మంచిర్యాల సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే-2014లో ఆధార్ కార్డు వివరాలు సేకరించనుండడంతో జిల్లావాసులు పునరాలోచనలో పడ్డారు. జిల్లాలో నేటికీ 20 శాతం మంది ప్రజలకు ఆధార్ కార్డులు లేవు. సర్వే అంశాల్లో 21వ కాలంలో ఆధార్ కార్డు సంఖ్య వివరాలు నమోదు చేయాలని ఉంది. తెల్లవారితే ఎన్యూమరేటర్లు ఇంటిముందు వాలుతారు. అన్ని వివరాలు చెప్పినా ఆధార్ కార్డు అడిగితే ఏమని చెప్పాలి? అనే ప్రశ్న పలువురిని తొలుస్తోంది.
జిల్లా వాసుల్లో కొందరు నాలుగైదు దఫాలుగా ఐరిస్ ఫొటో దిగినా కార్డు అందలేదు. మరికొందరివి తిరస్కరణకు గురయ్యాయి. ఇంకొందరివి పోస్టల్ ఆలస్యంతో చేతికందలేదు. పలువురికి సాంకేతిక కారణాలతో అందలేదు. ఇలా ఏదో ఒక కారణంతో ఆధార్ కార్డు రాకపోవడంతో మంగళవారం నిర్వహించే సర్వేలో పలు కుటుంబాల సభ్యులు ఇబ్బం దులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానికంగా ఉండక మరో ప్రాంతానికి ఉపాధి నిమిత్తం వెళ్లినవారు సైతం ఆధార్ కార్డు లేక సర్వే సందర్భంగా అవ స్థలు పడనున్నారు.
అర్హులై ఉండి ఆధార్ కార్డు లేనివారు సంక్షేమ పథకాలకు దూరమవుతామనే ఆందోళనకు గురవుతున్నారు. శ్రావణమాసంలో పండుగ సెలవులకు ఆదివారాలు తోడు కావడంతో పోస్టల్ ఆలస్యం అవుతోంది. ఎప్పుడో ఆధార్ ఫొటో దిగినవారు ఇప్పుడు అవసరం రావడంతో మళ్లీ ఆధార్ కేంద్రం, మీసేవ, పోస్ట్‌మన్ చుట్టూ తిరుగుతున్నారు. సాం కేతిక కారణాలకు విద్యుత్ కోతలు తోడవడంతో సకాలంలో ఆధార్ కేంద్రాల్లో పనులు పూర్తికావడంలేదనే అభిప్రాయాలు ఉన్నా యి. ఆధార్ కార్డు కుటుంబంలో కొందరికి వచ్చి, మరి కొందరికి రాకపోవడం కూ డా సమస్యగా మారింది.
ఆధార్.. పరేషాన్
Published Tue, Aug 19 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement