begging
-
బిచ్చగాళ్ల వేషంలో బీజేపీ కార్పొరేటర్లు
-
నీ కష్టం పగోడికి క్కూడా రాకూడదు మచ్చా... వైరల్ వీడియో
సాధారణంగా పెళ్లి కాని ప్రసాదులు ఏం చేస్తారు? పెళ్లిళ్ల పేరయ్యలనో, పెళ్లిళ్లు కుదిర్చే వెబ్‌సైట్లనో ఆశ్రయిస్తారు. అదీ కాదంటే స్నేహితుల ద్వారానో తనకు కావాల్సిన అమ్మాయిని వెతుక్కుంటారు. కానీ ఒక యువకుడు వెరైటీగా ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. స్టోరీ ఏంటంటే... రైళ్లలో చాయ్, సమోసాలు, పల్లీలు వగైరాలు అమ్ముకోవడం చూస్తాం.కానీ ఒక మెట్రో ట్రైన్లో ఉన్నట్టుండి ఒక యువకుడు గట్టి, గట్టిగా అరుస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తీరా అతను మాట్లాడుతున్నదేంటో అర్థమై పగలబడి నవ్వేశారు. అంతేకాదు అమ్మాయిలు కూడా ముసి ముసినవ్వులు కోవడం ఈ వీడియోలో చూడొచ్చు. "మీ రోజుకి అంతరాయం కలిగించినందుకు క్షమించండి. నేను డ్రగ్స్ వాడను నాకు పిల్లలు లేరు. కానీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఐ లవ్ అమెరికా, ప్లీజ్ నన్ను వరైనా నన్ను వివాహం చేసుకోండి. తద్వారా అమెరికాలో ఉండగలను. నాకు మంచి వంట వచ్చు. మంచిగా మాలిష్ చేయడం వచ్చు. డిస్కో సంగీతం వింటాను’’ ఇలా సాగుతుండి అతగాడి అభ్యర్థన. ‘‘నాకు మీ డబ్బు అవసరం లేదు, నా డబ్బు కూడా మీకే ఇస్తాను. మంచి బట్టలు, బూట్లు కొనుగోలు చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చేశాడు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో.. ఆడా, మగా ఎవరైనా, నాకు ఆఫర్ చేయడానికి సమాన అవకాశాలు’’ అనడంతో అక్కడున్నవారంతా గొల్లుమన్నారు. దీంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు.‘‘హిల్లేరియస్, ఇతగాడు మంచి సేల్స్ మేన్, తనను తాను అమ్మేసుకుంటున్నాడు’’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. వీళ్లను చూసి ‘‘మీకు భలే హ్యాపీగా ఉండాది గదా’’ అని పుష్ప స్టైల్లో ఉడుక్కుంటున్నారట పెళ్లి కాని ప్రసాదులు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గెయెంకా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియో ప్రామాణికత, మూలంపై స్పష్టత లేదు. యూఎస్ లో పరిస్థితి ఇదీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. In trains in India, people sell chai, toys, combs, samosa, etc. But in USA ??? Watch & enjoy ................. ! 😄😜😃 pic.twitter.com/dfXcEOEbOh— Harsh Goenka (@hvgoenka) December 12, 2024 -
Viral video: ఒకప్పుడు విదేశాల్లో టెకీ.. ఇప్పుడు బిచ్చగాడు
అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో, ఆ తరువాత బెంగళూరులో ఓ ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. ఇప్పుడదే బెంగళూరులోని జయనగర్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. మద్యానికి బానిసవడమే తన దుస్థితికి కారణమని చెబుతున్నాడు. అతను తనతో పంచుకున్న కథను శరత్ యువరాజా అనే యువకుడు ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐన్‌స్టీన్ మొదలుకుని పలువురు తత్వవేత్తల దాకా అందరి గురించీ అతను అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ధ్యానం, తత్వశాస్త్రం, సైన్స్ వంటి అంశాలపై లోతైన వ్యాఖ్యలు చ్తేస్తున్నాడు. అయితేనేం, ‘తల్లిదండ్రులను కోల్పోవడం నన్ను మద్యం మత్తులోకి నెట్టింది. అది అదుపు తప్పి ఈ గతి పట్టింది. నిరాశ్రయుడిగా మారి బతకడం కోసం భిక్షాటన చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘మతం కులం, ఇవన్నీ కలగలసి చివరకు నేనేమయ్యానో చూడండి. నేనింకా చదవాలి’’ అని మరో వీడియోలో చెప్పాడు. సాయం చేయడానికి ప్రయత్నిస్తే నిరాకరించాడని శరత్ పేర్కొన్నారు. ‘‘దాంతో ఎన్జీవోలను సంప్రదించా. కానీ పోలీసుల ప్రమేయంతోనే అతన్ని మార్చడం సాధ్యమని డాక్టర్లు అంటున్నారు’’ అని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వృత్తిలో విజయాలు తదితరాలపై ఈ వీడియోలు ఆన్లైన్లో గట్టి చర్చకు దారి తీశాయి. View this post on Instagram A post shared by 𝙎𝙃𝘼𝙍𝘼𝙏𝙃 YUVARAJ🌎 (@sharath_yuvaraja_official) -
పోలింగ్ బూత్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించిన సీఎం రమేష్
-
'భారత్ చంద్రున్ని చేరితే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోంది'
ఇస్లామాబాద్: భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్‌ను పాలించిన గత ప్రధానులు అవినితీకి పాల్పడి.. దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేశారని ఆరోపించారు. ' పాకిస్థాన్ ప్రధాని నిధులు సమకూర్చండని పక్క దేశాలను అడుక్కుంటున్నారు. మన పక్కనే ఉన్న భారత్.. చంద్రమండలంపైకి వెళ్లింది. జీ20 వంటి ప్రపంచ సమ్మిట్లకు వేదికగా మారింది. పాక్ ఎందుకు సాధించలేదు. ఈ దుస్థితికి కారణం ఎవరు..? వాజ్‌పేయీ కాలంలో భారత్ వద్ద నిల్వలు చాలా తక్కువగా ఉండేవి. అదే ప్రస్తుతం వారి నిల్వలు 600 బిలియన్ డాలర్ల వరకు చేరాయి.' అని లాహోర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి మాట్లాడారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దిగజారిపోతోంది. పేద ప్రజలకు తిండి పెట్టలేని దుస్థితికి చేరింది. ద్రవ్యోల్భణం రెండంకెల సంఖ్యకు చేరింది. పాకిస్థాన్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జులైలో ఐఎంఎఫ్‌కు 1.2 బిలియన్ అమెరికా డాలర్లను సమకూర్చింది. నవంబర్ 2019లో, నవాజ్ షరీఫ్‌కు అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. వైద్య కారణాలతో దేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21న ఆయన పాకిస్థాన్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. లాహోర్‌కు రాకముందే ఆయనకి రక్షిత బెయిల్ మంజూరు చేస్తామని PML-N పార్టీ చెబుతోంది. యూకే నుంచి తిరిగి వచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించనున్నారని పార్టీ నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
తినడానికి తిండిలేక,చెన్నై రోడ్లపై భిక్షాటన..ఇన్‌స్టా వీడియోతో పాపులారిటీ
కూటికోసం కోటివిద్యలు అంటారు. ఈ విద్యే... ఎవరూ చూసేవారు లేక అనాథలా మారి, పదిమంది దగ్గర యాచిస్తూ కడుపు నింపుకొంటోన్న మెర్లిన్‌కు భోజన, వసతి సదుపాయాలు కల్పించి ఆదుకుంటోంది. ఎంతోమందికి మెర్లిన్ నేర్పిన విద్యాబుద్ధులే 81 ఏళ్ల వయసులో నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెని ఆదుకుంటూ... అండగా నిలబడ్డాయి. బర్మాకు చెందిన మెర్లిన్ భారతీయ వ్యక్తిని పెళ్లిచేసుకుని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇంగ్లీష్, లెక్కలు, తమిళం బోధిస్తూ, భర్తతో సంతోషంగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ తనవారిని ఒక్కొక్కరిగా పోగొట్టుకుంటూ ఒంటరిదైపోయింది. తినడానికి తిండిలేక, ఉండడానికి చోటులేక ఫుట్‌పాతే అన్నీ అయ్యి బతుకుతోంది. చెన్నై రోడ్లమీద తిరుగుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకుంటోంది. దుస్తులు కొనివ్వండి బాబూ... ఒకరోజు ‘ఏబ్రోకాలేజ్కిడ్’అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తోన్న మొహమ్మద్ ఆషిక్ కంటపడింది మెర్లిన్. ఆమెను చూడగానే ఆమె మొదటినుంచి యాచకవృత్తిలో ఉన్న ఆమె కాదని గ్రహించాడు ఆషిక్. వెంటనే ‘‘ఎక్కడినుంచి వచ్చావు అమ్మా? నీకు ఎవరూ లేరా? వయసులో ఉన్నప్పుడు ఏం చేసేదానివి...’’ వంటి ప్రశ్నలు వేస్తూ మెర్లిన్ గురించిన వివరాలు తెలుసుకున్నాడు ఆషిక్. ‘‘భిక్షం అడిగి కడుపు నింపుకుంటున్నాను. కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. మరికొన్ని రోజులు ఏమీ దొరకదు... నీళ్లు తాగి పడుకుంటాను. దేవుడు ఎంతవరకు ఇస్తే అంతే బాబు’’ అని మెర్లిన్ చెప్పింది. ‘‘నీకు ఏం కావాలమ్మా?’’ అని ఆషిక్ అడిగినప్పుడు...‘‘నా దుస్తులు చిరిగిపోయాయి. వీలయితే అవి కొనివ్వు బాబు... అది చాలు’’ అంది. యాచించ కూడదనీ... మెర్లిన్ పరిస్థితి చూసి చలించిపోయిన ఆషిక్ మెర్లిన్‌కు చీర కొనిచ్చాడు. తరువాత...‘‘అమ్మ నువ్వు ఇంగ్లీష్ క్లాసులు చెప్పు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తాను. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు’’. మెర్లిన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పడానికి ఒప్పుకోవడంతో ఆమె చెప్పే పాఠాలు వీడియోలు తీసి ‘ఇంగ్లీష్ విత్ మెర్లిన్’ పేరుమీద ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి పోస్టు చేస్తున్నాడు. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తూ మెర్లిన్ ఎవరి దగ్గరా చేయి చాచకుండా... తన కష్టార్జితంతో బతికేలా ఏర్పాట్లుచేశాడు ఆషిక్. తన విద్యార్థులసాయంతో... ఆషిక్ పోస్టు చేసిన మెర్లిన్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వాటిని చూసిన వారిలో కొంతమంది మెర్లిన్ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. తమ టీచర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని బాధపడుతూ మెర్లిన్‌ను వెతుక్కుంటూ వచ్చారు. దగ్గర కూర్చుని, ఫలానా వాళ్లమని పరిచయం చేసుకుని, అప్పడు ఇలా చేశాం, అలా చేశాం, మీరు ఇలా ఉండేవారంటూ మాట్లాడి ఆమెలో ఉత్సాహం నింపారు. కొంతమంది ఆమెతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. అంతా కలిసి మెర్లిన్‌కు కష్టం కలగకుండా ఉండేందుకు, నలుగురి మధ్యలో ఉండేలా వృద్ధాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మెర్లిన్ ఎనభై ఏళ్ల వయసులో ఇంగ్లీష్ క్లాసులు చెబుతూ ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. మనం చేసే మంచి ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందనడానికి మెర్లిన్ జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) -
పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!
పాకీజా అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెహన్‌బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో తన పాత్రకు ప్రేక్షకులను మెప్పించింది. అలా తెరపై అందరినీ నవ్వించిన ఆమెకు నిజ జీవితంలో మాత్రం కష్టాలు వదలడం లేదు. తమిళనాడు సీఎం జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి చాలా దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి కూడా సరిగా తిండి లేక ఇబ్బందులు పడ్డామని వాపోయింది. ఆమె అసలు పేరు వాసుకి కాగా.. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్‌తో పాకీజాగా మారిపోయింది. (ఇది చదవండి: దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు) అయితే జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆమెకు టాలీవుడ్ ప్రముఖులు అండగా నిలిచారు. మెగా ఫ్యామిలీతో పాటు మా అసోసియేషన్ ఆమె సాయం చేశారు. అంతేకాకుండా మా అసోసియేషన్ తరఫున మంచు విష్ణు ఆమెకు గుర్తింపు కార్డును సైతం అందజేశారు. ఈ తరుణంలో మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తాయన్న ఆశతో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇక్కడే ఉంటూ నగరంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. అయితే పాకీజాకు ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. సీరియల్స్‌తో పాటు కామెడీ షో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె కష్టాలను తీర్చలేకపోయాయి. ఎప్పటిలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో తిరుపతిలో భిక్షాటన చేస్తూ కనిపించింది. తాను ఇంకా అర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. తిరుపతిలోని దుకాణాల యజమానులు ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ కనిపించింది. ఒక ఆర్టిస్ట్‌గా అందరి నవ్వించిన వాసుకిని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనకుండా ఉండలేరు. సినీ ఇండస్ట్రీలో అందరి జీవితాలు ఓకేలా ఉండవని ఆమె పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. (ఇది చదవండి: నా సొంతింటికి వచ్చినట్లు ఉంది.. చెన్నైకి వెళ్లను: సీనియర్ నటి పాకీజా) -
ఏం తెలివి సామీ.. క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తున్న మోడ్రన్ బిక్షగాడు
మనం ప్రతిరోజూ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, దేవాలయాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చగాళ్లను చూస్తుంటాం. కొందరు తమకు తోచినంత సాయం చేస్తారు. ఇంకొందరేమో చిల్లర లేదని సింపుల్‌గా చెప్పి తప్పించుకుంటుంటారు. అయితే ఈ బిచ్చగాడి నుంచి మాత్రం మీరు అస్సలు తప్పించుకోలేరు. ఇందుకంటే ఇతను టెక్నాలజీని వాడుకుంటూ చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తూ చాలా స్టైల్‌గా అడుక్కుంటున్నాడు. సాధరణంగా యచకులు పాత సంచి లేదా ఏదైనా చిన్న బొచ్చులాంటి పాత్ర పట్టుకొని అడ్డుకోవడం చూశాం. కానీ ఇది డిజిటల్ యుగం కదా. కాలం మారడంతో మనమూ మారాలి అనుకున్నాడేమో ఏకంగా ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ దానం చేయమని అడుక్కుంటున్నాడు. ముంబైలోని ఓ రద్దీ లోకల్ ట్రైన్లో కనిపించింది ఈ దృశ్యం. చక్కగా పాటలు పాడుతూ స్టైల్లో క్యూఆర్ కోడ్ ఇచ్చి భిక్షాటన చేయడంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టారు. ఓ వ్యక్తి ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ డిజిటల్ భిక్షగాడి తెలివికి నెటిజన్లు షాకవుతున్నారు. మరికొందరేమో ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు సొంతంగా ఉద్యోగం చేస్తూ బతకొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. #MumbaiLocal #DigitalIndia That's Mumbai local where you can see the height of using digital payment A beggar is carrying the online payment sticker with him so you have not to bother about excuses of not having change its purely a cashless facility 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/HIxlRJkbmM — 💝🌹💖jaggirmRanbir💖🌹💝 (@jaggirm) June 25, 2023 -
వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?
రిచెస్ట్ పీపుల్ అనగానే మనకి వ్యాపారస్తులు, నటులు లేదా ఇతర సెలబ్రిటీలు గుర్తుకు వస్తారు. మనమిపుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న బిచ్చగాడి గురించి తెలుసుకుందాం రండి. అత్యంత పేదరికంలో ఉన్నవారే 'బిచ్చగాళ్లు' గా మారతారు. అది పురుషుడైనా, మహిళ అయినా,పిల్లలైనా. ప్రాథమిక అవసరమైన పొట్ట నింపుకునేందుకు వేరే మార్గం లేకనో, మరే కారణమో బిచ్చమెత్తుకుని జీవిస్తారనేది సాధారణంగా అందరికీ తెలుసు. కానీ అదే భిక్షాటనను లాభదాయకమైన వృత్తిగా మార్చుకున్న వ్యక్తులు ఉన్నారని తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ముంబైలో నివసిస్తున్న భరత్ జైన్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు.భరత్ జైన్. ఇతను ముంబైలో ఉంటాడు. రూ. 1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు ఉన్నాయి. తన వద్ద ఉన్న సొమ్మను షాపుల్లో పెట్టుబడి పెట్టాడు. అంతేకాదు మహారాష్ట్రలోని థానేలో రెండు షాపులను కూడా కొనుగోలు చేశాడు. దీని ద్వారానెలకు రూ. 30వేల అద్దె ఆదాయం వస్తుంది. భారత్ జైన్ నికర విలువ 7.5 కోట్ల డాలర్లు. తాజా లెక్కల ప్రకారంఅతని నెలవారీ సంపాద దాదాపు లక్ష రూపాయలు. 2014 నాటికి భిక్షాటన ద్వారా భరత్ జైన్ సంసాదన ప్రతిరోజూ 2000-2500 రూపాయలు,నెలకు 75వేలు ఆర్జించేవాటంటే అతని ఆదాయాన్ని ఊహించుకోవచ్చు. (రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్) ఆర్థిక సంక్షోభం కారణంగా భరత్ జైన్ విద్యను కొనసాగించలేకపోయాడు. భరత్ జైన్‌కు వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక్కడ విశేషమేమిటంటే... భరత్ జైన్ తన పిల్లలిద్దర్నీ చక్కగా చదివించాడు. భరత్ జైన్, అతని కుటుంబం పరేల్‌లోని 1BHK డ్యూప్లెక్స్ ఇంటిలో చాలా సౌకర్యవంతంగా నివసిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు. కుటుంబంలోని మరికొందరు స్టేషనరీ దుకాణాన్ని కలిగి ఉన్నా. అయినా సరే, భిక్షాటన వదులుకోమని భారత్‌కు పదే పదే చెప్పినా...ఏమాత్రం వినకుండా దానినే కొనసాగిస్తున్నాడు.ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్‌లో భరత్ జైన్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా భిక్షాటన చేస్తాడట. -
వరద కాలువ కోసం భిక్షాటన
కోరుట్ల: పట్టణంలోని మద్దులచెరువును అనుసంధానిస్తూ వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ బీజేపీ నాయకులు బుధవారం పట్టణంలో భిక్షాటన చేశారు. వర్షాకాలంలో చెరువునిండి ఆ వరద నీటితో 10, పదకొండో వార్డులు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. తక్షణమే వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ 11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునీత, పదో వార్డు బీజేపీ ఇన్చార్జి దాసరి శేఖర్ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. మున్సిపల్ కౌన్సిల్ పట్టించుకోవటం లేదని, అందుకే భిక్షాటనతో నిధులు సేకరిస్తున్నామని వారు తెలిపారు. మరికొన్ని నిధులు మున్సిపల్ కౌన్సిల్ విడుదల చేసి చెరువు నీళ్ల కోసం వరద కాలువ నిర్మించాలని వారు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు మాడవేని నరేశ్, పెండెం గణేశ్, నాయకులు బల్మూరి మురళి, ఇందూరి తిరుమల, పోతుగంటి శ్రీనివాస్‌గౌడ్, గిన్నెల అశోక్, బింగి వెంకటేశ్, వాసాల నవీన్, వినయ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
పేరుకే బిచ్చగాడు.. సీఎం సహాయనిధికి భారీగా విరాళం
తిరువళ్లూరు: బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేల నగదును సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడో యచకుడు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం సమీపంలోని ఆళంగినర్ గ్రామానికి చెందిన యాచకుడు పూల్పాండి(75). భార్య మృతి చెందిన తరువాత తన పిల్లలు ఉద్యోగం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదును విద్య, వైద్యం, ఆనాథ ఆశ్రమాలకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పదేళ్లలో పాండిచ్చేరితో పాటు చైన్నె, తూత్తుకుడి, కన్యాకుమారి, విల్లుపురం, వేలూరు, సేలం, నీలగిరి, కోయంబత్తూరు సహా వేర్వేరు జిల్లాలకు చెందిన కలెక్టర్లను కలిసి ఇప్పటి వరకు యాచించిన రూ. 5.60 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. తాజాగా రెండు నెలల్లో బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన రూ.10 వేలను కల్తీసారా తాగి విల్లుపురం చెంగల్పట్టు జిల్లాలో మృతి చెందిన కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. మంగళవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌ను కలిసి నగదు అందజేశారు. అనంతరం మీడియాతో పూల్పాండి మాట్లాడుతూ.. డబ్బులు ఉంటే మనఃశాంతి ఉండదని, మనస్సు ఉన్న వారి వద్ద డబ్బులు ఉండడం లేదని తెలిపారు. తాను బిక్షాటన చేయడం ద్వారా వచ్చే నగదులో కొంత భాగాన్ని తిండి కోసం ఉపయోగిస్తున్నానని చెప్పారు. తనకు మూడుపూటల ఆహారం, కట్టుకోవడానికి గుడ్డ ఉంటే చాలని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే వృద్ధాశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నట్లు పాండి తెలిపారు. -
ఎయిర్‌పోర్టుల్లో ‘బిచ్చగాడు’.. ఓ యువకుడి నకిలీ యాచన!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు కూడళ్లు, ప్రార్థనా స్థలాలు, ఫంక్షన్ హాళ్లు తదితర చోట్ల యాచకులను చూస్తూనే ఉంటాం. వృద్ధాప్యం వల్లో లేదా శారీరక వైకల్యం వల్లో యాచించే వారు కొందరైతే దీన్నే దందాగా మార్చుకొని జీవించే వారు ఇంకొందరు కనిపిస్తుంటారు. కానీ ఇలా రోజంతా అడుక్కున్నా ఎవరికైనా లభించేది చిల్లరే... అందుకే సులువుగా నోట్ల కట్టలు సంపాదించేందుకు ఓ యువకుడు ఏకంగా ఎయిర్‌పోర్టులనే లక్ష్యంగా చేసుకొని ‘బిచ్చగాడి’అవతారం ఎత్తాడు! శంషాబాద్ ఎయిర్పోర్ట్ సహా ఎనిమిది విమానాశ్రయాల్లో నాలుగేళ్లుగా ‘యాచిస్తూ’విదేశీయులు, ప్రవాస భారతీయులు సహా అనేక మంది నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. చివరకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అక్కడి సీఐఎస్ఎఫ్ అధికారుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పర్సు పోవడంతో ఎదురైన అనుభవంతో.. చెన్నైకు చెందిన విఘ్నేష్ బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉగ్యోగం చేశాడు. అప్పట్లో అతనికి నాలుగంకెల జీతం కూడా వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్ పర్సు పోగొట్టుకున్నాడు. విమాన టికెట్ తన ఫోన్లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్‌లో ఓ విదేశీయుడితో పంచుకున్నాడు. అతనిపై జాలిపడ్డ విదేశీయుడు రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం కోల్పోవడంతో రోడ్డునపడ్డ విఘ్నేష్... బెంగళూరు ఎయిర్‌పోర్టు అనుభవంతో ఈజీ మనీపై దృష్టిపెట్టాడు. ముందస్తు షెడ్యూల్‌తో ముష్టి కోసం.. విమానాశ్రయాలనే టార్గెట్‌గా చేసుకొని ప్రయాణికులకు వివిధ పేర్లతో టోకరా వేసి డబ్బు దండుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం విఘ్నేష్ నిర్ణీత సమయానికి ముందే తక్కువ ధరకు వచ్చేలా డొమెస్టిక్ విమాన టికెట్లు బుక్ చేసుకొనేవాడు. ఖరీదైన క్యాజువల్స్ ధరించి, చేతిలో లగేజ్ బ్యాగ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా ఫ్లైట్ షెడ్యూల్ టైమ్‌కు దాదాపు 4–5 గంటల ముందే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేవాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ను ఎంచుకుని మాటలు కలిపేవాడు. ఆపై ఫోన్ (సైలెంట్ మోడ్‌లో ఉంచి) మాట్లాడినట్లు నటించేవాడు. తన తండ్రి తీవ్ర అనారోగ్యంపాలైనట్లు ఫోన్లో కుటుంబ సభ్యులు చెప్పారని... వెంటనే శస్త్రచికిత్స చేయించేందుకు తన వద్ద డబ్బు లేదని ప్యాసింజర్‌కు చెప్పి సాయం కోరేవాడు. దీంతో ఆ ప్యాసింజర్ జాలిపడి వీలైనంత సొమ్ము ఇచ్చేవాడు. ఆ తర్వాత విమానం ఎక్కి మరో నగరంలో దిగి అక్కడ కూడా ఇదే పంథాలో దండుకొనేవాడు. ఇలా విఘ్నేష్ ఒక్కోరోజు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించేవాడు. నిర్ణీత మొత్తం సంపాదించాకే చెన్నైలోని ఇంటికి తిరిగెళ్లేవాడు. ఆ డబ్బు ఖర్చయ్యే వరకు జల్సాలు చేసేవాడు. ఇప్పటివరకు ఫిర్యాదులులేకపోవడంతో.. ఈ పంథాలో విఘ్నేష్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా ఎనిమిది నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తన జేబు నింపుకున్నాడు. విఘ్నేష్ మోసగించిన వారిలో అత్యధికులు విదేశీయులే కావడంతో వారికి ఇది మోసమని తెలిసే అవకాశం లేదు. ఈ కారణంగానే 2021 నుంచి విఘ్నేష్ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ నెల 11న బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇద్దరికి టోకరా వేసి మూడో వ్యక్తి దగ్గరకు విఘ్నేష్ వెళ్లడాన్ని గమనించిన ఓ సీఐఎస్ఎఫ్ అధికారి అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు విఘ్నే‹Ùను పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ హైదరాబాద్‌లో సాగించిన ‘భిక్షాటన’గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. -
ఓర్నీ.. టెక్నాలజీ సాయంతో బిక్షాటనా! ట్రెండ్ సెట్ చేశాడుగా!
సాక్షి, బొమ్మలరామారం: మారాజ.. మారాజ.. అంటూ చేతిలో తుపాకీతో, మాటల గారడీ చేస్తూ సంక్రాంతి వేళ భిక్షాటన చేస్తూ సందడి చేసే తుపాకీ రాముడు నేడు ట్రెండ్ మార్చాడు. పోలీస్ ఆఫీసర్లాంటి ఖాకీ యునిఫాం, చేతిలో కట్టె తుపాకీ, నెత్తికి టోపీ, నల్లరంగు బూట్లను ధరించే తుపాకీ రాముడు ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కొత్త అవతారమెత్తాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన మిరాల రాములు సంచార జాతికి చెందిన వ్యక్తి. 42 ఏళ్లకు పైగా తుపాకీ రాముడి వేషధారణతో సంక్రాంతి సమయంలో భిక్షాటన చేస్తున్నాడు. ఇన్నేళ్లుగా నోటితో గారడీ మాటలు చెబుతూ భిక్షాటన చేసిన రాముడు నేడు ఆధునిక టెక్నాలజీని సైతం వినియోగించుకుంటున్నాడు. వయసు మీద పడడంతో తన మాటలను రికార్డు చేసి బ్లూటూత్ స్పీకర్ సాయంతో జనానికి వినిపిస్తున్నాడు. సంక్రాంతి పండుగ వేళ బ్లూటూత్ సాయంతో మాటలు వినిపిస్తున్న తుపాకీ రాముడి సందడిని చూసి ప్రజలు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. – మిరాల రాములు, బొమ్మలరామారం (తుపాకీ రాముడు) (చదవండి: బోసిపోయిన భాగ్యనగరం..నిర్మానుష్యంగా మారిన రహదారులు) -
రూ.30 లక్షల బిల్లులు రాక.. ఇన్చార్జ్ సర్పంచ్ భిక్షాటన
కౌడిపల్లి (నర్సాపూర్): గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఓ ఇన్చార్జి సర్పంచ్ భిక్షాటన చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో సోమవారం చోటు చేసుకుంది. వెల్మకన్న గ్రామ ఇన్చార్జ్ సర్పంచ్ కాజిపేట రాజేందర్ మాట్లాడుతూ.. గతేడాది మార్చి నుంచి సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, క్రీడాప్రాంగణం, పారిశుధ్యం పనులు, హరితహారం, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేశామని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే, ఇంత వరకు బిల్లులు రాలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక గ్రామంలో పంచాయతీ కారి్మకులతో కలిసి భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. రెండున్నర నెలల క్రితం రూ.ఆరు లక్షలకు సంబంధించి ఎంబీలు పూర్తి చేయగా చెక్కులు ఇచ్చారని, అయినా డబ్బులు మాత్రం రాలేదని తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు అడిగిన ఫ్రీజింగ్లో ఉందని, వచ్చాక ఇస్తామని చెబుతున్నారని అన్నారు. చదవండి: కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై -
కొడుకు శవం ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్.. బిక్షమెత్తిన తల్లిదండ్రులు
పాట్నా: ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఏ కార్యాలయాల్లోనైనా పని జరగాలంటే చేతులు తడపాల్సిందే! జరిగే పని తొందరగా జరగాలన్నా కొంతమంది అవినీతి అధికారులకు డబ్బు ధార పోయాల్సిందే. కాసుల కోసం కక్కుర్తి పడే అంటువంటి లంచావతారులు చివరకు మనుషుల ప్రాణాల విషయంలోనూ తగ్గడం లేదు. పరిస్థితులు, ఆర్థిక స్థోమతను కూడా అర్థం చేసుకోకుండా బాధితుల నుంచి డబ్బులను రక్తంలా పిండుకుంటున్నారు. తాజాగా మార్చురీ నుంచి కుమారుడి మృతదేహాన్ని ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేని తల్లిదండ్రులు భిక్షాటన శారు. గుండెలు పిండిసే ఈ ఘటన బిహార్‌లో జరిగింది. సమస్తిపూర్ తాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహేష్ ఠాగూర్ దంపతులకు సంజీవ్ అనే కుమారుడు ఉన్నాడు. మానసిక వికలాంగుడైన సంజీవ్ అదృశ్యమయ్యాడు. అయితే జూన్ 6న కొడుకు మృతదేహం సమస్తిపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. కన్నీరుమున్నీరవుతూనే కొడుకు మృతదేహాన్ని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. మృతదేహం తమ కొడుకుదే అని నిర్ధారించుకొని ఇంటికి తీసుకెళ్లేందుకు అధికారులను సంప్రదించారు. मानवता शर्मसार, फिर भी #NitishKumar जी का सुशासन का दावा बरकरार!! https://t.co/E3eV3aSOjV — Prashant Kishor (@PrashantKishor) June 9, 2022 అయితే పోస్టుమార్టం సిబ్బంది నాగేంద్ర మల్లిక్ అనే వ్యక్తి మృతదేహాన్ని అప్పగించడానికి రూ. 50 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బులు వృద్ద జంట వద్ద లేకపోవడంతో బిక్షాటన ఎత్తుకోవటం ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ జోలెపట్టి అడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమస్తిపూర్ సదార్ హాస్పిటల్ ఉన్నతాధికారులకు ఈ విషయం చేరింది దీంతో తక్షణమే యువకుడి డెడ్‌బాడీని అతని ఇంటికి పంపించేశారు. ఈ వీడియోను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ట్విటర్లో షేర్ చేశారు. మానవత్వానికి సిగ్గుచేటు నితీష్ కుమార్ ప్రభుత్వ పాలను ఇది నిదర్శనమంటూ మండిపడ్డారు. మరోవైపు ఈ విషయంపై సమస్తిపూర్ సివిల్ సర్జన్ మాట్లాడుతూ.. సిబ్బంది డబ్బులు అడగొచ్చు కానీ, రూ. 50,000 అయితే డిమాండ్ చేసి ఉండకపోవచ్చని అన్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది లంచం అడగడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక ఈ వీడియో వైరల్‌గా మారడంతో మృతదేహాన్ని ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన ఉద్యోగులపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: సర్పంతో మహిళ సహజీవనం.. ఆమె సమాధానం విని ఊరంతా సైలెంట్ ! -
భిక్షాటనతో భార్యకు ఊహించని సర్ప్రైజ్: వీడియో వైరల్
ఓ వ్యక్తి తనకు నచ్చిన బైక్ కోసం చిల్లర డబ్బలు పోగు చేసి మరీ కొనుకున్న ఉదంతాన్ని ఇటీవల చూశాం. ఇష్టమైన వాటిని పొందడం కోసం కష్టపడి సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఖరీదైన వస్తువులు కొనుక్కున్న సందర్భాలూ చూశాం. అవన్నీ ఒక ఎత్తైయితే ఇక్కడొక యాచకుడు భార్య కోసం అత్యంత ఖరీదైన బైక్ కొన్నాడు. అదీ కూడా భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో కొనడం విశేషం. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సంతోష్ కుమార్ సాహు అనే యాచకుడు శారీరకంగా వికలాంగుడు. దీంతో అతను అన్నింటికీ తన భార్య మున్నిపైనే ఆధారపడుతుంటాడు. అధ్వాన్నమైన రోడ్డుపై తన ట్రై సైకిల్ని భార్య నెట్టలేక ఇబ్బందిపడుతుండటం సాహు చూస్తుంటాడు. అదీగాక ఈ సైకిల్ నెడుతుంటే వెన్ను నొప్పి వస్తుందంటూ సాహు భార్య తరుచు బాధుపడుతుండేది. దీంతో ఆమె కోసం ఎలాగైన మంచి బైక్ కొనాలని నిశ్చయించకున్నాడు. అనుకున్నదే తడవుగా గత నాలుగేళ్లుగా బస్ స్టేషన్లు, దేవాలయాలు, మసీదులలో భిక్షాటన చేసి చాలా డబ్బు సంపాదించాడు. ఈ మేరకు అతను సూమారు రూ. 90 వేలు ఖరీదు చేసే మోపెడ్‌ని కొని తన భార్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ జంట ఇప్పుడూ ఈ కొత్త మోపెడ్ పై సియోని, భోపాల్, ఇండోర్ వంటి ప్రాంతాలకు వెళ్లాలని తెగ ప్లాన్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. A beggar from Chhindwara in Madhya Pradesh bought a moped worth Rs 90,000 for his wife after she complained of backache @ndtv@ndtvindia pic.twitter.com/9srzxKrFCx — Anurag Dwary (@Anurag_Dwary) May 25, 2022 (చదవండి: ఒంటి చేత్తో క్లైంబింగ్ వాల్ని అధిరోహించిన మహిళ.. వీడియో వైరల్) -
అయ్యా సర్పంచునయ్యా.. దానం చెయ్యండి
మునుగోడు: ‘అయ్యా మేము గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులం, పంచాయతీ కార్మికులం.. మేము చేసిన అభివృద్ధి పనులకు ఐదు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు.. ప్రతి నెలా కార్మికులకు అందించాల్సిన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్నాం. మీరంతా మాకు దానం చేసి ఆదుకోవాలి’ అని కోరుతూ మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్నతో పాటు, పలువురు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్మికులు సోమవారం మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. సర్పంచ్ వెంకన్న నిక్కరు వేసుకుని అర్ధనగ్న ప్రదర్శనగా డప్పు చప్పుళ్లతో వార్డు సభ్యులు, కార్మికులతో కలసి దుకాణాలు, ఇంటి యజమానుల వద్దకు వెళ్లి నగదు ఇచ్చి ఆదుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఖాతాల్లో నగదు ఉన్నప్పటికీ తాము చేసిన పనుల చెక్కులు ఎస్టీఓలో వేస్తే చెల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దాదాపు రూ.35 లక్షలకు పైగా అభివృద్ధి పనుల కోసం అప్పు చేసి తీసుకొచ్చామని వీటికి నెలకు రూ.70 వేల చొప్పున వడ్డీలు కడుతున్నామన్నారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు సరిగా అందక ఆ కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Hyderabad: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం) ఇప్పటికైనా ప్రభుత్వం సర్పంచ్ల, కార్మికుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ పందుల పవిత్రశ్రీను, వార్డు సభ్యులు ఎర్రబెల్లి శంకర్‌రెడ్డి, మిర్యాల మధుకర్, యాట రామస్వామి, పందుల నర్సింహ, యడవల్లి సురేష్, పంచాయతీ కార్మికులు సుధాకర్, పెంటయ్య, అచ్చమ్మ, పావని, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి, ఎండీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పసిబాల్యంపై యాచక మాఫియా దందా!
బనశంకరి (బెంగళూరు): అనాథ మహిళలు, పేద కుటుంబాల పిల్లలే పెట్టుబడిగా యాచక మాఫియా నగరాల్లో పేట్రేగిపోతున్నది. వీరి ఆర్థిక, సాంఘిక పరిస్థితులను ఆసరా చేసుకున్న కొంతమంది సంఘ విద్రోహశక్తులు వారితో భిక్షాటన చేయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. బెగ్గింగ్ మాఫియా ద్వారా ఏడాదికి దేశవ్యాప్తంగా రూ.260 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయంటేనే.. ఈ అనాగరిక వ్యవస్థ సమాజంలో ఏ మేరకు వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అద్దెకు పేద రాష్ట్రాల పిల్లలు.. కొంతమంది దళారులు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, అసోం, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నిరుపేద కుటుంబాలను కలిసి వారి పిల్లలను రోజువారి, లేదా శాశ్వతంగా కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని నగరాలకు పిలిపించి నెలకు కొద్దిమేర అద్దె ఇచ్చి పసిపిల్లలను తీసుకుంటారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రముఖ నగరాలు, జనసందడి కలిగిన ప్రాంతాలు, జాతర, ఉత్సవాలు, పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో ఈ పిల్లలతో భిక్షాటన చేయిస్తారు. ప్రభుత్వాల పునరావాసం.. భిక్షాటన మాఫియాలో చిక్కుకున్న పిల్లల ఆచూకీని ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు కనిపెట్టి ప్రభుత్వ పరంగా పునర్వసతి కల్పిస్తున్నారు. భిక్షాటన దందాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, పిల్లలను, మహిళలను ఈ దందాలో వినియోగిస్తున్నట్లు తెలిస్తే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. -
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
ఇమ్రాన్ ఖాన్ కామెడీ.. పాక్‌లో నవ్వులు
ఛాన్స్ దొరికితే చాలు.. ప్రతీ అంశంలోనూ భారత్‌ను లాగి.. అక్కసు వెల్లగక్కుతుంటాడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఓ స్టేట్మెంట్ నవ్వులు పూయించడమే కాదు.. రాజకీయ విమర్శలకు, ఇంటర్నెట్లో సొంత ప్రజల నుంచే సెటైర్లు పడేలా చేస్తోంది. ‘ప్రపంచ దేశాలతో పాకిస్థాన్ చౌక దేశంగా ఉంది. చాలా వస్తువులు చీప్‌గా దొరుకుతున్నాయి. కానీ, ప్రతిపక్షాలేమో మమ్మల్ని చేతకానీ ప్రభుత్వం అని విమర్శిస్తున్నారు. మేమేమో అన్ని సంక్షోభాల నుంచి దేశాన్ని రక్షిస్తున్నాం’ అంటూ రావల్పిండిలో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇక్కడితో పరిమితమైతే ఫర్వాలేదు. కానీ, అతిశయోక్తికి పోయి.. భారత్‌ను లాగడంతో అసలు వ్యవహారం మొదలైంది. చాలా దేశాల కంటే పాక్ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని, ముఖ్యంగా భారత్ కంటే మెరుగ్గా ఉందంటూ కామెంట్ చేశాడు. అంతే.. బిల్లు దేని కోసం ఖాన్ సాబ్? ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాక పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. చివరకు ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె సైతం చెల్లించలేని స్థితికి చేరుకుంది. ఈ తరుణంలో ఆర్థిక గండం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సాయం కోసం ప్రాధేయపడుతున్నాడు. అంతేకాదు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోసం ఐఎంఎఫ్ పెట్టిన ఎన్నో షరతులకు అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. సంబంధిత బిల్లుకు పార్లమెంటు ముద్ర వేయించేందుకు నానా పాట్లు పడుతున్నాడు. సొంత ప్రజలే ట్రోలింగ్ ఇమ్రాన్ ఖాన్ భారత్ మీద చేసిన కామెంట్‌పై పార్లమెంట్లో ప్రతిపక్షాలే సెటైర్లు పేలుస్తున్నాయి. ప్రతిపక్ష నేత పీఎంఎల్ ఎన్ అధ్యక్షుడు షెబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని నేషనల్ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తాడు. ఒక వైపు అణుశక్తి దేశంగా ఉంటూ.. మరోవైపు చిప్ప పట్టుకుని అడుక్కోవడం ఎలా సాధ్యమవుతోందని? పైగా భారత్ లాంటి దేశం కంటే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నామంటూ ఎలా వ్యాఖ్యానిస్తారని ఇమ్రాన్ ఖాన్‌ను ఏకీపడేశాడు. ఇక దేశ ఆర్థిక పరిస్థితిని పీఎంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దివాలా తీయించిందని, కరోనా టైంలో అన్ని రంగాల్లో దెబ్బ తీసిందని, వ్యాక్సినేషన్ సంగతి ఏంటని?.. ఇంటర్నెట్లో పాక్ ప్రజలే ఇమ్రాన్‌పై మీమ్స్ వేస్తున్నారు. -
సిద్ధాంతి వేషధారణలో బిక్షాటన! భయపెడుతూ డబ్బు గుంజి..
ద్వారకాతిరుమల: మండలంలోని వెంకటకృష్ణాపురంలో నకిలీ సిద్ధాంతి గుట్టు రట్టయ్యింది. స్థానికుల కథనం ప్రకారం... అన్నవరం సిద్ధాంతిని అంటూ ఓ వ్యక్తి వెంకటకృష్ణాపురంలోని చిలుకూరి సునీత ఇంటికి కారులో వచ్చాడు. ముందుగా అతడి సహాయకుడు గేటు తీసి, సిద్ధాంతి వచ్చారని పిలిచాడు. బయటకు వచ్చిన సునీతను బియ్యాన్ని భిక్ష ఇవ్వాలని కోరాడు. ఆమె బియ్యం తీసుకురాగా.. చిటికెడు మాత్రమే తన పాత్రలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటి వాస్తు బాగుందని, కలబంద, గుమ్మడి కాయలు కట్టాలని సూచించాడు. ఇంతలో అతని మాటల్ని సునీత తన భర్త రాధాకృష్ణకు ఫోన్ స్పీకర్ ద్వారా వినిపించింది. రాధాకృష్ణ అక్కడికి వచ్చి అతన్ని నిలదీశాడు. వెంటనే నకిలీ సిద్ధాంతి పొంతనలేని సమాధానాలు చెబుతూ ఆగకుండా కారులో ఉడాయించాడు. నకిలీ సిద్ధాంతి కారును రాధాకృష్ణ వెనుక నుంచి ఫొటో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టి అందరినీ అప్రమత్తం చేశాడు. ఈనెల 9న తిమ్మాపురంలో ఘంటా చిన్న గాంధి అతని మాటలు నమ్మి రూ 16,500, కామవరపుకోట మండలంలోని ఆడమెల్లిలో మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి రూ. 10 వేలు పోగొట్టుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. రాధాకృష్ణ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమేరాల్లో నకిలీ సిద్ధాంతి వ్యవహారం రికార్డ్ అయ్యింది. ఫిర్యాదు అందరకపోయినా ద్వారకాతిరుమల పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఎస్సై టి.వెంకట సురేష్ కోరారు. -
బంజారాహిల్స్: కన్న కూతురితో భిక్షాటన.. ఆపై వ్యభిచారం చేయాలని..
బంజారాహిల్స్ (హైదరాబాద్): కన్న కూతురితో భిక్షాటన చేయించడమే కాకుండా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న తల్లిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్‌లో నివసించే తల్లి తన కూతురు(16)తో కొంత కాలంగా భిక్షాటన చేయిస్తున్నది. (చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. ఎన్నిసార్లు చెప్పినా..) అమీర్‌పేట్‌లోని సాయిబాబా టెంపుల్ సమీపంలో 16 ఏళ్ల బాలిక భిక్షాటన చేయిస్తున్నదని చైల్డ్‌లైన్ 1098కు సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ వేదాల సాల్మన్‌రాజు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ఆమెకు కనిపించలేదు. ఈ నెల 6వ తేదీన ఖమ్మంలో కూడా 16 ఏళ్ల బాలిక భిక్షాటన చేస్తున్నట్లుగా 1098కు మరోసారి సమాచారం సంబంధిత సిబ్బంది అక్కడికి వెళ్లి ఆమెను రెస్క్యూ చేశారు. విచారించగా తన తల్లి బలవంతంగా భిక్షాటనతో పాటు వ్యభిచారం కూడా చేయిస్తున్నదని బాలిక వెల్లడించింది. దీంతో పోలీసులు బాలికను పునరావాస కేంద్రానికి తరలించి తల్లిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. (చదవండి: ‘174 మంది బాలికలకు ఒకటే’.. సాక్షి కథనానికి విశేష స్పందన) -
తాగి..పాముతో తందనాలాడాడు
రామచంద్రాపురం: మెడలో ఆరడుగుల పామును వేసుకుని ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేశాడొక యువకుడు. శుక్రవారం సాయంత్రం రామచంద్రాపురంలోని భారతీనగర్ చౌరస్తాలో ఈ సంఘటన జరిగింది. దాదాపు గంటకుపైగా ఆ యువకుడు పాముతో ప్రజలను బెంబేలెత్తించాడు. బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో దేవాలయం ముందు భిక్షాటన చేసే యువకుడు మహేశ్ శుక్రవారం మద్యం తాగి నాగుపామును మెడలో వేసుకుని బయల్దేరాడు. బెల్ టౌన్ షిప్ లోపలి నుంచి ఎల్ఐజీ చౌరస్తా (భారతీనగర్) వరకు వచ్చాడు. రోడ్డుపై అందరినీ బెదిరిస్తూ డబ్బులు అడిగాడు. దీంతో స్థానికులు పోలీసులు, పాములు పట్టే వారికి సమాచారం అందించారు. పాములు పట్టే వారు వచ్చి ఆ పామును స్వాధీనపరచుకున్న వెంటనే స్థానికులు కొందరు కోపంతో యువకుడిపై దాడికి దిగారు. పోలీసులు చేరుకుని మహేశ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
‘అడుక్కోవాలని లేదు.. పెన్నులు కొనండి చాలు’
ముంబై: కొంతమంది ఆరోగ్యపరంగా ఏ లోపాలు లేకున్నా, పని చేసే సామర్థ్యం ఉన్నా చేయలేక యాచించేవాళ్లని, ఇతరులపై ఆధారపడే వాళ్లని చూస్తుంటాం. ఇంకొందరు కష్టపడి పని చేయలేక సులభమైన దారిలో డబ్బు సంపాదనకై ఇతరులను మోసం చేస్తూ సంపాదిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి ఘటనలు మనం వింటూనే ఉంటాం. కానీ వయసు మీదపడినా కూడా ఓ బామ్మ మాత్రం ఎవరి దగ్గర చేయి చాపడం ఇష్టం లేదని ఈ వయసులోనూ తన కష్టం మీదే తన జీవనాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ బామ్మకి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడతూ హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రీఅప్ స్టూడియో వ్యవస్థాపకురాలు శిఖా రథి తన స్నేహితులతో కలిసి పూణేలోని ఎమ్‌జి రోడ్లో వెళ్తున్నప్పుడు ఈ బామ్మను(రతన్) కలిసింది. ఆ సమయంలో ఆ బామ్మ రంగురంగుల పెన్నులను కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన పెట్టెలో పెట్టి అమ్ముతోంది. అయితే ఆ కార్డ్‌బోర్డ్‌పై ఉన్న ఓ లైన్ చూసి అశ్చర్యపోయింది. ఆ నోట్లో.. ‘నాకు ఎవరీ దగ్గర చేయి చాచను. దయచేసి రూ.10/- బ్లూ కలర్ పెన్నులు కొనండి చాలు. థ్యాంక్యు. బ్లెస్ యూ’.. అని రాసుంది. కాగా ఆ బామ్మ రోడ్లపై తిరుగుతూ విద్యార్థులను, ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఆగిన వాహనదారులను రిక్వెస్ట్ చేస్తూ పెన్నులు అమ్ముతోంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి.. పెన్నులు అమ్మగా వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రతి ఆమె ఫోటో తీసి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు బామ్మకు హేట్సాఫ్ చెప్పడంతో పాటు మన వంతు సాయం చేయాలని కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Shikha Rathi (@sr1708) చదవండి: Snakes Found Home: ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే! -
ఏడాదిగా కాళ్లకు స్టీల్ రాడ్లతో..
ములకలపల్లి: సాఫీగా సాగుతున్న కుటుంబంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం ఓ మహిళ జీవితాన్ని ఆగం చేసింది. భర్త పట్టించుకోకపోవడంతో ఏడాదిగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రం మహేశ్ ఇల్లందుకు చెందిన మౌనికను ఐదేళ్ల కింద వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. ఏడాది కింద మౌనిక ములకలపల్లి వెళ్లి వస్తుండగా బైక్ ఢీకొట్టడంతో మౌనిక కాలికి తీవ్రగాయమైంది. దీంతో ఆమెను వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, ఆపరేషన్ చేసిన వైద్యులు కాలులో స్టీల్ రాడ్లు అమర్చారు. 15 రోజుల తర్వాత తొలగించాల్సి ఉండగా, కొన్ని రోజులు బాగానే చూసుకున్న భర్త మహేశ్, అత్తమామలు లక్ష్మి, ఏసురత్నం ఆ తర్వాత ఆమెను, ఆమె కుమారుడిని వదిలేశారు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక గత్యంతరం లేక కాలికి ఉన్న స్టీల్ రాడ్‌తోనే ఏడాదిగా గ్రామంలోని ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేస్తోంది. రాత్రి వేళ ఇళ్ల అరుగులు, చెట్ల కింద తలదాచుకుంటోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వానలకు, కాలికి ఉన్న రాడ్లతో నడవలేక ఆమె ఇబ్బంది పడుతుండటాన్ని గురువారం చూసిన ఎస్సైలు బాల్దె సురేశ్, నాగభిక్షం ఆమె వివరాలు సేకరించారు. మౌనిక భర్త మహేశ్ సెంట్రింగ్ పని కోసం పాల్వంచ వెళ్లగా ఫోన్లో మాట్లాడారు. ఆమె అత్తమామలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పలుమార్లు ఇంటికి రావాలని కోరినా మౌనిక స్పందించలేదని ఆమె అత్త తెలిపింది. దీంతో మౌనికను ఆటోలో ఆమె ఇంటికి తరలించారు. మౌనిక కాలికి ఉన్న రాడ్లు తొలగించేందుకు సహకరిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. -
Tamil Nadu: సొంత ఇళ్లు.. ఆటోలో వచ్చి అడుక్కుంటారు!
కరోనా సమయంలో రోడ్ల మీద కష్టాలు పడుతున్న భిక్షగాళ్లను ఆదుకునేందుకు సిద్ధమైన పోలీసులకు పెద్ద షాక్ తగిలింది. యాచకుల్లో ఒకరు.. సొంతంగా తనకున్న ఇళ్లను అద్దెకిచ్చి.. భిక్షాటన చేస్తున్నట్లు చెప్పగా, ఇంకొకరు తన వద్ద నోట్ల కట్టలున్నాయని చెప్పడంతో ఖాకీలు అవాక్కయ్యారు. సాక్షి, చెన్నై : కరోనా కష్టాలు ఎవర్నీ వదలి పెట్ట లేదు. అన్ని వర్గాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్ల మీద , బస్టాండ్లలో తలదాచుకుని భిక్షాటనలో ఉన్న వారు ఎదుర్కొంటున్న కష్టాల్ని పరిగణించి నాగర్ కోయిల్ పోలీసులు, కార్పొరేషన్ వర్గాలు సేవలకు సిద్ధం అయ్యారు. ఆ దిశగా మంగళవారం నుంచి నాగర్ కోయిల్‌లో ఉన్న భిక్షగాళ్లను ఆశ్రమానికి తరలించే పనిలో పడ్డారు. వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్ రావడంతో కలవరం తప్పలేదు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయాన్నే బస్టాండ్ ఆవరణలో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు స్థానిక పోలీసుల వద్దకే వెళ్లి అన్నం పొట్లాలు ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో వీరందర్నీ పోలీసులు విచారించి కొంతకాలం ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. ఈక్రమంలో వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆటోలో వచ్చి మరీ.. ఈ సమయంలో నలుగురు భిక్షగాళ్లు అక్కడి నుంచి జారుకునే యత్నం చేశారు. దీనిని గుర్తించిన పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది మందలించారు. ఈసమయంలో ఓ భిక్షగాడు అయితే, తాను ఆశ్రమానికి వెళ్లే ప్రసక్తే లేదని, తనకు సొంతంగా ఇళ్లు ఉన్నాయని, వాటిలో కొన్నింటిని అద్దెకు కూడా ఇచ్చి ఉన్నట్టు వెల్లడించారు. విచారణ చేపట్టిన పోలీసులు సొంతిళ్లను అద్దెకు ఇచ్చిన భిక్షగాడు నగర శివారు వరకు రోజు ఆటోలో వచ్చి, భిక్షాటన అనంతరం తిరిగి వెళ్లే వాడు అని తేలింది. దీంతో అతడ్ని తీవ్రంగా మందలించారు. మరోమారు చిక్కితే కటకటాల్లోకి నెడుతామని హెచ్చరించారు. మరో వృద్ధుడు అయితే, తన వద్ద రెండు నోట్ల కట్టలు ఉన్నాయని, ఇదంతా భిక్షాటనతో తాను సంపాదించినదిగా వెల్లడించారు. మూడో వ్యక్తి వద్ద రూ. 3500 నగదు, పొడవైన కత్తి బయట పడింది. విచారించగా అతడు రామనాథపురంకు చెందిన కుమార్‌గా తేలింది. రాత్రుల్లో కొందరు గంజాయి మత్తులో వచ్చి వేధిస్తున్నారని, వారి నుంచి ఆత్మరక్షణ కోసం ఈ కత్తి పెట్టుకున్నట్టు పేర్కొనడంతో పోలీసులు విస్తుపోయారు. మిగిలిన వారు కూడా వివిధ కారణాలతో ఆశ్రమానికి వెళ్లేందుకు సమ్మతించలేదు. దీంతో వారికి పోలీసులు అవగాహన కల్పించారు. అందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. చదవండి: గోల్డ్ స్కామ్‌లో కీలక మలుపు: ప్రధాన సూత్రధారి అరెస్ట్ -
బిడ్డ కోసం యాచకురాలిగా..
కేవీబీపురం: తల్లి ఒంటరిదైపోతుందన్న ఆలోచనతో కొడుకు పెళ్లి చేసుకోకుండా తల్లి సేవలోనే జీవించాడు. అయితే విధి చిన్నచూపు చూడడంతో కిడ్నీ దెబ్బతిని అతడు మంచం పట్టాడు. బిడ్డ అనారోగ్యానికి గురై.. కదలలేని స్థితికి చేరడంతో 90 ఏళ్ల వయస్సులో ఆ తల్లి యాచకురాలిగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అంజూరు పంచాయతీ జయలక్ష్మీపురం గ్రామానికి చెందిన రామలింగయ్య(54) తాపీ మే్రస్తిగా జీవించేవాడు. ఇతని తండ్రి సుబ్రమణ్యం చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కుప్పమ్మ (90) కూలీ పనులు చేసి తన ఇద్దరు బిడ్డలను సాకింది. ఈ క్రమంలో పెద్ద కుమారుడు క్రిష్ణయ్య వివాహం తరువాత వేరు కాపురంతో దూరమయ్యాడు. అప్పటి నుంచి చిన్నకుమారుడు రామలింగయ్య పెళ్లి చేసుకోకుండా తల్లిని కంటికిరెప్పలా కాపాడేవాడు. అయితే నాలుగేళ్ల క్రితం కిడ్నీలు దెబ్బతినడంతో మంచానికే పరిమితమై కదల్లేని స్థితికి చేరాడు. దీంతో బిడ్డను కాపాడుకునేందుకు ఆ వృద్ధురాలు పడరాని పాట్లు పడుతోంది. తనకు వచ్చే పింఛన్ సొమ్ము రూ.3 వేలతో బిడ్డకు చిన్నపాటి వైద్యసేవలందిస్తూ.. రక్షించుకునేందుకు తాపత్రయపడుతోంది. తనకున్న రెండెకరాలను అమ్మి.. కుమారుడి స్నేహితుల సహాయంతో చైన్నైలో వైద్యం అందించానని.. అయితే పరిస్థితిలో మార్పురాలేదని ఆ వృద్ధురాలు వాపోయింది. ఆపరేషన్‌కు రూ.8 లక్షలు ఖర్చువుతుందని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అయినా కోలుకుంటాడనే గ్యారంటీ లేదని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో యాచకురాలిగా మారినట్లు వాపోయింది. అధికారులు, దాతలు స్పందించి తమకు భోజన సదుపాయం, మందులైనా అందిస్తే.. బతికినంతకాలం రుణపడి ఉంటానని కన్నీటి పర్యంతమవుతోంది. -
జర్నలిస్టుల భిక్షాటన
సాక్షి, హన్మకొండ : కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో జర్నలిస్టు బెలిదే శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం జర్నలిస్టులు భిక్షాటన చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రెస్ క్లబ్ వద్ద మొదలైన భిక్షాటన సుబేదారిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది. శ్రీనివాస్ చికిత్స కోసం ఇప్పటికే రూ.20 లక్షల వరకు బిల్లు కాగా, ఆ కుటుంబం డబ్బు చెల్లించలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు దాతలు పెద్ద మనస్సుతో ఆదుకోవాలని వేడుకున్నారు. కాగా, వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యాన శ్రీనివాస్ చికిత్స నిమిత్తం రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. (20 లక్షలు దాటిన కరోనా టెస్టులు) -
బిక్షాటనతో బందీ అవుతున్న బాల్యం
సాక్షి, దుబ్బాక : ప్రతీ మనిషి జీవితంలో బాల్యం ఓ మధుర జ్ఞాపకం. చిన్నతనంలో చేసే చిలిపి పనులు మనం పెద్దయ్యకా తరుచూ.. తలుచుకుంటూ ఉంటాం. కానీ కొందరు మహిళలు పిల్లల్ని చూపి భిక్షాటన చేయడానికి అలవాటుపడ్డారు. పిల్లలను చంకలో గుడ్డతో కట్టుకుని భిక్షాటన చేస్తున్నారు. గంటల తరబడి పిల్లలను చంకలో కట్టుకుని తిరగడం వలన తల్లికి బిడ్డకు ఆరోగ్యపరంగా ఇబ్బందికరమేనని వైద్యులు చెబుతున్నారు. చంకలో నిరంతరం కట్టేయడం మూలంగా పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట, దుబ్బాకలో తెల్లవారుజాముగానే తల్లులు పలు ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఉదయం హోటళ్ల వద్ద టిఫిన్ కోసం వచ్చేవారి నుంచి, బస్టాండ్‌లోకి వెళ్లే ప్రయాణికులతో పాటు పలు దుకాణాల వద్ద కనిపించిన వారినల్లా చంటి బిడ్డలను చూపి డబ్బులు అడుక్కుంటూ ఉండగా కొందరు డబ్బులు ఇస్తుంటారు. మరి కొందరు తిడుతూ.. చిరాకుపడుతుంటారు. ఇలా చంటి బిడ్డలతో యాచించి వారు రకరకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ట్రాఫిక్‌లో ఏదైన వాహనం ఆగిందా అక్కడికి వెళ్లి చేయి చాపుతారు. అలాగే హోటళ్ల నుంచి బయటకు వస్తుంటే చాలు అడ్డుగా వెళ్లి దానం చేయ్యండయ్యా..íపిల్లలకు పాలు పట్టించాలి, పిల్లవాడు ఇంకా ఏమి తినలేదు అంటూ..అడుగుతుండడం కనిపిస్తూ ఉంటుంది. పేదరికం కారణంగా భిక్షాటన చేస్తున్నారని మానవత్వ హృదయంతో ఆలోచించి కొందరు దానం చేస్తుంటారు. మరి కొందరు చీదరించుకుంటారు. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. ప్రతీ రోజు పిల్లలను చంకలో కట్టేసుకుని గంటల తరబడి తిరుగుతూ...భిక్షాటన చేస్తుండటంతో పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బడిలో ఆటపాటలతో చదువుకుంటూ సేద తీరాల్సిన పిల్లలు చంకలో కట్టేయడం మూలంగా పిల్లలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే బిడ్డలను చూపి డబ్బులు అడుక్కోవడం అలవాటుగా మారిన తల్లులు అవేమి పట్టించుకోవడం లేదు. అలాగే పిల్లలకు సరైన ఆహారం అందించకపోవడంతో పిల్లలు బక్కచిక్కిపోతున్నారు. ఫౌష్టికాహారం లోపంతో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగడం లేదు. లాక్డౌన్లో తీవ్ర ఇబ్బందులు.. కరోన నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా భిక్షాటన చేసేవారి పరిస్థితి దుర్భేద్యంగా మారింది. హోటళ్లు, బస్సులు నడపకపోవడంతో ప్రజలు ఎవరూ రోడ్ల పైకి రాకపోవడంతో యాచకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండిలేక ఆకలితో అలమటించారు. కొందరు మానవతావాదులు వారిని చూడలేక ఆహారం అందించారు. -
దయ.. ‘తల్లి’చేదెవరు!
అనంతపురం: నారాయణపురానికి చెందిన మహమ్మద్బీ అనే వృద్ధురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడు మరణించగా.. కుమార్తెకు వివాహం చేసింది. తన వద్ద ఉండాలంటే నెలకు రూ.10వేలు ఇవ్వాలని అల్లుడు ఆదేశించాడు. పింఛను డబ్బులు ఇస్తానని చెప్పినా ససేమిరా అన్నాడు. విధిలేని పరిస్థితుల్లో ఓ మసీదులో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే లాక్డౌన్ కారణంగా మసీదులో కూడా పని లేకపోవడంతో ఈ వృద్ధురాలు వీధిన పడింది. ఇదిగో ఇలా..చెత్తకుప్పల్లో దొరికింది తింటూ రోజులు భారంగా గడుపుతోంది. దయతలిచే ప్రభువులు ఎవరోనని దీనంగా రోదిస్తోంది. కొమ్మ.. రెమ్మలా తోబుట్టువులు తన జీవితంలో ప్రతిరోజూ పండగే విధి కన్నుకుట్టి కొడుకూ దూరమయ్యాడు. కన్నకూతురే ఆధారం.. కాలధర్మం చేసే వరకూ కంటికి రెప్పలా.. కను‘పాపై’ చూసుకుంటుందనుకుందా.. అమ్మ మహ‘అమ్మ’ద్బీ.. బీబీ చెంతకు చేరాలనుకుంది.. కంటేనే అమ్మ అనుకున్నాడో ఏమో.. అమ్మ..అత్తమ్మకు అం‘త్త’ దూరం ఉందనుకున్నాడేమో! బంధం మరిచాడు.. బంధుత్వాన్ని కాదన్నాడు ‘అ(ల్లు)తడు’ భార్య తల్లీ భారమైందతనికి అమ్మతనం..ముసలితనమైంది..ఒంటరి జీవితం వెలితినిచ్చాయి..వృద్ధాప్యం ముంచుకొచ్చిందని ‘ఉత్తి’మిరపలా ఉంటే ముప్పొద్దులా గడవదని అనుకుంది..నిస్సహాయ స్థితిలోనూ మసీదులో చేతనైన పనిచేస్తుంటే..పూటగడిచేది ఆ ముదుసలికికరోన.. రూపంలో గడ్డు పరిస్థితి దాపురించిందిఅవసాన దశలో అన్నీ అల్లుడే అనుకుందిదయలేని అల్లుడు.. నిర్దయ చూపాడు..కనికరంలేని మనిషి.. కాదని బయటకు గెంటాడు చేవలేని వయసులో చేతనైన పని చేద్దామనుకున్నా.. కాలు బయటకు పెట్టేందుకు వీలుకాని పరిస్థితి..ఎటు వెళ్లాలనుకున్నా.. ‘లాక్’ పడింది చివరకు చెత్తకాగితంలా మారిందామె జీవితం.. దయార్ద్రహృదయులు దయతలిచి.. దరిచేర్చుకుంటే..మోడుబారిన మొదలుకు.. వసంత రుతువులో చిగురించి ని‘శ్చింత’గా సాగిపోదా.. శేష‘జీవితం’ – ఫొటో: జి.వీరేష్ -
చెన్నైలో భిక్షమెత్తుకుంటున్న మహిళా పారిశ్రామికవేత్త
సాక్షి, చెన్నై: మానసిక ప్రశాంతత కోసం స్వీడెన్కు చెందిన ఒక మహిళా పారిశ్రామిక వేత్త కోయంబత్తూరు వీధుల్లో భిక్ష మెత్తుకోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. స్వీడెన్ దేశానికి చెందిన కిమ్ అనే మహిళా పారిశ్రామికవేత్త. కొన్నినెలల క్రితం కోవైలోని ఈషాయోగా కేంద్రానికి చేరుకుని అక్కడి పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సహాయాలు చేస్తున్నారు. అయినా మానసిక ప్రశాంతత దొరక్కపోవడంతో రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ వీధుల్లో తిరుగుతూ భిక్షమెత్తడం ప్రారంభించారు. ప్రయాణికులిచ్చే ఐదు, పది రూపాయలను తీసుకుంటున్నట్లు కిమ్ తెలిపారు. ధనికురాలైన విదేశీ యువతి కోవై వీధుల్లో భిక్షమెత్తడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చదవండి: ఆ బిలియనీర్ బ్లూమ్‌బర్గ్‌ను అమ్మేస్తాడు.. -
భిక్షాటనతో ఆర్టీసీ కార్మికుల నిరసన
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. గురువారంతో 41వ రోజుకు చేరింది. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో జేఏసీ పిలుపు మేరకు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపి, వారికి మద్దతుగా భిక్షాటన చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ నాగేశ్వర్(43) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నాగేశ్వర్ నారాయణఖేడ్ డిపోలో విధులు నిర్వర్తించేవాడు. ఆయన మృతితో జోగిపేటలో ఉద్రిక్తత నెలకొంది. -
భిక్ష కాదు...లక్ష, కాదు కాదు మూడు లక్షలు...!!
బాప్రే....! భిక్ష...అంటే భిక్ష కాదు.. లక్ష!!. కాదు కాదు మూడు లక్షలు...!!. ఈ దృశ్యం చూస్తుంటే మీకేమనిపిస్తోంది..? ఆరుబయట హుండీ డబ్బులు లెక్కిస్తున్నట్లు లేదూ...!. కానీ ఇది ఓ యాచకుడు ‘కష్టపడి’ సంపాదించిన భిక్షను లెక్కిస్తున్న చిత్రం!. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని ముక్తిలింగవారి వీధిలో అప్పల సుబ్రహ్మణ్యం (75) ఒక పాడుబడిన ఇంట్లో ఉంటున్నాడు. అయినవాళ్లు ఆదరణ లేకపోవడంతో యాచకుడిగా మారాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు వచ్చి దహన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం ఇంట్లో సంచులను వెతగ్గా అందులో సుమారు రూ.3 లక్షల వరకూ ఉన్నట్లు గుర్తించారు. కాగా రాజమండ్రిలోని యాచిస్తూ జీవనం గడుపుతూ మరణించిన ఓ వృద్ధ సాధువు జోలె సంచిలో రూ. లక్షా 80 వేల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. చదవండి: సాధువు మృతి.. సంచిలో లక్షా 80 వేలు! -
అనాథలే ఆదాయం!
నగర శివారు ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుమతి లేని కేంద్రాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో ఇలాంటి కేంద్రాల దందా బçహాటంగా కొనసాగతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 71 అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అందులో ఏడు ప్రభుత్వ అనాథ అశ్రమాలు కాగా, మిలిగిన 64 కేంద్రాల్లో 51 కేంద్రాలు ఐదేళ్ల కాలపరిమితి గల లైసెన్స్‌తో నడుస్తున్నాయి. మిగిలిన 13 సంస్థలకు ఆరు నెలల కాలపరిమితి గల ప్రొవిజన్ లైసెన్స్ ఉన్నాయి. తొమ్మిది సంస్థలను ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వాహిస్తున్నారు. మేడ్చల్ పరిధిలో 120 వరకు అనాథ చిన్నారుల సంరక్షణ కేంద్రాలు ఉండగా వాటిలో సగానికి పైగా లైసెన్స్‌తో పాటు కనీస ప్రభుత్వ అనుమతి కూడా లేనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 100కి పైగా ఉన్న సంస్థల్లోనూ అదే పరిస్థితి ఉన్నట్టు అధికారలు గుర్తించారు. ఆయా అక్రమ కేంద్రాల నిర్వాహకులు బహాటంగా అడ్డదార్లు తొక్కుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహారస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి,సిటీబ్యూరో: విశ్వనగరి వైపు పరుగులు తీస్తున్న హైదరాబాద్‌లో ‘అనాథ పిల్లల సంరక్షణ’ నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. సేవ ముసుగులో అడ్డదార్లు తొక్కుతున్నారు. కొన్ని సంస్థలు నిజాయితీగా అనాథ పిల్లకు సేవ చేస్తుండగా.. మరికొన్ని స్వచ్ఛద సంస్థలు మాత్రం అనాథల సంరక్షణ కేంద్రాల పేరుతో పిల్లలను చేర్చుకుని వారితో ముఖ్య కూడళ్లలో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. అందుకు ఆయా కూడళ్లలో వాహనదారుల నుంచి ‘అనాథలకు సహాయం’ పేరుతో వసూళ్లు చేయిస్తుండగా, మరి కొన్ని సంస్థలైతే ఏకంగా చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఫలితంగా ‘అనాథ చిన్నారుల సంరక్షణ’ కొందరికి ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తముతున్నాయి. నగరంలో చందాలు, భిక్షాటన దందాకు అడ్డూ అదుపూ లేని కారణంగా పలువురు నిర్వాహకులు అనాథ పిల్లలను పావుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. నగరంలో 300కు పైగా కేంద్రాలు రాష్ట్రంలోనే అత్యధికంగా అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాలు హైదరాబాద్ నగరంలోనే ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ దాదాపు 300కు పైగా కేంద్రాలు నడుస్తున్నట్టు చెబుతున్నారు. వాటిలో 40 శాతం కేంద్రాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉండగా, మిగిలిన కేంద్రాలు ఎలాంటి అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలంటే కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ పరంగా అనుమతి పొందాలంటే ఎన్నో కఠిన నిబంధనలు పాటించాలి. లైసెన్స్ అంత సులభం కాదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖలో సొసైటీ, లేదా ట్రస్ట్ కింద నమోదైన స్వచ్ఛంద సేవా సంస్థలు అనా«థ పిల్లల సంరక్షణ కేంద్రాలు, అనాథ ఆశ్రమాల ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కనీసం మూడేళ్ల అనుభవం గల స్వచ్ఛంద సంస్థలు మాత్రమే అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు అనుమతి పొందే అవకాశం ఉంది. సంస్థ నియమ నిబంధనలు, అనుభవం, అర్థిక వనరుల సమీకరణ, అనా«థ చిన్నారుల సంరక్షణ సామర్థ్యం, చిన్నారులకు డైట్, కనీస వసతులు వంటి అంశాలపై అధికారులు సంతృప్తి చెందాలి. అప్పుడే అనుమతి ఇస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాక అన్ని అంశాలు సరిగా ఉంటే ఆరునెలల కాలపరితితో కూడిన ప్రొవిజన్ లైసెన్స్ జారీ అవుతుంది. తర్వాత ఐదుగురు జిల్లా స్థాయి అధికారుల విచారణ కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి కేంద్రాల పనితీరు బట్టి రాష్ట్ర స్థాయి విచారణ కమిటీకి సిఫార్సు చేస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీ కూడా మరోసారి విచారణ జరిపి నిబంధనలకు లోబడి ఉంటే ఐదేళ్లకు అనుమతి ఇస్తుంది. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాల్లో చాలావాటికి ఎలాంటి లైసెన్స్ లేకపోవడం గమనార్హం. -
లారెన్స్ కోసం వచ్చి భిక్షాటన
చెన్నై ,పెరంబూరు: ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్‌ను కలవడానికి వచ్చిన కుటుంబం ప్రస్తుతం భిక్షమెత్తుతూ జీవిస్తున్నారు. కన్న కొడుకుకు వైద్య సాయం కోరడానికి వచ్చిన ఆ అభాగ్యులు చెన్నై ఎగ్మూర్ రైల్వేస్టేషన్ ప్లాట్‌పామ్‌పై భిక్షమెత్తుకుని జీవించుకుంటున్నారు. వారి దీనగాథ పలువురిని కదిలిస్తోంది. వివరాలు రాజపాళైయంకు చెందిన యువతి గృహలక్ష్మీ. ఆమె సోదరుడు వెంకటేశన్. గృహలక్ష్మీ పెళ్లి జరిగింది. కొడుకు పుట్టాడు. దీంతో మేనమామ వెంటకేశన్ ఆనందంతో పొంగిపోయాడు. ఆ అనందం ఎంతో కాలం నిలవలేదు. గృహలక్ష్మీ కొడుకు పేరు గురుసూర్య. అయితే ఆ పిల్లాడు రెండేళ్ల వయసు వరకూ నడవలేక పోయాడు మాటలు రాలేదు. అంతే కాదు కాలం గడుస్తున్న కొద్ది గృహలక్ష్మీ మరింత క్షోభను కలిగించే సంఘటన జరిగింది. ఆమె కొడుకు గుండె జబ్బు బయటపడింది. దీంతో ఆమె కొడుకును కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. చాలా ఆస్పత్రులకు వెళ్లింది. అయినా ప్రయోజనం లేకపోయ్యింది. మరో పక్క భర్త వదిలి వెళ్లిపోయాడు. గృహలక్ష్మీకి ఎం చేయాలో, తన కొడుకును ఎలా కాపాడుకోవాలో పాలు పడలేదు. సోదరి బాదను చూడలేక వెంకటేశన్ తన పెళ్లిని త్యాగం చేసి అక్కకు అండగా నిలిచాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో చెన్నైకి వెళ్లి నటుడు లారెన్స్‌ను కలవమని సలహా ఇచ్చారు. దీంతో గృహలక్ష్మీ వారం రోజుల క్రితం కొడుకు, సోదరుడితో కలిసి లారెన్స్‌ను కలవడానికి చెన్నైకి వచ్చింది. వారికి లారెన్స్ చిరునామాను ఎవరూ చెప్పలేదు. దీంతో తిరిగి ఊరుకు వెళ్లలేక, కొడుకును రక్షించుకోలేక చెన్నై, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లోనే ఉండిపోయారు. అక్కడ ప్రయాణికులు దయదలచి ధర్మం చేస్తున్న బిక్షతోనే పొట్ట పోషించుకుంటున్నారు. అలాంటి ధీన స్థితి నుంచి వారిని బయట పడేయడానికి ఎవరైనా కనికరించి ఆదుకుంటే బాగుంటుంది. -
తల్లి అంత్యక్రియలకు కూతుళ్ల భిక్షాటన
సాక్షి, జగిత్యాల : తల్లి అంత్యక్రియలకు డబ్బు లేక కూతుళ్లు భిక్షాటన చేసిన దైన్య ఘటన శనివారం జగిత్యాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. భర్త, కొడుకు సైతం భిక్షాటన చేయగా... స్పందించిన ముస్లిం నాయకులు ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. కూతుళ్లు కన్నతల్లి చివరి చూపునకు నోచుకోలేకపోయారు. మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతానికి చెందిన మస్తాన్ తన భార్య ముంతాజ్, చిన్నాన్న పెద్ద మస్తాన్, ముగ్గురు పిల్లలతో కలిసి జగిత్యాలకు నెల రోజుల క్రితం వచ్చారు. ఇక్కడే భిక్షాటన చేస్తూ జిల్లాకేంద్రంలోని టౌన్హాల్లో సేద తీరుతున్నారు. ఓ వైపు అర్ధాకలి, మరోవైపు అనారోగ్యంతో మస్తాన్ భార్య ముంతాజ్ శనివారం ప్రాణాలు విడిచింది. భార్య మృతితో మస్తాన్ నిశ్చేష్టుడయ్యాడు. మస్తాన్ కూతుళ్లు ముంతాజ్(10), మున్నీ(7) తాతతో కలిసి తల్లి అంత్యక్రియలకు అవసరమైన డబ్బు కోసం భిక్షాటనకు వెళ్లారు. మస్తాన్ చిన్నకొడుకు అబ్దుల్లాతో కలిసి భార్య శవం వద్ద ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న మెకానిక్‌లు స్పందించి అంత్యక్రియల కోసం తలాకొంత డబ్బు జమచేశారు. భిక్షాటనకు వెళ్లిన వారు సాయంత్రమైనా తల్లి శవం వద్దకు చేరుకోలేదు. ఈ విషయం తెలిసిన ముస్లిం మైనార్టీ నాయకులు అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చారు. చీకటి పడుతుండటంతో కూతుళ్లు రాకుండానే ముంతాజ్ శవాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. భిక్షాటనకు వెళ్లిన కూతుళ్లు తల్లి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయారు. రాత్రయినా పిల్లలు తండ్రి వద్దకు చేరుకోలేదు. -
ఇకపై దేవస్థానంలో..భిక్షాటన నిషేధం
సాక్షి,భువనేశ్వర్/పూరీ: జగతి నాథుడు కొలువుదీరిన శ్రీ మందిరం లోపల, బయట చక్కటి ఆధ్యాత్మిక, ధార్మిక వాతావరణం కల్పించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. ఆలయ సంప్రదాయాలు, ఆచార–వ్యవహారాల సంస్కరణకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సింహద్వారం పరిసరాల్లో ఇబ్బందికర పరిస్థితులను నివారించి, రోజువారీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ క్రమంలో సింహద్వారం పరిసరాల్లో బిక్షాటన, విక్రయ కేంద్రాలు, వాహనాల నిలుపుదల వంటి చర్యల నిర్మూలనకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు అధికారిక సమాచారం. జగన్నాథుని దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి నిత్యం లెక్కకు మించిన భక్తులు, యాత్రికులు, పర్యాటకులు, సందర్శకులు వచ్చిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ జ్యోతిప్రకాష్ దాస్ తెలిపారు. పార్కింగ్, విక్రయాలు కూడా.. రథయాత్ర సమయంలో మినహా ఇతర రోజుల్లో బొడొ–దండొ ప్రాంగణం అంతా కలుషితం కావడంతో అక్కడికి వచ్చే పర్యాటక వర్గానికి ఇబ్బంది కలిగిస్తోంది. ముఖ్యంగా అనధికారిక వాహనాల పార్కింగ్ యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీంతో పాటు సింహద్వారం పరిసరాల్లో చిరువ్యాపార దుకాణాలు, ఇతరేతర వ్యవహారాలు కూడా యాత్రికులు, పర్యాటకులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఆలయ పరిసరాల్లో జరిగే బిక్షాటన కూడా విచారకర పరిస్థితులను ప్రేరేపిస్తోంది. సింహద్వారం పరిసరాల్లో ఆబోతుల స్వైరవిహారం నిర్మూలనకు కూడా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇదే పరిసరాల్లో వాహనాల అనధికారిక పార్కింగ్‌ను కూడా నిషేధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా పోలీసు యంత్రాంగం చెబుతోంది. అలాగే పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాత్రింబవళ్లు జవానులతో పహారా ఏర్పాటు చేస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ ఉమాశంకర దాస్ తెలిపారు. ప్రతిపాదిత కార్యాచరణ విజయవంతం జగన్నాథుని ప్రధాన దేవస్థాన ప్రవేశద్వారం పరిసరాల్లో చక్కటి పర్యావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదిత కార్యాచరణను ప్రయోగాత్మకంగా ఆదివారం ప్రారంభించింది. రోజంతా ఈ కార్యాచరణను ప్రయోగాత్మకంగా నిర్వహించి, సింహద్వారం పరిసరాల్లో అనధికారిక పార్కింగ్, బిక్షాటన, విక్రయ సంస్థల నిర్మూలన వంటి చర్యలను విజయవంతంగా నిర్వహించారు. -
లంచం ఇచ్చేందుకు భిక్షాటన..
వెలుగోడు: అధికారులకు లంచం ఇవ్వడం కోసం కుటుంబ సభ్యులతో కలసి భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపాడు ఓ రైతు. ఏపీలోని కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన వన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గౌరెడ్డికి ఇద్దరు కొడుకులు కాగా.. వారిలో వన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు రెండో కుమారుడు. వారసత్వంగా తనకు 25 ఎకరాల భూమి దక్కాల్సి ఉండగా, దీన్ని సమీప బంధువు ఆక్రమించాడని రాజు ఆరోపిస్తున్నాడు. తన భూమి తిరిగి ఇప్పించాలని రాజు కోరగా వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం వెలుగోడు పట్టణంలో రాజుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు చేతిలో గిన్నె పట్టుకొని.. మెడలో ఓ బ్యానర్ వేసుకుని భిక్షాటన చేయడం ప్రారంభించారు. బ్యానర్‌పై ‘దయచేసి నాకు దానం చేయండి. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయా. కాబట్టి నా భూమిని కోల్పోయా. రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నా’ అని రాసి ఉంది. రాజు ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆత్మకూరు సీఐ కృష్ణయ్య వెలుగోడు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టారు. రాజు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. రాజు అనుభవంలో 2.15 ఎకరాల పొలం మాత్రమే ఉందని, దాయాదుల మధ్య వివాదాన్ని తమపై నెడుతున్నాడని ఆరోపించారు. ఆయన భూమికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే కోర్టుకెళ్లి తేల్చుకోవాలని తహసీల్దారు సూచించారు. -
అధికారులకు లంచం ఇచ్చేందుకు రైతు భిక్షాటన
-
లంచమివ్వాలి.. దానం చేయండి ప్లీజ్!
సాక్షి, కర్నూలు : సమాజంలో అవినీతి, లంచం ఎంతలా పెరిగిపోయాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. అధికారులకు లంచం ఇవ్వడం కోసం ఓ రైతు కుటుంబంతో కలిసి భిక్షాటన చేస్తున్నారు. వివరాలు.. కర్నూలు జిల్లాకు చెందిన మన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజుకు పశ్చిమ గోదావరి జిల్లా మాధవరం గ్రామంలో 25 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమిని రాజు సమీప బంధువు ఒకరు అక్రమంగా ఆక్రమించినట్లు రాజు ఆరోపించారు. అంతేకాక సదరు బంధువు అధికారులకు లంచం ఇచ్చి, తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి.. భూమిని ఆక్రమించుకున్నాడన్నారు రాజు. ఈ విషయం గురించి అధికారులను సంప్రదించగా ఇప్పటికే సదరు బంధువు పేర మీద డాక్యుమెంట్ పేపర్లు తయారయ్యాయని.. ఏ నిమిషంలోనైనా వాటిని అతనికి అందజేస్తామని తెలిపారన్నారు. అధికారుల తీరుతో విసిగిపోయిన రాజు.. తన భూమిని కాపాడుకునేందుకు బిచ్చగాడిగా మారారు. రాజుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు కూడా చేతిలి భిక్షపాత్ర పట్టుకుని.. మెడలో ఓ బ్యానర్ వేసుకుని కనిపించిన వారినల్లా దానం చేయమని కోరుతున్నారు. బ్యానర్ మీద ‘దయచేసి నాకు దానం చేయండి.. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయాను.. కాబట్టి నా భూమిని కోల్పోయాను. గత రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నాను’ అని రాసి ఉంది. అయితే ఈ విషయం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్‌ని ప్రశ్నించగా.. రాజు చేస్తున్న ఆరోపణలు నిరాధరమైనవని తెలిపారు. అధికారుల గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నందుకుగాను అతని మీద పరువునష్టం కేసు పెడతామని హెచ్చరించారు. అతని భూమికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే కోర్టుకెళ్లి తేల్చుకోవాలని చెప్పారు. -
బెగ్గింగ్ కాదు.. బీజింగ్!
ఇస్లామాబాద్: అక్షరాలు, పదాలు తారుమారైతే అర్థాలే మారిపోతాయి.. అంతేకాకుండా పెడర్థాలకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి సమస్యనే ఓ మీడియా సంస్థ ఎదుర్కొంటోంది. వారి దేశ ప్రధాని వార్తలోనే ఘోర తప్పిదం చేయడంతో అపప్రదను మూటగట్టుకుంటోంది పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్ (పీటీవీ) మీడియా సంస్థ . పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేసిన ప్రసంగాన్ని పీటీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయితే డేట్లైన్ బీజింగ్‌లో ప్రధాని అని కాకుండా బెగ్గింగ్‌లో ప్రధాని అంటూ తప్పుగా ప్రసారం చేసింది . ఇలా 20 సెకన్ల పాటు ప్రసారం అయింది. ఆ వెంటనే తప్పు గుర్తించి సరి చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇది పాక్ ప్రధానికి, దేశానికి ఎంతో అవమానకరమని కొంత మంది నెటిజన్లు మండిపడగా మరికొంతమంది వినూత్నంగా స్పందించారు. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని.. దీనిపై ప్రత్యేక మిలటరీ అధికారులతో దర్యాప్తు జరిపించాలని చురకలు అంటిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు కూడా ‘అవును మన ప్రధాని చైనా ప్రభుత్వం ముందు బెగ్గింగ్ చేస్తున్నారు’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. వివరణ ఇచ్చిన పీటీవీ ‘పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనలో చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడంలో పొరపాటు దొర్లింది. డేట్లైన్ బీజింగ్ బదులు బెగ్గింగ్ అని తప్పుగా వచ్చింది. ఇది తెరపై 20 సెకన్ల పాటు కనబడింది. తర్వాత తొలగించారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం’అంటూ పీటీవీ సంస్థ వివరణ ఇచ్చింది. ఇక దీనిపై సర్వత్రా విమర్శలు రావటంతో ఈ ఘటనపై విచారణ జరపాలని పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి అధికారులను ఆదేశించారు. Today, during a live address of the Prime Minister during his ongoing visit to China, a typographical error took place, which remained on screen for 20 seconds & later removed. This incident is regrettable. Strict action has been initiated under rules against concerned officials pic.twitter.com/df2Z8oib5u — PTV News (@PTVNewsOfficial) 4 November 2018 -
విల్లా ఉన్నా.. భిక్షాటన!
‘ఆమెకెవ్వరూ సాయం చేయకండి! ఆమె చెప్పే కథలకు కరిగిపోకండి! మీకు కనిపిస్తున్నంత అమాయకురాలు కాదు. ఆమె ధనవంతురాలు, ఐదంతస్తుల విల్లాలో నివసిస్తుంది! దయచేసి ఆమెకు సాయం చేయకండి’అంటూ చైనాలోని హాంగ్జూ రైల్వేస్టేషన్లో గుడిలో స్తోత్రంలా వినిపిస్తుంటుంది. ఇదంతా 79 ఏళ్ల ఓ యాచకురాలు గురించి. ఆమెకు ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా వస్తుంది. కొడుకు వ్యాపారాలు చూసుకుంటాడు. కొడుకు ఎన్నోసార్లు చెప్పి చూసినా ఆమె యాచక వృత్తిని మానలేదట! ఇలా కాదని ఆమె ఫొటోలు గోడలు, సోషల్ మీడియాలో పెట్టి ‘దయచేసి ఈమెకు దానం చెయ్యొద్దు’అని ఆమె కథను విస్తృతంగా ప్రచారం చేసినా లాభం లేకపోయింది. దీంతో రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. మైకుల్లో అరవడం మొదలుపెట్టారు. అయినా ఫలితం లేదు. ఆమె వయసు,అవతారం చూసి జనాలు జాలితో దానం చేసి వెళ్తున్నారట! ఆమె తొలుత రైల్వే స్టేషన్లో మ్యాప్‌లు అమ్మడానికి ప్రయత్నించింది. కానీ, రైల్వే అధికారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో అదే రైల్వే స్టేషన్లో యాచించడం మొదలెట్టింది. రోజుకు 300 యువాన్లు కూడబెడుతుందట! ఇంటి వద్ద ఊరికే కూర్చోవడం ఇష్టం ఉండదని వయసు పెరిగేకొద్దీ డబ్బు అవసరం పెరుగుతుండటంతో యాచిస్తున్నానని పేర్కొంది. ఆమెపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇది ప్రజల సొమ్ము దోచుకోవడమేనని ఓ వర్గం తిట్టిపోస్తుంటే.. కొడుకు సరిగ్గా చూసుకో కపోవడం వల్లే ఒంటరితనం ఆమెనలా చేసిందని.. అందులో ఆమె తప్పేం లేదని మరో వర్గం దన్నుగా నిలుస్తోంది. -
అనాథాశ్రమం బాలలతో భిక్షాటన
ప్రొద్దుటూరు క్రైం : అనాథ ఆశ్రమం పేరుతో పసి పిల్లల చేత భిక్షాటన చేయిస్తున్న శ్రీ చౌడేశ్వరి ఫౌండేషన్ నిర్వాహకులపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పిల్లల చేత భిక్షాటన చేస్తున్నారని సమాచారం రావడంతో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్పెక్షన్ టీం గురువారం సాయంత్రం ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. తనిఖీల్లో భిక్షాటన చేయిస్తున్నట్లు వాస్తవాలు వెల్లడి కావడంతో వారు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు పాపయ్య, సరోజమ్మతో పాటు కొందరు కలిసి ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్‌లో ఐదేళ్ల నుంచి శ్రీ చౌడేశ్వరి ఫౌండేషన్ అనాథ, పేద పిల్లల ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో 14 మంది పిల్లలతో పాటు చైల్డ్వెల్ఫేర్ కమిటీ అనుమతి లేకుండా మరో ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలకు ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యాబోధన జరగాల్సి ఉంది. అయితే ఆశ్రమ నిర్వాహకులు పసి పిల్లలను పాఠశాలకు పంపకుండా రోజూ భిక్షాటనకు తీసుకొని వెళ్తున్నారు. రోజు ఆటోలో కూర్చోపెట్టుకొని, వారి చేతికి అనాథ పిల్లలమనే కరపత్రాన్ని ఇచ్చి రోజుకో వీధికి తీసుకొని వెళ్లి వదిలి పెడుతున్నారు. వారు రోజుకు రూ. వందల్లో డబ్బు తీసుకొని రాగా కేవలం తమకు 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని పిల్లలు సీడబ్ల్యూసీ అధికారుల విచారణలో వెల్లడించారు. పిల్లలలను మరో ఆశ్రమంలో చేర్పిస్తాం ఆశ్రమాన్ని తనిఖీ చేసిన సమయంలో రికార్డులో ఉన్న 14 మందితో పాటు అనధికారికంగా ఉన్న ముగ్గురు పిల్లలను సీడబ్ల్యూసీ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ముగ్గురు పిల్లలను జిల్లా అధికారుల అనుమతితో మంచి ఆశ్రమంలో చేర్పించి మెరుగైన ఆశ్రమంలో చేర్పిస్తామని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అధికారి ఎల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అనేక ఆశ్రమాల్లో చాలా దారుణాలు జరిగాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 44 అనాథ బాలల ఆశ్రమాలు ఉండగా వాటిలో 37 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుండగా, 7 ఆశ్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. పిల్లలకు విద్యను అందిచకుండా వారి హక్కులను హరిస్తున్న నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పసి పిల్లల చేత భిక్షమెత్తించడం నేరమని ఆయన తెలిపారు. 14 మంది పిల్లల తల్లి దండ్రులను పిలిపించి విచారణ చేస్తామన్నారు. ఆ తర్వాత జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. సీడబ్ల్యూసీ టీం సభ్యులు డాక్టర్ ప్రసన్నలక్ష్మి, చైల్డ్వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు వరమ్మ, డీసీపీఓ శివకుమార్‌రెడ్డిలతో సీఐ ఓబులేసు మాట్లాడారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. -
అడుక్కోవడం నేరమెలా అవుతుంది: హైకోర్టు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో యాచించడం నేరం కాదంటూ తీర్పునిచ్చింది ఢిల్లీ హైకోర్టు. ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం అడుక్కోవడాన్ని నేరం అని ఎలా అంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక యాచకులపై జరిమానాలు విధించడం రాజ్యంగ విరుద్ధమని ప్రకటించింది. ‘ఢిల్లీలో అడుక్కోవడాన్ని నేరంగా పరిగణించడానికి బదులుగా యాచకులకు కనీస ప్రాథమిక హక్కులు కల్పించాలం’టూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కర్ణిక సావ్నీ, హర్ష మందర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ‘అడుక్కోవాలని ఎవరూ అనుకోరు. మనిషి ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా మరొకరిని యాచించాల్సి వస్తోంది. ప్రజలకు ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు యాచించడాన్ని నేరంగా ఎలా పరిగణిస్తాయ’ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ సి.హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాక పిల్లల చేత బలవంతంగా అడుక్కునేలా చేస్తున్న ముఠాలను అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యామ్నయ చట్టాన్ని తీసుకురావాలని ఆదేశించింది. ‘బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్’ ప్రకారం అడుక్కోవడం నేరం. దీన్ని సవాలు చేస్తూ పిటిషన్‌దారులు కోర్టును ఆశ్రయించారు. అయితే పేదరికం కారణంగా యాచించడం నేరం కాదని గతంలోనే ప్రభుత్వం కూడా వెల్లడించింది. ప్రస్తుతానికి అడుక్కోవడాన్ని నిషేధించే కేంద్ర చట్టాలు ఏమి లేవు. అయితే చాలా రాష్ట్రాలు బాంబే చట్టాన్నే పరిగణలోకి తీసుకొని, యాచించడాన్ని నేరంగా పరిగణిస్తూ తమ రాష్ట్ర చట్టాల్లో మార్పులు చేస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం మొదటిసారి యాచిస్తూ పట్టుబడితే మూడేళ్ల కంటే ఎక్కువ శిక్ష ఉంటుంది. మళ్లీ అలాగే చేస్తే పదేళ్ల దాకా శిక్ష పడే అవకాశం ఉంది. -
భర్త శవాన్ని తరలించేందుకు భిక్షాటన..
చిత్తూరు , మదనపల్లె క్రైం: చికిత్స పొందుతూ భర్త చనిపోవడంతో ఆ శవన్ని ఇంటికి తరలించడానికి డబ్బులు లేక ఓ పేద మహిళ ఆస్పత్రిలోని రోగుల చెంత భిక్షాటన చేసింది. వారు ఆర్థిక సాయం అందించడంతో ఆటోలో భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లింది. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం వెలుగుచూసిన ఈ విషాదకర ఘటనకు సంబం ధించి వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు మండలం బారాడపల్లె పంచాయతీ ఈడిగపల్లెకు చెందిన బాబుసాహేబ్(45) భవన నిర్మాణ కార్మి కుడు. ఇతడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతని భార్య దౌలత్‌బీ ఆదివారం 108లో భర్తను చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చింది. అత్యవసర విభాగంలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు బాబుసాహేబ్ పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించాలని సూచించారు. అయితే దౌలత్‌బీ తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని డాక్టర్ల వద్ద కన్నీరు పెట్టుకుంది. చేసేది లేక డాక్టర్లు వెంటనే అతన్ని వార్డులో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. అప్పటికే గొం తు బిగుసుకుపోయిన బాబు సాహేబ్ ఊపిరి ఆడ క శ్వాసకోస వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైæ చని పోయాడు. భర్త మరణించాడని తెలియడంతో దౌలత్‌బీ కన్నీరు మున్నీరైంది. ఇక తనకూ, తన బిడ్డలిద్దరికి దిక్కెవరంటూ రోదించింది. చివరకు 20 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి భర్త శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఆమె వద్ద డబ్బులు కూడా లేకుండా పోయాయి. దీంతో ఆస్పత్రిలో కనిపించిన వారందరినీ ఆర్థికసాయం అందించామని వేడుకుంది. కరుణించిన కొందరు ఆమెకు కొంత నగదును ఇవ్వడంతో ఆ డబ్బుతో బాడుగ ఆటోలో తన భర్త శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లింది. ఆటో డ్రైవర్ కూడా ఉదారంగా వ్యవహరించి తక్కువ మొత్తంతో బాబుసాహేబ్ మృతదేహాన్ని ఇంటికి తరలించాడు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. -
మలిసంధ్యలో మాడే కడుపుతో..!
మంచిర్యాల సిటీ: ప్రముఖ కవి, దివంగత గూడ అంజయ్య మాతృమూర్తి పరిస్థితి దయనీయంగా మారింది. మలిసంధ్యలో ఉన్న ఆమె అర్ధాకలితో అలమటిస్తోంది. పదెకరాల భూమి ఉన్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె భిక్షాటన చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇది గమనించిన మాలమహానాడు నాయకులు సోమవారం జాయింట్ కలెక్టర్ వై. సురేందర్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగుచూసింది. పదెకరాల భూమికి సంబంధించిన వివరాలు ఇస్తే న్యాయం చేస్తానని జేసీ ఆమెకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లస్మవ్వ విలేకరులతో మాట్లాడుతూ తన గోడును వెళ్లబోసుకున్నది. ‘నాకు పదెకరాల భూమి ఉండేది. దాంతోనే ఆరుగురు కొడుకులను, ఒక బిడ్డను పెంచి పెద్ద చేసిన. వాళ్లకు అన్నీ దగ్గరుండి చూసుకున్న. కొడుకులు చచ్చిపోయిండ్రు. ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నది. కొడుకుల పిల్లలు ఉన్నరు. ఆరుగురిలో ఒకడు పదెకరాలను వాని పేరునే చేయించుకున్నడు. అంజయ్య రెండేళ్ల కిందటనే చచ్చిపాయే. అంజయ్య బతికి ఉన్నప్పుడే ఎవరు పట్టించుకోకపాయే. నేను కట్టుకున్న ఇంటిని కూడా వాళ్లే ఉంచుకున్నరు. అక్కడిక్కడ అడుక్కొని యాన్నో ఓ కాడ ఉంటున్న. ఎవలన్న పాపమని బుక్కెడు పెడితే తింటున్న. లేదంటే కడుపు మాడ్చుకొని ఉంటున్న. ఈ వయసులో ఎసంటోళ్లకు కూడా ఇసొంటి తిప్పలు రావద్దు. ఎవరైనా ఎన్ని రోజులు పెడుతరు బిడ్డ. ఎందుకు బతుకుతున్నా అని బాధపడుతున్న. దేవుడు జెప్పన తీసుకపోతే మంచిగుండు..’అంటూ లస్మవ్వ ఆవేదన వ్యక్తం చేసింది. -
అందరూ ఉన్నా అనాథే..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్నతల్లి రుణం తీర్చుకోవాలనే విచక్షణ ఆ సంతానానికి లేకుండా పోయింది. కనికరం లేని 13 మంది సంతానం వల్ల ఆ తల్లి అనాథగా మారింది. భిక్షాటన చేస్తూ బతుకీడుస్తున్న క్రమంలో కాలు విరిగడంతో అనాథ శరణాలయంలో చేరిపోయింది. తమిళనాడుకి చెందిన 95 ఏళ్ల వృద్ధురాలి దీనగాథ ఇది. దిండుగల్లు జిల్లా కొడైక్కెనాల్‌కు చెందిన అంతోనియమ్మాళ్ (95) ఇరవై ఏళ్ల కిందట భర్త దేవరాజ్ వేధింపులు తట్టుకోలేక వేలూరు జిల్లా కాట్పాడిలోని తన కుమార్తె జయ్సీరాణి ఇంటికి వచ్చింది. అల్లుడు నందకుమార్ కూడా బాగా చూసుకోవడంతో కుమార్తె వద్దే స్థిరపడిపోయింది. ఐదేళ్ల క్రితం నందకుమార్ చనిపోవడంతో కుమార్తె జయ్సీరాణి తల్లిని వదిలించుకుంది. దీంతో అంతోనియమ్మాళ్ ఐదేళ్లుగా వేలూరులోని ఓ చర్చి వద్ద భిక్షాటన చేస్తూ కాలం గడిపేది. భిక్షాటనతో వచ్చిన సొమ్మును కుమార్తె తీసుకెళ్లేది. ఈ స్థితిలో ఈ వృద్ధురాలు వారం రోజుల కిందట కిందపడడంతో కుడికాలి ఎముక విరిగింది. విషయం తెలుసుకున్న మణిమారన్ అనే సామాజిక కార్యకర్త వృద్ధురాలిని కలెక్టర్ వద్దకు మోసుకెళ్లి వినతిపత్రం అందజేసి వృద్ధురాలికి ఆహారం, వసతి కల్పించాల్సిందిగా కోరాడు. వృద్ధురాలిని అనాథగా వదిలేసిన 13 మంది సంతానంపై వేధింపుల చట్టం కింద అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. స్పందించిన కలెక్టర్ సాంఘిక సంక్షేమశాఖాధికారిని పిలిపించి ఆంతోనియమ్మాళ్ను వృద్ధుల శరణాలయంలో చేర్పించాలని ఆదేశించారు. అంతోనియమ్మాళ్ శుక్రవారం మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ‘నాకు 13 మంది పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. వారంతా నన్ను వదిలేయడంతో అనాథగా మారాను. దేవుడే దిక్కుగా బతుకీడుస్తున్నా. నేను చనిపోయే వరకు ఇంత అన్నం పెడితే చాలు. కాలు విరగడం వల్ల కాలకృత్యాలకు కూడా పోలేకపోతున్నాను. అందుకే అన్నం కూడా మానేశాన’ ని ఆవేదన వ్యక్తం చేసింది. బతికి ఉన్నపుడు తనను పట్టించుకోని కుమారులు, కుమార్తెలు, బంధువులు తాను చనిపోయిన తరువాత వచ్చి చూడకూడదని కన్నీటి పర్యంతమైంది. -
మిత్రుడి కోసం భిక్షాటన
భువనేశ్వర్ : ఆపదలో ఆదుకున్న వాడే మిత్రుడు అనే ఆంగ్ల సూక్తి తరచూ మన చెవిన పడుతుంటుంది. వాస్తవంగా ఇటువంటి మిత్ర బృందం రాష్ట్రంలో అందరి మన్ననల్ని పొందుతోంది. ప్రమాదవశాత్తు మంచాన పడిన అలోక్ మిత్రులు తోటి మిత్రుని చికిత్స కోసం డబ్బుల కొరత నివారించేందుకు నడుం బిగించారు. పూరీ జిల్లాలోని కృష్ణ ప్రసాద్ సమితి గోపాల్పూర్ గ్రామస్తుడు అలోక్ చిలికా పర్యటనకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని వెన్నెముక దెబ్బతింది. చికిత్స కోసం భారీగా వెచ్చించాల్సి ఉంటుందని వైద్యులు ప్రకటించారు. కుటుంబీకులకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. డబ్బు లేకుంటే చికిత్స ముందుకు సాగని దయనీయ పరిస్థితి. స్నేహితుడు మంచాన పడ్డాడు. లేచి తిరుగాడాలంటే ముందుగా డబ్బు పోగు చేయాలి. ఆ తర్వాతే వైద్యం, చికిత్స వగైరా. స్నేహితుడి కోసం భిక్షాటన తప్పు కాదు అలోక్ కుటుంబీకుల మాదిరిగానే స్నేహితుల ఆర్థిక స్తోమత çకూడా అంతంత మాత్రమే. మునుపటిలా మిత్రుడిని తమతో కలిసి తిప్పుకోవాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే. చివరికి మిత్రులంతా కలిసి భిక్షాటనకు సిద్ధమయ్యారు. వీధి వీధి తిరుగుదామని నిశ్చయించుకున్నారు. వైద్యుల సలహా మేరకు చికిత్సకు కావలసినంత సొమ్ము పోగు అయ్యేంత వరకు నిరవధికంగా భిక్షాటన చేద్దామని బయల్దేరారు. భిక్షాటన కోసం కాగితంతో ఓ డబ్బా తయారు చేసి వీధిన పడ్డారు. 15 రోజుల పాటు ఊరూ వాడా.. 15 రోజులపాటు వీధులే కాదు ఊరూరా తిరిగారు. నిరవధికంగా భిక్షాటన చేశారు. దాదాపు 15 పైబడి ఇరుగుపొరుగు గ్రామాల్లో తిరిగి చికిత్సకు కావలసినంత సొమ్ము పోగు చేసి మిత్రుని కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదానికి గురైన వెంటనే అలోక్‌ను తొలుత బరంపురం ఎమ్కేసీజీ వైద్య కళాశాలలో చికిత్స కోసం భర్తీ చేశారు. ఉన్నతమైన చికిత్స అవసరం కావడంతో భువనేశ్వర్‌లో పేరొందిన ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు తాము పోగుచేసిన నగదును అలోక్ తల్లిదండ్రులకు అతని మిత్రులు అందజేశారు. మొత్తం మీద మిత్రుని వెన్నెముక చికిత్స కోసం అలోక్ మిత్ర బృందం సాయశక్తులా శ్రమించింది. వీరి అంకిత భావంపట్ల భగవంతుడు కరుణించి మిత్రుడు అలోక్ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరుగాడతాడని ఆశిద్దాం. -
విమానంలో కూడా మొదలు పెట్టేశారు
-
విమానాన్ని వదల్లేదు; వీడియో వైరల్
దోహా : ‘కాదేది కవితకనర్హం’ అన్నట్లు అడుక్కోవడానికి కూడా ప్రదేశంతో సంబంధం లేదని నిరూపించాడు ఓ 50 ఏళ్ల మధ్య వయస్కుడు. ఇంతకూ ఇతను అడుక్కున్నది ఎక్కడనుకుంటున్నారు...ఆకాశంలో ఎగురుతున్న విమానంలో. అవును విమానంలోనే అడుక్కుంటున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తూ వైరల్‌గా మారింది ఈ వీడియో. వీడియోలో ఉన్న దాని ప్రకారం దోహా నుంచి షిరాజ్ ప్రయాణిస్తున్న విమానంలో ఆకస్మాత్తుగా ఓ మధ్యవయస్కుడు లేచి చేతిలో ప్లాస్టిక్ పౌచ్ పట్టుకుని తన తోటి ప్రయాణికుల దగ్గరకు వెళ్లి అడుక్కోవడం ప్రారంభించాడు. కొందరు అతనికి డబ్బులు కూడా ఇచ్చారు. ఇంతలో ఎయిర్‌లైన్ సిబ్బంది వచ్చి అతన్ని వారించడంతో వెళ్లి తన సీటులో కూర్చున్నాడు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియో గురించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కొందరైతే ఏకంగా అడుకుంటున్న వ్యక్తిని పాకిస్తానీగా భావించి...‘ఈ ప్రయాణికుడు ప్రస్తుతం మన దేశంలో ఉన్న అవినీతికి నిదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి మనకంటూ కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకోకపోతే నిజంగా అది మన దేశానికి అవమానకరం’ అంటూ కామెంట్ చేసాడు. అయితే దన్యాల్ గిలానీ అనే ఒక పాకిస్తానీ అధికారి ఈ వీడియోలో అడుక్కుంటున్న వ్యక్తికి సంబంధించిన వివరాలను పోస్టు చేసాడు. ‘దోహా షిరాజ్ విమానంలో అడుక్కుంటున్న వ్యక్తి పాకిస్తానీ కాదు. అతను ఒక ఇరానియన్. అతను మాట్లాడుతున్న భాషా పార్సీ. అతన్ని ఉన్న పళంగా దేశం నుంచి తరలించారు. దాంతో చేతిలో చిల్లగవ్వ కూడా లేకపోవడంతో ఆ వ్యక్తి తన తోటి ప్రయాణికులను అడుక్కుంటున్నాడు’ అని పోస్టు చేసాడు. దోహా నుంచి షిరాజ్ వరకు ఖతార్ ఎయిర్వేస్ విమాన టిక్కెట్ ధర 2,000 - 3,000 ఖతారీ రియాల్స్(రూ. 55,875) వరకూ ఖర్చవుతుంది. టికెట్టు కొనే స్తోమత లేక అలా చేస్తున్నాడని కొందరు సానుభూతి తెలపుతన్న నేపధ్యంలో ఈ వ్యక్తి తమకు పేయింగ్ కస్టమర్(అంటే టికెట్టు కొన్న ప్రయాణికుడి)గా నిర్ధారించింది ఖతార్ ఎయిర్వేస్. -
దేశానికి సేవ చేశాం.. పింఛన్ రాక అడుక్కుంటున్నాం..
సాక్షి, కడప : ఈమె పేరు పార్వతమ్మ.. కడప నగరం ఐటీఐ సర్కిల్ సమీపంలో నివాసముంటోంది. ఈమె భర్త మాజీ సైనికుడు. దాదాపు పదేళ్ల నుంచి మిలిటరీ పింఛన్ పెట్టించండి మహాప్రభో అంటూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. నడవడానికి కూడా ఆస్కారం లేని ఈ పండుటాకును మనవరాలు శారద మూడు చక్రాల సైకిల్లో కూర్చోబెట్టుకుని తోసుకుంటూ వస్తోంది. పింఛన్ రాకపోవడంతో బిచ్చం ఎత్తుకుని బతుకుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుని తన కష్టాన్ని ఏకరువు పెట్టుకుంది. . -
అడుక్కుంటాను అనుమతివ్వండి
ముంబై : ప్రభుత్వం నాకు రెండు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి పోలీసు యూనిఫామ్‌లోనే అడుక్కునేందుకు నాకు అనుమతివ్వండి అంటు ముంబై కానిస్టేబుల్ ఒకరు పోలీసు ఉన్నతాధికారులకు ఒక వినతి పత్రం ఇచ్చారు. ముంబైకి చెందిన ద్యనేశ్వర్ అహిర్రావ్ తొలుత స్థానిక మురోల్ ఆయుధ విభాగంలో పనిచేసేవాడు. కొన్ని రోజుల కిందట ఇతన్ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి మార్చారు. సరిగా ఆ సమయంలోనే అతని భార్య కాలు విరగడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గాను మార్చి 20 నుంచి 22 వరకు సెలవు పెట్టాడు. ఈ విషయం గురించి ఇంచార్జికి ఫోన్లో తెలియజేసాడు. అనంతరం మరో ఐదు రోజులు కూడా సెలవు తీసుకున్నాడు. భార్యను ఆస్పత్రి నుంచి తీసుకువచ్చిన తర్వాత మార్చి 28న వచ్చి తనకు కేటాయించిన మాతోశ్రీలో విధుల్లో చేరాడు. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకూ అతనికి జీతం రాలేదు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో పోలీసు దుస్తుల్లోనే అడుక్కునేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా ద్యనేశ్వర్ మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగర్ రావుకు అలానే ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశాడు. ఆ ఉత్తరంలో తను సెలవు పెట్టడానికి గల కారణాలను వివరించాడు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అందువల్ల తనకు యూనిఫామ్‌లో అడుక్కునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాడు. దీని గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ ఇంచార్జికి తెలపకుండా విధులకు హాజరు కాని వారికి మాత్రమే జీతం ఇవ్వకుండా ఆపుతారు. అందువల్లే ద్యనేశ్వర్కు రెండు నెలలుగా జీతం ఇవ్వడం లేదని తెలిపారు. ద్యనేశ్వర్ రాసిన లేఖ -
అపాయింట్మెంట్ కోసం అడుక్కుంటున్నాడు
వైఎస్సార్ జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జాతీయ నాయకుల అపోయింట్మెంట్ కోసం అడుక్కుంటూ తిరుగుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంజద్ బాషా, రవీంద్రనాధ్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. కేవలం ఫోటో షూట్ కోసం ఢిల్లీ టూర్‌కి వెళ్లారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసి జాతీయ పార్టీల నాయకులు నవ్వుకుంటున్నారని చెప్పారు. విజయ్ మాల్యాను కలిసారా లేదా అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసిరితే ఇంత వరకు దానిపై స్పందన లేదని మండిపడ్డారు. ముందుగా చెప్పిన విధంగా రేపు వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకి రాజీనామా చేస్తున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాము ఉన్నందుకు గర్విస్తున్నామని తెలిపారు. చంద్రబాబును చూసి జాతీయ నాయకులు, ప్రజలు పారిపోతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు నాటకాలు ఆడటం మొదలెట్టాయని విమర్శించారు. అధికారం లోకి వచ్చాక ఒక్క హమీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలను మోసం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతి జిల్లాని హైదరాబాద్ చేస్తా అని చెప్పి..ఇంత వరకు కనీసం పట్నం కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత ఏ ఒక్కరికీ లేదని, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏపార్టీతో నైనా కలిసి పోరాడుతామని ఈ సందర్భంగా తెలిపారు. -
భిక్షాటనతో పాఠశాలలకు సాయం
అన్నానగర్ (చెన్నై): ముసలి వయసులో పిల్లలు వెలివేయడంతో ఆ వృద్ధుడు ఒంటరయ్యాడు. భిక్షాటనతో బతుకు బండి లాగిస్తున్నాడు. భిక్షమెత్తగా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని ఓ స్కూలుకు అంది స్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. తమిళనాడు, తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం సమీపంలోని ఆలంగినరుకి చెందిన భూల్‌పాండి(68). ఇతని భార్య సరస్వతి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. సరస్వతి 24 ఏళ్ల కిందట మృతి చెందింది. భూల్‌పాండి తన పిల్లలకి పెళ్లిళ్లు చేశాడు. క్రమంగా వారు అసహ్యించుకోవడంతో భూల్‌పాండి ఇంటి నుంచి బయటకి వచ్చాడు. ఆకలి తీర్చుకోవడానికి భిక్షమెత్తుకోవడం ప్రారంభించాడు. భిక్షాటనతో వచ్చిన డబ్బుతో పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు అందజేశాడు. నెల్లై, తూత్తుకుడి, తిరుచ్చి, తంజావూరు, నాగపట్టణం జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పలు పరికరాలను కొనిచ్చాడు. భూల్పాండితో మాట్లాడగా పెరుంతలైవర్ కామరాజర్ మీద ఉన్న అభిమానంతోనే భిక్షాటనతో పాఠశాలలకు సహాయం చేస్తున్నానన్నాడు. దాదాపు 20 వేల మొక్కలను నాటానన్నాడు. దినతంతి పేపర్ని చూసి తాను రాయడం, చదవడం నేర్చుకున్నానని చెప్పాడు. -
టాయిలెట్ కోసం ఆమె ఏం చేశారంటే..
పట్నా: సంకల్ప సిద్ధికి, నిబద్థతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు బిహార్‌కు చెందిన ఓ మహిళ. భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న అమీనా ఖటూన్ (40) అత్యంత పేదరికాన్ని సైతం ఎదిరించి టాయిలెట్ నిర్మాణం పూర్తి చేసిన వైనం ప్రముఖంగా నిలిచింది. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఎలా వున్నప్పటికి.. ఆమె సంకల్పానికి మాత్రం స్థానికులు, అధికారులు జేజేలు పలికారు. అంతేకాదు స్వచ్ఛ్ భారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మాణంకోసం ఆశ్రయిస్తే ఉదాసీనత ప్రదర్శించిన అధికారులకు చెంపపెట్టులా ఆ పనిని పూర్తి చేసి.. వారి ప్రశంసలందుకోవడం విశేషం. సౌపాల్ జిల్లా పత్రా గ్రామానికి చెందిన అమీనా స్వచ్ఛ్ భారత్ పథకం కింద టాయిలెట్ నిర్మించుకునేందుకు అధికారులను ఆశ్రయించారు. పలుమార్లు సంబంధిత అధికారులు చుట్టూ తిరిగినా వారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తానే స్వయంగా రంగంలో దిగి చుట్టుపక్కల గ్రామాల్లో భిక్షమెత్తుకుని మరీ తన ఇంట్లో టాయిలెట్ నిర్మించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆమె పట్టుదలకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు, ఇతర కార్మికులు టాయిలెట్ నిర్మాణ పనులను ఉచితంగా చేసిపెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే విషయం తెలుసుక్ను జిల్లా అధికారులు ఆదివారం ఆమెను ఘనంగా సన్మానించారు. ఒక చిన్న పిల్లవాని తల్లి, తన జీవనోపాధికోసం కార్మికురాలిగా పని చేస్తున్న నిరుపేద మహిళ చేసిన ప్రత్యేక ప్రయత్నం పట్ల అభినందనలు తెలిపారు. మరోవైపు బిహార్ రాష్ట్రం స్వచ్ఛ భారత్ లక్ష్యం అమలులో దిగువ స్థాయిలో ఉంది. లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ బహిరంగ మలమూత్ర విసర్జన పద్ధతినే అనుసరిస్తున్నారు. అయితే, అక్టోబర్ 2, 2019 నాటికి బిహార్‌ను ఓడీఎఫ్‌గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. కానీ...ఒక్క జిల్లాగా కూడా ఓడీఎఫ్ (ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ) గా ప్రకటితం కాకపోవడం గమనార్హం. కాగా మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా, 2014, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
విధి ఆడిన వింతనాటకం
సాక్షి, చెన్నై : విధి ఆడిన నాటకంలో ఇద్దరు బాలురు అనాథలయ్యారు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి హఠాన్మరణం ఓ వైపు, తల్లిని వెంటాడుతున్న కేన్సర్ మహమ్మారి మరో వైపు వెరసి పుస్తకాలను పక్కనపెట్టి ముక్కుపచ్చలారని పసి వయస్సులోనే కూలీలుగా మారారు. జన్మనిచ్చిన తల్లిని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం. చివరకు తల్లి తనువు చాలించడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు కూడా చేయించలేని ఆర్థిక దుస్థితితో తల్లడిల్లారు. బంధువులు, ఆప్తులు ముఖంచాటేయడంతో గత్యంతరం లేక ఆ ఇద్దరు భిక్షాటనకు దిగారు. తల్లి అంత్యక్రియలకు సాయం చేయండంటూ కన్నీటి పర్యంతంతో అభ్యర్థించారు. చివరకు మంచి హృదయాలు స్పందించడంతో తల్లికి ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు. గురువారం దిండుగల్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారకర ఘటన వివరాలు... దిండుగల్ జిల్లా ఎరియోడు సమీపంలోని మేట్టుపట్టికి చెందిన కాళియప్పన్ , విజయ దంపతులకు మోహన్ (14), వేల్ మురుగన్(13) అనే ఇద్దరు కుమారులు, కాళీశ్వరి కుమార్తె ఉన్నారు. బంధువులు, ఆప్తులతో ఆనందకరంగా సాగిన ఈ కుటుంబంలో తొమ్మిదేళ్ల క్రితం విషాదకర çఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో హఠాత్తుగా కాళియప్పన్ మరణించడంతో కుటుంబ భారం విజయకు బరువైంది. కుటుంబ పెద్ద దూరమైనా, ఆప్తులు ముఖం చాటేసినా, రెక్కల కష్టంతో పిల్లల్ని చదివించాలని తపన పడింది. తన స్తోమత మేరకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినా, కాల క్రమేనా విధి ఆడిన నాటకం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. పుస్తకాలు చేతబట్టాల్సిన కుమారుల్ని కూలి పనికి, రక్తం పంచుకుని పుట్టిన కుమార్తె అనాథ ఆశ్రమానికి పరిమితం చేయాల్సిన పరిస్థితి విజయకు ఏర్పడింది. కేన్సర్ మహమ్మారి : విజయను కేన్సర్ మహమ్మారి తాకింది. బ్రెస్ట్ కేన్సర్‌తో తల్లి బాధ పడుతుండడంతో ఆ ఇద్దరు బాలుర కష్టాలు మరింత జఠిలమయ్యాయి. ఇద్దరు మగ పిల్లలు ఎలాగైనా బతక గలరని భావించిన విజయ, తన కుమార్తెను మాత్రం రక్షించాలని ఆ దేవుడ్ని వేడుకుంది. ఇందుకు తగ్గట్టు ఒట్టన్ చత్రంలోని ఓ ఆశ్రమ వర్గాలు కాళీశ్వరి ఆలనాపాలన చూసుకునేందుకు సిద్ధమయ్యారు. క్రమంగా కేన్సర్ తీవ్రత పెరగడంతో ఆస్పత్రికి వెళ్ల లేనంతగా , మంచానికే పరిమితం అయ్యే స్థాయికి విజయ పరిస్థితి చేరింది. తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్ల లేని పరిస్థితుల్లో బంధువులు, ఆప్తుల్ని కలిసి వేడుకున్నారు. వారిలో మాన వత్వం కొరవడింది. ఇక, చేసేది లేక ఇరుగు పొరుగున ఉన్న మానవతావాదుల సాయంతో దిండుగల్ ఆస్పత్రిలో చేర్పించారు. అమ్మకు వెన్నంటి ఉంటూ ఆ ఇద్దరు పిల్లలు సాయం అందించారు. వైద్యులు సైతం విజయకు వైద్య పరీక్షలు అందించారు. అయితే, ఫలితం శూన్యం. భిక్షాటనతో : చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండా, సర్కారు వారి వైద్యంతో కాలం నెట్టుకు వచ్చిన ఆ ఇద్దరు పిల్లల్లో గురువారం ఉదయం పిడుగు పడ్డట్టు పరిస్థితి మారింది. విజయ ఇక, లేదన్న సమాచారంతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆస్పత్రిలోని వార్డులో మంచం మీద విగతజీవిగా పడి ఉన్న తల్లి మృతదేహం వద్ద బోరున విలపించారు. వీరి వేదనను చూసిన పక్కనే మరో మంచం మీదున్న మరో రోగి కుటుంబీకులు, ఆ పిల్లల బంధువులకు సమాచారం అందించారు. కనీసం ఆ ఇద్దరు పిల్లల్ని ఓదార్చేందుకు సైతం బంధువులు, ఆప్తులు రాలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని స్థితిలో తమ తల్లికి ఎలా అంత్యక్రియలు చేయగలమన్న వేదనతో ఆ మంచం వద్దే కన్నీటి పర్యంతంతో నిలుచుండి పోయారు. చివరకు ఆ ఇద్దరు తమ తల్లికి అంత్యక్రియలు జరిపించేందుకు సహకరించాలని ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగుల కుటుంబీకుల వద్ద చేతులు చాపక తప్పలేదు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ భిక్షాటనకు దిగారు. మానవతావాదులు, అనేక మంది రోగులు తమ వద్ద ఉన్న తలా పదో, ఇరవయ్యే ఇచ్చి సాయం అందించే పనిలో పడ్డారు. ఈ ఇద్దరు పిల్లలు బిక్షాటన చేస్తుండడాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. తాము సైతం అంటూ సాయం అందించడమే కాదు, ఆస్పత్రి అధికారి మాలతి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ఆమె అంత్యక్రియలకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆ తదుపరి స్పత్రి వర్గాలు మృతదేహాన్ని దిండుగల్ ప్రభుత్వ ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. తల్లిని, తండ్రిని కోల్పోయి, చెల్లిని ఆశ్రమంలో వదలి పెట్టిన ఈ ఇద్దరు బాలురు అనాథలుగా గమ్యం ఎటో అన్న ట్టు ఆస్పత్రి ఆవరణలో కూర్చుని ఉండడం మనస్సున్న హృదయాల్ని కలచివేసింది. -
మా పొట్ట కొట్టొద్దు..
సాక్షి, హైదరాబాద్: గంగిరెద్దులు ఆడించి పొట్ట పోసుకుంటున్న తమను అడుక్కునే వారి కింద లెక్కకట్టి పోలీసులు అరెస్టు చేస్తున్నారని గంగిరెద్దుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి ఈటల రాజేందర్‌ని కలసి వారి సమస్యలను విన్నవించారు. ఇలా అయితే సంక్రాంతికి గంగిరెద్దులు ఆడించడం కష్టమవుతుందని అరెస్ట్ చేయకుండా చూడాలని మంత్రిని కోరారు. దీనిపై ఈటల స్పందిస్తూ.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీనిచ్చారు. భిక్షమెత్తే వారికి పునరావాసం, పని కల్పిస్తామన్నారు. -
బా..బ్బా..బ్బాబు..బాన్
నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిషేధాన్ని పొడిగిస్తూ నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) నేపథ్యంలో తొలిసారిగా నవంబర్ 8న భిక్షాటనపై నిషేధం విధించారు. అప్పట్లో నిర్దేశించిన రెండు నెలల గడువు ముగుస్తుండడంతో మరో రెండు నెలలు పొడిగించారు. వాహన చోదకులు, పాదచారులకు యాచకుల వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ నెల 7 నుంచి అమలులో ఉండే ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిషేధాన్ని పొడిగిస్తూ నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా... భిక్షాటనకు సంబంధిం చిన ప్రజాహిత వ్యాజ్యాలు ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్నాయి. పేదరికం వల్ల భిక్షాటన చేయడం నేరం కాదని ప్రాథమికంగా అభిప్రాయపడిన న్యాయస్థానం దీనిపై ఈనెల 9న తీర్పు వెలువరించనుంది. అది నగర పోలీసుల నిషేధాజ్ఞలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. గ్లోబ ల్ ఎంటర్‌పెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) నేపథ్యంలో తొలిసారిగా నవంబర్ 8న భిక్షాటనపై నిషేధం విధించారు. అప్పట్లో నిర్దేశించిన రెండు నెలల గడువు ముగుస్తుండటంతో మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాహనచోదకులు, పాదచారులకు బిచ్చగాళ్ల వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. ఈ నెల 7 నుంచి రెండు నెలల పాటు అమలులో ఉండే ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. పలువురు బిచ్చగాళ్ళు అభ్యంతరకరంగా బిచ్చమెత్తుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిలో కొందరు చిన్న పిల్లలు, దివ్యాంగుల్ని సైతం ప్రత్యేకంగా నియమించుకుంటున్నట్లు తెలిసిందన్నారు. వీరు పాదచారులు, వాహనచోదకుల నుంచి బిచ్చం తీసుకునేందుకు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. వీరి చర్యలు కొన్ని సందర్భాల్లో పాదచారులు, వాహనచోదకులకు ప్రమాదహేతువులుగా మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, జంక్షన్లలో బిచ్చమెత్తుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు కొత్వాల్ ప్రకటించారు. ఈ నిషేధం మరో రెండు నెలల పాటు లేదా ఉపసంహరించే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. వీటిని ఉల్లంఘించిన వారిపై ఐపీసీలోని 188 సెక్షన్‌తో పాటు హైదరాబాద్ పోలీసు చట్టం, తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్, జ్యువైనల్ జస్టిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం ఓ ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే గరిష్టంగా నెల రోజుల జైలు లేదా రూ.200 జరిమానా లేదా రెండూ విధించే ఆస్కారం ఉంటుంది. నేరం కాదన్న న్యాయస్థానం... నగరంలో బిచ్చగాళ్ళపై నిషేధం కొనసాగుతుండగా.. ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు ఇవ్వనున్న తీర్పు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలోని బిచ్చగాళ్ళ ప్రాథమిక హక్కుల సాధన కోసం, ఆ వృత్తిని నేరంగా పరిగణించకూడదంటూ అక్కడి హైకోర్టులో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ హరిశంకర్ల నేతృత్వంలోని ధర్మాసనం గతేడాది నవంబర్ 28న కీలక వ్యాఖ్యలు చేసింది. పేదరికం కారణంగా భిక్షాటన చేస్తే నేరంగా చూడకూడదంటూ వ్యాఖ్యానించింది. ఎవరైనా వ్యక్తులు మరొకరి బలవంతంపై కానీ లేదా సాధారణంగా బతికేందుకు అవసరమైన అన్ని వనరులు, శక్తిసామర్థ్యాలు ఉండి కూడా బిక్షాటన చేస్తే దాన్ని నేరంగా పరిగణించవచ్చంటూ పేర్కొంది. ఈ కేసు వాదోపవాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. యాచకులు నిజంగా పేదరికంలో ఉన్నారా? లేదా? అనేది నిర్థారించేందుకు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో ఈ వ్యాజ్యాలపై తీర్పును ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. దీనిపై తీర్పు వెలువడితే ఆ ప్రభావం నగర పోలీసుల ఉత్తర్వులపై ఏ మేరకు ఉంటు ందో వేచిచూడాలి. మరోపక్క దీనికి సంబంధించిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ప్రాథమిక వ్యాఖ్యల నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు సాధారణంగా బతికేందుకు అవసరమైన వనరులు ఉన్నప్పటికీ బిక్షాటన చేయడాన్ని నేరంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. జైళ్ళశాఖ ఆధీనంలో ఆనందాశ్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా బిచ్చగాళ్ళకు ఆ వనరుల్ని ప్రభుత్వం కల్పిస్తోంది. వాటిని వినియోగించుకోకుండా రహదారులపై భిక్షాటన చేయడం నేరమే అవుతుంది’ అని అన్నారు. -
అనాథ పిల్లలతో భిక్షాటన!
హైదరాబాద్: అనాథ పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారనే ఫిర్యాదుతో వనస్థలిపురంలోని గ్రేషియస్ పారడైస్ అనాథ ఆశ్రమంపై అధికారులు దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో బాలల సంరక్షణ కమిటీ అధికారులు ఈ దాడులు జరిపారు. ఆశ్రమ నిర్వాహకుడు, మాజీ ఉద్యోగి సత్యానంద్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఆశ్రమంలోని18 మంది అనాథ పిల్లలను నింబోలి అడ్డలోని ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. -
తల్లి వైద్యం కోసం బాలిక భిక్షాటన
♦ దారితప్పి బేగంపేట రైల్వేస్టేషన్లో ప్రత్యక్షం ♦ తల్లిదండ్రులకు అప్పగింత కర్నూలు(హాస్పిటల్): కన్నతల్లి ఆసుపత్రిలో అనారోగ్యంతో తల్లడిల్లుతుండటాన్ని చూడలేకపోయిన ఓ ఎనిమిదేళ్ల బాలిక భిక్షాటన చేసి డబ్బు సంపాదించాలని బయలుదేరి తప్పిపోయింది. చివరకు రైల్వే పోలీసులు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారుల సహకారంతో తల్లిదండ్రుల చెంతకు చేరింది. వివరాలిలా ఉన్నాయి. మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన బసవ, రాములమ్మలు వ్యవసాయ కూలీలు. రాములమ్మ 8వ నెల గర్భంతో ఉండటంతో మంత్రాలయం ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు రక్తం తక్కువగా ఉండడంతో ఆసుపత్రిలో చేరింది. తల్లి అనారోగ్యంతో ఉందని, తాను ఎలాగైనా డబ్బు తెచ్చి ఆమెను బాగు చేసుకోవాలని కూతురు సుజాత(8) భావించింది. ఈ మేరకు భిక్షాటన చేస్తూ మంత్రాలయం రైల్వేస్టేషన్లో రైలెక్కింది. అలా వెళ్లిన ఆమె చివరకు బేగంపేట రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. గత 21న అక్కడి రైల్వేస్టేషన్ పోలీసులు పాపను గుర్తించి అదుపులో తీసుకున్నారు. బాలిక వివరాల మేరకు బుధవారం రాత్రి కర్నూలు తీసుకొచ్చి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. గురువారం ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, ఐసీపీఎస్ అధికారి శారదలు సంయుక్తంగా తల్లిదండ్రులకు బాలికను అప్పగించారు. -
భిక్షాటనతో జీవనం సాగిస్తున్న నటుడు
తమిళసినిమా: సినిమా మోహం ఓ చిరు నటుడిని బిచ్చమెత్తుకునేలా చేసింది. నటుడు భరత్, సంధ్య జంటగా నటించిన కాదల్ చిత్రం 2004లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో ఒక చిన్న వేషం వేసి అందరినీ అలరించిన పల్లుబాబు ఇప్పుడు గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఆ చిత్రంలో సినిమా అవకాశాలను వెతుక్కుంటూ చెన్నైకి వచ్చి ఓ మ్యాన్షన్‌లో ఉండే యువకుడిగా పల్లుబాబు నటించాడు. అందులో విరుచ్చికాంత్ అనే పేరును పెట్టుకుని నేను నటిస్తే హీరోగానే, ఆ తరువాత రాజకీయం, సీఎం అంటూ అతను చెప్పే డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే అతను మాత్రం పాపులర్ కాలేకపోయాడు. కాదల్ చిత్రం తరువాత పల్లుబాబుకు అవకాశాలు రాలేదు. దీంతో పేదరికం, తల్లిదండ్రుల మరణంతో పల్లుబాబు మానసికంగా కుంగిపోయాడు. చివరికు కడుపు నింపుకోవడానికి స్థానిక చూలైమేడులోని గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడని అతడిని చూసిన స్థానికులు తెలిపారు. -
రైతు కంట నీరు
-
'సుమ' భిక్షాటన చేసింది.. ఫైన్ కట్టాల్సిందే!
చెన్నై: ఆలయ ఏనుగులతో భిక్షాటన చేయించడం వన్యమృగ హింసా చట్టం కింద నేరమని, ఇందుకు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెన్నై హైకోర్టులో శేఖర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తన వద్ద ఉన్న సుమ, రాణి అనే పేరుగల ఏనుగులు ఉండగా.. సుమను కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఉత్సవాల కోసం గతేడాది మే 17 నుంచి 30 వరకు పంపానని పిటిషనర్ తెలిపాడు. ఆ ఏనుగుతో పాటు ఇద్దరు మావటి వాళ్లను కూడా పంపాడు. అయితే, ఉత్సవాల తర్వాత సుమ అనే ఏనుగును తిరిగి పంపకుండా, భిక్షాటన చేయించారు. ఇలా చేసినందుకు అధికారులు శేఖర్ యాజమాన్య హక్కును రద్దు చేసి, జరిమానా విధించారు. అయితే, ఏనుగు భిక్షాటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, రద్దు చేసిన యాజమాన్య హక్కును తిరిగి ఇప్పించాలని, తన నుంచి వసూలు చేసిన జరిమానా సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ఏనుగులతో భిక్షాటన చేయించడం చట్ట ప్రకారం నేరం కాబట్టి జరిమానా విధించడం సమంజసమేనని తీర్పు ఇచ్చారు. -
మా గురించి పట్టించుకోరా
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆందోళన బాట ప్రచారంపైనే ప్రభుత్వం దృష్టి నేడు స్పిల్ వే కాంక్రీట్ పనులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నిరసన వ్యక్తం చేసేందుకు సన్నద్ధమవుతున్న నిర్వాసితులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పునరావాసంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ పోలవరం నిర్వాసితులు నెలన్నర రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం రోడ్లను దిగ్భంధనం చేసిన నిర్వాసితులు గురువారం భిక్షాటన కార్యక్రమం ద్వారా తమ నిరసన తెలిపారు. పునరావాస ప్యాకేజీని సంపూర్ణంగా అమలు చేస్తే గ్రామాలు విడిచి వెళ్లిపోతామని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రాజెక్టు పనుల పేరిట హడావుడి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పునరావాసం గురించి పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రాజెక్టు స్పిల్‌వే పనులు ప్రారంభించేందుకు వస్తున్న సీఎం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లేందుకు నిర్వాసితులు సన్నద్ధం అవుతున్నారు. ముంపు గ్రామాలు 130.. పునరావాసం కల్పించింది 8 గ్రామాలకే.. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మొత్తం 130 గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ముంపుబారిన పడతాయి. ఆయా గ్రామాలవారికి çపునరావాసం ప్యాకేజీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకూ ఏడు గ్రామాలను, పోలవరం కుడి కాలువలో వల్ల ముంపుబారిన పడే మరో గ్రామాన్ని మాత్రమే ఖాళీ చేయించారు. ఈ గ్రామాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. తమకు రావాల్సిన రాయితీలు ఇవ్వడం లేదని 45 రోజులుగా నిర్వాసితులు పోలవరంలో దీక్షలు చేస్తున్నారు. అన్ని ముంపు గ్రామాల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ నిర్ధిష్టమైన ప్రకటన రాలేదు. పునరావాస కేంద్రాలకు వచ్చి ఏడాది దాటినా మౌలిక వసతులు కల్పించ లేదని, ఇంకా కొందరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా భూమికి భూమి, యువతీ యువకులకు రాయితీలు చెల్లించలేదని, పోడు భూములకు పట్టాలివ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఖాళీ చేయించని 122 గ్రామాల ప్రజలు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాలు కావడంతో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. ప్రధానంగా రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కరువయ్యాయని, అధికారులకు చెప్పినా ముంపు గ్రామాలు కావటంతో పట్టించుకోవటంలోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కాలనీలోనూ నిర్వాసితులే.. పునరావాస కాలనీల్లోనూ వారు నిర్వాసితులుగానే ఉండాల్సి వస్తోంది. గోదావరితో అనుబంధం, తాతముత్తాతల కాలం నుంచి ఊరితో పెనవేసుకున్న బంధాన్ని వదులుకుని కన్నీటితో పునరావాస కాలనీకి చేరిన నిర్వాసితులకు కన్నీరు మాత్రం ఆగటం లేదు. అన్నీ వదులుకుని వచ్చామని, అయినా అధికారులు తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చేగొండిపల్లి నిర్వాసితులు తమ కోసం నిర్మించిన ఇళ్లు నాసిరకంగా ఉన్నాయని, తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. పైడిపాక, రామయ్యపేట నిర్వాసితుల కోసం పేరంపేట రోడ్డులో 265 ఇళ్లు నిర్మించారు. పైడిపాక గ్రామస్తులకు 189, రామయ్యపేట గ్రామస్తులకు 76 ఇళ్లు నిర్మించి వారందరినీ ఈ కాలనీకి తరలించారు. పునరావాస కేంద్రంలో ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పిన అధికారులు చివరకు నాసిరకం ఇళ్లను నిర్వాసితులకు అందజేశారు. గత సెప్టెంబర్‌లో వర్షాలు కురిసిన సమయంలో ఇంటి శ్లాబుల నుంచి నీరు గదుల్లోకి కారుతున్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే ఇంటికి సంబంధించి ఏర్పాటు చేసిన మెట్లకు గాని ఇంటి పైన గాని పిట్టగోడలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఒక బాలుడు ఇంటిపైకి ఎక్కుతుండగా తూలి కిందపడిపోగా చేయి విరిగింది. కిటికీలకు, ద్వారబంధాలకు తలుపులు లేవని, కొన్నింటికి తలుపులు ఏర్పాటు చేసిన గొళ్లాలు పెట్టలేదని మహిళలు పేర్కొన్నారు. కాలనీలో ఇళ్లు ఇష్టం వచ్చినట్లుగా నిర్మించారని, ఒక ఇంటికి, మరొక ఇంటికి అసలు సంబంధం లేదని పేర్కొన్నారు. ఒక ఇంట్లో రెండు గుమ్మాలు ఏర్పాటు చేస్తే, మరో ఇంట్లో నాలుగు గుమ్మాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే తమ ఇంటి స్థలం ఎంతవరకు ఉందో కొలిచి ఇస్తే కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటామన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంటికి ఆనుకుని నిర్మించిన మరుగుదొడ్ల పరిస్థితి మరీ ఘోరం. బాత్రూమ్ పైకప్పుపై సిమెంట్ ప్లేటు వేసి వదిలివేశారు. ప్లేట్‌కు ప్లేట్‌కు మధ్య ఖాళీ ఏర్పడి, వర్షం కురిస్తే వర్షపు నీరంతా అందులోకి వస్తోంది. అలాగే తాము సొంతంగా కట్టుకున్న మరుగుదొడ్లకు బిల్లులు ఇవ్వడం లేదని నిర్వాసితుల్లో కొందరు వాపోతున్నారు. ఈ కాలనీలో పాఠశాల ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించి భవనం కూడా కట్టారు. అయితే దానిలో సిమ్మెంట్బస్తాలు నిల్వ చేస్తున్నారు. కాలనీలో బడి కట్టకపోవడంతో వారంతా పిల్లలను ప్రైవేట్‌పాఠశాలల్లో చేర్పించారు. అయితే హడావుడిగా తాజాగా ఒక ఉపాధ్యాయుడిని నియమించి కమ్యూనిటీ హాల్లో పాఠశాల ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే ప్రైవేట్‌పాఠశాలలో విద్యార్థులు చేరిపోవడంతో ఈ పాఠశాలకు 10 నుంచి 15 మంది విద్యార్థులకు మించి వెళ్లడం లేదు. నష్టపరిహారం ఇవ్వలేదు పైడిపాకలో మా ఇంటికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. సర్వే కూడా చేసుకుని వెళ్లారు. ఇంకా 14 మందికి నష్టరిహారం అందాల్సి ఉంది. మమ్మల్ని తీసుకువచ్చి పునరావాస కాలనీలో పడేసి పట్టించుకోవడం లేదు. గూడా అచ్చమ్మ, పైడిపాక పునరావాస కాలనీ వా’ట ఇల్లు కట్టలేదు నాకు చేగొండపల్లి పునరావాస గ్రామంలో ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టలేదు. అడిగితే వేరేచోట కట్టిన ఇల్లు ఇస్తామంటున్నారు. నాకు ఇచ్చిన స్థలంలోనే ఇల్లు కట్టాలంటే అధికారులు కుదరదంటున్నారు. కొవ్వాసు అనిల్‌కుమార్, చేగొండపల్లి నిర్వాసితులు -
భిక్షాటన చేస్తూ నిరసన
కర్నూలు (న్యూసిటీ): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లు సోమవారం మహాత్మాగాంధీ విగ్రహం ఎదురుగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ముందుగా శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బ్రహ్మేశ్వర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లను ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. ఇదిలా ఉండగా.. కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరవధిక దీక్షలు 18వ రోజుకు చేరాయి. వీరికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కేసీ రాముడు, అధికార ప్రతినిధి పీబీవీ సుబ్బయ్య, కో కన్వీనర్ ఎస్ఎండీ రఫిక్, రామకృష్ణ, రవూఫ్, షేక్షావళి మద్దతు తెలిపారు. నిరాహారదీక్షలో నాయకులు రంగస్వామి, కె.రామక్రిష్ణ కూర్చున్నారు. లెక్చరర్లు శివరంగ ప్రసాద్, సోమేష్, ఆనంద్, భువనీశ్వరీ, రమేష్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
భిక్షాటన చేస్తూ నిరసన
కర్నూలు (ఓల్డ్‌సిటీ): సగం నెల గడిచినా పింఛన్ డబ్బు అందకపోవడంతో కర్నూలులోని 47వ వార్డుకు చెందిన వృద్ధులు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. స్థానికులు సుమలత, ఫరీదా మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పింఛన్ డబ్బులు అందకపోవడంతో జ్వరం వచ్చినా, జబ్బులు వచ్చినా వైద్యం చేయించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలకు నోట్ల కట్టలు అందుతుంటే, వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్ కూడా అందకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో శేషమ్మ, పుల్లమ్మ, బిచ్చమ్మ, చిన్నలక్ష్మిదేవి, కరీంబాషా తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో ‘పాప’ం.. అంజలి
కురవి : తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయింది.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో మంచం పట్టిన తల్లి ఆదివారం మృతిచెందింది. ఇప్పుడు ఆలన పాలన చూసేవారు లేక అనాథగా మిగిలింది ఐదేళ్ల చిన్నారి. స్థానికుల సహాయంతో ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి తల్లి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లా కురవి మండలం తట్టుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జిలకర నారాయణ, సుభద్ర కూతురు స్వరూప(40). చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. నారాయణ ఆమెను పెంచి పెద్దచేసి వివాహం చేశాడు. కొన్ని రోజుల తర్వాత భర్తను వదిలేసిన స్వరూప ఆ తర్వాత చిన్నా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి కూతురు అంజలి జన్మించింది. స్వరూప, చిన్నా హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తూ జీవించేవారు. నాలుగేళ్ల క్రితం చిన్నా అనారోగ్యంతో మృతి చెందగా, స్వరూప అంజలితో హైదరాబాద్‌లోనే ఉంటూ కూలీ పని చేస్తుండేది. నాలుగు నెలల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో పుట్టిల్లయిన తట్టుపల్లికి వచ్చింది. అప్పటికే తండ్రి మరణించగా, అతడి ఇంట్లోనే కూతురుతో కలిసి ఉంటోంది. కాగా, స్వరూప ఆరోగ్యం మరీ క్షీణించడంతో ఐదేళ్ల కుమార్తె అంజలి ఇంటింటికీ తిరిగి అన్నం అడుక్కుని వచ్చి తల్లికి తినిపించేది. మిగిలిన అన్నం తాను తినేది. ఈ క్రమంలో ఆదివా రం స్వరూప కూడా మృతిచెందింది. చందాలు పోగుచేసి అంత్యక్రియలు.. తల్లి అంత్యక్రియల కోసం ఇంటì æపక్కన ఉండే ఎ మ్మార్పీఎస్ నాయకుడు మందుల శ్రీను, వెంపటి చంద్రయ్య, అనుముల రాములు, ఎడెల్లి వెంకన్న త దితరుల సహాయంతో అంజలి ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసింది. వెయ్యి రూపాయలు పోగయినా, అవి సరిపోకపోవడంతో స్థానిక జర్నలిస్టులు అధికారులకు తెలియజేశారు. దీంతో తహసీల్దార్ జన్ను సంజీవ రూ.3 వేలు, సీఐ శ్రీనివాస్ రూ.3 వేలు, ఎస్సై అశోక్, సీనియర్ పాత్రికేయుడు దొంతు రమేష్, సర్పంచ్ లక్పతి రూ.2 వేల చొప్పున అందజేయగా, అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అనాథగా మిగిలిన అంజలి... చిన్నప్పుడే తండ్రిని.. ఇప్పుడు తల్లిని కోల్పోయిన అంజలి అనాథగా మిగిలింది. ఆకలికి తట్టుకోలేక తల్లి మృతదేహం పక్కనే కూర్చుని అన్నం తింటుండడాన్ని చూసిన స్థానికులు బోరున విలపించారు. దీనంగా తల్లి మృతదేహాన్ని పట్టుకుని లే..లెమ్మంటూ పిలుస్తుండడాన్ని చూసిన వారు తట్టుకోలేకపోయారు. నా అనే వాళ్లు లేని అంజలికి ఇప్పుడు దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అంజలి విషయాన్ని జర్నలిస్టులు చైల్డ్‌లైన్ సంస్థకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్ అధికారులు లేదా ఎవరైనా దాతలు అంజలిని తీసుకెళ్లి పోషించాలని స్థానికులు కోరుతున్నారు. లేదా ఏదైనా హాస్టల్లో చేర్పించి చదివించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆశ్రమం ముసుగులో దగా
చిన్నారులతో భిక్షాటన అనాథలతో చెలగాటం నిర్వాహకుడి నిర్వాకం పోలీసులు పట్టుకోవడంతో వెలుగుచూసిన వైనం ఆశ్రమాన్ని సీజ్ చేసిన అధికారులు రామచంద్రాపురం: పేరుకు ఓ అనాథ ఆశ్రమం. అక్కడ ఆశ్రమం ఉన్నట్టు ఎవరికీ తెలియదు. పైగా అందులో ఎంత మంది పిల్లలున్నారు? వారు ఏం చేస్తున్నారన్నదీ నిన్నటి వరకు రహస్యమే.. నేడు అసలు గుట్టు రట్టు కావడంతో అందరి దృష్టి ఆ అనాథ ఆశ్రమంపైనే పడింది. ఐటీ కారిడార్లలో భిక్షాటన చేస్తున్న చిన్నారులను పోలీసులు పట్టుకోవడం.. అధికారులు ఆశ్రమాన్ని సీజ్ చేయడం చకచకా జరిగిపోయాయి.. వివరాలిలా ఉన్నాయి.. అమీన్పూర్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర పేరిట ఓ అనాథ ఆశ్రమాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన జెమ్స్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని సుమారు ఐదేళ్లుగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశ్రమంలో 20 మంది వరకు చిన్నారులున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల చిన్నారులు కూడా ఇందులో ఆశ్రయం పొందుతున్నారు. వీరందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అయితే సెలవు రోజుల్లో వీరి చేత భిక్షాటన చేయిస్తుండటం గమనార్హం. ‘అనాథ ఆశ్రమానికి చేయూత నివ్వండి’ అనే స్టిక్కర్ ఉన్న డబ్బాలను వీరి చేతికిచ్చి రోడ్లపై భిక్షాటన చేయిస్తున్నారు. బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీసులు ఐటీ సెక్టార్లో భిక్షాటన చేస్తున్న ఇద్దరు చిన్నారులను పట్టుకోవడంతో అసలువిషయం బయటకు వచ్చింది. ఆ చిన్నారులు ఉంటుంది అమీన్పూర్ ప్రాంతం అని తెలియడంతో వెంటనే వారు రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాథ ఆశ్రమంపై దాడిచేయడంతో ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. అసలు ఆశ్రమానికి అనుమతే లేదని పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఆశ్రమం ఉన్నట్టు స్థానికులకు కూడా తెలియలేదంటే ఎంత గుట్టుగా నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది. సేకరించిన డబ్బు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. ఆశ్రమంలో ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు తెలియలేదా? లేక చూసిచూడనట్టు వ్యవహరించారా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అనాథ ఆశ్రమాల పేరిట అక్రమ దందాలు చేసేవారిపై నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. భిక్షాటన సమయంలో ప్రమాదం జరిగితే అందుకు బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గురువారం సదర్ ఆశ్రమాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అనుమతిలేని అనాథ ఆశ్రమాలను గుర్తించి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అనుమానం వచ్చి పట్టుకున్నాం ఐటీ కారిడార్లలో ఇద్దరు చిన్నారులు చేతిలో డబ్బాలు పట్టుకొని భిక్షాటన చేస్తున్నారు. ఈ చిన్నారులు ఇక్కడికి ఎలా వచ్చారన్న అనుమానంతో వారి వద్దకు వెళ్లి విచారించగా తమను ఫాస్టర్ జెమ్స్ వదిలివెళ్లారని తిరిగి సాయంత్రం తీసుకువెళతారని చెప్పారు. తాము రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందించాం.అమీన్పూర్లో ఆశ్రమానికి వెళ్ళిచూడాగా అందులో ఇరవై మంది అనాథ విద్యార్థులు ఉన్నారు. - ఎస్ఐ వెంకటేశ్, గచ్చిబౌలి ఎనిమిది నెలల క్రితం వచ్చాను నేను ఎనిమిది నెలల క్రితం ఈ ఆశ్రమానికి వచ్చాను. స్థానిక ఫాదర్ స్కూల్లో నర్సరీ చదువుతున్నాను. తనను ఇక్కడ బాగానే చూసుకుంటున్నారు. - కన్నయ్య, కల్హేర్ ఈ డబ్బు మా కోసమే మాది మహబూబ్‌నగర్. కొంత కాలంగా అనాధ ఆశ్రమంలో ఉంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. తమను సారు ప్రధాన కూడళ్ళ వద్ద దింపుతారు. తాము ఆశ్రమానికి సహాయం చేయాల్సిందిగా కోరుతాం. వచ్చిన డబ్బు మాకోసమే ఖర్చు చేస్తారు. - వెంకటేష్, మహబూబ్‌నగర్ డబ్బు సేకరించి సారుకు ఇస్తాం నేను స్థానిక ఫాదర్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాను. మా సారు జెమ్స్ మమ్మల్ని బాగానే చదివిస్తారు. మంచిగా చదవకపోతే కొడతారు. సెలవు దినాల్లో తమను గచ్చిబౌలి ప్రాంతంలో దింపుతారు. తాము డబ్బులు సేకరించి సారుకు ఇస్తాం. ఆ డబ్బులతో తమకు పుస్తకాలు, దుస్తులు కొనిస్తుంటారు. - అనురాగ్సేత్ విద్యార్థి చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరం చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరం. అలా చేసిన వారిపై కఠిన చర్చలు తప్పవు. గచ్చిబౌలి ఎస్ఐ చిన్నారులను పట్టుకుని విచారిస్తే అన్ని విషయాలు వెలుగుచూశాయి. అధికారులు పట్టనట్టు వ్యవహరించడం వల్లే అక్రమ దందాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అనుమతి లేని ఆశ్రమాలు సుమారు 30 వరకు ఉన్నాయని సమాచారం ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలి. - ఎంఎస్. చంద్ర, కార్పెడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ -
జీతాలు చాలకపోతే భిక్షాటన చేయండి
అనంతపురం ఎడ్యుకేషన్ : జీతాలు చాలకపోతే భిక్షాటన చేయమనండి .. అంతే కానీ అడ్మిషన్ల సమయంలో, టీసీలు ఇచ్చే సమయంలో ఇలా డబ్బు వసూలు సరికాదని హెచ్ఎంలను ఉద్ధేశించి డీఈఓ అంజయ్య మండిపడ్డారు. స్థానిక సైన్స్ సెంటర్లో మంగళవారం ఎంఈఓల సమావేశం నిర్వహించా రు. అయితే విద్యాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సమావేశాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని, కొన్ని పాఠశాలల్లో అడ్మిషన్ల ఫీజులు వసూలు చేస్తున్నారని, టీసీలు ఇచ్చేందుకు డబ్బులు దండుకుంటున్నారన్నారు. విద్యా వ్యాపారాన్ని అడ్డుకోలేని అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఈఓ హెచ్‌ఎంలపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్నా చాల్లేదా.. అలా అయితే అడుక్కోండంటూ మండిపడ్డారు. విద్యాహక్కు చట్టం ప్రకారం రూపాయి కూడా వసూలు చేయకూడదనే విషయం తెలీదా అసహనం వ్యక్తం చేశారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో గుర్తింపు ఒకచోట ఉంటే తరగతులు మరోచోట నిర్వహిస్తున్నారని, అసలే గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ దృష్టికి తెచ్చారు. దీంతో అలాంటి వాటిని వెంటనే సీజ్ చేయాలని డీఈఓ ఎంఈఓలను ఆదేశించారు. ఎన్నిమార్లు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సమావేశాన్ని రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు పట్టుబట్టారు. అక్కడే బైఠాయించారు. చివరికి డీఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కుమార్ నాయుడు, రమేష్, నగర కార్యదర్శి సూర్యచంద్రయాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున, నాయకులు ఆలం, రాజు, విష్ణు పాల్గొన్నారు. -
గమ్యానికి 'ఊతం'!!!
మానవ సంబంధాలు కరెన్సీ బంధనాల్లో చిక్కుకుంటున్నారుు. చివరకు మానవత్వం కూడా నోట్ల కట్టల వాసన ఆస్వాదిస్తూ భూగోళానికి దూరంగా పారిపోతోంది. ..ఆప్యాయత.. అనురాగం.. మమకారాలు బ్యాంకు లాకర్లలో శాశ్వతంగా నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారుు. దీనికి ఎన్నో ఉదాహరణలు నిత్యం సమాజంలో కనిపిస్తూనే ఉన్నారుు. అరుుతే అక్కడక్కడా.. అప్పుడప్పుడూ తోక చుక్కల్లా.. ఇంద్రధనసుల్లా స్వచ్ఛమైన ప్రేమ.. రుచికరమైన వెనీలా ఫ్లేవర్‌ను కురిపిస్తూనే ఉంది. శ్రీరామ్మూర్తి అనే వికలాంగుడు ఎక్కడ నుంచో ఎన్నో ఏళ్ల క్రితం ఒంగోలుకు చేరుకున్నాడు. అరుునవాళ్లంతా కాదు పొమ్మంటే చక్రాల బండిపై తిరుగుతూ భిక్షాటన చేస్తున్నాడు. కొంతకాలానికి అఖిల అనే మహిళ తోడైంది. నీకు నేనున్నానంటూ అతని చేతికర్ర తీసుకుంది. స్త్రీ, పురుషుల బంధానికి డబ్బు.. భవంతులు.. సౌకర్యాలు అక్కరలేదని రెండు మనసులు ఒకటైతే చాలంది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి భిక్షాటన చేస్తున్నారు. కష్టసుఖాలు మాట్లాడుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈయన వికలాంగుడైనా.. ఆధార్ కార్డు ఉన్నా ప్రభుత్వం పింఛను అందించడంలేదు. - సాక్షి, ఒంగోలు -
'బెగ్గర్ ఫ్రీ' డ్రైవ్ చేపట్టిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను 'బెగ్గర్ ఫ్రీ' సిటీగా మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. నగరంలో అడుక్కునే వారుండకూడదనే యోచనతో ఆ సమస్య శాశ్వత పరిష్కారానికి కసరత్తు చేపట్టింది. యాచక వృత్తిని నిషేధించి అందులో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు వారికి పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు జీహెచ్ఎంపీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. యాచకులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి సదుపాయాలు సమకూర్చడం.. పని చేయగలిగిన వారికి అవకాశాలు కల్పించడం... వ్యాధి పీడితులుంటే చికిత్స చేయించడం వంటి కార్యక్రమాలతో ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించాలని భావిస్తోంది. ఇన్ని చేసినా ఆ అలవాటు మానలేని వారిని ఆ ‘దారి’ నుంచి తప్పించేందుకు ఎవరూ వారికి ధర్మం చేయకుండా ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని భావిస్తోంది. బ్యానర్లు.. హోర్డింగ్‌ల ద్వారా 'భిక్షాటనను ప్రోత్సహించవద్దు’ అంటూ ప్రచారం చేస్తోంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ కొద్దిరోజుల క్రితం ఓ సర్వే కూడా నిర్వహించింది. హైదరాబాద్‌లో మొత్తం 14వేల మంది యాచకులు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. అయితే 98 శాతం మంది నకిలీ బిచ్చగాళ్లేనట. ఇక వాళ్ల ఏడాది టర్నోవర్ ఎంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే. బిచ్చగాళ్లు ఆదాయం ఏడాదికి రూ.24 కోట్లు పైమాటే. వీళ్లు అడుక్కోవటంతో పాటు డ్రగ్స్, వ్యభిచారం, మనీ లెండింగ్ ద్వారా కూడా సంపాదిస్తున్నారట. ఇక యాచకుల రోజువారి ఆదాయం హీనపక్షంగా చూసినా 2వేలు ఉంటుందట. కాగా నిజమైన యాచకులను గుర్తించి వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు కూడా బెగ్గర్ ఫ్రీ సిటీ సాకారాని చేయూత అందించేందుకు ముందుకు వస్తున్నాయి. -
భిక్షగాడిగా మారిన శాండల్‌వుడ్ హీరో!
బెంగళూరు: ప్రముఖ కన్నడ హాస్య నటుడు శరణ్ మారువేషంలో బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేశాడు. కానీ ఇది నిజంగా కాదు తను నటిస్తున్న కొత్త చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆయన భిక్షాటనకు దిగాడు. పవన్ ఒడయార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నటరాజ సర్వీస్ అనే కొత్త సినిమా కోసం ఆయన ఈ ఫీట్ చేశాడు. తనను ఎవరూ గుర్తు పడ్డకుండా కళ్లకు నల్లద్దాలు తదితర దుస్తులను ధరించి నగరంలోని గాంధీబజార్, హనుమంతనగర్ ప్రాంతాల్లో పాట పాడుతూ భిక్షాటన చేశాడు. అనంతరం ఈ విషయన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ విషయంపై చిత్ర హీరో శరణ్, డైరెక్టర్ పవన్ ఒడయార్లు స్పందిస్తూ శరణను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడానికి అలా చేశామని ప్రజలు కూడా తాము నిజంగానే భిక్షాటన చేస్తున్నట్లు భావించారని తెలిపారు. భిక్షాటనలో రూ. 128లు వచ్చాయని హీరో శరణ్ సరదాగా తెలిపాడు. -
వామ్మో! వాట్సాప్ ను వాళ్లూ వాడుకుంటున్నారు!
అబుధాబి: మొబైల్ మెసెజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. నిన్నమొన్నటివరకు రోడ్డుపక్కన పేవ్మెంట్ల మీద, కూడళ్ల వద్ద, థియేటర్ల వద్ద అడుక్కున్న యాచకులు ఇప్పుడు వాట్సాప్నూ వదిలిపెట్టడం లేదు. సున్నితమైన మనస్సు, దానగుణం ఉన్న వారు లక్ష్యంగా ఏకంగా వాట్సాప్ లో కరుణరసాత్మకమైన కథనాలు వండివారుస్తున్నారు. అమ్మ జబ్బుకు, అక్కకు రోగం, అన్నకు వైకల్యం అన్న తరహాలో అత్యంత దయనీయ కథనాలను గుర్తుతెలియన నంబర్ల ద్వారా పంపిస్తూ డబ్బులు అడుక్కుంటున్నారు. ఎంత తోచితే అంత దానం చేయాలని వేడుకుంటూ ఏకంగా బ్యాంకు అకౌంట్ నంబర్లు కూడా వాట్సాప్‌లకు పంపిస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో దుబాయ్‌లో ఈ ట్రెండ్ మరింత ముదిరింది. ప్రజల జాలిగుణాన్ని సొమ్ము చేసుకొని డబ్బు దోచుకునే ఉద్దేశంతో మోసగాళ్లే ఇలాంటి సందేశాలను వాట్సాప్ నంబర్లకు కుప్పలు తెప్పలుగా పంపిస్తున్నారని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని అబుదాబి డీజీపీ (ఆపరేషన్స్) ఆమిర్ మహమ్మద్ ఆల్ ముహైరి చెప్పారు. వాట్సాప్ లో తనకు నిత్యం ఇలాంటి దీనతీదీనమైన కథనాలతో సందేశాలు వస్తుండటంతో ఓ మహిళ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసపూరితమైన సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, మీడియా దుబాయ్ ప్రజలకు సూచించింది. -
దారి చూపుతున్న పాకెట్ మనీ
ఆదర్శం విద్యార్థికి చదువు అనేది విలువైన బహుమతి. విజ్ఞానం నుంచి మాత్రమే కాదు విషాదం నుంచి కూడా విలువైన పాఠాలు నేర్చుకునేవాళ్లే నిజమైన విద్యార్థులవుతారు. చెన్నైలోని ‘కలిగి రంగనాథన్ మౌంట్‌ఫోర్డ్ హైయర్ సెకండరీ స్కూలు’ విద్యార్థులను గమనిస్తే వారు నేర్చుకునే పాఠాలు పుస్తకాలకు మాత్రమే పరిమితం కాలేదని, జీవితం నుంచి కూడా నేర్చుకుంటున్నారనే విషయం అర్థమవుతుంది. గత సంవత్సరం చెన్నై వీధుల్లో భిక్షాటన చేసిన సరోజ... ఇప్పుడు పెరంబూర్ బస్‌స్టాప్ సమీపంలో రకరకాల ఫ్యాషన్ వస్తువులు అమ్ముతున్నారు. ఒక్క సరోజ మాత్రమే కాదు భిక్షాటనే ప్రపంచంగా బతికిన కొద్దిమంది యాచకులు ఇప్పుడు సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సొంతకాళ్ల మీద నిలబడ్డామనే తృప్తి వారి కళ్లలో బలంగా కనిపిస్తోంది. ‘కలిగి రంగనాథన్ మౌంట్‌ఫోర్డ్ హైయర్ సెకండరీ స్కూల్’ విద్యార్థులు తమ పాకెట్‌మనీతో యాచకులను మార్చడానికి, వారిని కొత్త దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. యాచకవృత్తిని వదిలి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్లలో సరోజ నుంచి నాగర్ వరకు ఎందరో ఉన్నారు. ‘‘ఒకప్పుడు రూపాయి కోసం కూడా చేయి చాపాల్సి వచ్చేది. ఇప్పుడు నేను సొంతకాళ్ల మీద నిలబడటమే కాదు కష్టాల్లో ఉన్నవారికి ఎంతో కొంత సహాయం చేయగలుగుతున్నాను. ఇదంతా ఆ పిల్లల చలవే. వారిది చల్లని మనసు’’ అంటోంది సరోజ. రోశమ్మ అనే యాచకురాలిని తమ స్కూల్లో హౌస్‌కీపర్ ఉద్యోగంలో చేర్పించడం ద్వారా ఆమెను యాచకవృత్తి నుంచి బయటికి వచ్చేలా చేశారు విద్యార్థులు. చిరిగిన మురికి దుస్తులతో దేవాలయాల దగ్గర యాచించే నాగర్ ఇప్పుడు ఆ పనికి స్వస్తి చెప్పాడు. ఒక స్టడీ టేబుల్ మీద చాక్లెట్లు అమ్ముతూ ఎవరినీ యాచించకుండా పొట్ట నింపుకుంటున్నాడు. అతడిలో మార్పు రావడానికి కారణం స్కూలు పిల్లలు. అయితే అందరు యాచకులు ఒకేలా స్పందించలేదు. ‘‘మాకు ఎవరి సహాయం అక్కర్లేదు’’ అని కొందరు ఎప్పటిలాగే యాచననే నమ్ముకున్నారు. అలాంటి వాళ్లలో కూడా కొందరిని మాటలతో మార్చారు ఆ విద్యార్థులు. ఆర్థిక సహాయం చేసి చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొనేలా చేయడమే కాదు... ఉద్యోగాలు చేయాలనుకున్నవారికి సెక్యూరిటీ గార్డ్, స్వీపర్...మొదలైన ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నారు. ఒక చిన్న సంఘటన విద్యార్థుల్లో పెద్ద మార్పు తీసుకువచ్చింది. ఒకసారి స్కూలు ముందు చిన్న అబ్బాయి, అమ్మాయి అడుక్కుంటూ కనిపించారు. ఈ దృశ్యం విద్యార్థుల మనసులను కదిలించింది. ఇక అప్పటి నుంచి ‘బెగ్గర్‌లెస్ సొసైటీ’ నినాదంతో పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఉపాధ్యాయులు కూడా ఇందుకు మద్దతు పలికారు. ‘‘ఆనందం అనేది ఆటపాటల్లోనే కాదు...సేవ చేయడంలో కూడా ఉంటుందనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను’’ అంటాడు క్రిస్టీ అనే విద్యార్థి. ‘‘యాచకులను చాలామంది దూరం పెడతారు. నిజానికి వారి దగ్గరికి వెళ్లి నాలుగు మంచి మాటలు చెబితే... వారు యాచనకు దూరం అవుతారు. కొత్త జీవితాన్ని మొదలుపెడతారు’’ అంటోంది రోషిణి అనే విద్యార్థిని. ‘‘నేను మనిషిని అని చెప్పుకోవడం కంటే మానవత్వంతో కూడిన మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయడం ముఖ్యం. ఈ దిశలో అడుగులు వేయడానికి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం’’ అంటున్నారు స్కూల్ ప్రిన్సిపల్ అనిత డేనియల్. విద్యార్థుల దగ్గర ధన సహాయాన్ని పొందిన వాళ్లలో కొందరు యాచకులు మళ్లీ కనిపించలేదు. కొందరు చిన్న చిన్న షాపులు పెట్టుకొని సొంతకాళ్ల మీద నిలబడాలని ప్రయత్నిస్తున్నారు గానీ మద్యానికి బానిసై పక్కదోవ పడుతున్నారు. అయితే ఇవేమీ విద్యార్థులను నిరాశపరచడం లేదు. మార్పు అనేది ఒక్క అడుగుతో. ఒక్కరోజుతో మొదలు కాదనే విషయం వారికి తెలుసు. అందుకే భవిష్యత్ పట్ల ధీమాగా ఉన్నారు. బెగ్గర్‌లెస్ సొసైటీ గురించి చిన్న వయసులోనే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అందరితోనూ ‘శభాష్’ అనిపించుకుంటున్నారు. -
ఎంగిలిపడేదెట్టా..?
♦ కాస్త దయచూపండి ♦ నాడు గౌరవంగా బతికి నేడు ఆదరణ కరువై భిక్షాటన ♦ రోడ్డున పడేసిన కరువు ♦ యాచిస్తూ కడుపు నింపుకుంటున్న యక్షగానం కళాకారులు ♦ మాచవరంలో కళాకారుల పరిస్థితి దయనీయం ‘ఆకలేస్తుందమ్మా... కాస్త అన్నంపెట్టండి.. చంటిపిల్లలు ఆకలికి ఆగలేక పోతున్నరు’.. అంటూ కళాకారులు భిక్షాటన చేస్తున్నారు. గత రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో గ్రామాలకు గ్రామాలు వలస పోవడంతో కళాకారులకు ఆదరణ లేకుండా పోయింది. మెదక్ మండలం మాచవరానికి చెంది న యక్షగానం కళాకారుడు రామస్వామి బుధవారం మెదక్ ఏరియా ఆస్పత్రిలో పట్టెడన్నం కోసం మనవడితో కలిసి భిక్షాటన చేయడం అందరిని కలిచివేసింది. ముఖానికి రంగు వేసు కుని స్టేజీ మీద.. హరిచంద్రుడి సన్నివేశంలో ‘ఆలుపిల్లలేమైరో ఆ నాటి వైభమేమాయెనో’ అంటూ రామస్వామి పాట పాడితే అందరూ కంటతడి పెట్టేవారు. అలా కథలు చెప్పుకుంటూ గౌరవంగా బతికిన ఈయన నేడు కాలేకడుపుతో భిక్షాటన చేస్తున్నాడు. అందరి మన్ననలు పొందిన ఈయన.. ఇప్పుడు భిక్షాటన చేయడంపై పలువురు చలించిపోయారు. కొందరు ఆయన్ను ఆప్యాయంగా పిలిచి యోగక్షేమాలు తెలుసుకున్నారు. - మెదక్ మెదక్: రంగస్థల నాటక రంగాన్ని ఓ ఊపు ఊపిన కళాకారులు నేడు వీధిన పడ్డారు. కళారంగానికి ఆదరణ కరువై రోడ్డున బిచ్చమెత్తుకుంటున్నారు. ‘ఆలుపిల్లలేమైయిరో... అంత వైభవమేమాయెనో’ అంటు ఒకనాడు రంగస్థలిపై హరిచంద్ర యక్షగానంలోని పాటలు పాడి అందర్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖానికి రంగులు వేసి, తమదైన హావాభావాలతో జనాన్ని మెప్పించారు. కథలు చెబుతూ నవ్వించారు.. ఏడ్పించారు. కళానైపుణ్యంతో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు. కళాప్రదర్శనతో వచ్చేడబ్బులతో గౌరవంగా బతికారు. అలాంటి గత రెండేళ్లుగా కరువు కన్నెర్ర చేయడంతో కాలేకడుపులకు ఆకలి తీర్చుకునేందుకు భిక్షాటన చేస్తున్నారు. కరువు కాటుకు పల్లెలన్నీ చిన్నబోయాయి. ఉపాధి వెతుక్కుంటూ జనమంతా ఇళ్లకు తాళాలు వేసి పట్నం బాట పట్టడంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. వీరి కళాప్రదర్శనలను తిలకించే దిక్కులేకుండా పోయింది. వీరిని పలుకరించే వారే లేకుండా పోయారు. ప్రదర్శనలివ్వక.. డబ్బులు లేక పస్తులుంటున్నారు. ఆకలికేకలతో అలమటిస్తున్నారు. బువ్వ దొరక్క వీరి కుటుంబాల్లోని చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మెదక్ మండలం మాచవరం గ్రామంలో సుమారు 40కి పైగా కళాకారుల (మాష్టుల) కుటుంబాలున్నాయి. వీరు ఊరూరు తిరుగుతూ పగటివేళలో యక్షగానాలు, బాగోతాలు ఆడేవారు. ఒక్కో ఊరిలో వారం, పదిరోజులపాటు బాలనాగమ్మ, హరిచంద్ర, మాందాత, వీదినాచారి, శ్రీకృష ్ణతులాభారం, అల్లిరాణి వంటి ఎన్నో కళారూపాలను ప్రదర్శించే వారు. ముఖాలకు రంగులు వేసుకుని రంగస్థలిపై పాటలు పాడి ఎందరినో ఆకట్టుకునేవారు. హరిచంద్ర యక్షగానంలోని... ‘ఆలుపిల్లలేమైయిరో అంతవైభవమేమైయెనో..’ అంటూ హరిచంద్రుడి వేషధారణలో పాటలు పాడుతుంటే ప్రేక్షలంతా కంటతడిపెట్టేవారు. కానీ రెండేళ్లుగా కరువు కోరల్లో చిక్కుకుపోవడంతో జనమంతా పల్లెను వదిలి పోవడంతో వీరికి గడ్డుపరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంట్లో కిలో బియ్యం కూడా లేవని, చేతిలో చిల్లిగవ్వ లేక వంట చేసుకోలేక పస్తులుంటున్నామని చెబుతున్నారు. తామెలాగోలా జీవితాన్ని గడిపిస్తామని... చంటిపిల్లల పరిస్థితి దయనీయంగా ఉందంటూ వాపోతున్నారు కళాకారులు. రోడ్డున పడ్డ తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరతున్నారు. -
అందరుండి అనాథ అయిన వృద్ధుడు
వెంకటాపురం : మండల పరిధిలోని ఎదిర గ్రామానికి చెందిన ఉమ్మనేని నరేందర్(60)కు అందరూ ఉన్నారు. కాని అనాథగా మిగిలాడు. బిక్షాటన చేసి కడుపు నింపుకుంటున్నాడు. ఈ దుస్థితి పగవారికి కూడా రాకూడదని పలువురు చెబుతున్నారు. ఎదిర గ్రామానికి చెందిన ఉమ్మనేని నరేందర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నా రు. కూతుళ్లకు పెళ్లి చేయటంతో అత్తారిళ్లకు వెళ్లిపోయారు. ఇద్దరు కొడుకులు బాబురావు, సాంబశివరావులు పెళ్లి చేసుకోని ఒకరు బెస్తగూడెం, మరొకరు వీరాపురం గ్రామాల్లో నివాసముంటున్నారు. కన్న తండ్రి నరేందర్‌ను సక్రమంగా చూసుకోలేదు. అన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటివేశారు. గత రెండు సంవత్సరాల నుంచి భద్రాచలం రామాలయంలో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం నరేందర్ ఆరోగ్యం క్షిణించింది. భద్రాచలం రామాలయం నుంచి వెంకటాపురం చేరుకున్నాడు. దీనికి తమ గ్రామస్తుడైన జాడి పోశాలు సాయం చేశాడు. కుటుంబ సభ్యులు ఎవరు చేరదీయక పోవటంతో వెంకటాపురం బస్టాండ్‌లోని చెట్టు కింద సోమ్మసిల్లి పడిపోయాడు. కొందరు వ్యక్తులు పోన్ ద్వారా ఎస్సై సముద్రాల జితేందర్‌కు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ ఆ ప్రాంతానికి చేరుకుని ఆ వృద్ధుడ్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. -
అధికారుల అదుపులో 50మంది బాలలు
ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : బిహార్ నుంచి వచ్చి భిక్షాటన చేస్తున్న 50 మంది పిల్లలను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని బిహార్‌కు చెందిన 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరు తమ పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న అధికారులు.. పోలీసుల సహాయంతో పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పిల్లలు అక్కడున్నవారికి చెందినవారేనా కాదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
భిక్షాటన మొత్తం 10 లక్షలు కాలిపోయాయి
-
భిక్షాటన మొత్తం 10 లక్షలు కాలిపోయాయి
సాక్షి, ముంబై: పాపం.. ఏళ్ల తరబడి భిక్షాటన చేసి సంపాదించుకున్న డబ్బు ఎలుక పుణ్యమాని తగులబడిపోయింది. అదేం చిన్నా చితకా కాదు.. ఏకంగా రూ. 10 లక్షలు. కళ్యాణ్‌లోని మారూమూల ప్రాంతంలోని చిన్న గుడిసెలో నివాసముంటున్న మహ్మద్ రెహమాన్, అతని భార్య ఫాతిమా.. సమీపంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో భిక్షాటన చేస్తూ.. ఇంత మొత్తాన్ని కూడబెట్టారు. మంగళవారం కరెంటుపోవటంతో.. దీపం పెట్టుకుని పడుకున్నారు. అయితే.. బుధవారం తెల్లవారుజామున ఎలుకలు దీపాన్ని పడగొట్టడంతో.. గుడిసెకు నిప్పంటుకుంది. ఈ దంపతులు ప్రాణాలతో బయటపడ్డా.. సంచుల్లో దాచి గోడల్లో కుక్కి పెట్టిన సంపాదన కూడా కాలిపోయింది. సంచుల్లో ఉన్న నోట్లను బట్టి రూ.10 లక్షల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
బెగ్గింగ్ చేస్తున్న పోస్ట్గ్రాడ్యుయేట్లు
బెంగళూరు: నేటి రోజుల్లో అడుక్కోవడం ఆకర్షణీయమైన వృత్తిగా మారిపోయింది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా ఈ వృత్తినే ఆశ్రయించడం మరింత ఆశ్చర్యకర విషయం. ముఖ్యంగా భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు వీధుల్లో తిరుగుతూ, ఫుట్‌పాత్‌లపై కూర్చొని నిర్మొహమాటంగా అడుక్కుంటున్నారు. ఎందుకని ఆరాతీస్తే... తాను ఓ కంపెనీలో పనిచేసినప్పుడు నెలకు ఆరువేల రూపాయల జీతం వచ్చేదని, ఇప్పుడు అడుక్కోవడం వల్ల నెలకు 12 వేల రూపాయలకుపైగా సంపాదిస్తున్నానని ఓ పోస్ట్‌గ్రాడ్యుయేట్ వెల్లడించాడు. తన కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల గురించి ఏకరవు పెట్టడం ద్వారా తనకు కుటుంబ పోషణానికి సరిపడ సంపాదన వస్తోందని ఆయన వివరించాడు. ఏదైనా కంపెనీల్లో ఎనిమిది గంటలు పనిచేసినా ఇంతకన్నా ఎక్కువ సంపాదిస్తానన్న నమ్మకం లేదని అన్నాడు. ఆధునిక సాంకేతిక విప్లవం పరిఢవిల్లిన నేటి ఐటీ యుగంలో సాధారణ చదువులు పూర్తి చేసిన తమకు సరైన ఆధరణ, సరిపడ ఉద్యోగావకాశాలు లేవని బెగ్గింగ్ ప్రధాన వృత్తిగా చేసుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు చెబుతున్నారు. అక్షరాస్యులు, ముఖ్యంగా ఉన్నత విద్యావేత్తలు కూడా వీధుల్లో అడుక్కుంటున్నారన్న విషయం ఓ ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడవడంతో కర్ణాటక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ రంగంలోకి దిగి అడుక్కుంటున్న విద్యావేత్తలకు కౌన్సిలింగ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా వారు ఇలాంటి విషయాలు వెల్లడించారు. ఉద్యోగార్హులకు ప్రైవేటు కంపెనీల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని అధికారులు చెబుతున్నా వారు వినిపించుకోవడం లేదు. 14, 15 వేల రూపాయల ఉద్యోగం ఇప్పిస్తారా ? అని ప్రశ్నిస్తున్నారు. చిన్నదైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినా అడుక్కోవడం మానేస్తామని చెబుతున్నారు. వారందరిని జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేవరకు కౌన్సిలింగ్ ఇస్తామని, ఈ విషయంలో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 10,680 మంది అడుక్కోవడంపైనే జీవిస్తున్నారు. రాజధాని నగరం బెంగళూరులోనే 1,368 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,547 మంది అక్షరాస్యులు అడుక్కుంటుండగా, వారిలో 459 మందిలో గ్రాడ్యుయేట్ల నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నవారు ఉన్నారు. 23 మంది వివిధ సాంకేతిక వృత్తి కోర్సుల్లో డిప్లొమా చేసిన వారున్నారు. ఒక్క బెంగళూరు నగరంలోనే 77 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 25 మంది డిప్లొమా హోల్డర్లు, 206 మంది ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్ చదవుకున్న వారు ఉన్నారు. వీరంతా ఎక్కువ వరకు నగరంలోని ఎంజీ రోడ్డులో, ఇతర వాణిజ్య ప్రాంతాల్లోనే అడుక్కుంటున్నారు. ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక నగరంగా ప్రసిద్ధి చెందిన పొరుగు నగరం మైసూరులో కూడా ఉన్నత విద్యావంతులు బెగ్గింగ్నే వృత్తిగా పెట్టుకున్నారు. వారిలో 169 మంది పోస్ట్గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఉన్నారు. వారిలో 68 మంది మహిళలు ఉండడం గమనార్హం. తాగుడుకు బానిసలై, పనిచేసే జవసత్వాలు ఉడిగిపోయిన కారణంగా అడుక్కోవడంలో అర్థముంది. కేవలం కుటుంబ పోషణార్థమే అడుక్కుంటున్నారంటే నిజంగా ఆలోచించాల్సిన అంశమే.