రింగ్ రోడ్డు అభివృద్ధికి నిధులివ్వండి
కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన సీఎం
సాక్షి, బెంగళూరు: బెంగళూరు శివార్లలో ఉన్న ఎనిమిది ఉప నగరాలకు చేరుకునేందుకు వీలుగా 340 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. బెంగళూరు శివార్లలో ఉన్న రామనగర, కనకపుర, నెలమంగళ, మాగడి, ఆనేకల్, హొసకోటె, దేవనహళ్లి, దొడ్డబళ్లాపుర ప్రాంతాలను కలిపేలా చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు పనులు ఇప్పటికే 110కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మరో 230 కిలోమీటర్ల మేర ఉన్న పనులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సహాయం అందజేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.