స్వీడెన్ యువతి
సాక్షి, చెన్నై: మానసిక ప్రశాంతత కోసం స్వీడెన్‌కు చెందిన ఒక మహిళా పారిశ్రామిక వేత్త కోయంబత్తూరు వీధుల్లో భిక్ష మెత్తుకోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. స్వీడెన్ దేశానికి చెందిన కిమ్ అనే మహిళా పారిశ్రామికవేత్త. కొన్నినెలల క్రితం కోవైలోని ఈషాయోగా కేంద్రానికి చేరుకుని అక్కడి పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సహాయాలు చేస్తున్నారు. అయినా మానసిక ప్రశాంతత దొరక్కపోవడంతో రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ వీధుల్లో తిరుగుతూ భిక్షమెత్తడం ప్రారంభించారు. ప్రయాణికులిచ్చే ఐదు, పది రూపాయలను తీసుకుంటున్నట్లు కిమ్ తెలిపారు. ధనికురాలైన విదేశీ యువతి కోవై వీధుల్లో భిక్షమెత్తడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment