
పాట్నా: బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మది మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. 15 మందితో ఒక ఆటో లఖిసరాయ్ నుంచి సికంద్రా వైపు వెళుతుండగా గుర్తుతెలియని వాహనం దానిని బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థిలికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన వాహనం ఏదనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment