కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా | karnataka mlc elections: congress wins bangalore city, ahead in 13 seats, BJP leads in 6, JDS 2, Other 2 | Sakshi
Sakshi News home page

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా

Published Wed, Dec 30 2015 4:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా - Sakshi

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా

బెంగళూరు : కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.  స్థానిక సంస్థల నుంచి శాసనమండలిలోని 25 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సగం స్థానాలు 'హస్త' గతమయ్యాయి. 25 స్థానాలకుగానూ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక బీజేపీ 6, జేడీఎస్ 4, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హర్షం వ్యక్తం చేశారు. కాగా  ప్రతిపక్ష బీజేపీ చిక్‌మగళూర్, కొడగు సహా 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్ జేడీఎస్ నాలుగు స్థానాలకే పరిమితం అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement