బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు.
హైదరాబాద్ క్రైం: బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మహ్మద్ అష్ఫాఖ్(43) అనే వ్యక్తి గత కొంతకాలంగా మతిస్థిమితం లేక బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతని చెవిలోంచి రక్తం వస్తోందని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అష్ఫాఖ్ మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.