ట్రక్కు నదిలో పడి 71 మంది మృత్యువాత
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియాలో నదిలో ట్రక్కు పడిన దుర్ఘటనలో 71 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ ప్రాంత సిడామాలోని లెమ్మ లగిడెలో ఆదివారం దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా పెళ్లి బృందంలోని వారు. కిక్కిరిసిన ట్రక్కు గలానా నదిపైన వంతెన మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి పడిపోయింది. అక్కడి కక్కడే 60 మంది అసువులు బాశారు.
మిగతా 11 మంది చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు చెప్పారు. పేద దేశం కావడంతో వివాహాలు వంటి వేడుకలకు వెళ్లే వారు ఎక్కువ ఖర్చయ్యే బస్సులకు బదులుగా తక్కువకే దొరికే ట్రక్కులనే జనం వాడుతుంటారు. రహదారుల నిర్వహణ లోపభూయిష్టంగా మా రడంతో ఇక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.
ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు
Comments
Please login to add a commentAdd a comment