సాక్షి, బెంగళూరు: అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం బెంగళూరులోని విధానసౌధలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూముల సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక ఇదే సందర్భంలో గదగ్-వాడి రైల్వే ప్రాజెక్టుకు గాను కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డు(కేఐఏడీబీ) ద్వారా ఆరు నెలల్లో మొత్తం 1100 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గదగ్-వాడి మధ్య 255 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 2,500 ఎకరాల భూమి అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ కోసం ఆరు నెలల్లో 1100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వనుందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న మరో 15 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అన్నారు.
ఈ 15 ప్రాజెక్టుల్లో తుమకూరు-రాయదుర్గ, బీదర్-గుల్బర్గా, బాగల్‌కోటె-కుడచి, బెంగళూరు-హాసన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారని వెల్లడించారు. తక్కువ పరిమాణంలో రైతుల నుంచి భూమి సేకరించాల్సిన పరిస్థితుల్లో నేరుగా డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రైల్వేకు 1100 ఎకరాలు
Published Thu, May 28 2015 5:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement