- ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ సమ్మయ్య
ఇబ్రహీంపట్నం : జపాన్‌లో పరిశుభ్రత, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె.సమ్మయ్య తెలిపారు. క్లీన్ కోల్ టెక్నాలజీ స్టడీ టూర్‌ను ముగించుకుని జపాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న ఆయనకు గురువారం అధికారులు, ఇంజినీర్లు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిపాలనా కార్యాలయంలో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ అక్కడ ఉత్పాదక ఖర్చు తగ్గించుకుని నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. తోషిబా, టోక్యో,
ఇమేర్చేర్యులోని కర్మాగారాలు, ట్రాన్స్‌పోర్టు కంపెనీలను సందర్శించి వాటి పనితీరును అధ్యయనం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ జెన్‌కో విద్యుత్ సౌధ చీఫ్ ఇంజినీర్ ఎంపీ సుందర్‌సింగ్, పర్యవేక్షక ఇంజనీర్లు కేఎస్ సుబ్రమణ్యంరాజు, ఎల్ మోహనరావు, రమేష్‌బాబు, నవీన్ గౌతం, సాయిబాబు, సుబ్బారావు, పర్యావరణం ఎస్‌ఈ ఎం శేఖర్, సివిల్ ఎస్‌ఈ పుష్పలత, కర్మాగారాల మేనేజర్ మైసూర్‌బాబు, సీనియర్ సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.