పరిశుభ్రతలో ఆదర్శంగా ఉందాం | Ideally hygiene undam | Sakshi
Sakshi News home page

పరిశుభ్రతలో ఆదర్శంగా ఉందాం

Published Thu, Oct 16 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

Ideally hygiene undam

యూనివర్సిటీ క్యాంపస్ : పరిశుభ్రతలో ఎస్వీ యూనివర్సిటీ ఆదర్శంగా ఉండాలని వీసీ రాజేంద్ర పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఆధ్వర్యంలో బుధవారం ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంపస్‌లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించి, చెత్తకుప్పలు తొలగించారు. మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద సభ నిర్వహించారు. ఈ సమావేశంలో వీసీ రాజేంద్ర మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛభారత్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘జన్మభూమి-మా వూరు’ ఒక యజ్ఞంలా జరుగుతున్నాయన్నారు.

విశ్వవిద్యాలయాలు ఆదర్శంగా ఉండాలన్న భావనతో ఎస్వీయూ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం వీసీ రాజేంద్ర, రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ దేవరాజులు మొక్కలు నాటారు. చివరగా ఎస్వీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల విద్యార్థులతో కలసి సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement