లక్నో: నిరుపేద యువతులు, మహిళల్లో రుతుస్రావంలో పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి ఉత్తరప్రదేశ్‌లో ఒక స్కూలు టీచర్ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తన సొంత డబ్బులతో ‘‘ప్యాడ్ బ్యాంక్’’ను ఏర్పాటు చేసి గ్రామంలో అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. బరేలి జిల్లా బొరియా బ్యాంకులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రాఖీ గంగ్వార్ తమ ఊళ్లో యుక్త వయసుకి వచి్చన అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో ఇంకా పాతకాలం పద్ధతుల్లో బట్టలనే వాడడం పట్ల ఆవేదనతో ఉండేవారు.
వారిలో శానిటరీ ప్యాడ్స్‌పై అవగాహన పెంచడానికి స్కూల్లోనే ప్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. తన సొంత డబ్బుతో ప్యాడ్స్ కొని ఆ బ్యాంకులో ఉంచుతున్నారు. అవి వాడడానికి ముందుకొచి్చన వారికి ఉచితంగా ఇస్తూ ఎలా వాడాలో నేరి్పస్తూ వారిలో అవగాహన పెంచుతున్నారు. మే 15న మదర్స్ డే సందర్భంగా ఈ బ్యాంక్ ప్రారంభించారు. మొదట్లో శానిటరీ ప్యాడ్స్ వాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో పరిశుభ్రత గురించి వివరంగా చెప్పాక ఒక్కొక్కరు వచ్చి ప్యాడ్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అలా ప్రస్తుతం ప్రతీ నెలా 150 వరకు మహిళలు ప్యాడ్ బ్యాంక్‌కి వస్తున్నారని రాఖీ గంగ్వార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment