రిచెస్ట్ పీపుల్ అనగానే మనకి వ్యాపారస్తులు, నటులు లేదా ఇతర సెలబ్రిటీలు గుర్తుకు వస్తారు. మనమిపుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న బిచ్చగాడి గురించి తెలుసుకుందాం రండి. అత్యంత పేదరికంలో ఉన్నవారే 'బిచ్చగాళ్లు' గా మారతారు. అది పురుషుడైనా, మహిళ అయినా,పిల్లలైనా. ప్రాథమిక అవసరమైన పొట్ట నింపుకునేందుకు వేరే మార్గం లేకనో, మరే కారణమో బిచ్చమెత్తుకుని జీవిస్తారనేది సాధారణంగా అందరికీ తెలుసు. కానీ అదే భిక్షాటనను లాభదాయకమైన వృత్తిగా మార్చుకున్న వ్యక్తులు ఉన్నారని తెలిస్తే ఆశ్చర్య పోతారు.
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ముంబైలో నివసిస్తున్న భరత్ జైన్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు.భరత్ జైన్. ఇతను ముంబైలో ఉంటాడు. రూ. 1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు ఉన్నాయి. తన వద్ద ఉన్న సొమ్మను షాపుల్లో పెట్టుబడి పెట్టాడు. అంతేకాదు మహారాష్ట్రలోని థానేలో రెండు షాపులను కూడా కొనుగోలు చేశాడు. దీని ద్వారానెలకు రూ. 30వేల అద్దె ఆదాయం వస్తుంది. భారత్ జైన్ నికర విలువ 7.5 కోట్ల డాలర్లు. తాజా లెక్కల ప్రకారంఅతని నెలవారీ సంపాద దాదాపు లక్ష రూపాయలు. 2014 నాటికి భిక్షాటన ద్వారా భరత్ జైన్ సంసాదన ప్రతిరోజూ 2000-2500 రూపాయలు,నెలకు 75వేలు ఆర్జించేవాటంటే అతని ఆదాయాన్ని ఊహించుకోవచ్చు. (రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్‌కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్)
ఆర్థిక సంక్షోభం కారణంగా భరత్ జైన్ విద్యను కొనసాగించలేకపోయాడు. భరత్ జైన్‌కు వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక్కడ విశేషమేమిటంటే... భరత్ జైన్ తన పిల్లలిద్దర్నీ చక్కగా చదివించాడు. భరత్ జైన్, అతని కుటుంబం పరేల్‌లోని 1BHK డ్యూప్లెక్స్ ఇంటిలో చాలా సౌకర్యవంతంగా నివసిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు. కుటుంబంలోని మరికొందరు స్టేషనరీ దుకాణాన్ని కలిగి ఉన్నా. అయినా సరే, భిక్షాటన వదులుకోమని భారత్‌కు పదే పదే చెప్పినా...ఏమాత్రం వినకుండా దానినే కొనసాగిస్తున్నాడు.ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్‌లో భరత్ జైన్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా భిక్షాటన చేస్తాడట.
Comments
Please login to add a commentAdd a comment