Papads
-
అప్పడాలు తెగ లాగించేస్తున్నారా ? ఈ ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం!
ఆరోగ్యకరమైన ఆహారం, బరువు తగ్గే ఆహారం గురించి మాట్లాడుకునేటప్పుడు, సాధారణంగా జంక్ ఫుడ్ తినకూడదని భావిస్తాం కదా. అలాగే ఖరీదైన లేదా పాశ్చాత్య ఆహారం ఏముందా అని ఆలోచిస్తాం. మన పెద్దవాళ్లు అలవాటు చేసిన కొన్ని ఆహారాల అలవాట్ల గురించి పెద్దగా పట్టించుకోం. అసలు విషయం దేని గురించో అర్థం కాలేదు కదా, అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.ఆరోగ్యకరమైన ఆహారం అంటే అది ఫాన్సీగానో లేదా ఖరీదైనదిగా ఉండవలసిన అవసరం లేదు. మనం పప్పులోనో, సాంబారులోనో నంజుకు తినే పాపడ్‌తో కూడా బరువు తగ్గవచ్చు! వింతగా అనిపిస్తుందా? ఇది నిజం! అమ్మ భోజనంతో పాటు అందించే పాపడ్ రుచికరమైందీ, ఆరోగ్యకరమైంది కూడా.పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహారాలను భోజనంతో పాటు తినడం వల్ల శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది పూర్తిగా గ్లూటెన్ రహితం కూడా. కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఇనుము లాంటి పోషకాలు అప్పడాల్లో పుష్కలంగా లభిస్తాయి. జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ప్రోటీన్స్ కూడా అధికం. అలెర్జీలు ఉన్నప్పటికీ, అప్పడాలు తినడం సురక్షితం. అన్ని వయసుల వారు, షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తినవచ్చు.నోట్ : ఇది అవగాహన కోసం అందించింది మాత్రమే. అమ్మమ్మ, నానమ్మల రెసిపీతో ఇంట్లో చేసిన అప్పడాలైతే మంచిది. మార్కెట్లో దొరికే వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఎలాంటి నూనె వాడుతున్నారు అనేది కూడా కీలకమే. ఆరోగ్య ప్రయోజనా లున్నాయి కదా అని ఏ ఆహారాన్ని అతిగా తీసుకోకూడదు. -
ఇసుకలో అప్పడం కాల్చిన జవాను
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఎండ వేడిమిలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.రాజస్థాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు. తాజాగా బికనీర్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలు ఏ రీతిలో ఉన్నాయో తెలియజేసేందుకు బీఎస్ఎప్ జవాను ఒకరు వినూత్న ప్రయోగం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.బీఎస్ఎఫ్ జవాను ఎండకు అత్యంత వేడిగా మారిన ఇసుకతో ఒక అప్పడాన్ని కాల్చారు. ఈ వీడియోను చూస్తే.. ప్రతికూల పరిస్థితుల్లో సైతం మన దేశ సరిహద్దులలోని సైనికులు ఎలా విధులు నిర్వహిస్తున్నారో గమనించవచ్చు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మనమంతా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుండగా, దేశ సరిహద్దుల్లోని జవానులు ఉక్కపోత మధ్యనే విధులు నిర్వహిస్తున్నారు. వైరల్ అయిన ఈ వీడియో బికనీర్‌లోని ఖాజువాలా సమీపంలోని పాక్ సరిహద్దులలోనిది. రాజస్థాన్‌లో హాటెస్ట్ సిటీగా బికనీర్ పేరుపొందింది. उफ ये गर्मी! बीकानेर में 47 डिग्री पार पहुंचा पारा, तपती रेत पर @BSF_India जवान ने सेंका पापड़। इतनी गर्मी में भी जवान सीमा पर निभा रहे फर्ज... देखें वीडियो #summersafety पूरी खबर पढ़ें- https://t.co/ToEeaJcxG9 pic.twitter.com/yyCajuv1lt— Amar Ujala (@AmarUjalaNews) May 22, 2024 -
అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి..
మనదేశం రుచికరమైన ఆహారం విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందరూ ఎంతగానో ఇష్టపడే వంటకాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అప్పడం రుచి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలకు ఎంతో ఇష్టం. అప్పడం భారతీయ వంటకాలలో ముఖ్యమైనదిగా పేరొందింది. వివాహ వేడుక అయినా, విందు అయినా పాపడ్ భారతీయులకు పాపడ్ ఉండాల్సిందే. క్రంచీ, స్పైసీతో కూడిన పాపడ్ ఇతర ఆహారపు రుచులను మరింతగా పెంచుతుంది. అయితే అందరూ ఎంతో ఇష్టంగా తినే పాపడ్ ఎలా పుట్టిందో, భారతీయుల ఆహారంలో అది ఎలా ప్రధాన భాగమైందో ఇప్పుడు తెలుసుకుందాం. పాపడ్‌కు ఘన చరిత్ర చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో మక్కువతో పాపడ్‌ను తింటారు. ఆహారపు రుచిని పెంచే ఈ కరకరలాడే పాపడ్ చరిత్ర 500 బీసీ అంటే 2500 సంవత్సరాల నాటిదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం ఆహార చరిత్రకారుడు, రచయిత కెటి ఆచార్య రాసిన 'ఎ హిస్టారికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్'లో కనిపిస్తుంది. మినప్పుప్పు, పెసర పప్పుతో చేసిన పాపడ్ గురించి అతని పుస్తకంలో ప్రస్తావించారు. మరోవైపు భారతదేశంలో దాని చరిత్ర గురించి చెప్పాలంటే ఇక్కడ పాపడ్‌కు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. పాపడ్ తయారీకి అనువైన సింధ్ అప్పడానికి సంబంధించిన తొలి ప్రస్తావన జైన సాహిత్యంలో కనిపిస్తుంది. పాపడ్ అనేది మార్వార్ జైన సమాజంలో కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు ప్రయాణాల్లో పాపడ్‌ను తీసుకెళ్లేవారు. పాపడ్ ఇండియాకు రావడం అనే విషయానికొస్తే ఇది మన పొరుగు దేశం పాకిస్తాన్ నుండి ఇక్కడకు చేరుకుంది. పాపడ్ తయారీకి సింధ్ (పాకిస్తాన్) సరైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ గాలి, అధిక ఉష్ణోగ్రత పాపడ్ తయారీకి అనువైనవి. 1947లో దేశ విభజన జరిగినప్పుడు చాలా మంది సింధీ హిందువులు భారతదేశానికి వలస వచ్చారు. వారు తమతో పాటు అప్పడాలు తీసుకువచ్చారు. అప్పడానికి ఊరగాయ జతచేసి.. ఆ సమయంలో అది అక్కడి ప్రజల ప్రధాన ఆహారంగా మారింది. ఎందుకంటే పాపడ్ శరీరంలో నీటిని నిలిపివుంచడంతో పాటు తాజాదనాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని భావించేవారు. రోజురోజుకు పాపడ్ వినియోగం పెరుగుతుండటంతో చాలామంది అప్పడాలను తయారు చేసి, వాటిని విక్రయిస్తూ డబ్బు సంపాదించసాగారు. పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సింధీలు తమ జీవనోపాధి కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితిలో పలువురు మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పడాలు, ఊరగాయలు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేవారు. అప్పడానికి ఎన్నో పేర్లు మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు అనేక రకాల పాపడ్లు పలు రుచులతో అందుబాటుకి వచ్చాయి. వీటిలో బియ్యం పాపడ్, రాగి పాపడ్, సజ్జ, బంగాళాదుంప, పప్పు, ఖిచియా పాపడ్ మొదలైనవి కూడా ఉన్నాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆహారంలో అప్పడం అనేది ముఖ్యమైన భాగంగా మారింది. ఈ వివిధ దేశాలలో అప్పడాలను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. తమిళనాడులో అప్పలమని పిలిస్తే, కర్ణాటకలో హప్పల అని అంటారు. కేరళలో పాపడమ్, ఒరిస్సాలో పంపా, ఉత్తర భారతదేశంలో పాపడ్ అని పిలుస్తారు. ఇది కూడా చదవండి: స్నేహితుని స్థానంలో పరీక్షకు సిద్ధం.. బయోమెట్రిక్ మెషీన్లో వేలు పెట్టగానే.. -
Recipes: ఇంట్లోనే ఇలా సులువుగా రాగుల అప్పడాలు, లసన్ పాపడ్!
విందు భోజనమైనా, ఇంటి భోజనమైనా పప్పు, చారు, రసం, చట్నీ, కూరలు ఎన్ని ఉన్నా అప్పడం లేకపోతే భోజనం బోసిపోతుంది. అందుకే దాదాపు అందరి ఇళ్లల్లో లంచ్, డిన్నర్లలోకి అప్పడం తప్పనిసరిగా ఉంటుంది. మార్కెట్లో దొరికే అప్పడాలు కాస్త ఖరీదు, పైగా కొన్నిసార్లు అంత రుచిగా కూడా ఉండవు. ఈ వేసవిలో మనమే రుచిగా, శుచిగా అప్పడాలు తయారు చేసుకుంటే, డబ్బు పొదుపు, ఆరోగ్యం, కాలక్షేపం కూడా. భోజనానికే వన్నె తెచ్చే అప్పడాలను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.. రాగులతో కావలసినవి: రాగి పిండి – అరకప్పు, మజ్జిగ – అరకప్పు, నీళ్లు – అరకప్పు, ఉప్పు – టీస్పూను, పచ్చిమిర్చి – రెండు, జీలకర్ర – అర టీస్పూను, ఇంగువ – పావు టీస్పూను, తెల్లనువ్వులు – రెండు టీస్పూన్లు. తయారీ.. ►ముందుగా ఒక గిన్నెలో రాగిపిండి వేయాలి. దీనిలో మజ్జిగ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ►పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువలను మిక్సీజార్‌లో వేసుకుని పేస్టుచేయాలి ►రెండు కప్పుల నీటిని బాణలిలో పోసి మరిగించాలి. ►నీళ్లు మరిగాక రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. ►ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమం వేసి ఉడికించాలి. రాగి మిశ్రమం దగ్గర పడిన తరువాత నువ్వులు వేసి స్టవ్ బీద నుంచి దించేయాలి. ►ఈ మిశ్రమాన్ని పలుచగా నీళ్లు చల్లిన పొడి వస్త్రంపై గుండ్రంగా అప్పడంలా వేసి ఎండబెట్టాలి. ►ఒకవైపు ఎండిన తరువాత రెండోవైపు కూడా పొడి పొడిగా ఎండాక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వచేసుకోవాలి. లసన్ పాపడ్ కావలసినవి: శనగపిండి – పావు కేజీ, వెల్లుల్లి తురుము – రెండున్నర టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – ఐదు (సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, కారం – టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, తయారీ.. ►శనగపిండిలో పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉప్పు, కారం, ఆయిల్ వేసి కలపాలి ►మిశ్రమానికి సరిపడా నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాలి. ►►పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, çపల్చగా అప్పడంలా వత్తుకోవాలి వీటిని నాలుగు రోజులపాటు ఎండబెట్టాలి. చక్కగా ఎండిన తరువాత ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వచేసుకోవాలి. పొటాటో పాపడ్ కావలసినవి: బంగాళ దుంపలు – కేజీ, బియ్యప్పిండి – రెండు కప్పులు ఉప్పు – టీస్పూను, కారం – టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – రెండు టీస్పూన్లు. తయారీ.. ►ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి కుకర్ గిన్నెలో వేయాలి. ►దీనిలో రెండు కప్పుల నీళ్లు పోసి, ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ►విజిల్ వచ్చాక 5 నిమిషాలపాటు మీడియం మంటమీద మెత్తగా ఉడికించాలి. ►దుంపలు చల్లారాక తొక్క తీసి, మెత్తగా చిదుముకుని, బియ్యప్పిండిలో వేయాలి. ►దీనిలో ఉప్పు, కారం, జీలకర్ర వేసి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి ముద్దలా కలుపుకోవాల. ►చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకుని దుంప మిశ్రమాన్ని ఉండలు చేయాలి. ►పాలిథిన్ షీట్‌కు రెండు వైపులా ఆయిల్ రాసి మధ్యలో ఉండ పెట్టి పలుచగా వత్తుకుని ఎండబెట్టాలి. ►రెండు వైపులా ఎండిన తరువాత గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల చదవండి👉🏾Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! -
పైసా వసూల్, జీఎస్టీ పన్ను లక్షకోట్లను దాటేసింది!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ, వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు లక్ష కోట్లకు అధిగమించాయి. రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోల్చితే ఈ నిధులు 30 శాతం అధికం కావడం గమనార్హం. కోవిడ్ ముందస్తు స్థాయి ఆగస్టు 2019 (రూ.98,202 కోట్లు) కన్నా కూడా ఈ నిధులు 14 శాతం అధికం కావడం మరో విషయం. జులై, ఆగస్టు మాసాల్లో తిరిగి రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతమని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం వంటి కారణాలు కూడా జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలకు కారణమైనట్లు తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వేర్వేరుగా ఇలా... ►సెంట్రల్ జీఎస్టీ రూ.20,522 కోట్లు ►స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రవాణాకు సంబంధించి వసూళ్లు– ఐజీఎస్టీ) రూ.56,247 కోట్లు. (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.26,884 కోట్లుసహా) ► సెస్ రూ.8,646 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.646 కోట్లుసహా). అప్పడానికి జీఎస్టీ వర్తించదు కాగా అప్పడానికి జీఎస్టీ వర్తించబోదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. పేరు లేదా ఆకారంతో సంబంధం లేకుండా.. పాపడ్‌కు జీఎస్టీ వర్తించబోదని స్పష్టం చేసింది. ‘‘గుండ్రంగా ఉన్న పాపడ్‌కు జీఎస్టీ నుండి మినహాయింపు ఉంది. చదరపు పాపడ్‌కు జీఎస్టీ వర్తిస్తుందని మీకు తెలుసా? నాకు ఈ లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్ని ఎవరైనా సూచించగలరా?’’ అని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్షా గోయెంకా మంగళవారం చేసిన ట్వీట్ నేపథ్యంలో సీబీఐసీ తాజా వివరణ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
అప్పడాలపై జీఎస్టీ !.. ట్విట్టర్లో రచ్చ రచ్చ
అప్పడాలపై జీఎస్టీ ఉందా? ఉంటే ఏ రకమైన అప్పడాలపై జీఎస్టీ ఉంది ? వేటికి మినహాయింపు ఉందనే అంశంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. చివరకు కేంద్రమే ఈ చర్చలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పాపడ్‌పై జీఎస్టీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఇటీవల ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. అందులో గుండ్రంగా ఉన్న పాపాడ్ (అప్పడం), చతురస్రాకారంలో ఉన్న అప్పడాల ఫోటోలను షేర్ చేశారు. ఇందులో గుండ్రటి అప్పడాలకు జీఎస్టీ మినహాయింపు ఉందని, చతురస్రాకారపు అప్పడాలకు జీఎస్టీ విధిస్తున్నారు ? ఇందులో లాజిక ఏముంది ? ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ ఈ సందేహానికి బదులివ్వాలంటూ అడిగారు. Did you know that a round papad is exempt from GST and a square papad attracts GST ? Can anyone suggest a good chartered accountant who can make me understand the logic? pic.twitter.com/tlu159AdIJ — Harsh Goenka (@hvgoenka) August 31, 2021 చర్చకు దారి తీసిన ట్వీట్ హర్ష్‌గోయెంకా ట్వీట్‌పై పెద్ద ఎత్తన నెటిజన్లు స్పందించారు. గుండ్రటి అప్పడాలు చేతితో చేస్తారు కాబట్టి వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని, చుతరస్రాకారపు అప్పడాలు మెషిన్ చేస్తారు కాబట్టి వాటికి జీఎస్టీ విధిస్తారంటూ చాలా మంది తమ అభిప్రాయం చెప్పారు. మరికొందరు చేతితో చేసే రౌండ్ షేప్ అప్పడాలు కుటీర పరిశ్రమ పరిధిలోకి వస్తాయని, స్క్వేర్ షేప్ అప్పడాలు భారీ పరిశ్రమ విభాగంలోకి వస్తాయంటూ స్పందించారు. ప్రభుత్వంపై విమర్శలు ఇక జీఎస్టీ చట్టం, అందులోని నిబంధనల జోలికి పోకుండా చాలా మంది నెటిజన్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అప్పడాలు రెండు ఒకటై అయినా రౌండ్ వాటికి మినహాయింపు ఇచ్చి, స్క్వేర్ షేప్ వాటికి పన్ను వేయడం పనికి మాలిన నిర్ణయమంటూ దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. ట్వీట్ పోస్ట్ చేసి 24 గంటల గడవక ముందే వేలాది మంది దీనిపై స్పందించడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. Papad, by whatever name known, is exempt from GST vide Entry No. 96 of GST notification No.2/2017-CT(R). This entry does not distinguish based on the shape of papad. This notification is available at https://t.co/ckIfjzg8hw https://t.co/19GbQJvYZe — CBIC (@cbic_india) August 31, 2021 జీఎస్టీ మినహాయింపు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోవడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం స్పందించింది. పాపాడ్ (అప్పడం) ఎలాంటిదైనా సరే దానిపై ఎటువంటి జీఎస్టీ విధించడం లేదని ప్రకటించింది. పాపాడ్లను జీఎస్టీ నుంచి మినహాయించినట్టు పేర్కొంది. ఈ మేరకు హర్ష్ గోయెంకా ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ బదులిచ్చింది. ఆల్కహాల్, పెట్రోలు ఉత్పత్తులు తప్ప దాదాపు అన్ని రకాల ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. చదవండి : సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి -
ఏడుగురు మహిళలు..రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్
సాక్షి వెబ్ డెస్క్: మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఏడుగురు మహిళలు. బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ లేదు.పెద్దగా చదువు కోలేదు. కానీ రూ.80 పెట్టుబడి పెట్టి 1600 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇప్పుడు 69 ప్రాంతాల్లో 42వేల మంది ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. ఆ మహిళలు ఎవరో కాదు శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్ వ్యవస్థాపకులు. ఇంటి వద్ద నుంచే ప్రారంభమైన లిజ్జత్ పాపడ్ బిజినెస్ కార్పొరేట్ స్థాయిలో వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఇంతకీ ఆ పాపడ్ కంపెనీ స్పెషల్ ఏంటీ? ఆ ఏడుగురు మహిళలు కేవలం రూ.80 ప్రారంభ పెట్టుబడితో 62 ఏళ్లుగా వందల కోట్ల బిజినెస్‌ను ఎలా రన్ చేస్తున్నారు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా 1959లో ముంబై గూర్ గావ్ ప్రాంతానికి చెందిన లోహన నివాస్ అనే బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న గుజరాతి కుటుంబాలకు చెందిన జశ్వంతిబెన్ జమ్నాదాస్ పోపాట్, పార్వతీబెన్ రామదాస్ తోడాని, ఉజాంబెన్ నారందాస్ కుండాలియా, బానుబెన్. ఎన్. తన్నా, లగుబెన్ అమృతలాల్ గోకాని, జయబెన్ వి. విఠలానీ, దివాలిబెన్ లుక్కా అనే ఏడుగురు మహిళలు కలిసి ఏదైనా బిజినెస్ పెట్టాలని అనుకున్నారు. చదువు లేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లలేరు. కేవలం ఏదో సాధించాలనే పట్టుదల, కష్టాలను వెరవని ఆత్మవిశ్వాసమే వారిని ముందుకు నడిపింది. కేవలం రూ.80పెట్టుబడితో తమకు తెలిసిన పాపడ్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. దానికి లిజ్జత్ పాపడ్ అని పేరు పెట్టారు. లిజ్జత్ అంటే అందరూ ఎదగాలని అర్ధం . ఇంటింటికి లిజ్జత్ మంచి క్వాలిటీ, టేస్ట్ తో పాపడ్ ను తయారు చేయడంతో ఇతర దుకాణాలకు చెందిన వ్యాపారులు లిజ్జత్ పాపడ్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగా వ్యాపారాన్ని విస్తరించేంత పెట్టుబడి వారి దగ్గర లేదు. అప్పుడే వారికో ఐడియా తట్టింది. ఇంటి దగ్గర ఉండే మహిళలన్ని తమ వ్యాపారంలో భాగస్వాములను చేశారు. పాపడాలు తయారు చేసే పనిని వారికి అప్పగించారు. తక్కువ పని, తక్కువ జీతం ఎక్కువ ఉత్పత్తి సాధ్యమైంది. మార్కెట్ డిమాండ్‌ని అందుకోగలిగారు. అలా ముంబైలో లిజ్జత్ ఇంటింటా ఓ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అయితే ఈ పని అంత ఈజీగా జరగలేదు. దీని కోసం ఆ మహిళలు కొత్త వ్యూహాన్ని రచించారు. బిజినెస్ మోడల్ ఇప్పుడంటే ఆడవాళ్లు కూడా ఆఫీసులకు వెళ్లి పని చేయగలుగుతున్నారు కానీ 1950,1960ల అంత సులువు కాదు. అందుకే పాపాడ్ తయారీకి అనువైన పిండి, ఇతర మసాల దినుసులను లిజ్జత్ ప్రధాన కార్యాలయంలో ఉంచేవారు. పాపడ్ తయారు చేసే మహిళలు వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లి ఇంటి దగ్గరే వాటిని తయారు చేసేవారు. మరుసటి రోజు వాటిని హెడ్ ఆఫీస్‌లో ఇచ్చే వారు. మళ్లీ పిండి తీసుకువెళ్లేవారు. చేసిన అప్పడాలకు సంబంధించిన డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చేవారు. ఇంటి దగ్గరే ఉంటూనే డబ్బులు సంపాదించే వాలు ఉండటంతో అనతి కాలంలోలోనే లిజ్జత్ పాపాడాలు తయారు చేసేందుకు ఆసక్తి చూపించే మహిళల సంఖ్య పెరిగిపోయింది. ప్రతీక్షణం అప్రమత్తం గృహిణులు ప్రతీ రోజు ఆఫీసుకు ఇంటికి వచ్చి పోయేప్పుడు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇంటి దగ్గర పరిశుభ్రమైన వాతావరణంలో నాణత్య పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు రెగ్యులర్‌గా హోం చెకప్‌లు కూడా చేసేవారు. లిజ్జత్ పాపడ్‌లో పని చేయాలనుకునే వారికి మొదట పాపడ్ రోలింగ్ వర్క్ అప్పచెప్పేవారు. అక్కడ బాగా పని చేస్తేనే తర్వాత పిండి కలపడం వంటి ఇతర బాధ్యతలు ఓ క్రమ పద్దతిలో అప్పగించేవారు. ఇలా గృహిణులు తమకు తెలిసిన పద్దతిలో తమకు ఎదురైయ్యే సవాళ్లను ముందుగానే ఊహిస్తూ బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లారు. కుటుంబ భావన లిజ్జత్ ఎదిగే క్రమంలో అండగా నిలిచిన వర్కర్లందరికీ ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నారు. లిజ్జత్ పాపడ్ స్థాపించిన ఐదేళ్ల తర్వాత దానిని శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ లిమిటెడ్ సంస్థగా మార్చారు. అందులో పని చేసే కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి వరకు అందరికీ కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చారు. ఇది మనది అనే భావన కలిగించారు. కంపెనీలో లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మహిళలందరూ సమానంగా పంచుకునేలా తీర్మాణం చేశారు. 42 వేల మందికి ఉపాధి అత్తెసరు అక్షర జ్ఞానం కలిగిన ఏడుగురు మహిళలు ఏర్పాటు చేసిన లిజ్జత్ ఈరోజు మహా వృక్షంగా మారింది. దేశంలో 67 బ్రాంచీల్లో 42 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మనదేశంలో పాటు 15 దేశాలకు ఈ పాపడ్లు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం లిజ్జత్ కంపెనీ ఏడాది టర్నోవర్ ఏకంగా రూ. 1600 కోట్ల రూపాయల పైమాటే అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎలాంటి మేనేజ్మెంట్ డిగ్రీలు లేకుండా కేవలం పరిస్థితులను అంచనా వేస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ లిజ్జత్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అచ్చం కుటుంబం లానే సాధారణంగా కంపెనీలు జీతం తప్ప కార్మికుల సంక్షేమం పట్ల అంతగా పట్టించుకోవు అనుకుంటాం. కానీ లిజ్జత్ పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థ అందుకే జీతాలు, భాగస్వామ్యం వంటి మనీ మ్యాటర్స్ ఒక్కటే కాదు వెల్ఫేర్‌లోనూ ముందు ఉంది. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ఉన్నత విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు. సహాకసంఘాల శక్తి ఎలాంటిదో ప్రపంచానికి చాటి చెప్పారు. చదవండి : నీ లుక్ అదిరే, సరికొత్త ఫీచర్లతో విడుదలైన సెడాన్ -
కాక రేపుతున్న పాపడం..
న్యూఢిల్లీ: భారతీయ ఆహారంలో పాపడాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వెజిటేరియన్ భోజనంలో పాపడం తప్పని సరి. అయితే గత కొద్ది రోజులుగా పాపడం ఏదో ఓ కారణంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పాపడ్‌తో కరోనా పరార్.. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే పాపడాలు తినాలంటూ ఓ మంత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. తాజాగా పాపడం మరో సారి వార్తల్లో నిలిచింది. 2014లో చిన్నారుల కోసం కంపోజ్ చేసిన ఓ పాపడం పాట ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. విగ్లెస్ అనే పిల్లల సంగీత బృందం సభ్యుడైన ఆంథోనీ డోనాల్డ్ జోసెష్ ఫీల్డ్ అనే ఆస్ట్రేలియా సంగీతకారుడు దీనిని స్వరపరిచారు. దాదాపు ఆరేళ్ల నాటి పాట తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాక వివాదాస్పదంగా మారింది. ఇక ఈ వీడియోలో ఆస్ట్రేలియన్ల బృదం "పాపడం" పాటను పాడతారు. దీనిలో ఒక దక్షిణాసియా మహిళ కూడా ఉంది. అయితే ఆమె నోటి వెంట ఎలాంటి పదాలు వెలువడవు.. పైగా ఏదో బలవంతంగా నవ్వుతూ.. ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం వీడియోలో చూడవచ్చు. (చదవండి: ‘ఈ పాపడ్‌తో కరోనా పరార్’) ఆమె కాక మిగతా అందరూ "పాపడం" అనే పదాన్ని పదేపదే జపిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో, ఈ టీంలోని ఒకరు క్రికెట్ బ్యాట్‌ని ఊపుతూ, పాటను పాడతాడు. ఇది క్రికెట్ పట్ల భారతదేశ ప్రేమను సూచిస్తుంది. సాంస్కృతిక ప్రాతినిధ్యంపై అవగాహన కల్పించడానికి 2014 లో పిల్లల కోసం రాసిన పాట అకస్మాత్తుగా దేశీ సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘2020లో ఇలాంటివి ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో.. మీ ఆలోచన బాగుంది.. ఆచరణ బాగాలేదు.. ఇలాంటి పాటతో పిల్లలకు ఏం బోధించాలనుకుంటున్నారు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వివాదం తలెత్తడంతో ఫీల్డ్ దీనిపై స్పందించారు. ‘భారతీయ సమాజాన్ని సాంస్కృతికంగా కించపరిచే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి’ అని కోరారు. Al, I wrote the song, and directed the clip in 2014 (which was meant as a celebration). It was not my intention to be culturally insensitive to the Indian community, or to add value to ethnic stereotyping. Apologies . — Anthony Field (@Anthony_Wiggle) October 22, 2020 -
పాపడాలు తినమన్న మంత్రికి కరోనా
న్యూఢిల్లీ: పాపడ్ తింటే కరోనా పోతుందని ఉచిత సలహా ఇచ్చి విమర్శలపాలైన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇప్పుడదే వైరస్ బారిన పడ్డారు. శనివారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తనకు కరోనా లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకున్నానని కేంద్ర మంత్రి తెలిపారు. మొదటి సారి నెగెటివ్ వచ్చినప్పటికీ రెండోసారి చేసిన పరీక్షలో పాజిటివ్ వచ్చిందన్నారు. తనను కలిసిన వారందరూ వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. (మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్) కాగా అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న ఆయన.. ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ కంపెనీ తయారు చేసిన పాపడ్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అమాంతం పెరిగి కరోనాను పోగొడుతుందంటూ మాట్లాడిన ఓ వీడియో గతంలో విపరీతంగా వైరల్ అయింది. ఇదిలా వుండగా మరో కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి కూడా కరోనా బారిన పడ్డారు. (నవనీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్) చదవండి: ‘ఈ పాపడ్‌తో కరోనా పరార్’ -
భాబీజీ పాపడ్‌ను లాంఛ్ చేసిన కేంద్ర మంత్రి
-
‘ఈ పాపడ్‌తో కరోనా పరార్’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను భాబీజీ పాపడ్ పారదోలుతుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ఈ పాపడ్‌ను ఆయన మార్కెట్లో ప్రవేశపెడుతున్న వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేఘ్వాల్ కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలో మేఘ్వాల్ భాబీజీ పాపడ్‌ను చూపుతూ కనిపించారు. ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్‌లో భాగంగా కరోనా వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ప్రేరేపించేందుకు ఊతమిచ్చేలా ఈ ఉత్పత్తిని పాపడ్ తయారీదారులు ప్రజల ముందుకుతీసుకువచ్చారని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఉత్పత్తిని చేపట్టిన తయారీదారులను తాము అభినందిస్తున్నామని ప్రశంసించారు. తమ ప్రోడక్ట్‌లో వ్యాధినిరోధకశక్తిని పెంచే పలు పదార్ధాలు ఉన్నాయని ఈ పాపడ్‌ను తయారుచేస్తోన్న బికనీర్‌కు చెందిన కంపెనీ పేర్కొంది . కాగా, మహమ్మారిపై పోరాటంలో అసత్య, అశాస్త్రీయ సమాచారాన్ని ప్రచారం చేస్తున్న అర్జున్‌రామ్ మేఘ్వాల్పై సుమోటోగా చర్యలు చేపట్టాలని ఈ వీడియోను పోస్ట్ చేసిన ఓ నెటిజన్ కోరారు. చదవండి : కోవిడ్-19 : మార్కెట్లోకి సిప్లా ఔషధం -
'అప్పడం'గా తినండి
ఏదో అప్పడమనీ... సైడ్ డిష్ అనీ ఇన్నాళ్లు సైడ్ ప్లేటులో పెట్టిన వాళ్లు ఇప్పుడు మెయిన్ కోర్సులోకి దించి అప్పనంగా తినండి! ఇది అప్పడం భోజనం! దహీ పాపడ్ కీ సబ్జీ కావలసినవి: నూనె – 4 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 1 (పొడవుగా నిలువుగా కట్ చేయాలి); మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; అప్పడాలు – 5; ఉప్పు – తగినంత; కసూరీ మేథీ – 2 టేబుల్ స్పూన్లు; గరం మసాలా – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙స్టౌ మీద బాణలిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి. ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి వేసి మరోమారు వేయించాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి వేసి మరోమారు వేయించాలి ∙కప్పు నీళ్లు, కప్పు చిలికిన పెరుగు వేసి కలపాలి ∙సన్నని మంట మీద పదార్థాలన్నీ కలిసేవరకు కలుపుతుండాలి ∙అప్పడం ముక్కలను ఇందులో వేసి, కొద్దిగా ఉప్పు జత చేసి రెండు నిమిషాలు ఉడికించాలి ∙గరం మసాలా, కసూరీ మేథీ జత చేసి బాగా కలిపి దింపేయాలి. మేథీ పాపడ్కర్రీ కావలసినవి: మెంతులు – 3 టేబుల్ స్పూన్లు; పెరుగు – 3 టేబుల్ స్పూన్లు; మినప అప్పడాలు – 4; ధనియాల పొడి – 3 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙స్టౌ మీద పెద్ద పాత్రలో రెండు కప్పుల నీళ్లు మరిగించి దింపేయాలి ∙మెంతులు వేసి మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక అప్పడాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి ∙మిక్సీలో... పెరుగు, ధనియాలు, మిరప కారం, పసుపు వేసి మెత్తగా చేసి, స్టౌ మీద బాణలిలో ఉన్న నూనెలో వేసి వేయించాలి ∙మెంతులలోని నీళ్లు తీసేసి, ఉడుకుతున్న పెరుగు మిశ్రమంలో వేసి రెండుమూడు నిమిషాలు కలియబెట్టాలి ∙ఒక కప్పు నీళ్లు జత చేసి మరిగించాలి ∙అప్పడం ముక్కలను ఇందులో వేసి కలిపి దింపేయాలి. (పచ్చి అప్పడాలను కూడా ఉపయోగించుకోవచ్చు) ∙అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. (మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఇందులోని మెంతులు ఔషధంలా పనిచేస్తాయి. పాపడ్ పోహా కావలసినవి: అప్పడాలు – 8; అటుకులు – ఒక కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక నూనె పోసి కాగాక, అప్పడాలు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙అప్పడాలను చేతితో పొడి చేయాలి ∙ఒక పాత్రలో అప్పడాల పొడి, అటుకులు, ఉప్పు, మిరప కారం, ఇంగువ వేసి బాగా కలిపి, గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. స్టఫ్డ్ పాపడ్ రోల్స్ కావలసినవి: పసుపు – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఆమ్చూర్ – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1; అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్ స్పూను; మైదా పిండి – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – 3 టేబుల్ స్పూన్లు; పచ్చి బఠాణీ – పావు కప్పు; ఉడికించి, మెత్తగా మెదిపిన బంగాళ దుంప – రెండు కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; చిన్న సైజు అప్పడాలు – 10. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, కొద్దిగా నీళ్లు పోసి దోసెల పిండి మాదిరిగా కలిపి పక్కనుంచాలి ∙స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙పచ్చి బఠాణీ, ఉడికించి మెదిపిన బంగాళ దుంప, ఉప్పు, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, ఆమ్ చూర్ పొడి వేసి కలపాలి ∙ఒక్కో అప్పడాన్ని చల్ల నీళ్లలో 30 సెకన్ల పాటు ఉంచి తీసేయాలి ∙అప్పడం మెత్తగా ఉన్నప్పుడే బంగాళ దుంప మిశ్రమం కొద్దిగా తీసుకుని అప్పడానికి ఒక చివర ఉంచి, జాగ్రత్తగా రోల్ చేసి, అంచులను మైదా పిండితో మూసేయాలి ∙ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న పాపడ్ రోల్స్‌ను అందులో వేసి కరకరలాడే వరకు వేయించాలి ∙కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి ∙గ్రీన్ చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. స్వీట్ అండ్ టాంగీ మసాలా పాపడ్ చాట్ కావలసినవి: ఉల్లి తరుగు – పావు కప్పు; ఉడికించిన బంగాళ దుంప – అర కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; గ్రీన్ చట్నీ – 2 టీ స్పూన్లు; స్వీట్ చట్నీ – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; మిరప కారం – పావు టీ స్పూను; మిక్స్చర్ – రెండు కప్పులు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; చాట్ మసాలా – అర టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; పచ్చి అప్పడాలు – 4 (మధ్యకు రెండు ముక్కలుగా కట్ చేయాలి) తయారీ: ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, నూనె వేయకుండా, అప్పడాలను పేపర్ నాప్కిన్తో ఒత్తుతూ కాల్చి కోన్ ఆకారంలో చుట్టాలి (వేడిగా ఉన్నప్పుడే కోన్ ఆకారంలో చుట్టినప్పుడు అంచులు అవే అతుక్కుంటాయి ∙ఈ విధంగా అన్నీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ∙ఒకపాత్రలో ఉడికించిన బంగాళ దుంప ముక్కలు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, మిక్స్చర్, కొత్తిమీర తరుగు, ఉప్పు, మిరప కారం, చాట్ మసాలా, నిమ్మ రసం, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ అన్నీ వేసి బాగా కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న కోన్‌లో ఈ మిశ్రమాన్ని ఉంచి, చాట్ మసాలా చల్లి అందించాలి ’ స్నాక్‌లా చాలా రుచిగా ఉంటుంది. కేరళ స్టైల్ పాపడ్ కర్రీ కావలసినవి: బంగాళ దుంప ముక్కలు – ఒక కప్పు; కేరళ అప్పడాలు – 10; ఉల్లి తరుగు – ఒక కప్పు; అల్లం ముద్ద – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2 ; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; కొబ్బరి నూనె – 3 టీ స్పూన్లు (పోపు కోసం). తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, అప్పడాలు వేయించి తీసి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙అదే బాణలి లో బంగాళ దుంప ముక్కలు వేసి కరకరలాడేవరకు వేయించాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙ఇంగువ, పచ్చి మిర్చి తరుగు, అల్లం ముద్ద వేసి బాగా కలపాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙మిరప కారం, పసుపు, ధనియాల పొడి జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙వేయించుకున్న బంగాళ దుంప ముక్కలు, అప్పడం ముక్కలు వేసి కలిపి దింపేయాలి ∙ఈ కూర అన్నంలోకి రుచిగా ఉంటుంది ∙స్నాక్లాగ కూడా తినొచ్చు. పాపడ్ స్టఫ్డ్పరాఠా కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; అప్పడాలు – 4; గరం మసాలా – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి). తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలుపుకుని, అరగంట సేపు పక్కన ఉంచాలి ∙అప్పడాలను నూనె లేకుండా పెనంమీద కాల్చి, చేతితో మెదుపుతూ మెత్తగా పొడి చేయాలి ∙ఒక పాత్రలో అప్పడాల పొడి, గరం మసాలా, ఎండు మిర్చి ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙ఒక్కో ఉండను, చేతితో గుండ్రంగా చేయాలి ∙అప్పడాల పొడి మిశ్రమం అందులో ఉంచి మధ్యలోకి మడిచి, అంచులు మూసేయాలి ∙అప్పడాల కర్రతో జాగ్రత్తగా ఒత్తుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక వీటిని ఒక్కొక్కటిగా వేసి ఎక్కువ సేపు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి. -
అప్పడాలమ్మా అప్పడాలు
.... అని రోడ్డుపై అమ్ముతున్నారు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్‌రోషన్. హీరో అప్పడాలు అమ్మాడంటే అది కచ్చితంగా ఏదో సినిమాకే అయ్యుంటుంది. అవును... ‘సూపర్ 30’ కోసం హృతిక్ అప్పడాలు అమ్మారు. బీహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ 30’. ఆనంద్ పాత్రలో హృతిక్ నటించారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలోని హృతిక్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఆనంద్‌కుమార్ జీవితంలో ఇలా అప్పడాలు అమ్మే నాటి పరిస్థితులు ఎంతో ఉద్వేగంతో కూడుకున్నవి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన కష్టపడి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని హృతిక్ పేర్కొన్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూలై 12న విడుదల కానుంది. -
అప్పడాలు అమ్ముకుంటున్న హీరో?
జైపూర్ : నగరాల్లోని బస్టాప్‌ల్లో, కూడళ్లలో అప్పడాలు, పిండివంటలు అమ్ముకుంటూ చాలామంది కనిపిస్తారు. వారిని చాలామంది పట్టించుకోరు. అవసరముంటే వారి వద్దకు వెళ్లి కొంటారు. అంతే.. కానీ జైపూర్‌లో ఇలా అప్పడాలు అమ్మిన ఓ వ్యక్తి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయి.. పాత్రలో ఒదిగిపోయిన అతని ఫొటోలు చూసి నెటిజన్లు విస్మయపోతున్నారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే.. బాలీవుడ్ గ్రీకుదేవుడు హృతిక్ రోషన్. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా ‘సూపర్ 30’.. బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు ఆనంద్‌కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా వికాస్ బల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా హృతిక్ ఇలా ఎవరూ గుర్తుపట్టనంతగా మారిపోయి.. జైపూర్‌లోని కూడళ్లలో సైకిల్ మీద అప్పడాల బుట్ట పెట్టుకొని.. వీధి, వీధి తిరిగి అమ్మాడు. సైకిల్ మీద అప్పడాలు అమ్ముతూ అతను వీధుల్లో తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు. తాజాగా సోషల్ మీడియాలో లీకైన ఈ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. పాత్రలోకి సంపూర్ణంగా లీనమై నటించడంలో హృతిక్‌కు హృతికే సాటి అంటూ అభిమానులు కొనియాడుతున్నారు. -
కుగ్రామం నుంచి అమెరికాకు
ఇక్కడ తయారయ్యే అప్పడాలు, చక్కిలాలు, పేణి, సొండిగలు రుచికి పేరుపొందాయి. సబ్బియ్యము, జిలకర, పుదీన, పాలాకు, కరివేపాకు,కొత్తిమీర, మెంతాకు, టమోటోలను కలిపి చేసే అప్పడాలు చూడగానే నోరూరిస్తాయి. ఇక విడిగాను, భోజనాల్లోను నంజుకుని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు. గౌరిబిదనూరు: గౌరిబిదనూరు సమీపంలోని కల్లూడి గ్రామం రుచికరమైన అప్పడాల తయారీకి ప్రసిద్ధి పొందింది. ఇక్కడి మహిళలు తయారుచేసే అప్పడాలు ఇతర రాష్ట్రాలకు, తాజాగా విదేశాలకూ ఎగుమతి అవుతూ పల్లెవాసుల కీర్తిని చాటుతున్నాయి. ఆ ఊళ్లో ఏ ఇంటి ముంగిట, మిద్దెల మీద చూసినా అప్పడాలు ఆరవేసిన దృశ్యాలే కనిపిస్తాయి. సుమారు 2 వేలమంది జనాభా, 720 కుటుంబాలు నివసిస్తున్న ఈ చిన్న గ్రామంలో 80 శాతం మంది వృత్తి అప్పడాల తయారీనే. ఈ గ్రామంలో 5 పిండిమరలు ఉన్నాయి. ప్రతి మిల్లూ రోజూ 4 క్వింటాళ్ళ బియ్యాన్ని పిండి ఆడిస్తుంది. ఇలా ఒక కుగ్రామంలో పుట్టిన ఆర్థిక విప్లవంగా ఈ గ్రామాన్ని సందర్శించిన అభ్యుదయవాదులు పేర్కొన్నారు. గ్రామంలో మహిళలు సూర్యోదయం నుంచే అప్పడాల తయారీ ఆరంభిస్తారు. సిరిధాన్యాలు, ఆకుకూరలను కలిపి అనేక రకాల ఫ్లేవర్లలో 18 రకాల అప్పడాలు చేయడంలో వీరు దిట్టలు. పురుషులు వాటిని నగరాలు, పట్టణాల్లో విక్రయించుకుని వస్తారు. ఒక్కో మహిళకు రోజుకు రూ.200 వరకు లాభం మిగులుతుంది. విదేశాల్లోనూ డిమాండు అప్పడాల పేరు క్రమంగా రాష్ట్రం దాటి తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పాకింది. అక్కడి నుంచి వ్యాపారులు, దళారులు వచ్చి పెద్ద మొత్తంలో కొనుక్కువెళ్తున్నారు. బెంగళూరు తదితర నగరాల నుంచి విదేశాలకు వెళ్లే వారు కల్లూడి అప్పడాలను వెంట తీసుకెళ్లడం ఆరంభమైంది. తమ కోసమే కాకుండా అక్కడ ఉండే బంధుమిత్రుల కోసం కూడా ఆర్డర్లపై చేయించుకుని తీసుకెళ్తుంటారని గ్రామ మహిళలు చెప్పారు. ఒక్కసారి కొనుక్కువెళ్లినవారు మళ్లీ మళ్లీ కావాలని ఫోన్లు చేసి కొరియర్ ద్వారానో, లేదా తమ బంధుమిత్రుల ద్వారానో తెప్పించుకుంటా రు. అమెరికా, గల్ఫ్, యూరప్ దేశాలకు వెళ్లేవా రు ఎక్కువగా అప్పడాలకు ఆర్డర్లు ఇస్తూ ఉంటా రు. దీంతో గ్రామ మహిళల ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది. నాణ్యత, రుచి పునాదులగా తయారయ్యే అప్పడాలకు ఎంత చెల్లించినా తక్కువే అంటారు కొనుగోలుదారులు. -
హహ్హహహ్హహహ్హహా..!
... వివాహభోజనంబు.. వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు.. ఒహ్హొహ్హొ నాకె ముందు! ఔరౌర గారెలల్ల... అయ్యారె బూరెలిల్ల... ఒహోరే అరిసెలుల్ల... ఇయెల్ల నాకె చెల్ల... పెళ్లి భోజనం ఎలా ఉందో... అధరాన్ని, ఉదరాన్ని మధురంగా ఊదరగొడుతూ పంచేంద్రియాలనూ అదిలించి కదిలిస్తారు ‘మాయాబజార్’ సినిమాలో ఎస్వీ రంగారావు! గారెలు, బూరెలు, అరిసెలేనా? లడ్లు, జిలేబీలు, అప్పడాలు.. పులిహోర దప్పళాలు.. పాయసాలు... ఎన్ని లేవు ఆ లిస్టులో! వాటిల్లో ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని కలిపి ఇవాళ మీ చేత లొట్టలు వేయించబోతోంది ‘ఫ్యామిలీ’! వివాహభోజనానికి ఏ మాత్రం తక్కువకాని ఈ దీపావళి భోజనాన్నిహహ్హహహ్హహహ్హహా... అంటూ ఆరగించండి. మీ ఆత్మీయులకు కొసరి కొసరి తినిపించండి. హ్యాపీ దీపావళి! సజ్జప్పాలు లేదా హల్వా పూరీ కావలసినవి: స్టఫింగ్ కోసం... బొంబాయి రవ్వ - కప్పు; పంచదార - కప్పు; నీళ్లు - రెండున్నర కప్పులు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు పై భాగం కోసం... మైదా పిండి - కప్పు; ఉప్పు - చిటికెడు; నూనె - అర కప్పు (మైదా పిండి నానబెట్టడానికి); నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారీ: బాణలిలో నెయ్యి వేసి వేడి చేశాక, జీడిపప్పులు వేయించి తీసేయాలి అదే బాణలిలో రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాక, వేయించి ఉంచుకున్న రవ్వ, జీడిపప్పు పలుకులు వేసి మిశ్రమం దగ్గరపడే వరకు కలిపి, ఆ తరవాత పంచదార జత చేయాలి బియ్యప్పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, మిశ్రమం చల్లారాక, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలిపి, అర కప్పు నూనె జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నానబెట్టాలి చేతికి నెయ్యి రాసుకుని నానబెట్టుకున్న మైదాపిండి ముద్ద తీసుకుని, చేతితో చపాతీలా ఒత్తి, అందులో బొంబాయిరవ్వ మిశ్రమం ఉండను ఉంచి, బొబ్బట్టు మాదిరిగా సజ్జప్పం ఒత్తాలి. ఇలా మొత్తం తయారుచేసి పక్కన ఉంచుకోవాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో సజ్జప్పం వేసి వేయించి తీసేయాలి ఇవి సుమారు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి. జిలేబీ కావలసినవి: మైదా పిండి - కప్పు; బేకింగ్ పౌడర్ - అర టీ; స్పూను; పెరుగు - కప్పు; నూనె - వేయించడానికి తగినంత; పంచదార - కప్పు; కుంకుమ పువ్వు - చిటికెడు; ఏలకుల పొడి - పావు టీస్పూను; మిఠాయి రంగు - రెండు చుక్కలు; రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి బాగా కలిపి ఒక రోజంతా నాననివ్వాలి మూతకు రంధ్రం ఉన్న మ్యాగీ సీసా వంటి దానిలో ఈ మిశ్రమాన్ని పోయాలి ఒక పాత్రలో పంచదార, నీళ్లు, రోజ్ వాటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జత చేయాలి బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి (మంట మధ్యస్థంగా ఉండాలి) పిండి ఉన్న సీసాను తీసుకుని జిలే బీ ఆకారం వచ్చేలా నూనెలో తిప్పాలి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి వెంటనే పంచదార పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి వేడివేడిగా అందించాలి. అప్పడాల కూర మీకు అప్పడాలంటే ఇష్టం ఉంటే, ఈ కూరను కూడా ఇష్టపడతారు. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. రాజస్థానీయులు ఎక్కువగా తయారుచేసే ఈ కూరను చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. కావలసినవి: అప్పడాలు - పావు కిలో; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; నెయ్యి లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; ఉల్లి తరుగు - పావు కప్పు; అల్లం ముద్ద - టీ స్పూను; వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; చిక్కగా గిలక్కొట్టిన పెరుగు - ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారీ: అప్పడాలను నూనెలో వేయించి నాలుగు ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి (మైక్రోవేవ్‌లో కూడా చేసుకోవచ్చు) స్టౌ (సన్నని మంట) మీద బాణలి ఉంచి, నెయ్యి లేదా నూనె వేసి, కాగాక జీలకర్ర వేసి వేయించాలి ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి పెరుగు, కప్పుడు వేడి నీళ్లు జత చేయాలి అప్పడం ముక్కలను వేసి జాగ్రత్తగా కలిపి, కొద్దిసేపు ఉడకనిచ్చి దింపే ముందు కొత్తిమీరతో అలంకరించి, అన్నంతో వడ్డించాలి. దప్పళం కావలసినవి: కందిపప్పు - పావు కప్పు; బెల్లం - 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - చిన్న కట్ట; చింతపండు గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు; సాంబారు పొడి - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; చిలగడదుంప ముక్కలు - అర కప్పు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి - 6 (పొడవుగా మధ్యకు చీల్చాలి); మునగకాడ ముక్కలు - కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; దొండకాయ ముక్కలు - పావు కప్పు; అరటికాయ ముక్కలు - పావు కప్పు; తీపి గుమ్మడికాయ ముక్కలు - కప్పు; సొరకాయ ముక్కలు - అర కప్పు; సెనగ పిండి - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; కారం - 2 టీ స్పూన్లు; పోపు కోసం... ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 10; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; ఇంగువ - కొద్దిగా తయారీ: పప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాక, మెత్తగా మెదిపిన పప్పు వేసి బాగా కలిపి, బెల్లం తురుము జత చేయాలి సాంబారు పొడి, కారం వేసి కాసేపు ఉడికించాలి కొద్దిగా నీళ్లలో సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న దప్పళంలో వేసి కలపాలి ఈలోగా పక్కన చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, మరుగుతున్న దప్పళంలో వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి. పేణీ లడ్డు కావలసినవి: సెనగపిండి - కప్పు; పేణీ - కప్పు; పంచదార - ముప్పావు కప్పు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; డ్రై ఫ్రూట్ పొడి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: స్టౌ (సన్న మంట) మీద బాణలి ఉంచి సెనగపిండి వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపి చల్లారనివ్వాలి మిక్సీలో పంచదార, పేణీలు వేసి రవ్వలా చేసి, సెనగపిండి ఉన్న పాత్రలో వేయాలి డ్రైఫ్రూట్ పొడి జత చేయాలి కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూ కట్టాలి. పేణీ పాయసం పాలు వేడి చేసి, బెల్లం పొడి జత చేసి కలిపాక, డ్రై ఫ్రూట్ పొడి జత చేయాలి ఒక పాత్రలో పేణీ వేసి అందులో పాలు బెల్లం మిశ్రమం వేయాలి తేనె వేసి బాగా కలిపి బాగా చల్లారాక అందించాలి. కట్టె పొంగలి కావలసినవి: బియ్యం - ముప్పావు కప్పు; పెసరపప్పు - పావు కప్పు; మిరియాల పొడి - టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; పచ్చి మిర్చి - 4; జీలకర్ర - టీ స్పూను; జీడిపప్పులు - 10; కరివేపాకు - 2 రెమ్మలు; నెయ్యి - 5 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత తయారీ: బియ్యం, పెసర పప్పులను శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి దించేయాలి పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్ది సేపు వేయించాక, జీడిపప్పు పలుకులు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి, అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి కలియబెట్టాలి చట్నీ, సాంబారులతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. సేకరణ: డా. వైజయంతి