Hygiene
-
యూపీ స్కూల్ టీచర్
లక్నో: నిరుపేద యువతులు, మహిళల్లో రుతుస్రావంలో పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి ఉత్తరప్రదేశ్‌లో ఒక స్కూలు టీచర్ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తన సొంత డబ్బులతో ‘‘ప్యాడ్ బ్యాంక్’’ను ఏర్పాటు చేసి గ్రామంలో అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. బరేలి జిల్లా బొరియా బ్యాంకులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రాఖీ గంగ్వార్ తమ ఊళ్లో యుక్త వయసుకి వచి్చన అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో ఇంకా పాతకాలం పద్ధతుల్లో బట్టలనే వాడడం పట్ల ఆవేదనతో ఉండేవారు. వారిలో శానిటరీ ప్యాడ్స్‌పై అవగాహన పెంచడానికి స్కూల్లోనే ప్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. తన సొంత డబ్బుతో ప్యాడ్స్ కొని ఆ బ్యాంకులో ఉంచుతున్నారు. అవి వాడడానికి ముందుకొచి్చన వారికి ఉచితంగా ఇస్తూ ఎలా వాడాలో నేరి్పస్తూ వారిలో అవగాహన పెంచుతున్నారు. మే 15న మదర్స్ డే సందర్భంగా ఈ బ్యాంక్ ప్రారంభించారు. మొదట్లో శానిటరీ ప్యాడ్స్ వాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో పరిశుభ్రత గురించి వివరంగా చెప్పాక ఒక్కొక్కరు వచ్చి ప్యాడ్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అలా ప్రస్తుతం ప్రతీ నెలా 150 వరకు మహిళలు ప్యాడ్ బ్యాంక్‌కి వస్తున్నారని రాఖీ గంగ్వార్ వివరించారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మంత్రి తలసాని
సనత్‌నగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను ఆదివారం ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, వర్షాకాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు, పిచి్చమొక్కలు, వ్యర్థాలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఫాగింగ్ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీ శంకర్, ఎంటమాలజీ ఎస్ఈ దుర్గాప్రసాద్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం అండ: మంత్రి యాదవుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులు.. అధ్యక్షుడు మేకల యాదయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రిని ఆయన నివాసంలో ఆదివారం కలిసి శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో గౌరవ అధ్యక్షుడు అల్లి వేణుయాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్మనబోయిన సైదులు యాదవ్, ఉపాధ్యక్షుడు కదారి గోపి, సాంస్కృతిక విభాగం మహిళా అధ్యక్షురాలు మంజులత యాదవ్, యూత్ అధ్యక్షుడు దొంగరి శివకుమార్, సల్లా సైదులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోసాల గోపాల కృష్ణ ఉన్నారు. కాగా, మంజుల యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన గురుకులం, ఇతర పాటల పోస్టర్లను మంతి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
ప్రాథమిక పరిశుభ్రతపై పిల్లలకు వర్క్ షాప్
సాక్షి, హైదరాబాద్: రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ప్రాథమిక పరిశుభ్రతను పాటించాలని సెసేమ్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనాలి ఖాన్ సూచించారు. సెసేమ్ వర్క్‌షాప్-ఇండియా, సెసేమ్ వర్క్‌షాప్ యొక్క భారతీయ విభాగం, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నాన్ ప్రాఫిట్ మీడియా, ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్, హైజీన్ అండ్ బిహేవియర్ చేంజ్ కోయలిషన్ (HBCC)తో కలిసి ప్రజలలో 'చేతి పరిశుభ్రత, వ్యాధుల నివారణ' గురించి అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్ నిర్వహించారు. 'తినే ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడగడం మర్చిపోవద్దు. పిల్లలు, కుటుంబాలలో పరిశుభ్రత జ్ఞానం, వైఖరులు, అభ్యాసాలను ప్రోత్సహించడం, అభివృద్ధి అవసరాలను తీర్చడం మా లక్ష్యం' అన్నారు. ఈ విషయం మనందరికీ చిన్నప్పటి నుంచి నేర్పుతున్నదే ఐనప్పటికీ కోవిడ్ మహమ్మారి ప్రారంభంతో, అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి ఈ ప్రాణాలను రక్షించే అలవాటును సాధారణ జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం మరింత ముఖ్యమైందిగా మారిందని పేర్కొన్నారు. చదవండి: జీడిమెట్లలో కుప్పకూలిన పురాతన భవనం -
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న... పరిశుభ్రత ప్రశ్నార్థకం
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలకు తోడు కోవిడ్ ఫోర్తు వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నెల 23 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలను కూడా పరీక్ష కేంద్రాలుగా గుర్తించడంతో ఏర్పాట్లు సమస్యగా మారాయి. సర్కారు బడుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల కొరత వెంటాడుతుంటంతో ఇప్పటి వరకు ప్రైవేటు సిబ్బందితో పనులు కొనసాగిస్తూ వచ్చారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు రానప్పటికీ టీచర్లందరు కలిసి సిబ్బంది వేతనాలను భరిస్తూ వచ్చారు. ఇక పరీక్షలు కేంద్రాల్లో సదుపాయాలను సమకూర్చేందుకు నిధుల కొరతతోపాటు ప్రైవేట్ సిబ్బంది విధులకు హాజరయ్యే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా ఇప్పటివరకు పాఠశాలల్లో పనిచేసిన స్వీ పర్లు, స్కావెంజర్లు డ్యూటీకి రాకుంటే పరిస్థితి ఏమిట ని ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 62 మంది సిబ్బందే.. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 690 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నా యి. ఆయా స్కూళ్లలో ప్రస్తుతం 1,06,635 మంది చదువుతుండగా, 6,200 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు నాలుగో తరగతికి చెందిన సుమారు 62 మంది పర్మనెంట్ అటెండర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఇతర పాఠశాలల్లో ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని తరగతి గదులు, నీటి ట్యాంకులు, మరుగుదొడ్లను శుభ్రం చేయడంతోపాటు విద్యార్థులకు తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్ధితేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెండేళ్ల నుంచి.. కరోనాకు ముందు పాఠశాల నిధులు (స్కూల్ గ్రాంట్) నుంచి కొంత డబ్బులు తీసి ఒక్కొక్కరికి నెలకు రూ.2500 వేతనం కింద ఇచ్చేవారు. సర్వశిక్ష అభియాన్ కింద కేటాయించే నిధులను కోవిడ్ కాలం నుంచి రద్దు కావడంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై భారం పడినట్లయింది. తాము పని చేస్తున్న స్కూల్లో మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు, తరగతి గదులను శుభ్రం చేయించేందుకు సొంతంగా డబ్బులు సమకూర్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూల్లో ఒక్కొక్కరు రూ.300 నుంచి 500 ఇస్తుండగా, ఎక్కువ ఉన్న చోట్ల రూ.500–1000 వరకు వేసుకొని వారికి వేతనాలుగా అందిస్తున్నారు. పరీక్షల సమయంలో ఎలా? వాస్తవంగా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తవుతుంటాయి. అప్పుడు అటెండర్లు, స్వీపర్లు, స్కావెంజర్ల సమస్య ఎదురయ్యేది కాదు. ప్రస్తుతం వేసవి సెలవుల సమయంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనుండడంతో ఏర్పాట్లు సమస్యగా తయారైంది. వేసవి సెలవుల్లో ప్రైవేట్ స్వీపర్లు, స్కావెంజర్లు విధులకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదని కొందరు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు రోజువారీగా తరగతి గదులను శుభ్రం చేయడంతోపాటు తాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది, ఎండాకాలం సెలవుల్లో వేతనం ఇచ్చే పరిస్థితి ఉండకపోవడంతో మెజారిటీ సిబ్బంది విధులకు హాజరుపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రంజాన్‌కు భారీ బందోబస్తు) -
మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతకే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: తోటి మహిళలు ఆరోగ్యం, పరిశుభ్రతపై తమకున్న ఆందోళనలను స్వేచ్ఛగా బయటకు వెళ్లడించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడమే తన ధ్యేయమని మిస్ యూనివర్స్–2021 కిరీటధారి హర్నాజ్ సంధు(21) చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తోపాటు రుతుక్రమ సమయంతో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్న తన తల్లి, గైనకాలజిస్ట్ రవీందర్ కౌర్ సంధుయే తనకు ఆదర్శమన్నారు. ‘మహిళలు తమ ఆరోగ్యం గురించి స్వేచ్ఛగా బయటకు చెప్పుకోగలగాలి. మా వర్గీయుల్లో చాలామంది మహిళలు ఇప్పటికీ తమ శరీరం, ఆరోగ్యం గురించి ఏదైనా మాట్లాడటం అసౌకర్యంగా భావిస్తారు. ఇలాంటి అంశాలపై వారిలో అవగాహన కల్పించేందుకు వివిధ సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. సరైన సమయంలో గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్‌ను కూడా నయం చేయవచ్చు’అని ఆమె చెప్పారు. పలు పంజాబీ సినిమాల్లో నటించిన హర్నాజ్ సంధు..బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్–2021గా తన ఎంపిక దేశానికే వేడుక వంటిదన్నారు. సాధ్యమైనంత త్వరలో స్వదేశం వచ్చి విజయోత్సవం జరుపుకునేందుకు, తన తల్లిని కౌగలించుకునేందుకు తహతహలాడుతున్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె ఇజ్రాయెల్‌లోని ఐలాత్ నుంచి ఫోన్ ద్వారా పీటీఐ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. సుస్మితాసేన్, లారాదత్తాల తర్వాత మిస్ యూనివర్స్‌ను సొంతం చేసుకున్న మూడో భారతీయ యువతిగా హర్నాజ్ సోమవారం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ నుంచి ఆమె నేరుగా న్యూయార్క్ వెళతారు. అక్కడ ఆమె మిస్ యూనివర్స్ సంస్థతోపాటు పలు సంస్థలకు ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!!
శీతాకాలంలో స్నానం చేయాలంటే ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది. అందుకని స్నానం మానెయ్యలేం కదండి! చన్నీటికి కొంచెం వేడి నీళ్లు జోడించి ఎలాగోలా స్నానం కానిస్తాం.. ఐతే ఓ యువతికి అసలు స్నానం చేయడమే ఇష్టం ఉండదట. వారానికోసారి మాత్రమే చేస్తుందట. స్కూల్ విద్యార్ధులకు మంచి అలవాట్ల గురించి నేర్పించవల్సిన టీచర్ ఆమె. ఇంత బాధ్యతాయుతమైన వృత్తిలో పనిచేస్తూ కూడా అపరిశుభ్రతను పాటించడం వెనుక కారణం ఏమిటో.. ఎందుకో.. తెలుసుకుందాం.. ఇంగ్లాండ్‌కు చెందిన నటాలీ కింగ్ (49) అనే యువతి వృత్తిరిత్యా టీచర్. ఆమె భర్త జమీ ప్లంబర్. ఒక నివేదిక ప్రకారం సదరు మహిళ వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తుందని, కనీసం శరీరం నుంచి దుర్గంధం రాకుండా డియోడరెంట్లను కూడా కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తుందని పేర్కొంది. ఇక ఆమె శరీరం నుంచి ఏ స్థాయిలో చెడు వాసన వస్తుందో ఊహించండి. అంతేకాదు ఆమె భర్త జమీ, భార్య ప్రతిరోజూ స్నానం చెయ్యాలని బాత్రూమ్ను కూడా అందంగా డిజైన్ చేయించాడట కూడా. అయినప్పటికీ ఆమె స్నానం చెయ్యడానికి ఆసక్తి చూపడం లేదు. దుస్తులకు పర్ఫ్యూమ్ కొట్టుకుని రోజువారి పనులు చేసుంటుంది. కానీ ఏ రోజు కూడా భార్యని స్నానం చెయ్యవల్సిందిగా ఒత్తిడి మాత్రం చెయ్యలేదు సదరు భర్తగారు. ఎంత విచిత్రమైన బంధమో వీళ్లది కదా! చదవండి: Senior Citizen Savings Scheme: బంపరాఫర్ ! పోస్టాఫీస్‌లో వెయ్యితో ఖాతా తెరిస్తే ఐదేళ్లలో రూ.14 లక్షలు!! పూర్తి వివరాలు.. -
అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్ మంచిదేనా?
నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ టౌన్, దేవరకొండ : ఎక్కడ పడితే అక్కడే కోతలు.. ఎవరి ఇష్టం ఉన్నవి వారు ఎక్కడైనా కోసేసుకోవచ్చు.. అవి రోగాలు ఉన్నవా.. లేనివా చూసి పరీక్షించే వారులేరు. అవి ఆడవా.. మగవా అనేది కూడా ఎవరికీ తెలియదు. శుభ్రం ఉండదు. నీరు సక్రమంగా ఉండవు. ఇదీ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో జంతు వధలు సాగుతున్న పద్ధతి. వీటన్నింటికీ ప్రధాన కారణం వధశాలలు లేకపోవడమే. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూ డ, దేవరకొండలో రోడ్లపైనే మటన్ విక్రయాలు సా గుతున్నాయి. గొర్రెలు, మేకల ద్వారా అంత్రాక్స్ వ్యాధులు వస్తున్నాయనే ప్రచారం సాగిన సమయంలో అధికారులు మటన్‌షాపుల వద్దకు వచ్చి హాల్చల్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కనీసం మటన్‌షాపు నిర్వాహకులు కోస్తున్న గొర్రెలు, మేకలను ఆరోగ్యంగా ఉంటున్నాయా లేదా అనేది పరీక్షించే అధికారి జాడ కూడా లేకుండా పోయింది. మున్సిపల్ శానిటరీ విభాగం అధికారులు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు మాంసం కొనాలంటే హడలిపోతున్నారు. (చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85) నల్లగొండలో రోడ్డు వెంట సాగుతున్న వధ ధ్రువీకరించాకే వధించాలి.. వధించే గొర్రెలు, గొర్రె పొట్టేళ్లు, మేకలు, మేక పోతులు తదితర వాటిని అక్కడ పశువైద్యులు పరిశీలించి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తరువాత మాత్రమే వాటిని కోయాలి. వధశాలలు ఉంటే అక్కడ ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలయ్యే అవకాశం ఉండేది. వధశాలలు లేకపోవడంతో నిబంధనలు ఏవీ పాటించకుండా ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లోనే జీవాలను వధిస్తూ మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించకుండానే వినియోగదారుల చెంతకు మాంసం చేరిపోతోంది. అంతే కాకుండా వాటి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తుండడంతో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండలో శిథిలావస్థలో వధశాల నీలగిరి పట్టణంలో జంతు వధశాల 40 ఏళ్ల కిందటి వరకు లైన్వాడిలో ఉన్నట్లు మాంసం వ్యాపారులు చెబుతున్నారు. దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని పనులు మొదలు పెట్టగానే అక్కడ మార్కెట్ వద్దంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో నాలుగేళ్ల కిందటనే పనులు నిలిచిపోయాయి. దీని గురించి అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ సరిగా పట్టించుకోకపోవడంతో కోర్టు కేసు పరిష్కారం కాక మార్కెట్ పనులకు మోక్షం కలగడంలేదు. పానగల్ బైపాస్ రోడ్డులో జంతు వధశాల నిర్మాణం చేపట్టాలని భావించినా సాధ్యపడలేదు. దీంతో రోడ్ల వెంటే మాంసం విక్రయాలు సాగుతున్నాయి. పట్టణంలో మాంసం విక్రయించే వారు 40 మంది వరకు ఉండగా, ఇక ఆదివారం మాత్రం దాదాపు 200 మంది జంతు వధ చేసి వ్యాపారం చేస్తున్నారు. (చదవండి: Vikarabad: కారుతో ఢీకొట్టి పరార్.. ప్రమాదమా? హత్యాయత్నమా?) నిరుపయోగంగా ఉన్న స్లాటర్ హౌస్ దేవరకొండలో.. రోడ్లపైనే విక్రయాలు ప్రతి ఆదివారం దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 500 కేజీల వరకు మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ వధశాల లేకపోవడంతో రోడ్ల వెంటే మాంసం విక్రయాలు సాగుతున్నాయి. అధికారుల తనిఖీలు లేకపోవడంతో బక్కచిక్కిన, అనారోగ్యం పాలైన జీవాలను కూడా కొంతమంది వ్యాపారులు వధించి విక్రయిస్తున్నారు. దీంతో డబ్బులు పోసి జబ్బులు తెచ్చుకోక తప్పడం లేదని ప్రజలు మాంసాహార ప్రియులు వాపోతున్నారు. పట్టణంలో వధశాలనిర్మించి సంబంధిత అధికారులు ధ్రువీకరించిన తర్వాతనే మాంసం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వధశాల ఉన్నా.. నిరుపయోగమే పారిశ్రామికంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడపడితే అక్కడే మటన్ షాపులు వెలుస్తున్నాయి. పట్టణంలో సుమారు 100–200 వరకు మటన్ షాపులుండగా ఏ ఒక్క దుకాణం వద్ద కూడా మున్సిపల్ అధికారులు పరిశీలించి ముద్ర వేసిన దాఖలాలు లేవు. పట్టణంలోని తడకమళ్ల రోడ్డులోని తాళ్లగడ్డ సమీపంలో నిర్మించిన స్లాటర్ హౌజ్ (కబేళా కేంద్రం) నాలుగేళ్లుగా కోర్టు వివాదంలో ఉండడంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో వినియోగదారులు నాణ్యమైన మాసం పొందలేకపోతున్నారు. జంతు వధశాల నిర్మించాలి జంతు వధశాల లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ కోస్తున్నారు. వధశాల నిర్మాణం చేపడితే వ్యాపారులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. మటన్ మార్కెట్ నిర్మాణం నిలిచిపోయినా పట్టించుకోవడంలేదు. జంతు వధశాల పెడితే నాణ్యమైన మాంసం వినియోగదారులకు అందుతుంది. వ్యాపారులకు కూడా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. – మహ్మద్ ఆజం, మాంసం వ్యాపారి, నల్లగొండ ఆరోగ్యమా.. అనారోగ్యమా తెలియదు ప్రతి వారం మటన్ తీసుకెళ్తాను. వారు కోసేది ఆరోగ్యంగా ఉన్నదా.. అనారోగ్యంగా ఉన్నదా ఎవరికీ తెలియదు. మటన్‌షాపులు పెరుగుతున్నాయి కానీ క్వాలిటీ లేకుండా పోతోంది. వెటర్నరీ, మున్సిపల్ అధికారులు ధ్రువీకరించిన తరువాతనే గోర్రెలు, మేకలు, పొటేళ్లు కోయాలి. కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రెగ్యులర్‌గా వచ్చిన వారికి మాత్రమే మంచి మటన్ ఇస్తున్నారు తప్ప కొత్తవారికి ఇబ్బందులు తప్పవు. – నల్లగుంట్ల నరేష్కుమార్, ఇస్లాంపుర, మిర్యాలగూడ బహిరంగ ప్రదేశాల్లో వధించకూడదు బహిరంగ ప్రదేశాల్లో జీవాలు (గొర్రె, మేక)లను వధించకూడదు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. దేవరకొండ పట్టణంలో స్లాటర్ హౌస్ నిర్మాణానికి సంబం ధించి స్థలాన్ని పరిశీలిస్తున్నాం. వ్యాపారులు నాణ్యమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పడేయకూడదు. ఎప్పటికప్పుడు సంబంధిత పశు సంవర్థక శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపడుతాం. – వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్, దేవరకొండ -
హైజీన్ కిట్లకు దూరం!
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతోంది. గత మూడు నెలలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఇటీవల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించింది. గురుకులంలో ఉన్నప్పుడు ఈ సమస్య లేదని, ఇటీవలి కాలంలోనే ఇలా బాధపడుతోందని బాలిక తల్లి వైద్యురాలికి వివరించింది. ఆమెను పరీక్షించిన వైద్యురాలు వ్యక్తిగత పరిశుభ్రతపై హితోపదేశం చేశారు. నెలసరి సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందని, మందులు వాడాలని సూచించారు. సాక్షి, హైదరాబాద్ : నిరుపేద విద్యార్థినులపై లాక్డౌన్, అనంతర పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రధానంగా గురుకుల పాఠశాలలు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, ఇతర ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండే బాలికలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. విద్యాసంస్థలో ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడు కొత్తగా ఎదురవ్వడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్, అనంతర పరిస్థితులు గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థినులపై ఎలాంటి ప్రభావం చూపాయనే అంశంపై పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, పీర్సన్ అనే సంస్థ హైదరాబాద్‌లోని మరో సంస్థ సహకారంతో అధ్యయనం చేశాయి. దాదాపు 3 వేల మంది విద్యార్థినులను నేరుగా, ఫోన్ ద్వారా ఇతర పద్ధతుల్లో సంప్రదించి వారి స్థితిని అంచనా వేశారు. ఈ క్రమంలో 68 శాతం మంది విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. విద్యాసంస్థల్లో ప్రత్యేక శ్రద్ధ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో అధికారులు విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారి ఆరోగ్యస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. బాలికలకు అవసరమైన కాస్మొటిక్ కిట్లను ప్రతి నెలా ఇస్తారు. ఇందులో ప్రత్యేకంగా సానిటరీ ప్యాడ్స్ ఉంటాయి. వీటిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండటం, వినియోగంపై అవగాహన కల్పించడంతో సరైన సమయంలో ఉపయోగించి జాగ్రత్తలు పాటించేవారు. లాక్‌డౌన్‌తో హైజీన్ కిట్లకు దూరం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో విద్యా సంస్థలు మూతబడ్డాయి. ఈ ఏడాది మార్చి నుంచి వీటిని పూర్తిగా మూసివేయడంతో విద్యార్థినులు వారి గ్రామాల్లోనే ఉండిపోయారు. ఇలా ఇంటి వద్ద ఆర్నెల్ల నుంచి ఉండటంతో వారికి పర్సనల్ హైజీన్ కిట్లు అందడం లేదు. నెలసరి సమయంలో సానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేకపోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో పలువురు బాలికలు పాత పద్ధతిలో గుడ్డలు వాడుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. జాగ్రత్తలు పాటించకపోవడంతో వారికి ఇన్ఫెక్షన్లు ఏర్పడి ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. 3 వేల మందిపై చేసిన పరిశీలనలో ఏకంగా 2 వేల మంది ఇలాంటి అనుభవాలనే చెప్పారని హైదరాబాద్‌కు చెందిన సంస్థ తెలిపింది. -
నేటి ‘కరోనా శుభ్రత’ నాడే ఉంది!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ‘చేతులు శుభ్రంగా కడుక్కోవడం’ అతి ముఖ్యమైనదిగా నేడు వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లోకి రావడంతోనే కాళ్లు చేతులు కడుక్కోవడం, ప్రార్థనా మందిరాలు, చారిత్రక కట్టడాల సందర్శనకు వెళ్లినప్పుడు కూడా అదే పద్ధతి పాటించడం దాదాపు అన్ని దేశాల్లో కొనసాగిన ప్రాచీన సంప్రదాయం. ఈ సంప్రదాయం భారత్ సహ కొన్ని దేశాల్లో నేటికి గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆధునిక పోకడలు సంతరించుకున్న పట్టణ ప్రాంత భవనాలు, భవన సముదాయాల్లో ఈ సంప్రదాయం మచ్చుకైనా కనిపించదు. ప్రాచీనకాలంకన్నా ఇప్పుడు ప్రతి ఇంటికి బాత్రూమ్లు, టాయ్లెట్లు ఎక్కువగానే ఉన్నాయి. అయితే అవి ఇంటి కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. పైగా అవి ఇంటి ముందు ఉండవు కనుక ఇంటి వారు కూడా బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కడుక్కోవడం కోసం ఇంటి లోపలి బాత్రూమ్ల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కరోనా లాంటి మహమ్మారులు మానవాళిపై దండయాత్ర చేసినప్పుడు బాత్రూమ్లు ఉన్నా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. (చదవండి: కరోనాతో గ్లోబల్ ట్రేడ్‌కు భారీ షాక్..) ప్రాచీన కాలంలో ఇంటివారు లేదా అతిథులు బయట నుంచి రాగానే ఇంటి ముందే కాళ్లు, చేతులు కడుక్కునేందుకు బకెట్లో లేదా గంగాళంలో నీరు నింపి పెట్టేవారు. నీళ్లు ముంచుకోవడానికి బ్యాక్టీరియాలను ఎదుర్కొనే లక్షణాలు కలిగిన రాగి చెంబును ఉంచేవారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో ఇంటి ముందు లేదా ఇంటి వసారా లేదా ప్రాంగణంలో లేదా గచ్చులో ఈ కాళ్లు, చేతులు కడుక్కునే ఏర్పాటు ఉండేది. పెద్ద పెద్ద ఇళ్లు, భవనాల్లో వసారా లేదా ప్రాంగణంలో ఈ వసతి ఉంటే చిన్న ఇళ్లలో ‘గచ్చు’ల వద్ద ఉండేవి. చతురస్రాకారంలో ఉండే గచ్చుపైన ఇంటి పైకప్పు ఓపెన్‌గా ఉంటుంది. వసారా లేదా గచ్చులోకి గాలి, వెలుతురు, ఎండ బాగా వచ్చే వెసులుబాటు ఉండడం వల్ల వైరస్ల బారిన పడే అవకాశం తక్కువగా ఉండేది. (చదవండి: భారత్ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి) బీజింగ్‌లో ప్రాంగణం లేదా గచ్చులను ‘ఉటాంగ్స్’ అని, దక్షిణాఫ్రికాలో ‘లాపా’ అని. లాటిన్లో పాశియో అని పిలుస్తారు. కొన్ని దేశాల్లో ఈ ప్రాంగణాల్లో ఔషధ మొక్కలను పెంచేవారు. ఈ ప్రాంగణాలు పిల్లలు ఆడుకోవడానికి వీలుగానే కాకుండా జబ్బు పడిన వారు ఏకాంతవాసం గడిపేందుకు ఆస్కారమూ ఉండేది. చారిత్రక కట్టడాల విషయం ఏమోగానీ ప్రార్థనా మందిరాల వద్ద కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు ప్రాంగణంలో కుళాయిలు ఉండడం నేటికి కనిపిస్తుంది. మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేయడానికి ముందు పాదాలు, మోచేతుల నుంచి ముఖం వరకు కడుక్కునే మంచి సంప్రదాయం ఉంది. దీన్ని ‘వుదు’ అని అంటారు. అయితే ఒక్క హౌజ్‌లో నిల్వ చేసిన నీటిని అందరూ నేరుగా చేతులతోని తీసుకొని కడుక్కోవడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరగుతోంది. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్లు ఇలా ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. (చదవండి: కరోనా: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ!) -
మంచిని పంచుదాం..పెంచుదాం!
న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా సానుకూల(పాజిటివ్) విషయాలను వైరల్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతికూల అంశాలను వ్యాప్తి చేయడం చాలా సులభమని వ్యాఖ్యానించారు. ప్రజల ఉమ్మడి కృషి కారణంగా భారత్ 2018లో పలు అద్భుతాలను సాధించిందన్నారు. ఆశయం బలంగా ఉంటే ఎదురయ్యే అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతాయని తెలిపారు. 2019లో కూడా భారత అభివృద్ధి, పురోగతి ఇలాగే సాగాలని ..సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. 2018లో చివరి మాసాంతపు ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ పలు అంశాలపై ముచ్చటించారు. ఏడాదిలో అనేక విజయాలు... ‘మనమంతా కలిసి సానుకూల అంశాలను వైరల్ చేద్దాం. ఇలా చేయడం వల్ల చాలామంది ప్రజలు సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులు, మహనీయుల గురించి తెలుసుకుంటారు. ప్రతికూల వార్తలు, అంశాలను వ్యాప్తి చేయడం చాలా సులభం. కానీ చుట్టూ సానుకూల విషయాలను వ్యాప్తిచేసే ప్రయత్నం నిజంగానే జరుగుతోంది. చాలా వెబ్సైట్లు ఇలాంటి వార్తలను ప్రచురిస్తున్నాయి. ఇలాంటి వార్తల లింక్స్‌ను విస్తృతంగా పంచుకోండి. తద్వారా సానుకూలతను వైరల్ చేయవచ్చు’ అని మోదీ సూచించారు. 2018లో ఎన్డీయే ప్రభుత్వ సాధించిన కీలక విజయాలపై మాట్లాడుతూ..‘ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమైన ఆయుష్మాన్ భారత్‌ను ఆవిష్కరించాం. దేశంలోని ప్రతీపల్లెకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ప్రజల దృఢ సంకల్పంతో పరిశుభ్రత అన్నది 95 శాతం దాటింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి త్రివర్ణ పతాకాన్ని ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోటపై ఎగురవేస్తున్నారు. కానీ స్వతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశచరిత్రలో తొలిసారి అక్టోబర్ 21న ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించాం. తొలి భారత హోంమంత్రి సర్దార్ పటేల్ గౌరవార్థం ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఏర్పాటుచేశాం. ఈ ఏడాదే భూ, జల, వాయు మార్గాల ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుంది’ అని మోదీ వెల్లడించారు. యువతకు గొప్ప అవకాశం... యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 2019, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాపై స్పందిస్తూ..‘ఈ కార్యక్రమం సందర్భంగా భక్తితో పాటు పరిశుభ్రత కూడా పరిఢవిల్లుతుందని ఆశిస్తున్నా. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి యువతకు కుంభమేళా గొప్ప అవకాశం’ అని పేర్కొన్నారు. అలాగే ఈసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా హాజరవుతారని తెలిపారు. దక్షిణాఫ్రికాలో∙గాంధీ జాతి వివక్షపై మొదటిసారి పోరాడి, మహాత్ముడిగా మారారని గుర్తుచేశారు. అండమాన్ ప్రజలు దేశానికే ఆదర్శం అండమాన్ దీవుల్లో మోదీ పర్యటన కార్ నికోబార్ / పోర్ట్‌బ్లెయర్ : 2004లో విరుచుకుపడ్డ సునామీ దుష్ప్రభావం నుంచి అండమాన్ ప్రజలు శరవేగంగా కోలుకున్నారని ప్రధాని కితాబిచ్చారు. అండమాన్ దీవుల్లో ఉంటున్న ప్రజల సంక్షేమానికి, భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కార్ నిరోబార్ దీవుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రశంసించిన మోదీ, ఈ విషయంలో అండమాన్ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సాధారణంగా ప్రజలు ప్రధాన భూభాగాన్ని, ద్వీపాలను వేరుగా చూస్తారనీ, తనకు మాత్రం ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల కంటే పోర్ట్బ్లెయరే ప్రధాన భూభాగమని అన్నారు. స్థానికుల డిమాండ్ మేరకు సముద్రపు అలల తాకిడికి నేల కోతకు గురికాకుండా రూ.50 కోట్లతో గోడను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్ నికోబార్‌లోని బీజేఆర్ స్టేడియంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. కొబ్బరి పొట్టు కనీస మద్దతు ధరను రూ.7 వేల నుంచి రూ.9 వేలకు పెంచామన్నారు. ఈ సందర్భంగా సునామీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. సావార్కర్ గదిలో ధ్యానం.. పర్యటనలో భాగంగా పోర్ట్‌బ్లెయర్‌లోని సెల్యూలర్ జైలును సందర్శించిన ప్రధాని.. బ్రిటిష్ పాలనలో స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన వీరులకు నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న హిందుత్వవాది వీర సావార్కర్‌ను బంధించిన గదిలో నేలపై ధ్యాన ముద్రలో కూర్చున్నారు. ఆతర్వాత జైలు సెంట్రల్ టవర్ వద్ద గోడపై చెక్కిన అమరుల పేర్లను పరిశీలించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి వెనుదిరిగారు. కాలాపానీగా పిలిచే ఈ జైలును 1896–1906లో నిర్మించారు. ఈ పర్యటనలో భాగంగా చెన్నై–పోర్ట్‌బ్లెయర్ మధ్య ఫైబర్ కేబుల్, 7 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు, సోలార్ మోడల్ గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. అలాగే అండమాన్ దీవుల్లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రితో పాటు 50 మెగావాట్ల ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ) ప్లాంట్‌ను స్థాపిస్తామని తెలిపారు. మూడు ద్వీపాలకు కొత్త పేర్లు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్‌లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 వసంతాలు పూర్తయిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి రోస్ ఐలాండ్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా, నీల్ ఐలాండ్‌ను షహీద్(అమరుల) ద్వీపంగా, హేవ్‌లాక్ ఐలాండ్‌ను స్వరాజ్య ద్వీపంగా నామకరణం చేస్తున్నట్లు పోర్ట్‌బ్లెయర్‌లోని నేతాజీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్మారక స్టాంపును, రూ.75 నాణేన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..‘స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి ప్రస్తావించాల్సి వస్తే నేతాజీ పేరును గర్వంగా ప్రకటిస్తాం. ఆయన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి తొలి ప్రధాని. ఆయన అండమాన్ గడ్డపై భారత్ స్వాతంత్య్రం కోసం తీర్మానం చేశారు. అండమాన్ నుంచి దేశం స్ఫూర్తి పొందుతోంది. 1943లో ఇదే రోజున అండమాన్, నికోబార్ దీవులను షహీద్, స్వరాజ్ దీవులుగా గుర్తించాలని నేతాజీ సూచించారు’ అని తెలిపారు. ఈ సందర్భంగా నేతాజీకి గౌరవంగా మొబైల్ ఫోన్ల ఫ్లాష్లైట్లను ఆన్ చేయాలని కోరడంతో స్టేడియం ఒక్కసారిగా వెలుగుజిలుగులతో కాంతులీనింది. అనంతరం మెరీనా పార్క్‌లో 150 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను మోదీ ఆవిష్కరించారు. -
అభివృద్ధిలో గజ్వేల్ నంబర్‌వన్
గజ్వేల్ మెదక్ : గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని... ఈ క్రమంలోనే గ్రామాల్లో అన్ని రకాల వసతులు సమకూరాయని ‘గడా’ ప్రత్యేకాధికారి హన్మంతరావు పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ‘ఆరోగ్య రక్ష’ పథకంలో భాగంగా హెల్త్ అండ్ హైజిన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ‘కంటి వెలుగు’ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని తెలుసుకుంటూ తమకు ఆదేశాలిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే గ్రామంలో డబుల్ బెడ్రూం పథకం పనులు, అంగన్వాడీ కేంద్రంను పరిశీలించిన అనంతరం మినీ ట్యాంక్‌బండ్ పనులను కూడా చూశారు. బతుకమ్మ పండుగ వరకు మినీ ట్యాంక్‌బండ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి గజ్వేల్ మండలశాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రమేష్‌గౌడ్, పాఠశాల హెచ్ఎం కరీమొద్దీన్, పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్, గ్రామ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రామాగౌడ్, నిజాం, ప్రభాకర్, అమర్, బుచ్చిరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికలకు భరోసా హెల్త్ అండ్ హైజిన్ కి ట్లు
కొత్తగూడెం/జూలూరుపాడు/కొణిజర్ల/భద్రాచలం : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఆరోగ్య రక్ష (హెల్త్ అండ్ హైజిన్) కిట్లు అందజేయాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతి వరకు చదివే బాలికలకు వీటిని పంపిణీ చేయనుంది. గతంలోనే మోడల్ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలలో బాలికలకు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల బాలికలకు కూడా అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 13 రకాల వస్తువులతో కూడిన కిట్లు బాలికలకు అందజేయనున్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న బాలికలకు ఈ కిట్లు అందజేయనున్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత , ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఈ కిట్లు అందజేస్తుంది. బాలికల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల్లో చదివే విద్యార్థినుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంతోపాటు, పలు కారణాలతో పెరుగుతున్న డ్రాపవుట్స్ల నివారణే లక్ష్యంగా గత ఏడాది కస్తూర్బా పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆశించిన మేర సత్ఫలితాలనివ్వడంతోపాటు బాలికల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవడంతో ఈ ఏడాది రాష్ట్రంలోని జిల్లా ప్రజాపరిషత్, ప్రభుత్వ మోడల్ స్కూల్స్, గురుకుల, కేజీబీవీలు, పంచాయతీరాజ్ పాఠశాలలన్నింటిలోనూ ఈ కిట్ల పంపిణీకి నిర్ణయించింది. 13 రకాల వస్తువులతో.. బాలికల అవసరాల మేరకు హెల్త్ అండ్ హైజిన్ కిట్‌లో 13 రకాల వస్తువులను అందజేయనున్నారు. వీటిని ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి చొప్పున జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో నాలుగు సార్లు విద్యార్థినులకు అందచేయనున్నారు. వేసవి సెలవుల్లో సైతం అందేవిధంగా ముందస్తు క్యాలెండర్‌ను రూపొందించారు. భద్రాద్రిలో కలెక్టర్ చేతుల మీదుగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, జాయింట్ కలెక్టర్ రాంకిషన్‌లు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, కళాశాలలు, పంచాయతీరాజ్ పాఠశాలల్లోని విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు కిట్లను డీఈఓ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ కమిటీల ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులు ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలను జారీ చేశారు. జూలూరుపాడుకేజీబీవీని సందర్శించిన జేడీ రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయం(హైదారాబాద్) జాయింట్ డైరెక్టర్(జేడీ), ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జి.రమేష్ గురువారం జూలూరుపాడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలిక ఆరోగ్య రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమం, హరిత పాఠశాల, హరితహారం వంటి కార్యక్రమాలతోపాటు, విద్యాలయంలోని సౌకర్యాలు, బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఎంఈఓ జి.వెంకట్, కేజీబీవీ ఇన్చార్జి ఎస్ఓ రజితలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను, వంట గది, స్టాక్ రూమ్‌ను పరిశీలించారు. బాలికలతో ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, సొసైటీ రెసిడెన్షియల్స్ మొత్తం 734 పాఠశాలల్లోని 35,296 మంది బాలికలకు బాలికా ఆరోగ్య రక్ష(కేసీఆర్) కిట్లు అందజేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 434 పాఠశాలలకు చెందిన 19,859 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 300 పాఠశాలలకు చెందిన 15,437 మంది బాలికలకు కేసీఆర్ కిట్స్ ఇస్తామని తెలిపారు. కేజీబీవీల్లో విద్య అభ్యసించే 6 నుంచి 10వ తరగతి బాలికలకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సొసైటీ రెసిడెన్షియల్స్‌లో చదివే 7 నుంచి 10వ తరగతి బాలికలకు కేసీఆర్ కిట్స్ అందజేస్తామని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హరిత పాఠశాల, హరిత కళాశాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతీ విద్యార్థికి 6 మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎంఈఓ గుగులోతు వెంకట్, కేజీబీవీ ఇన్చార్జి ఎస్ఓ రజిత, టీచర్లు, సిబ్బంది ఉన్నారు. గతంలో హాస్టళ్లకు వస్తువులు, స్కూళ్లకు నగదు.. ఇప్పటివరకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమాలు, గురుకులాల్లో చదివే విద్యార్థినులకు ఆయా సంస్థల ఆధ్వర్యంలో న్యాప్కిన్లు, కాస్మొటిక్స్‌ను అందజేస్తున్నారు. సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినులకు మూడు నెలలకోసారి కాస్మొటిక్స్ వస్తువుల కోసం వచ్చే డబ్బును ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో టెండర్లు నిర్వహించి సరఫరా చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ఇవి అందేవి కావు. 8 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు సర్వ శిక్ష అభియాన్ నిధుల నుంచి కాస్మొటిక్స్ కోసం డబ్బులు మంజూరు చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అవి సక్రమంగా పంపిణీ కాకపోవటం, బాలికలు ఆ డబ్బును ఇంటికి తీసుకెళ్లి ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో ఫలితం కనిపించడం లేదు. దీనిని అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ నుంచే నేరుగా హెల్త్ అండ్ హైజిన్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించారు. మండలాలకు చేరిన కిట్లు.. హెల్త్ అండ్ హైజిన్ కిట్లను సరఫరా చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒప్పందం చేసుకున్న సంస్థ వాటిని మండల కేంద్రాలకు ఇప్పటికే సరఫరా చేసింది. వీటిని ఆయా మండల విద్యాశాఖాధికారులు విద్యార్థినుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు చేరవేయాలి. ఇవి ప్రతీ విద్యార్థినికి అందేలా పాఠశాలల హెచ్ఎంలు బాధ్యత వహించాలి. సరఫరా అయిన కిట్లు, పంపిణీ లెక్క కచ్చితంగా ఉండేలా రిజష్టర్‌లో నమోదు చేయాలి. ఈనెల 24న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం 30లోపు ప్రతీ విద్యార్థినికీ అందేలా చర్యలు తీసుకోవాలి. మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు సకాలంలో హెల్త్ అండ్ హైజిన్ కిట్లు సరఫరా చేసేందుకు వాహన సదుపాయం కోసం కూడా నిధులు కేటాయించారు. 8 కిలోమీటర్ల లోపు ఉంటే రూ.300, ఆపైన దూరం ఉంటే రూ. 600 వాహనాలకు చెల్లించవచ్చు. వీటిని పాఠశాల గ్రాంట్ నుంచి వినియోగించుకునేలా ఉన్నతాధికారులు ఆదేశించారు. భద్రాద్రిలో 15,437 కిట్లు సిద్ధం బాలికల వ్యక్తిగత, ఆరోగ్య సంరక్షణతో పాటు బాలికలలో డ్రాపవుట్స్‌ను తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బాలికా రక్షలో భాగంగా జిల్లాల పంపిణీ చేసేందుకు 15,437 కిట్లను సిద్ధం చేశాం. ఏడాదిలో నాలుగు సార్లు అందించే విధంగా ప్రణాళికలను రూపొందించాం. బాలికావిద్యను అభివృద్ధి చేసేందుకు ఈ హెల్త్ అండ్ హైజిన్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –డి వాసంతి, డీఈఓ, భద్రాద్రి కొత్తగూడెం కిట్‌లో ఉండే వస్తువులు బాత్ సోప్స్ (పతంజలి)–3 డిటెర్జంట్ సోప్స్(పతంజలి)–3 కొబ్బరి నూనె(డాబర్)–1 షాంంపూ బాటిల్(డాబర్)–1 ఫేస్ పౌడర్( ఐటెక్స్)–1 టూత్ పేస్ట్(డాబర్)–1 టూత్ బ్రష్(పతంజలి)–1 టంగ్ క్లీనర్–1 దువ్వెన–1 బొట్టు బిళ్లలు (ఐటెక్స్) 77నుంచి 90 వరకు ఉండే ప్యాకెట్–1 నెయిలాన్ రిబ్బన్స్–2 హెయిర్ బాండ్స్–2 శానిటరీ న్యాప్కిన్స్ (జాన్సన్ అండ్ జాన్సన్)–3 హ్యాండ్ వాష్ కోసం స్కూల్లోని పిల్లలందరికీ కలిపి 5 లీటర్ల బాటిల్ –1 -
హైజీన్ కిట్ల పంపిణీకిసర్వం సిద్ధం
విద్యారణ్యపురి : విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ హైజీన్ కిట్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. గత విద్యాసంవత్సరంలో కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులకు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థినులకు హెల్త్కిట్స్ను పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం (2018–2019)లో ప్రభుత్వ, జిల్లాపరిషత్, ఎయిడెడ్ యూపీఎస్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థినులు, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్‌లోని విద్యార్థినులకు కూడా కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు హెల్త్ హైజీన్ కిట్స్ చేరుకున్నాయి. ఆయా జిల్లాల విద్యాశాఖల అధికారులు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కిట్లలో సానిటరీ న్యాప్కిన్స్తోపాటు మొత్తంగా 13 రకాల వస్తువులు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈ కిట్లు వస్తాయని భావించగా కొంత ఆలస్యం అయింది. ఈ నెల 13నుంచి 15 వరకు ఆయా పాఠశాలల్లోని విద్యార్థినులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 20కల్లా పూర్తి చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ , జిల్లాపరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో 7 నుంచి 10తరగతి, మోడల్ స్కూల్స్‌లో 7 నుంచి 12 వతరగతి, పాత కేజీబీవీల్లో 6 నుంచి 10వ తరగతి, ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ అయిన కేజీబీవీల్లో 6 నుంచి ఇంటర్, టీఎస్ఆర్ఈఐఎస్లో 6 నుంచి 12 వతరగతి వరకు చదివే విద్యార్థినులకు ఈ కిట్స్‌ను అందజేయనున్నారు. 3 నెలలకు సరిపడా.. హెల్త్ హైజీన్ కిట్లలో ఒక్కో విద్యార్థినికీ 3 నెలలకు సరిపడా 13 రకాల వస్తువులను అందుబాటులో ఉంచారు. కిట్ బాక్స్‌లో 3 బాత్సోప్స్ (100 గ్రాముల చొప్పున) 3 క్లాత్వాష్ డిటర్జెంట్ సోపులు(100 గ్రాముల చొప్పున), ఒక షాంపో బాటిల్ (150 ఎంఎల్), 1 కోకోనట్ ఆయిల్ బాక్స్ (175 ఎంల్), 1 ఫేషియల్ ఫౌడర్ బాక్స్ (50 గ్రాములు), 1 టూత్‌బ్రష్, 1 టంగ్‌క్లీనర్, కోంబ్, టిక్లీస్ (75 నుంచి 90 వరకు), 2 నైలాన్ రిబ్బన్స్, 2 ఫ్యాబ్రిక్ ఎలాస్టిక్ హెయిర్బ్యాండ్స్, సానిటరీ న్యాప్కిన్స్ (మూడు పాకెట్లు) ఉన్నాయి. ఇలా ప్రతి మూడు నెలలకొకసారి విద్యార్థినులకు కిట్లు పంపిణీ చేస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63,069 మందికి పంపిణీ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాలో ప్రభుత్వ, జిల్లాపరిషత్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్సూల్స్, టీఎస్ఐఈఆర్ఎస్లలో 63,069 మంది విద్యార్థినులకు ఈ కిట్లు అందించనున్నారు. -
పల్లెలో పరిశుభ్రతకు ప్రాధాన్యం
కర్నూలు(హాస్పిటల్): స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. శుక్రవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి వనరుల లభ్యత పట్ల ఎంపీడీవోలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వైద్యశాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 2018–19 నాటికి 889 గ్రామాలను బహిరంగ మలవిసర్జనర రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో ఈశ్వర్, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు, డీపీవో ఆనంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వావ్.. సిద్దిపేట
♦ కితాబు ఇచ్చిన ‘అస్కీ’ బృందం ♦ పట్టణ ‘పరిశుభ్రత’పై సంతృప్తి ♦ అధికారుల సామూహిక పనితీరుకు సభ్యులు ఫిదా సిద్దిపేట జోన్: పట్టణంలో పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలపై అస్కీ(అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా) ఆశ్యర్యం వ్యక్తం చేసింది. మున్సిపాలిటీలో ఒకే అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని పాలకవర్గం, అధికారులు సంస్కరణలను చేపట్టడమే కాకుండా లక్ష్యాలు నిర్దేశించుకోవడం అభినందనీయమని సభ్యులు పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో బహుళ ప్రయోజనాలకు దోహదపడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేసి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి త్వరలో అప్పగిస్తామని వారు తెలిపారు. జూన్‌లోగా పూర్తిస్థాయి నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందిస్తామన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు దూరదృష్టిని అభినందించారు. స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డుకు ఎంపికైన సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపల్‌ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, అధికారులు, మహిళ సంఘాలు, మెప్మా ప్రతినిధులు, స్చచ్చంద సంస్థలు ప్రజాప్రతినిధులతో చర్చించారు. -
ఇదీవరుస!
విజయవాడ@ 266 పరిశుభ్రతలో వెనుకబాటు స్వచ్ఛ భారత్ ర్యాంకింగుల్లో బయటపడ్డ డొల్లతనం పరిశుభ్రతలో నగరం బాగా వెనుకబడింది. లక్షలాది మంది జనాభా ఉన్న 476 నగరాలు, పట్టణాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన స్వచ్ఛభారత్ సర్వేలో విజయవాడకు 266వ స్థానం దక్కింది. పొరుగున ఉన్న గుంటూరు 70వ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు బెస్ట్ సిటీ అవార్డును దక్కించుకున్న బెజవాడ వెనుకబాటుతనానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతోపాటు ఆర్థిక సంక్షోభం కూడా కారణమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ : జాతీయ పారిశుధ్య విధానం 2008 ప్రకారం 2014-15 సంవత్సరానికి సర్వే చేపట్టారు. ఆరుబయట మలవిసర్జన, ప్రజామరుగుదొడ్లు, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ, వ్యర్థ పదార్థాలు, తాగునీటి నాణ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీని తరలింపు సక్రమంగా జరగడం లేదు. డంపింగ్ యార్డు కొరత ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంటింటి చెత్త సేకరణ 80 శాతానికి మించడం లేదు. తడి, పొడి చెత్త విభజన జరగడం లేదు. వర్మీకంపోస్ట్ ప్లాంట్లు పనిచేయడం లేదు. తూర్పు నియోజక వర్గంలో కుళాయిల ద్వారా మురుగునీరు వస్తోందని ప్రజలు ఇప్పటికీ గగ్గోలు పెడుతుంటారు. నూరు శాతం లేవు అభివృద్ధి చెందిన నగరంగా పేరొందిన విజయవాడలో నూరు శాతం వ్యక్తగత మరుగుదొడ్లు లేవు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా 59 డివిజన్లలో సర్వే నిర్వహించగా 6,700 వ్యక్తగత మరుగుదొడ్లు కావాల్సి ఉందని లెక్క తేలింది. వీటి నిర్మాణ బాధ్యతల్ని డ్వాక్వా మహిళలకు అప్పగించాలని నిర్ణయించారు. స్వచ్ఛ భారత్ నిబంధనల్ని అనుసరించి అద్దెదారులు, కాల్వగట్లవాసులు ఈ పథకంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించరాదని ఆంక్షలు ఉండడంతో ఆ సంఖ్య 2,500కి తగ్గింది. కాల్వగట్లవాసులు 80 శాతం మంది సెప్టిక్ ట్యాంక్ పైపుల్ని కాల్వగట్లలోకి పెట్టేశారు. దీంతో కాల్వల్లో జలం కలుషితమవుతోంది. గబ్బుకొడుతున్న టాయ్‌లెట్స్ ఏలూరులాకులు, ఉడా పార్క్, ఆర్టీసీ బస్టాండ్, హనుమంతరాయ ఫిష్ మార్కెట్, సర్కిల్-3 ఆఫీసు, యనమలకుదురు, పటమట రైతుబజార్, తారక్నగర్, పద్మావతి ఘాట్, రాజీవ్‌గాంధీ మార్కెట్, రాణీగారితోట, ఇందిరాగాంధీ స్టేడియం, సివిల్ కోర్టు, లెనిన్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ టాక్సీస్టాండ్, భవానీపురం లారీస్టాండ్, వీఎంసీ పూల మార్కెట్, ఐజీఎం స్టేడియం ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ టాయ్‌లెట్స్ నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి మరమ్మతులు లేకపోవడంతో ఇవి గబ్బుకొడుతున్నాయి. -
‘స్వచ్ఛ'...ఇక నిత్యం!
నెలలో ఒక రోజు అధికారులు వస్తారు {పజల సమస్యలు తెలుసుకుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మండుటెండలో పర్యటన ముగిసిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో రెండు లక్షల మంది నిరుపేదలకు డ బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.. లక్ష మందికి ఇళ్ల పట్టాల మంజూరు..చెత్తపై యుద్ధం... పరిశుభ్రతపై మహోద్యమం.... మార్కెట్లు.. బస్తీలు.. మురికివాడల అభివృద్ధికి హామీలు.. ఇవీ చివరి రోజైన బుధవారం ‘స్వచ్ఛ హైదరాబాద్’ విశేషాలు. మండుటెండను సైతం లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ నగరంలో ఏకంగా పదికి పైగా ప్రాంతాలను సందర్శించారు. ప్రజలతో మమేకమయ్యారు. స్థానికుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. పేదలకు గృహాలను నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ నాలుగు రోజులతోనే అయిపోదని.. నెలలో ఒక రోజు అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి... వాటిని పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలపై మేథోమథనం చేసి... సమస్య మూలాలకు వెళ్లి... పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాత నగరం సహా శివార్లలోని ఉప్పల్, ఎల్బీ నగర్, మహేశ్వరం, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. -
‘స్వచ్ఛ’మే లక్ష్యం
ఉత్సాహంగా ‘స్వచ్ఛ హైదరాబాద్’ మంత్రులు...అధికారుల నిమగ్నం సీఎం... మంత్రులు... అధికారులు... ఒక్కటిగా కదలి వస్తున్నారు. పరిశుభ్రతకే పరిమితం కాకుండా... బస్తీలు... కాలనీల్లో నెలకొన్న చిన్నపాటి సమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యమిస్తున్నారు. ఇది జనాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ఉల్లాసంగా పాల్గొనేలా చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వరుసగా నాలుగో రోజైన మంగళవారం కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రివర్గం... అధికార యంత్రాంగం పాల్గొన్నారు. చెత్త కుప్పలు తొలగించడంతో పాటు మురుగు కాలువలు శుభ్రం చేయడం... రహదారులకు మరమ్మతుల వంటి పనులు చేపట్టారు. ఈ పనుల్లో స్థానికులూ మమేకమయ్యారు. తమ ప్రాంతాన్ని బాగు చేసుకునేందుకు ముందుకొచ్చారు. తరలించిన చెత్త: 438 టిప్పుల ద్వారా 1326 మెట్రిక్ టన్నులు. నిర్మాణ వ్యర్థాలు: 2706 ట్రిప్పులు 7020 మెట్రిక్ టన్నులు . రెండు కలిపి: 3144 ట్రిప్పులు ద్వారా 8346 మెట్రిక్ టన్నులు తరలించారు. రోడ్లపై ఉన్న గుంతల పూడ్చివేత సీసీ రోడ్లపై 1863 బీటీ రోడ్లపై 1832 పుట్పాత్రిపేర్లు 80 వర్షపు నీటి గుంతలు 224 వరద నీటి కాల్వల మరమ్మతులు 40 మురుగునీటి కాల్వలు 251 మొత్తం 4290 జలమండలి పనులు : 262 వీటికి అయిన ఖర్చు : రూ.1350.42 లక్షలు డ్రైనేజీ పనులకు అరుున ఖర్చు: రూ.3056.34 లక్షలు వరద కాల్వల పనులు: రూ.812.75 లక్షలు రోడ్ల మరమ్మతులు: రూ.5289.63 లక్షలు. పార్కులు ప్లే గ్రౌండ్స్ పనులు: రూ.419.84 లక్షలు కమ్యూనిటీ హాళ్లు, లైబ్రరీలు: రూ.6757.48 లక్షలు మొత్తం పనులు: 2310 మొత్తం ఖర్చు: రూ. 17,686.46 లక్షలు -
రాష్ట్రవ్యాప్తంగా ‘వాష్’
స్వచ్ఛభారత్‌లో భాగంగా అమలు నీరు, పారిశుధ్యానికి ప్రాధాన్యత 150 మండలాల్లో 13 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టు కింద 12 గ్రామాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచిక మెరుగుదల నిమిత్తం గ్రామీణ ప్రాం తాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛభారత్ అమల్లో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 150 మండలాల్లో ‘వాష్’ (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) కార్యక్రమాన్ని ప్రారంభించాలని సర్కారు సంకల్పించింది. దీన్ని ఈ నెల రెండో వారంలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘వాష్’ ద్వారా వ్యక్తిగత పరిశుభ్రతపట్ల విస్తృత అవగాహన, మరుగుదొడ్ల నిర్మాణాన్ని పెద్దఎత్తున చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద 9 జిల్లాల నుంచి 12 గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించనుంది. ఫలితాలను సమీక్షించిన తర్వాత మిగిలిన గ్రామాలకూ విస్తరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు నిర్ణయించారు. ‘వాష్’ అమలు నిమిత్తం మొదటి విడతగా రూ.47.56 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో కేంద్రం వాటా రూ. 33.3 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14.26 కోట్లు విడుదల చేసింది. ‘వాష్’ అమలు ఇలా.. ఎంపిక చేసిన గ్రామంలో ‘వాష్’ అమలు బాధ్యతలను గ్రామ సమాఖ్యలు చేపడతాయి. మార్పు కమిటీలను ఏర్పాటు చేసి, వాటిని బలోపేతం చేసేలా చర్యలు చేపడతారు. ప్రధానంగా ఆరుబయట మల విసర్జనను రూపుమాపేందుకు ప్రజ లను చైతన్యం చేస్తారు. ఎంపిక చేసిన వలంటీర్లు నీరు, పరిశుభ్రత, పారిశుధ్యం అంశాలకు సంబంధించి గ్రామంలో కుటుంబాల వారీగా బేస్‌లైన్ సర్వే నిర్వహిస్తారు. వలంటీర్లకు ఇందిరా క్రాంతి పథం సిబ్బంది సహకరిస్తారు. సర్వేలో వెల్లడైన వివరాలను గ్రామసభలో చర్చించి నిర్ణీత సమయంలోగా ప్రతి కుటుం బం మరుగుదొడ్డి నిర్మించుకునేలా తీర్మానం చేస్తారు. ప్రొక్యూర్మెంట్, నిర్మాణం, నిఘా పేరుతో 3 ఉపకమిటీలను నియమిస్తారు. కమిటీల్లో గ్రామ సమాఖ్య సభ్యులు, సర్పం చ్, వార్డు సభ్యులు ఉంటారు. వాష్ కమిటీలకు సర్పంచులే అధిపతులుగా వ్యవహరిస్తారు. ప్రతీ మరుగుదొడ్డి నిర్మాణానికి ముందస్తుగా రూ.1,200 ఇస్తారు. విరాళాలనూ సేకరించవచ్చు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో పనిచేసే గ్రామ సమాఖ్యలకు రూ.50 లక్షలు రివాల్వింగ్ ఫండ్‌ను గ్రామీణ నీటి పారుదల, పారిశుధ్య (ఆర్డబ్ల్యూఎస్ఎస్) విభాగం అందజేస్తుంది. ఈ నిధులను గ్రామ సమాఖ్యలు మరుగుదొడ్ల నిర్మాణానికి అడ్వాన్స్‌గా వినియోగించుకోవచ్చు. -
చికెన్ చూస్తే చాలు చిరాకు...!
మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన శరీరాకృతి ఉంటుందని అనుష్కాశర్మ తరచు చెబుతుంటారు. చెప్పడమేమిటి... ఆ సూత్రాన్ని అక్షరాల పాటించేవారు కూడా. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేవారు. అడిగినా అడకగపోయినా తన ఆరోగ్య సూత్రాలు అందరికీ చెప్పేవారు. అంత ఆరోగ్య స్పృహ ఉన్నప్పటికీ... అనుష్కకు నాన్ వెజ్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆమె తన ఆరోగ్య సూత్రాల గురించి చెప్పినప్పుడు ఎవరైనా- ‘‘మరి నాన్‌వెజ్ సంగతో...’’ అని అడిగినప్పుడల్లా- ‘‘నో కామెంట్’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు. అంత ఇష్టమన్నమాట నాన్‌వెజ్ అంటే! అలాంటి అనుష్క కాస్త్తా ‘‘ఇక నాన్‌వెజ్ తినను’’ అని గట్టిగా ప్రకటించారు. ఆరోగ్యస్పృహలో భాగంగా తీసుకున్న నిర్ణయం కాదట ఇది. కేవలం తన పెంపుడు శునకం కోసం తీసుకున్న నిర్ణయం. ఇంతకీ విషయమేమిటంటే, అనుష్క పెంపుడు శునకానికి నాన్‌వెజ్ వాసన అంటే పడదు! తన చుట్టుపక్కల ఎక్కడైనా నాన్‌వెజ్ స్మెల్ వచ్చినా చాలా అసహనంగా ప్రవర్తిస్తుంటుందట. అందుకే... తన పెట్‌ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక... నాన్ వెజ్‌కు గుడ్‌బై చెప్పడమే కాదు... ఎవరైనా చికెన్ ప్రస్తావన తేస్తేనే చిరాకు పడుతున్నారు అనుష్క. -
పల్లెల్లో పరిశుభ్రతకు ‘వాష్’
నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాలకు ప్రాధాన్యం పైలట్ ప్రాజెక్టుగా ప్రతీ జిల్లా నుంచి రెండేసి గ్రామాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవ అభివృద్ధి సూచిక మెరుగుదల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు ఎంపిక చేసిన 150 మండలాల్లో ‘వాష్’(వాటర్, శానిటేషన్, హైజిన్) పథకాన్ని అమలు చేయాలని సంకల్పించింది. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల విస్తృతమైన అవగాహన కల్పించడం, ఆయా ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేలా ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. పైలట్ ప్రాజెక్టు కింద ప్రతీ జిల్లా నుంచి రెండు గ్రామాల్లో ‘వాష్’ను అమలు చేయనున్నారు. ఫలితాలను సమీక్షించాక దీన్ని విస్తరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పథకంలో భాగంగానే ‘వాష్’ ఈ నెల 13 నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు కానుంది. ప్రాజెక్టు అమలు ఇలా.. ఎంపిక చేసిన గ్రామంలో ‘వాష్’ బాధ్యతలను గ్రామ సమాఖ్యలు చేపడతాయి. గ్రామాల్లో మార్పు కమిటీలను ఏర్పాటు చేసి, వాటిని బలోపేతం చేయనున్నారు. ప్రధానంగా ఆరుబయట మల విసర్జనను రూపుమాపేందుకు ప్రజలను చైతన్య పరుస్తారు. ఎంపిక చేసిన వాలంటీర్లు నీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం.. అంశాలకు సంబంధించి గ్రామంలోని కుటుంబాల వారీగా ప్రస్తుత పరిస్థితిపై బేస్‌లైన్ సర్వే నిర్వహిస్తారు. వాలంటీర్లకు అవసరమైన సహకారాన్ని ఇందిరా క్రాంతి పథం సిబ్బంది అందజేస్తారు. ప్రతీ పల్లెలోను గ్రామసభ నిర్వహించి బేస్‌లైన్ సర్వేలో వెల్లడైన వివరాలను ప్రజలతో ముఖాముఖి చర్చిస్తారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ నిర్ణీత సమయంలోగా ప్రతీ కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా తీర్మానం చేస్తారు. ‘వాష్ ’ అమలు చేసే నిమిత్తం మూడు (ప్రొక్యూర్మెంట్, కనస్ట్రక్షన్, విజిలెన్స్) ఉప కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీల్లో గ్రామ సమాఖ్య సభ్యులు, సర్పంచ్, వార్డు సభ్యులు ఉంటారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రణాళికకు ముందు మేస్త్రీలు, మెటీరియల్ పంపిణీదారులతో ‘వాష్’ సంప్రదింపులు చేయాలి. ప్రతీ మరుగుదొడ్డి నిర్మాణానికి ముందస్తుగా రూ.1,200లను గ్రామ సమాఖ్య ద్వారా‘సెర్ప్’ అందజేస్తుంది. ఇతరుల నుంచి కూడా విరాళాలను సేకరించవచ్చు. ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించడంతో పాటు, దానిని సక్రమంగా వినియోగిస్తున్నారా, ఆరుబయట మల విసర్జనను మానేశారా.. లేదా వంటి అంశాలను నిర్ధారించాల్సిన బాధ్యత విజిలెన్స్ కమిటీలదే. ‘వాష్’ ప్రణాళిక, అమల్లో గ్రామ పంచాయతీ సమగ్రమైన భాగస్వామ్యం వహించాలి. గ్రామ సభల నిర్వహణ, వాష్ ప్రణాళిక అభివృద్ధికి సహకరించాలి. వాష్ కమిటీలకు సర్పంచులే నేతృత్వం వహిస్తారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)ల ఆధ్వర్యంలో పనిచేసే గ్రామ సమాఖ్యలకు రూ.50 లక్షలు చక్రనిధిని గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య(ఆర్డబ్ల్యూఎస్ఎస్) విభాగం అందజేస్తుంది. వాటిని గ్రామ సమాఖ్యలు మరుగుదొడ్ల నిర్మాణానికి అడ్వాన్స్‌గా వినియోగించుకోవచ్చు. -
బాగున్నారా!
ఆరోగ్యం కాపాడుకోవడానికి మొదట పరిశుభ్రతను పాటించాలి. వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వివిధ వ్యాధులు, వాటితో కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఏర్పడినా సమీపంలోని ఆరోగ్యకేంద్రానికిగానీ, ఆస్పత్రికిగానీ వెళ్లాలి. అక్కడ మా వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. వైద్య సేవలు, సలహాలు అందిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పెరుగకుండా చూసుకోవాలి. ఇంటిలోనూ, వసతి గృహాలలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలోని బాలికల వసతి గృహం అది. ఆదివారం పగలు 12 గంటల సమయం. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోవింద్ వాగ్మారే ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా అక్కడికి చేరుకున్నారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో గంటసేపు మాటామంతీ జరిపారు. బాలికల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. యోగ, క్షేమాలను విచారించారు. చక్కగా చదువుకోవాలని, వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని వారికి సూచించారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజెప్పారు. విద్యార్థినులు కూడా ఆయనను పలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను తీర్చుకున్నారు. ఈ వసతి గృహంలో ఆర్మూర్, కామారెడ్డి, నందిపేట్, నవీపేట్, డిచ్పల్లి, ఎడపల్లి తదితర ప్రాంతాలకు చెందిన 311 మంది విద్యార్థినులు ఉన్నారు. వారంతా ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు. వైద్యాధికారి : నీ పేరేమిటి? ప్రియాంక : నా పేరు ప్రియాంక. నేను గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న. వైద్యాధికారి : ఏ గ్రూప్ చదువుతున్నవు? ప్రియాంక : మైక్రో బయాలజీ రెండవ సంవత్సరం చదువుతున్న. వైద్యాధికారి : నీకు వ్యాధులపై అవగాహన ఉంటుంది కదా..క్రిములు, దోమలతో కలిగే అనర్థాలు తెలిసే ఉంటాయి కదా! ప్రియాంక : అవును సార్ వైద్యాధికారి : దోమలతో వచ్చే వ్యాధుల పేర్లు చెప్పు? ప్రియాంక : మెదడువాపు, డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వస్తాయి సార్. వైద్యాధికారి : వెరీ గుడ్ వైద్యాధికారి : నువ్వేం చదువుతున్నవు. ఏ కాలేజీ? అలేఖ్య : నేను గిరిరాజ్ కళాశాలలో సైన్స్ గ్రూప్‌లో విద్యనభ్యసిస్తున్నా. వైద్యాధికారి : వివిధ వ్యాధులతో కలిగే ఇబ్బందులపై అవగాహన ఉందా? అలేఖ్య : ఉంది సార్. వైద్యాధికారి : బోధకాలు నివారణ మాత్రలు వేసుకున్నారా? రజనీ : కొందరు వేసుకున్నారు, కొందరు వేసుకోలేదు సార్. వైద్యాధికారి : మాత్రలు వేసుకోనివారెవరు? నాగలక్ష్మి (వార్డెన్) : కొందరు విద్యార్థులు భోజనం చేయలేదు సార్, భోజనం చేసిన తరువాత వేసుకుంటారు. వైద్యాధికారి : ఇది చాలా ముఖ్యమైన విషయం. భోజనం చేసిన తరువాతే మాత్రలు వేసుకోవాలి. అనంతరం విశ్రాంతి తీసుకోవాలి. శిల్ప : మాత్రలు వేసుకుంటే ఏం కాదా? వైద్యాధికారి : ఎలాంటి ప్రమాదమూ ఉండదు. మాత్రలు వేసుకుంటే ముందస్తుగానే బోధకాలు వ్యాధిని నివారించవచ్చు. సౌమ్య : గతంలో ఎప్పుడూ ఈ మాత్రలు హాస్టళ్లలో ఇవ్వలేదు. వైద్యాధికారి : అది తెలిసే, ఈసారి తప్పనిసరి గా మీకు మాత్రలు అందించాలని మా సిబ్బందిని ఇక్కడికి పంపించాను. అవును హాస్టళ్లలో ఉంటున్నారు కదా.. మీ ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయి. మీకు ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కడికి వెళుతున్నారు? సుహాసినీ: మాకు ఆరోగ్య సమస్యలు వస్తే మా వార్డెన్‌ను సంప్రదిస్తాం. వారు దగ్గరుండి వైద్యం అందేలా చూస్తారు. వైద్యాధికారి : మీకు ఎలాంటి సమస్యలున్నా, పక్కనే అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడికి వెళ్లండి. మా వైద్య సిబ్బంది కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అపర్ణ : వ్యాధులలో డెంగీ ఎందుకు ప్రమాదకరమైంది? వైద్యాధికారి : డెంగీతో రక్తంలోని సెల్స్, ప్లేట్లెట్స్ పడిపోతాయి. దీంతో రక్తం తక్కువై నీరసించిపోతారు. వైద్య సహాయం అందకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. ఆడ ఎనాఫిలిస్ దోమతో డెంగీ వ్యాపిస్తుంది. అందుకే దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వసతి గృహంలో దోమలు లేకుండా చూసుకోండి. నాగలక్ష్మి (వార్డెన్): విద్యార్థినులు దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాస్టల్లోని పరిసరాలను ఎప్పుడు కప్పుడు శుభ్రం చేయిస్తుంటాం. వైద్యాధికారి : విద్యార్థినులు ఉండే గదులు శుభ్రంగా ఉంచుకోవాలి. కిటీకీలకు దోమ తెరలను ఏర్పాటు చేసుకోవాలి. దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తపడాలి. సంధ్య: విరేచనాలు ఎందుకు వస్తాయి? వైద్యాధికారి : కలుషిత ఆహారం తిన్నా, కలుషిత నీరు తాగినా విరేచనాలు అవుతాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. లేదంటే మా వైద్య సిబ్బంది మీకు అందుబాటులో మాత్రలు కూడా ఉంచుతారు. విద్యార్థినులు : అలాగే సార్. వైద్యాధికారి : మీరు ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఆడపిల్లలు కదా ఇంటివైపు ఆలోచన ఉండదా? మౌనిక : మేము వసతి గృహంలో ఉంటే ఇంటి వైపు ధ్యాస ఉండదు. స్నేహితులందరం కలిసి చక్కగా ఉంటాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఉంటారు. సమిష్టిగా చదువుకుంటాం. కబుర్లు చెప్పుకుంటాం. సుజాత: సెలవులు వస్తే ఇంటికి వెళ్తాం. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తారు. వైద్యాధికారి : వచ్చినప్పుడు ఏం చేస్తారు. వంటకాలు తీసుకొస్తారా? రాణి : తీసుకొస్తారు. ఆదివారం ప్రత్యేకంగా వంటకాలు తీసుకొస్తారు. వైద్యాధికారి : వ్యాధుల నివారణకు సంబంధిం చి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. వాటితో కలిగే నష్టాలు తెలుసుకోవాలి. చదువుతో పాటు వీటిపై కూడా దృష్టి సారించాలి. అప్పుడే ఆరోగ్యాలు బాగుంటాయి. -
పరిశుభ్రతలో ఆదర్శంగా ఉందాం
యూనివర్సిటీ క్యాంపస్ : పరిశుభ్రతలో ఎస్వీ యూనివర్సిటీ ఆదర్శంగా ఉండాలని వీసీ రాజేంద్ర పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఆధ్వర్యంలో బుధవారం ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంపస్‌లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించి, చెత్తకుప్పలు తొలగించారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద సభ నిర్వహించారు. ఈ సమావేశంలో వీసీ రాజేంద్ర మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛభారత్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘జన్మభూమి-మా వూరు’ ఒక యజ్ఞంలా జరుగుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయాలు ఆదర్శంగా ఉండాలన్న భావనతో ఎస్వీయూ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం వీసీ రాజేంద్ర, రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ దేవరాజులు మొక్కలు నాటారు. చివరగా ఎస్వీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల విద్యార్థులతో కలసి సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
కర్నూలు(జిల్లా పరిషత్): ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే పలు రకాల వ్యాధులు దరిచేరవని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఆమె నగరంలోని 50వ వార్డులోని చెన్నకేశవస్వామి దేవాలయం వద్ద, 45వ వార్డులోని బంగారుపేట మున్సిపల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన వార్డు సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణిలకు సీమంతం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం ఎంతో ఉన్నతమైనదన్నారు. పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ్ కార్యక్రమంలో పాల్పంచుకోవాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన చెత్త కుండీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం లోపిస్తే అతి సారం, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, జీర్ణాశయం, కాలేయ వ్యాధులు వస్తాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రసాదశర్మ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణచక్రవర్తి, డీఈ నబీరసూల్, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు
గీసుకొండ : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గంగదేవిపల్లి గ్రామం దేశానికి మకుటాయమానంగా నిలుస్తోందని పంచాయతీరాజ్ కమిషనర్ చొల్లేటి ప్రభాకర్ అన్నారు. మండలంలోని గంగదేవిపల్లిలో ‘స్వచ్ఛతా పంచాయతీ సప్తాహ్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో గంగదేవిపల్లిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి సందర్శించి తనకు ఎంతో గొప్పగా చెప్పారని, అప్పుడే ఈ గ్రామాన్ని చూడాలని అనిపించిందన్నారు. పరి శుభ్రతను పాటించడంలో అన్నీ ఉత్తమ వార్డులే ఉండడం గంగదేవిపల్లికే సాధ్యమైందన్నారు. అందరి కోసం అందరూ పనిచేయాలన్న సూత్రాన్ని గంగదేవిపల్లి సాకారం చేసిందన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న అపార్డు శిక్షణ కేంద్రానికి మరో నెల రోజుల్లో నిధులు మం జూరు చేయిస్తానన్నారు. గంగదేవిపల్లి చరిత్ర ప్రపంచవ్యాప్తమవుతోంది : కలెక్టర్ కాకతీయుల చరిత్ర లాగానే గంగదేవిపల్లి చరి త్ర కూడా ప్రపంచ ప్రజలకు తెలిసిపోతోందని కలెక్టర్ కిషన్ అన్నారు. ఇప్పటికే గ్రామాన్ని 76 దేశాల వారు సందర్శించారని, ఎన్నో అవార్డు లు వచ్చాయని కితాబిచ్చారు. తాను ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజాప్రతినిధులతో మాట్లాడినా గంగదేవిపల్లి ప్రజలు సాధించిన విజయాల గురించే చెబుతున్నానని తెలిపారు. స్వఛ్చ భారత్ అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన కార్యక్రమ ప్రధాన ఉద్దేశాన్ని గంగదేవిపల్లి చాలా ముందుగానే సాధించిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇట్ల శాంతి, ఉప సర్పంచ్ కూసం రాజమౌళి, డీఎల్పీవో రాజేందర్, ఎంపీడీవో పారిజాతం, తహసిల్దార్ మార్గం కుమారస్వామి, ఈఓపీఆర్డీ భీంరెడ్ది రవీంద్రారెడ్డి, ఆర్ఐ గట్టికొప్పుల రాంబాబు, పంచాయతీ కార్యదర్శి శైలజ పాల్గొన్నారు. స్వచ్ఛత పంచాయతీ సప్తాహ్ సందర్భంగా కమిషనర్, కలెక్టర్‌తోపాటు గ్రామస్తులు, అధికారులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. 11న న్యూఢిల్లీకి సర్పంచ్.. గంగదేవిపల్లిపై ఇటీవల నేషనల్ ఫిల్మ్ సొసైటీ రూపొందించిన డాక్యుమెంటరీని ఈ నెల 11న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చూస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సర్పంచ్ ఇట్ల శాంతిని ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్ తెలిపారు. గంగదేవిపల్లి గురించి వివరించడానికి తనతోపాటు మరో ముగ్గురిని ఢిల్లీ పర్యటనకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ వివరించారు. కనెక్షన్ ఇచ్చే వరకూ ఇక్కడే ఉంటా.. తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన విషయాన్ని ఉపసర్పంచ్ కూసం రాజమౌళి.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పం దించిన ఆయన ‘పది రోజుల క్రితమే ఎస్ఈకి చె ప్పిన.. ఇంకా కనెక్షన్ ఇవ్వలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఇప్పుడు గంగదేవిపల్లిలోనే ఉన్నానని చెప్పు.. కరెంటు ఇవ్వకుండా కదలనని చెప్పు...’ అంటూ కలెక్టర్ తన పీఏతో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మోహన్‌రావుకు ఫోన్ చేయించారు. దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు అప్పటికప్పుడు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. కరెంటు మీటర్లు ఉన్న వాటికి ఈ ఏడాది నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలని, లేని వాటికి చెల్లించవద్దని, సరఫరాను నిలిపివేస్తే తనకు ఎస్ఎంఎస్ చేయాలని కలెక్టర్ సూచించారు.