koyambattur
-
సీమాన్‌పై దేశద్రోహం కేసు
సాక్షి, చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేయడంపై అక్కడి నామ్ తమిళర్ కట్చి వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుకునపడ్డారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. గతంలో జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసిన కొంత కాలం కటకటాల్లోకి సైతం నెట్టారు. సీమాన్ ఇటీవల రాజకీయంగా బల పడుతున్నారు. ఆయన పార్టీ ఓటు బ్యాంక్ క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు నెలల క్రితం సీమాన్ చేసిన వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని ఇప్పుడు దేశద్రోహం కేసు నమోదు చేయడం ఆయన మద్దతుదారుల్ని ఆక్రోశాన్ని నింపింది. (సీమాన్ అరెస్ట్) పౌర నిరసనలో.. కేంద్రం తీసుకొచ్చిన పౌర చట్టానికి వ్యతిరేకంగా తమిళనాట ఆందోళనలు, నిరసనలు భగ్గుమన్న విషయం తెలిసిందే. మైనారిటీలు రాష్ట్రంలోని ఆయా నగరాల్లో మరో షాహిన్ బాగ్ అన్న నినాదాలతో నిరసన దీక్షలు కొనసాగించారు. ఇందులో భాగంగా కోయంబత్తూరు ఆత్తు పాలం వద్ద మైనారిటీల నిరసన దీక్ష సాగింది. ఈ దీక్షకు మద్దతుగా పలు సంఘాలు, పార్టీలు కదిలాయి. ఆ దిశగా ఫిబ్రవరి 22న ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతూ సీమాన్ హాజరయ్యారు. ఈ వేదిక నుంచి సీమాన్ వీరావేశంతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాటలతో విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని రెండు నెలల అనంతరం శనివారం ఆయనపై ద్రోహం కేసు నమోదైంది. (తండ్రి మృతదేహంతో 14గంటల పాటు..) పౌర చట్టానికి వ్యతిరేకంగా, మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీమాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని పేర్కొంటూ దేశ ద్రోహం కేసు నమోదు చేస్తూ, కోయంబత్తూరు పులియం ముత్తురు పోలీసుస్టేషన్ వర్గాలు ప్రకటించాయి. సీమాన్ వ్యాఖ్యల వీడియో చేతికి అందే సమయానికి కరోనా ప్రభావం తాండవం చేయడంతో ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టినట్టు, ప్రస్తుతం కోయంబత్తూరులో కరోనా కట్టడిలో ఉన్న దృష్ట్యా, సీమాన్ వ్యవహారాన్ని పోలీసులు చేతిలోకి తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ కేసు నమోదుతో సీమాన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో సీమాన్ ఉన్నట్టు సమాచారం. అయితే, తమ నాయకుడి ఎదుగుదల, తమకు లభిస్తున్న ఓటింగ్ శాతాన్ని చూసి ఓర్వలేక అక్రమంగా ఈ కేసు నమోదు చేశారని నామ్ తమిళర్ కట్చివర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పౌర చట్టానికి వ్యతిరేకంగా ఒక్క సీమాన్ మాత్రం వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి ప్రతి పక్ష నాయకుడు విరుచుకు పడ్డారని, అయితే, తమ నేతను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండి పడ్డారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 24 మంది దుర్మరణం చెందారు. తిరుపూర్ జిల్లా అవినాషి వద్ద కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీ కొనడటంతో 19మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుప్పుర్, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సేలం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు నేపాల్‌వాసులు మృతి చెందారు. ఓమలూరు వద్ద కారు, బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. -
చెన్నైలో భిక్షమెత్తుకుంటున్న మహిళా పారిశ్రామికవేత్త
సాక్షి, చెన్నై: మానసిక ప్రశాంతత కోసం స్వీడెన్కు చెందిన ఒక మహిళా పారిశ్రామిక వేత్త కోయంబత్తూరు వీధుల్లో భిక్ష మెత్తుకోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. స్వీడెన్ దేశానికి చెందిన కిమ్ అనే మహిళా పారిశ్రామికవేత్త. కొన్నినెలల క్రితం కోవైలోని ఈషాయోగా కేంద్రానికి చేరుకుని అక్కడి పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సహాయాలు చేస్తున్నారు. అయినా మానసిక ప్రశాంతత దొరక్కపోవడంతో రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ వీధుల్లో తిరుగుతూ భిక్షమెత్తడం ప్రారంభించారు. ప్రయాణికులిచ్చే ఐదు, పది రూపాయలను తీసుకుంటున్నట్లు కిమ్ తెలిపారు. ధనికురాలైన విదేశీ యువతి కోవై వీధుల్లో భిక్షమెత్తడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చదవండి: ఆ బిలియనీర్ బ్లూమ్‌బర్గ్‌ను అమ్మేస్తాడు.. -
కోయంబత్తూర్ రేప్ దోషికి ఉరే సరి
సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ ఘటనలో దోషిగా తేలిన మనోహరన్‌కు మరణ శిక్షే సరైన శిక్ష అని గురువారం సుప్రీంకోర్టు పునః నిర్ధారించింది. ఈ మేరకు ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. కోయంబత్తూర్‌లో 2010 అక్టోబర్ 29న పాఠశాలకు వెళ్తున్న పదేళ్ల బాలికను, ఏడేళ్ల ఆమె తమ్ముడిని మనోహరన్, మోహన కృష్ణన్ అనే ఇద్దరు బలవంతంగా ఎత్తుకెళ్లారు. పిల్లలిద్దరి చేతులు కట్టేసి, ఆ బాలికపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం వారికి విషమిచ్చి చంపే ప్రయత్నం చేశారు. విష ప్రభావంతో కూడా ఆ చిన్నారులు చనిపోకపోవడంతో.. వారిని చేతులు, కాళ్లు కట్టేసి పరంబికులం–అక్సియార్ ప్రాజెక్టు కాలువలో పడేసి ప్రాణాలు తీశారు. ఆ తరువాత పోలీసుల ఎన్కౌంటర్లో మోహన కృష్ణణ్ హతమయ్యాడు. మనోహరన్‌కు ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు ఆ తీర్పును సమర్ధించింది. ఈ ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు సైతం వారికి ఉరే సరైన శిక్ష అని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన దారుణంగా ఆ ఘాతుకాన్ని అభివర్ణించింది. అనంతరం మనోహరన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆ రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నారిమన్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సంజీవ్ ఖన్నా గత తీర్పును సమర్ధిస్తూ రివ్యూ పిటిషన్‌ను 2:1 తేడాతో తోసిపుచ్చారు. మరణ శిక్షను ఇద్దరు న్యాయమూర్తులు సమర్ధించగా, జస్టిస్ ఖన్నా మాత్రం చనిపోయేంత వరకు కఠిన కారాగార శిక్ష విధించడం సరైన శిక్ష అవుతుందని అభిప్రాయపడ్డారు. మెజారిటీ జడ్జీల తీర్పు మేరకు మనోహరన్‌కు ఉరిశిక్ష ఖాయమైంది. -
మూడో పెళ్లికి సిద్ధం.. ఇద్దరు పెళ్లాల యుద్ధం
సాక్షి, చెన్నై: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు ఆ నిత్యపెళ్లి కొడుకు. అయితే దురదృష్టం కొద్ది ఇద్దరు భార్యల చేతికి చిక్కాడు. చితక్కొట్టుడుకు గురైనాడు. వివరాలు. కోయంబత్తూరు జల్లా సూలూరు నెహ్రూనగర్‌కు చెందిన సౌందరరాజన్ కుమారుడు అరంగ అరవింద్ దినేష్ (26). ఇతను రాశీపాలయంలోని ఒక ప్రయివేటు సంస్థలో ప్యాట్రన్‌మేకర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి తిరుప్పూరు గణపతిపాళయం చెందిన ప్రియదర్శిని అనే యువతితో 2016లో వివాహమైంది. పెళ్లయిన 15 రోజుల్లోనే వేధింపులకు గురిచేయడంతో కొన్నాళ్లపాటూ భరించిన ప్రియదర్శిని ఆ తరువాత తన పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు పెళ్లయి మొదటి భార్య ఉన్న విషయాన్ని దాచిపెట్టి కల్యాణ వేదిక వెబ్సైట్ల ద్వారా వధువు వేట మొదలెట్టి కరూరు జిల్లా పశుపతి పాళయంకు చెందిన అనుప్రియ (23)ను ఈఏడాది ఏప్రిల్ 10వ తేదీన వివాహమాడాడు. అనుప్రియకు గతంలో పెళ్లయి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని తెలిసే అతడు పెళ్లిచేసుకున్నాడు. మొదటి భార్యతో ప్రవర్తించినట్లుగానే రెండో భార్యను సైతం వేధింపులకు గురిచేయడంతో ఆమె కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా మూడోపెళ్లికి సిద్దమైన ఈ నిత్యపెళి్లకొడుకు దినేష్ మరలా వివాహ వెబ్సైట్లను వెతకడం ప్రారంభించాడు. ఈ సమాచారం అందుకున్న మొదటి భార్య ప్రియదర్శిని, రెండో భార్య అనుప్రియ మంగళవారం ఉదయం కోయంబత్తూరు జిల్లా సూలూరులోని అతని తండ్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. తండ్రి సౌందరరాజన్‌ను వెంటపెట్టుకుని దినేష పనిచేసే సంస్థ వద్ద ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న సూలూరు పోలీసులు దినేష్, ఇద్దరు భార్యలను పోలీసు స్టేషన్‌కు రావాలి్సందిగా చెప్పి వెళ్లిపోయారు. ఈ సమయంలో సంస్థ నుంచి బయటకు వచ్చిన దినేష్‌ను ఇద్దరు భార్యలు చుట్టుముట్టి చితకబాదారు. ఇద్దరు పెళ్లాలు, ముద్దుల మొగుడు వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. -
లాటరీ టికెట్లపై ఐటీ దాడుల కలకలం
-
లాటరీ టికెట్లపై ఐటీ దాడుల కలకలం
సాక్షి, చెన్నై: లాటరీ టికెట్ల టైకూన్‌పై ఐటీ అధికారుల దాడులు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. గత నాలుగు రోజులుగా కోయంబత్తూరులోని మార్టీన్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు రహస్య అరలనుంచి కట్టల కొద్ది నగదు పట్టుబడింది. చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాల్లో ఏకకాలంలో 70 చోట్ల తనిఖీలు నిర్వహించారు. లాటరీ టికెట్ల టైకూన్ మార్టీన్ కార్యాలయాలు, నివాసాలపై దాడులు జరపగా..రూ.595 కోట్ల విలువైన లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై ప్రశ్నిస్తున్న అధికారులు.. లెక్కకు రాని మరో 619 కోట్ల రూపాయల గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో రూ. 24.57 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా.. వందల కోట్ల విలువైన దస్తావేజులను గుర్తించారు. క్యాషియర్ మరణంలో అనుమానాలు ఐటీ దాడుల నేపథ్యంలో లాటరీ మార్టిన్ కార్యాలయంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న పళని స్వామి మృతదేహం ఓ చెరువులో లభించడం కలకలం రేపింది. ఐటీ వర్గాలు కోయంబత్తూరుకు చెందిన పళనిస్వామి వద్ద సైతం విచారణ జరిపినట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం సాయంత్రం మేట్టుపాళయం సమీపంలోని వెల్లంకాడు చెరువులో పళనిస్వామి మృతదేహంగా తేలడం అనుమానాలకు దారి తీశాయి. ఈ మృత దేహాన్ని కోయంబత్తూరు మార్చురీలో ఉంచారు. తన తండ్రి మరణం మీద పళని స్వామి కుమారుడు రోహిన్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రి పనిచేస్తున్న కార్యాలయంలో ఉన్న ఇద్దరిపై తనకు అనుమానాలు ఉన్నాయని, నిర్ధారణ అయ్యాక వారి పేర్లను బయటపెడతానని వ్యాఖ్యానించాడు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణను ముమ్మరం చేశారు. కాగా, రోహిన్ కుమార్ పేర్కొంటూ, తన తండ్రి మృత దేహం మార్చురీలో ఉందని, సంబంధం లేని వ్యక్తులు వస్తున్నారని, కొందరు పోలీసులు పని గట్టుకుని రావడం, వెల్లడం వంటివి జరుగుతుండడం తన అనుమానాలకు బలాన్ని కల్గిస్తున్నట్టు పేర్కొన్నాడు. -
పేలుళ్లపై ముందే హెచ్చరించాం
న్యూఢిల్లీ: కోయంబత్తూరులో ఐసిస్ కేసు విచారణను ముగించిన వెంటనే, ఆ ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు, శ్రీలంకలో బాంబు దాడులు జరగొచ్చనే నిఘా హెచ్చరికలను శ్రీలంకకు ఈ నెల మొదట్లోనే పంపామని అధికారులు ఢిల్లీలో చెప్పారు. ఐసిస్‌ను స్ఫూర్తిగా తీసుకుని దక్షిణ భారతంలోని ప్రముఖ నేతలను చంపాలని కుట్రపన్నిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పట్టుకుని కోయంబత్తూరులో విచారించడం తెలిసిందే. ఆ హెచ్చరికలను రాయబార కార్యాయలం ద్వారా శ్రీలంకకు పంపామని అధికారులు తెలిపారు. కోయంబత్తూరులో విచారణ సమయంలో ఆ ఉగ్రవాదుల వద్ద నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) నేత జహ్రాన్ హషీమ్ వీడియోలు లభించాయి. కొలంబోలోని భారత హై కమిషన్‌పై ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు జహ్రాన్ హషీమ్ ఓ వీడియోలో సూత్రప్రాయంగా చెప్పాడు. మరింత లోతుగా విచారణ జరపగా, ఐసిస్ సహకారంతో ఉగ్రవాదులు చర్చిలు లక్ష్యంగా పేలుళ్లు జరిపేందుకు అవకాశం ఉందని తెలిసింది.ఈ సమాచారాన్ని వెంటనే శ్రీలంకకు తెలియజేశామని అధికారులు చెప్పారు. ఇస్లాం రాజ్యస్థాపనకు ముందుకు రావాల్సిందిగా శ్రీలంక, తమిళనాడు, కేరళ యువతను హషీమ్ కోరుతున్నట్లు మరో వీడియోలో ఉంది. ఇద్దరు రాజీనామా చేయండి: అధ్యక్షుడు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను రాజీనామా చేయాల్సిందిగా శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన ఆదేశించినట్లు సండే టైమ్స్ అనే ప్రతిక బుధవారం తెలిపింది. రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో, దేశ పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరలను రాజీనామా చేయమని సిరిసేన కోరారంది. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారం నాటికి 359కి చేరింది. పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేశామని పోలీసు విభాగ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర చెప్పారు. ఈ పేలుళ్లలో 500 మందికి పైగా ప్రజలు గాయపడటం తెలిసిందే. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులంతా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. -
భారీగా బంగారం పట్టివేత..!
సాక్షి, చెన్నై: తమిళనాడులో సోమవారం భారీగా బంగారం పట్టుబడింది. చెన్నై, కోయంబత్తూరు ఎయిర్‌పోర్టుల్లో 2.4 కేజీల బంగారాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరులో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 1.5 కేజీల బంగారాన్ని ప్రయాణికుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేరళలోని పాలక్కాడకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రజలపైకి దూసుకెళ్లిన కారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఓ లగ్జరీ కారు అదుపు తప్పి జనాలపై దూసుకెళ్లడంతో ఏడుగురు చనిపోగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. కోయంబత్తూరులోని సుందరపురం పెరియార్ విగ్రహం దగ్గర్లోని అయ్యర్ ఆస్పత్రి బస్టాండ్ బుధవారం ఉదయం 10.45 గంటలకు రద్దీగా ఉంది. ఈ సమయంలో పొల్లాచ్చి నుంచి కోయంబత్తూరు వైపు అతివేగంతో వచ్చిన ఓ ఆడీ కారు బస్టాండ్‌లోని ప్రజలపైకి దూసుకెళ్లింది. వాళ్లను తొక్కించుకుంటూ పక్కనే ఉన్న ఆటోను, పూలు అమ్ముకుంటున్న మరో వృద్ధురాలిని ఢీకొంది. తర్వాత ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగింది. కారు బలంగా తగలడంతో బస్టాండ్‌లోని పలువురు గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు కారును వేగంగా నడిపి ఏడుగురిని బలికొన్న డ్రైవర్ జగదీశన్(36) గాయాలతో ఘటనాస్థలం నుంచి పరారయ్యేందుకు యత్నించగా..స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కోయంబత్తూరులో కాల్పుల కలకలం
చెన్నై: కోయంబత్తూరులో ముగ్గురు వ్యక్తులను దుండగులు కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. ఇటీవలే ఓ హత్యకేసులో బెయిల్‌పై విడుదలైన ఆ ముగ్గురు వ్యక్తులను నడిరోడ్డుపై దుండగులు కాల్చిచంపినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్య, అమలాపాల్ వివాహం?
ఆర్య, అమలాపాల్ వివాహం చేసుకున్నట్లు పోస్టర్లు విడుదలై సంచలనం సృష్టిం చాయి. వీరి వివాహం ఎప్పుడు జరిగింది? రహస్య వివాహం చేసుకున్నారా? అంటూ చిత్ర వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీని గురించి విచారించగా పార్తిబన్ దర్శకత్వం వహిస్తూ కథ, మాటలు సమకూరుస్తున్న చిత్రం కోసం ఈ వివాహ దృశ్యం చిత్రీకరించినట్లు తెలిసిం ది. కోయంబత్తూరులో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించా రు. ఈ చిత్రంలో ఆర్యతో అమలాపాల్ అతిథి పాత్ర లో కనిపిస్తున్నారు. క్యారక్టర్ తనకు నచ్చడంతో ఆమె నటించేందుకు అంగీకరించారు. ఈ వివాహ దృశ్యం గురించి ఆర్య మాట్లాడుతూ ఇది వరకే వేట్టై చిత్రంలో తనకు, అమలాపాల్‌కు వివాహం జరిగినట్లు సన్నివేశం చిత్రీకరించారని, ప్రస్తుతం రెండవ సారి ఈ చిత్రంలోనూ అమలాపాల్‌కు తాళి కట్టినట్టు తెలిపారు. -
వండర్’ తాత
116 ఏళ్ల వయసులో ధరమ్‌పాల్ పరుగు కోయంబత్తూరు: 116 ఏళ్ల వయసున్న వృద్ధుడు బతికి ఉండటమే ప్రస్తుత రోజుల్లో గొప్ప. తన పనులు తాను చేసుకుంటూ, కర్ర సాయంతో నడవడమే చాలా గొప్ప. అలాంటిది ఉత్తరప్రదేశ్‌కు చెందిన 116 ఏళ్ల వయసున్న ధరమ్‌పాల్ గుజ్జార్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటున్నారు. జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగును 46.74 సెకన్లలో పూర్తి చేసి అబ్బురపరిచారు. 400 మీటర్ల పరుగులో స్వర్ణం కూడా గెలిచారు. 1897 అక్టోబరు 6న జన్మించిన ధరమ్‌పాల్ ఓ వ్యవసాయ కూలి. మీరట్ జిల్లాలోని గుడా అనే గ్రామంలో జీవిస్తున్నారు. తోటి కూలీల ఆర్థికసహాయంతో ఆయన ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వాలు తనకి సహకరిస్తే అంతర్జాతీయ పోటీలకు కూడా వెళ్లేవాడినని ధరమ్‌పాల్ చెప్పారు.