ప్రజలపైకి దూసుకెళ్లిన కారు | Six killed after speeding Audi car rams autorickshaw in Coimbatore | Sakshi
Sakshi News home page

ప్రజలపైకి దూసుకెళ్లిన కారు

Published Thu, Aug 2 2018 5:42 AM | Last Updated on Thu, Aug 2 2018 5:42 AM

Six killed after speeding Audi car rams autorickshaw in Coimbatore - Sakshi

ఘటనాస్థలిలో మృతదేహాలు. (ఇన్‌సెట్లో) ప్రమాదానికి కారణమైన కారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఓ లగ్జరీ కారు అదుపు తప్పి జనాలపై దూసుకెళ్లడంతో ఏడుగురు చనిపోగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. కోయంబత్తూరులోని సుందరపురం పెరియార్‌ విగ్రహం దగ్గర్లోని అయ్యర్‌ ఆస్పత్రి బస్టాండ్‌ బుధవారం ఉదయం 10.45 గంటలకు రద్దీగా ఉంది. ఈ సమయంలో పొల్లాచ్చి నుంచి కోయంబత్తూరు వైపు అతివేగంతో వచ్చిన ఓ ఆడీ కారు బస్టాండ్‌లోని ప్రజలపైకి దూసుకెళ్లింది. వాళ్లను తొక్కించుకుంటూ పక్కనే ఉన్న ఆటోను, పూలు అమ్ముకుంటున్న మరో వృద్ధురాలిని ఢీకొంది.

తర్వాత ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగింది. కారు బలంగా తగలడంతో బస్టాండ్‌లోని పలువురు గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు కారును వేగంగా నడిపి ఏడుగురిని బలికొన్న డ్రైవర్‌ జగదీశన్‌(36) గాయాలతో ఘటనాస్థలం నుంచి పరారయ్యేందుకు యత్నించగా..స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement