు కలెక్టర్ శిఖా) ఈ ప్రభుత్వం రక్షణ ఇవ్వలేక పోయిందంటే, ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని కుమారస్వామి ప్రశ్నించారు. ఇక మైసూరు కలెక్టర్ శిఖాపై బెదిరింపులకు పాల్పడిన సీఎం సిద్ధరామయ్య ఆప్తుడు మరిగౌడపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం వస్తోందని కుమారస్వామి మండిపడ్డారు. -
ఇది వేధింపుల ప్రభుత్వం
సీఎం రాజీనామా చేయాలి: జేడీఎస్ కృష్ణరాజపుర: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట,న్యాయ వ్యవస్థలను తుంగలో తొక్కి వేధింపుల సర్కార్‌గా మారిందని జేడీఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు కారకులైనవారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నాయకులు సోమవారం కే.ఆర్.పురలోని బీబీఎంపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పార్టీ కే.ఆర్.పుర అధ్యక్షుడు ప్రకాశ్ మాట్లాడుతూ.... అధికారలు ఆత్మహత్యకు నైతిక భాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. రాక్షస పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు భూస్థాపితం చేసి జేడీఎస్‌కు అధికార పగ్గాలు అప్పగిస్తారన్నారు. దొడ్డబళ్లాపురం: మంగళూరు డీవైఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం ద్వంద్వ నీతిని పాటిస్తోందని తాలూకా బీజేపీ అధ్యక్షుడు నారాయణస్వామి మండిపడ్డారు. గణపతి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం తీరును ఖండిస్తూ, మంత్రి కేజే జార్జ్,హోం మంత్రి పరమేశ్వర్లను పదవుల నుంచి తొలగించాలని డిమాండుచేస్తూ తాలూకా, పట్టణ బీజేపీ కమిటీల నుండి సోమవారం ఇక్కడి తాలూకా కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నారాయణస్వామి మాట్లాడుతూ మంత్రి జార్జ్ ,పోలీసు ఉన్నతాధికారులు వేధించారని డీవైఎస్పీ గణపతి ఇచ్చిన ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారని, ఆ సాక్ష్యాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. జిల్లా బీజేపీ కమిటీ అధ్యక్షుడు నాగేశ్,పట్టణ బీజేపీ అధ్యక్షుడు రంగరాజు,సీనియర్ నేతలు హనుమంతరాయప్ప,జోనా మల్లికార్జున్,కౌన్సిలర్ వెంకటరాజు పాల్గొన్నారు. -
మండలి సభాపతి రేసులో హొరట్టి
బిల్లుల ఆమోదానికి సిద్ధరామయ్య ప్రణాళికలు జేడీఎస్‌తో జతకట్టడానికి వ్యూహం బెంగళూరు: జేడీఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత బసవరాజ్ హొరట్టిని శాసనమండలి అధ్యక్షుడిగా చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఇటీవల శాసనసభ నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికలతో పాటు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ సంఖ్యాబలం పెరిగింది. అయితే బిల్లుల పాస్ కావడానికి అవసరమైన సంఖ్యాబలం మాత్రం అధికార పక్షానికి లేదు. అందువల్లే అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన బీబీఎంపీ విభజనకు సంబంధించిన బిల్లు ఇప్పటికీ మండలి ఆమోదం పొందకుండా పెండింగ్‌లో ఉంది. సమస్య పరిష్కారం కోసం జేడీఎస్‌ను మచ్చిక చేసుకుని వారి సహకారంతో అన్ని రకాల బిల్లులు పాస్ చేయించుకోవాలని సిద్ధరామయ్య ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం జేడీఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఏడుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన బసవరాజ్ హొరట్టికి శాసనమండలి అధ్యక్షస్థానాన్ని కట్టబెట్టాలని సిద్ధరామయ్య నిర్ణయించినట్లు సమాచారం. అదే గనుక జరిగితే ప్రస్తుతం శాసనమండలిలో కాంగ్రెస్, జేడీఎస్‌ల సంయుక్త సంఖ్యా బలం నలభై మూడుకు చేరుకుంటుంది. ఇక ఖాళీగా ఉన్న మూడు నామినేటెడ్ ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తయితే సంయుక్త సంఖ్యాబలం 46కు చేరుతుంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ బిల్లు అయినా మండలి ఆమోదం పొందుతుందనేది సిద్దు వ్యూహం. ఇక ఈ విషయమై జేడీఎస్ పార్టీ నేతలను ఒప్పించే బాధ్యత బసవరాజ్ హొరట్టికి సీఎం సిద్ధరామయ్య అప్పగించినట్లు సమాచారం. అత్యంత ప్రతిష్టాత్మకమైన మండలి అధ్యక్ష పదవినికి తమ పార్టీ నేతకు ఇప్పించడానికి దళం నాయకులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సభాపతి డీ.హెచ్ శంకరమూర్తి త్వరలో తన పదవికి రాజీనామ చేయనున్నట్లు సమాచారం. -
ఒకే ఒక్కడు !
పట్టువీడని శ్రీనివాస్ ప్రసాద్ ‘సహాయ నిరాకరణ’కు వ్యూహం సిద్ధు రాజకీయ చతురతతో చల్లారిన అసమ్మతి అసంతృప్తుల సమావేశం వాయిదా బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ వల్ల అమాత్య పదవిని కోల్పోయిన ఆయన సీద్ధును సీఎం పీఠం నుంచి దింపడమే లక్ష్యంగా తన ప్రయత్నాలను కొనసాగిస్తూ అందులో భాగంగా అసంతృప్తులందరినీ ఒక వేదిక పైకి తీసుకురావడానికి విఫలయత్నం చేస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఆయనతో కలిసి రావడానికి నిరకరిస్తున్నారని తెలుస్తోంది. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ వల్ల కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రీనివాస్ ప్రసాద్‌తో పాటు ఖమరుల్ఇస్లాం, అంబరీష్‌లతో పాటు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుని ముఖభంగం ఎదురైన యశ్వంతపుర ఎమ్మెల్యే సోమశేఖర్ వంటి వారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. అయితే సీఎం సిద్ధరామయ్య తన రాజకీయ చాతుర్యంతో పాటు వివిధ రకాల మార్గాల ద్వారా అసంతృప్తుల ఆగ్రహాన్ని కొంత వరకూ చల్లార్చగలిగారు. దీంతో ఆదివారం బెంగళూరులో జరగాల్సిన ‘అసంతృప్తుల సమావేశం.’ వాయిదా పడింది!. అయితే సిద్ధుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న శ్రీనివాస ప్రసాద్ మాత్రం పట్టు వీడటం లేదు. అసంతృప్తులకు స్వయంగా ఫోన్ చేసి తమ పోరాటాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తాను హైకమాండ్‌తో మాట్లాడుతానని ఇందుకు హైకమాండ్‌లోని కొంతమంది మంది మద్దతు తనకు ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా శనివారం రాత్రి పొద్దుపోయాక కోరారు. అయితే ఇందుకు ఎస్.ఎం కృష్ణ అంగీకరించలేదని సమాచారం. అనవసర విషయాలపై దృష్టి సారించి హైకమాండ్ ఆగ్రహానికి గురికావద్దని సూచించారు. దీంతో తమకు అండగా నిలబడుతారని భావించిన ఎస్.ఎం కృష్ణ ఇలా వ్యాఖ్యానించారని తెలుసుకున్న కొంతమంది అసంతృప్తులు తమ నిరసన దిక్కార స్వరాన్ని తగ్గించేశారు. అయితే పట్టువీడని శ్రీనివాస్ ప్రసాద్ మాత్రం ఒకటి రెండు రోజుల్లో అందుబాటులో ఉన్న అసంతృప్తులతో బెంగళూరులో ఓ సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒక వేళ అసంతృప్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతే వచ్చే నెల 4 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో అసంతృప్త నాయకులతో కలిసి ‘సహాయ నిరాకరణ’ విధానాన్ని అవలంభించాలని శ్రీనివాస్ ప్రసాద్ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఆదివారం నాటికి అసంతృప్తుల ఆగ్రహావేశాలు చాలా వరకూ తగ్గిపోవడం, అసంతృప్తుల సమావేశం వాయిదా పండటంతో సిద్ధరామయ్య కొంతవరకూ ఊపిరి పీల్చుకున్నట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
అసంతృప్తి చల్లారేనా?
రాజీనామా గళాన్ని విప్పిన కొంతమంది అసంతృప్తులు సీఎం సిద్ధును పదవి నుంచి తప్పించాలంటున్న మరికొందరు అసంతృప్తిని చల్లార్చేందుకు ‘ఆస్కార్’ ప్రయత్నాలు బెంగళూరు: పాలనను పరుగులు పెట్టించేందుకు సీఎం సిద్ధరామయ్య చేసిన మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణపై నిరసన సెగలు ఇంకా చల్లారడం లేదు. ఇటీవల మంత్రి పదవులను పోగొట్టుకున్న వారితో పాటు ప్రక్షాళనలో చోటు దక్కని ఎమ్మెల్యేలు సైతం సీఎం సిద్ధరామయ్య పై నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. వీరంతా కలిసి సీఎంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మంత్రి పదవులను కోల్పోయిన అంబరీష్‌తో పాటు శ్రీనివాస ప్రసాద్, ఖమరుల్ ఇస్లామ్, బాబూరావ్ చించనసూర్తో పాటు మంత్రి మండలిలో స్థానాన్ని ఆశించి భంగపడిన మాలకరెడ్డి, ఎస్.టి.సోమశేఖర్ తదితరులు సీఎం సిద్ధరామయ్య పై గుర్రుగా ఉన్నారు. సీఎంను ఆ పదవి నుంచి తప్పిస్తే తప్ప వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. వీరంతా బెంగళూరులోని శ్రీనివాస ప్రసాద్ నివాసంలో బుధవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రెబల్‌స్టార్ అంబరీష్ ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, తాజా మాజీ మంత్రి బాబూరావ్ చించనసూర్ సైతం తన నియోజకవర్గంలోని కార్యకర్తలు ప్రజలతో చర్చించి రాజీనామా పై నిర్ణయం తీసుకుంటానని బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసమ్మతిని చల్లార్చే బాధ్యతలను అధిష్టానం పార్టీ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండజ్‌కు అప్పగించగా ఆయన బుధవారం మద్యాహ్నం తాజా మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ నివాసానికి చేరుకొని గంటపాటు చర్చించారు. ‘వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం, అందువల్ల మీ సమస్య ఏదైనా సరే దాన్ని పార్టీ వేదికలపై చర్చించండి తప్పితే బహిరంగ వ్యాఖ్యలు చేయకండి’ అని ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్రీనివాస ప్రసాద్‌తో పేర్కొన్నట్లు సమాచారం. అంతకుముందు అసంతృప్త ఎమ్మెల్యేలు, తాజా మాజీ మంత్రులతో చర్చల అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ....‘మంత్రి మండలి పునర్ వ్యస్థీకరణ సరిగా జరగలేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి మండలి పునర్వ్యవస్థీకరన జరిపారు. మంత్రి మండలి నుండి మమ్మల్ని తప్పించే సమయంలో ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం మాకు చాలా బాధ కలిగించింది. ఇప్పట్లో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసే ఆలోచన ఏదీ లేదు. కర్ణాటకను కాంగ్రెస్ ముక్త రాష్ట్రంగా కాంగ్రెస్ హైకమాండే మారుస్తుందేమో అనిపిస్తోంది. అయితే అందుకు అవకాశం కల్పించరాదనేదే మా అందరి అభిమతం’ అని పేర్కొన్నారు. -
ఐదేళ్లలో 9వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
బెంగళూరు: రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో 9వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఈమేరకు రాష్ట్రంలో మొట్టమొదటి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణ పనులను సిద్ధరామయ్య మంగళవారం యలహంకలోప్రారంభించారు. అనంతర మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కూడ్లగి, బళ్లారి, యరమరస్ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించనున్నుట్లు వెల్లడించారు. రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మంత్రి డీ.కే.శివకుమార్ మాట్లాడతూ....రాష్ట్ర ప్రజలకు విద్యుత్ కష్టాలను తీర్చడానికి,ముఖ్యంగా రైతులకు నిరంతర విద్యుత్‌ను అందించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం యలహంకలో 370మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పావగడలో 12వేల ఎరకాల్లో 2వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించడానికి ఏర్పాట్లు శరవేంగా సాగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100తాలూకాలలో 20మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడానికి ప్రమయత్నిస్తున్నామని తెలిపారు. -
ఆయనేమన్న హిట్లరా !
నేను కాలికి వేసుకునే చెప్పును కాదు సీఎం సిద్ధరామయ్యపై అంబి ఫైర్ రాజీనామా ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్న అంబరీష్ బెంగళూరు: ‘ఆయనకు (సీఎం సిద్ధరామయ్య) ఇష్టమొచ్చినట్లు మార్చేయడానికి నేను కాలికి వేసుకునే చెప్పును కాదు’ అంటూ రెబల్‌స్టార్, మాజీ మంత్రి అంబరీష్ సిద్ధరామయ్యపై మండిపడ్డారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు తనతో ఒక్క మాట చెప్పి ఉంటే తానే పదవి నుంచి తప్పుకొని ఉండే వాడినని అన్నారు. మంత్రి పదవికి అసమర్థుడినైతే, ఎమ్మెల్యేగా కూడా అసమర్థుడినేనని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. మంగళవారమిక్కడి ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా స్నేహితులు ఉన్నారు. ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఏ స్థానంలో కూడా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. అందుకే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాను వెనక్కు తీసుకోబోను’ అని అంబరీష్ స్పష్టం చేశారు. పరిషత్ సమావేశంలో అందరు మంత్రులను ఉద్దేశించి మాట్లాడారని, అంటే తామేమైనా హోల్‌సేల్‌లో కొనుగోలు చేసేందుకు ఉన్నవాళ్లమా? అని సిద్ధరామయ్యపై మండిపడ్డారు. ‘తనకు ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన (సిద్ధరామయ్య) హిట్లరో, డిక్టేటరో కాదు. సినీపరిశ్రమలో 40 ఏళ్లకు పైగా పనిచేశాను. మూడు సార్లు ఎంపీగా పనిచేశాను. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాను. నేను ఎప్పుడూ పదవుల కోసం లాబీయింగ్ జరపలేదు. అలాంటి పరిస్థితి నాకెప్పుడూ ఎదురుకాలేదు’ అని అంబరీష్ పేర్కొన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్‌తో కూడా తాను చర్చలు జరపబోనని అన్నారు. ఇక అంబరీష్ పదవిని కోల్పోవడం వెనక మాజీ ఎంపీ రమ్య హస్తం ఉందన్న వార్తలపై అంబరీష్ స్పందిస్తూ ‘పాపం ఆ అమ్మాయికి ఏం సంబంధం ఉంటుందయ్యా, తను కూడా నాలాగే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. ఈ విషయంలోకి ఆ అమ్మాయిని ఎందుకు లాగుతారు’ అంటూ సమాధానమిచ్చారు. ఇక అంబరీష్‌ను మంత్రి మండలి నుంచి తప్పించడంపై మండ్యలో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అభిమానులు మంగళవారమిక్కడి ఆయన నివాసంలో అంబరీష్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మహిళా అభిమానులు కన్నీరు పెట్టడంతో అంబరీష్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. -
‘కాకి’ అపశకునమేమీ కాదు !
‘కాకి పిల్ల’ కూర్చున్నందుకు కారు మార్చలేదు సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: ‘కాకి అపశకునాన్ని సూచించే పక్షి అని నేను భావించడం లేదు. నా కారును మార్చేందుకు కాకి కారణం కాదు. ఇప్పుడు ఉన్న కొత్త కారుపై ఎన్ని కాకులు వాలినా కారును మాత్రం మార్చబోను’ అంటూ సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిపర మఠాధిపతుల వేదిక ఆధ్వర్యంలో సోమవారమిక్కడి అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ చనిపోయిన వ్యక్తులకు మన పల్లెల్లో పిండప్రదానం చేస్తారు. ఆ పిండాలను కాకులు వచ్చి తిని వెళ్లిన తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు. అలాంటి పక్షిని అపశకునం అంటూ చెబుతున్నారు. మూఢాచారాలు, అసమానతలు ఉన్నప్పుడే కొన్ని వర్గాలు అజమాయిషీ చూపడం సాధ్యమవుతుంది. అందుకే కొన్ని మూఢాచారాలను ఇప్పటికీ అనేక మంది కొనసాగిస్తూ వస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మూడేళ్లుగా కారును వాడుతున్న నేపథ్యంలో ఆ కారును మార్చాల్సిందిగా రెండు నెలల క్రితమే అధికారులను ఆదేశించానని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అయితే అకస్మాత్తుగా ఆ కారుపై కాకి పిల్ల వాలిందని, అంత మాత్రానికే కాకి పిల్ల వాలడం వల్లే నేను కారు మార్చానని దుష్ర్పచారం చేశారని ఆరోపించారు. తాను ఇలాంటి వాటిని ఎప్పటికీ నమ్మనని, ఇప్పుడు కొన్న కారుపై నాలుగైదు కాకులు వాలినా ఆ కారును మార్చబోనని అన్నారు. అయితే ఇదే సందర్భంలో తాను నాస్తికుడిని కూడా కాదని, మూఢాచారాలను మాత్రం నమ్మబోనని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఆంజనేయ, రోషన్‌బేగ్, కె.జె.జార్జ్ , వివిధ మఠాల అధిపతులు పాల్గొన్నారు. -
కేబినెట్‌కు కొత్తకళ
యువతకు పెద్దపీట రాజ్‌భవన్‌లో అట్టహాసంగా వేడుక మంత్రులుగా 13 మంది ప్రమాణం స్వీకారం ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ 9 మందికి క్యాబినెట్ హోదా బెంగళూరు : రాష్ట్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆదివారం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తొమ్మిది మందికి క్యాబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు అధిష్టానం శనివారం మధ్యాహ్నం గ్రీన్ సిగ్నల్ పడిన విషయం తెల్సిందే. దీంతో మంత్రి మండలిలోకి తీసుకునే వారికి ఢిల్లీ నుంచే సమాచారం అందించారు. సీఎం సిద్ధరామయ్య సూచన మేరకు ఆదివారం ఉదయమే బెంగళూరు చేరుకున్న వారంతా సాయంత్రం మూడున్నరలోపు తమ కుటంబ సభ్యులు, అనుచరులతో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం సరిగ్గా నాలుగు గంటలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ వ జుభాయ్రుడాభావ్వాలాలు రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్ వేదిక పైకి చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ జాదవ్ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా అనుమతి పొంది మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గవ ర్నర్ వజుభాయ్ రుడాభాయివాలా క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులు దక్కించుకున్న తొమ్మిది మందిలో మొదట కాగోడు తిమ్మప్ప, రమేష్‌కుమార్, బసవరాజరాయరెడ్డి, తన్వీర్‌సేఠ్, హెచ్.వై మేటితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎస్.ఎస్ మల్లికార్జున, శాసనమండలి సభ్యుడు ఎం.ఆర్ సీతారాం, సంతోష్‌లాడ్, రమేష్జారకిహోళిల మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. చివరిగా ప్రియాంక్‌ఖర్గే, రుద్రప్పలమాణి, ప్రమోద్ మద్వరాజ్, ఈశ్వర్ఖండ్రేలు మంత్రులుగా దేవుడి పేరుమీద ప్రమాణ చేశారు. మొత్తం అరగంటలోపు ముగిసిన ఈ ప్రమాణస్వీకారానికి దాదాపు వెయ్యిమంది హాజరయ్యారు. రాజ్‌భవన్ బయట కూడా భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రసారం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగలడంతో రాష్ట్ర హోంశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. కాగా, నూతన మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో మంత్రి మండలిలో స్థానం పొం దిన 13 మందితో పాటు మిగిలిన మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కష్టపడి పనిచేసి పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నూతనంగా అమాత్య పదవులు దక్కించుకున్నవారికి దిశా నిర్దేశం చేశారు. అంతేకాకుండా వచ్చేనెల 4 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో నూతన మంత్రులకు సహకారం అందించాలని మిగిలిన మంత్రులకు సిద్ధరామయ్య సూచించారు. యువతకు పెద్దపీట.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో యువతకు పెద్దపీట వేశారు. నూతనంగా తమ మంత్రిమండలిలోకి తీసుకున్న 13 మందిలో ఆరుగురు నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య ఉన్నవారే. వీరిలో అత్యంత పిన్నవయస్కుడు ఎమ్మెల్యే సంతోష్‌లాడ్ కాగా కురువృద్ధుడు కాగోడు తిమ్మప్పకు ప్రస్తుతం 82 ఏళ్లు. ఇదిలా ఉండగా నూతనంగా మంత్రి మండలిలోకి తీసుకున్న వారిలో ఐదుగురు గతంలో వివిధ మంత్రి పదవులు పొందగా మొదటిసారి మంత్రి పదవులు లభించిన వారు ఎనిమిది మంది. మొదటిసారి మంత్రి పదవులు దక్కించుకున్నవారిలో అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన కే.ఆర్ రమేశ్‌కుమార్‌తో పాటు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రియాంక ఖర్గే, ప్రమోద్ మధ్వరాజ్లు కూడా ఉన్నారు. 14 మందిని తొలగించడానికి గవర్నర్ అనుమతి మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుత మంత్రిమండలి నుంచి 14 మందిని తొలగించడానికి వీలుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించిన పేర్లకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ఆదివారం మధ్యాహ్నం పచ్చజండా ఊపారు. దీంతో శ్యామనూరు శివశంకరప్ప (ఉద్యానశాఖ), వీ.శ్రీనివాసప్రసాద్ (రెవెన్యూశాఖ), వినయ్‌కుమార్ సూరకే (పట్టణాభివృద్ధిశాఖ), సతీష్జారకి హోళి (లఘుపరిశ్రమలశాఖ), బాబురావ్చించనసూర్(జౌళిశాఖ),శివకుమార్తంగడి(చిన్ననీటిపారుదళశాఖ), ఎస్.ఆర్ పాటిల్ (ఐటీ,బీటీ శాఖ), మనోహర్ తాహశీల్దార్ (అబ్కారీశాఖ), అభయ్‌చంద్రజైన్ (యువజన,క్రీడలశాఖ), దినేష్ గుండూరావ్ (పౌరసరఫరాలశాఖ), ఖమరుల్ ఇస్లాం (మైనారిటీసంక్షేమ), కిమ్మెన రత్నాకర్ (ప్రాథమిక విద్యాశాఖ),పరమేశ్వర్న ాయక్ (కార్మికశాఖ), అంబరీష్ (గృహ నిర్మాణ శాఖ)లు మంత్రి మండలి నుంచి స్థానాలు కోల్పోయారు. ఇందులో అంబరీష్ పేరు చివరి క్షణంలో చేర్చినట్లు సమాచారం. ఈ జిల్లాలకు మంత్రి భాగ్య లేదు మంత్రి మండలి పున ర్వ్యవస్థీకరణ తర్వాత ఎనిమిది జిల్లాలకు చెందిన శాసనసభ్యులకు మంత్రి మండలిలో స్థానం దక్కలేదు. మంత్రి భాగ్యం దొరకని జిల్లాల జాబితాలో రాయచూరు, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరు, కొడగు, బళ్లారి, బెంగళూరు గ్రామాంతర, మండ్య, యాదగిరిలు చేరాయి. -
ఎవరిని తప్పించాలి ?
హస్తినకు మారిన రాజకీయాలు డిగ్గి, అహ్మద్ పటేల్‌తో ముగిసిన చర్చలు నేడు సోనియా, రాహుల్‌తో భేటీ కానున్న సీఎం సిద్ధు అదే రోజు స్పష్టత ఇవ్వనున్న అధిష్టానం మేడం ప్రసన్నం కోసం ఢిల్లీలో అమాత్యుల పాట్లు బెంగళూరులో చకచకా పునర్ వ్యవస్థీకరణ ఏర్పాట్లు బెంగళూరు : మంత్రి వర్గ ‘విస్తరణ’ అమాత్యుల్లో గుబులు రేపుతోంది. ఎక్కడ వేటు పడుతుందోనని మంత్రులు ఢిల్లీలో మేడం ప్రసన్నం కోసం పాట్లు పడుతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు హస్తినకు చేరుకున్నాయి. మంత్రి మండలి పునఃరచన కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లగా మండలిలో తమ స్థానాలు కాపోడుకోవడానికి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన అమాత్యులు హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు ఎట్టకేలకు ముహుర్తం కుదరబోతున్న విషయం తెలిసిందే. ఈ ముహుర్తాన్ని ఖరారు చేసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. తొలుత పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో కూడా చర్చించారు. మరొసారి నేడు (శుక్రవారం) ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యి మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవుల న ుంచి తప్పించాల్సిన వారి వివరాలతో పాటు వారిని ఎందుకు తప్పించాల్సి వస్తోందో చివరిసారిగా వివరించనున్నారు. అంతేకాకుండా రానున్న శాసనసభ ఎన్నికలతో పాటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వర్గాలకు చెందిన వారికి పదవుల్లో ప్రాధాన్యత కల్పించడానికి వీలుగా ఎవరెవరికీ మంత్రి పదవులు ఇవ్వాలన్న విషయాన్ని కూడా అధినాయకత్వానికి సిద్ధరామయ్య వివ రించనున్నారు. తద్వారా మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి అన్ని పనులను పూర్తి చేయనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే శుక్రవారం సాయంత్రానికి పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవులు కోల్పోయేవారి విషయంపై స్పష్టతరానుంది. అదేవిధంగా శనివారం రోజు మంత్రి పదవులను దక్కించుకున్న వారు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు ఇప్పటికే గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాతో అపాయింట్మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంత్రి పదవులను ఆశిస్తున్నవారితో పాటు మంత్రి పదవులు కోల్పోకూడదని గట్టి పట్టుదలతో ఉన్న నాయకులు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని లాబీయింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రి పదవులు దక్కించుకునే వారిలో రాజ అలగూరు (నాగఠాన ఎమ్మెల్యే), హరీష్ (శాంతినగర), రుద్రప్ప లమాణి (హావేరి), ఎస్.టీ సోమశేఖర్ (యశ్వంత్‌పుర), కోలివాడ (రాణిబెన్నూరు), మాలకరెడ్డి (యాదగిరి), కాగోడు తిమ్మప్ప (సాగర), రమేష్‌కుమార్ (శ్రీనివాసపుర), బసవరాజరాయరెడ్డి (యలబుర్గి), ప్రమోద్ మధ్వరాజ్ (ఉడిపి), ప్రియాంక్ ఖర్గే (చిత్తాపుర), సుధాకర్ (హిరియూరు), కే.సుధాకర్ (చిక్కబళాపుర), మోటమ్మ (ఎమ్మెల్సీ)లు ముంద వరుసలో ఉన్నారు. ఇదిలా ఉండగా మంత్రి మండలి నుంచి తప్పించే వారి పేర్లతో కూడిన జాబితా ఇప్పటికే హైకమాండ్‌కు చేరింది. ఇందులో వారిని తొలగించడానికి గల కారణాలు కూడా వివరించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జౌళిశాఖ మంత్రి బాబురావ్ చించన్సూరి, కార్మికశాఖ మంత్రి పరమేశ్వర్‌నాయక్, మైనారిటీ సంక్షేమశాఖమంత్రి ఖమరుల్ఇస్లాంపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీరిని మంత్రి మండలి నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇక ఉద్యానశాఖ మంత్రి శామనూరు శివశంకరప్ప, రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్‌లు అనారోగ్యం వల్ల సరిగా విధులు నిర్వర్తించడం లేదని సమాచారం. ఇక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వినయ్కుమార్సూరకే, యువజన, క్రీడలశాఖ మంత్రి అభయ్ చంద్రజైన, విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉమాశ్రీలు ఆశించిన స్థాయిలో విధులు నిర్వర్తించడం లేదని సిద్ధరామయ్య భావిస్తున్నారు. దీంతో వీరిని మంత్రి మండలి నుంచి సాగనంపాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు పౌరసఫరాలశాఖ మంత్రి దినేష్ గుండూరావ్ను జాతీయ రాజకీయాల్లోకి పంపించాలని హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ఒకరికి ఒకటే పదవి అన్న కాంగ్రెస్ పార్టీ పాలసీ నేపథ్యంలో ఆయన్ను కూడా మంత్రి మండలి నుంచి తప్పించే అవకాశం ఉంది. ఇక ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్, వ్యవసాయశాఖ మంత్రి కృష్ణభైరేగౌడతో పాటు ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్‌లో ఒకరికి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఉండటంతో వీరిలో ఒకరిని మంత్రి మండలి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సీఎం స్నేహితుడిని విచారించిన ఏసీబీ
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్నేహితుడు గిరీష్‌చంద్ర వర్మాను బుధవారం అవినీతి నిరోదక దళం (ఏసీబీ) అధికారులు విచారించారు. అత్యంత ఖరీదైన హొబ్లోట్ వాచ్‌ను గిరీష్‌చంద్ర వర్మా తనకు బహుమతిగా ఇచ్చినట్లు సీఎం సిద్ధరామయ్య స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. అంత ఖరీదైన వాచ్ ఇవ్వాల్సిన అవసరం ఏమెచ్చిందని?, ఆ వాచ్ దొంగలించి సీఎం సిద్ధుకు ఇచ్చారని.. ఇలా ఫిర్యాదలు ఏసీబీలో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో గిరీష్ చంద్రవర్మాను ఏసీబీ పోలీసులు తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు. -
త్యాగాలు చేయాలి
ఏ క్షణంలోనైనా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ మూడేళ్లు పనిచేసినందుకు ధన్యవాదాలు మంత్రుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య బెంగళూరు:మంత్రివర్గ ప్రక్షాళనపై సీఎం సిద్ధరామయ్య స్పష్టమైన సందేశాన్ని అందించారు. ‘మూడేళ్లు మంత్రులుగా పనిచేసినందుకు మీకు ధన్యవాదాలు. హై కమాండ్ ఆదేశాలను అనుసరించి రాబోయే శాసనసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే తయారు కావాలి. ఇందు కోసం ఏ క్షణంలోనైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. మీరు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. మంత్రి వర్గంనుంచి తొలగింపునకు గురయ్యేవారు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలి.’ అని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో చాలా ఏళ్ల తర్వాత 2013న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికార వ్యవధి మరో రెండేళ్లలో ముగియనున్నా ఇప్పటికీ చాలా మందికి సరైన పదవులు దక్కలేదని హస్తం నాయకులే పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని హై కమాండ్ నిర్ధారణకు వచ్చింది. దీంతో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రిమండలి వ్యవస్థీకరణకు పచ్చజండా ఊపాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం బుధవారం విధానసౌధలో మంత్రి పరిషత్‌ను ఏర్పాటు చేశారు. మొదట మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసిఅభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. అటుపై అధికారులందరినీ బయటికి పంపించి మంత్రులతో మాత్రం ప్రత్యేకంగా సమావేశమై మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ ఆవశ్యకతను వివరించినట్లు సమాచారం. మంత్రి మండలి ప్రక్షాళనలో తన పాత్ర ఏమీ లేదని, అంతా హై కమాండ్ నిర్ణయం మేరకు జరుగుతోందని సిద్ధరామయ్య మంత్రులకు తెలిపారు. ఇప్పటికే మంత్రులందరి పనితీరుకు సంబంధించి హై కమాండ్‌కు నివేదిక వెళ్లిందన్నారు. అందువల్ల ఎవరెవరిని మంత్రి మండలి నుంచి తొలగించాలన్న విషయంపై హై కమాండ్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మంత్రి మండలి నుంచి తొలగించిన వారికి పార్టీలో మంచి పదవులు దక్కుతాయని, రానున్న ఎన్నికల్లోపు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. అటుపై మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణపై అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా సిద్ధరామయ్య మంత్రులకు సూచించారు. ఇందుకు 11 మంది మంత్రులు మాత్రమే తమ సమ్మతిని తెలియజేయగా మిగిలిన వారు ‘ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ వల్ల అసమ్మతి పెరిగి పార్టీ పటిష్టత దెబ్బతింటుందని, అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడుతాం.’ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంత్రి పరిషత్‌లో వెల్లడైన అభిప్రాయలతో కూడిన నివేదికతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌తో కలిసి గురువారం ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యి ప్రక్షాళనకు తుది అనుమతి పొందనున్నారు. దీంతో మరో మూడు రోజుల్లో మంత్రి వర్గంలో ఉండేది ఎవరూ, తొలగించబడేది ఎవరనే విషయం తేలిపోనుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలోని మరోవర్గం నాయకులు మాత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈనెల 17 వరకూ మాత్రమే ఢిల్లీలో ఉంటారని, అటుపై పదిహేను రోజుల పాటు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారని చెబుతున్నారు. దీంతో ఈసారి కూడా మంత్రి వర్గ వ్యవస్థీకరణ వాయిదాపడే అవకాశం ఉందనేది వారి భావన. ఏది ఏమైనా మంత్రి మండలి ప్రక్షాళనలో భాగంగా మంత్రి మండలిలో స్థానాలను ఆశిస్తున్న వారిలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప, బసవరాజరాయరెడ్డి, రిజ్వాన్ అర్షద్, మాలికయ్య గుత్తేదార్లు ముందువరుసలో ఉన్నారు. -
సిద్ధు కాన్వాయ్‌లో కొత్త కారు
‘కాకిపిల్ల’ కూర్చున్నందుకే వాహనాన్ని మార్చారా!. బెంగళూరు: మూఢ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు తానే అలాంటి విశ్వాసానికి తలొగ్గారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం కాన్వాయ్‌లోని కారును మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. సీఎం కాన్వాయ్‌లో సీఎం ప్రయాణించే వాహనాన్ని మూడేళ్లకే మార్చేశారు. కోరమంగళ రీజనల్ ఆర్టీఓ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ పొందిన సరికొత్త ఫార్చునార్ కారు సీఎం కాన్వాయ్‌లో శనివారం చేరింది. అయితే మూడేళ్ల వ్యవధికే కారును ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న విషయంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. కారును మార్చేందుకు ఎలాంటి సాంకేతిక సమస్య కారణం కాదని తెలుస్తోంది. కాన్వాయ్‌లోని సీఎం ప్రయాణించే కారుపై గత వారంలో ఓ కాకిపిల్ల కూర్చొని కాసేపు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ విషయంపై విస్తృత చర్చ జరిగింది. వాహనంపై కాకిపిల్ల వాలడం ఏదో సమస్య తలెత్తనుందనే సంకేతాన్ని అందజేస్తోందంటూ జ్యోతిషులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాకిపిల్ల వాలడాన్ని అపశకునంగా భావించిన సీఎం సిద్ధరామయ్య ఆ వాహనం స్థానంలో కొత్త కారును చేర్చారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాను మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తానని పదే పదే చెప్పుకునే సీఎం సిద్ధరామయ్య కాకిపిల్ల కూర్చుందన్న కారణంతోనే కారు మార్చడమేమిటనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. -
మహిళలకు వెన్నుదన్ను
మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక మహిళా పార్క్ సదస్సులో సీఎం సిద్ధరామయ్య వెల్లడి బెంగళూరు: మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ, సహకారాలు అందజేసేందుకు తమ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఇందులో భాగంగానే మహిళల కోసమే ప్రత్యేక పారిశ్రామిక కేంద్రాలను ‘మహిళా పార్క్’ పేరిట ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాక రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక కేంద్రాల్లో మహిళా పారిశ్రామిక వేత్తలకు 5శాతం ప్రాంతాన్ని తప్పనిసరిగా కేటాయించాల్సిందిగా నిబంధనలు రూపొందించినట్లు పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్లో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సును సీఎం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా పారిశ్రామిక వేత్తల్లో 51.9శాతం మంది కర్ణాటక వారే కావడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. మైసూరు జిల్లాలోని హారోహళ్లి వద్ద మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో ఓ పారిశ్రామిక వాడను, హుబ్లీ-ధార్వాడ ప్రాంతంలో మరో పారిశ్రామిక వాడను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ రెండు పారిశ్రామిక వాడలను ‘మహిళా పార్క్’ పేరిట కేవలం మహిళా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సమాజంలో లింగ వివక్ష, అసమానతలను నివారించేందుకు స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలపాలని సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ఏదైనా సమస్యలు తలెత్తితే తనను నేరుగా సంప్రదించవచ్చని సిద్ధరామయ్య సూచించారు. అనంతరం ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా నిలిచిన మహిళలను సిద్ధరామయ్య సన్మానించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న రత్నప్రభను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని మహిళా పారిశ్రామిక వేత్తలు సీఎంకు విన్నవించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రత్నప్రభ తదితరులు పాల్గొన్నారు. -
కీలక నిర్ణయాలు
వచ్చేనెల 4నుంచి శాసనసభ సమావేశాలు కర్ణాటక ఆఫర్డబుల్ హౌసింగ్ పాలసీ అమలుకు ఆమోదం నగరోత్తన పథకం కింద రూ.7,300 కోట్లు వ్యయం మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం వివరాలు వెల్లడించిన మంత్రి జయచంద్ర బెంగళూరు: వచ్చే నెల 4 నుంచి 29 వరకూ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రీటైల్ ట్రేడ్ పాలసీ-2015 అమలుకు కూడా మంత్రి మండలి పచ్చజండా ఊపింది. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను న్యాయశాఖమంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వెల్లడించారు. ⇒నూతనంగా అమల్లోకి వచ్చే రీటైల్ ట్రేడ్ పాలసీ వల్ల ఆ రంగంలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా రీటైల్ సంస్థల పనివేళలతో పాటు , కార్మిక చట్టాల్లో కూడా మార్పులు రానున్నాయి. ⇒రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సొంతింటి కలను నిజం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర నుంచి ఆర్థిక సహకారం అందుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కర్ణాటక ఆఫర్డబుల్ హౌసింగ్ పాలసీ అమలుకు మంత్రి మండలి పచ్చజండా ఊపింది. ⇒ నగరోత్తన పథకం కింద 2016-17,2017-18 ఏళ్లల్లో బెంగళూరులో వివిధ అభివృద్ధి పథకాల కోసం రూ.7,300 కోట్లు ఖర్చు చేయడానికి అంగీకారం. ⇒బళ్లారి, రాయచూర్, కొప్పళ జిల్లాల్లో తాగునీటి సరఫరాకు రూ.432.55 కోట్లు విడుదల. ⇒తుమకూరు నుంచి శిర మీదుగా దావణగెరె వరకూ రైల్వే లైన్ల పనుల కోసం అవసరమై 235 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం రూ.1,801 కోట్ల నిధులు విడుదలకు మంత్రి మండలి అంగీకారం. ⇒{పస్తుత ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అరవింద్ జాదవ్ ఈనెల 30న రిటైర్డ్ అవుతున్న నేపథ్యంలో నూతన ముఖ్యకార్యదర్శి ఎంపిక విషయాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కట్టబెడుతూ మంత్రి మండలి ఏకగ్రీవ నిర్ణయం. కాగా, ముఖ్యకారదర్శి రేసులో సీనియారిటీను అనుసరించి వరుసగా ఉపేంద్ర త్రిపాఠి, సుభాష్‌చంద్ర, రత్నప్రభ, ఎస్.కే పట్నాయక్‌లు ఉన్నారు. వీరందిరిలో ఏడాది తొమ్మిది నెలల సర్వీసు కలిగిన రత్నప్రభను ముఖ్యకార్యదర్శిగా ఎంపికచేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ⇒పౌరసరఫరాల శాఖ రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే బియ్యం, రాగులు తదితర ఆహార పదార్థాలను చట్టవిరుద్ధంగా పొందడం కాని, నిల్వ చేయడం కాని చేసిన వారి వివరాలు చెప్పిన వారికి రూ.200 బహుమతి ఇవ్వడానికి అంగీకారం. -
పాలన పల్లెలకు చేరాలి
రాజధానికే పరిమితం కారాదు కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను నిర్మూలించండి జిల్లా ఇన్చార్జ్ కార్యదర్శులకు సీఎం సూచన బెంగళూరు: జిల్లాల ఇన్చార్జ్ కార్యదర్శులు రాజధానిలోని కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణుల చెంతకు సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేసే దిశగా పనిచేయాలని సీఎం సిద్ధరామయ్య సూచించారు. జిల్లా స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికారుల పనితీరును పర్యవేక్షించినప్పుడే అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారమిక్కడి విధానసౌధలో జిల్లాల ఇన్చార్జ్ కార్యదర్శుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ‘కలెక్టర్లు, జిల్లా సీఈఓలుగా పనిచేసిన అనుభవం ఉందన్న కారణంతోనే మిమ్మల్ని జిల్లా ఇన్చార్జ్ కార్యదర్శులుగా నియమించాము. మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి సారించండి. తద్వారా పాలన వేగవంతం కావడంతో పాటు పాలనా వ్యవహరాల్లో మరింత పారదర్శకతను తీసుకురావచ్చు’ అని సూచించారు. ఇక ఇదే సందర్భంలో ప్రతి నెలా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. సరిగ్గా విధులు నిర్వర్తించని ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలని, అప్పుడే ఇతర ఉద్యోగుల్లోనూ భయం వస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ‘దళారుల’ ప్రాబల్యం పెరిగిపోతోందని ఆరోపణలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయని, అందులోనూ తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల్లో ఇది మరింత విస్తరించిందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయాల్లో దళారులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయండి..... మైసూరు మహారాణి కాలేజీ హాస్టల్లోని విద్యార్థినుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ పురుషోత్తమ్‌ను తక్షణమే సస్పెండ్‌చేయాలని ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి భరత్‌లాల్ మీనాను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. ‘ఇటీవల నేను మైసూరులో పర్యటించినపుడు మైసూరు మహారాణి కాలేజీ హాస్టల్లోని ఓ విద్యార్థిని తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి కన్నీరు పెట్టుకుంది. అక్కడ నెలకొన్న అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయండి. మూడేళ్లలో అతను విద్యార్థినుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని రికవరీ చేసి తిరిగి విద్యార్థినులకు అందజేయండి’ అని అధికారులను ఆదేశించారు. -
చూస్తూ ఊరుకోం
పోలీసులకు సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక సామూహిక సెలవు అల్టిమేటంపై ఆగ్రహం పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం బెంగళూరు : నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు నిరసనకు దిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. వేతన పెంపుతో పాటు మరిన్ని డిమాండ్ల సాధన కోసం జూన్ 4న సామూహిక సెలవులపై వెళ్లనున్నట్లు రాష్ట్ర పోలీసు ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌తోపాటు పలువురు రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అత్యవసర సమీక్ష సమావేశం జరిపారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... హోంశాఖలోని కింది స్థాయి సిబ్బంది కొన్ని ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమన్నారు. వాటిని పరిష్కరించడం కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈలోపు పోలీసు సిబ్బంది నిరసనకు దిగితే కఠిన చర్యలు తప్పవని సీఎం సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. -
వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి
బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తన కష్టాలు చెప్పుకోవడానికి జనతా దర్శన్ కార్యక్రమానికి వచ్చిన దళిత మహిళను అకారణంగా దూషించి, అక్రమంగా రిమాండ్ హోంలో ఉంచిన పోలీసులు, ఘటనకు కారణమైన సీఎం కార్యాలయ సిబ్బందిపై మూడు రోజుల్లోపు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి ముందు ధర్నా చేపడుతానని హెచ్చరించారు. జనతాదర్శన్‌లో భాగంగా ఈనెల 17న సీఎంను కలవడానికి వచ్చిన దళిత మహిళ సవిత సీఎం కార్యాలయ సిబ్బంది, పోలీసులు అమర్యాదగా నడుచుకోవడమే కాకుండా ఆమె భర్తను మానసికంగా హింసించిన విషయంపై మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత మహిళతో కలిసి కుమారస్వామి విధాన సౌధలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటి హక్కుపత్రాలను తనకు ఇప్పించాలని సీఎంను వేడుకోవడానికి మాత్రమే సవిత ఈనెల 17న సీఎం క్యాంపు కార్యాలయం అటుపై ఆయన నివాసం కృష్ణ వద్దకు వెళ్లిందన్నారు. అయితే అనుమానాస్పదంగా తిరుగుతోందన్న కారణంతో పోలీసులకు అప్పగించామని సీఎం కార్యాలయ సిబ్బంది చెబుతుండగా నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ మాత్రం సవిత విషం తీసుకోవడానికి సిద్ధపడటంతో ఆమెను అరెస్టు చేశామని చెబుతున్నారన్నారు. అంతే కాకుండా అదే రోజు సవితను రిమాండ్ హోంకు పంపించడమే కాకుండా ఒక రోజంతా ఆమెను అక్కడే ఉంచారన్నారు. ఆమెను విడిపించడానికి వచ్చిన భర్తను కూడా పోలీసులు దూషించారన్నారు. ఈ విషయమై దర్యాప్తు చేసి ఘటనకు కారణమైన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి ముందు ధర్నాకు దిగుతానని కుమారస్వామి పునరుద్ఘాటించారు. ఈ విషయంపై ప్రతిస్పందించిన సీఎం సిద్ధరామయ్య ఈ విషయమై అధికారులతో మాట్లాడి బాధిత మహిళకు న్యాయం చేకూర్చడమే కాకుండా సీఎం కార్యాలయ సిబ్బంది తప్పు ఉంటే వారిపై కఠిన చర్యలు చేపడుతామన్నారు. అయితే ఈ విషయంలో కుమారస్వామి అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని ఈ సందర్భంగా సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. కాగా, సవిత వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 26న స్వయంగా మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఆ పనిచేయడానికి భర్త, పిల్లలతో వస్తారా: సవిత విధానసౌధలో జరిగిన మీడియా సమావేశంలో సవిత గద్గద స్వరంతో తనపట్ల పోలీసులు, సీఎం కార్యాలయ సిబ్బంది ప్రవర్తించిన తీరును వివరించారు. ‘నివాసం ఉంటున్న ఇళ్లకు సంబంధించిన హక్కు పత్రం కోసం అనేక ప్రభుత్వ కార్యాలయాలతోపాటు గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్‌ను కూడా కలిసి విన్నవించాను. అయినా ఫలితం కనబడలేదు. దీంతో సీఎంను కలవడానకి నా భర్తతో పాటు పిల్లలను తీసుకుని ఈనెల 17న వెళ్లాను. అయితే అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నానని నన్ను సీఎంతో భేటీ కావడానికి పంపించలేదు. నాతో పాటు వచ్చిన వారందరినీ లోనికి పంపించారు. ఈ విషయమై అక్కడి ఉన్న సిబ్బందిని అడిగినందుకు పోలీసులకు చెప్పి మొదట పోలీస్‌స్టేషన్‌కు అటుపై రిమాండ్ హోంకు పంపించారు. వేశ్యవృత్తి చేయడానికి ఎవరైనా పిల్లలు, భర్తతో కలిసి వస్తారా? పోలీస్స్టేషన్లోనూ రిమాండ్ హోంలోనూ నన్ను సూటి పోటీ మాటలతో అవమానించారు. నన్ను విడిపించడానికి వచ్చిన నా భర్తను కూడా పోలీసులు బెదిరించారు.’ అని సవిత వాపోయారు. -
జాప్యం... సహించం
నగర పర్యటనలో అధికారులపై సీఎం ఫైర్ పరివారంతో ప్రత్యేక బస్సులో సిటీ రౌండ్స్ వర్షాకాలం ప్రారంభానికి ముందే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు నిర్లక్ష్య అధికారిపై వేటు బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికల సమయంలో వారానికోసారి సిటీ రౌండ్స్ నిర్వహించిన సీఎం సిద్ధరామయ్య ఆరు నెలల తర్వాత మంగళవారం నగరంలో పర్యటించారు. బెంగళూరులోని ఆనందరావ్ సర్కిల్, విఠల్ మాల్యారోడ్, మడివాళ మార్కెట్, హెచ్ఎస్ఆర్ లేఔవుట్ తదితర ప్రాంతాల్లో మంత్రులు, అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడాన్ని గుర్తించి అధికారులపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని తానెంతమాత్రం సహించబోనంటూ హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అసంపూర్తిగా ఉన్న పనులన్నింటిని పూర్తి చేయాలని సీఎం సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణా నుంచి మంత్రులు రామలింగారెడ్డి, దినేష్ గుండూరావ్, కె.జె.జార్జ్, బీబీఎంపీ, బీడీఏ, బీడబ్ల్యూఎస్ఎస్బీ విభాగాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో సీఎం సిద్ధరామయ్య బయలుదేరారు. ఆనందరావ్ సర్కిల్ వద్ద జరుగుతున్న అండర్‌పాస్ పనులను సమీక్షించారు. పనులు ఎప్పట్లో పూర్తవుతాయి, ఇప్పటి వరకు ఎంత మేరకు నిధులను వెచ్చించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విఠల్మాల్యా రోడ్లో చేపట్టిన ‘టెండర్ షూర్’ పనులను సీఎం పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా మడివాళ మార్కెట్‌కు సమీపంలో జరుగుతున్న రోడ్డు పనులను సిద్ధరామయ్య పరిశీలించారు. ఈ రోడ్డును రూ.4.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఇప్పటికే 90 శాతం మేర పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇదే సందర్భంలో మడివాళ మార్కెట్లోని వ్యాపారులతో సిద్ధరామయ్య నేరుగా మాట్లాడారు. వ్యాపారుల జీవన స్థితి గతులు, మార్కెట్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు తదితర అంశాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఇక మార్కెట్ కోసం కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు చేసుకోవాలని, ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు పాదచారులకు సైతం సమస్యలు ఎదురవుతాయని సీఎం సూచించడంతో వ్యాపారులు ఇందుకు అంగీకరించారు. మార్కెట్ పక్కన చెత్త కుప్పలు, కుప్పలుగా పడి ఉండడాన్ని గమనించిన సిద్ధరామయ్య అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. చెత్తను తక్షణమే తొలగించాలని, మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి సీఎం సిద్దరామయ్య నేరుగా జువైనల్ హోమ్‌కు చేరుకున్న సీఎం సిద్ధరామయ్య అక్కడి బాల నేరస్తులతో మాట్లాడారు. ఈ జువైనల్ హోంలో ఆశ్రయం పొందుతున్న 43 మంది బాలలతో అక్కడి వసతుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ....జువైనల్ హోమ్‌లోని పరిస్థితులు బాల నేరస్తులను తిరిగి మంచి వారిగా పరివర్తన తీసుకొచ్చే విధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇదే సందర్భంలో బాలనేరస్తులతో మాట్లాడారు. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత మంచి పౌరులుగా మారండంటూ వారికి సూచించారు. అన ంతరం వారితో భవిష్యత్తులో దొంగతనాలు, హత్యలు వంటి నేరాలన్నింటికి దూరంగా ఉంటామని, ఉత్తమ పౌరులుగా మెలుగుతామని ప్రతిజ్ఞ చేయించారు. నిర్లక్ష్యం వహించిన చీఫ్ ఇంజనీర్ సస్పెన్షన్... హెచ్ఎస్ఆర్ లేఔట్లో డ్రెయినేజీ పనులను పూర్తి చేయడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీడబ్ల్యూఎస్ఎస్బీ చీఫ్ ఇంజనీర్ రుద్రమూర్తిని సీఎం సిద్ధరామయ్య సస్పెండ్ చేశారు. గత నాలుగేళ్లుగా హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఈ డ్రెయినేజీ పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తుండటంపై ఆరోపణలు రావడంతో సిటీ రౌండ్స్‌లో భాగంగా ఈ పనులను సీఎం పరిశీలించారు. ఎలాంటి కారణం లేకుండా పనులను వాయిదా వేస్తూ వస్తున్నారంటూ రుద్రమూర్తిని సీఎం సిద్ధరామయ్య సస్పెండ్ చేశారు. -
మంత్రుల గుండెల్లో రైళ్లు
పనిచేయనివారికి ఉద్వాసన యువ ఎమ్మెల్యేలకు పదవులు త్వరలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సిద్ధు యోచన 21న ఢిల్లీకి సీఎం బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ అమాత్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ పర్యటన తర్వాత మంత్రి వర్గ విస్తరణతో పాటు పునర్వ్యవస్థీకరణ కూడా ఉండబోతోందన్న సమాచారంతో వారికి కునుకు పట్టడం లేదు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకె ళ్లడంలో విఫలమైన వారిని మంత్రి వర్గం నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య ఇటీవల బెంగళూరులో మాట్లాడుతూ త్వరలో ‘మంత్రి వర్గ పునర్వవస్థీకరణ, విస్తరణ’ ఉంటుంది. అని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయంపై సీనియర్ మంత్రుల్లో భయం నెలకొంది. ఈ నెలలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లినా ఎన్నికల హడావుడిలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువరాజు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ సిద్ధుకు దొరకలేదు. ఎన్నికల ప్రక్రియ ముగియడమేకాకుండా రేపు (గురువారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మంత్రి వర్గ విస్తరణ విషయమై చర్చించడానికి సిద్ధును ఢిల్లీ రావాల్సిందిగా సూచన అందినట్లు సమాచారం. దీంతో సిద్ధు ఈనెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే సమయంలో గత మూడేళ్లల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా సిద్ధు హై కమాండ్‌కు నివేదిక రూపంలో అందజేయనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ మార్పులు తదితర విషయాల పై చర్చించడానికి వీలుగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీ.పరమేశ్వర్ కూడా ఈనెల 21న ఢిల్లీ వెళ్లనున్నారు. సీనియర్ మంత్రులపై వేటు... మంత్రి మండలి పునఃరచన, విస్తరణలో సీనియర్ మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వమోభారంతో బాధపడుతుండటం వల్ల ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్‌కు నివేదిక అందింది. ఇక గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా ఈయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న విషయం తలిసిందే. దీంతో ఈ రెబల్‌స్టార్ కూడా ‘తొలగింపు’ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇలా ప్రస్తుతం మంత్రి మండలిలో ఉన్న దాదాపు 10 మందిని తొలగించి ఆ స్థానంలో యువ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని సిద్ధరామయ్య ఆలోచన. అంతేకాకుండా మరికొందరు సీనియర్లను సైతం మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో భాగంగా వారి శాఖలను మార్చాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘మేడం, యువరాజు’ ఆమోదం కూడా... మంత్రి వర్గం మరింత చురుగ్గా పనిచేసేందుకు గాను అసమర్థులైన మంత్రులను తప్పించి వారి స్థానంలో కార్యదక్షత ఉన్న యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను అప్పగించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిద్ధరామయ్యను గతంలోనే ఆదేశించారు. ఆమేరకు సిద్ధరామయ్య నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నూతన నివేదిక పై మేడం, యువరాజుతోతో సీఎం సిద్ధరామయ్య ఆమోద ముద్ర వేయించుకుని రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మంత్రి పదవుల పై ఆశలు పెట్టుకున్న మోటమ్మ, మాలికయ్యగుత్తేదార్ వంటి సీనియర్ నాయకులు కూడా ఢిల్లీలో మకాం వేసి జోరుగా లాబియింగ్ జరుపుతున్నారు. -
లంచం ఇస్తేనే పనులు
► జన-మన’లో ఓ రైతు ఆవేదన ► కంగుతిన్న సిద్ధరామయ్య ► ప్రభుత్వ పథకాలపై నేరుగా ► లబ్ధిదారులతో సంవాదం ► మూడేళ్ల పాలనపై ప్రజలతో ► జీకేవీకేలో ప్రత్యేక సమావేశం సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టే వారికి ఎప్పుడు ముళ్లబాటే. అసమ్మతి ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అలాంటి పార్టీలో.. పూర్వాశ్రమంలో జనతాదళ్‌కు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా శుక్రవారం నాటికి మూడేళ్ల పాలనను సాఫీగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా మాట్లాడేందుకు నగరంలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే)లోని సమావేశ భవనంలో శుక్రవారం ‘జన-మన’ పేరిట కార్యక్రమం నిర్వహించగా సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులకు సైతం ఓ లబ్ధిదారు నుంచి ఊహించని సమాధాన ం ఎదురైంది. చిత్రదుర్గకు చెందిన వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ....‘గ్రామాల్లో ఏ పని జరగాలన్నా అధికారులు పరోక్షంగా లంచం అడుగుతున్నారు. గంగాకళ్యాణలో భాగంగా రెండేళ్ల క్రితం బోర్వెల్ వేయించాను. అందుకు సంబంధించిన బిల్లులన్నింటిని అధికారులకు అందజేసినప్పటికీ నాకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మొత్తం అందలేదు’ అంటూ వేదికపైనే ప్రశ్నించారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ వెంకటేష్‌ను పక్కకు తీసుకొని వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో సీఎం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అన్నభాగ్య, క్షీరభాగ్య, కృషి భాగ్య, మనస్విని తదితర పథకాల పనితీరును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఒక్కో జిల్లాకు పది మంది చొప్పున వివిధ పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు. పథకాల అమలుకు సంబంధించిన వివరాలను, పాలనలో మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి వీరి నుంచి సలహాలు, సూచనలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందుకున్నారు. -
ప్రతిపక్ష పార్టీలకు పచ్చకామెర్లు
► అందుకే అభివృద్ధి కనిపించడంలేదు ► నాపై నిరాధార ఆరోపణలు ► ఏమీ దొరక్క చేతి వాచీపై రాద్ధాంతం ► మూడేళ్లలో ఒక్క కుంభకోణం,అవినీతి లేకుండా పాలన-సీఎం సిద్ధరామయ్య దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలకు పచ్చకామెర్ల రోగం పట్టుకుందని, అందుకే వారికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడంలేదని, తనపై చేసినవన్నీ నిరాధార ఆరోపనలేనని, చివరకు ఏమీ దొరక్క చేతివాచీపై రాద్ధాంతం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దుయ్యబట్టారు. దేవనహళ్లిలోని భీరసంద్ర గ్రామంలో శుక్రవారం బెంగళూరు గ్రామీణ జిల్లాకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 165 హామీలలో ఇప్పటికే 120 హామీలు నేరవేర్చిందన్నారు. మూడేళ్ల పాలనలో ఒక్క కుంభకోణం లేకుండా పాలించిన ఘటన తమదేనన్నారు. బీజేపీ పాలనలో ముఖ్యమంత్రితో పాటు అందరూ జైలుపాలయినవాళ్లేనన్నారు. అలాంటి వారు తమకు అభివృద్ధి పాఠాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను మైనారిటీ, వెనుకబడిన వర్గాల పరంగా పనిచేస్తానని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని, అందులో సందేహమేమీ లేదన్నారు. అలాగని మిగతా వర్గాల వారికి అన్యాయం చేయడంలేదన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు చేయరాదని ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఎత్తినహొళె పథకానికి రూ. 13 వేల కోట్ల నిధులు మంజూరు చేసానని, ఇంకా ఎంతకావాలన్నా ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిని ప్రభుత్వం విజయవంతంగా నిభాయిస్తోందన్నారు. విద్యుత్ శాఖమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడడానికి గత బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విద్యుత్ విధానాలేనన్నారు. హోం మంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అవినీతిరహిత పాలన అంందించిందన్నారు. కార్యక్రమంలో పలు ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు ఆదేశపత్రాలు, చెక్కులు అందజేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కృష్ణభైరేగౌడ, మంత్రులు శ్రీనివాసప్రసాద్, హెచ్‌కే పాటీల్, ఖమర్ ఉల్ ఇస్లాం, అంబరీష్, ఆంజనేయ, ఉమాశ్రీ, ఎంపీ వీరప్పమొయిలీ, ఎమ్మెల్సీ ఎస్ రవి, ఎమ్మెల్యేలు వెంకరటమణయ్య, ఎంటీబీ నాగరాజు, పిళ్లమునిశామప్ప, శ్రీనివాసమూర్తి, జిల్లా కలెక్టర్ పాలయ్య, ఎస్పీ రమేశ్బానోత్, జిల్లా,తాలూకా,గ్రామ పంచాయ్తీల ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు. -
నేటితో సిద్ధు సర్కారుకు మూడేళ్లు
► నేడు ‘జన-మన’ సంవాద కార్యక్రమం ► లబ్ధిదారులతో నేరుగా మాట్లాడనున్న సీఎం సాక్షి, బెంగళూరు: సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటై శుక్రవారం నాటికి మూడేళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులతో స్వయంగా సిద్ధరామయ్య మాట్లాడనున్నారు. నగరంలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం(జీకేవీకే)లోని సమావేశ భవనంలో ‘జన-మన’ పేరిట నిర్వహించనున్న కార్యక్రమం ఇందుకు వేదిక కానుంది. వివరాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి పది మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరంతా ముఖ్యమంత్రితో మాట్లాడనున్నారని పేర్కొన్నారు. పథకాలపై సూచనలు, సలహాలు కూడా ఇచ్చేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మరింత మెరుగు పరుచుకునేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అన్నభాగ్య, క్షీరభాగ్య, కృషి భాగ్య, మనస్విని తదితర పధకాల పనితీరును నేరుగా ప్రజలను అడిగే తెలుసుకోనున్నామని చెప్పారు. ప్రభుత్వ ఛానల్ ఏర్పాటు ఉండబోదు.. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల ప్రచారం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఓ ఛానల్‌ను ఏర్పాటు చేయనుందన్న వార్తల్లో నిజం లేదని మంత్రి రోషన్‌బేగ్ స్పష్టం చేశారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ద్వేషపూరిత రాజకీయాలు ఉంటాయని, అందువల్లే అక్కడ ప్రభుత్వమే ఓ చానల్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. కానీ తమ ప్రభుత్వం పత్రికలు, చానళ్లు చేసే విమర్శలపై సానుకూలంగా స్పందిస్తుందని, అందువల్ల ప్రభుత్వమే ఓ చానల్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని అన్నారు. -
రింగ్ రోడ్డు అభివృద్ధికి నిధులివ్వండి
కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన సీఎం సాక్షి, బెంగళూరు: బెంగళూరు శివార్లలో ఉన్న ఎనిమిది ఉప నగరాలకు చేరుకునేందుకు వీలుగా 340 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. బెంగళూరు శివార్లలో ఉన్న రామనగర, కనకపుర, నెలమంగళ, మాగడి, ఆనేకల్, హొసకోటె, దేవనహళ్లి, దొడ్డబళ్లాపుర ప్రాంతాలను కలిపేలా చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు పనులు ఇప్పటికే 110కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మరో 230 కిలోమీటర్ల మేర ఉన్న పనులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సహాయం అందజేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. -
పదవి కాపాడుకునేందుకే సీఎం మంత్రి వర్గ విస్తరణ: యడ్యూరప్ప
సాక్షి,బెంగళూరు: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినా పట్టించుకోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి మంత్రిమండలి విస్తరణ చేపడుతున్నారని విపక్ష భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప విమర్శించారు. పార్టీ తరఫున ఏర్పాటు చేసిన బృందంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిపిన కరువు పర్యటనలో వెలుగుచూసిన వివరాలతోకూడిన నివేదికను పార్టీ ముఖ్యనాయకులైన కే.ఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక్ తదితరులతో కలిసి ఆయన గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ కరువు పరిస్థితుల నేపథ్యంలో మంత్రి మండలి విస్తరణను వాయిదా వేస్తు వచ్చిన సీఎం సిద్ధరామయ్య హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకుని ఈనెల చివరన ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం సరికాదన్నారు. కేవలం పదవిని కాపాడుకోవడానికే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో నలభై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కరువు ఏర్పడిన నేపథ్యంలో ప్రజల కష్టాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయన మంత్రి మండలి సభ్యుల నిర్లక్ష్యధోరణే ఇందుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కరువు కాటకాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంటే సీఎం సిద్ధరామయ్య, ఆయన మంత్రిమండలి సభ్యులు అధికారుల బదిలీ విషయం పై దృష్టి సారించడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఇది ఒక పెద్ద ‘దందా’గా సాగుతోందని యడ్యూరప్ప ఘాటు వాఖ్యలు చేశారు. సీఎం సిద్ధరామయ్య ప్రతిపక్షాల సలహాలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదన్నారు. అందువల్లే తాము రాష్ట్రంలో ఏర్పడిన కరువు, ప్రభుత్వ వైఫల్యం, కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాల పై గవర్నర్‌కు పూర్తి స్థాని నివేదిక అందజేశామని యడ్యూరప్ప తెలిపారు. -
125 అభివృద్ధి కార్యక్రమాలకు 13న శంకుస్థాపన
► హాజరు కానున్న సీఎం ► ఎమ్మెల్యే వెంకటరమణయ్య వెల్లడి దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం తాలూకా గ్రామీణ, పట్టణ పరిధిలో 125 అభివృద్ధి పనులకు ఈ నెల 13న సీఎం సిద్ధరామయ్య శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే వెంకటరమణయ్య వెల్లడించారు. దివ్యాంగుల సమస్యలపై స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవనహళ్లి, దొడ్డబళ్లాపురం సరిహద్దులో ఉన్న చప్పరదకల్లు గ్రామం వద్ద రూ.43కోట్లతో జిల్లా కేంద్ర కార్యాలయాలకు 13న సీఎం శంకుస్థాపన జరుగనుందన్నారు. ఇదే కార్యక్రమంలో పలు పథకాల కింద ఆదేశపత్రాలు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కార్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి కార్యాలయాలు ఒక్కచోట రావడం వల్ల జిల్లాలోని నాలుగు తాలూకాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు రెండు నెలల్లో త్రికచక్రవాహనాలు, డ్రైవింగ్ లెసైన్సులు అందజేస్తామన్నారు. అదేవిధంగా పేద దివ్యాంగులకు రెండువేల ఇళ్లు నిర్మిస్తామన్నారు. -
నీటి ఎద్దడిపై దృష్టి పెట్టండి
►మూడు రోజుల్లో నివేదికలు అందించాలి ► అధికారులకు సీఎం ఆదేశాలు ►కరువు నివారణకు కేంద్రాన్ని రూ.1416 కోట్లు అడుగుతాం ►చిక్కబళ్లాపురం జిల్లా పర్యటనలో సీఎం సిద్ధరామయ్య ► కరువు సమయంలో రాజకీయం వద్దు విపక్షాలకు హితవు చిక్కబళ్లాపురం: కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై కలెక్టర్లు దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. గురువారం ఆయన చిక్కబళ్లాపురం జిల్లాలో పర్యటించి కరువు పరిస్థితులను అంచనా వేశారు. తొలుత కొళవనహళ్లిని సందర్శించిన సీఎం... స్థానిక రైతులతో మాట్లాడారు. పంటనష్టం, నీటి ఎద్దడి, కరువు సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి ఎద్దడి నివారణకు ఏర్పాటు చేసిన బోర్లను పరిశీలించారు. తర్వాత రెడ్డి గొల్లవారహళ్లి గ్రామంలో పర్యటించి కరువుపై ఆరా తీశారు. తర్వాత చిత్రావతి డ్యాంను సందర్శించినారు. అనంతరం గౌరిబిదనూరు కల్లూడి గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను ఆలకించారు. తర్వాత జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయత్ సర్వీ భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. చిక్కబళ్లాపురం జిల్లాలోని అన్ని తాలూకాల్లో తాగునీటి కోసం బోర్లు వేశారని, యాక్షన్ ప్లాన్ ఆమోదం పొందలేదనే నెపంతో జిల్లా పాలక మండలి మోటార్లు సరఫరా చేయలేదని కొందరు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం స్పందించి కోలారు, చిక్కబళ్లాపురం జిల్లా కలెక్టర్లు నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను సందర్శించి మూడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఎత్తిన హొళె పథకం రెండు జిల్లాలకు వరమని, ఇప్పటికే ఈ పథకానికి రూ.3700 కోట్లు విడుదల చేసినట్లు సీఎం తెలిపారు. బెంగళూరులోని మురుగ నీటిని శుద్ధి చేసి జిల్లాలోని 39 చెరువులకు నింపే పనులు వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు నివారణకు రూ. 1416 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఈనెల 7న ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి కరువు పరిస్థితిని వివరిస్తామన్నారు. కరువు సమయంలో రాజకీయం చేయరాదని విపక్షాలకు హితవు పలికారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న యూకలిప్టస్ చెట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సమాచార శాఖా మంత్రి రోషన్‌బేగ్, ఎమ్మెల్యేలు సుధాకర్, శివశంకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, రాజణ్ణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. -
విధానసౌధ ముందు కేసీ రెడ్డి ప్రతిమ
► సీఎంకు విన్నవిస్తా ► మంత్రి రామలింగారెడ్డి కేజీఎఫ్ : రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి కేసీ రెడ్డి ప్రతిమను విధాన సౌధ ముందు ప్రతిష్టించాలని సీఎం సిద్ధరామయ్యకు విన్నవిస్తామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. కేసీ రెడ్డి 114వ జయంతిని పురస్కరించుకుని బంగారుపేట తాలూకా క్యాసంబళ్లి గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన 5 రోజుల కబడ్డీపోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేసి మాట్లాడారు. క్రీడ లతో దైహిక, మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుందన్నారు. తాలూకాలో రెండు ఎకరాల స్థలం చూపిస్తే క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కేసి రెడ్డి రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించారన్నారు. కేసి రెడ్డి స్వగ్రామంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు వస్తే సహకారం అందజేస్తానన్నారు. నగరంలో చేపట్టిన బస్టాండ్ పనులు పూర్తయ్యాయన్నారు. త్వరలోనే ఎంపీ కేహెచ్ మునియప్పతో చర్చించి ప్రారంభోత్సవం చేస్తానన్నారు. అనంతరం డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ కర్ణాటక ఆధ్వర్యంలో రెండు వేల మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు భక్తవత్సల రెడ్డి, బత్తుల అరుణాదాస్, రాష్ట్ర న్యాయవాదుల పరిషత్ సభ్యుడు హరీష్, కేడీపీ సభ్యుడు వెంకటకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూఢాచారాలకు చెల్లుచీటీ
► పటిష్టమైన ‘మూఢాచారాల నిషేధ చట్టం’ రూపకల్పన ► త్వరలో రాష్ట్రంలో అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు ► ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: సమాజాభివృద్ధికి ఆటంకంగా పరిణమించిన మూఢాచారాలను నిర్మూలించేందుకు మహారాష్ట కంటే పటిష్టమైన మూఢాచారాల నిషేధ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి త్వరలోనే రాష్ట్రంలో అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ‘మూఢాచారాలు శాస్త్రీయపరమైన ఆలోచనలకు గొడ్డలిపెట్టు’ అనే అంశంపై బెంగళూరులోని జ్ఞానజ్యోతి సభాంగణలో కర్ణాటక న్యాయవాదుల పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కకు నీరు పోసి మాట్లాడారు. సమాజంలో నమ్మకాలు ఉండవచ్చని, అయితే అవి మూఢనమ్మకాలుగా మారకూడదని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వం మూఢాచారాల నిషేధ చట్టం అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ అంశంపై చర్చ సైతం జరిగిందని తెలిపారు. మరోవైపు ఇలాంటి చట్టాలు రాష్ట్రంలో అమలు చేయకూడదనే డిమాండ్ కూడా చాలామంది నుంచి వినిపిస్తోందని అన్నారు. అయినా మూఢాచారాల నిషేధ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మూఢాచారాల నిషేధ చట్టం ఇప్పటికే మహారాష్ట్రలో అమల్లో ఉందని, ఈ నేపథ్యంలో కర్ణాటకలో మరింత పటిష్టమైన చట్టాన్ని రూపొందించాల్సిందిగా న్యాయనిపుణులను ఆదేశించినట్లు తెలిపారు. ‘నేను మూఢాచారాలను నమ్మను. నా పెళ్లి జరిగింది రాహుకాలంలో, పురోహితుల మాట విని మా మామగారు నా వివాహాన్ని ఉదయం 9.30-10.30గంటల మధ్యన నిర్ణయించారు. అయితే ఆ సమయానికి అతిథులు హాజరుకావడం ఆలస్యం కావడంతో పాటు అది భోజన సమయం కూడా కాకపోవడంతో నేను మధ్యాహ్నం 12.30గంటలకు రాహుకాలంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టానంటూ చర్చ జరిగింది. అయినా ఆ సమయంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకొని అలాగే చేశాను’ అని సీఎం చెప్పారు. మూఢనమ్మకాలు కేవలం ప్రజలను, వారి మనోస్థైర్యాన్ని బలహీనపరుస్తాయని, అందువల్ల విద్యావంతులు ఇలాంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలకు నిరసనగా తమ గళాన్ని వినిపించాలని సూచించారు. మరో రెండేళ్లు నేనే సీఎం...... రానున్న మరో రెండేళ్లు తానే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందనేది కేవలం గాలి వార్తలు మాత్రమేనని కొట్టిపారేశారు. -
ప్రజల వల్ల ముఖ్యమంత్రినయ్యా
జనార్దన పూజారిపై మండిపడ్డ సీఎం సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: ‘లోకాయుక్త సంస్థ నన్ను ముఖ్యమంత్రిని చేయలేదు, రాష్ట్రంలోని ప్రజలు హైకమాండ్ నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టింది’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. తద్వారా తనపై విమర్శలు చేసిన సొంత పార్టీ నేత జనార్దన్ పూజారిపై పరోక్షంగా మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు నేపథ్యంలో రెండవ విడతగా సోమవారం ఉదయం బెళగావిలో కరువు పర్యటన చేపట్టిన సీఎం సిద్ధరామయ్య స్థానిక సాంబా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు నా సారథ్యంలోని రాజకీయ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. వారు కోరుకున్న కారణంగా హైకమాండ్ నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. అంతేకానీ లోకాయుక్త సంస్థ కారణంగా నేను ముఖ్యమంత్రిని కాలేదు కదా’ అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని కరువు పరిస్థితిని అధ్యయనం చేయడానికి నాలుగు ఉప సమితులను నియమించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో ఏప్రిల్ 30లోపు తనకు వివరాలు అందజేయాల్సిందిగా ఆదేశించానని తెలిపారు. అధ్యయనం పూర్తయ్యి సమగ్ర నివేదికలు అందిన అనంతరం కరువు నష్ట పరిహార చర్యలు చేపడతామని తెలిపారు. -
32 నెలలు రూ 33 కోట్లు !
► అభివృద్ధి ఖర్చు కాదు... అమాత్యుల వాయువిహారం ► సీఎంతో పాటు మంత్రుల విమానయానం వ్యయం వెల్లడైన వాస్తవాలు సాక్షి, బెంగళూరు : 32 నెలలు... రూ. 33 కోట్లు ఇదేదో రాష్ట్రం అభివృద్ధి సాధించినట్లు అనుకుంటే మీరు పొరబడినట్లే... కరువు, తాగునీటి కష్టాలు, పశుగ్రాసం కొరత... రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంటే అమాత్యుల విమానయాన ఖర్చు ఇది. 32 నెలల్లో అక్షరాలా 33 కోట్ల రూపాయల ఖర్చు, కేవలం సీఎంతో పాటు ఆయన మంత్రివర్గంలోని అమాత్యుల వాయు విహారానికి అయిన ఖర్చే అక్షరాలా రూ.33.15 కోట్లు. బెళగావికి చెందిన ఆర్టీఐ కార్యకర్త భీమప్ప గుండప్ప సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13 మే 2013 నుంచి 31జనవరి 2016 వరకు ముఖ్యమంత్రితో సహా ఆయన మంత్రి వర్గ సహచరులు చేసిన విమానయాన ఖర్చులను భీమప్ప గుండప్ప సమాచార హక్కు చట్టం కింద సేకరించారు. కాగా, ఈ 32 నెలల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రుల విమాన ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.33.15 కోట్లు వెచ్చించగా అందులో అధిక వాటా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యదే. సీఎం సిద్ధరామయ్య ఒక్కరే రూ.20,11,34,971 ఖర్చు చేశారు. ఇక సీఎం తరువాతి స్థానంలో అధికంగా విమానయాన ప్రయాణాలకు ఖర్చు చేసిన వారిలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే ఉన్నారు. ఈ 32నెలల వ్యవధిలో ఆర్.వి.దేశ్‌పాండే మొత్తం 45.04 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇదే సందర్భంలో విమానయాన ప్రయాణాల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసిన అమాత్యుల జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఆర్.వి.దేశ్‌పాండేతో పాటు గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ (రూ.39,91,965), రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామనాథ్ రై (రూ.33,50,722), రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్(రూ.20,06,213), రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి అభయ్‌చంద్ర జైన్(రూ.19,10,387)లు ఉన్నారు. ఇక విమానయానం కోసం అత్యంత తక్కువగా ఖర్చు చేసిన రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్ప (రూ.2,26,019) ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నార -
మళ్లీ వాయిదా !
► లభించని అధినేత్రి అపాయింట్మెంట్ ► కరువు దృష్ట్యా విస్తరణ వాయిదా వేసుకోవాలని అధిష్టానం సూచన ► హైకమాండ్ సూచనలతో సీఎం ఢిల్లీ టూర్ రద్దు ఆశావహుల్లో నిరాశ సాక్షి, బెంగళూరు: గత కొంతకాలంగా ఆశావహుల్లో తీవ్ర కుతూహలాన్ని పెంచుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణకు మరోసారి బ్రేక్ పడింది. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించి విస్తరణకు అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయనకు ఇందుకు అవకాశం కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో సీఎం సిద్ధరామయ్య తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. అయితే మంత్రి వర్గ విస్తరణకు గతంలో ఎన్నికలు అడ్డువస్తే ఇప్పుడు కరువు పరిస్థితులు మంత్రి వ ర్గ విస్తరణకు బ్రేక్ వేస్తున్నాయి. కాగా, మే 13 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏరాటై మూడేళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భావించారు. ఇందుకు సంబంధించి ఇటీవల నగరానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవ హారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో సైతం సిద్ధరామయ్య చర్చించారు. శనివారం రోజున ఢిల్లీ చేరుకొని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్‌గాంధీతో సమావేశమై మంత్రివర్గ విస్తరణకు అనుమతి తీసుకోవాలని భావించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎం సిద్ధరామయ్యను ఆదేశించింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణను చేపడితే కరువు పరిస్థితుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని హైకమాండ్ తెలిపింది. అందువల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితుల నిర్వహణకు ముందుగా ప్రాముఖ్యతను ఇవ్వాలని లేదంటే ప్రతిపక్షాల చేతిలో విమర్శలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సిద్ధరామయ్యకు సూచించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గ విస్తరణకు తాత్కాలికంగా బ్రేకులు వేశారు. ముఖ్యమంత్రుల సమావేశానికీ వెల్లడం లేదు..... ఇక ఆదివారం (24న) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్న ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లాలని సిద్ధరామయ్య భావించారు. సమావేశంలో పాల్గొనడంతో పాటు హైకమాండ్‌తోనూ చర్చలు జరిపి రాష్ట్రానికి తిరిగి రావాలని అనుకున్నారు. అయితే హైకమాండ్‌తో భేటీకి అపాయింట్మెంట్ లభించని నేపథ్యంలో తన ఢిల్లీ టూర్‌ను రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్రను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
కరువు అధ్యయనానికి ‘ఉప సంఘాలు’
ఈనెల 30న ప్రభుత్వానికి నివేదిక కాంట్రాక్ట్స్ కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ బెంగళూరులో రెయిన్వాటర్ హార్వెస్ట్ ఇక తప్పనిసరి మంత్రి మండలి నిర్ణయాలను వెల్లడించిన టీ.బీ జయచంద్ర బెంగళూరు: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల అధ్యయనానికి నాలుగు మంత్రి మండలి ఉపసంఘాలను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో బుధవారం ఉదయం జరిగిన మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నాలుగు మంత్రి మండలి ఉపసంఘాల్లోని సభ్యులు రాష్ట్ర మంతటా పర్యటించి ఈనెల 30న క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేయనున్నారు. బెంగళూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని జిల్లాల్లో పర్యటించే మంత్రి మండలి ఉపసంఘానికి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి వీ. శ్రీనివాస్ ప్రసాద్, మైసూరు రెవెన్యూ విభాగానికి ఉన్నతవిద్య శాఖ మంత్రి టీ.బీ జయచంద్ర, బెళగావి విభాగానికి పరిశ్రమలశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే, గుల్బర్గా రెవెన్యూ డివిజన్ పరిధిలో పర్యటించే మంత్రి మండలి ఉపసంఘానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ నేతృత్వం వహించనున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. అందులో కొన్ని ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు... ⇒కరువు పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాకు వెంటనే రూ.100 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే తాగునీటి కోసం విడుదల చేసిన రూ.50 కోట్లకు ఈ నిధులు అదనం. ⇒ బెంగళూరులో ఇకపై నూతనంగా నిర్మించే ప్రభుత్వ, ప్రైవేటు భవనాలతో పాటు వ్యక్తిగత ఇళ్లుకు రెయిన్వాటర్ హార్వెస్టింగ్ సిస్టం ఏర్పాటును ఖచ్చితం చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ⇒రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల కాంట్రాక్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. రూ.50 లక్షల కంటే తక్కువ మొత్తం కాంట్రాక్టు పనుల్లో 17.1 శాతం ఎస్సీలకు, 6.95 శాతం ఎస్టీలకు (మొత్తం 24.05 శాతం) ఎటువంటి టెండర్ లేకుండా నేరుగా కేటాయించడానికి వీలుగా చట్టంలో మార్పులు తీసుకురావడానికి మంత్రి మండలి ఏకగ్రీవంగా అంగీకరించింది. ఒక వేళ ఒకే పనికి ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే లాటరీ రూపంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ⇒నాయిబ్రాహ్మణ, నాయింద, హజామ అనే పదాలను నిషేధిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ‘సవిత’ సమాజ వర్గం అని ఇకపై ఆ వర్గానికి చెందిన ప్రజలను పిలవాల్సి ఉంటుంది. సవిత సమాజ వర్గం పేరుతోనే జనన ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు. ⇒కరువు పరిస్థితుల నేపథ్యంలో వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలుకు మంత్రి మండలి నిర్ణయం. దీని వల్ల రాష్ట్రలోని 137 తాలూకాల్లోని విద్యార్థులకు 39 రోజుల పాటు మధ్యాహ్న భోజనం అందుతుంది. ⇒ రామనగర్‌లో నిర్మించనున్న రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పనుల కోసం రూ.580 కోట్ల విడుదలకు మంత్రి మండలి అంగీకారం. ఈ పనులను నాగార్జున కంపెనీ చేజెక్కించుకుంది. ⇒ కలబుర్గిలో విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల పెంపునకు రూ.109 కోట్లను ప్రజాపనుల శాఖకు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ⇒ బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన జీవీకే సంస్థ తన షేర్లను అమ్మకానికి పెట్టిందని అయితే ఆ షేర్లను కొనకూడదని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో సదరు సంస్థ తమ షేర్లను ఇతర ప్రైవేటు సంస్థలకు కాని వ్యక్తులకు గాని అమ్ముకోవచ్చు. ప్రస్తుతం కెంపేగడ అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలా 13 శాతం షేర్లను కలిగి ఉన్నాయి. ⇒రాష్ట్రంలోని ఓపెన్ యూనివర్శిటీలు బయటి రాష్ట్రాల్లో నూతన కోర్సులు ప్రారంభించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. -
ఆ పరిహారమే అందలేదు
బెంగళూరు: కరువు పర్యటనలో భాగంగా సోమవారం విజయపుర జిల్లాలోని ఇండి తాలూకాకు చేరుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. కరువు పరిహారం తమకు సరిగా అందండం లేదని, తాగేందుకు మంచినీళ్లు సైతం అందని పరిస్థితి ఏర్పడిందని, అధికారుల నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమంటూ స్థానిక రైతులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముట్టడించారు. ప్రస్తుత కరువు పరిహారం సంగతి అటుంచితే గత ఏడాది కురిసిన వడగళ్ల వానకు సంబంధించిన పరిహారం కూడా ఇప్పటి వరకు అందలేదంటూ రైతులు సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సిద్ధరామయ్య అక్కడే ఉన్న అధికారులపై మండిపడ్డారు. ‘ఏంటయ్యా ఇదంతా, ఎందుకని రైతులకు పరిహార ధనం అందించలేదు. కరువు నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ ఏమవుతున్నాయి’ అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి సమాధానం ఇవ్వడంలో అధికారులు తత్తరపాటుకు గురయ్యారు. దీంతో ‘మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు ముందు రైతులకు పరిహార ధనం అందేలా తక్షణమే చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. ముఖ్యమంత్రి భరోసాతో సంతృప్తి చెందని రైతులు తమకు పరిహారం అందే వరకు సీఎంను కదలనివ్వబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీంతో పోలీసులు కల్పించుకొని రైతులను పక్కకు తప్పించి, సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. అనంతరం అథర్గ చెక్‌డ్యామ్‌ను సీఎం పరిశీలించారు. చెక్‌డ్యామ్ పక్కనే నీరు లేక ఎండిపోయిన నిమ్మతోటను పరిశీలించారు. కాగా, అంతకుముందు విజయపురలోని ప్రభుత్వ అతిథి గృహంలో సీఎం సిద్ధరామయ్య జనతా దర్శన నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలపై వినతి పత్రాలను అందుకున్నార -
ఏ దర్యాప్తునకైనా సిద్ధం
సీఎం సిద్ధు బెంగళూరు: విక్టోరియా ఆసుపత్రి ఆవరణంలో రోగ నిర్ధారణ పరీక్షలు జరపడానికి అవసరమైన ల్యాబ్‌ను ఏర్పాటు చేసే టెండర్‌ను మ్యాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్ సంస్థ దక్కించుకోవడం వెనుక తన పాత్ర ఏమీ లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. తన కుమారుడు యతీంద్ర ఆ సంస్థకు డెరైక్టర్‌గా ఉన్నంత మాత్రానా అక్రమాలు జరిగాయనడం సరికాదన్నారు. ఈ విషయంలో ఏ సంస్థతో దర్యాప్తు జరిపినా తనకు అభ్యంతరం లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కరువు పర్యటనలో ఉన్న సిద్ధరామయ్య రాయచూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఆదివారం మాట్లాడారు. తాను ధరించిన వాచ్ విషయమై అనవసర రాజకీయాలు చేసిన విపక్ష పార్టీలు ప్రస్తుతం విక్టోరియా విషయమై అదే పంథాను అనుసరిస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేడియోలజిస్ట్ అయిన రాజశేఖర్ గౌడ 2009లో మ్యాట్రిక్స్ సొల్యూషన్‌ను స్థాపించారు. పథాలజిస్ట్‌గా పనిచేస్తున్న తన కుమారుడు యతీంద్ర 2014లో మ్యాట్రిక్స్ సొల్యూషన్ డెరైక్టర్‌గా ఆ సంస్థ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ఆ సంస్థ టెండర్‌ను దక్కించుకుని విక్టోరియా ఆసుపత్రిలో ల్యాబ్‌ను ఏర్పాటు చేసే అవకాశం చేజెక్కించుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రులు వసూలు చేసే రుసుములతో పోలిస్తే దాదాపు 20 శాతం తక్కువగా మ్యాట్రిక్స్ సొల్యూషన్ సంస్థ రోగుల నుంచి వసూలు చేస్తుంది. ఈ విషయంలో ఎటువంటి అక్రమాలు తావులేదు.’ అని పేర్కొన్నారు. తాను ఇప్పటికే విక్టోరియా విషయమై ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే దర్యాప్తు చేసి టెండర్ ప్రక్రియను రద్దు చేయాల్సిందిగా వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ప్రకాశ్ పాటిల్‌కు ఆదేశాలు జారీ చేసానని సిద్ధరామయ్య తెలిపారు. తన కుమారుడు తన నుంచి ఎటువంటి సహకారం తీసుకోలేదన్నారు. అంతేకాకుండా సక్రమంగా పన్నులు కూడా చెల్లిస్తున్నారని సిద్ధరామయ్య వివరించారు. ఈ విషయమై ఏ సంస్థ అయినా దర్యప్తు జరిపినా తాను పూర్తిగా సహకరిస్తానని సిద్ధరామయ్య తెలిపారు. అక్రమాలు జరిగినట్లు తేలితే చట్టం ప్రకారం శిక్ష అనుభవించడానికి సిద్దమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లలో ఏ ఒక్క విషయంలో కూడా అక్రమాలు చోటు చేసుకోలేదన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని దీన్ని ఓర్చుకోలేని విపక్షాలు తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. -
ప్రజల గొంతులెండితే కఠిన చర్యలు
అధికారులను హెచ్చరించిన సీఎం సిద్ధరామయ్య నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లు పంపండి మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం 15 రోజుల్లోగా ఇన్పుట్ సబ్సిడీ బళ్లారి : వేసవిలో ప్రజల గొంతులెండితే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా, లేదా కొత్త బోర్లు తవ్వించి యుద్ధప్రాతిపదికన నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరువు పరిహార పరిశీలన, మంచినీటి సమస్యపై బీదర్‌లోని జిల్లా పంచాయతీ సభామందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. బీదర్ జిల్లాలో మూడేళ్లుగా కరువు నెలకొందని, అందువల్ల ప్రజలకు అత్యవసర మంచినీటిని అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మంచి నీరందించేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని, విపత్తు నిర్వహణ నిధి కింద విడుదల చేసిన నిధులను వినియోగించాలని ఆయన జిల్లాధికారి అనురాగ్ తివారీకి సూచించారు. జిల్లాలో మొత్తం 881 గ్రామాలుండగా, 789 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొందన్నారు. ఈ గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు విృ్తత సూక్ష్మ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని ఆయన జెడ్పీ సీఈఓ పవన్ కుమార్ మాలపాటిని ఆదేశించారు. మంచినీటి సమస్య నివారణకు జిల్లా, తాలూకా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, అక్కడి ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి వారానికొకసారి రెవెన్యూ శాఖ కార్యదర్శికి నివేదిక ఇవ్వాలని జిల్లాధికారిని ఆదేశించారు. వచ్చే నెలలో పశుగ్రాసం, నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నందున అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని 15 రోజుల్లోగా సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కృష్ణభైరేగౌడ, కన్నడ సంృ్కతీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉమాశ్రీ, బీదర్ ఎంపీ భగవంత్ ఖూబా, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అరవింద్ జాదవ్, ఎమ్మెల్యేలు రహీంఖాన్, ఈశ్వర్ ఖండ్రె, రాజశేఖర్ పాటిల్, ప్రభు చౌహాన్, మల్లికార్జున ఖూబా, ఎమ్మెల్సీ విజయ్ సింగ్, గొర్రెల ఉన్ని అభివృద్ధి మండలి అధ్యక్షుడు పండిత్ చిద్రి, ద్రాక్షరస అభివృద్ధి మండలి అధ్యక్షుడు బక్కప్ప కోటె, ప్రాంతీయ కమిషనర్ ఆదిత్య బిస్వాస్, జిల్లాధికారి అనురాగ్ తివారీ, ఎస్పీ ప్రకాష్ నిక్కం, జెడ్పీ సీఈఓ పవన్‌కుమార్ మాలపాటిలతో పాటు జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అందరి సహకారంతో పార్టీ బలోపేతం
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప బెంగళూరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖకు సంబంధించిన ఏ విషయమైన పార్టీ పధాదికారులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తెలిపారు. ఏ విషయం పైన కూడా తానొక్కడినే నిర్ణయం తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం బీజేపీ పార్టీ నగరంలోని ప్యాలెస్ మైదానంలో ‘సామరస్య-సమావేశం’ పేరుతో నిర్వహించిన కార్యకర్తల బృహత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులను ఏకతాటిపై నడిపించి కర్ణాటకలో తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని తనకు ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా దిశానిర్దేశం చేశారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పై కఠినచర్యలకు వెనుకాడబోనని యడ్యూరప్ప స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 224 నియోజక వర్గాల పరిధిలో పార్టీ పటిష్టత కోసం క్షేత్రస్థాయి మార్పులు అవసరమన్నారు. మహిళ, దళిత, రైతు, యువ మోర్చా విభాగాలను బలోపేతం చేయనున్నానని తెలిపారు. ఇందుకోసం వారంలో మూడు నుంచి నాలుగు రోజులు రాష్ట్ర పర్యటనలో ఉండి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటానని తెలిపారు.గతంలో బీజేపీలో ఉండి, ఆ తర్వాత పార్టీని వీడిన వారు ఎవరైనా సరే బీజేపీలోకి వస్తే తాము చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని యడ్యూరప్ప ప్రకటించారు. నెలలోపు అవినీతి చిట్టా బయటికి తీస్తా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌లను ఏర్పాటు చేసే విషయమై ఆయన కుమారుడు డెరైక్టర్‌గా ఉన్న సంస్థకు టెండర్లను దక్కేలా చేశారని విమర్శించారు. సిద్ధరామయ్య ప్రభుతంలో జరిగిన ఇలాంటి అక్రమాలన్నింటిని నెలలోపు ప్రజల ముందుకు తీసుకు వస్తానన్నారు. రాష్ట్రంలో 1,200 మంది రైతులు అత్మహత్యలకు పాల్పడితే కేవలం 340 నుంచి 350 మందికి మాత్రమే పరిహారం అందిందన్నారు. మిగిలిన వారికి బీజేపీ తరపున ఒకలక్ష నుంచి రెండు లక్షరుపాలయ పరిహారం అందించాల్సిన విషయమై వేదిక పై ఉన్న నాయకులే కాకుండా ప్రతి కార్యకర్త ఆలోచించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కరువు నివారణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1550 కోట్ల నిధులు విడుల చేసినా వాటిని వినియోగించుకోవడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌తో పాటు బీజేపీ నేతలు శ్రీరాములు, సురేష్‌కుమార్, ప్రహ్లాద్‌జోషి, శోభాకరంద్లాజే, ఆర్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మరో కేంద్ర మంత్రి సదానంద గౌడ గైర్హాజరు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇక ఈ వేదికను యడ్యూరప్ప తన బలప్రదర్శనకు వినియోగించుకున్నారు. అనుచరులుగా ఉంటూ తాను పార్టీని వీడిన సమయంలో బీజేపీ నుంచి బయటికి వచ్చేసిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీకి తన అవసరం ఎంత ఉందన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక ఈ సమావేశానికి వేలాది సంఖ్యలో కార్యకర్తలను సమీకరించడం ద్వారా తను మాస్ లీడర్నని మరోసారి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. -
మంత్రి వర్గ విస్తరణ ఖాయం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి బెంగళూరు: ఏప్రిల్ చివరి నాటికి మంత్రి వర్గ విస్తరణ చేపట్టి తీరుతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారమిక్కడి విధానసౌధలోని బాంక్వెట్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గేతో కలిసి బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సిద్ధరామయ్య మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఆశావహులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మంత్రి కావాలనే ఆశ ప్రతి ఎమ్మెల్యేకు ఉంటుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇక శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరువు ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించేందుకు పర్యటన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కరువు పరిస్థితుల నిర్వహణకు సంబంధించి పరిశీలన జరిపేందుకు ఇప్పటికే నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు సిద్దరామయ్య వెల్లడించారు. ఏడాదంతా అంబేద్కర్ జయంతి... ఇక డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఏడాదంతా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అంబేద్కర్ ఆశయాలు, ఆయన జీవిత చరిత్ర తదితర విషయాలన్నింటిని నేటి తరానికి పరిచయం చేసేలా నాటికలు, షార్ట్ ఫిల్మ్‌లు ఇలా అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిన్నస్వామి మాంబళ్లికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బి.ఆర్.అంబేద్కర్ స్మారక అవార్డును అందజేసి సత్కరించారు. -
మరో వివాదంలో సిద్ధు
కుమారుడి ద్వారా శాంత ఇండస్ట్రీస్‌కు రూ.150 కోట్ల విలువైన భూమి ధారదత్తం ఆధారాలను బయటపెట్టిన ఆర్టీఐ కార్యకర్త సంకటస్థితిలో సిద్దు బెంగళూరు: పుత్ర వాత్సల్యానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మరో బాంబు పడింది. తన కుమారుడి కోసం ఆయన రూ.150 కోట్ల మేర విలువైన బీడీఏ భూమిని ధారాదత్తం చేశారన్న వార్తలు సీఎం సిద్ధరామయ్యను మరింత చిక్కుల్లో పడేశాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త కోదండరామ్ గురువారం సాయంత్రమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరంలోని మహాలక్ష్మీ లే అవుట్లో సర్వే నెంబర్ 174, 175లోని శాంత ఇండస్ట్రీస్ అనే సంస్థకు చెందిన భూమిని 1977లో బీడీఏ స్వాధీనం చేసుకుంది. ఆ భూమికి పరిహారం కూడా ఇస్తామని తెలిపింది. అయితే ఇందుకు నిరాకరించిన శాంత ఇండస్ట్రీస్ సంస్థ ఆ స్థలానికి బదులుగా మరో ప్రాంతంలో తమకు స్థలాన్ని కేటాయించాల్సింగా కోరుతూ వస్తోంది. ఈ విషయంపై సదానందగౌడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత జగదీష్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీడీఏలో విన్నవించారు. అయితే అప్పటి న్యాయనిపుణులు శాంత ఇండస్ట్రీస్ విన్నపం భూస్వాధీన న్యాయసూత్రాలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. దీంతో శాంత ఇండస్ట్రీస్ ఫైల్ అక్కడితో ఆగిపోయింది. అయితే సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర తన స్నేహితుడైన రాజేష్గౌడ శాంత ఇండస్ట్రీస్‌లో భాగస్వామిగా చేరారు. దీంతో మూలన పడిన ఈ శాంత ఇండస్ట్రీస్ ఫైల్ వేగంగా కదిలింది. హెబ్బాళలోని 2.19 ఎకరాల స్థలాన్ని బీడీఏ ద్వారా ఉచితంగా 2016 జనవరిలో కట్టబెట్టారు. తద్వారా రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా పొందారు’ అని కోదండరామ్ వెల్లడించారు. ఈ విషయంపై ఈనెల 5న ఏసీబీకి సైతం ఫిర్యాదు చేసినట్లు కోదండరామ్ తెలిపారు. ఇదిలా ఉండగా రాజేష్గౌడ డెరైక్టర్‌గా ఉన్న మ్యాట్రిక్స్ సంస్థలో సిద్ధరామయ్య కుమారుడైన డాక్టర్ యతీంద్ర డెరైక్టర్‌గా చేరడం, అదే మ్యాట్రిక్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసే కాంట్రాక్టును కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇలా యతీంద్ర భాగస్వామిగా ఉన్న సంస్థలకు సిద్ధరామయ్య ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వందల కోట్ల విలువ చేసే భూములను, కాంట్రాక్టులను కట్టబెడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘ఏసీబీ’ ఎలా చేద్దాం...
బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక దళం (ఏసీబీ) కార్యాచరణకు సంబంధించి చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం మరోమారు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఏసీబీ ఏర్పాటుకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ ఏర్పాటుపై వెల్లువెత్తుతున్న విమర్శలు తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్, న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్ జాదవ్, డీజీపీ ఓం ప్రకాష్‌లతో ప్రత్యేకంగా చర్చించారు. ఏసీబీలో ఎఫ్ఐఆర్ నమోదు, అధికారుల కార్యనిర్వహణ తదితర అంశాలపై ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కార్యనిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఉద్యోగుల నియామకం తదితర అంశాలపై సీఎం సిద్ధరామయ్య ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. -
వర్గపోరు
అధికార కాంగ్రెస్ పార్టీలో మొదలైన గ్రూపు రాజకీయాలు మంత్రులంతా ఒకవైపు, ఎమ్మెల్యేలు మరోవైపు పదవులు కాపాడుకోవడంపై అమాత్యుల దృష్టి అవే పదవులు చేజిక్కించుకోవడం కోసం ఎమ్మెల్యేల చలో ఢిల్లీ రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయాలు బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు ఎవరికి వారే ఎమునా తీరే అన్న చందంగా తయారైంది. అధికారం చేజారి పోకుండా ఉండేందుకు అమాత్యులు నానా తంటాలు పడుతుంటే ఆ మంత్రి పదవులను దక్కించుకోవడానికి ఆ పార్టీకి చెందిన శాసనసభ సభ్యులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ మంత్రులు, శాసనసభ్యుల మధ్య నాలుగు గోడల మధ్యకే మాత్రమే పరిమితమైన వార్ తాజాగా బహిర్గతమైంది. రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముకున్న సీనియర్లను కాదని జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులకు ముఖ్యమంత్రితో పాటు మంత్రి పదవులు దక్కాయి. దీంతో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న మాలికయ్య గుత్తేదార్ వంటి సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై గుర్రుగా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ లుకలుకలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎప్పుడు సీఎల్పీ సమావేశం జరిగినా ఎమ్మెల్యేలు మంత్రులపై విరుచుకు పడేవారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారని, కమీషన్లు వసూలు చేస్తున్నారని సీఎం ముందే విమర్శించేవారు. విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి రామనాథరై, హెచ్.కే పాటిల్ తదితరులు ఉన్నారు. మరోవైపు చురుకుగా వ్యవహరించక పోవడంతో పలు శాఖల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నత్తనడకన సాగుతున్నాయని గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరిష్, ఉద్యానశాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప, రెవెన్యూశాఖ మంత్రి వీ.శ్రీనివాస్ ప్రసాద్‌పై కూడా సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆక్రోశం వ్యక్తం చేస్తూ వచ్చారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన నేపథ్యంలో మంత్రి వర్గ ప్రక్షాళన చేయాలని హై కమాండ్ సిద్ధరామయ్యకు సూచించింది. ఈ కారణాలన్నింటి వల్ల మంత్రి వర్గ విస్తరణ, పునఃవ్యవస్థీకరణ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది రచ్చకెక్కిన విభేదాలు... మంత్రి వర్గ ప్రక్షాళన కచ్చితమన్న సంకేతాలు వెలువడటంతో ఆ పదవులపై కన్నేసిన కొంతమంది ఎమ్మెల్యేలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. క్రమంలో దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. ఏఏ మంత్రి ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలకు అందుబాటులోలేనివారు ఎవరు? సమర్థంగా శాఖలను నిర్వహించలేని వారు ఎవరు అన్న విషయాల పై నివేదికలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం తుమకూరులో కొంతమంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేటు హోటల్లో సమావేశమై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రి మండలి నుంచి తప్పించాల్సిన 25 మంది అమ్యాత్యులతో కూడిన జాబితాను ‘ఆశావహ’ ఎమ్మెల్యేలు రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈనెలలో ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో భేటీ అయ్యి జాబితా సమర్పించి విస్తరణ సమయంలో తమకు న్యాయం చేయాల్సిందిగా కోరనున్నారు. ‘మేము పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడటం లేదు. పార్టీ పటిష్టత కోసం ఎవరికి ఉన్నత పదవులు ఇవ్వాలనే విషయం పై మా అభిప్రాయాలను తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఎవరేమనుకున్నా మాకు అభ్యంతరం లేదు.’ అని ఎమ్మెల్యే యశ్వంత్‌పుర ఎమ్మెల్యే ఎస్.టీ సోమశేఖర్ బహిరంగంగానే ప్రస్తుత అమాత్యులకు సవాలు విసురుతున్నారు. ఇక ఎమ్మెల్యేల సమాలోచనపై ప్రస్తుత మంత్రులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. వీరిలో కొంతమంది అమాత్యులు బహిరంగంగానే తమ అసహనాన్ని వెల్లడిస్తున్నారు. ‘మా పనితీరుపై అంచనా వేయడానికి వారు ఎవరు. మంత్రి స్థానంలో ఉండాలో లేదో నిర్ణయించాల్సింది హైకమాండ్ లేదా ముఖ్యమంత్రి మాత్రమే. ఇలా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారి పై క్రమశిక్షణా రాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మా పదవులను ఎలా నిలుపుకోవాలో మాకు తెలుసు.’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొంటున్నారు. ఇలా అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తలోదిక్కుగా ఉంటే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి ఎలా అని? రాజకీయ విశ్లేషకులతో పాటు సగటు మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
ఆ కష్టాలు రాకూడదు
► పేద విద్యార్థుల కోసం ‘విద్యాసిరి’ని స్వయంగా రూపొందించా ► వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మాదే అధికారం ► బడ్జెట్‌పై చర్చలో సుదీర్ఘంగా ప్రసంగించిన సీఎం సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : విద్యనభ్యసించే సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలు ఏ పేద విద్యార్థికీ రాకూడదనే ఉద్దేశంతో ‘విద్యాసిరి’ పథకానికి స్వయంగా రూపకల్పన చేసి అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ‘నేను చదువుకునే సమయంలో మైసూరులో ఓ గది అద్దెకు తీసుకొని ఇంకో మిత్రుడితో కలిసి ఉండేవాడిని. బయట భోజనం చేసేందుకు డబ్బులు సరిపోక మేమే వంట చేసుకునే వాళ్లం. నా స్నేహితుడు వంట చేస్తే నేను పాత్రలు తోమే వాడిని. అప్పట్లో మా ఇంట్లో ఎనిమిది గేదెలు ఉండేవి. వాటి పోషణ ద్వారా వచ్చే డబ్బును కుటుంబ అవసరాలకు ఉపయోగించే వాళ్లం. సెలవుల్లో నేను కూడా గేదెలు కాసేందుకు వెళ్లేవాడిని’ అని చెప్పారు. తాను విద్యనభ్యసించే సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పటి తరం పేద విద్యార్థులు ఎదురుకాకుండా ఉండాలనే లక్ష్యంతోనే విద్యార్థులకు ఉపయుక్తమైన ‘విద్యాసిరి’ కార్యక్రమాన్ని రూపొందించామని పేర్కొన్నారు. విద్యాసిరి పధకంలో భాగంగా వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,500 విద్యార్థి వేతనాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. హాస్టల్స్‌లో సీటు లభించని విద్యార్థులకు భోజనానికి ఇబ్బంది కాకుండా ఈ పథకాన్ని రూపొందించినట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మాదే అధికారం...... ఇక బడ్జెట్‌పై చర్చకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగిస్తూ రాష్ట్ర జిఎస్డీపీ పెరగడంపై మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు సి.టి.రవి, బసవరాజ బొమ్మాయ్ ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. ‘గతంలో రాష్ట్రంలో ఉన్న స్థిరమైన ధరలను బట్టి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ (జిఎస్డీపీ)ని లెక్కగట్టేవారు. అయితే ప్రస్తుతం మార్కెట్ ధరలను బట్టి జీఎస్డీపీని లెక్కగడుతున్నారు. అందువల్ల రాష్ట్ర జీఎస్డీపీ పెరిగినట్లు కనిపిస్తోంది. అంతేతప్ప ఇందులో మీ ప్రభుత్వం సాధించిందేమీ లేదు’ అని విమర్శించారు. ముఖ్యమంత్రి కలగజేసుకొని ‘మీరు చాలా తెలివైన వారు, మీ ముందు మేమెంత’ అంటూ చమత్కరించారు. ఈ సందర్భంలో బసవరాజ బొమ్మాయ్ కలగజేసుకొని ‘మీరు అలా అనకండి, మీరు లాయర్ కావడంతో పాటు చాలా తెలివైన వారు కాబట్టే కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లను వెనక్కు నెట్టి జేడీఎస్ నుంచి వచ్చి సీఎం స్థానంలో కూర్చున్నారు’ అని అన్నారు. వెంటనే సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ....‘ప్రజల ఆశీర్వాదాలు మాకు తోడుగా ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ సైతం నాకు తోడుగా ఉంది. అందువల్లే ఇక్కడికి వచ్చి కూర్చోగలిగాను. 2018లో సైతం మా పార్టీనే అధికారంలోకి వస్తుంది. బీజేపీ నేతలు మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే’ అని జోష్యం చెప్పారు. -
హస్తినకు పోయిరావలె!
మంత్రి పదవుల కోసం పెరుగుతున్న డిమాండ్ సాక్షి, బెంగళూరు: మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు పట్టుబడుతున్న అధికార పక్ష ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ద్వారా కొత్త వారికి అవకాశం కల్పించాలని చాలా మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవిని ఆశిస్తున్న ఆశావహులంతా ఢిల్లీ బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. బడ్జెట్ సమావేశాలు పూర్తై అనంతరం ఏప్రిల్‌లో వీరు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో పార్టీ కోసం పనిచేస్తున్న మరికొంత మంది ఎమ్మెల్యేలకు సైతం మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని, పనితీరు సరిగ్గా లేని మంత్రులను పదవుల నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. వారిని అలాగే కొనసాగనిస్తే 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు రేస్‌లో వెనకబడిపోతుందనేది వీరి వాదన. అందువల్ల ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిని ఆయా పదవుల నుంచి తప్పించి, వారికి పార్టీలో పదవులు ఇప్పించాలని ఆశావహ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తద్వారా పార్టీ పటిష్టతకు కృషి చేసినట్లు అవుతుందనేది వీరంతా అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే సందర్భంలో కొత్త వారికి మంత్రి పదవులు కల్పించడం ద్వారా కూడా ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడుతుందని, ఇది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులకు కలిసొస్తుందనేది వీరి వాదన. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం గత కొంత కాలంగా బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రి వర్గ పునఃనిర్మాణాన్ని చేపడతామని చెబుతూ వస్తున్నారు. అయితే ఇందుకు ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇస్తుందా, లేదా అన్న అనుమానాలు సైతం ఆశావహ ఎమ్మెల్యేల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా తామే వెళ్లి పార్టీ హైకమాండ్ నేతలను కలిసి మంత్రి వర్గ పునఃనిర్మాణంపై ఆలోచించాల్సిందిగా కోరనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. -
సిద్ధరామయ్యతో ఖర్గే భేటీ
క్యాంపు కార్యాలయం కృష్ణాలో సమావేశం సాక్షి, బెంగళూరు: లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో మల్లికార్జున ఖర్గే, సీఎం సిద్ధరామయ్యతో శనివారం ఉదయం సమావేశమై అరగంటకు పైగా చర్చించారు. ఏసీబీ ఏర్పాటు పై విపక్షాలతో పాటు స్వపక్ష ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. మంత్రి మండలి విస్తరణ, కేపీసీసీ అధ్యక్షుడి మార్పు, ఏసీబీ ఏర్పాటు తదిరత విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీ అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.....ఏసీబీ ఏర్పాటుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎలాంటి వివరణ కోరలేదని తెలిపారు. 15 రాష్ట్రాల్లో ఇప్పటికే ఏసీబీ పనిచేస్తోందని, అందులో భాగంగానే కర్ణాటకలోనూ ఏసీబీని ఏర్పాటు చేశారని చెప్పారు. ఏసీబీ ఏర్పాటు వల్ల లోకాయుక్త బలహీనపడుతుందనడంలో నిజం లేదని అన్నారు. ఈ విషయంపై స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే వివరణ ఇచ్చారని తెలిపారు. ఏసీబీ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి, జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామిలు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన మాట వాస్తవమేనని అయితే ఈ విషయంపై సోనియాగాందీ ఎలాంటి వివరణ కోరలేదని పేర్కొన్నారు. ఏసీబీ ఏర్పాటు వల్ల లోకాయుక్త బలహీనపడుతుందని ప్రతిపక్షాలు భావిస్తే ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని అన్నారు. -
సీఎంపై అధిష్టానం గుర్రు
► బడ్జెట్ సమావేశాల తర్వాత ఢిల్లీ రావాలని సూచన ► ఏసీబీ ఏర్పాటుపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి సాక్షి, బెంగళూరు: అవినీతి నిరోధక దళం(ఏసీబీ) ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుసరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉంది. ఏసీబీ ఏర్పాటు సమయంలో హైకమాండ్‌కు ఏమాత్రం సమాచారం అందజేయకపోవడంతో పాటు సొంత పార్టీ నేతల సూచనలను కూడా పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా సీఎం సిద్ధరామయ్యకు హైకమాండ్‌ను పిలుపు అందింది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తై అనంతరం సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక రాష్ట్రంలో అవినీతి పరులకు సింహస్వప్నంగా ఉన్న లోకాయుక్త సంస్థను నిర్వీర్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ఏర్పాటు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే సందర్భంలో జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి సైతం ‘ఏసీబీ’ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా సీఎంకు సూచించాలంటూ ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు ఇప్పటికే లేఖలు రాశారు. రెండు రోజుల క్రితం జరిగిన సీఎల్పీ సమావేశంలో సైతం ‘ఏసీబీ’ ఏర్పాటు విషయంలో తమతో సంప్రదించలేదని, తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నిలదీశారు. ఏసీబీ’ ఏర్పాటుకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ సైతం గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. ‘దేశంలోనే అత్యంత చక్కని పనితీరు ఉన్న లోకాయుక్తగా కర్ణాటక లోకాయుక్తకు పేరంది. అలాంటి సందర్భంలో లోకాయుక్తను నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకోవడం సరికాదు’ అని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా లోకాయుక్తలో సీఎంతో పాటు మరో ఐదుగురు కేబినెట్ మంత్రులపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే ‘ఏసీబీ’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థల ప్రతినిధులు సైతం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘ఏసీబీ’ ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్ సమర్ధిస్తుందా అన్న అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో నెలకొన్నాయి. -
ప్రజలే దేవుళ్లు !
► నమ్మేది సామాజిక న్యాయాన్నే ► ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: ‘నేను నాస్తికుడిని కాదు, నా దృష్టిలో దేవుళ్లంటే ప్రజలే. నేను నమ్మేది సామాజిక న్యాయాన్నే’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. సిద్ధరామయ్య స్వగ్రామం మైసూరు జిల్లా సిద్దరామనహుండిలో శుక్రవారం జరిగిన జాతర మహోత్సవంలో సిద్ధరామయ్య పాల్గొని, గ్రామస్తులతో అనేక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో సిద్ధరామయ్య ముచ్చటించారు. సిద్ధరామనహుండిలో మూడేళ్లకోసారి సిద్ధరామేశ్వర, చిక్కతాయమ్మల జాతర మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. 2011లో జాతర జరిగిన సందర్భంలో తాను కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అయితే ఆలయ జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో ఐదేళ్లుగా జాతర మహోత్సవాన్న నిర్వహించలేక పోయారని పేర్కొన్నారు. తాను దేవుడిని నమ్ముతానని, అయితే మూఢ నమ్మకాలను, ఆచారాలను ఒప్పుకోనని స్పష్టం చేశారు. ప్రజలకు అందాల్సిన సామాజిక న్యాయానికే తాను ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తానని అన్నారు. బసవణ్ణ తత్వాలు, సిద్ధాంతాలను తను నమ్ముతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. లోకాయుక్తకు ఎలాంటి నష్టం ఉండబోదు..... అవినీతి నిరోధక దళం(ఏసీబీ) ఏర్పాటు కారణంగా లోకాయుక్తకు ఎలాంటి నష్టం ఉండబోదని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. లోకాయుక్తకు ఉన్న ఎలాంటి అధికారాలనూ మార్చలేదని, కేవలం అవినీతిని మరింత పటిష్టంగా ఎదుర్కొనేందుకు మాత్రమే ఏసీబీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ విషయంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు విపక్షాలకు సైతం ఎలాంటి అనుమానాలున్నా వాటిని నివృత్తి చేస్తానని వెల్లడించారు. -
కర్ణాటక ‘అడ్డుక ట్ట’ తొలగించండి
► నీళ్లిచ్చి తాగునీటి కష్టాలు తీర్చండి ► పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన ► జేసీ హామీతో రాస్తారోకో విరమణ మాగనూర్: కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా వేస్తున్న నీటి అడ్డుకట్టలను తొలగించాలని.. తమ సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ మండలంలో ని టైరోడ్‌లో మంగళవారం కృష్ణానది తీరప్రాంత రైతులు 3గంటల పాటు రా స్తారోకో నిర్వహించారు. కొందరు రైతు లు పురుగుమందు డబ్బాలను చేతపట్టుకొని నిరసన తెలిపారు. అడ్డుకట్టను తొలగించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని కొందరు రైతులు తమ ఆవేదన వెళ్లగక్కారు. కర్ణాటక దౌర్జన్యంగా మన భూభాగంలోని నదినీటికి అడ్డుకట్టవేస్తున్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బంగారు తెలంగాణ అంటున్న కేసీ ఆర్కు తాము తాగునీటికి పడుతున్న సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నదితీర ప్రాంతంలోని ప్రజలు ఇంతటి దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటుండగా ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక తహశీల్దార్ కృష్ణస్వామి అక్కడిచేరుకుని ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసాఇచ్చారు. కానీ రైతులు సమ్మతించలేదు. చివరికి అక్కడినుంచే జేసీ రాంకిషన్‌కు తహశీల్దార్ సమస్యను ఫోన్లో వివరించారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు సిద్రాంరెడ్డి, సంతోష్, వెంకటేష్, సూగిరెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణ, నింగప్ప, గుండప్ప, తిమ్మప్ప, రవి, గణపతి, రాంబాబు, శివప్ప, శంక్రప్ప, బషీర్, వెంకటేష్, ఉషెనప్ప, రాకేష్, తిమ్మప్ప, ప్రతాప్ పాల్గొన్నారు. పరిశీలించిన డీఆర్ఓ, డీఎస్పీ కృష్ణానదిలో నీటి ప్రవాహానికి అడ్డుకట్టవేసి ఆ నీటిని కేపీసీ పవర్‌ప్లాంట్‌కు కర్ణాటక తరలిస్తున్న ప్రాంతాన్ని డీఆర్ఓ బాస్కర్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, జూరాల ప్రాజెక్టు ఈఈ శ్రీధర్ పరిశీలించారు. ఉదయం నదితీరప్రాంతాల రైతులు కర్ణాటక వేసి న అడ్డుకట్టలను తొలగించాలని డిమాం డ్ చేస్తూ టైరోడ్‌లో రాస్తారోకో చేసిన విషయాన్ని తహశీల్దార్ కృష్ణస్వామి అధికారులకు వివరించారు. ఈ విషయమై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుని, ఈ ప్రాంతరైతులకు న్యాయం చేస్తామన్నారు. వారివెంట సీఐ శ్రీనివాస్, ఆర్ఐ సురేష్, కృష్ణ ఎస్ఐ రియాజ్ ఆహ్మద్, మాగనూర్ ఎస్ఐ నర్సయ్య, పలువురు రైతులు ఉన్నారు. -
బడ్జెట్లో నిధుల కేటాయింపు హర్షణీయం
బళ్లారి టౌన్ : సీఎం సిద్ధరామయ్య 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉప్పార సమాజాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందని ఉప్పార సంఘం ప్రధాన కార్యదర్శి, కేంద్ర పరిహార సమితి అధ్యక్షుడు యు.వెంకోబ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీభాగిరథి గురు పీఠం, శ్రీ పురుషోత్తమానందపురి స్వామి నేతృత్వంలో కర్ణాటక రాష్ట్ర ఉప్పార సంఘ పదాధికారులు ఈనెల 14న బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి సముదాయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి పత్రం ఇచ్చినందున, స్పందించిన సీఎం తమ సమాజాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారని తెలిపారు. -
కేసుల నుంచి బయట పడేందుకే..
ప్రభుత్వం ‘ఏసీబీ’ ఏర్పాటు చేయడంపై హీరేమఠ్ వ్యాఖ్యలు బెంగళూరు: సీఎం సిద్ధరామయ్యతో పాటు మరో ఐదుగురు మంత్రులపై లోకాయుక్తలో ఉన్న కేసుల నుంచి బయట పడేందుకే (యాంటీ కరప్షన్ బ్యూరో-ఏసీబీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సమాజ పరివర్తనా సంస్థ ప్రతినిధి ఎస్.ఆర్.హీరేమఠ్ ఆరోపించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏసీబీ ఏర్పాటు ద్వారా లోకాయుక్త సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయనుందని, తద్వారా సీఎంతో పాటు ఐదుగురు మంత్రులపై లోకాయుక్తలో ఉన్న కేసులను లోకాయుక్త నుండి ఏసీబీకి బదలాయించి ఆయా కేసుల నుండి బయటపడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహమని ఆరోపించారు. లోకాయుక్తలో ఉన్న 700 కేసులను సైతం ఇప్పటికే ఏసీబీకి బదలాయించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. త్వరలో ఏసీబీ ఏర్పాటుపై కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. -
సర్కార్ రైతు బాట
బడ్జెట్లో సేద్యానికి పెద్దపీట అంచనా వేస్తున్న నిపుణులు బెంగళూరు: ఈ సారి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టేబోయే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయనున్నారని తెలుస్తోంది. రెండేళ్ల పాటు ఎటువంటి ఎన్నికలు లేకపోవడం వల్ల అన్నభాగ్య, క్షీరభాగ్య, తదితర సంక్షేమపథకాల కంటే రైతులకు మేలు చేసే విధానాలను బడ్జెట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పొందుపరచనున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థికశాఖను కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత (2013) వరుసగా సిద్ధరామయ్య పూర్తిస్థాయి బడ్జెట్‌ను మూడోసారి, మొత్తంగా 11వ సారి శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఉచిత సంక్షేమ పథకాల కంటే వ్యవసాయ రంగానికి సీఎం సిద్ధరామయ్య తన బడ్జెట్లో పెద్దపీఠ వేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వరుసగా రెండో ఏడాది తీవ్రవైన కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. దీంతో సాగు నీటితో పాటు పశుపోషణ కష్టంగా ఉంది. అంతేకాకుండా సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో బీడు భూములకు నీటిపారుదల సౌకర్యం కల్పించలేదు. దగ్గర్లో ఏ ఎన్నికలు లేనందున ఒకటి రెండు సంక్షేమపథాకాలు మినహా గతంలో మాదిరిగా చెప్పుకోదగ్గ సంక్షేమపథకాలు బడ్జెట్లో పొందుపరిచే అవకాశం లేదని సమాచారం. 2016-17 బడ్జెట్లో సంక్షేమం కంటే రైతులకు మేలుచేకూర్చేలా వ్యవసాయ రంగంపై సిద్ధరామయ్య ఎక్కువ దృష్టిసారించనున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అప్పుల కుప్పలు... రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాథాన్యత ఇవ్వడం వల్ల వాటి అమలుకు వివిధ రూపాల్లో ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రోజువారి ప్రభుత్వ నిర్వహణ ఖర్చు కూడా పెరుగుతూ పోతోంది. దీంతో సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర అప్పులు రూ.59,323 కోట్లు. దీంతో రాష్ట్రంలోని ఒక్కొక్కరి తల పై రూ.28,819 ఆప్పు ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు లెక్కగట్టారు. -
అసంతృప్తి..
⇒సిద్దు ఒంటెత్తు పోకడలపై సీనియర్ల ఆగ్రహం ⇒ఆయనను పదవి నుంచి తప్పించే దిశగా నేతల యత్నాలు ! ⇒వ్యూహానికి పదును పెడుతున్న కాంగ్రెస్ సీనియర్లు ⇒ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే అవకాశం బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి తప్పించే దిశగా కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించేందుకు ఇప్పటికే వీరు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. అయితే ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల అనంతరం హైకమాండ్‌ను కలిసి సిద్ధరామయ్యపై తమ ఫిర్యాదుల చిట్టాను అందజేయనున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వలసదారుడైన సీఎం సిద్ధరామయ్యపై మూలతహా కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు తమ అసంతృప్తిని వీరు చాలా సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడించారు కూడా. మూలతహా కాంగ్రెస్ నాయకులైన ఎస్.ఎం.కృష్ణ, జాఫర్ షరీఫ్, ఎం.వి.రాజశేఖరన్, బి.కె.హరిప్రసాద్‌తో పాటు మరికొందరు నేతలు సిద్ధరామయ్య పాలనపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. పాలనా విషయాలకు సంబంధించిన అంశాల్లోనే కాకుండా ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో కూడా సీఎం సిద్ధరామయ్య తమ అభిప్రాయాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వీరంతా హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూనే వస్తున్నారు. అందువల్లే బీదర్, హెబ్బాళ, దేవదుర్గ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనే కాకుండా జిల్లా తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పరాభవం జరిగిందనేది వారి వాదన ఈ పరిణామాలన్నింటిని కాంగ్రెస్ హైకమాండ్ సైతం నిశితంగా గమనిస్తూ వస్తోంది. అయితే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహంపై చర్చలు జరపడంలో హైకమాండ్ తలమునకలై ఉంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో తన దృష్టిని పూర్తిగా ఈ ఐదు రాష్ట్రాలపై కేంద్రీకరించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించడంపై కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ నేతల నుంచి వస్తున్న డిమాండ్లను కొద్దికాలం పాటు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సైతం హైకమాండ్ వివరించినట్లు సమాచారం. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు సీఎం సిద్దరామయ్య కుర్చీకి ఎలాంటి ముప్పు ఉండబోదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక సిద్ధరామయ్య సైతం ఈనెల 18న ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ రూపకల్పనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఈనెల ఆఖరు వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడంపై సీఎం సిద్ధరామయ్య వ్యూహ రచన చేస్తున్నారు. -
మొద్దు నిద్రలో సిద్ధు సర్కార్
నిప్పులు చెరిగిన శెట్టర్ బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రలో ఉందని శాసనసభ విపక్షనేత జగదీష్‌శెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకుని అనుమానాస్పద స్థితిలో మరణించిన కలెక్టర్ డీ.కే రవి కుటుంబ సభ్యులకు ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హుబ్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డీ.కే రవి మరణించి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకూ వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందలేదన్నారు. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరే కారణమని అభిప్రాయపడ్డారు. అందువల్లే డీ.కే రవి వర్ధంతికి ఆయన తల్లి బంగారు అభరణాలను కుదువ పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి డీ.కే రవి కుటుంబ సభ్యులను ఆదుకోవాలన్నారు. -
మహిళలకు ప్రత్యేక బ్యాంకు: సీఎం
సాక్షి,బెంగళూరు: మహిళల కోసం ప్రత్యేకంగా బ్యాంకును ప్రారంభించే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ బ్యాంకు మహిళ ఆర్థిక అవసరాలకు చేయూత నిస్తుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ అధ్వర్యంలో మంగళవారం ఇక్కడ నిర్వహించినకార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను ప్రభుత్వం తరఫున ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళా రైతులకు అవసరమైన రుణాలు ఇవ్వడం మొదలు మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం వరకూ అవసరమైన ఆర్థిక అవసరాలు తీర్చడానికి వీలుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక బ్యాంకును ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ విషయమై నిపుణులతో చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. మహిళల పై జరుగుతున్న దౌర్జన్యాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చించడానికి ప్రతి శాసనసభ సమావేశాల్లో ప్రత్యేకంగా ఒక రోజు మొత్తాన్ని కేటాయించే ఆలోచన కూడా ఉందన్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు, వాటి ఖర్చును ఆర్థికశాఖలో ప్రత్యేక శీర్షిక కింద వివరించనున్నామన్నారు. వరకట్న, బ్రూణ హత్యల నిషేధం తదితర ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రజల ఆలోచనల్లో మార్పు రానంత వరకూ ప్రయోజనం శూన్యమన్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్టు పడాలంటే మహిళలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 1.5 లక్షల స్త్రీ శక్తి సంఘాలు ఉన్నాయని ఇందులో 21 లక్షల మంది సభ్యులుగా ఉన్నారన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో స్త్రీ శక్తి సంఘాలు లేవని వాటి ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల విషయంలో మహిళల కోసం ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సూచించారు. -
పదవి నుంచి తప్పించే కుట్ర
శాసన సభలో విపక్షాలపై సిద్ధు మండిపాటు చిన్న విషయాలపై అనవసర రాద్ధాంతం అది దొంగలించిన వాచీ కాదు... ఓ మిత్రుడి బహుమానం వాచీపై సీఎం వివరణ బెంగళూరు: వెనకబడిన వర్గాల వారి తరఫున ఎవరు మాట్లాడినా, వారి గొంతు నొక్కే ప్రయత్నం ఎంతో కాలంగా జరుగుతూనే ఉందని, అందులో భాగంగానే ఇప్పుడు కూడా తనను పదవి నుంచి తప్పించే కుట్రకు తెరతీశారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విపక్షాలపై మండిపడ్డారు. అందులో భాగంగానే వాచ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే విషయమై శాసన సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న వాచీ సంబంధ ఆరోపణలు, రాజకీయంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ఇదే సందర్భంలో శాసన సభలో సీఎం సిద్ధు ఉటంకించారు. తాను దేవుడిని నమ్ముతానని అయితే రోజూ పూజలు, హోమాలు చేయనన్నారు. బసవణ్ణ సిద్ధాంతాలను ఆచరిస్తానని పేర్కొన్నారు. ఆత్మసాక్షిని నమ్ముకుని పనిచేస్తున్నానని ఒక్క ఆరోపణ కూడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నానని సిద్ధరామయ్య తెలిపారు. ఈ సమయంలో కలుగజేసుకున్న జేడీఎస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ కుమారస్వామి...‘అర్కావతి డీ నోటిఫికేషన్ విషయంలో మీరు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారన్నది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ఇందుకు సీఎం సమధానమిస్తూ...‘అర్కావతి విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. నాకు న్యాయస్థానంపై నమ్మకముంది. అందువల్ల ఈ విషయంపై ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. మీపై రూ.150 కోట్ల లంచం ఆరోపణలు రాలేదా?’ అంటూ ప్రశ్నకు ప్రశ్నగా సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదు కేసులను సీబీఐకు అప్పగించానని మీ హయాంలో ఒక్క కేసు అయినా సీబీఐ చేత దర్యాప్తు చేయించారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఒక్క తప్పు కూడా జరగలేదని తాను అనడం లేదని అయితే చిన్న విషయాలను కూడా భూతద్ధంతో చూపిస్తూ తనపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘నేను వెనుకబడిన తరగతికి చెందిన వాడిని. రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడిన వారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం చాలా కష్టం. అయినా నేను కష్టపడి ఆ స్థానంలో కుర్చొన్నాను. ఇప్పుడు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఇబ్బందిగా ఉంది. మొత్తంగా సామాజికంగా వెనుకబడిన వారు సీఎం పీఠం దక్కించుకోవడం చాలా కష్టం అనుకుంటే ఆ స్థానంలో కొనసాగడం మరింత కష్టం’ అంటూ విశ్లేషించారు. దొంగిలించిన వాచీ కాదు... తాను ధరించిన ఖరీదైన హోబ్లాట్ వాచ్ దొంగలించినది కాదని స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చిందేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసనసభకు స్పష్టం చేశారు. సదరు వాచీపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడం, శాసనసభ సమావేశాలు ముగిసేలోపు సీఎం సిద్ధరామయ్యతో వివరణ ఇప్పిస్తానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప రెండు రోజుల ముందు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య శాసనసభ సమావేశాలు ముగిసిన శనివారం రోజుల సదరు వాచ్‌పై వివరణ ఇచ్చారు. స్నేహితుడు కానుకగా ఇచ్చిన వాచ్‌పై జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆ సమయంలో కలుగజేసుకున్న విపక్ష బీజేపీ ఫ్లోర్‌లీడర్ జగదీష్‌శెట్టర్ ‘ఆరోపణలు వచ్చిన వెంటనే చేతిలో ఉన్న వాచీని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిం ఉంటే సబబుగా ఉండేది. ఇప్పుడు ఏమి చేసినా ఏమి చెప్పినా ప్రజలు నమ్మలేరన్నారు.’ అన్నారు. ప్రజలకు అన్నీ తెలుసునని తాను ఇచ్చిన వివరణను అందరూ నమ్ముతున్నారని సిద్ధరామయ్య జవాబిచ్చారు. ఆ సమయంలో కలుగ జేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప ‘మీరు ఇచ్చిన జవాబు సరే...అయితే మీకు గిఫ్ట్‌గా ఇచ్చిన వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు పోలీసుల చేతికి చిక్కుతారు.’ అన్నారు. దీంతో కంగు తిన్న సీఎం సిద్ధరామయ్య అలాంటిది ఏమీ జరుగదు. సదరు వాచ్‌కు ఆయన అన్ని రకాల పన్నులు చెల్లించారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు కూడా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆయన అందజేశారు.’ అని సిద్ధరామయ్య వివరణ ఇవ్వడంతో వాచ్‌పై చర్చకు తెరపడింది. -
కుమారస్వామి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
రాయచూరు : కుమారస్వామి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి లేదని జనతాదళ్(ఎస్) తాలూకా అధ్యక్షుడు ఎం.లింగప్ప ధడేసూగూరు పేర్కొన్నారు. కేపీసీసీ వెనుకబడిన వర్గాల రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు కే.కరియప్ప కుమారస్వామి గురించి చులకనగా మాట్లాడటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వారి స్నేహితుడి నుంచి రూ.70 లక్షల విలువ చేసే వాచ్‌ని కానుకగా తీసుకోవడంపై కుమార స్వామి ప్రశ్నించడం తప్పు కాదన్నారు. కుమారస్వామి ఎన్నో కుంభకోణాలు వెలికి తీశారని ఆయన గుర్తు చేశారు. కరియప్ప మాత్రం విలేకరుల సమావేశంలో సిద్ధరామయ్య వాచ్ విషయం తప్ప కుమారస్వామికి వేరే పని లేదని, కుమారస్వామి కూడా కార్లు, సైట్లు తీసుకున్నట్లు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం తగదన్నారు.తాలూకా జేడీఎస్ ఉపాధ్యక్షుడు మహిబూబ్ పాషా, జేడీఎస్ నేత ధర్మనగౌడలు విలేకరుల సమావేశంలో ఉన్నారు. -
ఆ వాచీని క్యాబినెట్ హాల్లో పెడతా: సీఎం
సాక్షి,బెంగళూరు: తాను ధరించిన ఖరీదైన వాచ్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటిసారిగా నోరు విప్పారు. సదరు వాచ్‌ను విధానసౌధలో క్యాబినెట్ మీటింగ్ జరిగే కార్యాలయంలో పెడుతానన్నారు. ఆ వాచ్‌ను ఇక ధరించబోనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రూ.70 లక్షల విలువైన వాచ్‌ను ధరిస్తున్నట్టు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం లేపడంతో పాటు సీఎం సిద్ధు వ్యవహార శైలి పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై ఆరోపణలు వచ్చిన దాదాపు పదిహేను రోజుల తర్వాత గురువారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వాచ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘ఆ వాచ్‌ను కేరళకు చెందిన డాక్టర్ గోపాల పిళ్లై గిరీష్ చంద్ర వర్మ నాకు ఇచ్చారు. ఆయన దావణగెరెలో ఎంబీబీఎస్, మంగళూరులో ఎం.ఎస్ చేశారు. అటుపై వివిధ దేశాల్లో ప్రాక్టీస్ కొనసాగించి ప్రస్తుతం దుబైలో స్థిరపడ్డారు. నాకు అతను 1983 నుంచి తెలుసు. మేము మంచి మిత్రులం. గత ఏడాది జులైలో బెంగళూరుకు వచ్చినప్పుడు ఆయన తన చేతిలో ఉన్నా వాచ్‌ను తీసి నా చేతికి తొడిగారు. నేను వద్దాన్నా వినలేదు. స్నేహితుడే కదా ఇచ్చింది అని నేను కూడా తీసుకున్నా. మొదట్లో నేను ఆ వాచ్‌ను వాడలేదు. నాలుగు నెలల నుంచి మాత్రమే వాచ్‌ను ధరిస్తున్నాను. ఈ వాచ్ పై ఇంత వివాదం చెలరేగింది. ఇక ఈ వాచ్‌ను ధరించను. క్యాబినెట్ హాల్లో ఉంచేస్తాను.’ అని తెలిపారు. ఇదిలా ఉండగా సీఎం సిద్ధరామయ్య వివరణ పలు అనుమానాలకు తావిస్తోందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. వివరణ ఇవ్వడానికి పదిహేను రోజులు ఎందుకు తీసుకున్నట్టు అంటూ ప్రశ్నించారు. -
మార్పులకు వేళాయే..
బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణ పదకొండు జెడ్పీ అధ్యక్ష పీఠాలను చేజెక్కించుకుంటాం సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణ చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ఫలితాలకు మంత్రి మండలిలో మార్పులకు సంబంధం లేదని ఆయన తెలిపారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగళూరులోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మంత్రి వర్గ పునఃవ్యవస్థీకరణకు సమయం ఆసన్నమైందని, బహుశా బడ్జెట్ సమావేశాల తర్వాత ఆ ప్రక్రియను చేపడుతామని వివరించారు. తాజా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో తాము సొంతంగా 25 జెడ్పీ అధ్యక్షస్థానాలు గెలుచుకుంటామని భావించినా అలా జరగలేదన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం 1,705 గెలుచుకున్న టీపీ క్షేత్రాలకు అదనంగా మరో 100-150 ఎక్కువ స్థానాలు గెలుస్తామని భావించినా ఆ మేరకు గెలువలేకపోయామన్నారు. విపక్షాలైన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌లతో పోలిస్తే తమకే అటు జెడ్పీ క్షేత్రాలు ఇటు టీపీ క్షేత్రాల్లో మెజారిటీ సీట్లు సాధించామన్నారు. ప్రస్తుత ఫలితాలను అనుసరించి పదకొండు జెడ్పీ అధ్యక్ష పీఠాలను సొంతంగా చేజెక్కించుకుంటామన్నారు. ఎనిమిది చోట్ల బీజేపీ, జేడీఎస్ సొంతంగా రెండు జెడ్పీ అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకుంటాయాన్నారు. మిగిలిన తొమ్మిది చోట్ల పొత్తులు పెట్టుకునే విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు ఉండబోదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు పరమేశ్వర్ ఢిల్లీ వెళ్లినట్టు తనకు తెలుసునని బడ్జెట్ సమావేశాల విషయమై తాను బిజీగా ఉండటం వల్ల ఢిల్లీ వెళ్లలేదన్నారు. సమయం చూసుకుని తాను హైకమాండ్ పెద్దలను కలుస్తాన ని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానమిచ్చారు. -
కలకలం
సీఎంపై పేపర్ బంతితో దాడి బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగించే సమయంలో ఒక వ్యక్తి బాంబ్...బాంబ్ అంటూ చేతిలోని పేపర్‌బంతిని విసరడం కలకలం రేపింది. చివరికి అతను తాగుబోతు అని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉదయభాను కళాసంఘం స్వర్ణోత్సవ సంబరాలు బెంగళూరులోని రవీంద్రకళాక్షేత్ర ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం సిద్ధరామయ్య ప్రసంగించడానికి వేదిక వద్దకు వెళ్లారు. ఈ సమయంలో ఆడిటోరియం మొదటి అంతస్తులోని ఓ వ్యక్తి...‘మీరు మా సమాజానికి ఏమి చేశారో మొదట చెప్పి ప్రసంగించాలి’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ఆ వ్యక్తి ‘అంతా మీరే తింటున్నారు. మా కోసం ఏం చేశారో చెప్పేవరకూ నేను మిమ్మల్ని వదలను’ అంటూ చేతిలోని ఒక ఎర్రని వస్తువును బాంబ్..బాంబ్ అంటూ సీఎం ఉన్న వేదిక పైకి విసిరాడు. దీంతో కార్యక్రమంలో కలకలం చెలరేగింది. పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వస్తువును పరీక్షించగా కొన్ని మాత్రలపై కాగితాలను గుండ్రంగా చుట్టి దానిపై చాక్లెట్ రాపర్స్‌ను అతికించినట్లు తేలింది. దీంతో పోలీసులతో పాటు వేదికపైనే ఉన్న కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్, పలువురు సాహితీవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధరామయ్యపై పేపర్ బంతితో దాడికి యత్నించిన వ్యక్తి బీబీఎంపీ అరణ్య విభాగం ఉద్యోగి ప్రసాద్ అని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిత్రదుర్గాలో మీడియాతో మాట్లాడుతూ...‘ఉద్దేశపూర్వకంగానే కొంతమంది ఈ దాడికి పాల్పడి ఉండటాన్ని కొట్టిపారేయలేం. అయినా ఇలాంటివన్నీ ప్రజాస్వామ్యంలో సాధారణం. మా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి సమాన అవకాశాలు కల్పిస్తుంది’ అని అన్నారు. -
ఆ కార్లు, వాచీలు మీకు ఎవరిచ్చారు?
హెచ్.డి.కుమారస్వామికి ఎమ్మెల్సీ ఉగ్రప్ప ప్రశ్నాస్త్రాలు సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.50 నుంచి 70లక్షల విలువైన వాచ్ విషయాన్ని బహిర్గతం చేసిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామిపై కాంగ్రెస్ నేతలు ప్రతి విమర్శలకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఉగ్రప్ప, మాజీ సీఎం కుమారస్వామిపై ప్రశ్నాస్త్రాలను సంధించారు. శనివారమిక్కడ విధానసౌధలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమారస్వామి, ఆయన కుటుంబం వినియోగిస్తున్న లగ్జరీ కార్లు, వాచ్‌ల వివరాలతో కూడిన జాబితాను ఉగ్రప్ప విడుదల చేశారు. అనంతరం ఉగ్రప్ప విలేకరులతో మాట్లాడుతూ....‘కుమారస్వామి ఆయన కుటుంబం కోట్ల రూపాయల విలువ చేసే కార్లను వినియోగిస్తోంది. రూ.8కోట్ల విలువ చేసే లంబోర్గిని, రూ.3కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్, రూ.1.2కోట్ల విలువ చేసే ఇన్ఫినేటివ్ ఎఫ్ఎక్స్ కార్లను కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు. ఇక వీటితో పాటు మొత్తం ఎనిమిది కారులు కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు. ఇందులో రెండు కార్లు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కూడా కాలేదు’ అని అన్నారు. ఇక కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.6కోట్ల విలువ చేసే కారు, రూ.1.3కోట్ల విలువ చేసే డైమండ్ వాచ్‌ను దుబాయ్‌లో ఒక వ్యక్తి నుండి బహుమతిగా అందుకున్నారని ఆరోపించారు. ఈ బహుమతులు ఆయనకు ఎవరు ఇచ్చారో, ఏ పని చేసినందుకు ప్రతిఫలంగా అందుకున్నారో తెలపాలని కుమారస్వామిని డిమాండ్ చేశారు.ఇవే కాక రూ.50లక్షల విలువైన ఫ్రాంక్ ముల్లర్(డైమండ్) వాచ్, రూ.25లక్షలు విలువైన ఫ్రాంక్ ముల్లర్ వాచ్, రూ.5లక్షల విలువైన రాడో వాచ్‌లతో పాటు మొత్తం 50 వాచ్‌లను కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో కుమారస్వామి ప్రజలకు చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ హెచ్.ఎం.రేవణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
లోకాయుక్తకు ఎస్.ఆర్.నాయక్
పేరు సిఫార్సు చేసిన సీఎం బెంగళూరు: లోకాయుక్త న్యాయమూర్తి స్థానానికి నివృత్త న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయక్ పేరును సిఫార్సు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ మాత్రం మండిపడుతోంది. వివరాలు...లోకాయుక్త నియామకానికి సంబంధించి శుక్రవారం సాయంత్రం కుమారకృపా అతిథి గృహంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, స్పీకర్ కాగోడు తిమ్మప్ప, విధానపరిషత్ సభాపతి శంకరమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివృత్త న్యాయమూర్తి ఎస్.ఆర్.నాయర్ పేరును లోకాయుక్త పదవికి సిఫార్సు చేశారు. అయితే జగదీష్ శెట్టర్ మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నివృత్త న్యాయమూర్తి విక్రమ్‌జిత్ సేన్ పేరును సిఫార్సు చేయాల్సిందిగా సూచించారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆ సూచనను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో జగదీష్ శెట్టర్ ఈ సభలో తీవ్రఅసహనం వ్యక్తం చేశారు. ‘ఏకపక్షంగా మీరే నిర్ణయాలు తీసుకునేటట్లయితే మమ్మల్ని ఈ సభకు ఎందుకు పిలిచినట్లు? మీరే ఏదో ఒక పేరును సిఫార్సు చేస్తే సరిపోయేది కదా? అయినా కేవలం పేరుకు మాత్రమే ప్రతిపక్షాలను పిలిచేలా ఉంటే అసలు మమ్మల్ని ఇలాంటి సమావేశాలకు పిలవకండి. ప్రతిపక్షాల నిర్ణయానికి గౌరవమంటూ లేదా’అని మండిపడ్డారు. దీంతో సిద్ధరామయ్య సైతం ‘నేను చెప్పినదే తుది నిర్ణయం,’ అంటూ సమావేశం నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. -
‘వజ్ర’రామయ్య!
సీఎం సిద్ధరామయ్య వాచ్ ఖరీదు రూ.50-70లక్షలు వాట్సాప్ వీడియోలను సాక్ష్యంగా చూపిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించే వాచ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కన్నా హాట్ టాపిక్‌గా మారింది. ‘లోహియా’ ఆదర్శాలను పాలించే వ్యక్తిగా, అనుచరుడిగా సీఎం సిద్ధరామయ్య తనకు తాను చెప్పుకుంటూ ఉంటారు. అయితే సిద్ధరామయ్య లోహియా పేరును కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని, ఆయన నిజజీవితం పూర్తిగా విలాసవంతమైనదంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి గత కొద్దిరోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య రూ.50-70లక్షల విలువచేసే వాచ్‌ను, రెండు లక్షల రూపాయల విలువ చేసే కళ్లద్దాలు ధరిస్తారని కుమారస్వామి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ‘కుమారస్వామి చెప్పేవన్నీ అబద్ధాలే, కావాలంటే నా కళ్లద్దాలను రూ.50వేలకు, నా వాచ్‌ను పదిలక్షల రూపాయలకు ఇచ్చేస్తాను, తీసుకోమనండి’ అంటూ ప్రతిస్పందించారు. అయితే ఈ విషయానికి సంబంధించిన ఆధారాలను హెచ్.డి.కుమారస్వామి మంగళవారం మీడియాకు అందజేశారు. బీదర్‌లో కుమారస్వామి మాట్లాడుతూ....‘సిద్ధరామయ్య ధరించే వాచ్ హ్యూబ్లోట్ బ్రాండ్‌కు చెందినది. ఈ వాచ్‌ను పూర్తిగా బంగారుపూతతో తయారుచేస్తారు. డయల్‌లోని నంబర్లు వజ్రాలతో చేయబడతాయి. అందువల్లే ఈ వాచ్ ధర రూ.50-70 లక్షలుగా ఉంటుంది. సిద్ధరామయ్య ఓ పెళ్లికి హాజరైనపుడు ఆయన ఈవాచ్ను ధరించారు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా తెప్పించుకొని ఆ వీడియోను దుబాయ్‌కి పంపించి, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాను’ అని తెలిపారు. దీంతో సిద్ధరామయ్య ధరించిన వాచ్ విషయం ప్రస్తుతం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది. -
కాంగ్రెస్‌ను మరింత బలపరచండి
తుమకూరులో సీఎం ఎన్నికల ప్రచారం తుమకూరు : జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలను కోరారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తుమకూరు జిల్లాలో పర్యటించారు. తుమకూరు నగరంలో ఉన్న గ్రంథాలయం వద్ద ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి గ్రామ స్వరాజ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం అనంతరం కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడుతూ... తుమకూరు, కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు గ్రామీణ, ప్రాంతాలకు ఎత్తినహోళె పథకంలో నీరును అందించే పనులు జరుగుతున్నాయని, ఇందులో ఎటివంటి అపోహలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసే బీజేపీ, జేడీఎస్ పార్టీలు అబద్దాలు చెప్పుకుని కాలం వెల్లదీస్తున్నాయన్నారు. అనంతరం ఎంపీ, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా గడచినా ఒక్క రూపాయి కూడా నల్లధనాన్ని ఇండియాకు తీసుకురాలేదని అన్నారు. బడా కంపెనీలకు మాత్రం లబ్ధి చేకూర్చే పనిలో ఉందని ఆరోపించారు. సమావేశంలో హోంమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, ఇన్చార్జ్ మంత్రి టిబి.జయచంద్ర, మాజీ సీఎం వీరప్పమొయిలీ, ఎంపి. ముద్దహనుమేగౌడ, ముఖ్యమంత్రి చంద్రు, రెహామాన్, ఎమ్మెల్యే రఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో సిద్దూ పతనం ప్రారంభం
బళ్లారి ఎంపీ శ్రీరాములు సింధనూరు టౌన్ : కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య హవా పతనం ప్రారంభమైందని బీజేపీ నేత, బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ.శ్రీరాములు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం నగరంలోని బీజేపీ నాయకుడు కొల్లా శేషగిరిరావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులోని హెబ్బాళ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిద్దరామయ్య తన ఆప్తుడు బైరతి సురేష్‌కు టికెట్ సాధించడంలో విఫలం కావడం కాంగ్రెస్ పార్టీలో ఆయన హవా పతనం ఆరంభమైనట్లుగా సూచిస్తోందన్నారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గె గతంలో నుంచి కాంగ్రెస్ అధిష్టానం వద్ద పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇంకా పరిహారం పంపిణీ కాలేదన్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న దేవదుర్గ, బీదర్ నార్త్, హెబ్బాళ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం ఖాయమన్నారు. త్వరలో జరుగనున్న జెడ్పీ, టీపీ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందుతుందన్నారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు కొల్లా శేషగిరిరావు, అమరేగౌడ విరుపాపుర, దేవేంద్రప్ప యాపలపర్వి, బసప్ప కల్లూరు, బసనగౌడ తుర్విహాళ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
సిద్దుపై సీనియర్ల గుస్సా....
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి రెండున్నరేళ్లు కావస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై సీనియర్ నేతల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి రాహుల్ పర్యటన సందర్భంలో బయటపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు సీనియర్ నేతలతో చర్చించేందుకుగాను శుక్రవారం సాయంత్రం పొద్దుపోయాక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై కాంగ్రెస్ సీనియర్ నేతలు పలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ ఏకంగా రాహుల్‌గాంధీ ఎదుటే సిద్ధరామయ్యకు చురకలు అంటించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘రాష్ట్రంలో అసలు ఎవరి కోసం ప్రభుత్వం నడుస్తోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పరిశ్రమలు కూడా రాష్ట్రానికి వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని వెనకబడిన వర్గాల వారికి ఊరటనిచ్చే సంక్షేమ పధకాలేవీ రెండున్నరేళ్లలో ప్రభుత్వం ప్రారంభించలేకపోయింది. కేవలం అన్నభాగ్య, షాదీభాగ్య వంటి పధకాలతో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడం కుదరని పని. ఇక చాలా కాలంగా మంత్రి వర్గ విస్తరణ కూడా వాయిదా పడుతూనే వస్తోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి నెలకొది. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్ తరహా పరిస్థితిని కర్ణాటకలోనూ పార్టీ ఎదుర్కొనాల్సి వస్తుంది’ అని చెప్పారు. ఎస్.ఎం.కృష్ణ మాట్లాడుతున్న సందర్భంలోనే ఆయన మాటలకు సమాధానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందుకు రాగా రాహుల్‌గాంధీ సున్నితంగా వారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘సీనియర్ నేతలు ఏం చెబుతున్నారో ముందు వినండి, తరువాత మీ అభిప్రాయాలను చెప్పండి’ అని రాహుల్‌గాంధీ సూచించడంతో సిద్ధరామయ్య వెనక్కుతగ్గారు. ఇక ఎస్.ఎం.కృష్ణ వ్యాఖ్యలకు సీనియర్ నేత బి.కె.హరిప్రసాద్ సైతం గొంతు కలిపారు. అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తి పెరుగుతూ పోతే అది పార్టీ పటిష్టతపై ప్రభావం చూపే అవకాశం ఉందని సీనియర్ నేతలు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. లేఖ రాసిన అరణ్య అభివృద్ధి మండలి అధ్యక్షుడు.... ఇక సిద్ధరామయ్య తీరుపై సీనియర్ నేతలు రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే సిద్ధరామయ్యకు మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. రాష్ట్ర అరణ్య అభివృద్ధి మండలి అధ్యక్షుడు చలవాధి నారాయణ స్వామి ప్రభుత్వ పగ్గాలను సిద్ధరామయ్య చేతి నుండి తప్పించి కేపీసీసీ అధ్యక్షడు డాక్టర్ జి.పరమేశ్వర్ లేదా పార్లమెంటు సభ్యుడు మల్లికార్జున ఖర్గేలకు అప్పగించాల్సిందిగా రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు త్వరలోనే పదవీగండం తప్పదేమోననే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విసృతంగా జరుగుతోంది. -
అక్రమాలకు పాల్పడి ఉంటే... నా బిడ్డను ఉరి తీస్తా!
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధారాలుంటే చూపండంటూ విపక్షాలకు సవాల్ బెంగళూరు : ‘నిబంధనలకు విరుద్ధంగా ఇసు క తవ్వకాలు, రవాణాలో తన కుమారుడు ఎలాంటి అక్రమాలకు పాల్పడి ఉన్నా అతన్ని ఉరి తీస్తా’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేశంగా అన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలో సిద్దు కుమారుడితో పాటు మంత్రి మహదేవప్ప కుమారుడు హస్తముందంటూ బీజేపీ నేత కె.ఎస్.ఈశ్వరప్ప ఆరోపణలు చేసిన నేపథ్యంలో సీఎం స్పందించారు. మైసూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని విపక్ష నేతలకు హితవు పలికారు. ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు వల్ల రూ. 3,800 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ విషయాలకు సంబంధించిన నివేదికను రాష్ట్ర వ్యవశాఖ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడతో కూడినృబందం మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందజేయనుందని తెలిపారు. రాష్ర్టంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిన వెంటనే సహకార, ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న రైతు రుణాలను బేషరత్తుగా మాఫీ చేస్తానని సవాల్ విసిరారు. అక్రమాలకు పాల్పడిన యడ్యూరప్ప ఇప్పటికే జైలు జీవితం అనుభవించారని, అలాంటి వారి నుంచి నీతి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని మండిపడ్డారు. -
అపోహలు వద్దు
- సీఎం సిద్ధరామయ ఎత్తిన హొళె అమలుకు కట్టుబడి ఉన్నాం - వేమగల్ పారిశ్రామిక వాడలో పలు కర్మాగారాలకు శంకుస్థాపన కోలారు : ఉభయ జిల్లాలకు శాశ్వత నీటి పారుదల సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎత్తినహొళె పథకంపై ఎలాంటి అపోహలు వద్దని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కోలారు తాలూకాలోని వేమగల్ పారిశ్రామిక వాడలో గ్లాక్సో స్మిత్‌లైన్ ఫార్మాసూటికల్, టాటా పవర్ ఎస్ఈడీ, శివం మోటార్ కంపెనీలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. కోలారు జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, జిల్లా వాసులు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నారని అన్నారు. కోలారు జిల్లాకు శాశ్వత నీటి పారుదల సౌకర్యాలను కల్పించడం ద్వారా ఈ సమస్యను అధిగమించనున్నట్లు చెప్పారు. ఎత్తినహొళె పథకం కోసం బడ్జెట్లో రూ. 13 వేల కోట్లను కేటాయించినట్లు గుర్తు చేశారు. వచ్చే ఏడాది మరో వెయ్యి కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 30 జిల్లాలపైకి 27 జిల్లాల్లో కరువు తాండవిస్తోందని, 135 తాలూకాలలో వర్షాభావ పరిస్థితులు నెలకొందని అన్నారు. కోలారు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి కేసీ వ్యాలీ నుంచి శుద్ధీకరించిన నీటిని చెరువులకు మళ్లించనున్నట్లు వివరించారు. దీని వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని అన్నారు. కర్ణాటకలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉండడం వల్ల పరిశ్రమల స్థాపనకు జర్మనీ, తైవాన్, యూకె, జపాన్ వంటి దేశాలకు చెందిన పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఆయా పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంటుందని అన్నారు. వేమగల్ ప్రాంతంలో ప్రారంభమవుతున్న మూడు పరిశ్రమల ద్వారా 2300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. గ్లాక్సో స్మిత్‌క్లెయిమ్ కంపెనీ 1000 కోట్ల పెట్టుబడులతో 500 మందికి ఉద్యోగాలను కల్పిస్తోందన్నారు. టాటా కంపెనీ స్థాపనకు 50 ఎకరాల స్థలాన్ని అందించడం జరిగిందని తెలిపారు. కంపెనీ డిమాండ్ మేరకు 25 ఎకరాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే, యూనెటెడ్ కింగ్డమ్ మంత్రి లార్డ్ ఫిల్టన్ మౌల్డ్, జిల్లా ఇన్చార్జి మంత్రి యు.టి.ఖాదర్, గ్లాక్సోస్మిత్ లైన్ కంపెనీ ఎండీ విదీష్, ఎమ్మెల్యేలు వర్తూరు ప్రకాష్, నారాయణస్వామి, ఎమ్మెల్సీ నజీర్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ, రాష్ట్ర పరిశ్రమల శాఖ కమషనర్ రత్నప్రభ, కోలారు కలెక్టర్ డాక్టర్ కేవీ త్రిలోక్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి వర్గంలో చీలిక
చిచ్చురేపిన బీబీఎంపీ మేయర్ స్థానం జేడీఎస్‌తో పొత్తుపై కుదరని సయోధ్య భగ్గుమన్న విభేదాలు.. సిద్ధు నిర్ణయాలు తప్పు బట్టిన సీనియర్లు బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గంలో చీలిక ఏర్పడింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీలో విభేదాలను రేకెత్తించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయనకు అత్యంత సన్నిహితులైన కొందరు మంత్రులు బీబీఎంపీ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ వశం చేసేందుకు జేడీఎస్ సహకారం తీసుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ చర్యలను ఆ పార్టీలోని కొందరు సీనియర్లతో పాటు మరికొందరు మంత్రులూ విభేధిస్తున్నారు. ఫలితంగా సోమవారం మంత్రి మండలి సమావేశంలో పాలన పరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత అధికారులను బయటకు పంపి వేసి సిద్ధరామయ్య నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయారు. అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో జేడీఎస్‌తో మైత్రి విషయంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. మేయర్ పదవి దక్కించుకునేందుకు జేడీఎస్ సహకారం తీసుకుంటే తర్వాత ఆ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తుందని, ఇది సరైన నిర్ణయం కాదంటూ సిద్ధరామయ్యకు పలువురు సూచించారు. దీని వల్ల ప్రజల దృష్టిలో పార్టీ పరువు మరింత దిగజారుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా జేడీఎస్‌తో మైత్రి విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హై కమాండ్‌కు తప్పుడు నివేదిక ఇచ్చారని అక్రోశం వ్యక్తం చేశారు. ఈ తీవ్ర వాగ్వాదం తర్వాత సిద్ధరామయ్య ఎలాంటి నిర్ణయం తెలపకుండా మరోసారి ఈ విషయంపై సమావేశమవుదామంటూ ముగించినట్లు సమాచారం. -
పొత్తు లేదు
- బీబీఎంపీ మేయర్ ఎంపికపై ఎవరితోనూ మైత్రి ప్రస్తావనే లేదు - స్పష్టం చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ సీటు కోసం తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రస్తావనే లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో కొత్తగా ఎంపికైన కార్పొరేటర్లతో శనివారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. మేయర్ ఎంపిక పూర్తయ్యే వరకు నగరాన్ని వీడి ఎక్కడికీ వెళ్లవద్దని కొత్తగా ఎంపికైన కార్పొరేటర్లకు ఈ సమావేశంలో సిద్దరామయ్య సూచించినట్లు సమాచారం. అంతేకాక ఎన్నికల సమయంలో పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆయా వార్డుల్లో కార్పొరేటర్లు శ్రమిం చాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉం డాలని మార్గనిర్దేశనం చేశారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. ఇక సమావేశానికి ముందు సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ....బీబీఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ శిరసావహిస్తుందని తెలి పారు. మేయర్ సీటు కోసం ఎవరితోనూ పొత్తు కు దుర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నా రు. అనంతరం కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ మాట్లాడుతూ... బీబీఎంపీ ఎన్నికల్లో మైత్రికి సంబంధించి చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని అన్నారు. అయినా పార్టీ అనుమతి లేకుండానే మైత్రి చర్చలు జరిపిన నాయకుల నుంచి వివరణ కోరనున్నట్లు పరమేశ్వర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకోనుందనే వ్యాఖ్య లు సత్యదూరమని స్పష్టం చేశారు. -
పెట్టుబడిదారులకు విసృ్తత అవకాశం
సింగిల్ విండో విధానంలోతక్షణమే అనుమతులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : కర్ణాటకలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో అందులోనూ ఆన్లైన్లోనే అనుమతులు అందజేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరు శివారులోని బిడిది వద్ద బాష్ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమొబైల్ ఉత్పతి కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ మంది స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దీని వల్ల నిరుద్యోగ సమస్య తగ్గుతుందని తెలిపారు. చట్ట ప్రకారం రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని ప్రారంభించే సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తుందన్నారు. అనుమతుల్లో ఇబ్బందులు ఏర్పడితే వ్యక్తిగతంగా తనను కలుసుకుంటే వెంటనే సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బాష్ సంస్థ వ్యవస్థాపక డెరైక్టర్ స్టీఫెన్ బ్రౌన్, ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం సవతి ప్రేమ
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. నగరంలో మారుతి ఐ క్లినిక్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా తనను కలిసిన మీడియా ప్ర తినిధులతో మాట్లాడుతూ... మహదాయి న దీ నీటి పంపకం, మలప్రభ-మహదాయి నదు ల అనుసంధానం, కళసబండూరి సాగునీటి పథ కం ప్రారంభం తదితర విషయాల పరిష్కారాని కి చొరవ చూపాలంటూ ఇటీవల ప్రధాని నరేం ద్రమోదీని కర్ణాటక అఖిల పక్షం సభ్యులు కలిసి విన్న వించుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. ‘మహదాయి నీటి పంపకం విషయం లో కర్ణాటక, గోవా, మహరాష్ట్ర మధ్య తరు చూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ రెండు రాష్ట్రా ల్లో బీజేపీ అధికారంలో ఉంది. అందువల్ల కర్ణాటకతో పాటు ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలసి ఈ విషయం పై చర్చించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీని కోరినా అందుకు ఆయన సమ్మతించలేదు. మూడు రాష్ట్రాల ప్రతిపక్షనాయకులతో మొదట చర్చించండి అని మాకు సూచించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన అలా మాట్లాడారు. ఇది సరికాదు. మొదట ప్రధాని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిపితే అటు పై మేము మూడు రాష్ట్రాల ప్రతిపక్షనాయకులతో సమావేశమవుతాం.’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవానికి గల కారణాలతో కూడిన నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ హై కమాండ్ నుంచి తనకు ఎలాంటి సూచన అందలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
తీవ్ర నిరాశ !
నీటి పంపకాలపై లభించని స్పష్టత ముగ్గురు సీఎంలు చర్చించుకుని తన వద్దకు రావాలని {పధాని సూచన బెంగళూరు: ఉత్తర కర్ణాటక ప్రాంతానికి సాగు నీటిని అందించే మహదాయి నదీ నీటి పంపకం విషయంలో పొరుగు రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్రాలతో ఏర్పడుతున్న సమస్యలను పరి ష్కరించే విషయమై ప్రధాని నరేంద్రమో దీ నుంచి రాష్ట్ర అఖిల పక్షానికి ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో రా ష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులతో పాటు వివిధ మఠాధిపతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. మహదాయి నీటి పంపకం విషయంలో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల మధ్య ఏర్పడిన వివాదాన్ని తొలగించాల్సిందిగా కో రుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృ త్వంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, వివిధ మఠాధిపతులు ప్రధాని నరేం ద్రమోదీతో సోమవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారు 45 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం జేడీఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేందరమోదీ సమాధానం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భేటీలో జరిగిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘మహదాయి నదీ నీటి పంపకాలు సరిగా జరగక పోవడం వల్ల ఏడాదికి 100 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మీరు కలుగజేసుకుంటే వృథా నీటిని అడ్డుకట్టు వేయడానికి వీలవుతుంది. దీని వల్ల వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి రావడమే కాకుండా ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడవచ్చు.’ అని అఖిల పక్షం నాయకులు ప్రధానికి విజ్ఞప్తి చేశాం. ఇందుకు ప్రతిస్పందించిన ప్రధానమంత్రి మొదట మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడండి. అటుపై నా దగ్గరకు రండి. ఈ విషయంలో నేను ఏం చేయగలను.’ అని సమాధానం ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సమాధానం తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని బసవరాజ్‌హొరట్టి తెలిపారు. ప్రజలు రైతులు సాగు, తాగు నీటి కోసం అలమటిస్తుంటే ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయడం తగదని అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సమావేశంలో పాల్గొన్న వివిధ మఠాలకు చెందిన అధిపతులు కూడా మీడియా ముందు నరేంద్రమోదీ వ్యవహరించిన తీరు పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
నేనే సీఎం...
నాయకత్వ మార్పు లేదు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పట్లో నాయకత్వ మార్పులేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వంలో కానీ, పార్టీ వేదికలపై కానీ నాయకత్వ మార్పునకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ప్రజల మనసుల్లో సైతం నాయకత్వాన్ని మార్చాలనే ఆలోచన లేదని అన్నారు. నగరంలోని లాల్బాగ్ రోడ్లో ఉన్న ఎంటీఆర్ హోటల్‌కు శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా వచ్చిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడే అల్పాహారాన్ని తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...‘రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సమయంలో నాయకత్వ మార్పు గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహలు మాత్రమే. ఇలాంటి వదంతులన్నింటిపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మా లక్ష్యమంతా బీబీఎంపీ ఎన్నికల్లో గెలుపు సాధించడం పై మాత్రమే ఉంది’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇక ఇదే సందర్భంలో గురువారం రోజున కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎస్.ఎం.కృష్ణ, బి.కె.హరిప్రసాద్‌లు చేసిన వ్యాఖ్యలపై సైతం సిద్ధరామయ్య స్పందించారు. ‘అయినా వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు నా గురించే అని ఎందుకు అనుకోవాలి? ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి కూడా అయి ఉండవచ్చుగా! వేరే ఎవరి గురించి అయినా కావచ్చు కదా?’ అని మీడియా వారిని ప్రశ్నించారు. ఆహా బహు రుచికరం బాంబే హల్వా.... ఇక బీబీఎంపీ ఎన్నికల నేపథ్యంలో గత పది రోజులుగా బిజీబిజీగా గడిపిన సీఎం సిద్దరామయ్య శుక్రవారం రోజున కాస్తంత నింపాదిగా కనిపించారు. తన సహచరుడు, మంత్రి హెచ్.సి.మహదేవప్ప, ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌తో కలిసి శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా ఎంటీఆర్ హోటల్‌కు చేరుకున్నారు. అకస్మాత్తుగా సీఎం తమ హోటల్‌కు రావడంతో అక్కడి యాజమాన్యంతో పాటు సిబ్బంది, వినియోగదారులు సైతం కాసేపు కంగారుపడ్డారు. అనంతరం ఎంటీఆర్ యాజమాన్యం సీఎంకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లను చేసి ఆయనకు ఏ అల్పాహారం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో సిద్ధరామయ్య బాంబే హల్వా, రవ్వ ఇడ్లీ, బిసిబేలాబాత్, మసాలాదోసె ఇలా విభిన్న రకాల ఆహార పదార్థాలను తెప్పించుకొని రుచిచూశారు. అనంతరం హోటల్లో ఉన్న వినియోగదారులు సీఎంతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. -
కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న అసమ్మతి
సిద్ధరామయ్య వైఖరిపై ఎస్.ఎం.కృష్ణ పరోక్ష వ్యాఖ్యలు స్వరం కలిపిన బి.కె.హరిప్రసాద్ బెంగళూరు: కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి సెగలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీలోనూ అన్నీ తానై వ్యవహరిస్తున్న తీరుపై చాలా కాలంగా కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అసమ్మతి చెలరేగుతూనే ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ గురువారమిక్కడ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ అరస్ శత జయంతి వేడుకల సందర్భంగా గురువారమిక్కడి కేపీసీసీ కార్యాలయంలో నిర్విహించిన కార్యక్రమంలో ఎస్.ఎం.కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘ఇప్పుడు నాకు 83ఏళ్ల వయస్సు, అయినా ఇప్పటికీ నేనింకా ఏదో నేర్చుకోవాల్సి ఉందనే భావిస్తుంటాను. అంతేకాదు నేను నేర్చుకోవాల్సింది కూడా చాలానే ఉంది. అయితే కొంత మంది మాత్రం నాకు అంతా తెలుసు, నేను ఎవరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ ‘అహం బ్రహ్మాస్మి’ అంటూ ప్రవర్తిస్తున్నారు. పాలన సాగించే నేతలకు ఈ తరహా వైఖరి ఉండడం ఏమాత్రం సరికాదు’ అంటూ సిద్ధరామయ్య పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి సిద్దరామయ్య సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, హైకమాండ్ కూడా సిద్ధరామయ్య వైఖరి పట్ల అభ్యంతరం చెప్పక పోవడంతో ఎస్.ఎం.కృష్ణ తన అసహనాన్ని ఈ విధంగా ప్రదర్శించారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇక ఇదే సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ సైతం ఎస్.ఎం.కృష్ణ వ్యాఖ్యలకు స్వరం కలిపారు. ‘కొంతమంది అధికారానికి రాక ముందు ‘సమానత్వం’ గురించి మాట్లాడతారు. కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత మాత్రం కేవలం తమ జాతి వరకు మాత్రమే పరిమితమౌతారు. అధికారం చేతికి వచ్చిన తర్వాత కేవలం తమ జాతి వరకు పరిమితమవడం ఎంతమాత్రం సరికాదు’ అంటూ సిద్ధరామయ్యపై చురకలు విసిరారు. ఇక సిద్ధరామయ్య వైఖరి పట్ల అసంతృప్తి కారణంగా బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి ఎస్.ఎం.కృష్ణ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే భుజాలకెత్తుకున్నారు. ఈ సందర్భంలో బీబీఎంపీ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పరాజయం పాలైతే సిద్ధరామయ్యపై అసంతృప్తి మరింత అధికమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
విస్తరణకు సై..
ఎన్నికల తర్వాతే సీఎం సిద్ధరామయ్య బెంగళూరు : ృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రిమండలి విస్తరణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేదని స్పష్టం చేశారు. బెంగళూరు, మైసూరులో గురువారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీని కలవడానికి అన్ని పార్టీల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులతో పాటు వివిధ పంటలకు సరైన మద్దతు ధర లభించిక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న వైనాన్ని కూడా ఈ భేటీలో ప్రధానమంత్రికి వివరించనున్నట్లు తెలిపారు. కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకంలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారి నుంచి నీతి వ్యాఖ్యాలు వినాల్సిన దుస్థితి అధికార కాంగ్రెస్ పార్టీకి లేదని ఘాటు వాఖ్యలు చేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెఫెరెండం కాదని విశ్లేషించారు. -
ప్రచార పర్వంలోకి సిద్ధు
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల ప్రచార పర్వంలోకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం లాంఛనంగా అడుగుపెట్టేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో విజయం కోసం రూపొందించాల్సిన వ్యూహం పై చర్చించేందుకు గాను కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో గురువారం ఉదయం సిద్ధరామయ్య సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయా వార్డుల వారీగా అభ్యర్థులు ఎలాంటి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నగర ప్రజలకు ఎలా వివరించాలి వంటి అంశాలపై అభ్యర్థులకు సూచనలు చేశారు. అంతేకాక బీజేపీ హయాంలో బీబీఎంపీలో జరిగిన కుంభకోణాలు, నగరంలో తలెత్తిన చెత్త సమస్య వంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం గురువారం మద్యాహ్నం నగరంలోని బీటీఎం లే అవుట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పూర్తై తర్వాత నగరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని సిద్ధరామయ్య తొలుత భావించారు. అయితే ఇప్పటికే బీజేపీ, జేడీఎస్‌లు ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఇంకా ఆలస్యం అయితే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించి గురువారం నుంచే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈనెల 15 తర్వాత స్టార్ ప్రచారకులతో బీబీఎంపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక గురువారం సాయంత్రానికి నగరానికి చేరుకోనున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నుంచే నగరంలో ప్రచారాన్ని చేపట్టనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో టికెట్ లభించని కారణంగా దాదాపు 100 మంది రెబల్ అభ్యర్థులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రెబల్ అభ్యర్థులతో పార్టీ సీనియర్ నేతలు చర్చలు జరపడంతో వీరిలో దాదాపు 60 మంది గురువారం రోజున తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. కాగా మిగిలిన వారికి జేడీఎస్ పార్టీ తక్షణమే బీ-ఫాంలు అందించడంతో ప్రస్తుతం వీరంతా జేడీఎస్ తరఫున పోటీలో ఉన్నారు. దీంతో ఈ రెబల్స్ బెడదను తప్పించుకొని, విజయాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులే చేయాల్సి వస్తోందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
నదుల అనుసంధానంపై ఢిల్లీకి అఖిలపక్షం
సీఎం సిద్ధు బెంగళూరు:మలప్రభా, మహాదాయి నదుల అనుసంధాన పనులను త్వరగా ప్రారంభించాలని కేంద్రంపై ఒత్తిడికి తీసుకురావడానికి త్వరలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. రా ష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల ను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్ర రైతు సంఘం నాయకులు కొంతమంది సీఎం ఇంటి ముందు బుధవా రం నిరసనకు దిగారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య వారితో మాట్లాడుతూ... రైతు సమస్యలకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత ధోరణే కారణమన్నారు. కర్ణాటకలో ప్రవహిస్తున్న మలప్రభా, మ హాదాయి నదులను అనుసంధానం చేయ డం వల్ల వేలాది ఎకరాల బీడుభూములు సాగులోకి వస్తాయన్నారు. ఈ విషయమై ఒత్తిడి తీసుకురావడానికి త్వరలో ఢిల్లీ వెళ్లనున్నామని తెలిపారు. అంతేకాకుండా కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నామని త్వరలో వాటిని అమలు చేస్తామని చెప్పి రైతుల సంఘం నాయకులకు సిద్ధరామయ్య నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. -
రూ. 10 కోట్లతో దేవరాజ్ అరస్ ‘శతజయంతి
ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం బెంగళూరు: ఈ నెల 20న దేవరాజ్ అరస్ శత జయంతి నిర్వహించనున్న నేపథ్యంలో ఏడాది పాటు దేవరాజ్ అరస్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సోమవారమిక్కడి విధాన సౌధలో నిర్వహించిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో అంగీకారం లభించింది. ఈ ఉత్సవాల నిర్వహణకు గాను రూ.10కోట్లను కేటాయించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నెల 20న దేవరాజ్ అరస్ సొంతగ్రామమైన మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకా కల్లహళ్లి గ్రామంలో శతజయంతి ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభంకానున్నాయి. ఈ నేపధ్యంలో కల్లహళ్లి గ్రామాన్ని ‘మోడల్ విలేజ్’గా తీర్చిదిద్దేందుకు సైతం ఈ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాక దేవరాజ్ అరస్ బెంగళూరు నగరంలో ఎక్కువ రోజులు గడిపిన బాలబ్రూహి భవనంలో దేవరాజ్ అరస్ సాధనలను ప్రతిబింబించేలా ఒక మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. దేవరాజ్ అరస్ పరిశోధనా సంస్థను స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చేందుకు గా ను రూ.2.5కోట్ల మొత్తాన్ని కేటాయించనున్నారు. ఆకాశవాణిలో అరస్ చేసిన ప్రసంగాలన్నింటిని సేకరించి వాటిని ఓ సీడీ రూపంలోకి తీసుకురానున్నారు. ఇక దేవరాజ్ అరస్ బాల్యం నుంచి ఆయన చని పోయే వరకు సేకరించిన ఛాయాచిత్రాలతో పాటు ఆయన జీవితంపై కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పుస్తకాన్ని ముద్రించనున్నారు. ఈ పుస్తకాన్ని హిందీ, ఉర్దు, తమిళం, తెలుగు, మళయాళం, బెంగాలి భాషల్లోకి అనువదించనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు హెచ్.ఆంజనేయ, కె.జె.జార్జ్, టి.బి.జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటకకు నిధులు పెంచాం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తోందన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 13వ ఫైనాన్స్ కమిషన్‌తో పోలిస్తే 14వ ఫైనాన్స్ కమిషన్‌లో కర్ణాటకకు ఇచ్చే నిధులను 32శాతం నుంచి 42 శాతానికి పెంచామని ఆయన తెలిపారు. శనివారమిక్కడి బీజేపీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు ఐదేళ్లలో కర్ణాటకకు దాదాపు లక్ష కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం అందించనుందని తెలిపారు. ఇక కర్ణాటకలో ఇప్పటికే ఆరు స్మార్ట్ సిటీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. జనాభా, రెవెన్యూ, నగరంలోని పారిశుద్ధ్య వ్యవస్థ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయా నగరాల పేర్లను సిఫార్సు చేసి నివేదిక పంపాలనికోరినట్లు తెలిపారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలోని లక్షకు పైగా జనాభా ఉన్న నగరాల్లో హుబ్లీ-ధార్వాడ, మైసూరు, బెళగావి, దావణగెరె, బళ్లారి, బిజాపుర, శివమొగ్గ, తుమకూరు, రాయచూరు, బీదర్, హొస్పేట, కోలారుతో కలిపి మొత్తం 26 నగరాలను ‘అమృత్’ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. -
నిర్లక్ష్యాన్ని వీడండి...
రైతు ఆత్మహత్యలను నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై రాహుల్ మండిపాటు త్వరలోనే బాధిత కుటుంబాలకు పరామర్శ షెడ్యూల్ ఖరారు చేయాల్సిందిగా సీఎం, కేపీసీసీ అధ్యక్షుడికి సూచన బెంగళూరు : రాష్ట్రంలో రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అసహనం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి పొద్దు పోయాక బెంగళూరుకు చేరుకున్న రాహుల్‌గాంధీని ఇక్కడి ఓ రిసార్ట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలకు సంబంధించి అంశం ప్రస్తావనకు వచ్చింది. రైతుల ఆత్మహత్యల విషయంపై ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడితో రాహుల్‌గాంధీ అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ నెల రోజుల్లో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల సంఖ్య 70గా ఉంది, అయితే అనధికారికంగా ఈ సంఖ్య 120 వరకు ఉండవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలను అడ్డుకోవడంలో ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదని, అది ప్రభుత్వ మనుగడకే ముప్పుగా మారుతుందని రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ‘రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నేను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలు చేస్తున్నాను, అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలా రైతుల ఆత్మహత్యల పర్వం కొనసాగడం ఎంతమాత్రం సరికాదు. రైతులు ముఖ్యంగా అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ సందర్భంలో బ్యాంకులు రైతులపై అప్పుల చెల్లింపునకు సంబంధించి ఒత్తిడి తీసుకురాకుండా చేయడంపై దృష్టి సారించండి. అంతేకాదు రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు సూచించారు. మీరెలాగో పోలేదు.....నేనే వెళతా.... ఇక రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణ స్వయంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎస్.ఎం.కృష్ణ తీరును మెచ్చుకున్న రాహుల్‌గాంధీ...‘అసలు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా ముందుగా మంత్రులు లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రైతుల కుటుంబాలను కలిసి పరామర్శించాల్సింది, తద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాల్సింది, అయితే మీరెలాగో వెళ్లలేదు కదా, అందుకే నేనే వెళతాను, రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబ సభ్యులను కలిసేందుకు గాను రెండు రోజుల షెడ్యూల్‌ను ఖరారు చేయండి, కర్ణాటకలో కూడా త్వరలోనే పాదయాత్ర ద్వారా రైతులను కలుస్తాను’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ సూచించిన ట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మండింది!
నిధుల కేటాయింపులో కేంద్రం వైఖరిపై సీఎం ఆగ్రహం అడ్డుకున్న విపక్ష బీజేపీ సహనం కోల్పోయిన సిద్ధు బడ్జెట్ పుస్తకం విసిరివేత బెంగళూరు : రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేస్తూ బడ్జెట్ పుస్తకాన్ని విసిరేసిన ఘటన శాసనసభలో శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి వైఖరిని ఖండిస్తూ విపక్ష బీజేపీ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో అధికార, విపక్ష నాయకులను శాంతిపజేయడానికి స్పీకర్ కాగోడు తిమ్మప్ప తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖలపై శాసనసభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం ఇస్తూ నిధుల విడుదల విషయంలో కర్ణాటకపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. దీంతో ఈ ఏడాది వివిధ ప్రభుత్వ పథకాలకు అందాల్సిన నిధుల్లో రూ.4,690 కోట్లు కోత విధించిందని వివరించారు. ఇందుకు సభలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో కేవలం సగం మాత్రమే నిజమన్నారు. మిగిలిన సగం నిజాన్ని తాను గణాంకాలతో సహా చట్టసభకు వివరిస్తానని పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పాలక పక్షం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీటీ రవిని కూర్చొవాలని డిమాండ్ చేశారు. అయినా రవి వినకుండా మాట్లాడేందుకు ప్రయత్నించడంతో సిద్ధరామయ్యలో సహనం నశించింది. దీంతో ఆయన ఆవేశంతో ఊగిపోయారు. తన చేతుల్లో ఉన్న కేంద్రప్రభుత్వ బడ్జెట్ పుస్తకాన్ని విసిరి వేశారు. దీంతో విపక్షనాయకుడు జగదీశ్ శెట్టర్ తానున్న చోటు నుంచి నిల్చొని అధికార పక్షం నాయకులు శాసనసభల్లో నియంతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో అధికార, విపక్షనాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని ‘మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. మీ పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాల్సి వస్తుంది. చర్చపై సమాధానం ఇవ్వడానికి మొదట సీఎం సిద్ధరామయ్యకు అవకాశం ఇవ్వండి అటుపై మీ దగ్గర ఉన్న వివరాలను శాసనసభకు చెప్పడానికి నేను అవకాశం కల్పిస్తాను.’ అని సీటీ రవిని ఉద్దేశించి ఘాటుగా హెచ్చరించారు. దీంతో సీటీ రవితో పాటు బీజేపీ నాయకులు వారివారి స్థానాల్లో కూర్చోవడంతో సభా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. -
నాడహళ్లి ఔట్
బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా తిరుగుబాట బావుటా ఎగురవేసిన విజయపుర జిల్లా దేవరహిప్పర్గీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎ.ఎస్ పాటిల్ నాడహళ్లిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కి సూచన రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉత్తర కర్ణాటక అభివృద్ధి విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ స్వపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల నాడహళ్లి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో అతను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ నిర్ధారించింది. ఫలితంగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. -
నేడు రాహుల్ రాక
సీఎంతో పాటు కేపీసీసీ అధ్యక్షుడితో సమావేశం బెంగళూరు: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం బెంగళూరుకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ఆయన ముందుగా బెంగళూరు చేరుకోనున్నారు. గురువారం ఉదయం నగరంలోని కుమార కృపా అతిథి గృహంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్‌తో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలు, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ప్రభుత్వంతో పాటు పార్టీ తరఫున చేపడుతున్న కార్యక్రమాలు తదితర అంశాలపై రాహుల్‌గాంధీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం అనంతరం రాహుల్‌గాంధీ అనంతపురానికి బయలుదేరి వెళ్లనున్నారని పార్టీ వర్గాల సమాచారం. -
ఏం జరుగుతోంది?
- సీఎం సిద్ధరామయ్య - రైతు ఆత్మహత్యలకు కారణం అప్పులా? పంట నష్టాలా! - తేల్చేందుకు ప్రత్యేక సమితి ఏర్పాటు - రైతు వ్యతిరేక సిఫారసులు ఉన్నందునే అమలుకు నోచుకోని డాక్టర్‌వీరేష్ కమిటీ నివేదిక - చెరుకు బకాయిలు విడుదల మండ్య : రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యల వెనుక ఉన్న అసలైన కారణాలు ఏమిటో తనకు తెలియాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇందుకు గాను డాక్టర్ ఎస్.స్వామినాథన్ నేకృత్వంలో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల బలవన్మరణాలకు పా ల్పడిన రైతుల కుటుంబసభ్యులను ఓదార్చేందుకు ఆదివారం మండ్య జిల్లాలో ము ఖ్యమంత్రి పర్యటించారు. మండ్య తాలూకాలోని హొన్నయ్యనహళ్లికి చేరుకుని రైతు శివలింగేగౌడ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మండ్య, మైసూరు జిల్లా ల్లో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యల వెనుక కారణాలు అ ర్థం కావడం లేదన్నారు. అప్పుల బాధ లా... పంట నష్టాలా... ఇంకా వేరే ఏమైనా సమస్యలున్నాయా అనే విషయాలు తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. వ్యవసాయ రంగంలోని సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని, సమస్యల పరిష్కారానికి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తుందని తెలిపారు. 14 శాతం కన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటికే మండ్య జిల్లాలో 50 మంది వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేశారని తెలిపారు. రాష్ర్టంలో అన్నదాతలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని మనవి చేశారు. ఎస్.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ సమయంలో అప్పటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వీరేష్ నేకృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ఆత్మహత్యలపై అధ్యయనం చేశారని గుర్తు చేశారు. 2002, ఏప్రిల్ 27న ఓ నివేదికను వీరేష్ కమిటీ అప్పటి ప్రభుత్వానికి అందజేసిందని అన్నారు. అందులోని సిఫారసులు రైతు సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని అమలు చేయరాదంటూ అప్పట్లో రైతు సంఘం, రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ కారణంతోనే ఆ కమిటీ సిఫారసులు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ విషయం మాజీ సీఎం ఎస్ఎం ృష్ణకు గుర్తుకు లేనట్లుందని అన్నారు. చెరుకు బకాయి విడుదల 2013-14 ఏడాదికి సంబంధించి రూ.1520కోట్ల చెరుకు బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఆ సంవత్సరంలో ప్రతి టన్ను చెరుకుకు రూ.2500 చొప్పున ఇచ్చారని తెలిపారు. 2014-15లో ఎఫ్ఆర్పీ రూ.2200లను నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మొతాతన్ని ఇంకా అనేక ప్రైవేట్ పరిశ్రమలు ఇవ్వలేదని, కొన్ని పరిశ్రమలు రూ. 1500 చొప్పున ఇచ్చాయని అన్నారు. మరికొన్ని పరిశ్రమలు రూ.1800 చొప్పున చెల్లించాయని తెలిపారు. 2013-14 ఏడాదికి సంబంధించి బకాయిలను ఈ నెల చివరిలోపు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబంలోని సభ్యురాలికి ప్రభుత్వ ఉద్యోగం మండ్య తాలూకాలోని హోన్నాయ్కనహళ్ళి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు శివలింగేగౌడ ఇంటికి వచ్చిన సీఎం ఆయన కుటుంబసభ్యులను ఓదార్చి రూ. లక్ష చెక్ అందజేశారు. సుమారు 45 నిమిషాల పాటు వారి క్షేమసమాచారాలు వాకాబు చేశారు. అనంతరం బాధపడకూడదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. శివలింగేగౌడ భార్య సౌమ్య పీయూసీ చదివినట్లు తెలుసుకుని ఆమెకు కలెక్టరేట్లో ఉద్యోగం ఇవ్వాలని అక్కడే ఉన్న కలెక్టర్ అజయ్ నాగభూషన్‌ను ఆయన ఆదేశించారు. ఆదిచుంచనగరి విద్యాసంస్థలో చదువుకుంటున్న వారి పిల్లలకు ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ర్టంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించడం జరిగిందని, జిల్లా యంత్రాంగం ఇప్పటికే శివలింగేగౌడ కుటుంబానికి రూ. లక్ష అందజేసిందని, మిగిలిన రూ. లక్షను తన సమక్షంలో అందజేశారని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహదేవప్రసాద్, అంబరీష్, ఎమ్మెల్యే నరేంద్రస్వామి, స్థానికులు పాల్గొన్నారు. -
కలిసి ఉందాం..
పార్టీ నాయకులకు సీఎం సిద్ధు దిశానిర్దేశం మంత్రులు కృష్ణభైరేగౌడ, ఆంజనేయపై సహచర నాయకుల ఆక్రోశం సీఎల్పీకు గైర్హాజరైన రెబెల్ స్టార్ అంబరీష్ బెంగళూరు : అవిశ్వాస తీర్మానాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని ఇందుకు శాసనసభ సమావేశాలకు తప్పక హాజరు కావాలని కాంగ్రెస్‌పార్టీ శాసనసభ పక్ష సమావేశం (సీఎల్పీ)లో పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిశానిర్దేశం చేశారు. అంతేకాక అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్న విపక్ష జేడీఎస్ పార్టీ పై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో విధానసౌధాలో బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. సభ ప్రారంభమైన వెంటనే సిద్ధరామయ్య మాట్లాడారు. ‘ప్రభుత్వం పడిపోదని తెలిసినా రాజకీయ ప్రయోజనం ఆశించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి జేడీఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అక్రమాలు జరిగినట్లు ఆ పార్టీ నాయకులు భావిస్తే శాఖవారి చర్చల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. అలాకాక అవిశ్వాస తీర్మానానికి ముందుకు పడటం సరికాదు. ఆ పార్టీకు తగిన బుద్ధి చెప్పాలంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. శాఖ పరంగా గణాంకసహిత జవాబులు చెప్పడానికి మంత్రులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక ఎమ్మెల్యేలు తప్పక హాజరు కావాలి.’ అని పేర్కొన్నారు ఈ సమయంలో కలుగజేసుకున్న సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు కే.బి కోళివాడ మేము మీవెంట ఉంటాం. అవిశ్వాస తీర్మానం తప్పక వీగిపోతుంది. అని భరోసాయిచ్చారు. ఇందుకు సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న చాలా మంది నాయకులు మద్దతు పలికారు. అయితే సభలో పాల్గొన్న నాయకుల్లో చాలా మంది వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడపై విమర్శల వర్షం కురిపించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించడమే వ్యవసాయశాఖ పనికాదన్నారు. రైతులకు సరైన సమయంలో అవసరమైనంత మేర రుణాలు కూడా ఇప్పించాల్సిన బాధ్యత ఆ శాఖపై ఉందని గుర్తుచేశారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబానైనా మంత్రి కృష్ణైభైరేగౌడ పరమార్శించారా? బలవన్మరణాలు తగ్గించడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అవాక్కయిన అయన మీ సలహాలు, సూచనలు పాటిస్తానంటూ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో శాంతించిన నాయకులు వ్యవసాయ, ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ మంత్రులతో సలహాసమితి రూపొందించి పరిహారం అందించే విషయమై రెవెన్యూ డివిజన్ల వారిగా పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదించాలని సూచించారు. ఇందుకు మంత్రి కృష్ణభైరేగౌడ సమ్మతించడంతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉండగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖలో పరుపులు, తలగడ (దిండ్లు) కొనుగోలులో జరిగిన అక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం ఉందన్నట్లు బహిరంగ వాఖ్యలు చేసిన ఆ శాఖ మంత్రి ఆంజనేయ పై కూడా సహచరులు గరం అయ్యారు. ఈ సమయంలో సిద్ధరామయ్యతో సహా కొంతమంది సీనియర్ నాయకులు కలుగజేసుకుని పరిస్థితిని యథాస్థితికి తీసుకువచ్చారు. రైతుల ఆత్మహత్యల విషయంతోపాటు లోకాయుక్త పై అవినీతి ఆరోపణలు తదితర విషయాల పై చర్చించేందుకు వచ్చే బుధవారం మరోసారి సీఎల్పీ నిర్వహిస్తానని సిద్ధరామయ్య సమావేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్న ‘రెబెల్‌స్టార్’ గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్ సీఎల్పీకు గైర్హాజరయ్యారు. -
ఓల్వో విస్తరణ
- యూరోప్‌కు ఎగుమతి లక్ష్యం - 2,125 మందికి ఉద్యోగ అవకాశాలు - ఆగస్టులో స్వీడన్ పర్యటన - ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి సాక్షి, బెంగళూరు : హొసకోటెలోని ఓల్వో బస్ కార్పొరేషన్ యూనిట్‌ను రూ.975 కోట్లతో విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. స్వీడన్‌కు చెందిన ఓల్వో బస్ కార్పొరేషన్ అధ్యక్షుడు హాకన్ ఆగ్నేవాల్తో మంగళవారమిక్కడి విధానసౌధలోని తన ఛాంబర్లో సిద్ధరామయ్య సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హొసకోటెలో ఇప్పటికే 150 ఎకరాల్లో ఓల్వో బస్ కార్పొరేషన్ యూనిట్ ఏర్పాటై ఉందని అన్నారు. ఈ యూనిట్‌ను మరో 90 ఎకరాల్లో విస్తరించేందుకు గాను ఆ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. ఈ యూనిట్లో బస్‌లను తయారుచేసి యూరోప్‌కి ఎగుమతి చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోందని పేర్కొన్నారు. ఈ యూనిట్ విస్తరణ ద్వారా దాదాపు 2,125 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. ఈ యూనిట్ కనుక అందుబాటులోకి వస్తే దేశంలోనే మొదటి సారిగా బస్‌లను తయారుచేసి యూరోప్‌కు ఎగుమతి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసిన ఘనత కర్ణాటకకు దక్కుతుందని తెలిపారు. ఇక స్వీడన్‌ను సందర్శించాల్సిందిగా ఓల్వో బస్ కార్పొరేషన్ అధ్యక్షుడు హాకన్ ఆగ్నేవాల్ తనను ఆహ్వానించారని, ఆగస్టులో స్వీడన్‌ను సందర్శిస్తానని ఆయనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఓల్వో సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ, పరిశ్రమల శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి రత్నప్రభా తదితరులు పాల్గొన్నారు. ప్రధాని సభకు గైర్హాజరు ఇక కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూ స్వాధీన బిల్లుపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు(బుధవారం) నిర్వహించనున్న సమావేశానికి తాను హాజరుకావడం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ప్రధాని ముఖ్యమంత్రులతో నిర్వహించనున్న సమావేశానికి హాజరుకాలేక పోతున్నానని తెలిపారు. తన ప్రతినిధిగా రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి హెచ్.సి.మహదేవప్పను సమావేశానికి పంపుతున్నట్లు చెప్పారు. -
టార్గెట్
సిద్ధుపై అధికార పార్టీలో పెల్లుబుకుతున్న అసంతృప్తి రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ శక్తిని సృష్టించే దిశగా ‘అంబి’కి మద్దతిస్తున్న అసంతృప్త ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సిద్దు పై నిరసన గళాన్ని వినిపించిన రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరీష్‌కు వీరంతా మద్దతునిస్తున్నట్లు సమాచారం. - సాక్షి, బెంగళూరు రాష్ట్రంలో సిద్ధరామయ్యకు పోటీగా నాయకత్వాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు గాను అంబరీష్‌ని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిబింబించేందుకు వీరంతా సన్నద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ, ప్రభావవంత ఎమ్మెల్యేలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి నియోజక వర్గాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే నియోజకవర్గాల్లో తమ ప్రభావం తగ్గిపోవడమే కాకుండా పార్టీలో తమ మనుగడ కొనసాగడం కూడా కష్టమనే భావన చాలా కాలంగా వీరిలో ఉండిపోయింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బలమైన నేతగా ఉండడం, ఆయనకు ప్రత్యామ్నాయ శక్తిగా వ్యవహరించగల నేత రాష్ట్ర శ్రేణుల్లో లేకపోవడంతో పాటు పార్టీ హైకమాండ్ మద్దతు కూడా సిద్దరామయ్యకు ఉండడంతో వీరంతా ఇన్ని రోజులు మిన్నకుండిపోయారు. ఒకానొక సందర్భంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్పను రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిబింబించే ప్రయత్నం కూడా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలదృష్ట్యా శామనూరు శివశంకరప్ప వెనక్కు తగ్గడంతో అసంతృప్తి ఎమ్మెల్యేలం తా మళ్లీ సిద్ధరామయ్య నే అనుసరించక తప్పలేదు. ఇలాంటి సందర్భంలో అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో తన అభిప్రాయానికి ఎలాంటి విలువ ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి అంబ రీష్ ఘాటుగా లేఖ రా యడంతో ఈ అసృతప్త ఎమ్మెల్యేలం తా మరోసారి సిద్ధుకు ప్రత్యామ్నాయాన్ని వెతికే పని లో పడిపోయారు. నేరు గా సిద్ధరామయ్యను ఎదిరించలేని అసృతప్త ఎమ్మెల్యేలంతా ఇప్పుడిక అంబ రీష్ ద్వారా తమ అసృతప్తిని వెల్లగక్కేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. అందుకే అంబరీష్‌కు ఫోన్ చేసి తమ మద్దతును తెలుపుతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులృదష్ట్యా అంబరీష్‌ను రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రత్యామ్నాయంగా ప్రతిబిం బించి, అదే విషయాన్ని హైకమాండ్‌కు కూడా చేరవేయాలని వీరంతా భావిస్తున్నారు. తద్వారా సిద్దరామయ్యను ఇరకాటంలో పడేయడంతో పాటు వీలైతే ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి సైతం తప్పించాలనేది ఈ అసృతప్త ఎమ్మెల్యేల వ్యూహంగా తెలుస్తోంది. మిమ్మల్ని వదులుకోబోము..... ఇక అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో తన అభిప్రాయానికి ఏమాత్రం విలువ ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నేరుగా లేఖ రాసి, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా బెంగళూరు వచ్చేసిన మంత్రి అంబరీష్‌తో సిద్ధరామయ్య ఫోన్లో మాట్లాడారు. ‘మిమ్మల్ని వదులుకునే ప్రసక్తే లేదు. అపెక్స్ బ్యాంక్ డెరైక్టర్ నియామకం విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. బోర్డు సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఈ నిర్ణయం ద్వారా మీకు ఇబ్బంది కలిగి ఉంటే మరోసారి బోర్డు సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, డెరైక్టర్ ఎంపికను నిర్వహించేలా చర్యలు తీసుకుంటాను’ అని సీఎం మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. రాజీనామా కాదు... సాక్షి, బెంగళూరు: తన రాజీనామాపై మంత్రి అంబరీష్ నోరు విప్పారు. గురువారం రాత్రి ఏడు గంటలకు జేపీ నగర్‌లోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడు తూ... ‘నాకు ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రూపం లో తెలిపాను. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కాదు. రాజకీయాల్లో ఎవరికైనా తన వాళ్లంటూ కొంత మంది ఉంటారు. అదే విధంగా నాకు కూడా శ్రేయోభిలాషులున్నారు. వారికి సరైన స్థానాలను కల్పించాలన్నదే నా ఆరాటం. ఈ విషయాన్నే నేను లేఖలో వెల్లడించాను.’ అని పేర్కొన్నారు. -
ఆత్మహత్యలకు కారణాలు అన్వేషించండి
బెంగళూరు: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలకు కారణాలు అన్వేషించాలని వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెళగావిలోని ఎస్.నిజలింగప్ప చక్కెర పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన అనంతరం స్థానిక మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. జూన్ నెలలో 30 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం తనను తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించానన్నారు. కాగా, 36 మంది రైతుల బలవన్మరణాలు సంబవించాయని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చెబుతుండగా మీరు 30 మంది అని చెబుతున్నారు కదా? అన్న మీడియా ప్రశ్నకు ఈ విషయమై ఇంత కంటే ఎక్కువ మాట్లాడేది ఏమీ లేదంటూ అక్కడి నుంచి సీఎం సిద్ధరామయ్య వడివడిగా వెళ్లిపోయారు. -
రైతును వేధిస్తే జైలుకే
‘అప్పులిచ్చిన వడ్డీవ్యాపారులు, రైతులను వేధిస్తే జైలుకెళ్లక తప్పదు. రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది.’ - ముఖ్యమంత్రి సిద్ధరామయ్య - రుణదాతలకు సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక - ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు - గత ప్రభుత్వాల్లోనే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో రైతులను రుణదాతలు వేధిస్తే జైలుకెళ్లక తప్పదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. అన్నదాతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. ఆయన శనివారం బళ్లారి జిల్లాలోని తోరణగల్లు వద్ద జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన వివిధ నిర్మాణాలు, వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తనను ఎంతో బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 28 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయని, అయితే ఇందులో 8మంది మాత్రమే రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు స్పష్టమైన నివేదిక అందిందన్నారు. మిగిలిన వారు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారని, అయితే కారణం ఏదైనా ఆత్మహత్య చేసుకోవడం తగదని హితవు పలికారు. మనోధైర్యంతో జీవితాన్ని ముందుకు సాగించాలన్నారు. రైతులకు ప్రైవేటుగా అప్పులు ఇచ్చిన వారు వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారి, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైతే రైతులను వేధించిన రుణదాతలను జైలుకు పంపేందుకు కూడా వెనుకాడబోమన్నారు. పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడంతో కొందరు తనను విమర్శిస్తున్నారని, అయితే పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినంత మాత్రాన వారు సోమరులుగా మారిపోరని చెప్పారు. ధనవంతులు నిరంతరం కూర్చొని తిండి తినగా లేనిది పేదవారు కడుపునిండా అన్నం తినకూడదా? అని ప్రశ్నించారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం పాటించే విధంగా తమ పాలన సాగిస్తున్నామన్నారు. త్వరలో ఐదు రోజులపాటు పాలు రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. విద్యార్థులకు ప్రస్తుతం వారానికి మూడు రోజుల పాటు పాలు అందిస్తున్నామని, త్వరలో ఐదు రోజులపాటు పాఠశాలల్లో పాలు అందించి వారిని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో శుద్ధ మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.5 వేల కోట్లు కేటాయించామన్నారు. ధనవంతులు పొందుతున్న కార్పొరేట్ వైద్యాన్ని పేదలకూ అందించేందుకు తమ ప్రభుత్వం బీపీఏల్ కార్డుదారులతోపాటు ఏపీఎల్ కార్డుదారులకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు. జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో అత్యాధునిక ఆస్పత్రి ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశంలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ నంబర్ వన్ కావడం కర్ణాటకకే గర్వకారణంగా ఉందన్నారు. ఇక్కడ వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, ఈ నేపథ్యంలో జిందాల్ సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం వారి కర్తవ్యంలో భాగంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహాదేవప్ప, యూటీ ఖాదర్, పరమేశ్వర నాయక్, కిమ్మనె రత్నాకర్, జిల్లాధికారి సమీర్ శుక్లా, జిందాల్ సంస్థ ఎండీ సజ్జన్ జిందాల్, జిందాల్ సీఈఓ వినోద్ నావెల్, స్థానిక ఎమ్మెల్యే తుకారాం, బళ్లారి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌లాడ్, ఎన్ వై గోపాలకృష్ణ, మాజీ విధాన పరిషత్ సభ్యుడు కేసీ కొండయ్య, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ మంత్రులు దివాకర్‌బాబు, అల్లం వీరభద్రప్ప, కాంగ్రెస్ నాయకుడు వెంకటరావు ఘోర్పడే తదితరులు పాల్గొన్నారు. -
పరిషత్ నుంచి బీజేపీ వాకౌట్
బెంగళూరు: లోకాయుక్తపై వచ్చిన ఆరోపణల విషయమై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలనే విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు పరిషత్ నుంచి గురువారం వాకౌట్ చేశారు. వివరాలు...పరిషత్‌లో కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే బీజేపీ నాయకులు లోకాయుక్తపై వచ్చిన ఆరోపణల విషయమై చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న పరిషత్ అధ్యక్షుడు శంకరమూర్తి ‘ఈ విషయమై ఇప్పటికే శాసనసభలో చర్చ జరిగింది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాత మాత్రమే ఏ విషయానైనా చర్చించడం సంప్రదాయం. స్థానిక సమస్యలపై చర్చలు జరపడం కోసమే బెళగావిలో శాసనసభ సమావేశాలు జరుపుతున్నాం. ఈ కారణాల వల్ల నేను లోకాయుక్తపై వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం పరిషత్‌లో చర్చ జరపడానికి ప్రస్తుతం అనుమతించడం లేదు.’ అని స్పష్టం చేశారు. అయినా కూడా విషయ గంభీరత దృష్ట్యా చర్చకు అనుమతించాల్సిందేనని కే.ఎస్ ఈశ్వరప్ప పట్టుబట్టారు. ఈ సమయంలో ఎస్.ఆర్ పాటిల్ కలుగజేసుకుని ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉన్నందు వల్ల ఇక చర్చ సరికాదని పరిషత్‌కు తెలియజేశారు. అంతేకాక ఆరోపణలపై దర్యాప్తునకు ప్రత్యేక తనిఖీ బృందాన్ని (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం-సిట్) ఏర్పాటు చేసినందువల్ల సీబీఐకు అప్పగించడం కూడా సరికాదన్నారు. అయినా కూడా బీజేపీ నాయకులు చర్చ ప్రారంభించడానికి తయారయ్యారు. దీంతో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ విపక్ష నాయకులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదిలా ఉండగా ప్రజాస్వామ్యంలో చర్చల వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అందువల్ల వాకౌట్ చేయడం సరికాదని సీఎం సిద్ధరామయ్య చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సిద్ధరామయ్య మాటలను పట్టించుకోకుండా బీజేపీ నాయకులు పరిషత్ నుంచి బయటకు వెళ్లిపోయారు. సంతకాల సేకరణకు పూనుకున్న విపక్షాలు... ఇదిలా ఉండగా శాసనసభలో బీజేపీ, జేడీఎస్ ఫ్లోర్లీడర్లయిన జగదీష్‌శెట్టర్, కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ‘లోకాయుక్త భాస్కర్‌రావును ఆ స్థానం నుంచి తొలగించడానికి ప్రభుత్వానికి అధికారాలతో పాటు అనేక అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు ఎవరి పైన ఆరోపణలు వచ్చాయో (లోకాయుక్త భాస్కర్‌రావు) అతని నుంచే సలహాలు తీసుకుని ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసే ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే ఈ అక్రమాల్లో ప్రభుత్వంలోని పలువురు నాయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందేమోనన్న అనుమానం కలుగుతోంది. ఇక విపక్షాలుగా మా బాధ్యతను నిర్వహించాలి. అందుకోసం లోకాయుక్త భాస్కర్‌రావును తొలిగించే విషయమై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించి లిఖిత పూర్వకంగా స్పీకర్‌కు అందజేయనున్నాం. మనఃసాక్షిని అనుసరించి సంతకాలు చేయమని కాంగ్రెస్ పార్టీకు చెందిన వారిని కూడా కోరుతాం’ అని వివరించారు. నేటి (శుక్రవారం) సాయంత్రం లేదా సోమవారం స్పీకర్‌కు సంతకాల సేకరణ ప్రతిని అందజేస్తాం అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు వారు సమాధానమిచ్చారు. -
ఆత్మహత్యలపై నివేదిక కోరిన రాహుల్
బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న రైతుల వరుస ఆత్మహత్యలకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరి నుంచి రెండు వేర్వేరు నివేదికలు ఇవ్వాలని ఆయన సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో రెండు నెలల్లోనే 58 మంది రైతులు వివిధ కారణాల తో బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బెళగావిలోని సువర్ణ విధాన సౌధలో ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ వరుస ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఈ విషయమై కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ నాయకులు యజమానులుగాగల చక్కెర కర్మాగారాల నుంచి బకాయిలు రైతులకు అందకపోవడమే ఈ సమస్యకు కారణమని విపక్షాలతోపాటు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈ విషయమై ఇక్కడి పత్రికలే కాకుండా జాతీయస్థాయి మీడియా కూడా వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో ప్రస్తుతం కాస్త పట్టు ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టంలోనే వరుసగా రైతుల ఆత్మహత్యలు జరుగుతుండడం అందులోనూ ఆ పార్టీ నాయకుల పరోక్ష ప్రమేయంగల కారణాలతో ఈ సంఘటనలు చోటుచేసుకోవడం కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవరపెడుతోంది. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాహుల్‌గాంధీ పర్యటిస్తూ మోదీవి రైతు సంక్షేమానికి విఘాతం కలిగించే నిర్ణయాలని విమర్శిస్తున్న తరుణంలో అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆ పార్టీ హై కమాండ్‌ను ఇరుకున పెడుతోంది. ఈ నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు, నివారణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన పరిహారంతోపాటు ఇక పై ఇలాంటి పరిస్థితి రాకుండా చేపట్టబోయే చర్యలు తదితర వివరాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను త్వరగా హై కమాండ్‌కు అందించాలని ‘యువరాజు’, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఆదేశాలు జారీచేశారు. -
నేతల్లో దడ!
- మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై మల్లగుల్లాలు - జాబితాతో నేడు ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య - సీనియర్ మంత్రులపై వేటు - జార్జ్‌కు శాఖ మార్పు - తొలగింపు జాబితాలో రెబల్‌స్టార్? సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేటి (సోమవారం) ఢిల్లీ పర్యటన రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ అమాత్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ పర్యటన తర్వాత మంత్రి వర్గ విస్తరణతో పాటు పునఃవ్యవవస్థీకరణ కూడా ఉండబోతోందన్న సమాచారంతో వారి కి కునుకు పట్టడం లేదు. చాలా కాలంగా వాయిదా పడుతూ వసు ్తన్న మంత్రి వర్గ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లడంలో విఫలమైన వారిని మంత్రి వర్గం నుండి తొలగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య ఇటీవల బెంగళూరులో మాట్లాడుతూ త్వరలో ‘మంత్రి వర్గ పునర్వవస్థీకరణ భాగంలో కొంతమందిని తప్పించబోతున్నాం. ఈ ప్రక్రియ గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత ఉండబోతోంది.’ అని పేర్కొనడం తెలిసిందే. దీంతో మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయంపై సీనియర్ మంత్రుల్లో భయం నెలకొంది. సీనియర్ మంత్రుల పై వేటు...హోం శాఖ మంత్రికి ట్రాన్స్ఫర్! ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వమోభారంతో బాధపడుతుండటం వల్ల ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్థవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్‌కు నివేదిక అందింది. గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా ఈయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెబల్‌స్టార్ కూడా ‘తొలగింపు' జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ఇటీవల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరగడంతో జాతీయ స్థాయిలో కర్ణాటక పరువు వీధిన పడిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకు హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ అసమర్థతే ప్రధాన కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని స్వపక్షంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే హై కమాండ్‌కు నివేదిక పంపించారు. అంతేకాక ఐఏఎస్ అధికారి డీ.కే రవి అనుమానాస్పద వృుతితోపాటు సింగిల్ నంబర్ లాటరీ కేసుకు సంబంధించి కూడా కే.జే జార్జ్ పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కే.జే జార్జ్‌ను కూడా ఆ స్థానం నుంచి తప్పించి మరో అప్రాధాన్యత పదవి ఇవ్వొచ్చునని తెలుస్తోంది. ఈయనతోపాటు మరికొందరు సీనియర్లను సైతం మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో భాగంగా వారి శాఖలను మార్చాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బెర్తులపై సీనియర్ ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో కన్నేశారు. దీంతో ఆ పదవులను దక్కించేందుకు వారు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని జోరుగా లాబీయింగ్ నడుపుతున్నట్లు ఆ పార్టీకు చెందిన కొంతమంది నాయకులు చెబుతున్నారు. ‘మేడం, యువరాజు’ ఆమోదం కూడా... మంత్రి వర్గం మరింత చురుగ్గా పనిచేసేందుకు గాను అసమర్థులైన మంత్రులను తప్పించి వారి స్థానంలో కార్యదక్షత ఉన్న యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను అప్పగించాలని సిద్ధరామయ్యను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గతంలోనే ఆదేశించారు. ఆమేరకు సిద్ధరామయ్య నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నూతన నివేదికకు ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మేడం, యువరాజుతో తో ఆమోద ముద్ర వేయించుకుని రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. -
చెరువులకు మహర్దశ
- అమల్లోకి ‘సరోవర సంరక్షణ, అభివృద్ధి చట్టం’ - ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి సాక్షి, బెంగళూరు: కబ్జాదారుల చేతుల్లో బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రముఖ చెరువులకు మహర్దశ పట్టనుంది. కనుమరుగవుతున్న చెరువులు, సరస్సులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. చెరువుల రక్షణ, అభివృద్ధికి రూపొందించిన సరోవర సంరక్షణ, అభివృద్ధి చట్టం శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఇదే సందర్భంలో చెరువుల సంరక్షణ, అభివృద్ధికి నూతనంగా ఏర్పాటు చేసిన ‘లేక్ డెవలప్మెంట్ అథారిటీ’ సైతం శుక్రవారం నుంచే తన పనులను ప్రారంభించిందని వెల్లడించారు. శుక్రవారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో నిర్వహించిన విశ్వ పర్యావరణ దినోత్సవంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎక్కడ చెరువుల కబ్జా జరిగినా, వాటిని అడ్డుకొని చెరువులను సంరక్షించే దిశగా ఈ అథారిటీ విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. గతంలో బెంగళూరులో వందలాది చెరువులు ఉండేవని, అయితే నగరంలో జనాభా పెరుగుదల, పరిశ్రమల ఏర్పాటు కారణంగా అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయని పేర్కొన్నారు. ఈ కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణల నడుమ సమతుల్యం తప్పనిసరని ఈ సందర్భంగా సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. ఇక పర్యావరణ రక్షణ, నగరాన్ని శుభ్రంగా ఉంచడం కేవలం బీబీఎంపీ విధులు మాత్రమే కావని, ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని సూచించారు. కోటికి పైగా జనసంఖ్య ఉన్న బెంగళూరు నగరంలో రోజుకు 3.5 నుంచి 4.5 వేల టన్నుల చెత్త ఏర్పడుతోందని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడే చెత్తను పడేయడం, నీటిని శుద్ధి చేయకుండా చెరువుల్లోకి వదిలేయడం తదితర పనులతో గార్డెన్ సిటీ కాస్తా గార్బేజ్ సిటీ అనే అపఖ్యాతిని మూటగట్టుకుందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో నగరంలోని చెత్తను శుద్ధి చేసేందుకు నగరంలో ఆరు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం విశ్వ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కంఠీరవ ప్రాంగణంలో సిద్ధరామయ్య మొక్కలను నాటారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి రామనాథ్ రై, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు వామనాచార్య తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేకు 1100 ఎకరాలు
సాక్షి, బెంగళూరు: అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం బెంగళూరులోని విధానసౌధలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూముల సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక ఇదే సందర్భంలో గదగ్-వాడి రైల్వే ప్రాజెక్టుకు గాను కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు(కేఐఏడీబీ) ద్వారా ఆరు నెలల్లో మొత్తం 1100 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గదగ్-వాడి మధ్య 255 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 2,500 ఎకరాల భూమి అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ కోసం ఆరు నెలల్లో 1100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వనుందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న మరో 15 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అన్నారు. ఈ 15 ప్రాజెక్టుల్లో తుమకూరు-రాయదుర్గ, బీదర్-గుల్బర్గా, బాగల్కోటె-కుడచి, బెంగళూరు-హాసన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారని వెల్లడించారు. తక్కువ పరిమాణంలో రైతుల నుంచి భూమి సేకరించాల్సిన పరిస్థితుల్లో నేరుగా డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాక్షి, బెంగళూరు: అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం బెంగళూరులోని విధానసౌధలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూముల సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక ఇదే సందర్భంలో గదగ్-వాడి రైల్వే ప్రాజెక్టుకు గాను కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు(కేఐఏడీబీ) ద్వారా ఆరు నెలల్లో మొత్తం 1100 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గదగ్-వాడి మధ్య 255 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 2,500 ఎకరాల భూమి అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ కోసం ఆరు నెలల్లో 1100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వనుందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న మరో 15 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అన్నారు. ఈ 15 ప్రాజెక్టుల్లో తుమకూరు-రాయదుర్గ, బీదర్-గుల్బర్గా, బాగల్కోటె-కుడచి, బెంగళూరు-హాసన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారని వెల్లడించారు. తక్కువ పరిమాణంలో రైతుల నుంచి భూమి సేకరించాల్సిన పరిస్థితుల్లో నేరుగా డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అలకలు వీడి ఒక్కటై...
బెంగళూరు: రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దావణగెరెలో నిర్వహించిన ‘సర్వోదయ’ సమావేశం కాంగ్రెస్ నేతల్లో ఒకింత ఉత్సాహాన్ని నింపిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దావణగెరెలోని బా పూజీ ఎంబీఏ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ ‘సర్వోదయ’ పేరిట ఏర్పాటు చేసిన స మావేశంలో కాంగ్రెస్ నేతలంతా తమ తమ విభేదాలను మరిచి చేతులు కలపడమే ఇందుకు ముఖ్య కారణం. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కు మ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇన్చార్జ్ మంత్రులు తమ తమ నియోజకవర్గాల వ్యవహారాల్లో ఎక్కువగా తల దూ రుస్తున్నారంటూ అధికార పార్టీకి చెంది న కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎదుటే మండిపడ్డారు. ఇక మంత్రులు అసలు కేపీసీసీ కార్యాలయం వైపే రావడం లేదని, పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి నెలకొంది. అంతేకాక పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు మంత్రుల సహాయ సహకారాలు లభించడం లేదని కూడా పార్టీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో రాష్ట్రంలో అ ధికారాన్ని చేపట్టి రెండేళ్లు కావస్తున్నా మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర్‌ను మంత్రి పదవికి దూరంగా ఉంచ డం వంటి కారణాలన్నీ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య దూరాన్ని పెంచేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లోనే ఒకరంటే ఇంకొకరికి పడటం లేదంటూ చర్చ సాగింది. అయితే దావణగెరెలో నిర్వహించిన ‘సర్వోదయ’ సమావేశంలో కాంగ్రెస్ నేతలు తమ కుమ్ములాటలను పక్కన పెట్టి అందరూ చేతులు కలపడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దావణగెరెలో నిర్వహించిన సర్వోదయ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి గులామ్ నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, మంత్రులు ఆంజనేయ, డి.కె.శివకుమార్, మహదేవ ప్రసాద్, శామనూరు శివశంకరప్ప తదితరులు పాల్గొన్నారు. సమావేశం పై వరుణుడి ప్రతాపం దావణగెరెలో నిర్వహించిన ‘సర్వోదయ’ సమావేశం పై వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. శనివారం ఉదయం సమావేశం ప్రారంభం కాగానే దావణగెరెలో వర్షం ప్రారంభమైంది. దీంతో అక్కడికి చేరుకున్న వందలాది మంది కార్యకర్తలు తాము కూర్చున్న కుర్చీలను తీసుకొని వర్షానికి అడ్డుగా తలపై పెట్టుకొని నాయకుల ప్రసంగాలను వినాల్సి వచ్చింది. -
ఏం సాధించారని సాధన సమావేశాలు: జగదీష్
బెంగళూరు: రెండేళ్లలో అసలు ఏం సాధించారని కాంగ్రెస్ నేతలు సాధన సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. శనివారం ఇక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంతటి నిర్లక్ష్య, నిర్లిప్త ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడనే లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ‘సర్వోదయ’ పేరుతో సమావేశాన్ని నిర్వహించడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. తమకెంతో మేలు చేస్తారని వెనకబడిన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే, అయితే వారి ఆశలన్నింటినీ సిద్ధరామయ్య తుంచివేశారని ఆరోపించారు. సిద్ధరామయ్య అధికారాన్ని చేపట్టాక పాలనా వ్యవహారాల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ఇసుక, గనుల మాఫియాలు ప్రభుత్వ అధికారులనే బెదిరించే స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేక కన్నీరుపెట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇవన్నీ ఏవీ పట్టించుకోకుండా కేవలం రెండేళ్లు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడమే పెద్ద ఘనకార్యం అన్నట్లు సిద్దరామయ్య సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. -
అట్టహాసంగా ‘సర్వోదయ’
వంద హామీలు నెరవేర్చామన్న సీఎం తన పాలనపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమంటూ ప్రకటన బెంగళూరు: రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టి రెం డేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సర్వోదయ’ పేరుతో అట్టహా సంగా సమావేశాన్ని నిర్వహించారు. దావణగెరెలో శనివారం నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, కర్ణాటకను కాంగ్రెస్ రహిత రాష్ట్రం గా మార్చాలని బీజేపీ నేతలు కలలు కంటున్నారని, అయితే అది ఎన్నటికీ సాధ్యం కాదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, కాంగ్రెస్ కార్యకర్తల అండదండలతో కర్ణాటకను ‘బీజేపీ రహిత’ రాష్ట్రంగా మారుస్తానని అన్నారు. ‘పేదల ఆకలి తీర్చేందుకు మేము ఉచితంగా బియ్యం అందిస్తుంటే, ఇక ప్రజలు కూలి పను లకు ఏం వెళతారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. గత బీజేపీ ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మొత్తం 13 మంది జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. అలాంటి బీజేపీ నేతలు ఇప్పుడు తమపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోందని, అయినా ఇప్పటికీ ప్రజలకు మేలు కలిగించే ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదని విమర్శించారు. అదే తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యే సరికి మేనిఫెస్టోలోని 160 హామీల్లో 100 హామీలను ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రజల కోసం తాము ఏం చేశామనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు తాము సిద్ధమని, అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన పనులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయగలదా అని సిద్ధరామయ్య సవాల్ విసరడం గమనార్హం. -
మూడేళ్లు నేనే సీఎం
రెండేళ్లలో 100 హామీలను నెరవేర్చాం కబ్జాకోరులపై క్రిమినల్ చర్యలు గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మంత్రి వర్గం విస్తరణ ‘మీట్ ది ప్రెస్’లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు: ‘మిగిలిన మూడేళ్లు నేనే సీఎం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. రానున్న ఎన్నికల్లోనూ నేను పోటీచేస్తాను. కర్ణాటకను కాంగ్రెస్ రహిత రాష్ట్రంగా చేస్తామంటూ కలలుకంటున్న బీజేపీ నేతలకు వాస్తవాలను తెలియజెప్పడం కోసమే రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టి బుధవారంతో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రెస్‌క్లబ్ ఆఫ్ బెంగళూరు, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారమిక్కడి ప్రెస్‌క్లబ్ ఆవరణలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సిద్ధరామయ్య పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఎన్నికలకు ముందు తాము ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రజలకు 165 హామీలను ఇచ్చామని, వీటిలో ఈ రెండేళ్లలోనూ 100 హామీలను పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక కోటి ఎనిమిది లక్షల కుటుంబాలకు బీపీఎల్ కార్డుల ద్వారా అన్నభాగ్య పథకాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు నాలుగు కోట్ల మంది పేదలు లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని కోటి మంది చిన్నారులకు ‘క్షీరభాగ్య’ ద్వారా ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. అయితే ఇవేవీ ప్రతిపక్షాలకు కనిపించక పోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ అసలు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో గుర్తు తెచ్చుకోవాలంటూ హితవు పలికారు. పాలనా అవృసరాల దష్ట్యా బీబీఎంపీని విభజిస్తామని బీజేపీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు. ఇప్పుడు బీబీఎంపీని విభజిస్తామంటే బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములతో పాటు చెరువులను ఆక్రమించుకున్న కబ్జాదారులతో పాటు వారికి సహకరించిన అధికారులపై కూడా నిర్దాక్షిణ్యంగా క్రిమినల్ కేసులను నమోదు చేయనున్నట్లు తేల్చి చెప్పారు. ఇళ్లను కోల్పోయిన పేదలకు పునర్వసతి కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించడం ద్వారా ఇప్పటి వరకు 4,052 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వం అనుసరించిన పారిశ్రామిక విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు సైతం పెరిగాయని పేర్కొన్నారు. హోరీ మోటార్స్ సంస్థ ఒక్కటి ఆంధ్రప్రదేశ్‌కు తరలి పోయినంత మాత్రాన అన్ని పరిశ్రమలు తరలిపోయాయనడం సరికాదని తెలిపారు. ఐఏఎస్ అధికారి డి.కె.రవి కేసు ప్రస్తుతం సీబీఐ పరిధిలో ఉన్నందున ఈ విషయం పై తానేమీ మాట్లాడలేనని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తై తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
ఏం సాధించాం?
రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిపై సీఎంతో కేపీసీసీ చీఫ్ చర్చ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహ రచన బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో గ్రామ పంచాయితీ ఎన్నికల నగారా సైతం మోగడంతో కాంగ్రెస్ పార్టీలో ‘రెండేళ్లలో ఏం చేయగలిగాం’? అన్న విషయంపై అంతర్మధనం మొదలైంది. గ్రామ పంచాయితీ ఎన్నికల కోసం ప్రజల ముందుకు ఎలా వెళ్లాలో చర్చించేందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ సమావేశమయ్యారు. బుధవారమిక్కడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో సిద్ధరామయ్యతో పరమేశ్వర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు గ్రామ పంచాయితీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, మంత్రి మండలి విస్తరణ, బీబీఎంపీ ఎన్నికలు, రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సిద్ధరామయ్యతో సుదీర్ఘంగా చర్చించారు. ‘గ్రామ పంచాయితీ ఎన్నికల నగారా మోగిన వేళ ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడగాలి, అసలు ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలేమిటి?’ అని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఇక అనంతరం మంగళవారం రోజున నగరంలోని రేస్‌కోర్సు రోడ్‌లోని కేపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కేపీసీసీ పదాధికారుల సమావేశానికి సంబంధించిన అంశాలను సైతం పరమేశ్వర్, సిద్ధుకు తెలియజేశారు. ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి మంగళవారం నాటి సమావేశంలో బయటపడిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పరమేశ్వర్ , సిద్ధరామయ్య ముందు ఉంచారు. ‘మంత్రులంతా తమ తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నారు తప్పితే పార్టీ ప్రయోజనాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ప్రజల్లో ప్రభుత్వం పై మంచి అభిప్రాయం కూడా లేకుండా పోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కూడా మంత్రులు చురుగ్గా పాల్గొనలేదు. ఇదిలాగే కొనసాగితే పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా నష్టం తప్పదు. మంత్రుల తీరును మార్చేందుకు మీరు కలగజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామ పంచాయితీ ఎన్నికల నగారా మోగిన ఈ తరుణంలో క్షేత్రస్థాయి కార్యకర్తల అవసరం పార్టీకి ఎంతైనా ఉంది’ అని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పేర్కొన్నట్లు సమాచారం. ఇక పరమేశ్వర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ...‘క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను కలుపుకు పోయేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తరఫున ఏమీ చేసేందుకు వీలుకాదు. అందువల్ల ఎన్నికలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా సరే పార్టీ తరఫునే చేపట్టండి. పార్టీలోని అందరి సహకారం ఈ కార్యక్రమాలకు అందేలా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ సీనియర్ నాయకులందరి పైనా ఉంది’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరమేశ్వర్‌కు బదులిచ్చినట్లు కేపీసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లో ఇంటిపోరు
చల్లారని అసమ్మతి భర్తీ కాని నామినేటెడ్ పోస్టులు రాహుల్ దృష్టికి సమస్య ఇలాగే ఉంటే భవిష్యత్తు ఉండదని ఆందోళన బెంగళూరు:అధికార కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ పార్టీలో అసమ్మతి చల్లారడం లేదు. కొంతమంది పార్టీనాయకులైతే ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్ లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావడానికి తామెంతో కష్టపడినా అందుకు తగ్గఫలితం మాత్రం దక్కడంలేదని వాపోతున్నారు. ఈ విషయమై అమీతుమీకి సిద్ధమైన ఆ అసృతప్త నాయకులు ఏకంగా కాంగ్రెస్ యువరాజుకు లేఖరాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంకా 40 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ పదవుల పై ఆశలు పెట్టుకున్న నాయకులు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు తగిన స్థానం ఇవ్వాల్సిందిగా విన్నవిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పదవుల భర్తీ విషయమై సిద్ధు.... పరమేశ్వర్ ‘ఎవరికీ వారే యమునాతీరే’ అన్న రీతిలో వ్యవహరిస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ నామినేటెడ్ పదవుల పై డీసీసీ అధ్యక్షులతో పాటు వారి అనుచరులు కన్నేసి ఉంచారు. పదవుల కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదని భావించిన వీరంతా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తమ గోడును వెళ్లబోసుకుంటూ లేఖరాశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ లేఖలో... ‘2013లో కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం క్షేత్రస్థాయి కార్యకర్తలు ఎంతగానో శ్రమించారు. అందువల్లే దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయితే క్షేత్రస్థాయి సిబ్బంది కష్టాన్ని విస్మరించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరమేశ్వర్ వంటి కొంత మంది నాయకులే పదవులను అ నుభవిస్తున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టులను కూ డా మాకు కట్టబెట్టడం లేదు. ఎన్ని సార్లు వారిని కలిసి విన్నవించినా రేపు మాపు అంటూ వాయిదా వేస్తున్నా రు. వారికి సమయం లేదేమో., మీరే కల్పించుకుని మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడండి. లేదంటే రానున్న బీబీఎంపీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ విజయం పై మేము భరోసా ఇవ్వలేం’ అని ఘాటుగా పేర్కొన్నారు. మరోవైపు మంత్రి మండలి కూడా పూర్తీ స్థాయిలో భర్తీ కాలేదు. ఇంకా నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవుల పై కన్నేసిన నాయకులే డీసీసీ అధ్యక్షుల లేఖల ఘటాన్ని తెరవెనక నుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ... ‘మంత్రి పదవుల పై కన్నేసిన నాయకులు సిద్ధరామయ్య ‘వాయిదా వ్యవహార శైలి’ పై కినుకు వహించారు. డీసీసీ అధ్యక్షుల ద్వారా హై కమాండ్ పై ఒత్తిడి తీసుకువచ్చి నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలోనే మంత్రిమండలి విస్తరణకు కూడా అనుమతి పొందవచ్చునని భావిస్తున్నారు. అందువల్లే ఈ లేఖల ఘట్టాన్ని తెరవెనక ఉండి నడిపిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. -
ఆకలి రహిత కర్ణాటక లక్ష్యం
సీఎం సిద్ధరామయ్య అన్నభాగ్యతో 4 కోట్ల మందికి {పయోజనం రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోండి ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తుల ఆహ్వానం జూన్ 1 నుంచి ఏపీఎల్ కార్డుదారులకు దేషన్ బెంగళూరు: ఆకలి రహిత కర్ణాటకను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. బీపీఎల్ కార్డుదారులకు చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన విధానసౌధ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అన్నభాగ్య పథకం వల్ల రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారన్నారు. ఈ పథకం కోసం వరి, రాగి, గోదుమలకు కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. దీని వల్ల రైతులకు కూడా లాభం చేకూరుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం జనాభాలో 21 శాతం మంది దారిద్ర రేఖకంటే దిగువన ఉన్నారని తెలిపారు. తమిళనాడులో ఈ సంఖ్య 17 శాతం, కేరళలో 12 శాతంగా ఉందని వివరించారు. అయితే కర్ణాటకలోని మొత్తం జనాభాల్లో 23.6 శాతం మంది దారిద్రరేఖ కంటే దిగువన ఉన్నారని తెలిపారు. వీరందరికీ పౌష్టికాహారం దక్కాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ఉచితంగా ఆహారధాన్యాలను, రాయితీ ధరల్లో వంటనూనె, ఉప్పును అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. నూతనంగా ఏపీఎల్ లేదా బీపీఎల్ కార్డు పొందాలనుకునే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఏపీఎల్ కార్డుదారులకూ రాయితీ ధరల్లో బియ్యం, గోదుమలను రేషన్ షాపుల ద్వారా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావ్ మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 రేషన్‌కార్డులను వితరణ చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ రేషన్‌కార్డులను అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు రామలింగారెడ్డి, కే.జే జార్జ్ తదితరులు పాల్గొన్నారు. -
వెనక్కు తగ్గం
మేకెదాటు వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తాం దీని వల్ల తమిళనాడుకు ఎలాంటి నష్టం ఉండదు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజకీయాలు చేసినా వెనకడుగు వేయకుండా మేకెదాటు ప్రాజెక్టును నిర్మించి తీరతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నగరంలోని పీణ్యా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి నాగసంద్ర వరకు నిర్మించిన మెట్రో రీచ్ 3బి రైలు సంచారాన్ని శుక్రవారమిక్కడ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మేకెదాటు వద్ద జలాశయాన్ని నిర్మించడం ద్వారా 35 టీఎంసీల నీటిని సేకరించవచ్చని, అంతేకాక 400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ జలాశయం నిర్మాణం వల్ల తమిళనాడుకు ఎలాంటి నష్టం కలగబోదని తెలిపారు. కావేరి జలాల పంపిణీకి సంబంధించిన ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం గత ఎనిమిదేళ్లుగా ప్రతి ఏడాది తమిళనాడుకు 192 టీఎంసీల నీటిని విడుదల చేస్తూనే వస్తున్నామని చెప్పారు. కావేరి నది నుంచి వృధాగా సముద్రంలోకి వెళుతున్న నీటిని ప్రజల తాగునీటి అవసరాల కోసం మరలించేందుకే మేకెదాటు వద్ద జలాశయాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఈ జలాశయ నిర్మాణానికి అడ్డుపడడం ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ృసష్టించినా, ఎన్ని రాజకీయాలు చేసినా మేకెదాటు జలాశయాన్ని నిర్మించి తీరతామని పేర్కొన్నారు. ఇక 42.3 కిలోమీటర్ల పొడవున ఏర్పాటైన మొదటి విడత మెట్రో రైలు పనులను ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది మార్చ్ నాటికి పూర్తి చేయనున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. రూ.13,845 కోట్ల రూపాయల మొదటి విడత మెట్రో పనుల్లో ఇప్పటికే 94శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. మెట్రో మొదటి విడత పనులు పూర్తయిన అనంతరం రూ.26,405 కోట్ల అంచనా వ్యయంతో 72 కిలోమీటర్ల మేర రూపొందించిన మెట్రో రెండో విడత పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక బీబీఎంపీ విభజన అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ....బెంగళూరు మహానగర పాలికెనుృబహత్ బెంగళూరు మహానగర పాలికెగా మార్చడమే ఓ అవైజ్ఞానిక నిర్ణయమని, అప్పటి నుంచి నగర ప్రజల సమస్యలు మరింత అధికమయ్యాయని అన్నారు. అందుకే బీబీఎంపీని విభజించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. -
నేటి నుంచి ఉచిత అన్నభాగ్య
బెంగళూరు : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలతో పాటు అంత్యోదయ లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల ఉచితంగా బియ్యం, గోధుమలు వితరణ చేయనున్నారు. రాయితీ ధరల్లో ఉప్పు, వంటనూనెను కూడా ప్రభుత్వం అందజేయనుంది. బెంగళూరులోని విధానసౌధాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేటి (శుక్రవారం) ఉదయం 12 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. యూనిట్‌కు (ఒకరు ఉన్న కుటుంబానికి) రూ.5కిలోల బియ్యం లేదా నాలుగు కిలోల బియ్యం కిలో గోధుమలు లెక్కన గరిష్టంగా 25 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా వితరణ చేయనున్నారు. అదేవిధంగా రూ.20 చొప్పున లీటర్ వంటనూనెను, రూ.2లకు కిలో అయోడైజ్డ్ ఉప్పును ప్రభుత్వం అందజేయనుంది. ఇదిలా ఉండగా గతంలో మాదిరిగానే లబ్ధిదారులకు చక్కెర, కిరోసిన్‌ను కూడా ఇవ్వనుంది. అదేవిధంగా ఏపీఎల్ కార్డుదారులకు కూడా కిలో రూ.15 చొప్పున బియ్యాన్ని రూ.10 చొప్పున గోధుమలను రాయితీ ధరల్లో జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా అందజేయనున్నారు. మే 1 నుంచి నూతనంగా బీపీఎల్, లేదా ఏపీఎల్ కార్డు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ కిలో రూ.1 చొప్పున గరిష్టంగా 30 కిలోల బియ్యాన్ని అన్నభాగ్య పథకం కింద వితరణ చేస్తున్న విషయం తెలిసిందే. -
నీటిమూటేనా ?
తుంగభద్ర కాలువల ఆధునికీకరణపై పాలకుల్లో కనిపించని చిత్తశుద్ధి ఏపీ, కర్ణాటక సీఎంల చర్చలు నిష్ఫలం సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నీరందించే తుంగభద్ర జలాశయం పరిధిలోని హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల ఆధునికీకరణ చేస్తామని పాలకులు ఇచ్చిన హామీ నీటి మూటగా మారింది. వరద కాలువ నిర్మాణాలపై పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో రైతులకు శాపంగా మారిం ది. తుంగభద్ర డ్యాంలోకి ఏటా పుష్కలంగా నీరు వస్తున్నప్పటికీ తగినంత నిల్వ ఉంచుకునే సామర్థ్యం లేకపోవడంతో ఏటా 200 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఇందులో కనీసం కొంత నీరైనా రైతులకు ఉపయోగించేలా చర్యలు చేపట్టడంలో పాలకు లు విఫలమవుతున్నారు. తుంగభద్ర డ్యాం సామర్థ్యం 134 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం పూడిక చేరి పోవడంతో 101 టీఎంసీలకు పడిపోయింది. దా దాపు 33 టీఎంసీల నీటి నిల్వ మేర పూడిక చేరడం తో పూడిక తీత సాధ్యాసాధ్యాలపై ఆధ్యయనం పూ ర్తిస్థాయిలో చేయలేదు. దీంతో నీటి వాటా దామాషా ప్రకారం పూర్తిగా తగ్గించి వేశారు. అనంతపురం జిల్లాకు 32 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం 22 టీఎంసీలు మాత్రమే అందిస్తున్నారు. బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలకు ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో పూడికవల్ల నష్టపోతున్న నీటిని ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆరు నెలల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో బెంగళూరులో భేటీ అయ్యారు. పూడిక వల్ల నష్టపోతున్న నీటిని పొందాలంటే హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువల ఆధునీకరణ చేపడితే కొంత మేలు జరుగుతుందని చర్చించారు. వరద కాల్వ నిర్మాణాలపై చర్చించినప్పటికీ ఆధునీకరణకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే తుంగభద్ర డ్యాం పరిధిలో వరద కాల్వ నిర్మాణాలు చేపడితే బళ్లారి, అనంతపురం జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ ప్రాంత రైతులు అభిప్రాయ పడుతున్నారు. ప్రతి ఏటా కాలువల తాత్కాలిక ఆధునీకరణ పనులకు తూతూమంత్రంగా నిధులు విడుదల చేస్తున్నారు. పనులు ఆలస్యంగా చేపట్టడం, టెండర్లు ఆలస్యంగా పిలవడం వల్ల కాలువల మరమ్మతులు కూడా సక్రమంగా చేయడం లేదు. ఈ నేపథ్యంలో సీఎంలు ఇద్దరు తుంగభద్ర కాలువలపై చర్చలు జరపడంతో రైతుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. అయితే ముఖ్యమంత్రులు చంద్రబాబు, సిద్ధరామయ్య చర్చించిన మేరకు ఆధునీకరణపై ఎలాంటి ముందడుగు లేకపోవడంతో ఈ ఏడాది ఆధునీకరణ అటకెక్కినట్లేని భావిస్తున్నారు. ప్రస్తుతం మేలోకి అడుగు పెట్టబోతున్నాం. మే, జూన్ రెండు లేదా మూడవ వారంలోపు తుంగభద్ర కాలువ ఆధునీకరణ పనులకు చేపట్టాలి. ఆ తర్వాత కాలువలకు నీరు విడుదల చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా నిలిపి వేస్తారు. ప్రస్తుతం డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కూడా పిలవకపోవడంతో తుంగభద్ర కాలువల ఆధునీకరణపై ముఖ్యమంత్రికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. -
నేపాల్ బాధితులకు ఏడాది వేతనం
బెంగళూరు: శాసనమండలి సభ్యుడిగా తన ఏడాది వేతనాన్ని నేపాల్ భూకంప బాధితులకు అందజేయనున్నట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మంత్రిమండలి పునఃరచనతో పాటు విస్తరణ కూడా ఉంటుందని తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తాను చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చేనెల 13కు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు తెలియజెప్పడానికి ఉత్తర కర్ణాటక భాగంలో ృహత్ సమావేశం జరిపే ఆలోచన ఉందని తెలిపారు. -
సీనియర్లకు దడ
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో మంత్రి వర్గం విస్తరణ, పునఃవ్యవస్థీకరపై మొదలైన ఆందోళన బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ అమాత్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ పర్యటన తర్వాత మంత్రి వర్గ విస్తరణతో పాటు పునఃవ్యవవస్థీకరణ కూడా ఉండబోతోందన్న సమాచారంతో వారికి కునుకు పట్టడం లేదు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లడంలో విఫలమైన వారిని మంత్రి వర్గం నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి సీఎం ఇటీవల బెంగళూరులో మాట్లాడుతూ త్వరలో ‘మంత్రి వర్గ పునర్వవస్థీకరణ భాగంలో కొంతమందిని తప్పించబోతున్నాం. ఈ ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలోపు పూర్తి కావచ్చు.’ అని పేర్కొన్నారు. దీంతో మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయంపై సీనియర్ మంత్రుల్లో భయం నెలకొంది. సీనియర్ మంత్రులపై వేటు? ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వయోభారంతో బాధపడుతుండటం వల్ల ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్ధవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్‌కు నివేదిక అందింది. ఇక గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. చాలా కాలంగా ఈయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెబల్‌స్టార్ కూడా ‘తొలగింపు’ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ఇటీవల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరగడంతో జాతీయ స్థాయిలో కర్ణాటక పరువు వీధిన పడిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకు హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ అసవర్థతే ప్రధాన కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయాన్ని స్వపక్షంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే హై కమాండ్‌కు నివేదిక పంపించారు. అంతేకాక ఐఏఎస్ అధికారి డీ.కే రవి అనుమానాస్పద మృతికి సంబంధించి కూడా కే.జే జార్జ్ పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కే.జే జార్జ్‌ను కూడా ఆ స్థానం నుంచి తప్పించి మరో అప్రాధాన్యత పదవి ఇవ్వొచ్చునని తెలుస్తోంది. ఈయనతోపాటు మరికొందరు సీనియర్లను సైతం మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో భాగంగా వారి శాఖలను మార్చాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘మేడం’ ఆమోదం కూడా... మంత్రి వర్గం మరింత చురుగ్గా పనిచేసేందుకు గాను అసమర్థులైన మంత్రులను తప్పించి వారి స్థానంలో కార్యదక్షత ఉన్న యువ ఎమ్మెల్యేలకు పదవులను అప్పగించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గతంలోనే సిద్ధరామయ్యను ఆదేశించారు. ఆమేరకు సిద్ధరామయ్య నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నూతన నివేదికకు ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మేడంతో ఆమోద ముద్ర వేయించుకుని రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. -
విద్రోహుల పీచమణుస్తాం
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు : రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పే ర్కొన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా కోరమంగళలోని కేఎస్ఆర్పీ మైదానంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఇందుకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పోలీసుల సంక్షేమం కోసం ప్ర భుత్వం అనేక కార్యక్రమాలను రూపొం దిస్తోం దన్నారు. అందులో భాగంగా వారి పిల్లల కోసం ప్రత్యేకంగా త్వరలో గుల్బర్గా, ఉడిపిల్లో ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించనున్నామన్నారు. ఇలాంటి పాఠశాలలు ఇప్పటికే కోరమంగల, మైసూరు, ధార్వాడలో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలీస్ క్యాంటీన్లోని సౌలభ్యాలను విశ్రాంత ఉద్యోగులకూ అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. కాగా, కార్యక్రమం లో భాగంగా పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన 85 మంది సిబ్బందికి ముఖ్యమంత్రి పతకాలను ప్రదానం చేశారు. -
మద్యం షాప్‌లకు అనుమతులు
నకిలీ మద్యాన్ని అరికట్టే దిశగా... సభలో చర్చించి నిర్ణయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన నూతన విధానంతో ఖజానాకు ఆదాయం : ఎమ్మెల్యే రమేష్‌కుమార్ మద్యం షాప్‌లకు అనుమతులు బెంగళూరు: రాష్ట్రంలో సారాయి అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన అనంతరం నకిలీ మద్యం ప్రవాహం పెరిగిపోయిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ మద్యం ప్రవాహాన్ని అరికట్టాలంటే కొత్త మద్యం షాప్‌ల లెసైన్స్‌ల జారీ విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విధానసభలో శుక్రవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం సేవించే వారి సంఖ్య తగ్గలేదని, అదే సందర్భంలో నకిలీ మద్యం కూడా గ్రామీణ ప్రాంతాల్లో యధేచ్చగా లభిస్తోందని అన్నారు. సారాయి అమ్మకాలను నిషేధించిన అనంరతం టీ స్టాల్స్, కిరాణా దుకాణాల్లో సైతం మద్యాన్ని అమ్ముతున్నారని తెలిపారు. ‘ఆడపడుచుల కన్నీరు తుడిచే ఉద్దేశంతో గత ప్రభుత్వం రాష్ట్రంలో సారాయి అమ్మకాలను నిషేధించింది. అయితే సారాయి స్థానంలో నకిలీ మద్యం ప్రవేశించింది. ప్రజలు నకిలీ మద్యాన్ని సేవించడం మానలేదు, ఆడపడుచుల కన్నీరు ఆగలేదు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. గ్రామాల్లో నకిలీ మద్యం ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే మద్యం షాప్‌లకు లెసైన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే గతంలో ఓ సారి వైన్స్టోర్లకు లెసైన్స్‌లు అన్న తమ ఆలోచనను ప్రకటించినపుడు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. అందువల్ల ఈ విషయంపై ఓ సారి సభలో చర్చించి, సభ్యుల అభిప్రాయాలను సేకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే రమేష్‌కుమార్ మాట్లాడుతూ...కొత్త లెసైన్స్‌ల జారీ విధానం ద్వారా నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు అవకాశం ఉందని అన్నారు. ఇక ఎక్సైజ్ శాఖలో అవినీతిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. -
చావుపై విపక్ష రాజకీయం
ఉభయ సభల్లో తీవ్ర వాగ్వాదానికి కారణమైన సీఎం వ్యాఖ్యలు వాకౌట్ చేసిన శాసనసభ, మండలిలోని విపక్షాలు బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐఏఎస్ అధికారి డీ.కే రవి వృతికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఉభయసభల్లో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. సీఎం వాఖ్యలను ఖండిస్తూ విపక్షాలు సభల నుంచి వాకౌట్ చేశాయి. శాసనసభలో సోమవారం కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే సభానాయకుడు, సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘విపక్షాలు కోరుతున్నాయని మేము డీ.కే రవి మృతికి సంబంధించిన కేసును సీబీఐకు ఇవ్వడానికి అంగీకరించలేదు. రాష్ట్ర ప్రజలతో పాటు బాధిత కుంటుంబం కోరిక మేరకు కేసును సీబీఐకి అప్పగించాం. చావుకు సంబంధించిన విషయం కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. అందులో భాగంగా డీ.కే రవి తల్లిదండ్రులను విధానసౌధలోనికి తీసుకువచ్చి వారితో నిరసన దీక్ష చేయించాయి. దీని వల్ల రాజకీయ ప్రయోజనం పొందాలనేదే వారి ఆలోచన.’ అని పేర్కొన్నారు. దీనికి శాసనసభలోని ప్రధాన విపక్ష భారతీయ జనతా పార్టీ నాయకుడు శెట్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు మిగిలిన బీజేపీ నాయకులతో పాటు జేడీఎస్ తదితర విపక్ష నాయకులు తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా అధికార విపక్ష నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదాల నడుమే శెట్టర్ మాట్లాడుతూ...‘సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం అంగీకరించడం సరైన నిర్ణయమే. అయితే ఈ చర్యలను వారం ముందు తీసుకుని ఉంటే బాగుండేది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విపక్షాల గురించి నిర్లక్ష్య వ్యాఖ్యలు చేయడం సరి కాదు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెన క్కు తీసుకోవాలి.’ అని పునరుద్ఘాటించారు. ఈ సమయంలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని సభానాయకుడైన సీఎం సిద్ధరామయ్య సరిగానే మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోమని చెప్పలేను.’ అని పేర్కొన్నా రు. దీంతో బీజేపీ నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. వారికి మద్దతుగా జేడీఎస్ ఫ్లోర్ లీడర్ కుమారస్వామితో పాటు ఆ పార్టీకు చెందిన నాయకులందరూ శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దాదాపు ఇదే ‘సీన్’ శాసనమండలిలో కూడా కనిపించింది. ముఖ్యమంత్రి సిద్ధరామ య్య ప్రకటనపై విపక్షాలు చర్చకు పట్టుబటా యి. అంతేకుండా హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అయితే అందుకు మండలి నాయకుడు ఎస్.ఆర్ పాటిల్‌తోపాటు శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తి అంగీకరించక పోవడంతో బీజేపీ, ఎడీఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ బయటికి వెళ్లిపోయారు. -
పీ 3మయం
అంతా సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన రూ.1.42 లక్షల కోట్ల అంచనాతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పథకాల అమలుకు నిధుల సేకరణ పెద్ద సవాలుతో కూడుకున్నది. దీంతో చాలా పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో పూర్తి చేయాలని భావిస్తోంది. గత ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలులో చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యం కంటే రూ.1,500 కోట్లు వెనుక బడిపోయింది. అంతే కాకుండా రానున్న ఆర్థిక ఏడాది (2015-16)కి కేంద్రం తన బడ్జెట్లో అనేక రకాల సబ్సిడీలకు, సంక్షేమ పథకాలకు కోత విధించింది. దీంతో కేంద్ర సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న కొన్ని పథకాల్లో దాదాపు రూ.4,900 కోట్లకు కోత పడనుంది. ఈ విషయాలన్నీ తెలిసినా త్వరలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సిద్ధరామయ్య గత ఏడాది కంటే ఎక్కువ అంచనాలు గల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో తాజా బడ్జెట్లో పేర్కొన్న మొత్తం నిధుల్లో ఎక్కువ భాగం ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతోపాటు బడ్జెట్లో కొత్తగా పేర్కొన్న షూ, పశు తదితర ‘భాగ్య’లకే ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి. దీంతో తాజా బడ్జెట్లో ప్రస్తావించిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రైవేటు సహకారం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మేరకు ఇప్పటికే అన్నిప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బడ్జెట్లో పేర్కొన్న అభివృద్ధి కార్యకమాలకు సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యం విధానంపై నివేదిక తయారు చేయాలని సిద్ధరామయ్య ప్రభుత్వం పేర్కొంది. ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రైవేటు సహకారం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం పెరగనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటుబడుతుందని విశ్లేషిస్తున్నారు. ఈ విషయమై బెంగళూరు విశ్వవిద్యాలయ ఆర్థిక విభాగనికి చెందిన ప్రొఫెసర్ ఒకరు మాట్లాడుతూ...‘కేంద్ర సాయం తగ్గడం, గత ఏడాది పన్నుల వసూలులో అనుకున్న లక్ష్యం చేరక పోవడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని సిద్ధరామయ్య వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను తయారు చేసి ఉండాల్సింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది కంటే ఎక్కువ అంచనాలతో రూపొందించిన తాజా బడ్జెట్ పేరుకు పెద్దది తప్పస్తే దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే బలుపే తప్ప బలం లేదు.’ అని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో అమలు చేయాలని భావిస్తున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాయిల్ హెల్త్ మిషన్ చేపల అమ్మక కేంద్రాలు, అల్పాహార కేంద్రాల ఏర్పాటు హుబ్లీ, తుమకూరుల్లో శీతల గిడ్డంగుల ఏర్పాటు రాష్ట్రంలోని 17 పట్టణాల్లో ఘణ వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ కేంద్రాలు హేమావతి, కబిని ఆనకట్టల వద్ద ఉద్యానవనాల ఏర్పాటు -
పదవి నాకొద్దు
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్ బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానం రేసులో తాను లేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్ స్పష్టం చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. తనకు కేపీసీసీ అధ్యక్ష స్థానంపై ఎలాంటి ఆశ లేదన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు పరమేశ్వర్‌కు సైతం తెలియజేశానని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం తాను నిర్విస్తున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖను వీడి ఇతర శాఖకు వెళ్లాలనే ఆలోచన తనకు లేదన్నారు. ప్రస్తుతం తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖతో సంతృప్తిగానే ఉన్నానని తెలిపారు. కర్ణాటక భూ భాగానికి చెందిన మేకదాటు వద్ద జలాశయాన్ని నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయమై న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చించామని తెలిపారు. రానున్న పదినెలల్లోపు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక తయారవుతుందని ఎం.బీ పాటిల్ తెలిపారు. మేకెదాటు వద్ద జలాశయాన్ని నిర్మించడం వల్ల తమిళనాడుకు కర్ణాటక నుంచి ఇవ్వాల్సిన కావేరీ జలాల్లో ఎటువంటి కోత పడదని స్పష్టం చేశారు. అయినా అక్కడి ప్రభుత్వం ఈ విషయమై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఎం.బీ పాటిల్ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. -
నేడు బడ్జెట్
బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేటి (శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు 2015-16 ఆర్థిక ఏడాదికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ, పారిశ్రామిక పరిస్థితులను అనుసరించి సంక్షేమం, అభివృద్ధికి దాదాపు సమాన నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్ రూ.1.38 లక్షల కోట్లు కాగా ఈ సారి అంతకంటే పదిశాతం ఎక్కువగా బడ్జెట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రానున్న మేనెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామీణుల సంక్షేమం, అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించనున్నారు. మరోవైపు సాగు భూమిలేని వారికి ప్రభుత్వమే భూములు కొనుగోలు చేసి వితరణ చేసేలా ఓ పథకాన్ని కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రతి గ్రామపంచాయితీకు ఒక సహకార గ్రామీణ బ్యాంకును నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో ప్రకటించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక త్వరలో బీబీఎంపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేయర్ పీఠాన్ని చేజెక్కించుకోవడానికి వీలుగా బీబీఎంపీ పై కూడా వరాలు జల్లు కురిపించవచ్చునని తెలుస్తోంది. నేటి బడ్జెట్లో బీబీఎంపీకి దాదాపు రూ.2,500 కోట్లు కేటాయించవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోయాయి. ఈ విషయమై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్న సిద్ధరామయ్య ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పలు రాయితీలను ప్రకటించవచ్చునని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాట్ తగ్గింపు ఇందులో ప్రధాన అంశం కానుందని సమాచారం. కర్ణాటకవాసులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఐఐటీను ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందుకు భూ కేటాయింపులు, ఇతర మౌలిక సదుపాయాల పై రాష్ట్ర బడ్జెట్లో సిద్ధరామయ్య స్పష్టత ఇవ్వనున్నారని అధికారులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూను పెంచుకోవడం కోసం మద్యం ధరలను పెంచే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయిన రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ తదితర వాటిని పెంచి ఆదాయ వనరులుగా మార్చుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రితోపాటు ఆర్థికశాఖను నిర్వహిస్తున్న సిద్ధరామయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం పదోసారి. ముఖ్యమంత్రి హోదాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఇది మూడోసారి. గత బడ్జెట్ హామీల సంగతేమిటో...... 2014-15 బడ్జెట్లో సిద్ధరామయ్య ప్రకటించిన వివిధ పథకాలు ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ కనీసం ప్రారంభం కూడా కాలేదు. ఈ పథకాలకు గాను కనీసం ఈ బడ్జెట్లో నైనా నిధులను కేటాయిస్తారా, లేక వాటిని కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు వివిధ అభివృద్ధి పనులకు గాను ఆయా శాఖలకు కేటాయించిన నిధులు కూడా కేవలం 40 నుంచి 50శాతం మాత్రమే ఖర్చయ్యాయి. దీంతో కనీసం ఈ ఏడాదైనా సరే ప్రజా సంక్షేమ పధకాలను ప్రకటించడంతో పాటు వాటిని ప్రారంభించి, ఆయా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలనేది నిపుణుల వాదన. -
పదవుల పందేరం
కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల నియామకానికి కసరత్తు ఆశావహులు పదివేలకు పైగా 900 మందికి స్థానం నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం బెంగళూరు : రాష్ట్రంలోని కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కార్పొరేషన్ బోర్డుల అధ్యక్షులు, సభ్యుల నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం వెలువడనున్నట్లు సమాచారం. కార్పొరేషన్ బోర్డు పదవులకు సంబంధించి అధ్యక్షులు, సభ్యులుగా 900 మందిని నియమించే అవకాశాలుండగా, ఈ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మాత్రం 10వేల మందికి పైగా కావడం గమనార్హం. ఇక దరఖాస్తు చేసుకున్న వారిలో 900 మందిని ఎంపిక చేసేందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్లు ఇంతకు ముందు చర్చలు జరిపారు. అయితే తుది జాబితాను సిద్ధం చేయాల్సిన తరుణంలో దళిత ముఖ్యమంత్రి డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్ వెనక ఉన్నది కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ అన్న వార్తలు రావడంతో సిద్ధు, పరమేశ్వర్ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో మరోసారి కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల భర్తీ వాయిదా పడవచ్చనే వార్తలు వచ్చాయి. ఇక కార్పొరేషన్ బోర్డులకు అధ్యక్ష, సభ్యుల నియామకం ఎప్పటి కప్పుడు వాయిదా పడుతూ వస్తుండడంతో క్షేత్ర స్థాయి అభిృద్ధి పూర్తిగా కుంటుపడిందనే విమర్శలు ప్రభుత్వంపై వెల్లువెత్తాయి. అంతేకాక చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీకోసం ఇన్నాళ్లు శ్రమించిన ఎంతో మంది క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు కార్పొరేషన్ బోర్డుల అధ్యక్షులు, సభ్యుల నియామకంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ల మధ్య నెలకొన్న విబేధాలతో ఈ నియామకాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో సహనం నశించిన కొంతమంది నాయకులు పార్టీ హైకమాండ్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో తక్షణమే కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల స్థానాల భర్తీపై ృష్టి సారించాలని, కార్యకర్తల్లో మరింత అసంృప్తి చెలరేగకుండా జాగ్రత్త పడాలని హైకమాండ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఎస్.ఎం.ృష్ణ, మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, బి.కె.హరిప్రసాద్‌ల సిఫార్సులు, సూచనలను సైతం పరిగణలోకి తీసుకొని తుది జాబితాను రూపొందించినట్లు సమాచారం. కాగా మొత్తం 900 మందితో కూడిన తుది జాబితా మంగళవారం వెలువడే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
నూతన ఒరవడికి శ్రీకారం
స్టూడెంట్ పోలీస్ కాడెట్ ప్రారంభం లైంగికదాడుల నివారణకు చైతన్యం అవసరం సీఎం సిద్ధరామయ్య బెంగళూరు(బనశంకరి): పిల్లలపై లైంగికదాడుల్లాంటి అమానుష సంఘటనలను అరికట్టడానికి పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సోమవారం కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టూడెంట్ పోలీస్ కాడెట్ పథకాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. సమాజంలో పిల్లలపై జరుగుతున్న లైంగికదాడులు, అత్యాచారాలు లాంటి అమానుష దుశ్చర్యలను అరికట్టే కార్యక్రమాలు పాఠశాల, కాలేజీ స్థాయి నుంచే ప్రారంభం కావాలన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని స్టూడెంట్ పోలీస్ కాడెట్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. కర్ణాటక పోలీసులు నూతన ప్రయోగం చేశారని, స్టూడెంట్ కాడెట్ పథకం పాఠశాల స్థాయిలో యువకుల ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు. పాఠశాల-కాలేజీ విద్యార్థుల్లో సామాజిక జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు. కేరళలో ఈ పథకం విజయవంతమైందని తెలిపారు. సమాజంలో జవాబుదారీతనంతో కూడిన యువతీయువకులను తయారు చేస్తుందని సమాజంలో శాంతి భద్రతలు ఉండాలంటే ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పోలీసులు జనస్నేహిగా సమాజ శ్రేయస్సుకోసం పనిచేయాలన్నారు. అప్పుడే సమస్యలు పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థి దశ నుంచి జాగృతం చేసే ఈ పథకం ద్వారా దేశప్రేమను పొందడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఇటీవల రోజుల్లో మానవవిలువలు క్షీణిస్తున్నాయన్నారు. ధర్మ-అధర్మాల మధ్య, జాతి-జాతుల మధ్య ఘర్షణలు శాంతికి భంగం కలిగిస్తున్నాయన్నారు. ఇలాంటి దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడే గుణం యువత అలవరుచుకోవాలన్నారు. యూనిఫాం ధరించిన తరువాత ఎలాంటి తప్పు చేయరాదని స్టూడెంట్ పోలీస్ కాడెట్లకు తెలిపారు. అనంతరం హోంమంత్రి కేజే జార్జ్ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతలు కాపాడడం, ఆస్తులకు రక్షణ కల్పించడం కేవలం పోలీస్ శాఖతోనే సాధ్యం కాదన్నారు. ప్రజలు, సంఘ సంస్థలు సహకరించి అందరూ చేయి కలపాలన్నారు. స్టూడెంట్ పోలీస్ కాడెట్ పథకం యువకుల్లో చట్టంపై అవగాహన పెంచే ఉత్తమ సాధనమన్నారు. దేశభవిష్యత్ యువకులతోనే సాధ్యమని, దేశాభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నూతన డీజీపీ ఓంప్రకాష్, నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్.రెడ్డి, నేరవిభాగం అదనపు పోలీస్ కమిషనర్ హరిశేఖరన్, శాంతి భదత్రల విభాగం అదనపు కమిషనర్ అలోక్‌కుమార్ పాల్గొన్నారు. -
ప్రయోజనం శూన్యం
రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు అందించలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రయాణ ఛార్జీలు తగ్గుతాయని సామాన్యులు ఆశించారు. ఇంధన ధరలు తగ్గినా రైల్వేశాఖ నష్టాల్లో ఉందని సాకులు చెబుతూ ప్రయాణ ఛార్జీలు ఏమాత్రం తగ్గించకపోవడం శోచనీయం. ఇంధన ధరల తగ్గింపు కారణంగా రైల్వే శాఖ దాదాపు 16వేల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేస్తోంది. ఈ మొత్తాన్ని ప్రజలకు అందజేసేందుకు కేంద్రం ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు.’ అని తెలిపారు. ఇక గత ఏడాది డి.వి.సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 8 రైళ్లను ప్రకటించారని, వీటిలో ఏ ఒక్కటి ఇప్పటికీ అందుబాటులోకి రాలేదని విమర్శించారు. ఇక ఈ బడ్జెట్లో సైతం ఈ రైళ్లకు సంబంధించి ప్రస్తావించకపోవడం కన్నడిగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 50శాతం నిర్మాణ వ్యయాన్ని భరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో మార్పులు చేయాల్సిందిగా ఇప్పటికే తాను కోరానని తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూములను కేటాయించడంతో పాటు నిర్మాణ వ్యయంలో 50శాతం భరించడం రాష్ట్రానికి భారంగా పరిణమిస్తుందనే విషయాన్ని కేంద్రానికి వివరించానని చెప్పారు. -
అదిరిందయ్యా.. సతీషూ..
మంత్రిత్వ శాఖ మార్పుపై నిర్ణయం ప్రతిపాదనను గవర్నర్‌కు పంపిన ముఖ్యమంత్రి బెంగళూరు : సతీష్ జారకీ హోళీ మంత్రిత్వ శాఖను రాష్ట్ర ఎక్సైజ్ నుంచి చిన్నమధ్య తరహా పరిశ్రమల శాఖకు మారుస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలాకు గురువారం పంపించారు. ఇప్పటి వరకు సతీష్ జారకీహోళీ నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖను ముఖ్యమంత్రి తన పర్యవేక్షణలోకి తీసుకున్నారు. కాగా, ఎక్సైజ్ శాఖ తన మనస్తత్వానికి సరిపోదంటూ గతంలో సతీష్ జారకీహోళీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు గాను అప్పట్లోనే శాఖ మార్పుపై ఆయనకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం సతీష్ జారకీ హోళీకి రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖను కేటాయించారు. -
రూ.1.75 లక్షల కోట్లతో బడ్జెట్ - సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు : మార్చిలో జ రగనున్న సమావేశాల్లో రూ. 1.75లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అన్ని విభాగాలకు సమాన ప్రాధాన్యతను కల్పించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చే కూర్చే విధంగా అత్యుత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నామని చె ప్పారు. బెళగావి పర్యటనలో భా గంగా శనివారం ఉదయం సాం బ్రా విమానాశ్రయానికి చేరుకు న్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఇక ఇటీవల వినిపిస్తున్న ‘దళిత సీఎం’ డి మాండ్‌పై సిద్దరామయ్య స్పంది స్తూ...తమ పార్టీలో దళిత సీఎం, మరో వర్గపు సీఎం అంటూ విభేదాలు లేవని అన్నారు. అందువల్ల దళిత సీఎం అన్న డిమాండ్ పార్టీలో తలెత్తే అవకాశమే లేదని పేర్కొన్నారు. -
గాల్లో కలిసిన రూ. 13కోట్లు !
ఏడాదిన్నరలో సీఎం హెలికాప్టర్ల పర్యటనలకు వెచ్చించిన ఖర్చు సమాచార హక్కు ద్వారా వెల్లడైన విషయాలు బెంగళూరు: అధికారిక పర్యటనల కోసమంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒకటిన్నర ఏడాదిలో హెలికాప్టర్ అద్దె కోసం చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.13కోట్లు, 2013 ఏడాదిలో మే 13న ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి 2014 నవంబర్ 31 వరకు సిద్ధరామయ్య పర్యటనల కోసం వినియోగించిన హెలికాఫ్టర్‌కు చెల్లించిన మొత్తం రూ.13 కోట్లంటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి పొదుపు మంత్రాన్ని జపిస్తూ వస్తున్న సిద్ధు తన పర్యటనల కోసం మాత్రం ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని ఎలా ఖర్చుచేశారో తెలియడం లేదని నగరానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త టి.నరసింహమూర్తి పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఆర్టీఐ కార్యకర్త టి.నరసింహమూర్తి శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా టి. నరసింహమూర్తి మాట్లాడుతూ....13.05. 2013 నుంచి 31.11.2014 వరకు ముఖ్యమంత్రి పర్యటనల కోసం హెలికాఫ్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,07,41,884ను అ ద్దెగా చెల్లించిందని తెలిపారు. ఢిల్లీకి చెందిన చాప్సన్ ఏవియేషన్, ఓఎస్ఎస్ ఎయిర్ మేనేజ్మెంట్, హర్యాణాకు చెందిన స్పైస్ జెట్ తదితర సంస్థ నుంచి వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి పర్యటనకు హెలికాఫ్టర్లను అద్దెకు తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వివిధ సందర్భాల్లో హెలికాఫ్టర్‌ను వినియోగించాల్సి ఉంటుందని, అయితే హెలికాఫ్టర్లను అద్దెకు తీసుకోవడం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ఓ హెలికాఫ్టర్‌ను కొనుగోలు చేస్తే ప్రజాధనం వృధా కాకుండా అడ్డుకోవచ్చని నరసింహమూర్తి అభిప్రాయపడ్డారు. -
వారికి పార్టీతో సంబంధం లేదు
బెంగళూరు: ‘దళిత ముఖ్యమంత్రి నినాదంతో తరుచూ మీడియా ముందుకు వస్తోంది కాంగ్రెస్ నాయకులు కారు. మా పార్టీకి చెందని వారు చేసే వాఖ్యలపై నేను ప్రతిస్పందించబోను.’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పే ర్కొన్నారు. గురువారమిక్కడి సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో ఆయన మీడియాతో మా ట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని అన్నారు. ఇతర పార్టీల నా యకులు, లేదా వేర్వేరు సంఘాలు దళిత ము ఖ్యమంత్రి కావాలని చేసే డిమాండ్ గురించి ఆలోచించే తీరిక కాని ప్రతిస్పందించే సమయం కాని తనకు లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్నచిన్న విషయాలను హై కమాండ్ దృష్టికి తీసుకు వెళ్లే ఆలోచన ఏదీ లేదన్నారు. తెరవెనక ఉండి ‘దళిత సీఎం’ నినాదాన్ని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీ.పరమేశ్వర్ వినిపిస్తున్నారన్న వార్తలు సత్యదూరమని పేర్కొన్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ.దేశ్‌పాండేపై లోకాయుక్తలో కేసు దాఖలైన విషయం తనకు తెలియదని పూర్తి సమాచారం లభించిన తర్వాత ఈ విషయం పై స్పందిస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 200వ శాఖను సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. -
వైమానిక రంగం అభివృద్ధిలో కర్ణాటకదే అగ్రస్థానం
బెంగళూరు : దేశ వైమానిక రంగం అభివృద్ధిలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక సహకారం అధికమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. దేశ విమానయాన రంగానికి అవసరమైన వస్తు ఉత్పత్తి కర్ణాటక నుంచే 60 శాతం ఉందని పేర్కొన్నారు. బెంగళూరులో బుధవారం ఏరో ఇండియా-15 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... దేశంలో తొలిసారిగా ఏరరో స్పేస్ పాలసీను అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్రం కర్ణాటకనే అని తెలిపారు. ఈ విధానం 2023 వరకూ అమల్లో ఉంటుందన్నారు. ఈ విధానం వల్లనే విమాన యాన రంగంలో ఎక్కువ పెట్టుబడులు కర్ణాటకకే వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తుమకూరు వద్ద 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ హెలిక్యాప్టర్ల తయారీ కోసం హెచ్‌సీఎల్ ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తోందన్నారు. అదేవిధంగా వేమగల్, గౌరిబిదనూరు, దబస్పేట, మహ్మిగట్టి, గమన్హట్టి వద్ద కూడా ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటుచేశామన్నారు. దేశంలో మొదటిసారిగా ఏరోస్పేస్ సెజ్‌ను బెళగావి వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. విమానయాన రంగంలోని పలు ప్రైవేటు కంపెనీలు కూడా ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.. విమానయానరంగంతో పాటు ఐటీ,బీటీ రంగాల్లో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందన్నారు. ఔత్సాహిక పెట్టుబడుదారులకు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చిత్రదుర్గా-బెంగళూరు-చెన్నై... బెంగళూరు-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణానికి సహకారం అందించాలని ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
13 నుంచి బడ్జెట్ సమావేశాలు
బెంగళూరు : ఈ ఏడాది మార్చి 13 నుంచి 31 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. క్యాంపు కార్యాలయం కృష్ణాలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19 నుంచి బడ్జెట్ సన్నాహాక సమావేశాలు ఉంటాయన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో క్షుణ్ణంగా చర్చించి ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకుని బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ సారి బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. గత బడ్జెట్లో సంక్షేమం కోసం రూ.65వేల కోట్లు కేటాయించగా అందులోఇప్పటి వరకూ 60 శాతం ఖర్చు చేశామని మరో రెండు మాసాలు సమయం ఉండటం వల్ల మిగిలిన మొత్తాన్ని కూడా వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. జేడీఎస్ పార్టీ నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అయితే ఈ స్థలానికి సంబంధించి కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని వాటిని జేడీఎస్ పార్టీనే పరిష్కరించుకోవాల్సి ఉందని అన్నారు. -
‘బీజేపీ ముక్త కర్ణాటక’ సిద్ధుకు కలే...
మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ బెంగళూరు : బీజేపీ ముక్త కర్ణాటక అనేది ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కలగానే మిగిలిపోతుందని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. శనివారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు. తమ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని ప్రకటించిందని, అదే విధంగా కాంగ్రెస్ ముక్త కర్ణాటక కోసం బీజేపీ రాష్ట్ర నేతలు కలిసికట్టుగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే తమ నినాదం నిజం కూడా కానుందని అన్నారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం తన ఖాతాను సైతం తెరవలేకపోయిందని విమర్శించారు. అలాంటిది 2018లో కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామనుకోవడం కాంగ్రెస్ నేతల పగటి కల అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయాన్ని సాధిస్తుందని జోష్యం చెప్పారు. -
కృష్ణప్ప స్మారక నిర్మాణానికి సహకారం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బళ్లారి(దావణగెరె): దళిత నాయకుడు, దివంగత బి.కృష్ణప్ప స్మారక నిర్మాణానికి ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు అందించి పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లాలోని హరిహర తాలూకా హనగవాడి గ్రామం వద్ద జిల్లా యంత్రాంగం, ప్రొఫెసర్ బి.కృష్ణప్ప ట్రస్ట్, సాంఘిక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ బి.కృష్ణప్ప సాంస్కృతిక భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. ప్రొఫెసర్ బి.కృష్ణప్ప సమాధి స్థలాన్ని ప్రత్యేక స్మారకంగా చేయాలనేది ట్రస్ట్ ఉద్దేశమని, దీనికి ప్రభుత్వం నుంచి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బి.కృష్ణప్ప అనితర పోరాట యోధుడని, దేశాభివృద్ధికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. అధికారం కోసం ఆశ పడలేదని, ఆయన చిన్నతనం నుంచే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో సమగ్ర మార్పును తీసుకొచ్చారని తెలిపారు. సమాజంలో నెలకొన్న దౌర్జన్యాలను, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జీఎం సిద్ధేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొంటున్న వివక్ష పూరిత ఘటనలను ఖండిస్తూ దళితుల హక్కుల కోసం గళమెత్తి బి.కృష్ణప్ప పోరాటం చేపట్టారన్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న అవధిలో భవన నిర్మాణానికి కోటి రూపాయలు సమర్పించారన్నారు. అంతేకాకుండా సాంస్కృతిక భవన నిర్మాణం ఆలస్యం చేయకుండా అతి త్వరలో ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి శామనూరు శివశంకరప్ప, ప్రజాపనుల శాఖా మంత్రి హెచ్‌సీ మహాదేవ ప్రసాద్, చిత్రదుర్గం లోక్‌సభ సభ్యుడు బీఎన్ చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
బీబీఎంపీ విభజనకు సై
సీఎం ప్రకటనతో విపక్షాల మండిపాటు బెంగళూరు : బీబీఎంపీ విభజనకు సంబంధించి నివేదిక అందగానే ఆ దిశగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానపరిషత్‌కు తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రగౌడ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానమిస్తూ....‘మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎస్.పాటిల్ నేతృత్వంతో బీబీఎంపీ విభజనకు సంబంధించి ఓ కమిటీని వేశాం. ఈ కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను సైతం అందజేసింది. ఇందుకు సంబంధించిన తుది నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కష్టనష్టాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు. ఈ సమయంలో బీజేపీ సభ్యుడు వి.సోమణ్ణ కలగజేసుకుంటూ ‘కెంపేగౌడ నిర్మించిన బెంగళూరు నగరాన్ని విభజించడం సరికాదు. బీబీఎంపీ పాలనా సౌలభ్యం కోసం మేయర్ ఇన్ కౌన్సిల్ విధానాన్ని రూపొందించండి. అంతేకాని బీబీఎంపీని విభజించకండి’ అని సలహా ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘గతంలో 200 చదరపు కిలోమీటర్లు ఉన్న బెంగళూరు ప్రస్తుతం 800 చదరపు కిలోమీటర్ల పరిధికి చేరుకుంది. 110 గ్రామాలు, ఏడు నగరసభలు, ఒక పట్టణ పంచాయితీ బెంగళూరులో కలిశాయి. అదే విధంగా బీబీఎంపీ పరిధిలో సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అందువల్ల బీబీఎంపీ పాలనా సౌలభ్యం కోసం బీబీఎంపీని విభజించే దిశగా ఆలోచనలు సాగించాల్సి వచ్చిందని’ తెలిపారు. దీంతో సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. బీబీఎంపీని విభజించేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పాయి. -
భవిష్యత్ బయోటెక్నాలజీదే
సీఎం సిద్ధరామయ్య రానున్న మూడేళ్లలో ‘ఎల్ఈడీ’ వెలుగులు బెంగళూరు ఇండియా బయో-2015 ప్రదర్శనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బెంగళూరు: బయోటెక్నాలజీలో భారత్ ప్రధాన శక్తిగా ఎదిగే దిశగా కర్ణాటక ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సోమవారం ఇక్కడి బెంగళూరు ఇండియా బయో-2015 ప్రదర్శనను కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధు మాట్లాడుతూ రాష్ట్రంలో జైవిక పరమాణు ఇంజనీరింగ్ సంశోధనా కేంద్రాన్ని ప్రారంభించేందుకు అనుమతించాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కోరినట్లు తెలిపారు. దేశంలోని బయోటెక్నాలజీ సంస్థలన్నింటిలోకి దాదాపు 52 శాతం సంస్థలు కర్ణాటకలోనే ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో ఉన్న 10 ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థలు రాష్ట్రంలో తన శాఖలను ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇక రాష్ట్రంలో బయో టెక్నాలజీ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా బయోకాన్ సంస్థ చైర్మన్ కిరణ్ మజుందార్ షా నేతృత్వంలో ఓ ప్రత్యేక మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దేశంలో ఇకపై ఎల్ఈడీ వెలుగులు రానున్న మూడేళ్ల కాలంలో దేశంలోని అన్ని వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వీధి దీపాల్లోని సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా ఏడాదికి 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని, తద్వారా 1.5 బిలియన్ డాలర్లను పొదుపు చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇప్పటికే న్యూఢిల్లీలో వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చామని, ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా 617 ఎల్ఈడీ బల్బులను అమర్చామని వెల్లడించారు. గతంలో ఒక్కో ఎల్ఈడీ బల్బు ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉండేదని ప్రస్తుతం రూ.150కి ఎల్ఈడీ బల్బులు అందుబాటులోకి వ చ్చేశాయని పీయూష్ గోయల్ తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సబ్సిడీలను కనుక ప్రకటిస్తే ఒక్కో ఎల్ఈడీ బల్బు రూ.100కి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష జవదేకర్ మాట్లాడుతూ...ప్రస్తుతం బయో ఇంధన రంగంలో యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికీ కావాల్సినంత విద్యుత్ అందుబాటులో లేదని, అందువల్ల ప్రతి రోజూ డీజిల్‌తో నడిచే జనరేటర్ల ద్వారా విద్యుత్‌ను అందించాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాక స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఆహార వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా సరికొత్త పధకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, బీటీశాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్, పార్లమెంటు సభ్యుడు పీసీ మోహన్, పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా తదితరులు పాల్గొన్నారు. -
హాస్యాస్పదం!
డీ నోటిఫికేషన్‌పై సీఎంని నిలదీసిన శెట్టర్ మొరాయించిన మైకులు పది నిమిషాల పాటు సభ వాయిదా బెంగళూరు : రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక్క ఇంచు భూమి కూడా డీనోటిఫై చేయలేదని చెప్పడం హాస్యాస్పందంగా ఉందని విపక్ష నేత జగదీష్ శెట్టర్ ఎద్దేవా చేశారు. శాసనసభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్కావతికి సంబంధించిన భూములే కాకుండా మరో మూడు ప్రాంతాల్లోని భూములను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డీనోటిఫై చేశారని తెలిపారు. ‘లాల్‌బాగ్‌కు దగ్గరగా ఉన్న సిద్ధపుర ప్రాంతంలో 2.39 ఎకరాలను, బనశంకరి 6, 5వ క్రాస్‌లో వరుసగా 7.15 ఎకరాలు, 2.6 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా సిద్ధరామయ్య డీ నోటిఫై చేశారు. అప్పటి ఐఏఎస్ అధికారి సత్యమూర్తి ఈ అక్రమాల్లో భాగస్వామి’ అని వివరించారు. ఈ మూడు చోట్ల డీ నోటిఫికేషన్‌కు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరగాలని శెట్టర్ డిమాండ్ చేశారు. ఆర్కావతి డీ నోటిఫికేషన్‌కు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న న్యాయమూర్తి కెంపణ్ణ కమిషన్ అడిగిన దాఖలాలను ఫిబ్రవరి చివరిలోపు ప్రభుత్వం అందజేయాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. మొరాయించిన మైక్ జగదీష్ షెట్టర్ ప్రసంగించే సమయంలో పదేపదే మైక్ మొరాయించింది. అదేవిధంగా జేడీఎస్ ఫ్లోర్‌లీడర్ కుమారస్వామి మాట్లాడే సమయంలో కూడా మైక్ సరిగా పనిచేయలేదు. దీంతో స్పీకర్ పదినిమిషాల పాటు శాసనసభను వాయిదా వేయాల్సి వచ్చింది. -
అదే జోరు
రగిలిన తొగాడియా వివాదం నిషేధాన్ని తొలగించబోమన్న సిద్ధరామయ్య విధానసభ నుంచి బీజేపీ వాకౌట్ బెంగళూరు : విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా నగర ప్రవేశ నిషేధం అంశం గురువారం సైతం ఉభయ సభల్లో తీవ్ర దుమారాన్నే రేపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ బీజేపీ సభ్యులు విధానసభ నుంచి వాకౌట్ చేశారు. ఇక బీజేపీ సభ్యుల ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోమని, ప్రవీణ్ తొగాడియాపై విధించిన నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన పరిషత్‌లో ప్రకటించారు. బీజేపీ సభ్యుల వాకౌట్... ప్రవీణ్ తొగాడియా నగర నిషేధం అంశం గురువారం సైతం విధానసౌధలో ప్రతిధ్వనించింది. గురువారం ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు జగదీష్ శెట్టర్, ఆర్.అశోక్, బసవరాజ బొమ్మాయిలు సభ వెల్‌లోకి దూసుకెళ్లి ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేశద్రోహులను ప్రోత్సహించడంతో పాటు దేశభక్తులను ఇబ్బందులకు గురిచేస్తోందని నినాదాలు చేశారు. నగరంలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభలో ప్రవీణ్ తొగాడియా పాల్గొనకుండా నిషేధం విధించడం ఏమాత్రం సరికాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన అనంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రవీణ్ తొగాడియా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారేమోననే ఊహలతో ఆయనపై నిషేధం విధించడం సరికాదని బీజేపీ సభ్యులు పేర్కొన్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య కాసేపు మాటల యుద్ధం కొనసాగింది. అనంత ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు ఇక ప్రవీణ్ తొగాడియా పై విధించిన నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన పరిషత్‌లో వెల్లడించారు. ప్రవీణ్ తొగాడియాను నిషేధించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుందని ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై విధంగా స్పందించారు. బీజేపీ నేతల ఒత్తిళ్లు బెదిరింపులకు ప్రభుత్వం ఏ మాత్రం బెదరదని ఆయన స్పష్టం చేశారు. ప్రవీణ్ తొగాడియా నిషేధానికి సంబంధించి ఎలాంటి పరిణామాన్నైనా సరే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రవీణ్ తొగాడియాపై దేశ వ్యాప్తంగా 46 కేసులున్నాయని, తొగాడియా మంచివాడైతే ఇన్ని కేసులు ఆయనపై ఎందుకు నమోదవుతాయని సిద్ధరామయ్య బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. గతంలో కూడా రాష్ట్రంలో ప్రవీణ్ తొగాడియాపై నిషేధం విధించిన సందర్భాలున్నాయని సిద్ధరామయ్య గుర్తుచేశారు. ప్రవీణ్ తొగాడియా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారనే సమాచారం ఉన్నందువల్లే నగర పోలీస్ కమీషనర్ ఆయనపై నిషేధం విధించారని సిద్ధరామయ్య విధానపరిషత్‌కు వెల్లడించారు. -
కుదిపేసిన తొగాడియా
బీజేపీ సభ్యుల ధర్నాతో రెండు సార్లు సభ వాయిదా తుగ్లక్‌ల పాలన సాగుతోందంటూ పరిషత్‌లో ఈశ్వరప్ప మండిపాటు బెంగళూరు: విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా... బెంగళూరు ప్రవేశంపై నగర పోలీసులు నిషేధం విధించడంపై ఉభయ సభల్లోనూ వాడీవేడి చర్చ జరిగింది. నిషేధాన్ని ఖండిస్తూ విధానసభ, విధానపరిషత్‌లో బీజేపీ సభ్యులు ధర్నాకు దిగడంతో సభా కార్యకలపాలకు తీవ్రవిఘాతం కలిగింది. ఈ కారణంగా విధానసభ రెండు సార్లు వాయిదా పడింది. సభలో గందరగోళం బుధవారం ఉదయం విధానసభ కార్యకలాపాలు ప్రారంభంకాగానే బీజేపీ ఎమ్మెల్యే ఆర్.అశోక్ మాట్లాడుతూ....‘ఫిబ్రవరి 8న నగరంలో విశ్వహిందూ పరిషత్ సువర్ణ మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ప్రవీణ్ తొగాడియాపై ఎందుకు నిషేధం విధించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడా లేని నిషేధం ఇక్కడెందుకు’ అని ప్రశ్నించారు. దీంతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ వ్యక్తిని రాష్ట్రంలోకి రానివ్వకుండా నిషేధం విధిస్తాం, అందులో భాగంగానే ప్రవీణ్ తొగాడియాపై కూడా నిషేధం విధించాం’ అని సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ విధానసభలో ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. దీంతో విధానసభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను గంట పాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా బీజేపీ సభ్యులు తమ ధర్నాను కొనసాగించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందంటూ బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. బీజేపీ నేతలకు జేడీఎస్ ఎమ్మెల్యే మల్లికార్జున కూబా మద్దతుగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పురాకపోవడంతో మద్యాహ్నం 2.30గంటల వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇలా రెండు సార్లు ఎలాంటి చర్చ లేకుండానే విధానసభ వాయిదా పడింది. భోజన విరామంత తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురు కావడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను గురువారానికి వాయిదా వేశారు. విధానపరిషత్‌లోనూ విధానపరిషత్‌లోనూ ప్రవీణ్ తొగాడియా నిషేధంపై పెద్ద దుమారమే చెలరేగింది. ప్రశ్నోత్తరాల సమయాని కంటే ముందే ఈ విషయంపై చర్చించాలని పరిషత్‌లో ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. అయితే ఈ అంశాన్ని ప్రశ్నోత్తరాల సమయంలోనే చర్చించేందుకు అనుమతివ్వాలని అధికార పక్ష నేతలు సైతం పట్టుబట్టారు. ఈ సమయంలో బీజేపీ సభ్యులు కె.ఎస్.ఈశ్వరప్ప, గో.మధుసూధన్, నారాయణస్వామి తదితరులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. విధానపరిషత్‌లో పరిస్థితి గందరగోళంగా మారడంతో సభ అధ్యక్షుడు శంకరమూర్తి సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా బీజేపీ నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రవీణ్ తొగాడియాకు నిషేధం విధించడానికి ఇదేమైనా పాకిస్తానా, ఆప్ఘనిస్తానా అని ఈశ్వరప్ప ఘాటుగా ప్రశ్నించారు. సభ అధ్యక్షుడు శంకరమూర్తి కలగజేసుకొని ఇరు పక్షాల వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. హైకోర్టులో ప్రవీణ్ తొగాడియా రిట్ బెంగళూరు : తనను బెంగళూరుకు రాకుండా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం ద్వారా భారతదేశ పౌరుడిగా తనకు దక్కాల్సిన ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తున్నారని రాష్ర్ట హైకోర్టులో విశ్వహిందూపరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా బుధవారం రిట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది.