సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కామెడీ పండించిన ‘బుల్లిరాజు’ గుర్తున్నాడా? ‘‘అప్పడాలు వడియాలు అయ్యాయా’’అంటూ చెప్పిన కొన్ని డైలాగులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. థియేటర్ లో నవ్వులు పూయించిన బుల్లిరాజు క్యారెక్టర్ విమర్శల పాలయ్యింది. పిల్లాడితో బూతు డైలాగులా అంటూ జనం మండిపడ్డారు. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే...అక్కడికే వస్తున్నా... అప్పడాలు, వడియాలతోపండగ చేసుకుంటున్న నెటిజనుల దృష్టిలో అప్పడాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. పప్పు, సాంబారు, అప్పడాలు కాంబినేషన్ ఎంత ఫ్యామస్సో తెలుసు కదా. చాన్స్ దొరికితే కరకరమనే అప్పడాలను ఇంకో రెండు వేసుకుని మరీ లాగించేస్తాం. అయితే ఈ అప్పడాలను ఎలా తయారు చేస్తారో ఎపుడైనా ఆలోచించారా? దీనికి సంబంధించిన ఒక వీడియోపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.
అప్పడాల్లో చాలా రకాలు మార్కెట్లో లభిస్తుంటాయి. బియ్యం పాపడ్, మసాలా పాపడ్, కలి మిర్చ్ పాపడ్, రాగి పాపడ్, వెల్లుల్లి పాపడ్, సాబుదానా పాపడ్, అబ్బో ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఈ అప్పడాలు లేనిదే ఫంక్షన్స్, పార్టీలు సంపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పడాలను తయారు చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం ఒక పెద్ద గిన్నెలో అప్పడాల పిండి కలిపి ఉంది. దీని ఆవిరి మీద ఉడికేలా.. వేడినీటి గిన్నెపై ఉన్న మూతపై పూతలా వేసింది ఒక మహిళ.దాన్ని తీసి ఒకచోట పేర్చింది. ఆ తర్వాత వరుసగా పేర్చిన వాటిపై పదునైన గుండ్రటి స్టీల్ డబ్బాల సాయంతో కాళ్లతో తొక్కుతూ పెద్ద అప్పడంపై ఒత్తిడి పెంచి, దాన్ని గుండ్రటి అప్పడాలుగా తయారు చేశారు. అలా ఒక్కోటి వేరు వేరుగా తీసి వాటిని ఎండబెట్టడం ఈ వీడియోలు చూడవచ్చు.
తేజస్ పటేల్ అనే యూజర్ దీన్ని ఎక్స్‌లో షేర్ చేశారు. కష్టపడి పనిచేస్తున్నారు... కానీ శుభ్రతగురించి పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కమెంట్ చేశారు. ఇలాంటి వాటిని తినడం తినకపోవడం మీ ఇష్టం అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభినంగా స్పందించారు. కాళ్లతో తొక్కడం తప్ప అంతా బానే ఉందని కొందరు, అప్పడం రుచిలోని రహస్యం అదే అంటూ వ్యాఖ్యానించారు.
Very hardworking ppl, let's support. Why care about hygiene🤡 pic.twitter.com/4HmsxZIgWC
— Tejas Patel (@237Stardust) January 22, 2025
ఫాస్ట్ ఫుడ్, హోటల్స్‌లో పాటించే శుభ్రత కంటే బెటరేగా?
గతంలో ఇలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాలో చర్చకు తెరతీసింది. దీనిపై చాలామంది విమర్శలు గుప్పించినప్పటికీ, చాలామంది సమర్ధించారు. "ఫాస్ట్ ఫుడ్" కంటే మెరుగే అని కొందరు "చాలా హై-ఎండ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కంటే ఇది చాలా బెటర్ అని ఒకరు,"కనీసం ఈ మహిళ అప్పడాలపై డైరెక్ట్‌గా పాదం పెట్టకుండా తగినంత జాగ్రత్త పడుతోంది.. ఇంత కంటే ఘోరంగా చాలా హోటల్స్ ఉంటాయి అంటూ ఇంకొందరు అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
అప్పడం ఒక ఎమోషన్
సౌత్ ఇండియాలో అప్పడాలు, వడియాలు విందు భోజనాన్ని అస్సలు ఊహించలేం. అప్పడాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర మంచి పోషకాలు వుంటాయి. జీవక్రియను ప్రోత్సహించేందుకు అప్పడాలు దోహదపడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగల శక్తి అప్పడాలకు వుంది.అయితే ఇటీవల ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో ఆయిల్ లేకుండా వేయించుకునే అప్పడాలు కూడా వచ్చాయి ఎందుకంటే అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి ముఖ్యంగా ఆయిల్‌లో వేయించడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. రక్తపోటు, గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. సో.. చాయిస్ ఈజ్ యువర్స్.
Comments
Please login to add a commentAdd a comment