
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దోచుకున్న సొమ్మును ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ‘‘కర్ణాటకకు డబ్బు పంపారు. నేనే ప్రత్యక్ష సాక్షి. టీఆర్‌ఎస్ పార్టీ అకౌంట్‌లో రూ.870 కోట్లు ఎక్కడివి?. సొంత విమానం కొనడానికి వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఈటల ప్రశ్నించారు. ధరణి తెచ్చి భూములను కేసీఆర్ కుటుంబం కబ్జా చేస్తోందన్నారు. ఆలయాలు, వక్ఫ్, అసైన్డ్ భూములనూ కబ్జా చేశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
చదవండి: మునుగోడు దంగల్.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు