సాక్షి, సినిమా: అమలా.. నన్ను ప్రేమించు అనగానే ఇదేదో సినిమా టైటిలో, ఏదైనా సినిమాలోని డైలాగో అనుకుంటున్నారా? అలాగైతే కచ్చితంగా పప్పులో కాలేసినట్లే. అసలు ఏమిటిది.. ఈ మాట ఎవరన్నారు అనేది తెలుసుకుందాం. ఇటీవల ఖరీదైన కారును కొనుగోలు చేసిన నటి అమలాపాల్ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. పన్నును తగ్గించుకోవడానికి ఆ కారును పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించుకుందనే ఆరోపణలను ఎదుర్కొంది. దాంతో అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అమలాపాల్ మీడియాపై విరుసుకుపడింది కూడా. అంతటితో ఆగకుండా తాను కేరళలో పుట్టిన అమ్మాయినంటూ బోటులో ప్రయాణం చేసే ఫోటోలను ఇంటర్నెట్‌లో పెట్టింది. ‘ఇలా బోటులో ప్రయాణిస్తే పన్ను కట్టనవసరం లేదనుకుంటా‘ అంటూ వ్యంగ్యంగా పేర్కొంది.
ఎవరు స్పందించారో, స్పందించలేదో కానీ హీరోయిన్లను ఆట పట్టించే నటుడు ఆర్య మాత్రం వెంటనే అమలాపాల్‌పై సెటైర్లు వేశాడు. ఇలా బోటు ప్రయాణం చేసి రోడ్డు ట్యాక్స్‌ను ఆదా చేసుకోవాలనుకుంటున్నావని తాను భావిస్తున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దాంతో రియాక్ట్ అయిన ‘మీరు రన్నింగ్, సైకిలింగ్ చేసి భవిష్యత్తు కోసం కూడబెడుతున్నట్టా’ అంటూ బదులిచ్చింది. నేను కూడబెడుతున్నది నీ కోసమే.. నన్ను ప్రేమించు అమలా అంటూ ఆర్య తిరిగి పోస్టు చేశాడు. ఇది ఎక్కడికో పోతోందని భావించిన అమలాపాల్ ఇక చాల్లేండి అంటూ ముగింపు పలికింది. కాగా, వీరిద్దరూ కలిసి ఇంతకుముందు వేట్టై, తదితర చిత్రాల్లో నటించారు. హాట్‌హాట్ సన్నివేశాలలో ఈమె నటించిన తిరుట్టుప్పయలే 2 చిత్రం త్వరలో తెరపైకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment