The state government
-
కొత్త యూనివర్సిటీలకు తీరని నష్టం
కొత్త యూనివర్సిటీలకు తీరని నష్టం రాష్ట్ర ప్రభుత్వం కన్ను వర్సిటీల నిధులపై పడింది. ఈ నేపథ్యంలో వ ర్సిటీల అభివృద్ధికి దోహదపడే అంతర్గత నిధులను తమ ఖాతాల్లో వేసుకునేందుకు ముందడుగు వేసింది. ఇం దులో భాగ ంగా సంబంధిత ఆదేశాలు కూడా విడుదలయ్యారుు . అరుుతే జిల్లాలోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి ఇంకా ఈ ఆదేశాలు అందాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్తే... ఎచ్చెర్ల క్యాంపస్ : యూనివర్సిటీలు ఆర్థిక పరిపుష్టి కావాలంటే ప్రభుత్వం ప్రత్యేక నిధులను వర్సిటీలకు అందజేయాలి. బడ్జెట్లో మెరుగైన కేటారుుంపులు చేయాలి. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ. రాష్ట్ర ప్రభుత్వ నిధులపై ఆధార పడుతున్న సంస్థ. ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల మూల ధన నిల్వలు ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేస్తుంది. అరుుతే వర్సిటీలకు అధికారికంగా ఆదేశాలు అందాల్సి ఉంది. యూనివర్సిటీలు అభివృద్ధిలో అంతర్గత నిధులదే కీలక పాత్ర. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేస్తుంటారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో అంతర్గత నిధులు కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సెల్, ఎగ్జామినేషన్స సెక్షన్ నుంచి ఎక్కువగా చేకూరుతున్నారుు. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ మూలధన చేకూర్పు పరిశీలిస్తే 86 డిగ్రీ కళాశాలలు ఉన్నారుు. 46,000 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ పరీక్ష ఫీజులు చెల్లిస్తారు. డిగ్రీ కళాశాలలు అడ్మిషన్ల సమయంలో ప్రత్యేక ఫీజులు, ఎఫిలియేషన్ , ర్యాటిఫికేషన్ ఫీజలు చెల్లిస్తారు. పీజీ అనుబంధ కళాశాలలు 10 వరకు ఉన్నారుు. వర్సిటీ, ఏఫిలియేషన్ కళాశాలల్లో 1700 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. మరో పక్క బీఎడ్, ఎంఎడ్ కళాశాలలు ఉన్నారుు. ఈ కళాశాలల నుంచి విద్యార్థులు పరీక్ష ఫీజులు, ఎఫిలియేషన్ ఫీజులు ద్వారా మంచి ఆదాయం వస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి సంబంధించి ఏడాదికి రూ.4 కోట్లు వరకు ఆదాయం వస్తుంది. ఈ డబ్బును కరెంట్ అకౌంట్లు, మరో పక్క షార్టు టెర్మ్ ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తారు. వర్సిటీలో గతంలో పోల్చుకుంటే అంతర్గత నిధులు ద్వారా రూ.8 కోట్లతో అకడమిక్ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. వసతిగృహానికి అదనపు వసతి నిర్మాణాలు, పరీక్షల నిర్వహణ, అదనపు భవనాల సముదాయం వంటి నిర్మాణాలు చేపట్టారు. ఇలా అనేక వసతులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం మూలధన నిల్వలు ప్రభుత్వ అకౌంట్లులో జమ చేయాలి. ఈ నిధులు భవిష్యత్తులో ప్రభుత్వ వెనక్కు ఇస్తుందని సైతం చెప్పలేం. సొంతానికి, ప్రభుత్వ ఇతర పథకాలకు వినియోగించుకోవచ్చు. వర్సిటీలు అభివృద్ధి మాత్రం సాధ్యం కాదు. ఎటువంటి ఆదేశాలు రాలేదు ప్రస్తుతానికి ఎటువంటి ఆదేశాలు రాలేదు. వర్సిటీల మూ ల ధనం నిల్వలు ప్రభు త్వ ఖాతాల్లో జమ చేస్తే అభివృద్ధిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వర్సిటీలు స్వయం సమృద్ధి సాధన సైతం కష్టం. -ప్రొఫెసర్ తులసీరావు, రిజస్ట్రార్,డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ -
ముందుగానే మూసేద్దాం...
► బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేతపై మహారాష్ట్ర ప్రతిపాదన ► తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్ణీత గడువు 29న మూసుకోనున్న గేట్లు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గే ట్లు మూసివేతపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తొందర పడుతోంది. ఎగువన విస్తారంగా కురిసిన వర్షాలతో నీరంతా ఎస్సారెస్పీకి చేరుతున్న నేపథ్యంలో గడువుకు ముం దే గేట్లు మూసివేస్తామని రాష్ట్రానికి ప్రతిపాదించింది. కానీ దీనిపై అభ్యంతరం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్ణీత గడువునే గేట్లు మూయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు అంశంపై సుప్రీంకోర్టు రెండున్నరేళ్ల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం ఏటా జూలై ఒకటి నుంచి అక్టోబర్ 28 వరకు ప్రాజెక్టు గేట్లు పూర్తిగా తెరిచి ఉంచి నది సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను సుప్రీం ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచవచ్చని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూలై 1న తెరిచిన గేట్లను అక్టోబర్ 29న మూసేయాల్సి ఉంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో మహారాష్ట్ర నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దాంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది కూడా. అయితే ఆ వరదల సందర్భంగానే మహారాష్ట్ర బాబ్లీ గేట్లను మూసివేసే ప్రతిపాదన తెచ్చింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. భారీగా వస్తున్న ప్రవాహాలకు అడ్డుకట్టవేయవద్దని స్పష్టం చేసింది. దాంతో మిన్నకుండిపోయిన మహారాష్ట్ర.. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిండడం, నీరు సముద్రంలోకి వెళుతున్న నేపథ్యంలో మళ్లీ బాబ్లీ గేట్ల మూసివేతను తెరపైకి తెచ్చింది. వచ్చిన నీరు వచ్చినట్లుగా మళ్లింపు తాజాగా మహారాష్ట్ర చేసిన ప్రతిపాదనను కూడా తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌కు కేవలం 25-30వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు మాత్రమే వస్తున్నాయి. ఇదే స్థాయిలో నీటిని కాకతీయ, లక్ష్మి కాలువల ద్వారా సాగు అవ సరాలకు వదులుతున్నారు. దీనికితోడు ఎస్సారెస్పీ, వరద కాలువల ప్రాజెక్టు కింద కలిపి మొత్తంగా 920 చెరువులుండగా.. అందులో 823 చెరువులను నింపారు. మిగతా చెరువులను నింపాల్సి ఉంది. ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలను చెరువులు నింపేందుకు, ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబ్లీ గేట్లు మూసివేస్తే వస్తున్న ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోతాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశముంది. దీంతో గేట్లు మూయాలన్న మహారాష్ట్ర ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రాష్ట్ర అవసరాలకు మళ్లించి, గేట్లు మూసే సమయంలోగా వీలైనంత ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకోవాలని భావిస్తోంది. -
అశాస్త్రీయంగా విభజన ప్రక్రియ
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు టేకుమట్లను మండలంగా ప్రకటించాలని ర్యాలీ, సభ టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం, తోపులాట చిట్యాల : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా లేదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. టేకుమట్లను మండలంగా ప్రకటించాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొర్రె సాగర్ ఆధ్వర్యంలో బుధవారం రామకిష్టాపూర్(టి) నుంచి టేకుమట్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ విస్తీర్ణం, జనాభాపరంగా విస్తరించి ఉన్న టేకుమట్లను మండలంగా చేయకపోవడం విచారకరమన్నారు. జనగాం, గద్వాలలను జిల్లాలుగా ప్రకటించాలన్నారు. గ్యాంగ్‌స్టర్ నÄæూం ఎన్‌కౌంటర్‌ను ప్రజలు మర్చిపోయేలా చేసేందుకే సీఎం కేసీఆర్ తెరపైకి కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. కాగా, సభా స్థలి సమీపంలోకి టీఆర్ఎస్ నాయకులు చేరుకొని ఆ పార్టీ చేరికల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సౌండ్బాక్స్లతో పాటలు వేశారు. ఈక్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసు సిబ్బంది రంగప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. కాంగ్రెస్ సభలో ఎంపీపీ బందెల స్నేహలత, వైస్ ఎంపీపీ సట్ల కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అటకెక్కిన ఆంగ్ల మాధ్యమం
నెరవేరని ప్రభుత్వ ఆశయం ఇప్పటికీ ప్రారంభంకాని ఇంగ్లిషు మీడియం పెద్దశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల్లో సర్కార్బడుల్లో ఇంగ్లిషు మీడియం అంటూ కొత్త ఆలోచనలు రేపినా ఆచరణలో సాధ్యమయ్యేలా లేదు. ప్రభుత్వం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియం అంటూ ప్రచారం చేపట్టింది. అయితే మండలంలో నాలుగు పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిషు మీడియం ప్రతిపాదనలు పంపించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు గ్రామాల్లో ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, కరపత్రాలతో భారీగా ప్రచారం చేపట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడికి పంపాలా లేక ప్రైవేట్ బడికి పంపాలో తేల్చుకోలేక ఈ ఏడాది ప్రైవేట్‌కే మొగ్గుచూపారు. ప్రతి యేటా బడిబాట పేరుపై ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు గ్రామాల్లో ర్యాలీలు తీస్తూ భారీగా ప్రచారం చేపడుతున్నా తల్లిదండ్రులను మాత్రం ఆకర్షించలేకపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై యాభై రోజులు పూర్తయినా ఇప్పటి వరకు మండంలో ఇంగ్లిషు మీడియం ప్రారంభం కాలేదు. ఇంగ్లిషు మీడియంలో తమ పిల్లలను 100 శాతం చేర్పిస్తే రూ.లక్ష నజరానాతోపాటు, ఆ పాఠశాలకు అదనంగా రూ.20 వేలు అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు. కానీ విద్యార్థులను బడిలో చేర్చుకునేందుకు 5 ఏళ్లు నిండి ఉండాలనే తప్పనిసరి నిబంధన తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది. సర్కారు ముందుకు వచ్చినా... రోజురోజుకు దిగజారుతున్న సర్కారు బడులను బలోపేతం చేసేందుకు సర్కారు ముందుకు వచ్చినా ఫలితం మాత్రం కనిపించేలా లేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రారంభించేందుకు జీఓ 524ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ, గ్రామపంచాయితీ, గ్రామాభివృద్ధి కమిటీలు తీర్మానం చేసి విద్యాశాఖకు అందజేయాలి. ముందుకు వచ్చింది కేవలం నాలుగు పాఠశాలలే.. పెద్దశంకరంపేట మండలంలో 46 పాఠశాలలున్నాయి. ఇందులో 7 ఉన్నత, 13 ప్రాథమికోన్నత, 26 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఇందులో కస్తూర్బా, మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 5420 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు పెద్దశంకరంపేటలోని బాలికల ప్రాథమిక, వీరోజిపల్లిలోని ప్రాథమిక, చీలాపల్లి, రామోజిపల్లిలోని పాఠశాలలు మాత్రమే ఇంగ్లిషు మీడియంలో ప్రవేశాలకు ముందుకు వచ్చాయి. ఇంత పెద్ద మండలంలో కేవలం కొన్ని పాఠశాలలు మాత్రమే ఇంగ్లిషు మీడియాన్ని ప్రారంభించేందుకు ముందుకు వచ్చినా ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడం విచారకరం. ఇంగ్లిషు మీడియం అని తెలిపినా ఇప్పటి వరకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ చేయలేదు. ప్రభుత్వం స్పందించి అన్ని పాఠశాలల్లో పూర్థి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి పాఠశాలలో ఇంగ్లిషు మీడియాన్ని ప్రారంభించేలా జీఓ విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక చిన్నారుల వయస్సును 5 నుంచి 3 తగ్గించడంతో పాటు నర్సరీలకు అవకాశం కల్పిస్తే ఇంగ్లిషు మీడియం సర్కారు బడులకు మహర్దశపట్టే అవకాశం ఉంది. కనీసం వచ్చే ఏడాదైనా ముందుగా ప్రణాళికలు రూపొందించి ఇంగ్లిషు మీడియం పాఠశాలలను ప్రారంభిస్తే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు చేకూరుతుంది. -
రిక్తహస్తం
బడ్జెట్లో గుంటూరు డివిజన్‌కు నూతన కేటాయింపులు శూన్యం రైల్వే జోన్ ప్రస్తావనే లేదుమౌలిక వసతులకంటే టెక్నాలజీకే ప్రాధాన్యం పెండింగ్ ప్రాజెక్టులకే నిధులుసామాన్య ప్రయాణికుల్లో తీవ్ర నిరాశ నవ్యాంధ్రరాజధానిలో బడ్జెట్ రైలు ఆగలేదు. గుంటూరు రైల్వే డివిజన్‌కు నూతన కేటాయింపుల ఊసే లేదు. ఇప్పుడిప్పుడే రాజధాని అమరావతి నిర్మాణ పనులు పుంజుకుంటున్న నేపథ్యంలో గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి కనెక్టవిటి అత్యవసరం. బడ్జెట్ కేటాయింపుల్లో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు మినహా నూతన రైళ్లు, రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. నగరంపాలెం (గుంటూరు) కేంద్రమంత్రి సురేష్‌ప్రభు గురువారం పార్లమెంట్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ గుంటూరు డివిజన్ ప్రజలను నిరాశకు గురిచేంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై చేస్తున్న హడావుడి కార్యరూపం దాల్చేందుకు చాలాకాలం పట్టేలా ఉందని భావించారో ఏమో కనీసం రాజధాని ప్రాంతంలో రైల్వేలైన్ల అభివృద్ధిపై హామీలు కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు. మౌలిక వసతుల కంటే టెక్నాలజీకే ప్రాధాన్యమిచ్చారు. వీటికి నిధులొచ్చే అవకాశం.. గుంటూరు - విజయవాడకు రాజధాని ప్రాంతమైన అమరావతి మీదుగా సుమారు 85 కి.మీ, నల్లపాడు-బీబీనగర్‌కు 243 కి.మీ డబ్లింగ్ సర్వేకు అనుమతించింది. ఇక విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా నూతన రైల్వేజోన్ ఊసేలేదు. డివిజన్లో ప్రధానమంత్రి ప్రయార్టీ ప్రాజెక్టుల కింద నడుస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి పనులకు రూ.182 కోట్లు, గతంలో పనులు ప్రారంభించి ఆగిపోయిన మాచర్ల-నల్లగొండ రైల్వే లైన్‌కు రూ.20 కోట్లు కేటాయించారు. దేశం మెత్తంలోని పెండింగ్ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలపడం ద్వారా డివిజన్లో ప్రస్తుతం జరుగుతున్న తెనాలి-గుంటూరు డబ్లింగ్, గుంటూరు- నంద్యాల విద్యుదీకరణ పనులకు బడ్జెట్ నిధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధుల సమర్థతను బట్టే సౌకర్యాలు రాష్ట్రప్రభుత్వ కేంద్రమంత్రి సురేష్‌ప్రభు గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో భాగస్వామ్యంతో గుంటూరు-నంద్యాల డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. మేళచెర్వు-జగ్గయ్యపేట పెండింగ్ ప్రాజెక్టుకు రూ.110 కోట్లు కేటాయింపు ద్వారా భవిష్యత్తులో గుంటూరు డివిజన్‌కు విష్ణుపురం మీదుగా సరుకురవాణా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక వివరాలు లేకుండా దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లకు వైఫై, 311 స్టేషన్లులో సీసీ కెమేరాల ఏర్పాటు, అన్ రిజర్వుడ్, సూపర్‌ఫాస్ట్ అంత్యోదయ ట్రైన్లు, దీన్‌దయాళ్ కోచ్‌లు, రిజర్వేషన్, పర్యటకరంగ ప్రయాణికుల కోసం హమ్‌సఫర్, తేజస్, ఉదయ్, రైళ్లు నడపాలని ప్రకటించారు. దీని వలన జోన్ స్థాయిలో అధికారుల సమర్థతను బట్టి, ప్రజప్రతినిధులు రైల్వే బోర్డుపై తెచ్చే ఒత్తిడి వలనే ఈ సౌకర్యలు డివిజన్‌కు సమకూరే అవకాశం ఉంది. భద్రతకు ఆన్లైన్ టెక్నాలజీ రైల్వే శాఖలో ఆన్లైన్ టెక్నాలజీని ప్రయాణికులకు, భద్రతకు విస్తృతంగా వినియోగించేలా పథకాల రూపకల్పన చేయనున్నారు. ప్లాట్ ఫాం టికెట్‌ను యాప్ ద్వారా అందించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. సగటు రైల్వే ప్రయాణికుడికి మేలు చేయలేని బడ్జెట్‌గా దీనిని రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్లో 2016-17 సాధించనున్న లాభాలు ప్రస్తావించటం, పీపీపీ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించడం ద్వారా, రైల్వేశాఖలో భవిష్యత్తులో జరిగే ప్రయివేటీకరణకు ఇది నాంది బడ్జెట్ అవుతుందంటున్నారు. ఇక ఉద్యోగుల సంక్షేమంపై కనీస ప్రస్తావనే లేదు. మంగళగిరికీ మొండిచేయి.. మంగళగిరి : నవ్యాంధ్ర నూతన అమరావతి రాజధానిలో ప్రధాన స్టేషన్‌గా వున్న మంగళగిరిలోనే బడ్జెట్ రైలు కూత వినిపించలేదు. అధికారులు,అధికారపార్టీనేతలు గొప్పగా చెప్పిన రైల్యే లైన్లు విస్తరణ,దేశనలుమూలలకు నూతన రైళ్లు దక్కకపోగా సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్న కనీస మౌలిక వసతులుకు బడ్జెట్లో స్థానం దక్కకపోవడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. స్టేషన్లో కనీసం రెండో రిజర్యేషన్ కౌంటర్, ప్రయాణికుల విశ్రాంతి గదులతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు ఏర్పాటుకు దిక్కు లేకపోవడం విశేషం. గత ఏడాది దక్షిణ మధ్య రైల్యే జీఎం పర్యటించిన సమయంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రయాణికుల సంక్షేమసంఘం ప్రతినిధులు కలిసి పలు వినతులు చేశారు.రాజధాని స్టేషన్లో మరిన్ని మౌలికవసతులతో పాటు స్టేషన్ అభివృద్ధికి మరిన్ని ప్రతిపాదనలు చేశామని బడ్జెట్లో నిధులు కెటాయించిన వెంటనే స్టేషన్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని చెప్పిన అధికారులు ఆమేరకు చేతలలో సాధించలేకపోవడం గమనార్హం. -
మిషన్ భగీరథ’ పనులు వేగవంతం చేయూలి
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పనులు కొ న్నిచోట్ల నత్తనడకన సాగడంపై కలెక్టర్ వాకాటి కరుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమన్వయం తో సమస్యలు పరిష్కరించుకుంటూ పనులు వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాల యంలో వాటర్‌గ్రిడ్ ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు, నాగార్జున నిర్మాణ సంస్థ ప్రతిని ధులతో సమీక్ష నిర్వహించారు. మెట్రో సెగ్మెంట్ కింద జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 704 ఆవాసాలకు ఏప్రిల్ 30 నాటికి తాగునీరు అంది చేలా పనులు చేపట్టాలన్నారు. 25 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా ప్రగతిలో 9, భూసమస్య కారణంగా 6, రోడ్డు సమస్య కారణంగా 4 నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయని, అధికారులు అలసత్వం వహించకుండా సత్వర చర్యలు చేపట్టాలని చెప్పారు. రెవెన్యూ అధికారులు పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పరిశీ లించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ ఏసురత్నం, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావు, జనగామ ఆర్డీవో వెంకటరెడ్డి, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
నీటిసంఘాల ఎన్నికలకు పచ్చజెండా
భీమవరం : నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కలెక్టర్ అధ్యక్షతన నీటి పారుదల శాఖ అధికారులు సమావేశమై ఎన్నికల తేదీలను ఖరారు చేయనున్నారు. పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ పరిధిలో 131 నీటి వినియోగదారుల సంఘాలు, 20 నీటి పంపిణీ కమిటీలు ఉన్నాయి. వీటితోపాటు మెట్ట ప్రాంతంలో 16 మీడియం, 229 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పరిధిలో నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న జీవో-20 జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. వీటిని అనుసరించి కలెక్టర్లు నీటి సంఘాల ఎన్నికల తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. ఎన్నికల తంతును సెప్టెంబర్ 12వ తేదీలోగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో నీటి పారుదల శాఖాధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. టీసీ సభ్యుల సంఖ్య కుదింపు నీటి వినియోగదారుల సంఘాల పరిధిలో గతంలో 12 ప్రాదేశిక (టీసీ) సభ్యులు ఉండేవారు. వారిలో ఒకరిని అధ్యక్షునిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకునేవారు. 10 మంది టీసీలుగా ఉండేవారు ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కాకుండా టీసీ సభ్యుల సంఖ్యను నాలుగుకు కుదించింది. గతంలో నామినేషన్లు స్వీకరించి ఎన్నిక నిర్వహించేవారు. ఇప్పుడు గ్రామ సభల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన విధిం చింది. నీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైన వారం తా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవడం, వారంతా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే.. నీటి సంఘాల పదవులను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రామ సభల పేరుతో ఎన్నికలు నిర్వహించాలని పైకి చెబుతున్నా.. ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తులనే ఎన్నుకునేవిధంగా లోపాయికారీ ఒప్పందాలు చేస్తున్నారు. -
ఔషధ నగరి.. పరిహారం కిరికిరి!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముచ్చర్ల ఔషధనగరికి అడుగడుగునా చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ కొలిక్కిరాకపోవడం ప్రాజెక్టు అంకురార్పణపై ప్రభావం చూపుతోంది. భూములు కోల్పోయే రైతాంగానికి పరిహారం చెల్లించే అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఫార్మాసిటీకి పునాదిరాయి ఇప్పట్లో పడే అవకాశం కనిపించడంలేదు. ఔషధనగరి పనులు చకచకా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వస్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, పరిహారం చెల్లించే విషయంలో స్పష్టత వ చ్చేవరకు అడుగుముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 10,939 ఎకరాల్లో ఫార్మాసిటీని స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములను సేకరించి టీఐఐసీకి అప్పగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు కసరత్తు చేసిన జిల్లా అధికారులకు ప్రతిబంధకాలే ఎదురవుతున్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీతో నిర్వాసితులుగా మారే రైతాంగం నష్టపరిహారంపై బెట్టువీడడంలేదు. మరీ ముఖ్యంగా పట్టాదారులు కనీస ధర (మార్కెట్ వాల్యూ) కంటే అధికంగా మూడింతలు పరిహారం చెల్లిస్తేనే భూములు అప్పగిస్తామని భీష్మించారు. బహిరంగ మార్కెట్లో కూడా దాదాపు ఎకరాకు రూ.15 లక్షల వరకు ధర పలుకుతుండగా.. కేవలం ఏడున్నర లక్షలకు భూములను లాక్కోవడం సమంజసంకాదని వాదిస్తున్నారు. ముచ్చర్లలోని సర్వే నం.288లో రెవెన్యూ రికార్డు ప్రకారం 2,746 ఎకరాలు ఉండాల్సివుండగా, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) సర్వేలో 1,917 ఎకరాలు మాత్రమే తేలింది. ఇదే సర్వే నంబర్లో 381.32 ఎకరాల పట్టా భూములను 151 మంది సాగు చేసుకుంటున్నారు. మరో 293.20 ఎకరాలు 150 మందికి అసైన్డ్ చేశారు. వీరందరూ ప్రస్తుతం నష్టపరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పట్టాదారులు పట్టుబడుతుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో యంత్రాంగం పడిపోయింది. పట్టాదారులతో ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ ససేమిరా అంటుండడం.. సాధ్యమైనంత త్వరగా భూములను బదలాయించాలని టీఐఐసీ ఒత్తిడి పెంచుతుండడం రెవెన్యూ అధికారులకు చిరాకు కలిగిస్తోంది. మరోవైపు పట్టాదారులకు పరిహారం చెల్లించే విషయం కొలిక్కివస్తే.. అసైన్డ్‌దారులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే అంశంపై అడుగు ముందుకేయాలని భావిస్తోంది. పట్టాలు పొందినా, కబ్జాలో లేన ందున పరిహారం ఇచ్చే విషయంలో తర్జనభర్జనలు పడుతోంది. అయితే, ప్రభుత్వం పొజిషన్ చూపకపోవడంతోనే అసైన్డ్‌దారులు కబ్జాలో లేరని, అది వారి తప్పుగా భావించడంలో అర్థంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై స్పష్టత వస్తేకానీ భూసేకరణ సాఫీగా జరిగే అవకాశంలేదు. -
డీఎస్సీ భర్తీ అనుమానమే!
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం కొత్త తరహాలో నిర్వహించిన డీఎస్సీ-14 భర్తీ జరుగుతుందో లేదోనన్న సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. అనాలోచిత నిర్ణయాలతో డీఎస్సీని ప్రకటించడం వల్ల ఇప్పుడు భర్తీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. టెట్ కమ్ టీఆర్టీ పేరిట డీఎస్సీ పరీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థులపై భారాన్ని మోపకూడదని యోచిస్తూ టెట్ కమ్ టీఆర్టీని నిర్వహిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం అభ్యర్థులపై మరింత భారాన్ని మోపేలా పరీక్షను నిర్వహించింది. గతంలో 100 మార్కులకు పరీక్ష నిర్వహించగా ఇప్పుడు 200 మార్కులకు పరీక్ష పెట్టారు. అయితే సమయాన్ని మాత్రం 3 గంటలు మాత్రమే పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. ప్రస్తుత విధానం వల్ల అభ్యర్థులు సోషల్, మ్యాథ్స్, సైన్స్‌తోపాటు మరిన్ని సబ్జెక్టులను చదవాల్సి వస్తోంది. ఉదాహరణకు తెలుగు పండిట్ అభ్యర్థి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 70 మార్కులకు, సోషల్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు 60 మార్కులకు, మిగిలిన అంశాలకు సంబంధించి 70 మార్కులకు చదవాల్సి వచ్చింది. ఇన్ని మార్కులకు తర్ఫీదు పొందాలంటే రోజుకు 18 గంటలకు పైగా శ్రమించాలి. గతంలో 100 ప్రశ్నలను 3 గంటల్లో రాస్తే ఇప్పుడు అదే సమయంలో 200 ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టులో కేసు వేశారు. అలాగే గతంలో టెట్ నిర్వహించినప్పుడు ప్రశ్నపత్రాల కాఠిన్యత స్థాయి నియమాలను అనుసరించి మార్కులను కలిపేవారు. టెట్ కమ్ టీఆర్టీ గతంలో కంటే కఠినమైనప్పటికీ గత నియమాలను అనుసరించకపోవడంతో గతంలో టీఈటీ ఉత్తీర్ణులైనవారికి వెయిటేజ్ ఉండడంతో వారు లబ్ధిపొంది తాము నష్టపోతున్నామంటూ కొత్తగా పరీక్ష రాసిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అలాగే ఎన్సీటీఈ టెట్ నిర్వహించమని సూచించింది తప్ప టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించమని చెప్పలేదని, టెట్‌కు వెయిటేజ్ ఇమ్మని చెప్పలేదని, ఓసారి టెట్‌లో అర్హత పొందితే ఏడేళ్ల వరకు టెట్ రాసే అవసరం లేదని ఎన్సీటీఈ చెప్పినప్పటికీ అందుకు విరుద్ధంగా డీఎస్సీ నిర్వహించడంపై కూడా అభ్యర్థులు కోర్టు దష్టికి తీసుకెళ్లారు. అలాగే కీ లోని పలు తప్పులు దొర్లాయంటూ ఆధారాలతో సహా పలువురు అభ్యర్థులు చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఫలితాలను విడుదల చేసింది. తుది కీ లో 13 తప్పులు ఉన్నాయంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆధారాలతో సహా ఆశ్రయించారు. ఇవన్నీ పరిష్కారమవ్వాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వం కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహించడంతో కోర్టు తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా వస్తే అసలు నియామకాలుంటాయా అనే సందేహం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వీటికి జవాబు చెప్పేవారే లేకుండా పోయారు. -
డ్వాక్రా రుణ మాఫీలోనూ కొర్రీ
- నగరంలో సగానికి సగం - మున్సిపాలిటీల్లో 1,354 గ్రూపులకు కోత - ఎందుకు తొలగించారో గ్రూపు సభ్యులే తీర్మానం చేయాలంటూ మెలిక విజయవాడ సెంట్రల్ : డ్వాక్రా రుణమాఫీలోనూ సర్కారు కొర్రీ పెట్టింది. ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో దానిని మూడు విడతలుగా ఇస్తానని ప్రకటించింది. అదీ పెట్టుబడి నిధిగా గ్రూపు ఖాతాల్లో జమచేస్తామని తెలిపింది. తొలి విడతలో గ్రూపునకు రూ.30 వేలు ఇస్తానని పేర్కొంది. తాజాగా ఈ మొత్తాల చెల్లింపులోనూ భారీగా కోతగా పెట్టింది. 76,240 మంది మాఫీకి దూరం నగరపాలక సంస్థలో 11,500 గ్రూపులకు గాను 5,243 గ్రూపులను, జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో 8,195 గ్రూపులకు గాను 6,841 గ్రూపులను మాత్రమే రుణమాఫీకి ఎంపిక చేశారు. ఆధార్ కార్డులు లేవని, తాత్కాలిక వలసలు వంటి కుంటిసాకులతో మాఫీకి ఎగనామం పెట్టేశారు. మెప్మా పరిధిలో నగరంతో పాటు జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో 19,695 గ్రూపులు ఉండగా, వాటిలో దాదాపు రెండు లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. తాజా జాబితాలను పరిశీలిస్తే 7,624 గ్రూపుల్లో 76,240 మంది మహిళలు రుణమాఫీకి దూరమయ్యారు. ఎన్నికల కోడ్‌తో అధికారులకు ఊరట రుణమాఫీ వర్తింపునకు సంబంధించి మెప్మా, యూసీడీ అధికారులు భారీ కసరత్తు చేశారు. గత నెల 21 నుంచి స్వయం సహాయక సంఘాలు, స్లమ్ లెవల్ ఫెడరేషన్, టౌన్ లెవల్ ఫెడరేషన్లతో మూడు విడతలుగా సమావేశాలు నిర్వహించారు. గ్రూపు సభ్యుల నుంచి పుస్తకాలను కలెక్ట్ చేశారు. తొలి విడతగా ఒక్కో గ్రూపునకు రూ.30 వేలు చొప్పున రుణమాఫీ వస్తోందని వివరించారు. అంతా చేసి చివరకు 40 శాతం గ్రూపులు జాబితా నుంచి గల్లంతవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క జన్మభూమి సభల్లో రుణమాఫీ పొందిన గ్రూపుల జాబితాలను వెల్లడించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో రుణమాఫీ జాబితాలను బయటపెట్టే అవకాశం లేకుండా పోయింది.దీంతో అధికారులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. తీర్మానంతో మెలిక: ఏ కారణాలతో రుణమాఫీ దక్కలేదో తెలియజేస్తూ గ్రూపు సభ్యులే తీర్మానం చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత ఉన్నప్పటికీ మాఫీ వర్తించపోతే అదే విషయాన్ని తీర్మానంలో పేర్కొనాలని సూచించింది. విజయవాడ నగరపాలక సంస్థలో 7,600 గ్రూపులకు (సుమారు 76 వేల మంది మహిళలకు) సంబంధించి ఆధార్ సీడింగ్ పూర్తయినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ 5,243 గ్రూపులకు మాత్రమే జాబితాలో చోటు దక్కింది. అకారణంగా గ్రూపులపై అనర్హత వేటు వేశారన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. ప్రభుత్వం చేసిన తప్పిదానికి గ్రూపు సభ్యులు తీర్మానం చేయాలనడం కొసమెరుపు. సరిచేస్తాం: ఆధార్ సీడింగ్ జరగకపోవడం వల్లే కొన్ని గ్రూపులకు రుణమాఫీ వర్తించడం లేదని మెప్మా ప్రాజెక్ట్ డెరైక్టర్ హిమబిందు ‘సాక్షి’కి చెప్పారు. లోటుపాట్లను సరిచేసి రెండో విడతలో రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. ఇందుకు సంబంధించి గ్రూపు సభ్యుల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్లు తెలిపారు. -
ఎంట్రీ ట్యాక్స్ ఎగ్గొట్టి ఏపీలోకి..
చింతలపూడి : తెలంగాణ రాష్ట్రానికి వెళ్లే ఆంధ్రా రవాణా వాహనాలపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్ విధిస్తూ.. ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. తెలంగాణ నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే వాహనదారులు మాత్రం ఎంట్రీ ట్యాక్స్ చెల్లించకుండానే దొడ్డిదారిన దర్జాగా వెళ్లిపోతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు వెళ్లే వాహనాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఏప్రిల్ 24 నుంచి తెలంగాణ నుంచి వచ్చే రవాణా వాహనాలపై పన్ను విధించింది. రాజమండ్రి-హైదరాబాద్ హైవేపై ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వద్ద తెలంగాణ రవాణా శాఖ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయగా.. ఏపీ ప్రభుత్వం మన జిల్లాలోని జీలుగుమిల్లి వద్ద చెక్‌పోస్ట్ నెలకొల్పింది. ఏపీలోకి వచ్చే తెలంగాణ వాహనాల నుంచి ఎంట్రీ ట్యాక్స్ రూపంలో మన రాష్ట్రానికి నెలకు రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఆ మేరకు రావడం లేదు. కారణం ఏమిటని ఆరా తీస్తే.. తెలంగాణ రాష్ట్రం నుంచి నిత్యం వందలాదిగా భారీ ట్రాలీ లారీలు గ్రానైట్ రాళ్లతో దొడ్డిదారిన మన రాష్ట్రంలోని కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు వెళ్తున్నాయి. ఈ వాహనాలను చెక్‌పోస్ట్ ఉన్న జీలుగుమిల్లి మీదుగా కాకుండా ఖమ్మం జిల్లా గంగారం నుంచి చింతల పూడి మండలం రాఘవాపురం మీదుగా భీమడోలు మండలం పూళ్ల చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి విజయవాడ-కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రయాణించి గమ్యస్థానాలకు వెళుతున్నాయి. అదేవిధంగా మేడిశెట్టివారిపాలెం అడ్డరోడ్డు నుంచి యర్రగుంటపల్లి, మక్కినవారిగూడెం, లక్ష్మీపురం మీదుగా రాజమండ్రి వైపు హైవేపై ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల మన రాష్ట్రానికి ఎంట్రీ ట్యాక్స్ రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి వచ్చే భారీ వాహనాలు దొడ్డిదారిన ప్రయాణించడం వల్ల గ్రామీణ రహదారులు ఛిద్రమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు ఏ దశలోనూ వీటిని తనిఖీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు తరచూ తని ఖీలు నిర్వహించి దొడ్డిదారిన వెళ్తున్న వాహనదారుల నుంచి ట్యాక్స్ వసూ లు చేస్తే ఎంట్రీ ట్యాక్స్ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణ సరిహద్దుల్లో మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. -
కొంతే ‘స్వచ్ఛం’
- స్వచ్ఛ హైదరాబాద్‌తో మిశ్రమ ఫలితాలు - కొన్ని ప్రాంతాల్లో కనిపించిన మార్పు - మరికొన్ని చోట్ల పాత పరిస్థితే - అందుబాటులో లేని చెత్త డబ్బాలు...వాహనాలు - అమలుకు నోచని అమాత్యుల ఆదేశాలు - స్వచ్ఛ హైదరాబాద్‌తో మిశ్రమ ఫలితాలు - కొన్ని ప్రాంతాల్లో కనిపించిన మార్పు - మరికొన్ని చోట్ల పాత పరిస్థితే - అందుబాటులో లేని చెత్త డబ్బాలు...వాహనాలు - అమలుకు నోచని అమాత్యుల ఆదేశాలు సాక్షి’బృందం: స్వచ్ఛ హైదరాబాద్... రాష్ర్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, యంత్రాంగమంతా భాగస్వాములైన కార్యక్రమం. ఈ నెల 16 నుంచి 20 వరకు నగరంలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా నగరం పరిశుభ్రం కావాలని ప్రభుత్వం భావించింది. మరి ‘స్వచ్ఛ హైదరాబాద్’ స్ఫూర్తితో పారిశుద్ధ్య పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? పౌరస్పృహ పెరిగిందా..? అనే అంశాలను ‘సాక్షి’ బృందం గురువారం గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించింది. ఈ పరిశీలనలో మిశ్రమ పరిస్థితులు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో గతంలో కంటే పారిశుద్ధ్యం మెరుగైంది.ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం లేదు. డంపర్బిన్లలోనే వేస్తున్నారు. చెత్తను క్రమం తప్పకుండా తరలిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల డబ్బాలు లేకపోవడంతో రోడ్లపైనే చెత్త వేస్తున్నట్లు ప్రజలు చెప్పారు. ఇళ్ల నుంచి చెత్తను తీసుకువెళ్లే రిక్షాలు అందుబాటులో లేవు. మరి కొన్నిచోట్ల స్వచ్ఛ హైదరాబాద్‌ను ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించారనే భావిస్తున్నారు. దీన్నిబట్టి ప్రజల్లో అవగాహన కల్పించలేకపోయినట్టు అర్థమైంది. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ పర్యటించిన బౌద్ధనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. గోషా మహల్, సనత్ నగర్, ఎల్బీనగర్, తదితర నియోజకవర్గాల్లో ఏమాత్రం మార్పులేదు. ఎటొచ్చీ తేలిందేమంటే.. ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాల్సి ఉంది. చె త్త వేయడానికి డబ్బాలు, తరలించే వాహనాలు సమకూర్చాల్సి ఉంది. దీనికి రెండువేల ఆటోట్రాలీలు, తడి,పొడి చెత్తను వేరుగా వేసేందుకు రెండురంగుల డబ్బాలను అందించనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. అవి అందుబాటులోకి వచ్చేంతవరకైనా అవసరమైనన్ని చెత్తడబ్బాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి దాదాపు పదివేల డబ్బాలను జీహెచ్ఎంసీ సమకూర్చుకుంది. వీటిని ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అందజేయనున్నారు. ట్రాలీల కొనుగోళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తగ్గని చెత్త... ఇళ్ల నుంచి వెలువడే చెత్త ఏమాత్రం తగ్గడం లేదు. గతంలో రోజుకు సగటున 3,300 మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు తరలేది. గడచిన వారం రోజుల్లో రోజుకు 3,250 నుంచి 3,650 మెట్రిక్ టన్నుల వరకు తరలించారు. ఇదీ ప్రస్తుత పరిస్థితి పాతబస్తీలోని చార్మినార్, గోషామహల్, ధూల్‌పేట్ తదితర ప్రాంతాల్లోచెత్త యధావిధిగా రోడ్లపైనే పడేసిన దృశ్యాలు కనిపించాయి. డస్ట్బిన్ల పక్కన, రోడ్లపై చెత్తకుప్పలు దర్శనమిచ్చాయి. బేగంబజార్ ఫిష్ మార్కెట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ...అమలుకు నోచుకున్న దాఖలాలు కనిపించలేదు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రపరిస్థితుల్లో మార్పు లేదు. సర్కిల్-4, 5 ప్రాంతాల్లో కుండీల వద్ద చెత్త కుప్పలుగా పేరుకుపోయి దర్శనమిస్తోంది. గౌలిపురా, బాలాగంజ్, యాకుత్‌పురా ఇమ్లిబన్, ఆమన్‌నగర్-బి, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, యాకుత్‌పురా, ఎస్సార్టీ కాలనీ, చావునీ నాదే అలీ బేగ్, రెయిన్‌బజార్ చమాన్‌లో కుండీల వద్ద చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మార్పు కనిపించింది. సీఎం ఇన్చార్జిగా ఉన్న బౌద్ధ నగర్ డివిజన్ పార్శిగుట్ట ప్రాంతంలో చెత్త తొలగింపు కార్యక్రమం సజావుగా సాగుతోంది. రాఘవ గార్డెన్, పార్శీగుట్ట, అంబర్ నగర్, మధురానగర్, న్యూ అశోక్‌నగర్, బౌద్ధనగర్ కమ్యూనీటి హాల్ ప్రాంతాల్లో ఏ రోజు చెత్తను ఆరోజే తొలగిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటించడంతో తమ ప్రాంతాలు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. సనత్‌నగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రజల్లో మార్పు కనిపించకపోగా... అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించిన తీరు స్పష్టమైంది. ప్రధానంగా మంజు థియేటర్ ప్రాంతంలో చెత్త కుండీలు నిండిపోయి కనిపిస్తున్నాయి. మినర్వా కాంప్లెక్స్, దీన్‌దయాల్ రోడ్, మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో చెత్త కుండీలు నిండిపోయి ఉన్నాయి. సిబ్బంది చెత్తను తొలగించక పోవడంతో రోడ్లపై కుప్పలుగా పడి ఉంది. సనత్ నగర్ నియోజకవర్గంలోని నటరాజ్ నగర్, సారథి నగర్, కళ్యాణి నగర్ వెంచర్-3లోని ఇళ్ల సమీపంలో చెత్త కుప్పలను తొలగించకపోవడంతో పరిస్థితికి మొదటికి వచ్చింది. గాజులరామారం డివిజన్ నెహ్రూ నగర్లో రోడ్డు మధ్యలో బోరు వేసి వదిలేశారు. ఈ విషయాన్ని అక్కడ పర్యటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని అప్పట్లో అధికారులను మంత్రి ఆదేశించారు. అయినా నేటికీ పరిస్థితిలో మార్పులేదు. మంజు థియేటర్ ప్రాంతంలో చెత్త కుండీలు నిండిపోయాయి. మినర్వా కాంప్లెక్స్, దీన్‌దయాల్ రోడ్, మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో కుండీలు చెత్తతో నిండిపోయి...ఆ ప్రాంతమంతా అధ్వానంగా మారింది. వనస్థలిపురం సుష్మ బస్‌స్టాప్ వద్ద జాతీయ రహదారిపై చెత్త డంపింగ్ యార్డును తలపిస్తోంది. రాజేంద్రనగర్ సర్కిల్లో మార్పు కనిపిస్తోంది. గతంలో ఖాళీ ప్రదేశాలతో పాటు తమ ఇళ్ల పక్కనే చెత్తాచెదారాలు వేసేవారు. ప్రస్తుతం డస్ట్బిన్లు, ఇళ వద్దకు వచ్చే రిక్షాలలో వేస్తున్నారు. ఉప్పల్ సర్కిల్లో పరిస్థితులు మెరుగయ్యాయి. ప్రధాన రహదారుల్లో ఎక్కడికక్కడే పేరుకు పోయిన చెత్త శుభ్రం చేశారు. ఉప్పల్ పారిశ్రామిక వాడ , చిలుకానగర్ చౌరస్తాలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. -
రైల్వేకు 1100 ఎకరాలు
సాక్షి, బెంగళూరు: అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం బెంగళూరులోని విధానసౌధలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూముల సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక ఇదే సందర్భంలో గదగ్-వాడి రైల్వే ప్రాజెక్టుకు గాను కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు(కేఐఏడీబీ) ద్వారా ఆరు నెలల్లో మొత్తం 1100 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గదగ్-వాడి మధ్య 255 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 2,500 ఎకరాల భూమి అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ కోసం ఆరు నెలల్లో 1100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వనుందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న మరో 15 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అన్నారు. ఈ 15 ప్రాజెక్టుల్లో తుమకూరు-రాయదుర్గ, బీదర్-గుల్బర్గా, బాగల్కోటె-కుడచి, బెంగళూరు-హాసన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారని వెల్లడించారు. తక్కువ పరిమాణంలో రైతుల నుంచి భూమి సేకరించాల్సిన పరిస్థితుల్లో నేరుగా డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాక్షి, బెంగళూరు: అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం బెంగళూరులోని విధానసౌధలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూముల సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక ఇదే సందర్భంలో గదగ్-వాడి రైల్వే ప్రాజెక్టుకు గాను కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు(కేఐఏడీబీ) ద్వారా ఆరు నెలల్లో మొత్తం 1100 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గదగ్-వాడి మధ్య 255 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 2,500 ఎకరాల భూమి అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ కోసం ఆరు నెలల్లో 1100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వనుందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న మరో 15 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అన్నారు. ఈ 15 ప్రాజెక్టుల్లో తుమకూరు-రాయదుర్గ, బీదర్-గుల్బర్గా, బాగల్కోటె-కుడచి, బెంగళూరు-హాసన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారని వెల్లడించారు. తక్కువ పరిమాణంలో రైతుల నుంచి భూమి సేకరించాల్సిన పరిస్థితుల్లో నేరుగా డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కూరగాయలు, పప్పుదినుసుల ధరలకు రెక్కలు
- హోల్‌సేల్ రేట్లకు, రిటైల్ రేట్లకు సగానికి సగం వ్యత్యాసం - బెంబేలెత్తుతున్న వినియోగదారులు - రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం తప్ప మిగిలిన ధరలన్నీ భారీగా పెరుగుదల. సాక్షి, బళ్లారి : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. కేజీ బియ్యాన్ని బీపీఎల్ కార్డు దారులకు ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికి పేదలకు కడుపు నిండా భోజనం తినలేని పరిస్థితి ఏర్పడుతోంది. రేషన్ షాపుల్లో బీపీఎల్‌కార్డు దారులకు ఉచితంగా బియ్యం దొరుకుతుందని సంతోషం తప్ప రేషన్ షాపుల నుంచి బయటకు వచ్చి అన్నంలో పప్పు వండేందుకు, సాంబార్ చేసేందుకు కూరగాయలు, పప్పు దినుసులు తీసుకోవాలంటే పేదలు కొనలేని పరిస్థితిలో ధరలు చుక్కలనంటుతున్నాయి. ఎండ వేడిమి రోజు రోజుకు పెరుగుతూ జనాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారో అదే తరహాలో కూరగాయలు, పప్పు దినుసులు ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. పేదలకు రేషన్ షాపుల్లో ఒక్క బియ్యం మాత్రం ఉచితం అందజేసి, కంది పప్పును అందజేయకపోవడంతో పేదలకు ఎలాంటి మేలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఒక్క బియ్యం తీసుకుని ఉత్త అన్నం తినాలా అంటూ పేదలు ప్రశ్నిస్తున్నారు. కూరగాయలు, కంది పప్పులు, అలసందలు, పెసలు తదితర పప్పు దినుసులను మార్కెట్ మాయాజాలంతో వ్యాపారస్తులు విపరీతంగా పెంచుతున్నప్పటికీ సర్కార్ కళ్లు మూసుకుని చూస్తుండటంతో రైతులకు ఎలాంటి లాభం చేకూరక పోగా, వ్యాపారస్తులు కోట్లు గడిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతుండటంతో రూ.500 లకు చిన్న బ్యాగులోకి కూడా కూరగాయలు రావడం లేదని పలువురు నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చి మిర్చి నుంచి టమోటా, క్యారెట్, బీట్రూట్, బెండ, వంకాయ తదితర కూరగాయలన్ని భారీగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మొన్న మొన్నటి వరకు రూ.5లు ఉన్న టమోటా ధర ప్రస్తుతం రూ.40లకు పలుకుతోంది. అయితే ఇక్కడ రైతులు మాత్రం ఇంత భారీ స్థాయిలో నగదు రాకపోవడం గమనార్హం. టమోటాతో క్యారెట్ రూ.40, పచ్చిమిర్చి, బెండ కూడా రూ.40 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కూరగాయలు దాదాపు రూ.40 నుంచి రూ.50లు పలుకుతుండటంతో పాటు పప్పుదినుసులు మరింత రేటు పెరగడంతో పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంది పప్పు రూ.130, పెసర, అలసంద, మినపప్పులు కూడా రూ.150లు పైకి ఎగబాకడంతో వాటిని కొనుగోలు చేసి వంట వండుకునేందుకు మహిళలు నానా అవస్థలు పెడుతున్నారు. ఉన్నది సర్దుకుని వంట చేయమని పురుషులు ఆర్డర్ వేస్తున్నారు. ఎలా వండి వడ్డించాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీతోనైనా కందిపప్పు, ఇతర పప్పుదినుసులు సరఫరా చేస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు మహిళలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. -
‘హరికృష్ణ ఎక్స్పోర్స్ట’పై చర్యలేవీ?
- పోలీసులు పట్టించుకోలేదు.. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు - ఆరోపించిన మాజీ మంత్రి నసీమ్ ఖాన్ - రెండు రోజుల్లో యజమానిని అరెస్టు చేయకపోతే నిరసన చేస్తామని వెల్లడి ముంబై: మతం పేరుతో ముస్లిం యువకుడికి ఉద్యోగమివ్వని వజ్రాభరణాల ఎగుమతి చేసే హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర మాజీ మంత్రి నసీమ్ ఖాన్ ఆరోపించారు. ఘటన జరిగి నాలుగు రోజు లైనా సదరు సంస్థపై ముంబై పోలీసులు ఎఫ్ఐ ఆర్ నమోదు చేయలేదని విమర్శించారు. మరో రెండు మూడు రోజుల్లో అరెస్టు చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని ప్రభుత్వాన్ని ఆదివారం హెచ్చరించారు. హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ జేషన్ అలీ ఖాన్ ఉద్యోగానికి దర ఖాస్తు చేసుకున్నాడు. దానికి ‘మీ దరఖాస్తుకు ధన్యవాదాలు. మేము ముస్లిమేతర అభ్యర్థులను మాత్రమే ఉద్యోగంలో చేర్చుకుంటాం’ అని కంపెనీ జవాబు పంపింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని బీకేసీ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్, ఆ జోన్ డీసీపీని కోరినట్లు ఖాన్ చెప్పారు. అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాలని ఆయన కోరారు. ఆదివారం ఉదయం జేషన్, అతని తండ్రితో కలసి ఖాన్‌ను కలిశారు. పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని, కేసును పరిశీలించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణపై అసంతృప్తి లేదని, అయితే కేసుకు సంబంధించి అరెస్టు జరిగి ఉంటే సంతోషించే వాడినని జేషన్ అన్నారు. ఈ విషయమై బీకేసీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే నిగ్డే మాట్లాడుతూ.. కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని, దానికి అనుగుణంగా అరెస్టు జరుగుతుందని అన్నారు. మే 21న ఈ విషయం తెలిసిన తర్వాత సీఎం ఫడ్నవీస్ ఘటనపై విచారణకు ఆదేశించారు. ముంబై పోలీసులు ఆ బిజినెస్ హౌజ్‌పై కేసు నమోదు చేశారు. జాతీయ మైనార్టీ కమిషన్ ఆ బిజినెస్ హౌజ్ నుంచి వివరణ కోరింది. అయితే ఇది హెచ్ఆర్ ట్రెయినీ తప్పిదమని, సదరు వ్యక్తిపై చర్య తీసుకున్నామని కంపెనీ తెలిపింది. -
అరుణకు ఘన నివాళి
- ఓ కళాశాలకు పేరు పెడుతున్నట్లు సీఎం ప్రకటన - అవార్డు నెలకొల్పుతున్నట్లు ప్రకటించిన ఎంపీ సీఎం ముంబై: 42 ఏళ్లపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయిన అరుణా శానబాగ్ జ్ఞాపకార్థం థాణేలోని ప్రముఖ నర్సింగ్ కళాశాలకు ఆమె పెరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం తెలిపారు. ఆమె స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు. కేఈఎమ్ ఆస్పత్రిలోని నాలుగో వార్డుకు అరుణ పేరు పెట్టాలని ఆస్పత్రి అధికారులు బీఎంసీని కోరారు. చికిత్స చేసిన గదిలో ఆమె ప్రతిమను ఉంచారు. ఆ గదికి ఆమె పేరు పెట్టి ఆ గదిని ఆస్పత్రి పనులకు, చికిత్సలకు వాడుకోవాలని నిర్ణయించారు. అరుణ పేరుతో అవా ర్డు నెలకొల్పుతున్న ట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహిళలపై జరుగుతు న్న అన్యాయాలకు వ్య తిరేకంగా పోరాడుతు న్న స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని నిర్ణయిం చారు. ఈ అవార్డు కింది రూ. ఒక లక్ష బహుమతిగా ఇవ్వనుంది. అరుణకు జరిగిన అన్యాయానికి మధ్యప్రదేశ్ సీఎం చింతిస్తూ...ఆమె గౌరవానికి చిహ్నంగా పేర్కొన్నారు. దేశానికి దక్కిన బహుమతి అరుణ దేశానికి దక్కిన గొప్ప బహుమతి అని రచయిత పింకి విరానీ అన్నారు. 1973 నవంబర్ 27 ఘటన అరుణ జీవితాన్ని మార్చి వేసిందని విచారం వ్యక్తం చేశారు. ఆమె చనిపోయినా ఎప్పటికీ తన గుండెలో బతికే ఉందని అన్నారు. -
కేసులు ఉపసంహరించుకుందాం
- పెండింగ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం - 1,291 కోర్టుల్లో 18 లక్షల కేసులు పెండింగ్ ఉన్నట్లు వెల్లడి - ముంబై, పరిసర ప్రాంతాల్లోనే 4.5 లక్షలు నమోదు ముంబై: రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తప్పడు చార్జ్‌షీట్, సాక్షాలు, ఆధారాలు లేని ఇతరత్రా కేసులను వెనక్కి తీసుకోవాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని 1,291 కోర్టుల్లో 18 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 25 శాతం (4.5 లక్షల) కేసులు కేవలం ముంబై దాని పరిసర ప్రాంతాల్లో నమోదయ్యాయని రాష్ట్ర హోం శాఖ తెలియజేసింది. సరైన ఆధారాలు లేకపోయినప్పటికీ కొన్ని కేసులు నమోదు చేశారని, దర్యాప్తు పూర్తి కాకపోయినప్పటికీ చార్జ్‌షీట్ దాఖలయ్యేవని హోం శాఖ అధికారులు తెలిపారు. ఉపసంహరించుకోవాల్సిన కేసులను పరిశీలించడానికి జిల్లా ముఖ్య అధికారి, సెషన్స్ జడ్జి నేతృత్వంలో ప్రతి జిల్లాలో ఓ హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ ఆఫ్ పోలీస్, ప్రాసిక్యూషన్ అసిస్టెంట్ డెరైక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వ న్యాయవాది కమిటీలో ఉంటారు. తాలుకా ముఖ్య కేంద్రాల్లో కూడా సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలో ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించి, వాటిని వివిధ విభాగాల వారిగా విభజిస్తారు. సంబంధిత కేసులను ఉపసంహరించుకోవచ్చా లేదా అనేది న్యాయ శాఖను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు. -
సర్కారీ జాగా... అక్రమార్కుల పాగా!
- టీఐఐసీ, అటవీ స్థలాల క్రమబద్ధీకరణ - జంట జిల్లాల్లో 13 వేల దరఖాస్తుల పరిశీలన - ఆమోదానికి అత్యున్నతస్థాయి కమిటీ - శిఖం భూములపై ఆచితూచి అడుగు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వివిధ సంస్థలకు కట్టబెట్టిన సర్కారీ స్థలాల్లో వెలిసిన కట్టడాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పారిశ్రామిక, అటవీ, విద్యా, నీటిపారుదల తదితర శాఖలకు బదలాయించిన స్థలాల్లో చాలా చోట్ల నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఆక్రమణదారులంతా జీవో 58 కింద తమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీలున్నంత వరకు స్థలాల క్రమబద్ధీకరణ ఉదారంగా వ్యవహ రించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో.. చెరువులు, స్మశానవాటిక, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, శిఖం భూములను కూడా రెగ్యులరైజ్ చేసే కోణంలో రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాల్లో వెలిసిన నిర్మాణాలపై కూడా ఆయా శాఖల సమ్మతితో క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఫలితంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 13,417 దరఖాస్తులకు మోక్షం కలిగించే అంశంపై భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నేతృత్వంలోని కమిటీ కుస్తీ పడుతోంది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో 6,692 దరఖాస్తులు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,725 దరఖాస్తులను పరిశీలించనున్నారు. శిఖం స్థలాలకు వెనుకడుగు! ఇదిలా ఉండగా శిఖం భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వాటి జోలికి వెళితే న్యాయపరమైన చిక్కులు తప్పవని స్పష్టం కావడంతో పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. గతంలో చెరువులు నగరీకరణ నేపథ్యంలో కనుమరుగు కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. శిఖం/ఎఫ్టీఎల్లో వెలిసిన నిర్మాణాలపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లాలో దాదాపు 8,887 దరఖాస్తులకు మోక్షం కలిగించే దిశగా ఆలోచించింది. అయితే శిఖం భూములపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, న్యాయస్థానాలు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న సర్కారు.. వీటిని పక్కనపెట్టడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు అధికారవర్గాల సమాచారం. -
రైతులను మోసం చేసిన సర్కారు
- కలెక్టరేట్ వద్ద జైల్‌భరోలో సీపీఐ నేతలు మచిలీపట్నం (చిలకలపూడి) : భూసేకరణ విషయంలో రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు డి.నిర్మల పేర్కొన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా, జైల్‌భరో నిర్వహించారు. నిర్మల మాట్లాడుతూ భూసేకరణ విషయంలో రైతులను వేధింపులకు గురిచేసి వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బలవంతంగా భూములను లాక్కోవటం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం సీపీఐ నాయకులు కలెక్టరేట్ గేటు వద్ద నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అఫ్జల్, పరుచూరి రాజేంద్రప్రసాద్, లింగం ఫిలిప్, జంపాన వెంకటేశ్వరరావు, గారపాటి సత్యనారాయణ, నర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు రూ. 200 కోట్లు
యాదమరి: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి నందుకు రూ.200 కోట్లు నష్టం వచ్చిందని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆరోపించారు. ఆయన గురువారం విలేకరితో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ 43 శాతం ఇవ్వాలని ముందే అడిగారనీ,ఇవ్వకపోతే సమ్మె చేస్తామని హెచ్చరికలు చేసినా ప్రభుత్వం వీరి సమస్యలు పట్టించుకోకుండా పోవడంతో వారు ఎనిమిది రోజులుగా సమ్మె చేశారు. ప్రయాణికుల సమస్యలను చూడలేక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందన్నారు. సమ్మె కాలంలో వాటిల్లిన దాదాపు రూ.200 కోట్ల నష్టం ప్రభుత్వం భరించాలని పేర్కొన్నారు. నేడు సప్లై ఛానల్ పరిశీలన మండలంలోని నేరేనగర్ ముస్లింవాడ గ్రామం నుంచి శ్మశాన స్థలానికి వెళ్లే సప్లై ఛానల్‌ను పూతలపట్టు నియోజక వర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జెడ్పీటీసీ ఉషారాణి, ఎంపీపీ రాధమ్మ , వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు,సర్పంచ్‌లు పరిశీలించనున్నట్లు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ధనంజయరెడ్డి తెలిపారు. -
మీ ఫీజులు కట్టం!
స్థానికేతర విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను సదరు విద్యార్థులకు నిలిపేసింది.ఫలితంగా తోటి విద్యార్థులంతా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పొందగా.. స్థానికేతర విద్యార్థులు మాత్రం నిరాశ చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14,774 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా.. ఏకంగా ఈ పాస్ వెబ్సైట్లో వారి వివరాలను బ్లాక్ చేసింది. దీంతో ఆయా విద్యార్థులు ప్రస్తుత కోర్సు ఫీజు చెల్లించే అంశంపై ఆందోళన చెందుతున్నారు. - ఫీజు రీయింబర్స్మెంట్ నిధులకు బ్రేకు - వెబ్సైట్లో నిధుల బదలాయింపు ఆప్షన్ తొలగింపు - నిలిచిన చెల్లింపులు రూ.50.76 కోట్లు - ఫలితంగా 14,774 మంది విద్యార్థుల్లో ఆందోళన - అయోమయంలో కళాశాలల యాజమాన్యాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్‌కు చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడంతో జిల్లాలో రికార్డుస్థాయిలో వృత్తివిద్యా కళాశాలలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యధికంగా జిల్లాలో పోస్టుమెట్రిక్ కాలేజీలుండడం.. అందులోనూ పేరున్న కాలేజీలున్నందున ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం కొర్రీలు విధించింది. దీంతో కోర్సు మధ్యలో వదిలి వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ఆ ప్రాంత విద్యార్థులు ఇక్కడే చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు, ఉపకారవేతనాల నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన విద్యార్థులందరికీ ఫీజులు, ఉపకారవేతనాలు విడుదల చేసిన అధికారులు.. స్థానికేతర విద్యార్థులకు మాత్రం చెల్లింపులు నిలిపివేశారు. రూ.50.76 కోట్లకు బ్రేక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.2లక్షల మంది పోస్టుమెట్రిక్ విద్యార్థులున్నారు. వీరికి ఆయా సంక్షేమశాఖల ద్వారా ప్రభుత్వం ఉపకారవేతనాలు, ఫీజు రాయితీ నిధులను అందిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఫీజు బకాయిల పంపిణీకి ఉపక్రమించిన ప్రభుత్వం.. స్థానికేతర విద్యార్థులకు సంబంధించి నిధుల పంపిణీకి బ్రేకువేసింది. జిల్లావ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ విద్యార్థులు 11,254 మంది, ఈబీసీ విద్యార్థులు 3,250 మంది ఉన్నారు. వీరికి సంబంధించి రూ.50.76 కోట్ల బకాయిలను అధికారులు నిలిపివేశారు. వెబ్సైట్లో బ్లాక్ చేసి.. ప్రభుత్వం పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియకు సంబంధించి వ్యవహారమంతా ఈ- పాస్ వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయడంతో విద్యార్థులు తమ ఫీజు రాయితీ, ఉపకారవేతనాల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అయితే, స్థానికేతర విద్యార్థుల వివరాలను ప్రభుత్వం బ్లాక్ చేసింది. దీంతో ఆయా విద్యార్థులకు ఫీజు రాయితీ, ఉపకారవేతనాల చెల్లింపులు చేసే వీలు లేదు. దీంతో విద్యార్థుల ఈపాస్ స్టేటస్ సైతం కనిపించడం లేదని ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. -
‘స్వచ్ఛ’ టీం రెడీ!
- ముఖ్యులకు బాధ్యతల అప్పగింత - ప్యాట్రన్లు, మెంటర్ల పేర్లు వెల్లడి ‘స్వచ్ఛ హైదరాబాద్’కు సన్నాహాలు ఊపందుకున్నాయి. విశ్వనగరమే ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పరిశుభ్ర నగర బాధ్యతల్ని ముఖ్యులందరికీ అప్పజెబుతోంది. ముఖ్యమంత్రి నుంచి ఐఏఎస్ అధికారి వరకు పలువురు వీవీఐపీలు ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగం పంచుకుంటారు. ఏరియాలు, బాధ్యతలు, ముఖ్యులెవరో ప్రభుత్వం ప్రకటించింది. 400పైగాయూనిట్లలో ఈ నెల 16 నుంచి ‘యజ్ఞం’ మొదలవనుంది. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రప్రభుత్వం ఈ నెల 16 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’ మహాయజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈమేరకు ఆయా విభాగాల బాధ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమం కోసం జీహెచ్ఎంసీని 400 యూనిట్లకు పైగా విభజించారు. ఒక్కో విభాగానికి ఒక్కొక్క వీవీఐపీ బాధ్యతలు నిర్వహించనున్నారు. వీరిని పాట్రన్/మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి పర్యవేక్షణలో జీహెచ్ఎంసీకి చెందిన అధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. నోడ ల్ అధికారి సమన్వయంతో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కేవలం పారిశుధ్య కార్యక్రమాలపైనే కాక ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలనూ వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తారు. జీహెచ్ఎంసీలోని కొన్ని సర్కిళ్లకు ఒకరి కంటే ఎక్కువ మంది బాధ్యతలు నిర్వహించనున్నారు. కొన్ని సర్కిళ్లకు ఒక్కరే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా స్వచ్ఛ హైదరాబాద్‌పై చర్చించేందుకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. -
ముంబై లో మరో ‘వెదర్ డాప్లర్ రాడార్’
- ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం - నగర శివారులో నిర్మాణానికి కసరత్తు సాక్షి, ముంబై: వాతావరణ వివరాలు తెలుసుకునేందుకు ముంబైలో మరో ‘వెదర్ డాప్లర్ రాడార్’ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివారు ప్రాంతంలోని ఓ కొండపై ఈ డాప్లర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వాతావరణ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణనంద హోసాల్కర్ తెలిపారు. మొదటి రాడార్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో భవనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో రెండో డాప్లర్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలకు నగరం, శివారు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఘటనలో దాదాపు రెండు మంది ప్రాణాలు పోగా కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం వాటిళ్లింది. వర్షాలు, వరదలపై ముంద స్తు హెచ్చరికలు జారీ చేయలేదని వాతావరణ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వాతావరణ వివరాలు కచ్చితంగా తెలుసుకునేందుకు కొలాబా నేవీ నగరంలోని అర్చన భవనంపై రూ. 35 కోట్లు విలువచేసే వెదర్ డాప్లర్ రాడార్‌ను ఏర్పాటు చేశారు. డాప్లర్ ఏర్పాటు చేయడంవల్ల ఈ ప్రాంతంలో ఎత్తై భవనాలు నిర్మించడానికి వీలులేకుండా పోయింది. 15 టన్నుల బరువైన ఈ రాడార్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల చుట్టపక్కల ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. దీంతో బిల్డర్ లాబీలు 2014లో హైకోర్టును ఆశ్రయించాయి. రాడార్‌ను మరోచోటికి మార్చాలని ప్రభుత్వం, బీఎంసీ, వాతావరణ శాఖను కోర్టు ఆదేశించింది. రాడార్‌ను శివారు ప్రాంతానికి తరలించడానికి బిల్డర్ లాబీలు అనేక ప్రయత్నాలు చేశాయి. అందుకు అవసరమైన సాయం చేసేందుకు కూడా సిద్ధపడ్డాయి. కానీ రాడార్‌ను చే యడం సాధ్యం కాదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో రెండో రాడార్ ఏర్పాటుకు పనులు వేగవంతం చేశారు. రాయ్‌గడ్, ఠాణే జిల్లాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని స్థల సేకరణ పనులు పూర్తిచేశారు. అయితే రాడార్‌ను ముంబైలోనే ఏర్పాటుచేయాలని వాతావరణ శాఖ పట్టుబట్టింది. దీంతో కొద్ది నెలలుగా స్థల సేకరణ పనులు చేపట్టగా ఎట్టకేలకు ఉప నగరంలో స్థలాన్ని నిర్ణయించారు. -
ముంబై లో మరో ‘వెదర్ డాప్లర్ రాడార్’
- ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం - నగర శివారులో నిర్మాణానికి కసరత్తు సాక్షి, ముంబై: వాతావరణ వివరాలు తెలుసుకునేందుకు ముంబైలో మరో ‘వెదర్ డాప్లర్ రాడార్’ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివారు ప్రాంతంలోని ఓ కొండపై ఈ డాప్లర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వాతావరణ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణనంద హోసాల్కర్ తెలిపారు. మొదటి రాడార్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో భవనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో రెండో డాప్లర్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలకు నగరం, శివారు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఘటనలో దాదాపు రెండు మంది ప్రాణాలు పోగా కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం వాటిళ్లింది. వర్షాలు, వరదలపై ముంద స్తు హెచ్చరికలు జారీ చేయలేదని వాతావరణ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వాతావరణ వివరాలు కచ్చితంగా తెలుసుకునేందుకు కొలాబా నేవీ నగరంలోని అర్చన భవనంపై రూ. 35 కోట్లు విలువచేసే వెదర్ డాప్లర్ రాడార్‌ను ఏర్పాటు చేశారు. డాప్లర్ ఏర్పాటు చేయడంవల్ల ఈ ప్రాంతంలో ఎత్తై భవనాలు నిర్మించడానికి వీలులేకుండా పోయింది. 15 టన్నుల బరువైన ఈ రాడార్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల చుట్టపక్కల ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. దీంతో బిల్డర్ లాబీలు 2014లో హైకోర్టును ఆశ్రయించాయి. రాడార్‌ను మరోచోటికి మార్చాలని ప్రభుత్వం, బీఎంసీ, వాతావరణ శాఖను కోర్టు ఆదేశించింది. రాడార్‌ను శివారు ప్రాంతానికి తరలించడానికి బిల్డర్ లాబీలు అనేక ప్రయత్నాలు చేశాయి. అందుకు అవసరమైన సాయం చేసేందుకు కూడా సిద్ధపడ్డాయి. కానీ రాడార్‌ను చే యడం సాధ్యం కాదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో రెండో రాడార్ ఏర్పాటుకు పనులు వేగవంతం చేశారు. రాయ్‌గడ్, ఠాణే జిల్లాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని స్థల సేకరణ పనులు పూర్తిచేశారు. అయితే రాడార్‌ను ముంబైలోనే ఏర్పాటుచేయాలని వాతావరణ శాఖ పట్టుబట్టింది. దీంతో కొద్ది నెలలుగా స్థల సేకరణ పనులు చేపట్టగా ఎట్టకేలకు ఉప నగరంలో స్థలాన్ని నిర్ణయించారు. -
పనిచేయని ఎల్‌డీబీ బ్యాంకుల మూసివేత: సీఎం ఫడ్నవీస్
ముంబై: ఆగిపోయిన భూ అభివృద్ధి బ్యాంకులను మూసివేసి వాటి ఆస్తులను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పని చేయని బ్యాంకుల పరిస్థితిపై గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను తమ ప్రభుత్వం స్వీకరించిందని సీఎం ఫడ్నవీస్ మంగళవారం అన్నారు. వాటి ద్వారా 2,800 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రూ. 500 కోట్ల విలువైన బ్యాంకుల ఆస్తులను ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలా లేక అమ్మివేయాలా అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 1,046 మంది ఎల్‌డీబీ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకం సొమ్మును 2.5 రెట్లు పెంచామని, దీని విలువ రూ. 70.12 కోట్లని అన్నారు. వరికి రూ. 250 ప్రోత్సాహకాన్ని ఇస్తున్నామని ఆయన అన్నారు. ఈ మొత్తం రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని అన్నారు. ముడి చక్కెరకు మెట్రిక్ టన్నుకు రూ. 1000 ఎగుమతి సబ్సిడీ కూడా అందిస్తున్నామన్నారు. ఇది కేంద్రం ఇస్తున్న రూ. 4000కు అదనం అన్నారు. ఇప్పటి వరకు ఎనమిది నుంచి పది లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెర ఎగుమతి జరిగిందని చెప్పారు. అక్రమ నిల్వలను నిరోధించడానికి చక్కెర ఎగుమతి ఉపయోగపడుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రశ్నించగా యావత్మాల్, ఉస్మానాబాద్ జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలపై సర్వే పూర్తయిందని చెప్పారు. వ్యవసాయ సంక్షోభం ఎదుర్కొంటున్న రైతులకు నేరుగా సంక్షేమ పథకాలు అందటానికి ఐఏఎస్ అధికారులు నేతృత్వంలో సంబంధిత జిల్లాల్లో పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. -
మంత్రి ఆదేశాలు బేఖాతరు
- మొక్కుబడిగా అవగాహన సదస్సులు - కనీసం కరపత్రాలు పంపిణీ చేయని అధికారులు - స్పెషల్ డివిజన్ కార్యాలయంలో మూలుగుతున్న కరపత్రాలు సాక్షి, విజయవాడ : భూగర్భ జలాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీరు-చెట్టు పథకం కింద పెద్దఎత్తున కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా చెరువుల్లో పూడిక తీయడంతో పాటు వర్షపు నీరు వాగులు, వంకల్లోకి ప్రవహింపజేయడం, వర్షపు నీటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవచ్చో తెలియజేస్తూ లక్షలు రూపాయలు వెచ్చించి వాటర్ షెడ్స్ కరపత్రాలను ముద్రించారు. ఈ కరపత్రాల్లో ఆయా మండలాల్లో వర్షపాతం, వాగులు, చెరువుల వివరాలు, భూగర్భ జలస్థితి, బావులు, బోరుల్లో నీటిమట్టం తదితర సమాచారం ఇచ్చారు. అలాగే వర్షపు నీటిని ఉయోగించుకుని భూగర్భజలాలను ఎలా పెంచుకోవచ్చో వివరించారు. ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన జలవనరుల సలహామండలి సమావేశంలో ఈ కరపత్రాలను మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు స్వయంగా ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు కరపత్రాలు అందజేయాలని, భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలని ఇంజినీర్లుకు సూచించారు. మండలాలకే చేరని కరపత్రాలు.. లక్షలు ఖర్చు చేసి ముద్రించిన కరపత్రాలు ఇరిగేషన్ ప్రాంగంణంలోని స్పెషల్ డివిజన్ కార్యాలయంలో పడి ఉన్నాయి. ఈ నెల రెండు నుంచి 11వ తేదీ వరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రేపటితో అవగాహన సదస్సులు ముగుస్తుండగా ఇప్పటి వరకు ఒక్క మండలానికి కానీ, గ్రామానికి కానీ ఈ కరపత్రాలు పంపలేదు. రైతులకు ఎంతో ఉపయోగపడే సమాచారానికి సంబంధించిన కరపత్రాలు కార్యాలయంలో పడి ఉన్నాయి. మండలాలు, గ్రామాల్లో రైతులు భూగర్భ జలాల గురించి సమాచారం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఇరిగేషన్ అధికారులను పరుగులు పెట్టిస్తానంటూ మంత్రి దేవినేని హడావుడి చేస్తుంటే.. మరో వైపు రైతులకు కావాల్సిన సమాచారంతో ముద్రించిన కరపత్రాలను వారికి అందించకుండా మొక్కుబడిగా అవగాహన సదస్సులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. తూతూ మంత్రంగా అవగాహన సదస్సులు.. మెట్ట ప్రాంతాల్లోని గ్రామాల్లో జరుగుతున్న నీరు- చెట్టు అవగాహన సదస్సులను అధికారులు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. రైతులు వ్యవసాయపనులకు వెళ్లే సమయానికి ఇరిగేషన్ అధికారులు గ్రామాల్లోకి చేరుకుంటున్నారు. కనీసం పదిమంది రైతులు లేకపోయినప్పటికీ హడావుడిగా సదస్సును నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల నిర్ణీత సమయం కంటే రెండు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. మైలవరం నియోజకవర్గంలో చంద్రాల, చండ్రగూడెం, పొందుగల తదితర గ్రామాల్లోనూ మొక్కుబడిగానే సదస్సులు జరిగాయి. కేవలం టీడీపీ నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించి సమావేశాన్ని ముగిస్తున్నారు. నీరు- చెట్టుపై రైతులకు అవగాహన కల్పించాలంటూ మంత్రి ఇచ్చిన ఆదేశాలు ఆయన సొంత జిల్లాలోనే ఏ మాత్రం అమలు కావడం లేదు. కొన్నిచోట్ల నీరు-చెట్టు కింద జరుగుతున్న సమావేశాలకు హజరవుతున్నప్పటికీ.. రైతులు రుణమాఫీ జరగలేదంటూ అధికారులను నిలదీస్తూ ఉండటంతో వారు అవాక్కవుతున్నారు. -
డిస్కంలకు బకాయిలు చెల్లించం
- మంత్రి సత్యేంద్ర జైన్ - బకాయిలను సబ్సిడీలతో సరిపెట్టాలని నిర్ణయం - విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకూడదని ఆదేశం న్యూఢిల్లీ: పవర్ సబ్సీడీలో భాగంగా డిస్కంలకు డబ్బులు చెల్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి సరఫరాలో డిస్కంలు చెల్లించాల్సిన మొత్తంతోనే సరిపెట్టాలని యోచిస్తోంది. బీఎస్‌ఈఎస్‌కు రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్), బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌లు చెల్లించాల్సిన బకాయిలను.. ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సీడీలతో సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. రెండు డిస్కంలు ఢిల్లీ ట్రాన్స్‌కో లివిటెడ్‌కు సుమారు రూ. 6 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీకి ట్రాన్స్‌కో తిక్రీకాలన్ ప్రాంత ంలో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన భూగర్భ సరఫరా వ్యవస్థ లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్‌లు చెల్లించాల్సిన బకాయిలపై సంప్రదించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగడం, తక్కువ మొత్తాలు వసూలు చేయడంతో బీఎస్ఈఎస్ రూ. 10 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన తెలిపారు. నెలలో 400 యూనిట్ల విద్యుత్ వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం 50 శాతం సబ్సీడీ ఇస్తుందని హామీనిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వేసవిలో విద్యుత్ కోతలపై డిస్కంలను మంత్రి హెచ్చరించారు. డిస్కంలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యుత్ సర ఫరాకు ఎలాంటి అంతరాయం ఉండకూడదని ఆయన చెప్పారు. దీనిని సమర్థిస్తూ డిస్కంలు లిఖితపూర్వకంగా సెక్రటరీకి తెలిపాయని పేర్కొన్నారు. ఢిల్లీ ట్రాన్స్‌కో తిక్రీకాలన్లో 400కేవీ సబ్‌స్టేషన్‌తో కలిసే 200కేవీ సబ్‌స్టేషన్‌ను కలపడానికి పీరాఘరీలో కొత్తగా 200కేవీ సామర్థ్యం గల భూగర్భ స్టేషన్‌ను నిర్మించింది. -
రూ.60కోట్ల నిధులు వెనక్కు
- మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం - 33 మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి మదనపల్లె: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రతియేటా మున్సిపల్ శాఖ నుంచి రెండు పర్యాయాలు 13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది మార్చి 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 110 మున్సిపాలిటీలకు, 13 కార్పొరేషన్లకు నిధులను మంజూరు చేసింది. 77 మున్సిపాల్టీలలో ఈ నిధులను ఏప్రిల్ 5వ తేదీలోగా తీసుకున్నారు. మిగిలిన 33 మున్సిపాల్టీల్లో రూ.60 కోట్లకు పైగా నిధులను తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ కారణంగా వెనక్కి వెళ్లిపోయాయి. ఇందులో రాయలసీమ రీజనల్ పరిధిలో 9 మున్సిపాలి టీలు ఉండగా మన జిల్లాలో మూడు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీలోపు ఆయా పట్టణాల్లోని ట్రెజరీ కార్యాలయంలో సంబంధిత ఉత్తర్వు కాపీలను సమర్పించి ఆ నిధులను మున్సిపల్ అకౌంట్‌కు బదలాయించి తీసుకోవాల్సి ఉంది. 33 మున్సిపాల్టీలలో అధికారుల పర్యవేక్షణ కొరవడం, చైర్మన్, పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఈ నిధులను సకాలంలో తీసుకోలేకపోయారు. ఆయా మున్సిపాలిటీల అధికారులు నిధులను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
బకాయిలొచ్చాయ్..
- ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ. 1.25కోట్లు విడుదల - ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు - పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు సిద్ధమవుతున్న అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఊరట లభించింది. గత వేసవిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనులకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి గత ఏడాదే ఈ నిధులు మంజూరయ్యాయి. అప్పట్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ రాష్ట్ర విభజన ప్రక్రియతో జిల్లాకు రావాల్సిన ఈ నిధులు నిలిచిపోయాయి. తాజాగా ఈ నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ప్రభుత్వం జిల్లా ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి రూ.1.25 కోట్లను కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. 2014-15 సంవత్సరంలో వేసవిలో తాగునీటి సమస్యలనెదుర్కొనేందుకు ఆర్డబ్ల్యూఎస్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ట్యాంకర్ల ద్వారా నీటి, ప్రైవేట్ బోర్లు అద్దెకు తీసుకోవడం, ప్రస్తుతమున్న బోర్లు ఫ్లషింగ్తో పాటు లోతు పెంచడం, బోరుమోటార్ల మరమ్మతులు తదితర పనుల్ని సీఆర్ఎఫ్ (విపత్తు నివారణ నిధి) కింద చేపట్టారు. దాదాపు రూ.1.21కోట్లతో పనులు పూర్తిచేశారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియతో ఈ ఫైలు అటకెక్కింది. ఒకవైపు పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు నిధులకోసం అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ ఈ నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం బకాయిల విడుదలకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా మంగళవారం రూ.1.25కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. గత బకాయిలు చెల్లించినప్పటికీ ఆర్డబ్ల్యూస్కు కొంత అదనపు నిధులు వలిసివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత అవసరాలకు వాటిని వినియోగించనున్నట్లు ఆ శాఖ ఇంజినీరు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు
- తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయాలి - మే 2న వీహెచ్ రాహుల్ రైతు సందేశ్ యాత్ర - డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం కరీంనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేల ముంచుతున్నాయని డీసీసీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయం ఆరోపించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులను ఆదుకోకపోవడంలో పాలకులు నిర్లక్ష్యం వీడాలన్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం పంటనష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించకపోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగ సభల మోజులో పడి రైతు సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. మల్లాపూర్ చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు రైతులకు వెంటనే బకారుులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయలేమని మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడడం బాధ్యతా రాహిత్యమన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయూలన్నారు. రైతులకు వెంటనే పరిహారం ఇవ్వకుంటే మే మొదటి వారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రైతులకు జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాజ్యసభ ఎంపీ వి.హన్మంతరావు మే 2న జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు గంభీరావుపేట నుంచి బయలుదేరి దమ్మన్నపేట, బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట, పదిర, వెంకటాపూర్, సిరిసిల్ల, నాంపెల్లి, కొదురుపాక , బావుపేటలో పంటలను పరిశీలిస్తూ జిల్లా కేంద్రానికి చేరుకుంటారని చెప్పారు. -
సిరిసిల్లలో టెక్స్టైల్స్ అడ్వైజరీ కమిటీ
- పదిహేను మంది సభ్యులుండే అవకాశం - మరో నాలుగు ప్రత్యేక కమిటీలు - నేత కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి - వస్త్ర పరిశ్రమపై సర్కారు ఆజమారుుషీ - కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం - ఆటుపోట్ల వస్త్ర పరిశ్రమకు ఊరట లభించేనా? సిరిసిల్ల : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తరచూ ఎదుర్కొంటున్న ఆటుపోట్లను అధిగమించేం దుకు టెక్స్టైల్స్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆత్మహత్యలు, ఆకలిచావులు, సమ్మెలు, సంక్షోభాల వస్త్ర పరిశ్రమను ఒడ్డుకు చేర్చేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతోంది. ప్రైవేటు యాజమాన్యం చేతుల్లో ఉన్న వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వ పరంగా అజమాయిషీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. సిరిల్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34వేల మరమగ్గాలు ఉండగా, 25వేల మంది కార్మిక కుటుంబాలు వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డాయి. అంతర్జాతీయంగా నూలు ధరలు పెరగడం, తగ్గడం వంటి సమస్యలతో వస్త్ర పరిశ్రమ తరచూ కుదేలవుతోంది. ఇక్కడ ఉత్పత్తయిన గుడ్డకు ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో వస్త్రోత్పత్తుల కొనుగోళ్లు ఆధారపడి ఉండడంతో ప్రభుత్వ పరంగా అజమాయిషీ లేదు. దీంతో వస్త్రం అమ్మక నిల్వలు పేరుకుపోయి పెట్టుబడులు లేక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లకోసారి కూలీ రేట్లు పెంచడం, పాలిస్టర్, కాటన్ గుడ్డ ఉత్పత్తిలో పన్నెండు గంటల పాటు శ్రమిస్తున్నా గిట్టుబాటు కూలీ రావడం లేదని కార్మికులు సమ్మె చేయడం పరిపాటిగా మారింది. ఈ సమస్యలన్నింటీపై సమగ్ర అధ్యయనం, సహేతుకమైన కూలీ రేట్ల నిర్ణయం, పని గంటల విధానం వంటి అంశాలపై అధ్యయనం చేసి అధికారులు, పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల నేతలు, జౌళి శాఖ అధికారులు సభ్యులుగా మొత్తం 15 మందితో అడ్వైజరీ కమిటీ నియమించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందులో నాలుగు కమిటీలు వేసి వస్త్ర పరిశ్రమ సంక్షోభాలను అధిగమించాలని భావిస్తోంది. కమిటీ ఏం చేస్తుందంటే... అడ్వరుజరీ కమిటీ పర్యవేక్షణలో వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తిస్తూ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన సహకారాన్ని నిర్దేశించనుంది. వస్త్రాన్ని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయని పక్షంలో స్థానికంగా నిల్వ చేసి యజమానులకు బ్యాంకు రుణాలు ఇప్పించడం, తక్కువ వడ్డీతో వస్త్ర పరిశ్రమ నడిచేలా చర్యలు తీసుకోవడం, కార్మికులకు నిరాటంకంగా ఉపాధి కల్పించడం వంటి చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేస్తూ వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది. సిరిసిల్లలో పన్నెండు గంటల పని విధానం అమలవుతుండగా, దాన్ని కుదించడం, అవసరమైన సమయాల్లో పెంచుకోవడం, కార్మికుల మనోభావాలను గుర్తించడం, ఆర్థిక ఇబ్బందులున్న కార్మిక కుటుంబాలకు ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం వంటివి కమిటీ పర్యవేక్షణలో జరుగుతారుు. అలాగే వస్త్ర పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, వారికి ఎదురయ్యే ఆరోగ్య పరమైన సమస్యలను అధిగమించడం, దురలవాట్లకు దూరంగా ఉంచేందుకు కౌన్సెలింగ్ నిర్వహించడం, పింఛన్లు, అంత్యోదయ కార్డులు, పని భద్రత కల్పించడం, సామూహిక బీమా సదుపాయం, కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు ఇవ్వడం, కార్మిక కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి ప్రత్యక్షంగా కార్మికుల సంక్షేమానికి పాటుపడడం ఈ కమిటీ లక్ష్యం. ఆత్మహత్యల నివారణపై దృష్టి సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం, కమ్యూనిటీ ఫెసిలిటేటర్ల సంఖ్యను పెంచి కార్మికుల స్థితిగతులపై నిఘా ఉంచడం వంటి చర్యలను కమిటీ చేపట్టనుంది. ప్రస్తుతం కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఉండగా, మరో ఎనిమిది మందిని నియమించి కార్మిక క్షేత్రంలో మానసిక వేదనకు గురయ్యే నేతన్నలను గుర్తించేందుకు కమిటీ పని చేస్తుంది. కూతురు పెళ్లి చేసేందుకు ఇబ్బందిపడేవారు, ఇతర ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారిని మహిళా సంఘాల సాయంతో గుర్తించడం వంటి మార్గాల్లో నేతన్నల ఆత్మహత్యలను నివారించానికి కృషి చేస్తుంది. కార్మిక వాడల్లో సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించడం, మద్యానికి బానిసైన వారిని ఆ వ్యసనం నుంచి దూరం చేయడం వంటి చర్యలను ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మొత్తంగా టెక్నికల్, నాన్‌టెక్నికల్ పారిశ్రామికవేత్తలు, జౌళి శాఖ అధికారులు, వస్త్ర వ్యాపారులు, కార్మిక నేతలతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి కోసం కమిషనర్‌ను నియమించి, పార్క్ నిర్వహణతో పాటు మౌలిక సదుపాయూలను మెరుగుపర్చడం మరో ప్రధానమైన ఉద్దేశం. -
మెట్రోకు ఓకే !
- అమరావతికి హైస్పీడ్ రైళ్లు! - శ్రీధరన్ డీపీఆర్‌ను ఆమోదించిన సర్కారు - త్వరలో డీఎంఆర్సీ ఆధ్వర్యంలో నిర్మాణం - వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేది 40 శాతం - జపాన్ కంపెనీ నుంచి 60 శాతం రుణం! సాక్షి, విజయవాడ బ్యూరో : ఇక నవ్యాంధ్ర రాజధానిలో హైస్పీడ్రైళ్లు పరుగులు తీయనున్నాయి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకోసం రాష్ట్రంలోని మెట్రోప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదించడంతో ప్రాజెక్టుకు మార్గం సుగుమమైంది. రూ.5,705 కోట్ల అంచ నా వ్యయమున్న ఈ ప్రాజెక్టును శ్రీధరన్ నేతృత్వంలోని డీఎంఆర్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) చేపట్టనుంది. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన 60 శాతం మొత్తాన్ని జపాన్‌కు చెందిన జైకా వంటి విదేశీ కంపెనీల నుంచి రుణం ద్వారా సేకరించాలని ప్ర భుత్వం భావిస్తోంది. భూసమీకరణకయ్యే రూ.769 కోట్ల ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో కొనుగోళ్లకయ్యే ఖర్చులో ఆరు శాతం మొత్తాన్ని సర్వీసు చార్జిగా తీసుకుని డీఎంఆర్సీ నిర్మాణాన్ని చేపడుతుంది. తొలి నుంచి అనుకున్నట్లుగానే ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు కారిడార్లను 25.76 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మెట్రో మెయిన్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి కంట్రోల్ రూమ్, బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకూ 12.76 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో పెనమలూ రు వరకూ ఒకటో కారిడార్ నిర్మితమవుతుంది. రెండవ కారిడార్‌ను బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్, అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డు అక్కడి నుంచి నిడమానూరు వరకూ 13 కిలోమీటర్ల మేర 13 స్టేషన్లతో నిర్మిస్తారు. భవిష్యత్తులో చేపట్టే రెండో దశ ప్రాజెక్టులో ఒక టో కారిడార్‌ను రాజధాని వరకూ పొడిగిస్తారు. ఇందుకోసం బస్టాండ్ సమీపంలో కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించి అక్కడి నుంచి కారిడార్‌ను తుళ్లూరు వరకూ పొడిగిస్తారు. రెండో దశలోనే రెండవ కారిడార్‌ను ఒకవైపు గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ, మరోవైపు గొల్లపూడి సెంటర్ వరకూ విస్తరిస్తారు. రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరలో రూపొందించనున్నారు. 25.76 కిలోమీటర్ల తొలి దశ మెట్రో ప్రాజెక్టును 2019కల్లా పూర్తి చేస్తామని ప్రారంభంలో గంటకు 40 నుంచి 50 వేల మంది ప్రయాణిస్తారని డీఎంఆర్సీ అంచనా వేసింది. 2019 నాటికి గంటకు 2.91 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉందని ట్రాఫిక్ సర్వే ద్వారా తేల్చారు. మెట్రో రైళ్లలో 5 కిలోమీటర్ల వరకూ టికెట్ ధర రూ.10, 5 నుంచి పది కిలోమీటర్లయితే రూ.20, పది కిలోమీటర్లు దాటితే రూ.30గా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ధరల ద్వారా ఏడు సంవత్సరాల్లో మెట్రో ప్రాజెక్టు ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతిని హైస్పీడ్ రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అనుసంధానించే విషయంపై ప్రభుత్వం డీఎంఆర్సీ సలహాను కోరింది. బెంగళూరు నుంచి అమరావతి, విశాఖపట్నం నుంచి అమరావతి మీదుగా తిరుపతి వరకూ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి శ్రీధరన్‌ను కోరారు. అలాగే విజయవాడ-మంగళగిరి-గుంటూరు-తెనాలి సర్క్యూట్‌ను మెట్రో నుంచి మినహాయించి ర్యాపిడ్ రైల్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించాలని శ్రీధరన్ డీపీఆర్‌లో ప్రతిపాదించారు. -
ఎన్నికల్లేవు !
- బీబీఎంపీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు - ఏకసభ్య పీఠం ఉత్తర్వులను రద్దు చేసిన చీఫ్ జస్టిస్ సాక్షి, బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుతానికి కాస్తంత మద్దతునిచ్చేలా హైకోర్టు తీర్పు లభించింది. మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య పీఠం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ రద్దు చేసింది. దీంతో ఇప్పటి వరకు ప్రతిపక్షాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రభుత్వానికి కాస్తంత ఊరట లభించినట్లైంది. వివరాలు....బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలు హైకోర్టును సైతం ఆశ్రయించాయి. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయమూర్తి బి.వి.నాగరత్న నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లైంది. ఎలాగైనా సరే ఈ ఆదేశాలను అడ్డుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన చేయాల్సి ఉందని, భౌగోళిక అసమానతలను నివారించడంతో పాటు బీబీఎంపీలో జరిగిన అనేక అక్రమాల పై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉందని, అందువల్ల హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించేందుకు 6నెలల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీలులో కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలు పై సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి డి.హెచ్.వఘేలా, న్యాయమూర్తి రామమోహన్ రెడ్డిలతో కూడిన డివిజనల్ బెంచ్ శుక్రవారం తన తీర్పును వెల్లడించింది. హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఎన్ని రోజుల్లోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలన్న విషయంపై ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరిన గడువు 6 నెలలు కాబట్టి మరో ఆరు నెలల వరకు బీబీఎంపీ ఎన్నికల నిర్వహణ గండం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. -
న్యాయ పోరాటానికి సమాయత్తం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోని జరీబు భూముల రైతులు మూకుమ్మడి న్యాయపోరాటానికి సమాయత్తం అవుతున్నారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా సోమ, మంగళవారాల్లో హైకోర్టులో పిటిషన్లు వేయనున్నారు. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి నిర్బంధంగా భూములు సేకరించారని వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని వాటిపై నిర్ణయాన్ని రెండు వారాల్లో వివరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టులో వివరించిన విషయం విధితమే. సీఆర్డీఏ నిబంధనలకు లోబడి భూ సమీకరణ చేశామని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో చేసిన వాదనలో వాస్తవం లేదని జరీబు రైతులంతా మూకుమ్మడిగా పిటిషన్లు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నియోజకవర్గానికి చేరుకుని గ్రామాల్లో పర్యటిస్తూ రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాజధాని గ్రామాల రైతుల న్యాయ పోరాటానికి ఆర్కే సహకరిస్తున్నారు. ఆందోళన చెందుతున్న రైతులకు ధైర్యం చెబుతూ సీఆర్డీఏ చట్టంపై అవగాహన కలిగిస్తున్నారు. అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతుల భూములను ప్రభుత్వం తీసుకునే అవకాశం లేదని, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరి రైతులు ఐక్యంగా న్యాయపోరాటానికి సిద్ధమైతే అందుకు పార్టీ పరంగా సహకరిస్తామని భరోసా ఇస్తున్నారు. గ్రామాల వారీగా కలుస్తున్న రైతులను గ్రూపులుగా చేసి వారితో కోర్టులో పిటిషన్లు వేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ న్యాయపోరాటంలో ఎక్కడా లోపాలు లేకుండా ఉండేందుకు భూ సమీకరణను మొదటి నుంచి తాము వ్యతిరేకించామని, అధికారులు, పాలకుల దందా వలనే తాము అంగీకారపత్రాలు ఇచ్చామంటూ రైతులతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు రిజిస్టర్డ్ లేఖ పంపే ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది రైతులు సోమ, మంగళవారాల్లో పటిషన్లు వేయనున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం.. శనివారం మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఆర్కే రైతులతో సమావేశం అయ్యారు. 9.2 ఫారాలతో పాటు 9.3 ఫారాలు ఇచ్చిన రైతులంతా కేవలం భయపడి మాత్రమే భూములు ఇచ్చారని వారందరికి న్యాయం జరిగేవరకు పోరాడతానన్నారు. తొలివిడత కోర్టును ఆశ్రయించిన 32 మంది రైతుల విషయంలో స్పష్టమైందన్నారు. మిగిలిన వారంతా కోర్టులో పిటిషన్ వేస్తే తొలి విడత కోర్టులో పిటిషన్ వేసిన రైతులకు వర్తించే న్యాయమే జరుగుతుందన్నారు. ఆదివారం బేతపూడి, నవులూరు, పెనుమాక, యర్రుపాలెం, ఉండవల్లి గ్రామాల్లో ఆర్కే పర్యటించనున్నారు. సోమవారం వరకు గ్రామాల్లో పర్యటించి న్యాయపరమైన పోరాటానికి రైతులను సిద్ధం చేస్తామని, మంగళవారం వారందరితో పిటిషన్లు వేయిస్తానని ఆర్కే సాక్షి ప్రతినిధికి వివరించారు. -
ప్రభుత్వం చెప్పేది ఎక్కువ..చేస్తున్నది తక్కువ!
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట వెస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేస్తున్నట్టు చెప్పుకుంటోందని, కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ పనిలో కూడా చిత్తశుద్ధి కన్పించటం లేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని పూర్తిగా మాట్లాడనీయకుండా చేస్తోందన్నారు. ఉగాది సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు శనివారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేందుకు లేవగానే స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఐదారుగురు మంత్రులకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారని, వారు వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ టీడీపీ నాయకులు జేబులు నింపుకునేందుకు చేపట్టిన ప్రాజెక్టని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా పట్టిసీమను చేపట్టడం దారుణమన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభించి సంతోషంగా ఉండాలనేది తన కోరికని చెప్పారు. ప్రభుత్వ తీరు రైతులను పట్టించుకునే విధంగా లేదన్నారు. పంటలకు మద్దతు ధరలు లేక రైతులకు పెట్టుబడి కూడా దక్కే అవకాశం కన్పించటం లేదన్నారు. మార్చి నెలాఖరు వరకు సాగునీరు అందిస్తే కొంతమేర ఉపశమనం లభిస్తుందన్నారు. కానీ వారం రోజులు ముందుగానే సాగునీరు ఆపేసి కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఇస్తుండటంతో రైతులు వేసిన వరి, మొక్కజొన్న, మిరప పంటలు ఎండిపోయే దశకు చేరాయన్నారు. ఏప్రిల్ పదో తేదీ వరకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గోపిరెడ్డిని కలిసినవారిలో ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ కార్యదర్శి పాలపర్తి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం
అరండల్‌పేట(గుంటూరు)/తాడికొండ: నూతన రాష్ట్రంలో తొలి ఉగాది వేడుకలకు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామం ముస్తాబైంది. రాజధాని ప్రాంతంలో తొలిసారిగా అనంతవరంలో అధికారికంగా ఉగాది పండుగను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు తగిన విధంగా తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా పండుగ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో తొలి ప్రధాన ఘట్టమైన భూ సమీకరణ ప్రభుత్వం ఆశించిన రీతిలో జరగడంతో అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని నాలుగు ఎకరాల స్థలంలో సీఎం, ప్రముఖుల వేదిక, పంచాంగ శ్రవణం వేదిక, సంప్రదాయనృత్యాలకు ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేశారు. వేలాది మంది ప్రజల సమక్షంలో ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఇదే ప్రథమం. ఉమ్మడి రాష్ట్రంలో ఇలా ప్రజల మధ్యలో ఉగాది వేడుకలను నిర్వహించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి రాక ... అనంతవరం గ్రామంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఆయన రాక కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ నిర్మించారు. సభాస్థలి చుట్టుపక్కల పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేసి తనిఖీలు చేస్తున్నారు. గ్రామంలో ఉగాది వేడుకలను తెలిపే ఫ్లెక్సీలు, రోడ్లవెంట బ్లీచింగ్ చల్లారు. అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేయటంతో గ్రామం పోలీసు వలయంగా మారింది. కొండపైకి రెండు బస్సులను ఏర్పాటు చేసి అందులో సీఎంతోపాటు కొందరు ప్రముఖలను వేంకటేశ్వరస్వామి దర్శనానికి తీసుకువెళ్లే ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 8 గంటలకు అనంతవరం చేరుకుని, కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. నాలుగుచోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మూడుచోట్ల ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. ఉగాది పురస్కారాలు... రైతులకు సన్మానం .... ఉగాది వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట వ్యక్తులను సత్కరించనుంది. ఇప్పటికే కొంతమందికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. అదే విధంగా ఉత్తమ రైతులతో పాటు, భూసమీకరణకు భూములు ఇచ్చిన రైతులను ముఖ్యమంత్రి సన్మానించనున్నట్లు అధికారులు ప్రకటించారు. సీఎంను రైతులు అభినందించే కార్యక్రమాన్నీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల బందోబస్తు విధుల్లో సుమారు 2500 మంది పోలీసులు పాల్గొంటున్నారు. ఏడుగురు ఏఎస్సీలు, 20 మంది డిఎస్పీలను నియమించారు. వేదిక సమీపంలో కూర్చునే ప్రజలు సెల్ఫోన్లు, అగ్గిపెట్టెలు లేకుండా రావాలని పోలీసులు ప్రకటించారు. సుమారు 50 వేల మంది ప్రజలు ఈ వేడుకలకు రానున్నట్టు అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. అందరికి మంచినీరు, ప్రసాదాలను అందించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకట పూర్ణచంద్రప్రసాద్ పంచాంగ పఠనం చేస్తారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా వేదిక ... గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఉగాది వేడుకల వేదికను అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 20 జానపద కళాబృందాలు ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. -
ప్రాజెక్టుల పరుగులు
భూ సేకరణ ఇలా (ఎకరాల్లో).. ప్రాజెక్టు సేకరించాల్సింది సేకరించింది నెట్టెంపాడు 26,542 21,657 రాజీవ్‌భీమా 17,254 15,591 కల్వకుర్తి 17,254 16,532 జూరాల 10,000 9,196 కోయిల్‌సాగర్ 7,230 6,476 సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో నాలుగు అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టులు, లింక్ కెనాల్స్ పనులు ముమ్మరం అవుతున్నాయి. ఎన్నో ఏళ్లనుంచి భూ సేకరణ పూర్తికాక నత్తనడకన సాగిన పనులు ఇప్పుడు జోరందుకుంటున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఆసరా చేసుకొని ప్రాజెక్టుల పనులు చకచకా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. జిల్లాలోని ఆరు ప్రధాన ప్రాజెక్టులకోసం 8,828 ఎకరాల భూమిని సేకరించే పని లో అధికార యంత్రాంగం నిమగ్నమైం ది. దీంతో వచ్చే ఏడాది పాలమూరు భూములు పచ్చగా మార్చేందుకు సర్కారు సన్నద్ధం చేస్తోంది. ఏళ్లు గడుస్తున్నా నత్తనడకనే... జిల్లా తలాపునుంచే రెండు ప్రధానమైన నదులు ప్రవహిస్తుంటాయి. కానీ వాటినుంచి జిల్లావాసులకు పెద్దగా ప్రయోజ నం చేకూరడం లేదు. దీంతో పొట్టకూటి కోసం జిల్లావాసులు ముంబై, దుబాయి తదితర ప్రాంతాలకు వలసలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు వలస కష్టాలను నివారించేందుకు ప్రాజెక్టుల రూపకల్పన చేశారు. రాజీవ్‌భీమా, నెట్టెం పాడు, కల్వకుర్తి (మహాత్మాగాంధీ ఎత్తిపోతల) తదితర వాటి ద్వారా జిల్లా కష్టాలను తీర్చాలని భావించారు. వైఎస్ఆర్ ఉన్నంత వరకు ఆయా ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టించారు. కేవలం నాలుగేళ్లలో ప్రధాన ప్రాజెక్టుల పనులు పూర్తయి ఇప్పటికే పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాల్సి ఉంది. కానీ వైఎస్ఆర్ మరణానంతరం ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తిగా నెమ్మదించాయి. ఐదేళ్లుగా పనులన్నీ పూర్తిగా స్తంభించి, ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తయి 2015 ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సిద్ధమవుతాయని భావించిన తరుణంలో ప్రాజెక్టుల భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం... కొరకరాని కొయ్యలా తయారై జిల్లాలో ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణ సాధ్యపడలేదు. దీంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం జిల్లాలో మూడు ప్రధాన భారీ ఎత్తిపోతల పథకాల్లో మట్టి పనులు, రిజర్వాయర్ పనులు, కాలువల తవ్వకాల పనులు పూర్తయ్యాయి. కీలకమైన డిస్ట్రిబ్యూటర్లు, తూములు, ప్రధాన సిమెంటు నిర్మాణ పనులకు అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఖరీఫ్ నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణ త్వరతగతిన పూర్తిచేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టుల లక్ష్యాలు ఇలా... జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులలో ఒకటైన నెట్టెంపాడు ద్వారా మొత్తం రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రా జెక్టు ద్వారా రెండు పంప్‌హౌస్‌లను ఉపయోగించి దీనికిందున్న ఏడు రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేసేలా ప్రణాళిక ర చించారు. అక్కడి నుంచి మొత్తం రెండు లక్షల ఎకరాల పొలానికి సాగునీరు అం దించనున్నారు. అలాగే రాజీవ్‌భీమా ఎత్తిపోతల ద్వారా కూడా మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా మక్తల్, దేవరకద్ర, తదితర నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మూడు లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందించనున్నారు. మొత్తం 25 టీఎంసీల నీటిని ఉపయోగించి నాలుగుచోట్ల బ్యాలెన్సింగ్ రిజార్వాయర్లు నిర్మించి సాగునీరు అందించనున్నారు. మొదటి పంపు ద్వారా మొన్నటి ఖరీఫ్ పంటకు నీటిని విడుదల చేశారు. రెండో లిఫ్టులో మొత్తం ప్రాజెక్టు లక్ష్యం ఉన్నందున మిగతా పనులను వేగవంతం చేసి వచ్చే ఖరీఫ్ నాటికి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే ప్రస్తుతం సాగునీరు అందిస్తోన్న జూరాల, కోయిల్‌సాగర్ ఆయకట్టును కూడా పూర్తిగా పనులు చేపట్టి చివరి ఆయకట్టుకు నీరందించాలని భావిస్తోంది. ఇలా మొత్తం మీద వచ్చే ఖరీఫ్ నాటికి నెట్టెంపాడు ద్వారా 2లక్షల ఎకరాలు, భీమా ద్వారా 2లక్షల ఎకరాలకు, కల్వకుర్తి ద్వారా 3.30లక్షల ఎకరాలలో సాగునీరు కనీసం 80 శాతం మేరకైనా అందించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. -
కొత్త జీఓలతో ఆడుకుంటున్న ప్రభుత్వం
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి సుండుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీఓలతో ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకుంటోందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మడితాడు ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎస్టీయూ మండలశాఖ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎస్టీయూ రాయచోటి రీజినల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల వేళలు పెంచడంతో ఉపాధ్యాయులకు అదనపు భారం పెరుగడంతోపాటు, మానసిక వత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. 3 కిలో మీటర్లలోపు పాఠశాలలను ఒకేచోట ఏర్పాటు చేసి క్లస్టర్ పాఠశాలగా పెట్టాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనను ఎస్టీయూ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రభుత్వ కొత్త విధానాల వల్ల ఉపాధ్యాయ పోస్టులకు గండి పడడమే కాక ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఉర్దూ, డిగ్రీ కళాశాలను తప్పకుండా ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్టీయూ సర్వసభ్య సమావేశంలో మండల స్థాయి ఆర్థిక, కార్యకర్తల రిపోర్టు తప్పనిసరిగా చూపించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ మెడలు వంచాలంటే ఉపాధ్యాయ సంఘాలన్ని కలిసి పోరాటం చేయాలన్నారు. ఉపాధ్యాయులు కూడా తమ బాధ్యతను గుర్తుంచుకొని నిరుపేదల విద్యాభివృద్ధికి నిత్యం కృషి చేయాలన్నారు. అనంతరం సుండుపల్లెనుంచి రాయచోటికి బదిలీ అయిన ఎంఈఓ రామకృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. అలాగే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులైన సురేందర్ రెడ్డి, సత్యరాజ్, హాజిరా, రవీంద్రనాయక్‌తో పాటు మండలంలో ఎస్టీయూ స్థాపనకు కృషి చేసిన విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్బ రామరాజు, సదాశివరాజును సన్మానించారు. సమావేశంలో ఎస్టీయూ ఉర్దూ వింగ్ రాష్ట్ర కన్వీనర్ ఇలియాజ్, రాష్ట్ర మాజీ సంయుక్త అధ్యక్షులు పిసి రెడ్డన్న, సంయుక్త అధ్యక్షులు సురేష్ బాబు, రాష్ట్ర నాయకులు సజ్జల రమణారెడ్డి, లెక్కల జమాల్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, ఆర్థిక కార్యదర్శి రామలింగరాజు, సంయుక్త అధ్యక్షులు హైదర్‌అలి, ప్రధానోపాధ్యాయులు నాగమునిరెడ్డి, చిన్నప్పరెడ్డి, చక్రే నాయక్, పాల కొండమ్మ, రవీంద్ర నాయక్, ఆరిఫుల్లా, రాయచోటి రీజనల్ ఎస్టీయూ సభ్యులు పాల్గొన్నారు. -
అదనపు వాహనం ఉంటే వడ్డింపే
నంద్యాలటౌన్: ఆధార్‌కార్డు ఆధారంతో వాహనాల యజమానులపై అదనపు పన్ను వడ్డించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వాహనదారుల నుంచచి ఆధార్‌కార్డులను సేకరించి ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసేందుకు నంద్యాల పట్టణాన్ని రాష్ట్రస్థాయిలో పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అయితే ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రం రావడంతో మెప్మా ఎండీ అనిత రాజేంద్రన్, రవాణా శాఖ అధికారులు మంగళవారం పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శాఖలోని కార్యకలాపాలను ఆధార్‌కు అనుసంధానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాహనాల యజమానుల నుంచి అదనపు పన్నును వసూలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక వ్యక్తి ఒకే వాహనాన్ని కలిగి ఉండాలి. అదనంగా మరో బైక్, కారు, ఇతర వాహనాలు ఉంటే పన్నులను అదనంగా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఆన్లైన్లో వాహనాల యజమానులకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు లేవు. దీంతో ఆన్లైన్లో ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. వాహన దారుడు రాష్ట్రంలో ఎక్కడైనా మరో వాహనాన్ని కొంటే ఆధార్ నంబర్ ఆధారంగా మొదటి వాహనం, అతని ఆర్థిక పరిస్థితి ఇతర వివరాలు నిమిషాల్లో అందుబాటులోకి వస్తాయి. అదనంగా ఉన్న వాహనంపై అధిక పన్నును వసూలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. స్పందన అంతంత మాత్రం... రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల వివరాలను ఆన్లైన్లో ఆధార్ వివరాలను అనుసంధానం చేసే విధానాన్ని నంద్యాల నుంచి శ్రీకారం చుట్టారు. నంద్యాలను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, మెప్మా, రవాణా శాఖ ఈనెల 10వ తేదీ నుంచి ఇంటింటి సర్వేను ప్రారంభించింది. పట్టణంలోని 84 మంది సీఆర్పీలు, రవాణా శాఖ సిబ్బంది ఇంటింటి సర్వేను ప్రారంభించారు. వాహనాల యజమానుల ఆధార్ వివరాలను అందజేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వాహనం చోరీకి గురైనప్పుడు క్షణాల్లో సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ సమాచారం అందుతుందని, భద్రత ఉంటుందని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఆధార్ కార్డు ఇవ్వడంతో ఇటీవల దాదాపు 1000కి పైగా పింఛన్లు రద్దయ్యాయి. దీంతో ఆధార్ కార్డు ఇవ్వడానికి స్థానికులు ఆసక్తి చూపలేదు. వారం రోజుల్లో 50వేలకు పైగా వాహనాల యజమానుల ఆధార్ కార్డు వివరాలను సేకరించాలని నిర్ణయించగా కేవలం 6025 మంది వాహన దారుల వివరాలు మాత్రమే అందాయి. దీంతో ప్రజల నుంచి కనీసం 15 శాతం కూడాస్పందన రాకపోవడంతో అధికారులు మరో వారం రోజులు గడువు పొడిగించారు. అందరూ ఆధార్ ఇవ్వాలి ఆధార్‌కార్డుల అనుసంధానం గురించి మెప్మా మేనేజింగ్ డెరైక్డర్ అనితారాజేంద్రన్ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ చాంబర్లో సమావేశమయ్యారు. ఆధార్‌కార్డుల సేకరణలో ఎదురైన సమస్యల గురించి సీఆర్పీలను అడిగి తెలుసుకున్నారు. వాహన దారుల యజమానులు, వారి కుటుంబ సభ్యులు వివరాలను ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీఆర్పీలు చెప్పారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వాహన యజమాని తప్పని సరిగా ఆధార్ వివరాలను అందజేయాలని కోరారు. ఇంటింటికి సీఆర్పీలు వచ్చినప్పుడు ఆధార్ వివరాలను అందజేయవచ్చని, లేకపోతే మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వెబ్సైట్లో కూడా వివరాలను అందజేయవచ్చని చెప్పారు. ఆధార్ కార్డు ఇవ్వడం వలన వాహనం చోరీకి గురైతే సరైన సమాచారం అందుతుందని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, కమిషనర్ రామచంద్రారెడ్డి, ఐవీ స్పెషలిస్ట్ ఆదినారాయణ, డీసీఓ శివలింగమయ్య, ఆర్టీఓ రాజబాబు, టౌన్ ప్రాజెక్టు అధికారి సతీష్, సీఆర్పీలు, రవాణా శాఖ అధికారులు హాజరయ్యారు. -
అర్హులకు ‘ఆసరా’ ఇవ్వడంలేదు
కమాన్‌చౌరస్తా : అర్హులందరికీ ఆసరా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. పేదరికాన్ని అర్హతగా తీసుకుని పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా.. రకరకాల కారణాలతో ఉన్నవారి పింఛన్లు తొలగించేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా గ్రామాల్లో అందరికీ రూ.1.5 లక్షల లోపు ఆదాయం ఉంటుందని వారిని అర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు లక్ష మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్లో గృహాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించిందని, ఒక్కో ఇంటికి రూ.3.5 లక్షలు ఇస్తే నియోజకవర్గానికి 240 నుంచి 245 ఇళ్లు నిర్మించే అవకాశం ఉందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం 11 శాతం జనాభానే సూచించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మన్ కుమార్, నాయకులు అంజన్‌కుమార్, నిఖిల్ చక్రవర్తి, పోతారపు సురేందర్, తదితరులు పాల్గొన్నారు. -
బాధిత రైతులకు 'ఉపాధి' వరం
సాక్షి, విశాఖపట్నం: హూదూద్ విధ్వంసంతో దెబ్బ తిన్న రైతులకు ఉపాధి హామీ ద్వారా సాంత్వన కలగనుంది. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఉపయోగపడే పనులు గుర్తించారు. పొలాల్లో పేరుకుపోయిన ఇసుకమేటలు తొలగించడం, ధ్వంసమైన పొలం గట్లు, వరదగట్లు పటిష్టపరచడం, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ ఛానల్స్‌లో పేరుకుపోయిన డీసిల్టింగ్ తొలగించడం వంటి పనులను ఉపాధి కూలీల ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. అలాగే పొలం గట్లు, తోటల్లో నేలకొరిగిన కొబ్బరి, మామిడి, జీడిమామిడి, సపోటా, సిల్వర్‌ఓక్ తదితర చె ట్లు తొలగింపు వంటి పనులను కూడా ఉపాధి హామీలో చేర్చారు. ఇందుకోసం రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు జిల్లాలకు రూ.50కోట్లు కేటాయించింది. తొలగింపునకు ఒక్కో చెట్టుకు ఒక్కో ధరను నిర్ణయించారు. మామిడి/జీడిమామిడి చెట్టుకు రూ.250లు, కొబ్బరి/సిల్వర్ ఓక్ చెట్లకు రూ.200లు, ఇతర పండ్ల చెట్లకు రూ.150 చొప్పున చెల్లించనున్నారు. ఐదేళ్ల వయస్సు పైబడిన చెట్లకు మాత్రమే ఈసొమ్మును చెలిలంచనున్నారు. ఇలా తొలగించిన చెట్లను రైతులే విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా రైతులు కోరుకున్న పండ్ల చెట్లను హార్టికల్చర్ ప్రొగ్రామ్ ద్వారా ఉపాధి హామీ పథకం కింద వారు కోరుకున్న ప్రాంతాల్లో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ పూర్తి కాగానే చెట్ల తొలగింపునకు అంచనాలు రూపొందిస్తారు. ఆతర్వాత రైతుల సమ్మతితో కూలీలద్వారా వారు కోరుకున్న మొక్కలను నాటనున్నారు. ఇందుకోసం అవసరమైన మొక్కలను ఉద్యానశాఖ సరఫరా చేయనుంది. ఈ పనుల కింద ఉపాధి కూలీలకు పెద్ద ఎత్తున పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. -
బంగారు బాటలు
సాక్షి, మహబూబ్‌నగర్ జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టనుంది. వాహనదారులు ఇక హాయిగా ప్రయాణం చేసుకునే వీలు కలగనుంది. గుంతలతో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కూడా అడ్డుకట్టపడినట్టే. రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించడంతో జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమైంది. సీఎం ప్రకటన రావడంతోనే రోడ్ల పరిస్థితిపై జిల్లా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్‌శాఖల ఆధ్వర్యంలో 13,558 కి.మీ పొడువు రహదారులున్నాయి. ఆర్ అండ్‌బీ పరిధిలో మహబూబ్‌నగర్, వనపర్తి, కల్వకుర్తి డివిజన్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్,నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలో 1154.76 కి.మీలను ఆర్అండ్బీ పర్యవేక్షిస్తోంది. అలాగే వనపర్తి డివి జన్‌లోని నాగర్‌కర్నూల్, వనపర్తి, కల్వకుర్తి, అలంపూ ర్, గద్వాల నియోజకవర్గాల పరిధిలో 1225.809 కి.మీ, కల్వకుర్తి డివిజన్లోని కల్వకుర్తి, షాద్‌నగర్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలో 779. 951 కి.మీ పొడవున్నా యి. అదే మాది రిగా పంచాయతీరాజ్ పరిధిలో అన్ని డివి జన్లలోకలిపి 10,500 కి.మీ మేర మార్గాలున్నాయి. అయితే గత పాల కుల వైఫల్యం, స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధుల పాలన లేకపోవడం చేత రహదారులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏళ్ల తరబడి వీటిని పట్టించుకోకపోవడంతో చిన్న పాటి వర్షానికి చెరువులను తలపిస్తున్నాయి. గ్రామాల లింక్ రోడ్లు, మండల కేంద్రాల నుం చి జిల్లా కేంద్రానికి ఉన్న దారులన్నీ దారుణంగా తయారయ్యాయి. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నాలుగులేన్ల రహదారులు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండడంతో పాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకే పెద్దపీట ఇటీవల రహదారుల పరిస్థితిపై సమీక్షించిన సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నియమనిబంధనలు రూపొందించి, 15 రోజుల్లోగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. అయితే జిల్లాలోని రహదారులకు సంబంధించి గతంలో నిర్వహించిన ‘మన ఊరు-మన ప్రణాళిక’లో వచ్చిన పనులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధులకు పెద్దపీట వేసి, వారిచ్చే పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మన ప్రణాళికలో భాగంగా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో మొత్తం దాదాపు 3,500 కి.మీ పొడువుకు సంబంధించి వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు పెద్దఎత్తున రానున్న నిధులను ప్రణాళిక పనులకు ప్రాధాన్యత క్రమంలో త్వరతగతిన చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
కోలార్ కలెక్టర్ బదిలీ
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపినందుకు బహుమానం ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్ కోలార్ ప్రజల నిరసన నేడు జిల్లా బంద్ కోలారు : అవినీతికి తలొంచకుండా, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీని కానుకగా అందజేసింది. ఇసుక మాఫియాతో పాటు స్థానిక నేతల ఒత్తిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. కోలారు జిల్లాలోని ఇసుక మాఫియాను అరికట్టడంలో తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్లిన కలెక్టర్ డీకే రవిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ రవిని రాష్ట్ర వాణిజ్య పన్నుల అదనపు కమిషనర్‌గా నియమించింది. బీబీఎంపీలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి కేవీ తిలక్చంద్రను కోలారు కలెక్టర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో కోలారు సీఈవో వినోత్ ప్రియను బదిలీ చేసి సకాల అదనపు డెరైక్టర్‌గా నియమించింది. కోలారు సీఈవోగా మంజునాథ్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పంతం నెగ్గించుకున్న ప్రజాప్రతినిధులు కలెక్టర్ రవి తమకు కొరకాని కొయ్యగా తయారయ్యాడని భావించిన కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు కలెక్టర్‌ను బదిలీ చేయించడానికి కంకణం కట్టుకుని ఎట్టకేలకు విజయం సాధించారు. ఇసుక మాఫియాను అరిక ట్టడంతో పాటు భూ మాఫియాపై ఉక్కుపాదం మోపి ఆక్రమణలు తొలగిస్తూ వస్తున్న కలెక్టర్ చర్యలు కొంతమందికి నచ్చలేదు. కలెక్టర్ వద్ద తమ మాట చెల్లుబాటు కాదని భావించిన నాయకులు ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు కొంతమంది ముఖ్యమంత్రి వద్ద కలెక్టర్‌ను బదిలీ చేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి సఫలమయ్యారు. గత కొద్ది రోజుల క్రితమే కోలారు కలెక్టర్‌ను బదిలీ చేసేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మాటలు వ్యర్థ మయ్యాయి. కలెక్టర్‌ను జిల్లా నుంచి బదిలీ చేయ కూడదని ప్రజా సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనకు విలువ లేకుండా పోయింది. అవినీతికి తావు లేకుండా.... కోలారు కలెక్టర్‌గా గత సంవత్సరం ఆగస్టు నెలలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే కలెక్టర్ రవి అవినీతికి తావులేని పారదర్శక మైన పాలనను అందించేందుకు కృషి చేశారు. జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. కలెక్టర్ తీసుకున్న చర్యల వల్ల జిల్లాలో పూర్తిగా ఇసుక అక్రమ రవాణా నిలిచి పోయింది. దీన్ని జీర్ణించుకోలేని ఇసుక మాఫియా అప్పుడే కలెక్టర్‌ను బదిలీ చేయించడానికి ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. పాలనను ప్రజలకు చేరువ చేయలనే సదుద్దేశంతో కలెక్టర్ రవి జిల్లాలో రెవెన్యూ అదాలత్ , పోడి అదాలత్ తదితర వినూత్న కార్యక్రమాలను ప్రారంభించి రైతుల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించారు. కలెక్టర్ ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లా ప్రజలను ఎంతగానో ఆకర్షించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రశంసలు అందాయి. భూమాఫియాపై కన్నెర్ర : ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న భూ మాఫియాపై కన్నెర్ర చేసిన కలెక్టర్ రవి ఆక్రమణల స్వాధీనానికి నడుం బిగించారు. ఇదే కలెక్టర్ బదిలీకి కారణ మయిందని చెప్పవచ్చు. బంగారు పేటలో కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని గోల్ఫ్‌కోర్సును నిర్మించిందని ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేశారు. ఇది సహించని భూ మాఫియాదారులు తమ ప్రభావాన్ని చూపించారు. ప్రజా ప్రతి నిధులపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చి కలెక్టర్‌ను బదిలీ చేయించారు. కలెక్టర్‌ను బదిలీ చేస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని భావించిన ప్రభుత్వం కలెక్టరే బదిలీ కోరుతూ ఉత్తరం రాశారని ప్రచారం చేయించడం గమనార్హం. నేడు కోలార్ జిల్లా బంద్ జిల్లా కలెక్టర్ డీ కే రవిని ప్రభుత్వం బదిలీ చేయడాన్ని నిరసిస్తూ వివిధ సంఘాలకు చెందిన కార్యకర్తలు బుధవారం సాయంత్రం నగరంలోని బస్టాండు సర్కల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్ బదిలీకి కారకులైన ప్రజా ప్రతినిధులను దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వం వెంటనే కలెక్టర్ బదిలీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళనను తీవ్ర తరం చేస్తామన్నారు. కలెక్టర్ బదిలీని నిరసిస్తూ అన్ని సంఘటనలు కలిసి గురువారం జిల్లా బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు, సీపీఐ, సీపీఎం, కేపీఆర్‌ఎస్, రైతు సంఘం, రక్షణా వేదిక, వివిధ సంఘటనలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు . -
పోలీస్ బాస్‌లు మారారు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పోలీస్ శాఖలో భారీ మార్పులు జరిగాయి. వరంగల్ అర్బన్, రూరల్ ఎస్పీలు, వరంగల్ రేంజ్ ఐజీ, డీఐజీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లో వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. తాత్కాలికంగా కూడా ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. వరంగల్ రూరల్ ఎస్పీగా అంబర్ కిశోర్‌ఝా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం మన జిల్లాలోనే ఓఎస్డీగా పనిచేస్తున్నారు. రూరల్ ఎస్పీగా ఉన్న ఎల్‌కేవీ.రంగారావు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. వరంగల్ రేంజ్ డీఐజీగా బి.మల్లారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా ఉన్నారు. వరంగల్ రేంజ్ డీఐజీగా ఉన్న ఎం.కాంతారావు డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. వరంగల్ రేంజ్ ఐజీగా వి.నవీన్‌చంద్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న రవి గుప్తాను హోంగార్డ్స్ ఐజీగా బదిలీ చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల మార్పుల నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో డీఎస్సీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీలు జరగనున్నాయని తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఈ పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
ఈ-పంచాయతీకి ఇక్కట్లు
కరీంనగర్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ-పంచాయతీలకు బాలారిష్టాలు దాటడం లేదు. గ్రామపంచాయతీల్లో పారదర్శకత, వేగవంత మైన పాలనను అందించేందుకు టీఆర్ఎస్ సర్కార్ ఈ-పంచాయతీలకు శ్రీకారం చుట్టింది. తొలివిడతలో 319 ఈ-పంచాయతీలు లక్ష్యం నిర్ణయించగా 106 జీపీలకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించింది. ఈ-పంచాయతీల కోసం జిల్లాలోని 319 గ్రామపంచాయతీలకు, 57 మండల పరిషత్ కార్యాలయాల్లో, మూడు డీఎల్పీ కార్యాలయాల్లో, రెండు డీపీవో కార్యాలయంలో, ఒకటి సీఈవో కార్యాలయంలో కంప్యూటర్లు అమర్చారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఆయా పంచాయతీలకు మోడెం పంపించారు. 383 కంప్యూటర్లకు గాను 381 మోడెమ్స్ జిల్లాకు చేరాయి. ఇప్పటి వరకు 55 గ్రామ పంచాయతీలు, 40 మండల పరిషత్‌లు, రెండు డీఎల్పీవో కార్యాలయాల్లో, ఒకటి డీపీవో కార్యాలయంలో, ఒకటి సీఈవో కార్యాలయంలో మోడమ్స్‌ను ఇన్స్టాల్ చేశారు. ఇంటర్నెట్ పెండింగ్ ఈ-పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం అడ్డంకిగా మారింది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్స్, సిగ్నల్స్ లేకపోవడంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యపడడం లేదు. ఇంటర్నెట్ లేక ఈ ప్రయత్నం వృథా అవుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 160కు మాత్రమే కనెక్షన్.. జిల్లాకు తొలివిడతలో 319 గ్రామపంచాయతీలను ఈ-పంచాయతీలుగా గుర్తించినా.. అందులో 160 పంచాయతీలకు మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. మిగతా 221 గ్రామపంచాయతీలకు బీఎస్ఎన్ఎల్ టవర్స్ లేకపోవడంతో కంప్యూటర్లు అందజేసి చేతులు దులుపుకున్నారు. మొదటి విడతలోనే దాదాపు 60 శాతం గ్రామపంచాయతీలు ఇంటర్నెట్ సౌకర్యానికి నోచుకోకపోయూరుు. దీంతో 1207 గ్రామపంచాయతీల్లో ఎన్ని ఈ-పంచాయతీలకు దూరమవుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ప్రత్యామ్నాయ మార్గాలపై నజర్ ఈ-పంచాయతీలుగా మార్చే క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. చాలాచోట్ల బీఎస్ఎన్ఎల్ టవర్స్, సిగ్నల్స్ లేకపోవడంతో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి గ్రామపంచాయతీలను గుర్తించి ఇతర అవకాశాలను తెలియజేయాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల సేవలు తీసుకోవడం, డాటా కార్డులు తదితర అవకాశాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. - కుమారస్వామి, డీపీవో 221 గ్రామపంచాయతీలకు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అందుబాటులో లేకపోవడాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. బీఎస్ఎన్ఎల్ అధికారులతో సంప్రదించి కొత్త లైన్ వేసైనా పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో కొత్త లైన్ వేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
అసెంబ్లీ సమావేశాలు నడిపేందుకు ప్రభుత్వం వెనకడుగు....
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాటిని చర్చించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి మండిపడ్డారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సైతం వెనకడుగు వేస్తోందని విమర్శించారు. హాసనలోని హాసనాంబ దేవాలయాన్ని శుక్రవారం సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గృహనిర్మాణ సహకార సంఘానికి చెందిన ఇళ్ల పంపిణీలో తాను అక్రమాలకు పాల్పడ్డానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారని, ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపితే ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందని, స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై విమర్శలు చేస్తుండడమే ఇందుకు ఉదాహరణ అని కుమారస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నభాగ్య పధకం పూర్తిగా విఫలమైందని, అన్నభాగ్య పథకం పూర్తిగా ధనవంతులు, దళారులకు ప్రయోజనాలు చేకూరుస్తోందని విమర్శించారు. ఇక రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. డి.కె.శివకుమార్ అద్దాల మేడలో కూర్చున్నారని, అక్రమంగా ఆస్తులను సంపాదించడంతో పాటు ఆ సంపదతో మంత్రి పదవిని కూడా పొందారని మండిపడ్డారు. అదే సందర్భంలో దేవెగౌడ కుటుంబం అద్దాల మేడలో లేదని, వీధుల్లో సామాన్య ప్రజలతోనే వారి సమస్యలను చర్చిస్తూ ఉందని అన్నారు. జేడీఎస్‌లో 11 మంది సభ్యులతో ఒక కోర్ కమిటీని రూపొందించామని, మరో రెండు మూడు రోజుల్లో కోర్ కమిటీలోని సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. కోర్ కమిటీని ప్రకటించిన అనంతరం జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం జేడీఎస్ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవి కోసం ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. అందువల్ల త్వరలోనే జేడీఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడతో కలిసి సమావేశాన్ని నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు చెప్పారు. -
ఆటోలకు కొత్త రూల్స్
టాంపర్ ఫ్రూఫ్ డిజిటల్ మీటర్ ప్రింటెడ్ రిసిప్ట్... అలారమ్ స్విచ్ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం అంటున్న అధికారులు ఆర్థిక భారమని వాపోతున్న ఆటోడ్రైవర్లు సాక్షి,బెంగళూరు : ఆటో ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నూతన నిబంధనలను అమలు చేయనుంది. వీటి వల్ల ఇక మీటరు పై అదనంగా చెల్లించడం... మృగాళ్ల లాంటి ఆటో డ్రైవర్ల బారి నుంచి మహిళలను రక్షించడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నూతన నిబంధనలు తమపై ఆర్థిక భారాన్ని మోపుతాయని ఆటోడ్రైవర్ల సంఘం ప్రతినిధులు వాపోతున్నారు. ప్రస్తుతం నగరంలో దాదాపు లక్ష ఆటోలు ఉన్నాయి. కొంత మంది ఆటోడ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా మీటర్లను ట్యాంపర్ చేసి అదనపు సొమ్మును ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మీటరుపై అదనపు సొమ్మును డిమాండ్ చేయడం, మీటరు ప్రకారం ప్రయాణికుడు కోరిన చోటుకు వెళ్లడానికి నిరాకరించడం, ఆటోలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడడం వంటివి నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఇందుకు సంబంధించిన 10,777 కేసులు నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లలో నమోదయ్యాయి. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో అనేక కేసులు వీగిపోయాయి. రెండు కేసుల్లో మాత్రమే (మీటర్‌ను ట్యాంపర్ చేసిన విషయమై) కోర్టులో విచారణ జరుగుతోంది. చాలా ఏళ్ల నుంచి ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం రాష్ట్ర తూనికలు కొలతల శాఖ.... పోలీసుశాఖతో కలిసి రూపొందించిన కొత్త నిబంధనలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అగీకరించినట్లు విశ్వనీయ సమాచారం. టాంపర్‌ప్రూఫ్ డిజిటల్ మీటర్... నూతన నిబంధనల ప్రకారం మొదట ప్రస్తుతం ఉన్న డిజిటల్ మీటర్‌ను టాంపర్‌ప్రూఫ్ డిజిటల్ మీటరుగా ఆధునీకరిస్తారు. లేదా నూతన టాంపర్‌ప్రూఫ్ డిజిటల్ మీటర్‌ను ఆటోల్లో అమరుస్తారు. అదేవిధంగా ప్రయాణికుడు చెల్లిం చిన సొమ్ముకు ప్రింటెడ్ రిసిప్ట్ నూతన డిజిటల్ మీటరు ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రిసిప్ట్‌లో ఆటోనంబర్, డ్రైవర్ పేరుతోపాటు జీపీఎస్ విధానం వల్ల ప్రయాణించిన మార్గం కూడా ప్రింట్ అయ్యి ఉంటుంది. దీని వల్ల ఆటోడ్రైవర్లలో జవాబుతారీ తనం పెరుగుతుంది. అంతేకాకుండా అదనపు సొమ్ము వసూలు చేయడం, దగ్గరి గమ్యస్థానానికి కూడా వివిధ చోట్ల తిప్పి ఎక్కువ సొమ్మురాబట్టడం తదితర విషయాలపై నమోదైన కేసుల్లో ప్రింటెడ్ రిసిప్ట్‌ను సాక్ష్యంగా చూపెట్టడం వల్ల ప్రయాణికుడికి మేలుజరుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి ప్రింటెండ్ రిసిప్ట్ విధానం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాపకామ్ దుకాణాల్లో ఉండడం గమనార్హం. అదేవిధంగా మహిళలు ఆటోలో ప్రయాణించేటప్పుడు ప్రమాదం ఎదురైన వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌తోపాటు చుట్టపక్కల ఉన్నవారికి తెలియజేయడానికి వీలుగా ఎమర్జెన్సీ అలారంను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఏర్పాటు ఏటీఎంలలో ఉండడం తెలిసిందే. ఈ నూతన నిబంధనలను మొదట బెంగళూరులో అమలు చేసి తర్వాత రాష్ట్రంలోని అన్ని నగరాలకు విస్తరించాలనేది ప్రభుత్వ భావన. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆటోలు ఉన్న స్థితిని పరిగణనలోకి తీసుకుంటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరుచుకోవడానికి ఒక్కొక్క ఆటోకు రూ.10 వేలు నుంచి రూ.15 వేలు ఖర్చవుతుందని అధికారులే చెబుతున్నారు. ఇంతటి ఖర్చును మధ్యతరగతికి చెందిన ఆటోడ్రైవర్లు ఎలా భరిస్తారనేది ప్రశ్న. ఈ విషయమై పీస్ఆటో వ్యవస్థాపకుడు అనీల్శెట్టి మాట్లాడుతూ... ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా దీని వల్ల అయినా ఒక వర్గంపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. అందువల్ల ఆటోల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరించడం కాని లేదా సబ్సిడీ ప్రకటించడం గాని చేయాలని చేయాలి..’ అని విజ్ఞప్తి చేశారు. -
కొత్త కార్డులకు బియ్యం వచ్చేనా..?
సాక్షి, మహబూబ్‌నగర్ : నవంబర్ నుంచి కొత్త రేషన్‌కార్డులకు కొత్త పంథాలో బియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున.. గరిష్టంగా 20 కేజీలకు మించకుండా ఇచ్చేవారు. కానీ కొత్త కార్డులపై ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల చొప్పున కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బియ్యం కోటా పెరిగే అవకాశముంది. అయితే మరోవైపు కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (సీఎంఆర్) సరఫరా చేయడంలో మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడువు మీద గడువులు విధించినా వారి నుంచి స్పందన ఉండడం లేదు. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించినా పట్టింపులు లేవు. చివరాఖరుగా ప్రభుత్వమే అ క్టోబర్ 30నాటికి బియ్యం అందజేయాలని తా జాగా గడువు విధించింది. ఈ గడువు కూడా సమీపిస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త కార్డులకు బియ్యం సరఫరా, మిల్ల ర్ల నుంచి రాబట్టడంపై పౌరసరఫరాల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. మిల్లర్ల ఇష్టారాజ్యం... ఈ ఏడాది మార్చిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలోని మిహ ళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగో లు చేశారు. పౌరసరఫరాల శాఖలో తగిన సిబ్బంది లేరని, ఇతరత్రా కారణాల చేత మహి ళా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 61,308.439 టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని జిల్లాలోని దాదాపు 45 రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. స్వీకరించిన ధాన్యంలో దాదాపు 68శాతం అంటే 41,689.738 మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి స రఫరా చేయాల్సి ఉంది. ఇదంతా కూడా కేవలం 14 రోజుల్లోనే మిల్లర్లకు ఆదేశాలున్నాయి. మొ త్తం మీద జూన్ మొదటి వారం నాటికి పూర్తి స్థాయిలో బియ్యం అందజేయాల్సి ఉండేది. గడువుల మీద గడువులు విధిస్తూ ఆఖరుకు సెప్టెంబర్ 30 నాటికి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు కూడా ఆ లక్ష్యం నెరవేరడం లేదు. సెప్టెంబర్ 30 నాటికి కేవలం 32శాతం బియ్యం మాత్రమే మిల్లర్ల నుంచి రావడంతో జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని రంగంలోకి దిగి క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. అనంతరం చివరాఖరు అవకాశంగా అక్టోబర్ 30నాటికి పూర్తిస్థాయిలో ఇవ్వాలని మిల్లర్లకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఇంకా 25.71శాతం బకాయి.. నాలుగు నెలలుగా మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఆఖఱు అవకాశమిచ్చిన ప్రభుత్వం అందుకు పక్కా చర్యలు తీసుకుంది. ధాన్యం బాకీ ఉన్న మిల్లర్ల నుంచి బయట మార్కెట్ బియ్యం వెళ్లకుండా చూ సేందుకు ప్రత్యేకంగా సెప్టెంబర్ 20వ తేదీన 15 మంది అ దికారులను నియమించింది. మొత్తం మిల్లర్ల నుంచి 41,689.738 టన్నుల బియ్యం రావాల్సిఉండగాఇప్పటి వరకు 30,919.403 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే వచ్చింది. ఇంకా 10,770.335 మె ట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీపావళి సెలవులు పోను తుది గడువుకు వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో అతి కొద్ది కాలంలో మిల్లర్ల నుంచి ఎలా రాబట్టాలోనని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
పరిశుభ్రతలో ఆదర్శంగా ఉందాం
యూనివర్సిటీ క్యాంపస్ : పరిశుభ్రతలో ఎస్వీ యూనివర్సిటీ ఆదర్శంగా ఉండాలని వీసీ రాజేంద్ర పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఆధ్వర్యంలో బుధవారం ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంపస్‌లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించి, చెత్తకుప్పలు తొలగించారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద సభ నిర్వహించారు. ఈ సమావేశంలో వీసీ రాజేంద్ర మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛభారత్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘జన్మభూమి-మా వూరు’ ఒక యజ్ఞంలా జరుగుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయాలు ఆదర్శంగా ఉండాలన్న భావనతో ఎస్వీయూ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం వీసీ రాజేంద్ర, రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ దేవరాజులు మొక్కలు నాటారు. చివరగా ఎస్వీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల విద్యార్థులతో కలసి సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. -
విజిలెన్స్ కమిటీ నియామకం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ పార్లమెంటేరియన్, నాగర్ కర్నూలు లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య చైర్మన్‌గా, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కమిటీ కో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. గౌరవ సభ్యులుగా జిల్లా కలెక్టర్, కమిటీ సభ్యులుగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. వీరితో పాటు డ్వామా, డీఆర్డీఏ పీడీలు, జెడ్పీ సీఈఓ, పోస్టల్ సూపరింటెండెంట్, మండల పరిషత్ అధ్యక్షులు కూడా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రతి మూడు నెలలకోమారు ఈ కమిటీ సమావేశం కావాల్సి ఉన్నా రాష్ట్ర విభజన, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చివరి సమావేశం గత యేడాది డిసెంబర్ 28న నిర్వహించారు. 16వ లోక్‌సభ కొలువుదీరిన నేపథ్యంలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం విడుదల చేసే నిధుల వ్యయం, ఆయా పథకాల పురోగతిని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రతి మూడు నెలలకోమారు సమీక్షించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ పథకం, సామాజిక పింఛన్లు, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన తదితర పథకాలకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. నూతన కమిటీ ఏర్పాటు నేపథ్యంలో త్వరలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. -
తొడగొట్టి పడగొడతాం..
కేసీఆర్ ప్రభుత్వంపై టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా సుబేదారి/హన్మకొండసిటీ : కేసీఆర్ ప్రభుతాన్ని తొడగొట్టి పడగొడతామని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కరెంటు లేక సాగు నీరందక రైతులు, పింఛన్లు అందక వృద్ధులు, ఇళ్ల బిల్లులు రాక పేదలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర సాధన కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే కేసీఆర్ 460 మందికి మాత్రమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని అన్నారు. కవిత మ్మ బతుకమ్మ ఆడితే రూ.10కోట్లు ఇచ్చారు, సానియా మీర్జా కనపడినప్పుడల్లా రూ.కోటి ఇస్తున్నారు.. రైతుకు ఎకరానికి రూ. 30వేల నష్టపరిహారం ఇవ్వలేరా అన్ని ప్రశ్నించారు. టీడీపీలో ఒక్కొక్కరు 100 మంది కేసీఆర్‌లతో సమానం.. రాబోయే రోజుల్లో తొడగొట్టి ప్రభుత్నాన్ని పడగొడుతామని హెచ్చరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రమణ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని చెప్పా రు. రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహు లు మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కేసీఆర్ తన ఇంట్లోనే నాలుగు పదవులు ఇచ్చుకున్నాడని వివర్శించారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10లక్షల చొప్పు న ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశా రు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ మూడేళ్ల వరకు కరెంట్ సమస్య తీరదనే సీఎం మాటలతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎంపీ నల్లమల్లారెడ్డి, పార్టీ నాయకులు గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ, రాష్ట్ర నాయకులు వేంనరేందర్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, నర్సిరెడ్డి మాట్లాడారు. ధర్నా మధ్యలో పార్టీ ప్రతినిధుల బృందం జాయింట్ కలెక్టర్ పౌసుమిబసును క లిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం హన్మకొండలోని కాకతీయ హరిత హోటల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కృష్ణారావు, రాజేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. -
ఇక పశుభాగ్య
ప్రోత్సాహంగా నగదు స్థానంలో పాడి పశువులు ఎస్సీ, ఎస్టీలకు నూతన సంక్షేమ పథకం వారిని పాడి వైపు ప్రోత్సహించడమే లక్ష్యం నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలు సాక్షి, బెంగళూరు :షెడ్యూలు కులాలు, తెగల వర్గానికి చెందిన పాడి రైతులకు ప్రోత్సాహక ధనానికి బదులు పాడి పశువులను ఇచ్చే యోచనలో రాష్ర్ట సర్కార్ ఉంది. దీన్ని ‘పశుభాగ్య’ పేరుతో నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రానున్న కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం పాడి రైతుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు 10 శాతం మంది కూడా లేరు. దీంతో ఆ వర్గానికి చెందిన వారిని పాడి వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందిస్తోంది. పాడి రైతులకు లీటరు పాలకు రూ.4, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.6 ప్రోత్సాహకంగా ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన రూ.104 కోట్లను సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఖర్చు చేయాలనే విషయంపై మంత్రి మండలిసమావేశంలోనూ చర్చించారు. అయితే దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్ ఆంజనేయ, పశుసంవర్థక శాఖ మంత్రి టీబీ జయచంద్రకు విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ప్రోత్సాహకాన్ని పెంచడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీబీ జయచంద్ర వాదించారు. దీంతో ప్రోత్సాహకం పెంపు నిర్ణయం మూడు నెలలుగా వాయిదా పడుతోంది. సమస్య పరిష్కారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రోత్సాహకం బదులు ఒక్కొక్క లబ్ధిదారుడికి ఉచితంగా లేదా దాదాపు 95 శాతం సబ్సిడీపై రెండు పాడి పశువులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అర్హుల ఎంపికను స్థానిక శాసన సభ్యులకు ఇవ్వాలని తీర్మానించింది. మరోవైపు పశువుల కొనుగోలు, నిధుల విడుదల విషయం సాంఘిక, సంక్షేమ, పశుసంవర్థకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరగనుంది. మొదటి ఏడాది 13,000 మందికి ‘పశుభాగ్య’ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా వచ్చే నెల ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
బదిలీలపై న్యాయ పోరాటం
ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సబ్ రిజిస్ట్రార్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విజయవాడ : ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఇటీవల చేసిన బదిలీలపై పలువురు సబ్ రిజిస్ట్రార్లు న్యాయపోరాటానికి దిగారు. అక్రమ బదిలీలను ఆకస్మికంగా చేశారంటూ జిల్లాకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు బదిలీలకు సంబంధించి సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆకస్మిక బదిలీలతో ఇబ్బందులే.. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30 తేదీన రాష్ట్రవ్యాప్తంగా జీరో సర్వీసు జీవో ప్రకారం మూకుమ్మడిగా సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో 30 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. వారు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. సంవత్సరం మధ్యలో ఆకస్మికంగా బదిలీచేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించారు. కౌన్సెలింగ్ జరపకుండా ప్రభుత్వం ఇష్టానుసారం బదిలీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని పిటిషన్లలో పేర్కొన్నారు. నందిగామ, కంకిపాడుల్లో సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేసిన రాంబాబు, రాఘవరావుతో పాటు పలువురు శుక్రవారం ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. వీటిని ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. బదిలీల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలను వచ్చే బుధవారంలోగా సమర్పించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఏలూరు డీఐజీ సాయిప్రసాద రెడ్డిని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణ అనంతరం ట్రిబ్యునల్ నుంచి తీర్పు వెలువడనుంది. ఇదిలాఉంటే.. జిల్లాలో పది మంది సబ్ రిజిస్ట్రార్లు బదిలీ జరిగినప్పటికీ చార్జి అప్పగించకుండా, బదిలీ అయిన ప్రదేశానికి వెళ్లలేదని సమాచారం. దీనివల్ల రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలుగుతోంది. బదిలీలు అస్తవ్యస్తంగా జరిగాయని కంకిపాడు ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ సిటిజన్ శుక్రవారం హైకోర్టులో పిల్ వేశారు. జిల్లాలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు. బదిలీలు రద్దు? ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో జరిగిన బదిలీలు రద్దవుతాయని తెలుస్తోంది. ప్రభుత్వం రూపొందించిన జీరో సర్వీసు నిబంధన చట్టవిరుద్ధమని, బదిలీలు కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే జరగాల్సి ఉండగా సర్వీసు రూల్స్‌ను పక్కనపెట్టి ఉత్తర్వులు జారీ చేయడం తగదని పలువురు పేర్కొంటున్నారు. వచ్చే వారంలో బదిలీలన్నీ రద్దవుతాయని పెద్దఎత్తున ప్రచారం నడుస్తోంది. -
శిల్పారామానికి రూ.1.14 కోట్లు
హరిత కాకతీయ హోటల్‌కు కొత్త అందాలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరంలో నిర్మించనున్న శిల్పారామం ప్రాజెక్ట్‌కు రూ. 1.14 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, నెల్లూరు, తిరుపతితోపాటు వరంగల్‌లో శిల్పారామం నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం 2010లో అనుమతులు జారీ చేసింది. ఒక్కో శిల్పారామానికి ఐదు కోట్ల రూపాయలు కేటాయిం చింది. అయితే నాలుగేళ్లుగా వరంగల్ శిల్పారామానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇక్కడ నిర్మించే శిల్పారామానికి రూ.5 కోట్లు రావాల్సి ఉండగా... ఇప్పటివరకు రూ 1.25 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో రూ.10.08 లక్షలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రూ. 1.14 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన నిధులను సైతం త్వరితగతిన మంజూరు చేసి... శిల్పారామాన్ని సకాలంలో నిర్మించేలా ఇక్కడి ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో సుందరీకరణ పనుల్లో భాగంగా శిల్ప కళా ఖండాలను ఏర్పాటు చేసేందుకు మరో తొమ్మిది లక్షల రూపాయలు అదనంగా మంజూరయ్యాయి. -
కుడా మోసం!
ఎల్ఆర్ఎస్లో లొసుగులే పెట్టుబడిగా దందా యథేచ్ఛగా అధికారుల అవినీతి పర్వం యజమానులకు మేలు చేసేలా పాత పత్రాలతో పనులు ఎగవేసిన మొత్తంలో వాటాల వారీగా పంపకాలు ప్రభుత్వ ఆదాయూనికి భారీగా గండి సాక్షి, హన్మకొండ: అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అమల్లోకి తెచ్చిన లే అవుట్ రెగ్యులరైజేషన్ చట్టం-2007 (ఎల్ఆర్ఎస్)లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. పలువురు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అధికారుల అవినీతి వారికి కాసులను కురిపిస్తుండగా... భూ యజమానులకు మేలు చేకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలు దారి మళ్లుతున్నాయి. ఎల్ఆర్ఎస్ పేరిట చేపట్టిన క్రమబద్ధీకరణలో ఎక్కువభాగం అక్రమబద్ధీకరణే జరిగినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు తేటతెల్లం చేస్తున్నాయి. అధికారుల అండతో ప్లాట్ల యజమానులు క్రమబద్ధీకరణ సమయంలో పాత యాజమాన్య పత్రాలు, మార్కెట్ విలువను తక్కువగా చూపుతూ ప్రభుత్వానికి చెల్లించే మొత్తాన్ని భారీగా ఎగవేస్తున్నట్లు రూడీ అయింది. ఈ అక్రమాల్లో ప్రధాన పాత్ర ‘కుడా’ అధికారులదేనని తేలింది. అధికారులకు కాసుల పంట అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2007లో లే అవుట్ రెగ్యులరేజైషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం లే అవుట్లో పార్కు లేనందుకు మార్కెట్ ధర ప్రకారం భూమి విలువలో పది శాతం జరిమానాగా... భూమి ఎంత ఉందో గజాలను బట్టి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెనాల్టీ చెల్లించాలి. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ఆలస్యాన్ని బట్టి మొత్తం భూమి విలువలో కొంత మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయూలి. దరఖాస్తు చేసే సమయంలో భూమి యాజమాన్య పత్రాలతోపాటు దరఖాస్తులో తెలిపిన అన్ని విషయాలు నిజమేనంటూ నోటరీని సైతం సమర్పించాలి. అనంతరం అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, సర్వేయర్, డ్రాఫ్ట్‌మన్, జూనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫీల్డుకు వెళ్లి దరఖాస్తులో సమర్పించిన అంశాలు సరైనవా... కాదా... అనే అంశాలను పరిశీలించాలి. ఆ తర్వాత మార్కెట్ రేటు, స్థల విస్తీర్ణాన్ని బట్టి ఎల్ఆర్ఎస్ పెనాల్టీని విధించాలి. ప్లానింగ్ అధికారి పరిశీలించిన తర్వాతే సదరు స్థలాన్ని క్రమబద్ధీకరించాలి. అయితే ఎల్ఆర్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూముల ధరలు గరిష్టంగా పదిరేట్ల వరకు పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగా ఎల్ఆర్ఎస్ ఫీజు, పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తే ఏమొస్తుందని అనుకున్నారో.. ఏమో... కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన పలువురు అధికారులే ఎల్ఆర్ఎస్ చట్టంలోని లొసుగులను ఒడిసిపట్టి అక్రమార్జనకు తెగబడ్డారు. లే అవుట్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు అందగానే అక్కడి సిబ్బంది అలర్ట్ అవుతున్నారు. ప్రభుత్వానికి ఎక్కువ మొత్తం చెల్లిస్తే ఏం లాభం... మేం చెప్పినట్లు పాత తేదీలతో ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్లతో పని కానిచ్చేద్దాం... మిగిలింది ఫిఫ్టీ-ఫిఫ్టీగా పంచుకుందామంటూ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని దండుకుంటున్నారు. ఇలా భూ యజమానులకు మేలు జరుగుతుండగా.. సదరు అధికారుల జేబులు నిండుతున్నాయి. ప్రభుత్వ ఆదాయూనికి మాత్రం గండిపడుతోంది. సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాలు హన్మకొండ న యీంనగర్లో సర్వే నంబర్లు 5-980, 5-981,5-982లో ఉన్న 1721 చదరపు మీటర్ల స్థలాన్ని 1998లో రేచర్ల శ్రీనివాసరావు కొనుగోలు చేశాడు. ఈ స్థలాన్ని 2003, 2009లో పలు విడతల్లో రేవూరి కిషన్‌రెడ్డికి, అతడి కుటుంబ సభ్యులకు విక్రయించాడు. ఈ మేరకు ఈ ఆస్తికి హక్కుదారులుగా రేవూరి కిషన్‌రెడ్డి, అతడి కుటుంబీకులు ఉన్నారు. ఇందుకు సంబంధించి సేల్స్ డీడ్స్ రికార్డులు ఉన్నాయి. ఈ స్థలాన్ని క్రమబద్ధీకరించాలంటూ 2010 మేలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి దరఖాస్తు అందింది. ప్రస్తుతం ఈ భూమికి యజమానిగా ఉన్న రేవూరి కిషన్‌రెడ్డి పేరుతో కాకుండా గత యజమాని అయిన రేచర్ల శ్రీనివాసరావు పేరుతో దరఖాస్తు అందింది. పరిశీలనకు వెళ్లిన ‘కుడా’ అధికారులు ఈ అంశంపె ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండానే పాత డాక్యుమెంట్ల ఆధారంగా 1998 మార్కెట్ ధర ప్రకారం ఎల్ఆర్ఎస్ ఫీజు, పెనాల్టీ కింద రూ 4,27,860 చెల్లించాల్సిందిగా నిర్ధారించారు. దరఖాస్తు వివరాల ప్రకారం ఈ మొత్తాన్ని స్థల యజమాని అయిన రేచర్ల శ్రీనివాసరావు చెల్లించాలి. అయితే కార్పొరేషన్ బ్యాంకులో డిమాండ్ డ్రాఫ్టును రేవూరి కిషన్‌రెడ్డి పేరుతో తీసి ‘కుడా’కు అందినట్లు ఉంది. ముందుగా కుదిరిన ఒప్పందమో... కావాలని చేసిన తప్పిదమో.. దరఖాస్తుదారులు ఎవరు, డబ్బులు చెల్లించినవారు ఎవరనేది పరిశీలించకుండా పని పూర్తి చేసినట్లు స్పష్టమవుతోంది. ఎల్ఆర్ఎస్ చట్టం అమల్లో ఉన్న కాలంలో 90 శాతం పనులు ఈ విధంగా అక్రమ పద్ధతిలో కొనసాగినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ‘కుడా’లో అంతా అక్రమమే ఎల్ఆర్ఎస్ పేరుతో ‘కుడా’లో పెద్ద కుంభకోణం జరిగింది. నా ప్రమేయం లేకుండా నా సంతకాలు ఫోర్జరీ చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ‘కుడా’ అధికారుల అండదండలతోనే ఇది జరిగింది. ఎల్ఆర్ఎస్ అక్రమాలపై విచారణ చేయాలి. - రేచర్ల శ్రీనివాసరావు ఆయనకు తెలిసే జరిగింది సర్వే నంబర్లు 5-980, 5-981,5-982లో ఉన్న 1721 చదరపు మీటర్ల స్థల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రతి పనీ రేచర్ల శ్రీనివాసరావుకు తెలిసే జరిగింది. ఆయనే దగ్గరుండి ఎల్ఆర్ఎస్లో పాల్గొన్నారు. వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. - రేవూరి కిషన్‌రెడ్డి -
పేదల చెంతకు ప్రభుత్వ పథకాలు
పాత గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పేద ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తానని జిల్లా సంయుక్త కలెక్టర్ చెరువూరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు.. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఈ దృష్ట్యా ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాలను త్వరితగతిన ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తానని జేసీ హామీ ఇచ్చారు. జిల్లాలో ఆధార్ నమోదు కాని వారు దాదాపు రెండు లక్షల మంది ఉన్నట్లు తెలిసిందని, వారందరికి ఆధార్ నమోదు చేయించి కార్డు అందేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం ఆధార్‌తో అను సంధానమైనందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆధార్ ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. భూ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాలు, రెవెన్యూ రికార్డులను చేరువ చేయడం ద్వారా ఈ-గవర్నెన్స్ అమలుకు కృషి చేస్తానన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువయ్యేలా చూస్తానన్నారు. అనంతరం నూతన సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్‌ను జిల్లా కలెక్టర్ కార్యాలయం తరపున ఏవో బి.బి.ఎస్. ప్రసాద్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. -
అన్నభాగ్య!
పట్టణ పేదలకు రేషన్ కట్ దసరా, బక్రీద్ తర్వాత అమల్లోకి? కిరోసిన్ రహిత పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం సాక్షి, బెంగళూరు : అడిగిన సమాచారం ఇవ్వని వారికి సబ్సిడీ సరుకులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే తొలిదశలో పట్టణాల్లో ఉంటున్న బీపీఎల్, అంత్యోదయ కార్డుదారులకు చౌకదుకాణాల నుంచి అందించే రేషన్‌ను నిలిపి వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అనర్హులను గుర్తించడంతో పాటు కిరోసిన్ రహిథ పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే గనుక జరిగితే పట్టణాల్లోని పలువురు పేదలు అన్నభాగ్య పథకానికి దూరం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మొత్తం మీద కోటి కుటుంబాలు రేషన్ షాపుల నుంచి ప్రతి నలా సబ్సిడీ సరుకులను పొందుతున్నాయి. లబ్ధిదారుల్లో మొత్తం 9,17,987 మంది పట్టణప్రాంతాల్లో(వీరిలో 65,061 మంది అంత్యోదయ లబ్ధిదారులు) నివసిస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 35 లక్షల మంది కొత్తగా బీపీఎల్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్నికల కమిషన్ అందజేసే ఎలొక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్ కార్డు)తోపాటు ఆధార్ నంబర్‌ను జత చేయడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి వెంటనే ఆధార్, ఎపిక్‌నంబర్‌ను ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ దాదాపు రెండు నెలల ముందే సూచించింది. ప్రభుత్వం అడిగిన సమాచారం ఇచ్చినవారు ఇప్పటికీ లక్షను దాటలేదు. దీంతో సమాచారం ఇవ్వని వారికి రేషన్ నిలిపివేయాలని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. ఇందుకోసం మొదట పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు చేసి తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వర్తింపజేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పట్టణప్రాంతాల్లో సబ్సిడీ ధరలో కిరోసిన్ పొందే వారిని గుర్తించి సరైన గణాంకాలు కేంద్రానికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ మేరకు కేంద్రం నుంచి అదనపు గ్యాస్ పొందడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరిగితే అంత వేగంగా కర్ణాటకను కిరోసిన్ రహిత పట్టణ ప్రాంతాల రాష్ట్రంగా చేయడానికి వీలవుతుంది. దీంతో ‘ఆధార్’ను రేషన్ కార్డుకు అనుసంధానం చేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్యలో ఖచ్చితత్వం పెరుగుతుందనేది పౌరసరఫరాలశాఖ భావన. దీనికి సంబంధించిన ఫైల్ పదిహేను రోజుల ముందే ప్రభుత్వానికి చేరింది. అయితేదసరా, బక్రీద్ పండుగలు వచ్చే నెల మొదట్లోనే వస్తుండడంతో ఈ నిబంధన వల్ల రేషన్ దొరక్కపోతే ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుందని ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ నుంచి ఈ నిబంధనలను అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ పట్టుదలతో ఉంది. -
రాజధానికి నూజివీడే అనుకూలం
పైసా ఖర్చు లేకుండా వేలాది ఎకరాల సేకరణకు అవకాశం ప్రకృతి విపత్తుల భయం లేని ప్రాంతం విమానాశ్రయం ఏర్పాటుకూ భూములు తొందరపాటు నిర్ణయాలొద్దు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సూచన నూజివీడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి అన్ని హంగులూ కలిగిన అనువైన ప్రదేశం నూజివీడేనని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజివీడును రాజధానిగా నిర్మిస్తే ఏలూరు, నూజివీడు, విజయవాడ కలసి దేశంలోనే ఒక పెద్ద మహానగరంగా మారుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ పరిసరాలలోనే రాజధాని ఉంటుందని ప్రకటించడం శుభపరిణామమని, అయితే రోజుకోవిధంగా ప్రకటన ఇస్తుండటంతో ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. దీనికి తెరదించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తదితరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టంచేయాలన్నారు. నూజివీడు ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే ఒక్క పైసా ఖర్చు లేకుండా వేలాది ఎకరాల భూములు సేకరించవచ్చన్నారు. ఈ ప్రాంత భూములు భారీ భవనాల నిర్మాణానికి అనువైనవని, భూకంపాలు కూడా వచ్చే ప్రమాదం లేదని నిపుణులు తెలిపారని వివరించారు. నూజివీడుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే విమానాశ్రయం ఉందని, నూతన విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకుంటే కాట్రేనిపాడులో దాదాపు ఐదువేల ఎకరాల అటవీభూములు ఉన్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఎలాంటి నష్టం గాని, ముంపు భయం గాని లేని ప్రాంతం నూజివీడు ఒక్కటేనని తెలిపారు. నూజివీడు ప్రాంతం హైదరాబాద్ తరహా భౌగోళిక నైసర్గికత కలిగి ఉందని చెప్పారు. పాలకులు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా నిపుణులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. నూజివీడు ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని 1953లోనే ఆనాటి పెద్దలు నిర్ణయించారని, కొన్ని అనివార్య కారణాల వల్ల రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయకుండా కర్నూలులో ఏర్పాటు చేశారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నూజివీడు మండల అధ్యక్షుడు మందాడ నాగేశ్వరరావు, నాయకుడు పల్లె రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
మళ్లీ ఇవ్వండి!
సాక్షి, మంచిర్యాల : ‘మన ఊరు-మన ప్రణాళిక’ ద్వారా ఆయా గ్రా మాల నుంచి సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర సర్కారు పునఃసమీక్షిస్తోంది. ఇందులో భాగంగా ఆయా ప్రజల అవసరాలపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశిం చింది. దీంతో అధికారులు, గ్రామస్థాయి కార్యదర్శులు సమాచార సేకరణలో బిజీగా మారారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం ఆయా గ్రామాలు, ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు కావాల్సిన రోడ్లు, మరుగుదొడ్లు, నీటిసదుపాయం, ఇతరత్రా సామాజిక అవసరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు వారంపాటు సాగిన ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించారు. వాటిని ‘మన మండలం-మన ప్రణాళిక’లో క్రోడీక రించి జిల్లా స్థాయికి నివేదికలు పంపించారు. జిల్లా ప్రజాపరిషత్ అధికారులు మండలాల సమగ్ర నివేదికలన్నింటి ఆధారంగా జిల్లాకు కావాల్సిన అవసరాలు పేర్కొంటూ సంబంధిత వెబ్సైట్లో నమోదు చేశారు. అయితే ఈ నమోదు తర్వాత ప్రభుత్వం మొదట ప్రకటించినట్లుగానే ఆయా వివరాలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆన్లైన్లో ఉంచింది. ఈ సమయంలో పెద్ద ఎత్తున తప్పుల తడకగా వివరాలు ఉండటం బయటకు వచ్చింది. వాటితోనే చిక్కంతా.. గ్రామ ప్రణాళికలను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం కాస్త ఇళ్ల నిర్మాణం కోసం, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేదిగా మారింది. ఆయా పథకాల అర్హులు పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఒక్కో గ్రామంలో నివసిస్తున్న ప్రజల కంటే పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్యే అధికంగా కనిపించింది. మరోవైపు వివరాలను ఆన్లైన్లో ఉంచినపుడు గ్రామ ప్రజల కంటే పింఛన్లు పొందుతున్నవారు ఎక్కువని, స్త్రీల కంటే వితంతువుల సంఖ్యే అధికమనే విచిత్రాలు కనిపించాయి. ఈ అవకతవకలను సరిదిద్దేందుకు సర్కారు వాస్తవ వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జెడ్పీ కార్యాలయం నుంచి ఆయా మండలాల ఎంపీడీవోలకు వివరాలు తిరిగి అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఇళ్ల నిర్మాణం కోసం అర్హులైన వారెందరు, పింఛన్ల రావాల్సినవారెందరు అనే సమచారాన్ని గ్రామకార్యదర్శుల ద్వారా ఎంపీడీవోలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సదరు దరఖాస్తుదారుల ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డుల సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఈ తంతు మరో రెండ్రోజుల్లో ముగించి 25వ తేదీ వరకు జిల్లా అధికారులు సమగ్ర నివేదిక సిద్ధంచేసుకునేలా కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఉచిత విద్యకు ప్రణాళికలు రూపొందించాలి
విద్యాపరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి డీఎస్‌యూ ఆధ్వర్యంలో సదస్సు కేయూ క్యాంపస్ : సరైన ప్రణాళిక లేకుండా నే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విద్యాపరి రక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.నర్సిం హారెడ్డి విమర్శించారు. డెమోక్రటిక్ స్టూడెం ట్స్ యూనియన్ (డీఎస్‌యూ) ఆధ్వర్యంలో ‘తెలంగాణ విద్యారంగం, భవిష్యత్ లక్ష్యాలు - కార్యాచరణ’ అంశంపై హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ సెమినార్‌హాల్‌లో శనివారం స దస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నర్సిం హారెడ్డి మాట్లాడుతూ సీఎం చెప్పిన మాటల ప్రకారం ఉచిత విద్య కొందరికే చేరువయ్యే అవకాశముందన్నారు. సాధ్యాసాధ్యాలను సరిగా పరిగణనలోకి తీసుకోకుండా ప్రకట నలు చేయడం కాకుండా.. స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇక కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం ఇంత వరకు తన వైఖరి ప్రకటించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంఈఓ పోస్టులతో పాటు కళాశాలల్లో ఖాళీల ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం పాఠ్యాం శాల్లో వేదాలు, ఉపనిషత్తులను చేర్చి మనువాద రాజ్య స్థాపనకు కుట్ర పన్నుతోందని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టకుండా.. రేషనలైజేషన్ పేరి ట వేలాది స్కూళ్ల మూసివేతకు కుట్ర పన్నారని ఆరోపించారు. సదస్సులో డీఎస్‌యూ రాష్ట్ర అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంచర్ల బద్రి, అరుణాంక్‌తో పాటు సంపత్‌రెడ్డి, జేసీ.పాణి, అమృతరాజు, సిద్ధార్థ, శ్రావణ్, జనార్దన్, అవినాష్, అనిల్, సదయ్య, శివ, నగేష్, భాస్కర్, శ్రీకాంత్, సురేష్, ప్రేంసాగర్ పాల్గొన్నారు. -
రైతుల కడుపు కొట్టద్దు
బెంగళూరు : చిన్న రైతులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తే పోరాటం చేయాల్సి వస్తుందని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ హెచ్చరించారు. శనివారం ఆయన ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చిన్న రైతులు పోరంబోకు భూములు, అటవీ ప్రాంతానికి చెందిన భూములను అక్రమించుకుని వ్యయసాయం చేసుకుంటున్నారని అన్నారు. ఈ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాశానని దేవెగౌడ అన్నారు. చిన్న రైతుల భూములు లాక్కొని ప్రభుత్వం ముందు బడా బాబుల భూములు లాక్కుంటే అందరికి మంచి జరుగుతుందన్నారు. బెంగళూరు న గరంలో, పరిసర ప్రాంతాలలో అనేక ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని ఏ.టీ. రామస్వామి, బాలసుబ్రమణ్యం కమిటీలు ఇప్పటికే నివేదిక సమర్పించారని గుర్తు చేశారు. ఈ భూములు ఆక్రమించుకున్నవారిలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌తో పాటు ఇతర పార్టీల నాయకులు ఉన్నా సరే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని దేవెగౌడ చెప్పారు. సమావేశంలో జేడీఎస్ పార్టీ నాయకులు వై.వీ.ఎస్ దత్తా, నారాయణరావ్, రతన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట కలేనా?
స్మార్ట్ సిటీలుగా రాష్ర్ట రాజధానులకు నో ఛాన్స జనాభా ప్రాతిపదికన ఆ సిటీల ఎంపిక 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకే అవకాశం రాష్ర్టంలో ఒక్క నగరానికీ దక్కని అవకాశం అవరోధంగా మారిన కేంద్రం విధి విధానాలు రాష్ట్రం నష్ట పోతుందని కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం లేఖ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘ఈ రోజు కర్ణాటక చెప్పింది...రేపు దేశమంతా ఆచరించాలి’...ఈ వ్యాఖ్యానమెవరిదో కాదు...తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూది. సైన్స్, టెక్నాలజీ...ఇలా ఏ రంగంలోనైనా కర్ణాటక ముందుంటుంది అని చెప్పడానికి ఆయనీరకంగా వ్యాఖ్యానించారు. అలాంటి కర్ణాటకకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన స్మార్ట్ సిటీ... ఎండమావిగా మారే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే... స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన విధి విధానాలే దీనికి కారణం. పది లక్షల నుంచి 40 లక్షల జనాభా కలిగిన 44 నగరాలను, 40 లక్షలు, ఆపైబడిన జనాభా కలిగిన తొమ్మిది శాటిలైట్ నగరాలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం పంపిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఇంత జనాభా కలిగిన నగరం ఒక్కటి కూడా రాష్ట్రంలో లేదు. కేంద్రం ప్రతిపాదించిన వంద స్మార్ట్ సిటీలలో 53 నగరాలకు విధి విధానాలను రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ 53 స్మార్ట్ సిటీలలో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కే అవకాశం లేదు. 84.25 లక్షల జనాభా కలిగిన బెంగళూరు కూడా దీని పరిధిలోకి రాదు. రాష్ట్రాల రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేరే ప్రత్యేక కేటగిరీ కిందికి వస్తాయి. స్మార్ట్ సిటీ అర్హత కోసం రూపొందించిన ఈ నిబంధనల వల్ల రాష్ట్రం నష్ట పోతుందని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో బెంగళూరు తర్వాతి స్థానాల్లో హుబ్లీ-ధార్వాడ (9.43 లక్షల జనాభా), మైసూరు (8.87లక్షలు), గుల్బర్గ (5.3 లక్షలు), బెల్గాం (4.88 లక్షలు), మంగళూరు (4.84 లక్షలు), దావణగెరె (4.35 లక్షలు), బళ్లారి (4.09 లక్షలు), శివమొగ్గ (3.22) లక్షలు ఉన్నాయి. పక్కనున్న కేరళలో పది లక్షల జనాభా కలిగిన నగరాలు ఐదు ఉన్నాయి. మహారాష్ట్రలో ఆరు నగరాలున్నాయి. రాష్ర్టంలో దశాబ్దాల తరబడి బెంగళూరుపైనే దృష్టి కేంద్రీకృతమైనందున, ద్వితీయ శ్రేణి నగరాలు పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఏ రాష్ట్రంలోనైనా పట్టణ ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు అవకాశాలున్న నగరాలే ముందుకు దూసుకు పోతున్నాయి. ఇక రెండో కేటగిరీలో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన పది నగరాలను స్మార్ట్ సిటీల కోసం ఎంపిక చేస్తారు. యాభై వేల నుంచి లక్ష వరకు జనాభా కలిగిన 20 నగరాలను కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందులోనైనా రాష్ట్రానికి అవకాశం లభిస్తుందా అనేది కూడా సందేహమే. ఎందుకంటే... దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర నగరాలతో పోటీ పడాల్సి ఉంటుంది. మోడీ సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే స్మార్ట్ సిటీలను ప్రతిపాదించింది. 24 గంటలూ విద్యుత్, నీటి సరఫరా, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, అధునాతన సదుపాయాలు, ఈ-గవర్నెన్స్, పరిశుభ్రమైన పర్యావరణ లాంటి హంగులన్నీ స్మార్ట్ సిటీలో ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్తమాన ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో దీనికి రూ. ఏడు వేల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. -
నాణ్యతకు పెద్ద పీట : మంత్రి కేటీఆర్
సనత్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ‘28వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ -2014’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పౌర సరఫరాలు, గృహ నిర్మాణ రంగాల్లో నాణ్యత ఉండేలా దృషి టసారించామన్నారు. రాష్ట్రంలో 84 లక్షల ఇళ్లు ఉండగా, ఒక కోటి ఏడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ క్రమంలో అర్హులైన వారికి నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను చేపట్టామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్లను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ‘మై విలేజ్-మైప్లాన్, మై టౌన్-మై ప్లాన్’ పేరిట కింది స్థాయి నుంచి నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిమ్స్‌లాంటి ఆస్పత్రులు, ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఉత్పత్తులను అందిస్తున్న వివిధ సంస్థలకు క్యూసీఎఫ్ఐ అవార్డులను ప్రదానం చేసింది. వీటిని మంత్రి చేతుల మీదుగా ఆయా సంస్థల ప్రతినిధులు అందుకున్నారు. కార్యక్రమంలో క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీహెచ్.బాలకృష్ణారావు, ఎమిరటస్ చైర్మన్ ఎ.శ్యాంమోహన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డీకే శ్రీవాత్సవ, క్యూసీఎఫ్ఐ వైస్ చెర్మన్ మనోహర్ హెడ్జ్, సెక్రటరీ విశాల్‌కరణ్, సీనియర్ సలహాదారుడు బి.సుబ్రమణ్యం పాల్గొన్నారు. అవార్డులు అందుకున్న సంస్థలు.. బీహెచ్ఈఎల్, ఎన్ఎండీసీ, అమర్ రాజా బ్యాటరీస్, సోలార్ సెమీ కండక్టర్స్, రామ్‌కో సిమెంట్, ఉషా ఇంటర్నేషనల్, ఏపీఎస్ఆర్టీసీ, ఎన్ఆర్బీ బేరింగ్స్. -
రంగంలోకి ఢిల్లీ మెట్రో
వీజీటీఎం ఉడా పరిధిని పరిశీలిస్తున్న డీఎంఆర్సీ డీపీఆర్ తయారీకి కసరత్తు ఉడా పరిధిలో ఢిల్లీ బృంద పర్యటన సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలో నిర్మించ తలపెట్టిన మెట్రో ప్రాజెక్టు బాధ్యతల్ని ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో వీజీటీఎం ఉడా పరిధిలో మెట్రో ప్రాజెక్టు నిర్మించనున్న ప్రాంతాల్లో అధికారులు శుక్రవారం పర్యటించారు. వాస్తవానికి డిటైల్డ్ ప్రాజెక్టు తయారీ బాధ్యతల్ని తొలుత ప్రభుత్వం వీజీటీఎం ఉడాకు అప్పగించింది. అయితే, దీనికంటే ముందే ఉడా అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధంచేయటం.. ఆ తర్వాత కేంద్రబృంద పర్యటన.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలతో మెట్రో సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారుచేయడం జరిగాయి. ఉడా పరిధి అంతా మెట్రోరైల్ ఉండేలా నాలుగు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. చివరకు ప్రాజెక్టు మంజూరుచేసిన క్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు నాలుగు ప్రతిపాదనల్ని క్రోడీకరించి 49 కిలోమీటర్ల మార్గం మేరకు నూతన ప్రతిపాదన సిద్ధంచేసి ఖరారు చేశారు. దీనికి సంబంధించిన బాధ్యతలను ఉడాకు అప్పగించారు. వెంటనే ఉడా అధికారులు కంపెనీ ప్రొఫైల్స్ స్వీకరణ కార్యక్రమం టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్వహించారు. చివరకు ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు నిపుణుడు శ్రీధరన్ సేవలు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న క్రమంలో ప్రాజెక్టు పూర్తి బాధ్యతలు డీఎంఆర్సీకి కేటాయించారు. ప్రాజెక్టుకు సంబంధించి పనులు యథాతథంగా నిలిపివేయాలని ప్రత్యేక జీవో కూడా జారీచేశారు. ఇదంతా జరిగి మూడు రోజులైంది. ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ తయారీకి సంబంధించిన టెండర్ల దశలోనే ఉంది. అయితే, టెండర్లు లేకుండానే.. నేరుగా ఢిల్లీ మెట్రోకే ప్రాజెక్టును అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో ఢిల్లీ మెట్రో ఇంజినీర్లు ఉడా మాస్టర్‌ప్లాన్ ఆధారంగా వీజీటీఎం ఉడా పరిధిలో పర్యటించారు. వారి పర్యటన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచారు. అయితే, డీపీఆర్ తయారీలో భాగంగా ఉడా పరిధిపై అవగాహన కోసం మెట్రో మార్గం నిర్మించనున్న 49 కిలోమీటర్లు గన్నవరం, కంకిపాడు, విజయవాడ, గొల్లపూడిలో వారు పర్యటించారు. అలాగే, శుక్రవారం ఉదయం వీజీటీఎం ఉడా కార్యాలయంలోని సిటిజన్ చార్టర్లో కూడా మెట్రో మాస్టర్ ప్లాన్‌ను ఢిల్లీ బృందం కొనుగోలు చేసింది. -
త్వరలో బస్సు చార్జీల బాదుడు!
బాబు సర్కారు యోచన ► 15 శాతానికి తక్కువ కాకుండా పెంపునకు ఆర్టీసీ ప్రతిపాదనలు ► పెరగనున్న ఆర్డినరీ, సూపర్ లగ్జరీ, గరుడ చార్జీలు! ► సీఎం ఆమోదమే తరువారుు ► రూ. 556 కోట్లకు పైగా జనంపై భారం హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘బస్సు చార్జీలను పెంచి ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో డీజిల్ ధర ఏడెనిమిది సార్లు పెరిగింది. బస్సు చార్జీలను పెంచక తప్పని పరిస్థితి ఉంది. త్వరలోనే సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పిన నేపథ్యంలో అక్టోబర్ నుంచి చార్జీల పెంపు తప్పదని తెలుస్తోంది. 15 శాతానికి పైగా బస్సు టికెట్ ధరలు పెంచాల్సిందిగా ఆర్టీసీ యూజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ప్రయాణికులు డబ్బు లెక్క చేయడం లేదని, వారికి మెరుగైన సేవలందిస్తే ఆర్థిక భారాన్ని పట్టించుకోరని మంత్రి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే.. చార్జీల పెంపు ఖాయమని, ప్రభుత్వం ఇప్పటికే ఈ మేరకు నిర్ణయూనికి వచ్చిందనే విషయం స్పష్టమవుతోంది. ఈ మేరకు ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. గురువారం సచివాలయంలో ఆర్టీసీ, రవాణా అధికారులతో సమావేశమైన మంత్రి ఈ అంశంపైనే సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. డీజిల్ ధర ప్రతి నెలా లీటరుకు 50 పైసల చొప్పున పెరుగుతుండటంతో సంస్థ ఏటా రూ.400 కోట్లకు పైగా భారం భరించాల్సి వస్తోందని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఎంప్లాయిస్ యూనియన్ నేతలతో బుధవారం చర్చలు, అంతర్గత సమావేశం సందర్భంగా చార్జీల పెంపును ప్రస్తావించిన యాజమాన్యం.. చార్జీల పెంపు తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ చార్జీలు 10 శాతానికి పైగా, సూపర్‌లగ్జరీ 15 శాతం, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ చార్జీలు 15 శాతానికి పైగా పెంచేందుకు ఆర్టీసీ సమాయత్తమవుతున్నట్టు అధికారవర్గాల సమాచారం. 15 శాతం వరకు చార్జీల పెంపుతో ప్రయాణికులపై పెనుభారమే పడనుంది. రూ.556 కోట్లకు పైగా భారం! గతేడాది నవంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ చార్జీలు 9.5 శాతం వరకు పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలపై రూ.600 కోట్ల భారం పడింది. విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం పెంచనున్న బస్సు చార్జీలతో రూ.556 కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా. ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగితే రాష్ట్రంలోని ప్రైవేటు బస్సు ఆపరేటర్లకూ కాసుల వర్షమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు బస్సుల నిర్వాహకులు వారాంతాల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ చార్జీలు పెరిగితే ఆ సాకుతో ప్రయాణికులను మరింత దోచుకుంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు బస్సు ఆపరేటర్లంతా టీడీపీకి చెందినవారే కావడంతో వారు పండుగల వేళ, రద్దీ సమయాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విలేకరులు రవాణా మంత్రి దృష్టికి తెచ్చారు. వారితో ఏకీభవించిన మంత్రి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. డీజిల్ బదులు బయోడీజిల్: మంత్రి శిద్దా ఆర్టీసీ బస్సుల్లో డీజిల్ బదులు బయో డీజిల్ వాడాలని నిర్ణరుుంచినట్లు రవాణా మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. బయో డీజిల్ సరఫరాను కాంట్రాక్టుకు అప్పగించనున్నామని, ఈ మేరకు రెండ్రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బస్స్టేషన్లలో విద్యుత్ పొదుపునకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయూలని, ఆర్టీసీ స్థలాలు బీవోటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) పద్ధతిలో లీజుకు అప్పగించడం వంటి కీలక నిర్ణయూలు తీసుకున్నామన్నారు. పోలాండ్, ఆస్ట్రేలియాలో ఆర్టీసీ బస్స్టేషన్లను అధ్యయనం చేసి, ఆ మాదిరిగా విజయవాడ, వైజాగ్, గుంటూరులలోని ఆర్టీసీ బస్టాండ్లలో షాపింగ్ మాల్స్, ఐమ్యాక్స్ థియేటర్లు లాంటి నిర్మాణాలు బీవోటీ పద్ధతిలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గతంలో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా డీల్ చేయలేదన్నారు. సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ మాట్లాడుతూ.. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోయినా మూడు నెలల కిందటే ఏర్పాటైన ప్రభుత్వానికి ఓ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సమ్మె విషయంలో గౌరవప్రదమైన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. -
మెడికల్ హబ్ దిశగా తిరుపతి!
ఆరు వైద్య కేంద్రాలను అనుసంధానించే యోచన 12 మంది కమిటీతో కీలక నివేదిక నిర్వహణతోపాటు కీలకపోస్టులో టీటీడీ ఈవో హబ్ డెరైక్టర్‌పై ఆశలు పెంచుకున్న బర్డ్ డెరైక్టర్ నేడు సీఎం చంద్రబాబు అంగీకారమే తరువాయి తిరుపతి సిటీ: వైద్య రంగంలో తిరుపతి మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఆరు వైద్య కే్రందాలను అనుసంధానిస్తూ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్, బర్డ్, సెంట్రల్ హాస్పిటల్స్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెత్తనంతో నడుస్తున్న ఎస్వీ వైద్యకళాశాల, రుయా, మెటర్నిటీ హాస్పిటల్స్‌ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. మెడికల్ హబ్ ఏర్పాటు కు సంబంధించిన వ్యవహారాలపై రెండు రో జులుగా జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌తోపాటు ఆరు వైద్య కేంద్రాల ప్రధాన అధికారులతో చర్చలు జరుపుతున్నారు. దీనిపై అధికారులు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఆస్పత్రులలో ప్రధానంగా రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, లోపాలను గుర్తించి నివేదిక తయారు చేసేందుకు 12 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కమిటీలో టీటీడీ ఈవో, జేఈవోలతో పాటు డీఎంఈ, అడిషనల్ జాయింట్ కలెక్టర్, అర్బన్ ఎస్పీ, మున్సిపల్ కమిషనర్, ఎండోమెంట్ కార్యదర్శి, ఆరు విభాగాలకు చెందిన హెచ్వోడీలు ఉండేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏర్పాటు కాబోయే మెడికల్ హబ్‌కు టీటీడీ ఈవో చైర్మన్‌గా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. శ్రీవెంకటేశ్వర మెడికల్ హబ్.. కొత్తగా ఏర్పడే మెడికల్ హబ్ ఎక్కువగా టీటీడీ ఆధ్వర్యంలో నడవనున్న నేపథ్యంలో ‘శ్రీవేంకటేశ్వర మెడికల్ హబ్’గా పిలిస్తేనే సార్థకత అవుతుందనే ఉద్దేశంతో అధికారులు ఉన్నట్లు సమాచారం. నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు రానున్నారు. దీనిని సీఎం ముందు ఉంచి గ్రీన్ సిగ్నల్ పొందాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఏది ఏమైనా తమను ప్రభుత్వం, టీటీడీ ఇబ్బందులకు గురిచేయకుండా నిధులను సకాలంలో అందించాలని ఆరు వైద్య కేంద్రాలకు చెందిన అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుస సమావేశాలలో ఆస్పత్రులకు సంబంధించిన పాత జీవోలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రతి 3 నెలలకు వైద్య కేంద్రాలకు అవసరమయ్యే నిధులు ప్రభుత్వం నుంచి రావడం ఆలస్యమైతే వాటిని తొలుత టీటీడీ భరించి ప్రభుత్వ నిధులు వచ్చిన వెంటనే పొందేవిధంగా కమిటీ నిర్ణయించింది. అలాగే పేదరోగుల సహాయార్థం స్విమ్స్ ఆస్పత్రికి అందిస్తున్న విధంగా రుయా, మెటర్నిటీ ఆస్పత్రులకు కూడా టీటీడీ ప్రాణదాన నిధులను అందించేందుకు అంగీకారం తెలపాలని ఎండోమెంట్‌కు నివేదిక పంపాలని కమిటీ నిర్ణయించింది. బర్డ్ డెరైక్టర్ కోసమే.. అని ప్రచారం ప్రస్తుతం బర్డ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న జగదీష్‌కు సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ పరిచయం ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నా లేక పోయినా పార్టీకి సంబంధించిన కేడర్‌కు బర్డ్ ఆస్పత్రిలో వైద్యం అవసరమైతే అందుబాటులో ఉంటూ చంద్రబాబుకు మరింత దగ్గరయ్యారు. దీంతో పదేళ్ల తర్వాత బాబు అధికారంలోకి రావడంతో బర్డ్ డెరైక్టర్ చిరకాల కోరిక తీర్చేందుకే మెడికల్ హబ్ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన దిశా నిర్దేశకాలు బర్డ్ డెరైక్టర్ ఇచ్చినవే అనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తాత్కాలిక కమిటీలో కూడా జిల్లా మంత్రి బర్డ్ డెరైక్టర్ ఆలోచన మేరకు నివేదిక సిద్ధం చేయాలని పరోక్షంగా ఆదేశించినట్లు తెలిసింది. ఒక్క బర్డ్ ఆస్పత్రికే డెరైక్టర్‌గా ఇన్నాళ్లు చేశాం.. దీనికంటే పెద్ద పదవి కావాలంటే ఆరు వైద్య కేంద్రాలను కలిపి అందులో డెరైక్టర్‌గా కూర్చోవాలనే ఆలోచనతోనే ఈ కొత్త హబ్ ప్రస్తావన వచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. అయితే ఎన్ని హబ్‌లు ఏర్పాటైనా సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి తేవాలనే విషయాన్ని పాలకులు విస్మరించకుంటే చాలు. -
అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి
ఏలూరు : జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర అటవీ శాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయి మెజార్టీ అందించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తొలుత జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని క్యాబినెట్ సమావేశంలో స్పష్టం చేశారని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి, హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు, నేషనల్ ఇనిస్ట్యిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. చింతలపూడి ప్రాంతంలో బొగ్గు నిల్వలు వెలికితీతను పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, చేపల చెరువుల రైతుల జీవనవిధానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొల్లేరును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అదేక్రమంలో కొల్లేరు ప్రాంత ప్రజలకు ఎటువంటి నష్టం లేనివిధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎంపీలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు బడేటి కోట రామారావు, గన్ని వీరాంజనేయులు, కలవపూడి శివరామరాజు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో మంత్రి మొక్కలు నాటారు. -
ఇక ఎస్ఐల వంతు?
ఇసుక వివాదంలో ముగ్గురిపై వేటు పడే అవకాశం! ‘కొత్త పాలసీ’పై మాఫియా కన్ను! డ్వాక్రాల మాటున వ్యవహారం చోడవరం: ఇసుక మాఫియాకు సహకరించిన పోలీసు అధికారులపై ఓ పక్క వేటుపడుతుండగా మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇసుక కొత్త విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే చోడవరంతో పాటు జిల్లాలో అనకాపల్లి, పాయకరావుపేట, నర్సీపట్నం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, మాడుగుల, యలమంచిలి, రాంబిల్లి, కోటవురట్ల పలుచోట్ల ఇసుకు అక్రమ రవాణా జరుగుతోంది. దీనిపై వారం రోజుల కిందట జిల్లా ఎస్పీ కె.ప్రవీణ్ ఆకస్మిక దాడులు చేయడం, చోడవరం సర్కిల్ ఇనస్పెక్టర్‌ను సస్పెండ్ చేయడం విదితమే. ఇసుక మాఫియాకు సానుకూలంగా ఉన్నారంటూ చోడవరం, బుచ్చెయ్యపేట, దేవరాపల్లి పోలీసు సబ్ ఇనస్పెక్టర్లతోపాటు చోడవరం పోలీసు స్టేషన్లో ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను ఎస్పీ విచారించినట్టు తెలిసింది. వీరిపై కూడా త్వరలో వేటు పడే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం. ‘ఇసుక విధానం’పై మాఫియా కన్ను ఈ పరిస్థితుల్లో ఇసుక తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చే విధానంగా నిర్ణయం తీసుకోవడంతో మాఫియా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. జిల్లాలో కొందరు అధికార పార్టీ నాయక్చుజీ అక్రమ ఇసుక క్వారీల నిర్వహణ, రవాణా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో మాఫియా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు అన్ని విధాలా పావులు కదుపుతోంది. డ్వాక్రా సంఘాలకు ఇసుక తవ్వకాలు అప్పగించడం మంచిదే అయినప్పటికీ ఏ సంఘాలకు , ఎలాంటి ప్రాతిపదికన ఇస్తారన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. బంగారంగా మారిన ఇసుక నుంచి కాసులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు నాయకులు తమకు అనుకూలంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు ఇసుక ర్యాంపుల నిర్వహణ వచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పుడే తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఈ మాఫియా తిరుగుతున్నట్టు సమాచారం. విజిలెన్స్ దాడులు చోడవరం: చోడవరం పరిసరాల్లో ఇసుక ర్యాప్‌లపై భూగర్బ గ నుల శాఖ విజిలెన్స్ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గౌరీపట్నం, లక్కవరంలో పెద్దేరు, శారద నది ప్రాంతాల్లో తనిఖీచేసింది. నిల్వ ఉంచిన 20 ఇసుకు కుప్పలను సీజ్చేసింది. విజిలెన్స్ అధికారులు ఎస్.టి.కె. మల్లేశ్వరరావు, ఆర్ఐ రవికుమార్, చోడవరం ఆర్ఐ భారతి, గ్రామ రెవెన్యూ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. -
‘లింగ’ అనుమతి నా దృష్టికి రాలేదు
జిల్లా ఇన్చార్జ్ మంత్రి కిమ్మెన రత్నాకర్ శివమొగ్గ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపుదిద్దుకుంటున్న లింగ షూటింగ్ వివాదంపై జిల్లా ఇన్చార్జి మంత్రి కిమ్మెన రత్నాకర్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం ఆయన నగరంలోని జిల్లా అధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పర్యాటక నిషిద్ధ ప్రాంతమైన ప్రముఖ జలాశయం లింగనమక్కి వ ద్ద లింగ షూటింగ్‌కు అనుమతి ఎలా ఇచ్చారని విలేకరులు మంత్రిని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన వివరణ ఇస్తూ ఈ విషయం తనకు తెలియదని, సంబంధిత మంత్రితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో సిటీ బస్సులు : శివమొగ్గ-భద్రావతిలో కేఎస్ఆర్టీసీ బస్సులను నడపటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంపై రవాణా శాఖ అధికారులకు కూడా పలు సూచనలు చేశామని మంత్రి చెప్పారు. మరో మూడు నెలల్లోపు బస్ డిపో, బసాండ్ నిర్మాణం చేపడతామన్నారు. ఇప్పటికే అధికారులు పనులు వేగవంతం చేశార ని మంత్రి కిమ్మెన తెలిపారు. -
ఆధార్.. పరేషాన్
మంచిర్యాల సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే-2014లో ఆధార్ కార్డు వివరాలు సేకరించనుండడంతో జిల్లావాసులు పునరాలోచనలో పడ్డారు. జిల్లాలో నేటికీ 20 శాతం మంది ప్రజలకు ఆధార్ కార్డులు లేవు. సర్వే అంశాల్లో 21వ కాలంలో ఆధార్ కార్డు సంఖ్య వివరాలు నమోదు చేయాలని ఉంది. తెల్లవారితే ఎన్యూమరేటర్లు ఇంటిముందు వాలుతారు. అన్ని వివరాలు చెప్పినా ఆధార్ కార్డు అడిగితే ఏమని చెప్పాలి? అనే ప్రశ్న పలువురిని తొలుస్తోంది. జిల్లా వాసుల్లో కొందరు నాలుగైదు దఫాలుగా ఐరిస్ ఫొటో దిగినా కార్డు అందలేదు. మరికొందరివి తిరస్కరణకు గురయ్యాయి. ఇంకొందరివి పోస్టల్ ఆలస్యంతో చేతికందలేదు. పలువురికి సాంకేతిక కారణాలతో అందలేదు. ఇలా ఏదో ఒక కారణంతో ఆధార్ కార్డు రాకపోవడంతో మంగళవారం నిర్వహించే సర్వేలో పలు కుటుంబాల సభ్యులు ఇబ్బం దులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానికంగా ఉండక మరో ప్రాంతానికి ఉపాధి నిమిత్తం వెళ్లినవారు సైతం ఆధార్ కార్డు లేక సర్వే సందర్భంగా అవ స్థలు పడనున్నారు. అర్హులై ఉండి ఆధార్ కార్డు లేనివారు సంక్షేమ పథకాలకు దూరమవుతామనే ఆందోళనకు గురవుతున్నారు. శ్రావణమాసంలో పండుగ సెలవులకు ఆదివారాలు తోడు కావడంతో పోస్టల్ ఆలస్యం అవుతోంది. ఎప్పుడో ఆధార్ ఫొటో దిగినవారు ఇప్పుడు అవసరం రావడంతో మళ్లీ ఆధార్ కేంద్రం, మీసేవ, పోస్ట్‌మన్ చుట్టూ తిరుగుతున్నారు. సాం కేతిక కారణాలకు విద్యుత్ కోతలు తోడవడంతో సకాలంలో ఆధార్ కేంద్రాల్లో పనులు పూర్తికావడంలేదనే అభిప్రాయాలు ఉన్నా యి. ఆధార్ కార్డు కుటుంబంలో కొందరికి వచ్చి, మరి కొందరికి రాకపోవడం కూ డా సమస్యగా మారింది. -
సర్వేకు సహకరించాలి
18న ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు పాఠశాలలు, కళాశాలల యూజమాన్యాలకు డీఈఓ సూచన బస్సులతో తహసీల్దార్లకు రిపోర్ట్ చేయాలి డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ఖిలావరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ విజయ్‌కుమార్ కోరారు. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో శనివారం విద్యాశాఖ, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎంవీఐలకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమకు సంబంధించిన బస్సులను సమగ్ర సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లకు కేటారుంచి... వారిని మండల కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు తరలించాలని సూచించారు. కలెక్టర్ జి,కిషన్ ఆదేశాల మేరకు సమగ్ర సర్వేలో భాగస్వామ్యులయ్యేందుకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నెల 18న సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు వేల స్కూల్ బస్సులు, ఇతర వాహనాలకు సమాచారం అందించామన్నారు. జిల్లాలోని వడుప్సా, టీచర్స్, విద్యా సంస్థల ఆసోసియేషన్స్ బాధ్యులు స్వచ్ఛందంగా పాల్గొంటామని చెప్పారన్నారు. 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వహిస్తున్న సమగ్ర సమాజిక కుటుంబ సర్వేలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సెలవు దినంగా పాటించాలన్నారు. బస్సులను సమగ్ర సర్వేకు ఉపయోగించేకునేందుకు సహకరించాలని కోరారు. విద్యా సంస్థ యాజమాన్యాలు డ్రైవర్స్, క్లీనర్ల వివరాలతో బస్సులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆయా మండల తహసీల్దార్ కార్యాలయంలో 18వ తేదీన 2 గంటలకు బస్సుల వివరాలతో రిపోర్ట్ చేయాలన్నారు. కుటుంబంతో లేకుంటే ప్రభుత్వ పథకాలకు దూరమైతామనే భయం డ్రైవర్లు, క్లీనర్లకు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు బస్సుల వెంట పింపించే డ్రైవర్లు, క్లీనర్లకు సర్వేలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు ఇవ్వాలని విద్యాసంస్థల యూజమాన్యాలకు సూచించారు. జిల్లాలో విద్యా సంస్థల బస్సులు, ఇతర వాహనాల పర్యవే క్షకులుగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆయన వెల్లడించారు. వీరు బస్సులను అందుబాటులో ఉంచడంతోపాటు ఎప్పటికప్పుడు సర్వే సిబ్బందికి వివరాలు అందజేస్తారని డీటీసీ చెప్పారు. సమావేశంలో ఎంవీఐలు సత్యనారాయణ, నాగలక్ష్మి, ఎస్కే.మాసూద్ అలీ, వై.కొండల్రావు, ఈజే.జయకుమార్, జి.వేణుగోపాల్, శివస్వప్న, ఎల్.రాంచందర్, ఫహీమ సుల్తాన పాల్గొన్నారు. -
రేపు భూపంపిణీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15న జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ చేయనున్న భూములను గుర్తించారు. లబ్ధిదారులకు ప్రాథమిక స్థాయిలో హక్కు పత్రాలు ఇచ్చి.. తర్వాత పూర్తి స్థాయి రికార్డు డాక్యుమెంట్లు ఇవ్వాలా... లేక అదే రోజు పూర్తి స్థాయిలో పత్రాలు ఇవ్వాలా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. రెవెన్యూ పరంగా ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేలా వీటి విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టు 15న భూముల పంపిణీకి సంబంధించి జిల్లాలో 64 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిసింది. వీరిలో ఐదుగురు మహిళలకు హైదరాబాద్‌లోని గోల్కొండలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేతుల మీదుగా భూముల పత్రాలు ఇవ్వనున్నారు. మరో ఐదుగురు మహిళలకు జిల్లా కేంద్రంలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, జిల్లా కలెక్టర్ అందజేయనున్నారు. మిగిలిన వారికి ఆయా నియోజకవర్గాల్లో జరగనున్న కార్యక్రమాల్లో భూముల పంపిణీ పత్రాలు ఇవ్వనున్నారు. పూర్తిగా భూమి లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాలు, ఎకరం ఉంటే రెండు ఎకరాలు, రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం చొప్పున ప్రభుత్వం భూములు పంపిణీ చేయనుంది. నర్సంపేట నియోజకవర్గంలో 27 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆగస్టు 15న పంపిణీ చేయనున్న భూముల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాకు రూ.5 కోట్లను విడుదల చేసింది. భూముల కొనుగోలు కోసం రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. పూర్తిగా సాగుకు యోగ్యంగా ఉండే భూములనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసే భూముల విషయంలో పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయ పంటలకు అనువుగా ఉన్నా యా, భూముల రకాలు వంటి అంశాలతోపాటు రెవెన్యూ పరంగా ఉండే సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అధికార వర్గాల సమచారం ప్రకారం జిల్లాలో భూములు పంపిణీ చేయనున్న పది నియోజకవర్గాల్లోని గ్రామాలు ఇవీ... స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ మండలం పీసర గ్రామంలో భూ పంపిణీ పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మొగుళ్లపల్లి మండలం పిడిసిల్లలో భూములు పంపిణీ చేయనున్నారు. పంపిణీకి అవసరమైన భూములను ఇక్కడ సేకరించే పక్రియ చివరి దశలో ఉంది. జనగామ నియోజకవర్గంలో నర్మెట మండలం అమ్మాపూర్‌లో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ అవసరమైన భూములను కొనుగోలు చేస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలం పొనుగోడులో భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ ఉన్న భూములను గుర్తించి పంపిణీ అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట మండలం బాంజిపేటలో భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు. డోర్నకల్ నియోజకవర్గంలో మరిపెడ మండలం బీచరాజుపల్లిలో భూములను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో సంగెం మండలం రా మచంద్రాపురంలో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడే పంపిణీకి అనువుగా ఉన్న భూములను గుర్తించి సేకరిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కొడకండ్ల మండలం నర్సింగాపురంలో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్వతగిరి మండలం వడ్లకొండలో భూముల పంపిణీ కార్యక్రమం జరగనుంది. దీని కోసం రెవెన్యూ అధికారులు భూములు కొనుగోలు చేస్తున్నారు. ములుగు నియోజకవర్గం ములుగు మండలం కాసిందేవిపేటలో భూములు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి భూముల విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఇళ్ల పట్టాల వ్యవహారం మళ్లీ మొదటికి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ సదాశివపేట: ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అట్టహాసంగా పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 5,300 మందికి పట్టాల పంపిణీ చేయగా వీటిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అనర్హులకు, జిల్లాయేతరులకు కూడా పట్టాలిచ్చారని ఇటీవల స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. రెవెన్యూ రికార్డుల నుంచి సేకరించిన ప్రాథమిక ఆధారాలను కూడా ఆయన ముఖ్యమంత్రికి అందజేశారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ పాత పట్టాల కేటాయింపును రద్దు చేసి, తిరిగి అర్హులైన వారికి కొత్త పట్టాలు ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌ను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2013లో అట్టహాసంగా పంపిణీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి 2013 అక్టోబర్ 5న సదాశివపేట పట్టణానికి ఆనుకొని ఉన్న సిద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని స్థలాన్ని ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున కేటాయించి 5,300 మందికి పట్టాలను పంపిణీ చేశారు. ఇందుకోసం 160 మంది రైతుల నుంచి 184 ఎకరాల అసైన్డ్ భూమిని కూడా సేకరించారు. రైతుల ఆధీనంలో ఉన్న ఈ భూమికి ఎకరాలకు రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారంతో పాటు భూమి కోల్పోయిన వారికి ఇంటి స్థలం ఇచ్చేందుకు రెవిన్యూ అధికారులు అంగీకరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కేవలం రూ. 5.52 కోట్లు మాత్రమే నిధులను మంజూరు చేయడంతో గత అక్టోబర్‌లో ఎకరానికి రూ. 2.56 లక్షల చొప్పున అధికారులు చెల్లించారు. ఒప్పందం మేరకు మిగిలిన డబ్బు కూడా చెల్లించాలని రైతులు ఆందోళన చేస్తుండగానే.. 130 ఎకరాల భూమిలో గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల అధికారులు లే అవుట్‌ను రూపొందించారు. మరో 54 ఎకరాల్లో లేఅవుట్ చేయవలసి ఉంది. ఆది నుంచీ వివాదమే 2007లో కూడా ఈదులవాగు సమీపంలోని ప్రభుత్వ భూమిలో 2,000 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే ఇక్కడ గృహ నిర్మాణం చేసేందుకు అనువుగా లేదన్న కారణంతో ఈదుల వాగు పట్టాలు రద్దు చేసి వారికి కూడా ఇక్కడే పట్టాలిచ్చారు. ఇక మిగిలిన 3,300 పట్టాల్లో దాదాపు 80 శాతం పట్టాలు అక్రమార్కుల చేతిల్లోకే వెళ్లిపోయినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. 1,300 పట్టాల్లో అప్పటి తహశీల్దార్ శంకరప్ప ఎలాంటి అర్హతా పత్రాలను పరిశీలించకుండా ఎమ్మెల్యే సూచనల మేరకు అనర్హులకు పట్టాలు మంజూరు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీళ్లు కాకుండా సంగారెడ్డి పట్టణం, అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వ్యక్తులు కూడా పట్టాలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పట్టణంలోని 23 వార్డుల పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులకు ఒక్కొక్కరికి 20 చొప్పున ఖాళీ పట్టా సర్టిఫికెట్లను అందజేయగా, వాళ్లు తమకిష్టమైన వారికి, డ బ్బులు ఇచ్చిన వారిపేర్లతో పట్టాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ అక్రమాలపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో వాటిని రద్దు చేయాలని సర్కార్ నిర్ణయించింది. -
పడిన చోటే..
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘అయ్యా...నా బిడ్డ ఎలాగూ బతకడు. వాడిని అక్కడే సమాధి చేయడానికి అనుమతించండి. తవ్వేసిన నా భూమిని... గతంలో ఉన్నట్లు యథా స్థితిలో తిరిగి నాకు అప్పగించండి’...ఇది బాగలకోటె జిల్లా సూళగేరిలో గత ఆదివారం బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల తిమ్మన్న తండ్రి హనుమంతప్ప జిల్లా కలెక్టర్ మేఘన్ననవర్కు చేసిన విన్నపం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు. మరో వైపు 160 అడుగుల లోతు నుంచి సజీవంగా తీసుకు రాలేని తిమ్మన్నను, నిర్జీవంగానైనా తీసుకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు అనేక విఘ్నాలు ఎదురవుతున్నాయి. దీంతో అతను మట్టిలో కలసిపోవడం దాదాపు ఖాయమని వినవస్తోంది. తిమ్మన్న బోరు బావిలో పడిపోయినప్పటి నుంచి అతనిని బయటకు తీసుకు రావడానికి చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా తవ్విన సమాంతర గుంతలో లోతుకు వెళ్లే కొద్దీ ఉన్నఫళంగా కూలిపోతుందేమోననే భీతి సిబ్బందిని వెంటాడుతోంది. పొలంలో లోతున మట్టి స్వభావం బంక మట్టిని పోలి ఉంది. ఇలాంటి బురద మట్టితో అపాయమని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీగా జాగ్రత్త చర్యలు చేపట్టి, శవాన్ని వెలికి తీయాలంటే కనీసం ఎనిమిది రోజులు పడుతుందని అంచనా. కుమారుడు బోరు బావిలో పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై బాగలకోటె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది, సూలగిరికి తిరిగి వచ్చిన హనుమంతప్ప, గురువారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. కాగా పొలంలో మట్టి స్వభావాన్ని పరీక్షించడానికి ఆ రంగంలో నిపుణుడైన ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తిని పిలిపించినట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్ఆర్. పాటిల్ తెలిపారు. ఆయన మట్టి పరీక్షలను పూర్తి చేసిన అనంతరం జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజా ప్రతినిధులు, సూళగేరి గ్రామ పెద్దలతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా తిమ్మన్న శవాన్ని వెలికి తీయడానికి సాగుతున్న పనులను ప్రభుత్వం ఆపివేయలేదు. అయితే బాలుడి తండ్రి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
నియోజకవర్గానికో ఉపవిద్యాధికారి
మంచిర్యాల సిటీ : ఉచిత నిర్బంధ విద్యను పటిష్టంగా అమలుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా పర్యవేక్షణపై మొదటగా దృష్టి సారించింది. పర్యవేక్షణ పకడ్బందీగా లేనిదే మెరుగైన విద్యనందించడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో శాసనసభ నియోజకవర్గానికో ఉప విద్యాధికారిని నియమించాలని భావిస్తోంది. విద్యాశాఖలో అడ్డగోలుగా ఖాళీలు ఉండడంతో ప్రాథమిక విద్య అడుగుంటిపోతోందని ఉపాధ్యాయ వర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో ఒక్క జిల్లా విద్యాధికారితోపాటు ముగ్గురు మండల విద్యాధికారులే శాశ్వత అధికారులుగా పని చేస్తున్నారు. 49 మండలాలకు ఇన్చార్జి ఎంఈవోలే ఉన్నారు. పెరుగనున్న పోస్టులు జిల్లాలో ప్రస్తుతానికి మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాలకు ఇద్దరు ఇన్చార్జి డెప్యూటీ ఈవోలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గానికి ఒకరు చొప్పున భర్తీ చేస్తే.. 10 నియోజకవర్గాలకు పది మంది ఉపవిద్యాధికారులు నియామకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నియోజక వర్గాలు పెంచాలని సీఎం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. నియోజకవర్గాలు పెరిగితే అందుకు అనుగుణంగా మరిన్ని పోస్టులూ పెరుగుతాయి. తగ్గనున్న భారం నియోజకవర్గానికో ఉప విద్యాధికారి నియామకమైతే వారికి భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్నవారు 20కి పైగా మండలాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలను పర్యవేక్షించడం ఒక్కరితో సాధ్యం కాదు. నియోజకవర్గానికి ఒకరిని నియమిస్తే పరిపాలన సులభమవుతుంది. విద్యార్థులకు మెరుగైన విద్య అందే అవకాశాలు ఉంటాయి. సర్వశిక్ష అభియాన్‌కు విద్యాశాఖ అధికారులే.. సర్వశిక్ష అభియాన్‌కు ఇన్నేళ్లుగా విద్యాశాఖకు సంబంధం లేని అధికారులే ప్రాజెక్టు అధికారులుగా నియమితులయ్యేవారు. కేంద్రం ఆదేశాల ప్రకారం పీవో పోస్టులు డీఈవో అజమాయిషీలోనే ఉండాలి. నాలుగేళ్ల కిందట ఈ విధానానికి స్వస్తి పలికింది. ఇతర విభాగాలకు చెందిన అధికారులను నియమించడంతో విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులనే నియమించి ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నాలుగేళ్ల కిందటి మాదిరిగా అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
పల్లెలకే పరిమితం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘సమగ్ర కుటుంబ సర్వే’పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. ఒకే రోజు జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహణకు సరిపడా సిబ్బంది సమకూరే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వేను గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టాలని నిర్దేశించింది. ఈ సర్వేను ఏకకాలంలో నిర్వహించడం ద్వారా అక్రమార్కులను సులువుగా తొలగించవచ్చని భావించింది. ప్రభుత్వం సంకల్పం మంచిదే అయినా, జిల్లా విషయానికి వచ్చేసరికి ఒకే రోజు సర్వే నిర్వహణ ఆచరణసాధ్యంగా కనిపించడంలేదు. జిల్లాలో 15.12 లక్షల ఇళ్లల్లో సుమారు 60 లక్షల జనాభా వివరాలను సేకరించడం యంత్రాంగానికి కత్తిమీద సామే. ఒక ఎన్యుమరేటరు (సర్వే చేసే వ్యక్తి) సగటున 25 ఇళ్లను సర్వే చేసే అవకాశముంటుందని అంచనా. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా ఒకే రోజు సర్వే నిర్వహించాలంటే దాదాపు 60వేల సిబ్బంది అవసరమని యంత్రాంగం లెక్క గట్టింది. అందుబాటులో 22 వేలే..! ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘సమగ్ర సర్వే’కు జిల్లాలో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా తయారైంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగో తరగతి మినహా అన్ని కేట గిరిల ఉద్యోగులను ఈ విధులకు వినియోగించుకోవాలని భావించిన యంత్రాంగం.. ఉద్యోగుల వివరాలను సేకరించింది. ఈ క్రమంలో 22వేల మంది ఉద్యోగులున్నట్లు అధికారులు తేల్చారు. సర్వేకు అవసరమున్న స్థాయి లో సిబ్బంది సమకూరకపోవడంతో యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న యంత్రాంగం.. సార్వత్రిక ఎన్నికల విధుల్లో వినియోగించుకున్న సిబ్బందిని తాజా సర్వేకు వినియోగించుకోవాలని యోచిస్తోంది. అంత ఈజీ కాదు.. జిల్లాలోని ప్రైవేటు సంస్థల్లో దాదాపు 10వేల మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న మరో 10వేల మంది ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే 2 వేల ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను, బ్యాంకుల్లో పనిచేస్తున్న మరో 8వేల మంది, జంటనగరాల్లోని ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాల్లోని 3వేల మంది ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీలో పనిచేసే 2వేల మంది సిబ్బందిని ఈ సర్వే ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కార్యచరణ రచిస్తోంది. అయితే ఈ ఉద్యోగులను సర్వే ప్రక్రియలోకి దించాలంటే ఆయా శాఖల ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ, బ్యాంకు సిబ్బందిని సర్వేలోకి దించడం ఆషామాషీ వ్యవహారం కాదని అధికారవర్గాలే అంటున్నాయి. గ్రామాలకే పరిమితం చేస్తే... ప్రస్తుతం జిల్లాలో 15.12 లక్షల కుటుం బాలుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 4.12 కుటుంబాలున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆరు మున్సి పాల్టీలలో సర్వే చేసేందుకు 16వేల సిబ్బంది అవసరమని యంత్రాంగం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 19వ తేదీన ‘ఇంటింటి సర్వే’ను జీహెచ్ఎంసీ పరిధిని మినహాయించి గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లా యంత్రాంగానికి సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ సర్వేకు కేవలం 16వేల మంది సిబ్బంది మాత్రమే అవసరమని భావిస్తూ.. జీహెచ్ఎంసీ పరిధిలో మరో రోజు సర్వే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. సిబ్బంది కొరత దృష్ట్యా ఒకే రోజు జంట జిల్లాల్లో సర్వే అసాధ్యం కనుక.. మరో రోజు పొడిగించే అంశంపై కూడా చర్చలు సాగిస్తోంది. -
రవీందర్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి
వరంగల్ క్రైం : విధి నిర్వహణలో రవీందర్‌రెడ్డిని మిగతా సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు అన్నారు. మూడు రోజుల క్రితం ఉద్యోగ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై మాధవరెడ్డి రవీందర్‌రెడ్డిని స్పెషల్ బ్రాంచ్ విభాగం సిబ్బంది, అధికారులు ఘనంగా సన్మానించారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ జనార్దన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, అదనపు ఎస్పీ ఎం.యాదయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొని ఎస్సై రవీందర్‌రెడ్డిని సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. 1979లో పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా చేరిన రవీందర్‌రెడ్డి 1983లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2001లో ఏఎస్సైగా, 2009లో ఎస్సైగా ఉద్యోగోన్నతి పొందారు. ఎస్సైగా రాయపర్తి, బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించారు. అర్బన్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. రవీందర్‌రెడ్డి పదవీ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేవ, ఉత్తమ సేవ పతకాలను అందుకోవడంతోపాటు 50కిపైగా శాఖాపరమైన రివార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రవీందర్‌రెడ్డి సమయ పాలన పాటిస్తూ తనకు అప్పగించిన పనులను విజయవంతంగా నిర్వహించారన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీలు వాసుసేన, నాగరాజు, డీఎస్పీ జనార్దన్, సీఐ మదన్‌లాల్, ఎస్సైలు సత్యనారాయణ, రహమాన్, రవికుమార్, కరుణాకర్‌తోపాటు ఇతర స్పెషల్ బ్రాంచ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులే ప్రజలకు నిజమైన మిత్రులు ప్రజలకు పోలీసులే నిజమైన మిత్రులని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు అన్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వరంగల్ అర్బన్ ఎస్పీ విద్యార్థులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టడంతోపాటు చిన్నారుల చేత కట్టించుకున్నారు. విద్యార్థులు, ప్రజలు నిర్వహించుకునే ఫ్రెండ్షిప్ డే రోజున శాంతిభద్రతల కోసం నిరంతరం శ్రమించే పోలీసులను కూడా తమ మిత్రులుగా భావించాలని ఎస్పీ తెలిపారు. తమ కుటుంబం కన్నా ప్రజల రక్షణే తన లక్ష్యంగా విధులు నిర్వహించే పోలీసులు అన్నివర్గాల ప్రజలకు మిత్రులన్నారు. తేజస్వీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు మన్నవ లక్ష్మీమహతి, మాధవశర్మ, లహరి అర్బన్ ఎస్పీకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారు. అనంతరం విద్యార్థులకు తిరిగి ఎస్పీకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారు. -
‘ఫాస్ట్’ కోసం నిరీక్షణ
ఖమ్మం హవేలి: తెలంగాణ విద్యార్థుల ఫీజులు చెల్లించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం అమలుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు రాకపోవడంతో ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు కాలేదు. పైగా గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా పెండింగ్‌లో ఉన్న ఫీజులు ప్రభుత్వం నుంచి రాలేదు. విద్యార్థుల స్థానికతకు సంబంధించి ఇంకా కచ్చితమైన నిర్ణయం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 410 కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మార్గదర్శకాలు వెలువడలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల వివరాలు పొందుపరిచిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఆన్లైన్ ద్వారా వివరాలు పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కళాశాలలు ఆన్లైన్లో డేటా ఇచ్చి అందుకు సంబంధించిన కాపీలు తీయాలి. ప్రిన్సిపాల్ సంతకం పెట్టి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ సంక్షేమశాఖలకు వీటిని అందజేయాలి. కానీ జిల్లాలో ఉన్న కళాశాలల్లో సుమారు 100 కాలేజీలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇందులో ప్రభుత్వ కళాశాలలు కూడా ఉండటం గమనార్హం. 2007-08 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు బీసీ సంక్షేమశాఖ ద్వారా బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.277 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించింది. రూ.212 కోట్లకు సంబంధించి కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చాయి. మరో రూ.65 కోట్లకు సంబంధించి బీసీ సంక్షేమశాఖకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కళాశాలల నుంచి రావాల్సి ఉంది. మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా మైనారిటీ విద్యార్థులకు రూ.6 కోట్ల వరకు ఫీజులు వచ్చాయి. ఇందులో రూ.1.2 కోట్లకు సంబంధించి కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.220 కోట్ల ఫీజులు వచ్చాయి. వీటిలో రూ.40 కోట్లకు కళాశాలల నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఈ శాఖకు అందాల్సి ఉంది. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు నిర్లక్ష్యం వీడితే గత విద్యాసంవత్సరం పెండింగ్‌లో ఉన్న ఫీజులు విడుదల అయ్యే అవకాశం ఉంది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులకు రూ.36 కోట్లకు గాను రూ.26 కోట్లు రాగా మరో రూ.10 కోట్లు రావాల్సి ఉంది. మైనారిటీ విద్యార్థులకు రూ.1.33 కోట్లకు రూ.1.13 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.20 లక్షలు రావాల్సి ఉంది. బీసీ విద్యార్థులకు రూ.17కోట్లు, ఈబీసీ విద్యార్థులకు రూ.6 కోట్లు రావాల్సి ఉంది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజులతో పాటు కొత్త పథకం వేగంగా అమలు కావాలంటే కళాశాలలు వెంటనే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందజేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. -
ఊరు.. హుషారు
ఇందూరు: కొత్త విధానంలో భాగంగా ముందుగా గ్రామాలవారీగా, ఆ తరువాత మండల, జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి పంపించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు ఎవరికి వారు పనులలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, మండల అభివృద్ధి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు కూడా ఈ కార్యక్రమం గురించి అవే ఉత్తర్వులను పంపించారు. ఈ నెల 13నుంచి 18 వరకు గ్రామాలవారీగా, 19 నుంచి 23 వరకు మండలాలవారీగా, 24నుంచి 28 వరకు జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేందుకు జిల్లా అధికారులు సమాయత్తమవుతున్నారు. ఏం చేస్తారు! గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసి ఇవ్వాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించిన ప్రభుత్వం, పలు అంశాలను సూచించింది. వీటి ఆధారంగా ప్రణాళికలను తయారు చేసుకోవాలని వివరించింది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగం, ఉపాధి, రోడ్లు, మురుగుకాలువలు తదితర అంశాలపై సమగ్రంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలిపింది. వీటి కోసం గ్రామాలలో ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించాలని, అక్కడి తీర్మానాలను ప్రణాళికలో చేర్చాలని పేర్కొంది. గ్రామసభలను మొక్కుబడిగా కాకుండా, అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలిచ్చింది. పక్కా గా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసే బాధ్యతలను గ్రామ సర్పంచ్, కార్యదర్శులతో పాటు ఎంపీడీఓలకు అప్పగించారు. వీటి ఆధారంగానే గ్రామలవారీగా అభివృద్ధి నిధులను ప్రభుత్వం కేటాయించనుంది. రిసోర్సు పర్సన్లతో అవగాహన గ్రామాలవారీగా అభివృద్ధి ప్రణాళికలను ఎలా తయారు చేయాలనే విషయంపై సర్పంచులకు, కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు రిసోర్సు పర్సన్లను నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రామానికి ఒకరు, మండలానికి ఇద్ద రు చొప్పున రిసోర్సు పర్సన్లను అధికారులు నియమించనున్నారు. ఈ రిసోర్సు పర్సన్ లకు కూడా శిక్షణనిచ్చేందుకు జిల్లా స్థాయిలో 18 మంది మాస్టర్ ట్రైనర్స్‌ను నియమించారు. వీరు రిసోర్సు పర్సన్లకు శిక్షనిచ్చి గ్రామాలు, మండలాలకు పంపుతారు. గ్రామస్థాయివారు 12న, మండలస్థాయివారు 11న మాస్టర్ ట్రైనర్స్ ఆద్వర్యంలో శిక్షణ పొందుతారు. ఇందుకోసం డివిజన్లవారీగా అవగాహన సదస్సులు పెట్టడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామాలలో రిసోర్సు పర్సన్లుగా పని చేసేందుకు విద్యావంతులు అయిన యువకులను ఎంపిక చేసే బాధ్యతలను ఎంపీడీఓలకు అప్పగించారు. -
శ్రీశైలాలయ పనులు వివాదాస్పదం
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివాదాస్పదమయ్యాయి. ఈ పనులపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బృహత్తర ప్రణాళికలో భాగంగా రూ.600 కోట్లతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, షాపింగ్ కాంప్లెక్స్, క్యూకాంప్లెక్స్, డార్మెటరీ, కల్యాణమండపం, పుష్కరిణి నిర్మించాలని భావించారు. ఇందులో అతి ముఖ్యమైనది రూ.49 కోట్లతో చేపట్టిన నీటిశుద్ధి, భూగర్భ నీటివ్యవస్థ. మరో రూ.25 కోట్లతో సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయం, రూ.14 కోట్లతో డార్మెటరీల నిర్మాణం, రూ.7 కోట్లతో స్నానఘట్టాలు, రూ.3.50 కోట్లతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, చంద్రావతి కళ్యాణ మండపం పనులు చేస్తున్నారు. ఈ పనులన్నీ ఏడాదిన్నరగా కొనసా..గుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లోపంతో జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. విధ్వంసం..అభివృద్ధి ఏకకాలంలో చూపించిన ఈఓ ఆజాద్.. శ్రీశైలాలయప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ఈఓ చంద్రశేఖర ఆజాద్ చేపట్టిన అభివృద్ధి పనులు చేపట్టారు. అదే సమయంలో అతి ప్రాచీన, పురాతన కట్టడాలను నేలమట్టం చేసి విధ్వంసం సృష్టించారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఆలయప్రాంగణంలో ఈశాన్యదిశగా భారీ ఎత్తున తవ్వకాలను చేపట్టి, అదేస్థానంలో తిరిగి నూతన కట్టడాలను నిర్మించారు. సాలుమండపాల్లో కొంత భాగాన్ని తొలగించి తిరిగి కొత్తగా కోటగోడ దక్షిణ వాయువ్యంలో నిర్మించడంపై భక్తులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పంచభుతాల ప్రతిష్ఠిత ఆలయాల పక్కనే ఉన్న మండ పాన్ని తొలగించి మెట్ల మార్గాన్ని అదనంగా పొడగించడం స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అదే విధంగా అభివృద్ధి పేరున సుమారు పాతిక అడుగుల మేర ఎత్తున గాల్వలం షీట్లతో విశాలమైన షెడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఆలయప్రాంగణం శోభను కొల్పోయిందని, పురాతన ఆనవాళ్లన్నీ నాశనం చేశారని పండితులు కొందరు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలకు భంగం... మల్లన్న లింగ స్వరూపం అరిగిపోతుందనే కారణం చూపిస్తూ సువర్ణకవచం ఏర్పాటు చేయాలనే ఆలోచనను వీరశైవ భక్తులు, పండితులు వ్యతిరేకించారు. దీనిపై అనేక విమర్శలు రావటంతో ఆ ప్రయత్నాన్ని నిలిపివేసి చివరకు లింగంచుట్టూ గాడి ఏర్పందని, దాన్ని పూడ్చివేసి మూలికలు, రసాయనాలు, పాషాణాలతో అష్టబంధనంచేయాలని సంకల్పించారు. ఇందుకు జగద్గురు పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, విశాఖ శారదా పీఠాధిపతితో పాటు పలువురు పీఠాధిపతులు అనుమతి పత్రాలు అందజేశారని ఈఓ పేర్కొంటున్నారు. అయితే ఇప్పటి వరకు స్వామిజీలు, పీఠాధిపతులు ఇచ్చిన అనుమతి పత్రాలను బయటపెట్టిన దాఖలాలు లేకపోవటం గమనార్హం. మల్లన్న అష్టబంధన కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తటం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గత నెల జూన్ 9న జరగాల్సిన అష్టబంధన కార్యక్రమం, పరివార ఆలయాలపై కలశస్థాపన, స్వామివార్ల గర్భాలయం కుంబాభిషేకం పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఎక్కడి పనులు అక్కడ నిలిపివేసి యధాస్థితిని కొనసాగించాల్సిందిగా‘ కెప్ట్ అబయన్స్’ ఉత్తర్వులు ఈఓకు జారీచేశారు. ఓ వైపు పురాతన కట్టడాలను తొలగిస్తూనే మరోవైపు ఆలయ ప్రాంగణంలోని కట్టడాలలో సహజత్వాన్ని తీసుకురావడానికి రాతి నిర్మాణాలపై ఏర్పాటు చేసిన టైల్స్, సున్నపు పొరలను శాండ్‌బ్లాస్టింగ్ ద్వారా తొలగించే ప్రక్రియ చేపట్టారు. అదే విధంగా భారీ షెడ్లు ఏర్పాటు చేయటంతో ఆలయప్రాంగణం రూపురేఖలు కోల్పోయి సహజత్వానికి భిన్నంగా దర్శనమిస్తోంది.