Madhya Pradesh Beggar Started Collecting Money To Buy Bike For His Wife, Details Inside - Sakshi
Sakshi News home page

Viral video: భిక్షాటనతో భార్యకు ఊహించని సర్‌ప్రైజ్‌..

Published Wed, May 25 2022 4:44 PM | Last Updated on Wed, May 25 2022 7:03 PM

Beggar Started Collecting Money To Buy Bike For His Wife - Sakshi

ఓ వ్యక్తి తనకు నచ్చిన బైక్‌ కోసం చిల్లర డబ్బలు పోగు చేసి మరీ కొనుకున్న ఉదంతాన్ని ఇటీవల చూశాం. ఇష్టమైన వాటిని పొందడం కోసం కష్టపడి సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఖరీదైన వస్తువులు కొనుక్కున్న సందర్భాలూ చూశాం. అవన్నీ ఒక ఎత్తైయితే ఇక్కడొక యాచకుడు భార్య కోసం అత్యంత ఖరీదైన బైక్‌ కొన్నాడు. అదీ కూడా భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో కొనడం విశేషం.

వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సంతోష్ కుమార్ సాహు అనే యాచకుడు శారీరకంగా వికలాంగుడు. దీంతో అతను అన్నింటికీ తన భార్య మున్నిపైనే ఆధారపడుతుంటాడు. అధ్వాన్నమైన రోడ్డుపై తన ట్రై సైకిల్‌ని భార్య నెట్టలేక ఇబ్బందిపడుతుండటం సాహు చూస్తుంటాడు. అదీగాక ఈ సైకిల్‌ నెడుతుంటే వెన్ను నొప్పి వస్తుందంటూ సాహు భార్య తరుచు బాధుపడుతుండేది. దీంతో ఆమె కోసం ఎలాగైన మంచి బైక్‌ కొనాలని నిశ్చయించకున్నాడు.

అనుకున్నదే తడవుగా గత నాలుగేళ్లుగా బస్ స్టేషన్‌లు, దేవాలయాలు, మసీదులలో భిక్షాటన చేసి చాలా డబ్బు సంపాదించాడు. ఈ మేరకు అతను సూమారు రూ. 90 వేలు ఖరీదు చేసే మోపెడ్‌ని కొని తన భార్యకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఈ జంట ఇప్పుడూ ఈ కొత్త మోపెడ్‌ పై సియోని, భోపాల్‌, ఇండోర్‌ వంటి ప్రాంతాలకు వెళ్లాలని తెగ ప్లాన్‌లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది.

(చదవండి: ఒంటి చేత్తో క్లైంబింగ్‌ వాల్‌ని అధిరోహించిన మహిళ.. వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement