మనదేశం రుచికరమైన ఆహారం విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందరూ ఎంతగానో ఇష్టపడే వంటకాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అప్పడం రుచి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలకు ఎంతో ఇష్టం. అప్పడం భారతీయ వంటకాలలో ముఖ్యమైనదిగా పేరొందింది. వివాహ వేడుక అయినా, విందు అయినా పాపడ్ భారతీయులకు పాపడ్ ఉండాల్సిందే. క్రంచీ, స్పైసీతో కూడిన పాపడ్ ఇతర ఆహారపు రుచులను మరింతగా పెంచుతుంది. అయితే అందరూ ఎంతో ఇష్టంగా తినే పాపడ్ ఎలా పుట్టిందో, భారతీయుల ఆహారంలో అది ఎలా ప్రధాన భాగమైందో ఇప్పుడు తెలుసుకుందాం.
పాపడ్‌కు ఘన చరిత్ర
చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో మక్కువతో పాపడ్‌ను తింటారు. ఆహారపు రుచిని పెంచే ఈ కరకరలాడే పాపడ్ చరిత్ర 500 బీసీ అంటే 2500 సంవత్సరాల నాటిదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం ఆహార చరిత్రకారుడు, రచయిత కెటి ఆచార్య రాసిన 'ఎ హిస్టారికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్'లో కనిపిస్తుంది. మినప్పుప్పు, పెసర పప్పుతో చేసిన పాపడ్ గురించి అతని పుస్తకంలో ప్రస్తావించారు. మరోవైపు భారతదేశంలో దాని చరిత్ర గురించి చెప్పాలంటే ఇక్కడ పాపడ్‌కు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది.
పాపడ్ తయారీకి అనువైన సింధ్
అప్పడానికి సంబంధించిన తొలి ప్రస్తావన జైన సాహిత్యంలో కనిపిస్తుంది. పాపడ్ అనేది మార్వార్ జైన సమాజంలో కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు ప్రయాణాల్లో పాపడ్‌ను తీసుకెళ్లేవారు. పాపడ్ ఇండియాకు రావడం అనే విషయానికొస్తే ఇది మన పొరుగు దేశం పాకిస్తాన్ నుండి ఇక్కడకు చేరుకుంది. పాపడ్ తయారీకి సింధ్ (పాకిస్తాన్) సరైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ గాలి, అధిక ఉష్ణోగ్రత పాపడ్ తయారీకి అనువైనవి. 1947లో దేశ విభజన జరిగినప్పుడు చాలా మంది సింధీ హిందువులు భారతదేశానికి వలస వచ్చారు. వారు తమతో పాటు అప్పడాలు తీసుకువచ్చారు.
అప్పడానికి ఊరగాయ జతచేసి..
ఆ సమయంలో అది అక్కడి ప్రజల ప్రధాన ఆహారంగా మారింది. ఎందుకంటే పాపడ్ శరీరంలో నీటిని నిలిపివుంచడంతో పాటు తాజాదనాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని భావించేవారు. రోజురోజుకు పాపడ్ వినియోగం పెరుగుతుండటంతో చాలామంది అప్పడాలను తయారు చేసి, వాటిని విక్రయిస్తూ డబ్బు సంపాదించసాగారు. పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సింధీలు తమ జీవనోపాధి కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితిలో పలువురు మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పడాలు, ఊరగాయలు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేవారు.
అప్పడానికి ఎన్నో పేర్లు
మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు అనేక రకాల పాపడ్‌లు పలు రుచులతో అందుబాటుకి వచ్చాయి. వీటిలో బియ్యం పాపడ్, రాగి పాపడ్, సజ్జ, బంగాళాదుంప, పప్పు, ఖిచియా పాపడ్ మొదలైనవి కూడా ఉన్నాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆహారంలో అప్పడం అనేది ముఖ్యమైన భాగంగా మారింది. ఈ వివిధ దేశాలలో అప్పడాలను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. తమిళనాడులో అప్పలమని పిలిస్తే, కర్ణాటకలో హప్పల అని అంటారు. కేరళలో పాపడమ్, ఒరిస్సాలో పంపా, ఉత్తర భారతదేశంలో పాపడ్ అని పిలుస్తారు.
ఇది కూడా చదవండి: స్నేహితుని స్థానంలో పరీక్షకు సిద్ధం.. బయోమెట్రిక్ మెషీన్‌లో వేలు పెట్టగానే..
Comments
Please login to add a commentAdd a comment