Moped Rider
-
భిక్షాటనతో భార్యకు ఊహించని సర్ప్రైజ్: వీడియో వైరల్
ఓ వ్యక్తి తనకు నచ్చిన బైక్ కోసం చిల్లర డబ్బలు పోగు చేసి మరీ కొనుకున్న ఉదంతాన్ని ఇటీవల చూశాం. ఇష్టమైన వాటిని పొందడం కోసం కష్టపడి సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఖరీదైన వస్తువులు కొనుక్కున్న సందర్భాలూ చూశాం. అవన్నీ ఒక ఎత్తైయితే ఇక్కడొక యాచకుడు భార్య కోసం అత్యంత ఖరీదైన బైక్ కొన్నాడు. అదీ కూడా భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో కొనడం విశేషం. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్లోని చింద్వారాకు చెందిన సంతోష్ కుమార్ సాహు అనే యాచకుడు శారీరకంగా వికలాంగుడు. దీంతో అతను అన్నింటికీ తన భార్య మున్నిపైనే ఆధారపడుతుంటాడు. అధ్వాన్నమైన రోడ్డుపై తన ట్రై సైకిల్ని భార్య నెట్టలేక ఇబ్బందిపడుతుండటం సాహు చూస్తుంటాడు. అదీగాక ఈ సైకిల్ నెడుతుంటే వెన్ను నొప్పి వస్తుందంటూ సాహు భార్య తరుచు బాధుపడుతుండేది. దీంతో ఆమె కోసం ఎలాగైన మంచి బైక్ కొనాలని నిశ్చయించకున్నాడు. అనుకున్నదే తడవుగా గత నాలుగేళ్లుగా బస్ స్టేషన్లు, దేవాలయాలు, మసీదులలో భిక్షాటన చేసి చాలా డబ్బు సంపాదించాడు. ఈ మేరకు అతను సూమారు రూ. 90 వేలు ఖరీదు చేసే మోపెడ్ని కొని తన భార్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ జంట ఇప్పుడూ ఈ కొత్త మోపెడ్ పై సియోని, భోపాల్, ఇండోర్ వంటి ప్రాంతాలకు వెళ్లాలని తెగ ప్లాన్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. A beggar from Chhindwara in Madhya Pradesh bought a moped worth Rs 90,000 for his wife after she complained of backache @ndtv@ndtvindia pic.twitter.com/9srzxKrFCx — Anurag Dwary (@Anurag_Dwary) May 25, 2022 (చదవండి: ఒంటి చేత్తో క్లైంబింగ్ వాల్ని అధిరోహించిన మహిళ.. వీడియో వైరల్) -
దండం పెట్టాడు.. దండన తప్పించుకున్నాడు
పాక్ చాంగ్: మొసలికి చిక్కి, శరణన్న ఏనుగును.. హుటాహుటిన వచ్చి కాపాడతాడు విష్ణుమూర్తి.. గజేంద్ర మోక్షంలో. మరి, గజేంద్రులే భీకరంగా ఘీంకరిస్తూ మృత్యుదేవతల్లా మీదికొస్తే! ఏ దేవుడు కాపాడతాడు? పాశ్చాత్య దేశాల్లోనైతే ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. అదే ఆసియాలో.. అందునా భారత్ కు అతి సమీపాన ఉన్న థాయిలాండ్ లోనైతే ఐడియా ఇట్టే తడుతుంది! కోపంగా తన మీదికి దూసుకొచ్చిన ఏనుగుల గుంపునకు భక్తితో (నిజానికి భయంతో) దండాలు పెట్టి తప్పించుకున్నాడో ధన్యుడు. ధాయిలాండ్ లోని ప్రఖ్యాత ఖావో యై నేషనల్ పార్కులో చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలేం జరిగిందంటే దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఖావో పార్కులో వందలాది జంతువులు ఆశ్రయం పొందుతున్నాయి. పార్క్ లోనే 50 కిలోమీటర్ల పరిధిలోని సఫారీలో సందర్శకులు.. బైకులు, కార్లలో వెళ్లి ఎంచక్కా జంతువుల్ని ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాటుచేశారు నిర్వాహకులు. అలా బైకెక్కి పార్కులో తిరుగుతున్న ఓ వ్యక్తిని ఏనుగుల గుంపు అడ్డగించింది. కోపంగా అతని వైపు దూసుకొచ్చింది. నిలువెల్లా వణికిపోయిన ఆ రైడర్.. చేతులు జోడించి ఏనుగుల గుంపునకు దండాలు పెట్టాడు. 'నన్నేమీ చెయ్యొద్ద'ని వేడుకున్నాడు. అతడి 'భయ'భక్తికి మెచ్చిన ఏనుగులు రైడర్ ను ప్రాణాలతో వదిలేసి వెళ్లిపోయాయి. అదే రోడ్డుపై నిలిచి ఉన్న మరో కారు కెమెరాలో ఈ దృశ్యాలలు రికార్డయ్యాయి. సదరు రైడర్ రావడానికి ముందు.. కొన్ని బైకులపై వచ్చిన ఆకతాయిలు కొందరు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగులను చిరాకు పెట్టారట! అసహనానికి గురికావటం వల్లే ఏనుగులు రైడర్ వైపు దూసుకెళ్లాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఉదంతంతో ఖావో పార్క్ లో బైకులు, కార్లను నిషేధించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.