Sakshi News home page

'భారత్ చంద్రున్ని చేరితే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోంది'

Published Tue, Sep 19 2023 7:23 PM

Pakistan Begging The World While India Reached Moon Nawaz Sharif - Sakshi

ఇస్లామాబాద్‌: భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్‌ను పాలించిన గత ప్రధానులు అవినితీకి పాల్పడి.. దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేశారని ఆరోపించారు.

' పాకిస్థాన్ ప్రధాని నిధులు సమకూర్చండని పక్క దేశాలను అడుక్కుంటున్నారు. మన పక్కనే ఉన్న భారత్.. చంద్రమండలంపైకి వెళ్లింది. జీ20 వంటి ప్రపంచ సమ్మిట్‌లకు వేదికగా మారింది. పాక్ ఎందుకు సాధించలేదు. ఈ దుస్థితికి కారణం ఎవరు..? వాజ్‌పేయీ కాలంలో భారత్‌ వద్ద నిల్వలు చాలా తక్కువగా ఉండేవి. అదే ప్రస్తుతం వారి నిల్వలు 600 బిలియన్ డాలర్ల వరకు చేరాయి.' అని లాహోర్‌ వేదికగా జరిగిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి మాట్లాడారు. 

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దిగజారిపోతోంది. ‍పేద  ప్రజలకు తిండి పెట్టలేని దుస్థితికి చేరింది. ద్రవ్యోల్భణం రెండంకెల సంఖ్యకు చేరింది. పాకిస్థాన్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జులైలో ఐఎంఎఫ్‌కు 1.2 బిలియన్ అమెరికా డాలర్లను సమకూర్చింది.    

 నవంబర్ 2019లో,  నవాజ్‌ షరీఫ్‌కు అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. వైద్య కారణాలతో దేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21న ఆయన పాకిస్థాన్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. లాహోర్‌కు రాకముందే ఆయనకి రక్షిత బెయిల్ మంజూరు చేస్తామని PML-N పార్టీ చెబుతోంది. యూకే నుంచి తిరిగి వచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించనున్నారని పార్టీ నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే!

Advertisement

What’s your opinion

Advertisement