సీఎం రాజీనామా చేయాలి: జేడీఎస్
కృష్ణరాజపుర: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చట్ట,న్యాయ వ్యవస్థలను తుంగలో తొక్కి వేధింపుల సర్కార్‌గా మారిందని జేడీఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు కారకులైనవారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నాయకులు సోమవారం కే.ఆర్.పురలోని బీబీఎంపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పార్టీ కే.ఆర్.పుర అధ్యక్షుడు ప్రకాశ్ మాట్లాడుతూ.... అధికారలు ఆత్మహత్యకు నైతిక భాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. రాక్షస పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు భూస్థాపితం చేసి జేడీఎస్‌కు అధికార పగ్గాలు అప్పగిస్తారన్నారు.
దొడ్డబళ్లాపురం: మంగళూరు డీవైఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం ద్వంద్వ నీతిని పాటిస్తోందని తాలూకా బీజేపీ అధ్యక్షుడు నారాయణస్వామి మండిపడ్డారు. గణపతి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం తీరును ఖండిస్తూ, మంత్రి కేజే జార్జ్,హోం మంత్రి పరమేశ్వర్‌లను పదవుల నుంచి తొలగించాలని డిమాండుచేస్తూ తాలూకా, పట్టణ బీజేపీ కమిటీల నుండి సోమవారం ఇక్కడి తాలూకా కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నారాయణస్వామి మాట్లాడుతూ మంత్రి జార్జ్ ,పోలీసు ఉన్నతాధికారులు వేధించారని డీవైఎస్పీ గణపతి ఇచ్చిన ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారని, ఆ సాక్ష్యాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. జిల్లా బీజేపీ కమిటీ అధ్యక్షుడు నాగేశ్,పట్టణ బీజేపీ అధ్యక్షుడు రంగరాజు,సీనియర్ నేతలు హనుమంతరాయప్ప,జోనా మల్లికార్జున్,కౌన్సిలర్ వెంకటరాజు పాల్గొన్నారు.
ఇది వేధింపుల ప్రభుత్వం
Published Tue, Jul 12 2016 2:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement