‘స్వచ్ఛ’మే లక్ష్యం
ఉత్సాహంగా ‘స్వచ్ఛ హైదరాబాద్’ మంత్రులు...అధికారుల నిమగ్నం
సీఎం... మంత్రులు... అధికారులు... ఒక్కటిగా కదలి వస్తున్నారు. పరిశుభ్రతకే పరిమితం కాకుండా... బస్తీలు... కాలనీల్లో నెలకొన్న చిన్నపాటి సమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యమిస్తున్నారు. ఇది జనాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ఉల్లాసంగా పాల్గొనేలా చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వరుసగా నాలుగో రోజైన మంగళవారం కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రివర్గం... అధికార యంత్రాంగం పాల్గొన్నారు.
చెత్త కుప్పలు తొలగించడంతో పాటు మురుగు కాలువలు శుభ్రం చేయడం... రహదారులకు మరమ్మతుల వంటి పనులు చేపట్టారు. ఈ పనుల్లో స్థానికులూ మమేకమయ్యారు. తమ ప్రాంతాన్ని బాగు చేసుకునేందుకు ముందుకొచ్చారు.
తరలించిన చెత్త: 438 టిప్పుల ద్వారా 1326 మెట్రిక్ టన్నులు.
నిర్మాణ వ్యర్థాలు: 2706 ట్రిప్పులు 7020 మెట్రిక్ టన్నులు .
రెండు కలిపి: 3144 ట్రిప్పులు ద్వారా 8346 మెట్రిక్ టన్నులు తరలించారు.
రోడ్లపై ఉన్న గుంతల పూడ్చివేత
సీసీ రోడ్లపై 1863
బీటీ రోడ్లపై 1832
పుట్‌పాత్‌రిపేర్లు 80
వర్షపు నీటి గుంతలు 224
వరద నీటి కాల్వల మరమ్మతులు 40
మురుగునీటి కాల్వలు 251
మొత్తం 4290
జలమండలి పనులు : 262
వీటికి అయిన ఖర్చు : రూ.1350.42 లక్షలు
డ్రైనేజీ పనులకు అరుున ఖర్చు: రూ.3056.34 లక్షలు
వరద కాల్వల పనులు: రూ.812.75 లక్షలు
రోడ్ల మరమ్మతులు: రూ.5289.63 లక్షలు.
పార్కులు ప్లే గ్రౌండ్స్ పనులు: రూ.419.84 లక్షలు
కమ్యూనిటీ హాళ్లు, లైబ్రరీలు: రూ.6757.48 లక్షలు
మొత్తం పనులు: 2310
మొత్తం ఖర్చు: రూ. 17,686.46 లక్షలు