భిక్షాటన మొత్తం 10 లక్షలు కాలిపోయాయి | Sacks Of Cash Burnt In Fire At A Beggar's House Near Mumbai | Sakshi
Sakshi News home page

భిక్షాటన మొత్తం 10 లక్షలు కాలిపోయాయి

Published Fri, Jan 15 2016 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

భిక్షాటన మొత్తం 10 లక్షలు కాలిపోయాయి

భిక్షాటన మొత్తం 10 లక్షలు కాలిపోయాయి

సాక్షి, ముంబై: పాపం.. ఏళ్ల తరబడి భిక్షాటన చేసి సంపాదించుకున్న డబ్బు ఎలుక పుణ్యమాని తగులబడిపోయింది. అదేం చిన్నా చితకా కాదు.. ఏకంగా రూ. 10 లక్షలు. కళ్యాణ్‌లోని మారూమూల ప్రాంతంలోని చిన్న గుడిసెలో నివాసముంటున్న మహ్మద్ రెహమాన్, అతని భార్య ఫాతిమా.. సమీపంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్‌లో భిక్షాటన చేస్తూ.. ఇంత మొత్తాన్ని కూడబెట్టారు. మంగళవారం కరెంటుపోవటంతో.. దీపం పెట్టుకుని పడుకున్నారు.

అయితే.. బుధవారం తెల్లవారుజామున ఎలుకలు దీపాన్ని పడగొట్టడంతో.. గుడిసెకు నిప్పంటుకుంది. ఈ దంపతులు ప్రాణాలతో బయటపడ్డా.. సంచుల్లో దాచి గోడల్లో కుక్కి పెట్టిన సంపాదన కూడా కాలిపోయింది. సంచుల్లో ఉన్న నోట్లను బట్టి రూ.10 లక్షల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement