ఆర్య, అమలాపాల్ వివాహం?
ఆర్య, అమలాపాల్ వివాహం చేసుకున్నట్లు పోస్టర్లు విడుదలై సంచలనం సృష్టిం చాయి. వీరి వివాహం ఎప్పుడు జరిగింది? రహస్య వివాహం చేసుకున్నారా? అంటూ చిత్ర వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీని గురించి విచారించగా పార్తిబన్ దర్శకత్వం వహిస్తూ కథ, మాటలు సమకూరుస్తున్న చిత్రం కోసం ఈ వివాహ దృశ్యం చిత్రీకరించినట్లు తెలిసిం ది.
కోయంబత్తూరులో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించా రు. ఈ చిత్రంలో ఆర్యతో అమలాపాల్ అతిథి పాత్ర లో కనిపిస్తున్నారు. క్యారక్టర్ తనకు నచ్చడంతో ఆమె నటించేందుకు అంగీకరించారు. ఈ వివాహ దృశ్యం గురించి ఆర్య మాట్లాడుతూ ఇది వరకే వేట్టై చిత్రంలో తనకు, అమలాపాల్‌కు వివాహం జరిగినట్లు సన్నివేశం చిత్రీకరించారని, ప్రస్తుతం రెండవ సారి ఈ చిత్రంలోనూ అమలాపాల్‌కు తాళి కట్టినట్టు తెలిపారు.