సాక్షి, హైదరాబాద్: గంగిరెద్దులు ఆడించి పొట్ట పోసుకుంటున్న తమను అడుక్కునే వారి కింద లెక్కకట్టి పోలీసులు అరెస్టు చేస్తున్నారని గంగిరెద్దుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి ఈటల రాజేందర్‌ని కలసి వారి సమస్యలను విన్నవించారు. ఇలా అయితే సంక్రాంతికి గంగిరెద్దులు ఆడించడం కష్టమవుతుందని అరెస్ట్ చేయకుండా చూడాలని మంత్రిని కోరారు. దీనిపై ఈటల స్పందిస్తూ.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీనిచ్చారు. భిక్షమెత్తే వారికి పునరావాసం, పని కల్పిస్తామన్నారు.