Ethiopia
-
24 ఏళ్ల తర్వాత... ఇథోయోపియా అథ్లెట్‌కు పసడి పతకం
పారిస్: ఒలింపిక్స్ క్రీడలు ముగియడానికి ఒక రోజు ముందు ఇథియోపియా జట్టు పసిడి పతకం బోణీ కొట్టింది. పురుషుల మారథాన్ ఈవెంట్లో తమిరాత్ తోలా విజేతగా నిలిచి ఇథియోపియాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన మారథాన్ రేసులో నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 32 ఏళ్ల తోలా అందరికంటే వేగంగా 2 గంటల 6 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బషీర్ ఆబ్ది (బెల్జియం; 2గం:06ని:47 సెకన్లు) రజతం... బెన్సన్ కిప్రోతో (కెన్యా; 2గం:7ని:00 సెకన్లు) కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పురుషుల మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఇథియోపియా అథ్లెట్ గెజాహెగ్నె అబెరా మారథాన్ విజేతగా నిలిచాడు. మరోవైపు మారథాన్‌లో ‘హ్యాట్రిక్’ ఒలింపిక్ స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన కెన్యా దిగ్గజం ఎలూడ్ కిప్చోగే అనూహ్యంగా విఫలమయ్యాడు. 40 ఏళ్ల కిప్చోగే 30 కిలోమీటర్లు పరుగెత్తాక రేసు నుంచి వైదొలిగాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కిప్చోగే స్వర్ణ పతకాలు సాధించాడు. కిప్చోగే ‘పారిస్’లోనూ విజేతగా నిలిచిఉంటే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో మూడు బంగారు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించేవాడు. -
229కి చేరిన ఇథియోపియా మృతుల సంఖ్య
దక్షిణ ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కి చేరింది. గోఫా జోన్ ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవహారాల విభాగం విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం మృతులలో148 మంది పురుషులు, 81 మంది మహిళలు ఉన్నారు.ఇథియోపియా దక్షిణ ప్రాంతీయ రాష్ట్ర ప్రతినిధి అలెమాయేహు బావ్డి మరణాల సంఖ్యను ధృవీకరించారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా జరుగుతున్నదని తెలిపారు. కాగా బురదమట్టిలో నుంచి ఐదుగురిని సజీవంగా బయటకు తీసుకువచ్చామని, వారికి వైద్య చికిత్స అందిస్తున్నామని ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఈబీసీ) తెలిపింది. మృతులలో అధికంగా స్థానికులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య నిపుణులు వ్యవసాయ నిపుణులు ఉన్నారని పేర్కొంది.ఘటన జరిగిన ప్రాంతంలో ఇథియోపియన్ రెడ్‌క్రాస్ అసోసియేషన్‌తో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రొఫెషనల్ రెస్క్యూ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో దక్షిణ ఇథియోపియాలోని గోఫా ప్రాంతంలో ఆదివారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో భారీగా జనం సమాధి అయ్యారు. సోమవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ప్రారంభంకాగా, ఇంతలో మరొక కొండచరియ విరిగిపడటం మరింత విషాదానికి దారితీసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదని, మృతదేహాలను ఇంకా బయటకు తీస్తున్నామని గోఫా ప్రాంత జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ అధిపతి మార్కోస్ మెలేస్ మీడియాకు తెలిపారు. ఘటనపై స్పందించిన ఇథియోపియా ప్రధాని అభి అమ్మద్ మాట్లాడుతూ భారీ ప్రాణనష్టం తనను ఎంతగానో కలచివేసిందని, విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి ఫెడరల్ అధికారులను ఘటన జరిగిన ప్రాంతానికి పంపించినట్లు తెలిపారు. ఇథియోపియా పార్లమెంటేరియన్ కెమల్ హషి మీడియాతో మాట్లాడుతూ బాధితులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం అందిస్తున్నామన్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. The death toll from two landslides in southern #Ethiopia jumped to 229 and could rise further as the search for survivors and casualties continued into a second day.Following heavy rain a landslide buried people in Gofa zone in Southern Ethiopia regional state on Sunday night,… pic.twitter.com/uVyYiUxdP4— DD News (@DDNewslive) July 24, 2024 -
విరిగిపడిన కొండచరియలు.. 150 మందికి పైగా మృతి
ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 157 మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలోని గోఫా జోన్లో ఈ విషాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు శిథిలాల్లో చిక్కుకున్నవారిని వెలికితీస్తుండగా మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ గుమిగూడిన ప్రజలు, సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్నారు. ఇప్పటివరకు 146 మంది మృతదేహాలను వెలికితీసినట్లుగా స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.వర్షం నుంచి వచ్చిన బురద కారణంగా సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయని, మృతి చెందిన వారిలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతదేహాలను బురదలో నుంచి బయటకు తీస్తున్నామని చెప్పారు. ఒక కొండచరియ తర్వాత మరో కొండచరియ కూడా విరిగిపడటంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని తెలిపారు.అయితే జులైలో ప్రారంభమయ్యే వర్షాకాలంలో ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణంగా మారింది. ఈ వర్షాకాలం సెప్టెంబర్ మధ్య వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు చెబుతున్నారు. -
ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..!
ప్రపంచం మొత్తం ఇంచుమించుగా ఒకే ఏడాదినే ఫాలో అవుతుంది. ఆయా దేశ కాలమాన పరిస్థితుల రీత్యా న్యూ ఇయర్ వేడుకులు వేర్వేరుగా జరగుతాయేమో..! గానీ అన్ని చోట సంవత్సరం ఒకటే ఉంటుంది. ఆయా స్థానిక సంప్రదాయాలు, మతాలు రీత్యా ఉండే ఏడాదులు వేరుగా ఉంటాయి. కానీ అంతర్జాతీయంగా ఫాలో అయ్యే ఇయర్ అనేది ప్రపంచమంతా ఒకటే ఉంటుంది. కానీ ఒక దేశం మాత్రం ఇంకా 2016వ సంవత్సరంలోనే ఉంది. ఇదేంటీ..? అనుకోకండి. ఎందుకుంటే..? అక్కడ దాదాపు ఏడేళ్లు వెనుక్కు ఉంటారట. మరీ వేరే దేశాలతో జరిగే కార్యకలాపాల్లో ఎలా..? అనే కదా..!. అందుకు వారేం చేస్తారంటే..ఇధియోపియా ఇంకా 2016వ ఏడాదిలోనే ఉంది. వచ్చే సెప్టంబర్11కి 2017 ఏడాదిలోకి అడుగుపెడుతుందట. దాదాపు ఎనిమిదేళ్ల వ్యత్యాసమా అని ఆశ్చర్యంగా ఉన్నా. ఇది వాస్తవం. ఆఫ్రికాలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన ఇధియోపియా దేశం తమ సంప్రదాయ సమయపాలనకు కట్టుబడి ఉంది. ప్రపంచమంతా గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అయితే..అక్కడ మాత్రం ఆర్థోడాక్స్ చర్చి క్యాలెండర్‌ని ఫాలో అవుతుంది. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే ఏడు లేదా ఎనిమిదేళ్లు వెనుక్కు ఉంటుంది. చెప్పాలంటే ఇథియోపియా దేశం తమ సాంప్రదాయిక వ్యవస్థన పట్ల ఉన్న నిబద్ధతను చాటేలా.. తన సాంస్కృతిక మతపరమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా తాప్రతయపడుతోంది. అందుకోసమే ఇలా ప్రత్యేక క్యాలెండర్‌ని ఫాలో అవుతుంది. అంతేగాదు తాము వలస రాజ్యాన్ని వంటబట్టించుకోలేదని, మాకు స్వంత క్యాలేండర్, స్వంత వర్ణమాల ఉందని సగౌర్వంగా చెబుతున్నారు ఇథియోపియా వాసులు. ఇక ఇధియోఫియా క్యాలెండర్లో ఏకంగా 13 నెలలు ఉంటాయి. వాటిలో 12 నెలల్లో ఒక్కొక్కటి 30 రోజులు ఉండగా చివరినెల ఒక విధమైన సమయపాలను ఉంటుంది. ఇక్కడ ప్రజలు రెండు క్యాలెండర్లును ఫాలో అవ్వుతారు. అందరూ ఫాలో అయ్యే గ్రెగోరియన్ క్యాలెండర్ తోపాటు తమ దేశ క్యాలెండర్‌ని అనుసరిస్తారు. అందువల్ల ఇక్కడ ప్రజలు బర్త్ సర్టిఫికేట్లు రెండు ఉంటాయి. వాటిని ప్రాంతాల వారిగా ఒక తేదీ, అంతర్జాతీయంగా మరో తేదీ ఉంటుంది. ఇది కాస్త గందరగోళానికి గురి చేసే వ్యవహారమే అయినా వాళ్లు మాత్రం అలానే అనుసరించడం విశేషం. ఇథియోపియాలో పనిచేసే అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కూడా. అయితే అక్కడ ప్రజలకు మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదు. వాళ్లు చాలా సులభంగా రెండు క్యాలెండర్లను అనుసరిస్తారు.(చదవండి: డిప్రెషన్‌తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?) -
ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!?
ఇథియోపియా, అడిస్ అబాబాకు దక్షిణంగా ఉన్న సోడో ప్రాంతంలోని తియా పురావస్తు ప్రదేశం.. ప్రపంచాన్నే ఆకట్టుకుంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో మెగాలిథిక్ స్తంభాలు.. 12 లేదా 14వ శతాబ్దాల నాటి ఎన్నో కథలను.. ఊహించి చెబుతుంటాయి. అందుకే అవన్నీ మార్మిక సంకేతాలతో మానవ చరిత్రకు వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచాయి.సంక్లిష్టమైన సామాజిక–మతపరమైన పద్ధతుల్లో కొన్ని రకాల చిహ్నాలు.. ఆ శిలాఫలకాలపై చెక్కి ఉన్నాయి. కత్తులు, బొమ్మలు ఇలా ఎన్నో భావనలతో చెక్కిన ఆ స్తంభాలు.. యునెస్కో గుర్తింపును కూడా పొందాయి. అందుకే ఇవన్నీ.. శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. పురాతన ఇథియోపియన్ సంస్కృతికి చెందిన ఆచారాలకు, నమ్మకాలకు ఇవి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఈ అమూల్యమైన ప్రదేశాన్ని సంరక్షించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఈ శిలాఫలకాలు, వాటిపైనున్న మార్మిక చిహ్నాలు పురాతన రాతియుగం నాటి పరిస్థితుల్ని సూచిస్తాయి. కానీ ఆ సూచనలు నేటి తరాలకు ఏ మాత్రం అర్థం కాకుండా ఉన్నాయి.ఇక్కడ మొత్తంగా 36 మెగాలిథిక్ స్తంబాలు ఉన్నాయి. వాటి మీదున్న కత్తుల బొమ్మలు ఏదైనా దైవ శక్తిని లేదా సైనిక శక్తిని సూచిస్తూ ఉండవచ్చని నిపుణుల అంచనా. కానీ దానిపై స్పష్టత లేదు. ఇక ఇతర బొమ్మల విషయానికి వస్తే ఆనాటి జ్యోతిష వివరాలను, ఆనాటి నాగరికత వివరాలను తెలుపుతున్నట్లుగా అనిపిస్తున్నాయని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 1930ల వరకు ఈ పురావస్తు ప్రదేశం వెలుగులోకి రాలేదు. ఇథియోపియా ప్రాంతీయ సర్వేల సమయంలో ఫ్రెంచ్ పరిశోధకులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, వీటి వివరాలను ప్రపంచానికి వెల్లడించారు.ఆ రాతిస్తంభాలన్నీ పురాతన యుగంలో.. అంటే 12 లేదా 14 శతాబ్దంలోని చనిపోయిన పూర్వీకుల జ్ఞాపకార్థం కావచ్చని కొందరు లేదంటే అప్పటి సమూహానికి నాయకుడిగా ఉన్న నాయకుడి గౌరవార్థం కావచ్చని మరికొందరు అంచనా వేశారు. ఆ లెక్కన చూస్తే.. ఇది పురాతన శ్మశానవాటిక కావచ్చని కూడా కొందరి అభిప్రాయం. అయితే ఈ స్తంభాలు వెనుకున్న అసలు కథ ఏమిటి? అన్నది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
సౌదీ సైన్యం కాల్పుల్లో వందలాది మంది మృతి !
దుబాయ్: సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యతి్నంచిన ఇథియోపియా వలసదారులపై సౌదీ బలగాలు జరిపిన కాల్పుల్లో వందలాదిమంది మృతి చెందినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ మంగళవారం తెలిపింది. సైన్యం మెషిన్స్ గన్లు, మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. యెమెన్ వైపు ఉన్న సరిహద్దు నుంచి వస్తున్న వలసదారులపైకి సౌదీ బలగాలు కాల్పులు జరపడంపై ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. హ్యూమన్ రైట్స్ వాచ్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోందని సౌదీ అధికారి ఒకరు ఖండించారు. సౌదీలో ప్రస్తుతముంటున్న 7.50 లక్షల మంది ఇథియోపియన్ శరణార్థుల్లో 4.50 లక్షల మంది అనధికారికంగా ఉంటున్నవారే. ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సౌదీ ప్రభుత్వం వీరిని వెనక్కి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
ఇథియోపియాలో వైమానిక దాడి.. 26 మంది మృతి
నైరోబీ: ఇథియోపియాలోని కల్లోలిత అంహారా ప్రాంతంలోని ఓ పట్టణ కూడలిలో జరిగిన వైమానిక దాడిలో 26 మంది మరణించారు. మరో 55 మంది గాయాలపాలయ్యారు. ఈ మేరకు ఆ దేశానికి చెందిన సీనియర్ వైద్యాధికారి సోమవారం వెల్లడించారు. స్థానిక మిలీషియా ముఠాలను నిర్వీర్యం చేసేందుకు దేశ ఆర్మీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ఫినోట్ సెలామ్లోని కమ్యూనిటీ సెంటర్‌పై ఆదివారం ఉదయం వైమానిక దాడి జరిపింది. ఇదిలా ఉండగా గతవారం అమ్హారా ప్రాంతంలోని కీలక పట్టణాలను సైనిక చర్య ద్వారా ఇథియోపియా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులకు ఆహారం అందించి ఓ ట్రక్కుపై వెనక్కు వస్తున్న కొందరు వ్యక్తులను లక్ష్యంగా వైమానిక దాడులు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. చదవండి: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా కకర్ ప్రమాణం -
తమిళనాడు అబ్బాయి.. ఇథియోపియా అమ్మాయి
తమిళనాడు: ఇథియోపియా అమ్మాయితో సేలం అబ్బాయి హిందూ సంప్రదాయం ప్రకారం తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఈ వేడుక మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. సేలం జిల్లా అత్తార్ సమీపంలోని కల్పగనూర్ గ్రామానికి చెందిన సెల్లదురై కుట్టి మార్క్స్(32), ముంబై యూనివర్సిటీలో 5 సంవత్సరాలుగా అసోసియేట్ ప్రొఫెసర్, పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. తనతో పనిచేసిన ఇథియోపియన్ అసోసియేట్ ప్రొఫెసర్ రియార్ మెన్బారే అక్లీలతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై వారి తల్లిదండ్రులను సంప్రదించారు. సెల్లదురై కుట్టిమార్క్ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి అతని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దీంతో పెత్తనాయకన్పాళయంలోని హిందూ కల్యాణ మండపంలో వీరి వివాహ వేడుక జరిగింది. బంధువుల సమక్షంలో చెల్లదురై కుట్టి మార్క్స్, మెన్బారే అక్లీ మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి పలువురు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఇథియోపియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం..
అడిస్ అబాబా: ఇథియోపియాలో ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం ఎమర్జెన్సీని ప్రకటించింది. గత కొంతకాలంగా ఉత్తర అమ్హారా ప్రాంతంలో ఫెడరల్ భద్రతా దళాలకు స్థానిక మిలీషియాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక ఇదే వారంలో ఇథియోపియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, ఫానో మిలీషియా గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది. పొరుగున ఉన్న టైగ్రే ప్రాంతంలో రెండు సంవత్సరాల పాటు జరిగిన అంతర్యుద్ధం కారణంగానే ఈ ఘర్షణలు చెలరేగినట్లు చెబుతోంది ఇథియోపియా ప్రభుత్వం. సాధారణ న్యాయ వ్యవస్థ ఆధారంగా ఈ దారుణాలను నియంత్రించడం కష్టతరంగా మారినందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మొదటగా ప్రభుత్వం తరపున ఆర్డర్‌ను తిరిగి అమలు చేయాల్సిందిగా ఫెడరల్ అధికారుల సాయం కోరామని అయినా కూడా ఘర్షణలను నియంత్రించడం కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ప్రకటించింది. ఎమర్జన్సీ అమల్లో ఉండగా బహిరంగ సభలను నిషేధం.. అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారెంట్లు లేకుండా అరెస్టులు జరుగుతాయని ఏ ప్రకటనలో పేర్కొంది. అవసరాన్ని బట్టి కర్ఫ్యూ విధించదానికి కూడా వెనుకాడమని ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. -
రైతు సంక్షేమ కార్యక్రమాలు భేష్
పెనుగంచిప్రోలు: ఏపీలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇథియోపియా ప్రతినిధి బృందం పేర్కొంది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇథియోపియా బృందంలోని ఆరుగురు సభ్యులు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో సాగవుతున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. రైతు పెద్ది మోహనరావుతో మాట్లాడి సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు ఎంతో మేలు కలిగేలా ఉన్నాయన్నారు. ఆంధ్రా రైతులు రకరకాల ఉత్పత్తులు లాభసాటిగా పండిస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఎన్నో రకాల సేవలందిస్తున్నాయని ప్రశంసించారు. ఇక్కడ వ్యవసాయ రంగంలో అమలవుతున్న ప్రతి కార్యక్రమం తమ దేశంలో రైతులకు అందించేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. ఇథియోపియో ప్రతినిధులు రోసి, ఎల్షడే, అబ్రహాం, ఆలీ, ఏడీఆర్ డాక్టర్ జీఎంవీ ప్రసాదరావు, డీడీఈ డాక్టర్ బి.ముకుందరావు, ఏడీ శివప్రసాద్, గరికపాడు కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ఏపీ సహకారంతో ఇథియోపియాలో ఈ–క్రాప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను గుర్తించే ఎలక్ట్రానిక్ క్రాపింగ్ (ఈ–క్రాప్) అద్భుతంగా ఉందని, ఈ సాంకేతికతను తమ దేశంలో అమలు చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఇథియోపియా ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడో రోజైన గురువారం ఇథియోపియా ప్రతినిధి బృందం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భంగా ఏపీలో రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని తమ దేశంలో రైతులకు కూడా అందించేందుకు ఆసక్తిగా ఉన్నామని ఇథియోపియా ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ–పంట నమోదుతోపాటు యంత్రసేవా పథకం, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా వంటి పథకాలను తమ రైతులకు అందించాలని భావిస్తున్నామన్నారు. వీటి అమలు కోసం అవసరమైన సాంకేతికతను అందించేందుకు చేయూతనివ్వాలని కోరారు. ఇథియోపియా దేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. ఎరువులు, పురుగు మందులపై ఆరా ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయాలను ఇథియోపియా ప్రతినిధి బృందం ఆరా తీసింది. కాగా, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందానికి వివరించారు. ఈ–క్రాప్ నమోదు, ఉచిత పంటల బీమా, ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఇన్పుట్స్ పంపిణీ, ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు (కస్టమ్‌హైరింగ్ సెంటర్స్), డ్రోన్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, వైఎస్సార్ అప్లికేషన్ సాంకేతికతను, పొలం బడుల ద్వారా గ్యాప్ సర్టిఫికేషన్ జారీ అంశాలను వివరించారు. ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్‌పాండే, వ్యవసాయ శాఖ జేడీ వల్లూరి శ్రీధర్ వివిధ అంశాలపై మాట్లాడారు. -
పశుపోషణ, పాడి, డెయిరీ, సాగు రంగాల్లో.. ఏపీ దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి/భవానీపురం/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : పశుపోషణ, పాడి, డెయిరీ, సాగు రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కేరళ, ఇథియోపియా బృందాలు కొనియాడాయి. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు.. అలాగే, రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే) ద్వారా గ్రామస్థాయిలో అందిస్తున్న సేవలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని తెలిపాయి. ఏపీలో తీసుకొస్తున్న లైవ్‌స్టాక్ అండ్ పౌల్ట్రీ ఫీడ్ అండ్ మినరల్ మిక్చర్ బిల్లు–2022ను స్ఫూర్తిగా తీసుకుని దానిని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో అమలుచేసే నిమిత్తం మంత్రి చెంచురాణి నేతృత్వంలోని 10 మంది ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన కేరళ ప్రభుత్వ సెలక్ట్ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో మంగళవారం రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులతో కేరళ బృందం సమావేశమైంది. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో తమ ప్రభుత్వం నాలుగేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని వివరించారు. ప్రతీ ఆర్బీకేను రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్‌గా తీర్చిదిద్దామన్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా మహిళా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ డెయిరీ రంగం బలోపేతానికి కృషిచేస్తున్నామన్నారు. కేరళ ఎమ్మెల్యేల సందేహాలను మంత్రి అప్పలరాజు నివృత్తి చేశారు. ఏపీ పశుదాణా చట్టం–2020 అమలుతీరును పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ వివరించారు. సీఎం జగన్ దూరదృష్టి అద్భుతం : కేరళ మంత్రి చెంచురాణి కేరళ మంత్రి చెంచురాణి మాట్లాడుతూ ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టికి తామంతా ముగ్ధులయ్యామన్నారు. పశుపోషణ, పాడి, డెయిరీ రంగాల్లో ఏపీ సర్కార్ అందిస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. కేరళలో పాడి, పౌల్ట్రీ సంపదకు అవసరమైన దాణా, ఫీడ్ కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. 50 శాతానికి పైగా పశు దాణా, పౌల్ట్రీ ఫీడ్లను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ చేపట్టిన కార్యక్రమాలను కేరళలో కూడా అమలుచేసేందుకు తమ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు, వైద్య, విద్యరంగాల్లో తీసుకొచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు. కేరళ మంత్రి, ఎమ్మెల్యేలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆచరించదగ్గ ఎన్నో విషయాలున్నాయిక్కడ: ఇథియోపియా బృందం ప్రశంస మరోవైపు.. ఆర్బీకేల సేవలు అద్భుతంగా ఉన్నాయని ఇథియోపియా ప్రతినిధి బృందం కితాబిచ్చింది. ప్రపంచంలో వ్యవసాయాధారిత దేశాలన్నీ ఆచరించదగ్గ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ అమలవుతున్నాయని అభిప్రాయపడింది. ఇథియోపియా బృందం పర్యటనలో భాగంగా రెండోరోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని గొల్లపూడి ఆర్బీకే కేంద్రాన్ని బృందం సందర్శించింది. ఆర్బీకేలోని కియోస్క్ ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల బుకింగ్, సరఫరా గురించి రైతులను అడిగి బృందం సభ్యులు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకిచ్చిన ట్రాక్టర్ ఎక్కి రైతు క్షేత్రంలో దుక్కి పనుల్లో పాల్గొన్నారు. మూలపాడులో ఖరీఫ్ పంటల ఈ–క్రాప్ నమోదును పరిశీలించారు. రైతులతో ముఖాముఖిలో పాల్గొని ఆర్బీకే ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల గురించి తాము విన్నదానికంటే ఎన్నో రెట్లు బాగున్నాయని బృంద సభ్యులు ప్రపంచానికే ఏపీ ఒక దిశానిర్దేశం చేసిందన్నారు. ఈ బృందంలో ప్రపంచ బ్యాంకు సలహాదారు హిమ్మత్ పటేల్, ఇథియోపియా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. -
ఏపీ విధానాలు ప్రపంచానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: ‘రైతులకు సాంకేతికతను చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కృషి బాగుంది. మీ ఆలోచన విధానాలు ప్రపంచానికే ఆదర్శం. మాది వ్యవసాయాధారిత దేశం. మీ విధానాలు, సాంకేతికత అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నాం. అందుకు తగిన సహకారం అందించండి’ అని ఇథియోపియా దేశ ప్రతినిధి బృందం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐదు రోజుల పర్యటన కోసం సోమవారం రాష్ట్రానికి విచ్చేసిన ఇథియోపియా బృందానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ స్వాగతం పలికారు. అనంతరం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం(ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్), ఆర్బీకే చానల్ స్టూడియోలను ఇథియోపియా బృందం సందర్శించింది. ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వల్లూరు శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఆర్బీకే యూట్యూబ్ చానల్ స్టూడియోలో శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వివిధ పంటల సాగులో అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు తెగుళ్లు, పురుగుల నివారణకు వ్యవసాయ విశ్వవిద్యాలయ, వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తల సూచనలతో రూపొందిస్తున్న వీడియోలను వారు పరిశీలించారు. రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తున్న తీరును పరిశీలించడంతో పాటు ఆర్బీకేల ద్వారా అందిస్తున్న రైతు భరోసా సచిత్ర మాస పత్రిక గురించి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ కృషిని ఇథియోపియా బృందం ప్రశంసించింది. తమ దేశంలోనూ రైతులకు ఈ తరహా విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది. బృందంలో ప్రపంచ బ్యాంకు సలహాదారు హిమ్మత్ పటేల్, ఇథియోపియా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు డా.ఆదిషు బెజ్ బెహ్ అలి, అన్ దువాలేమ్, అబ్రహాం టేస్ పాయె, ఆరెగా సేమెగా, ఎల్ షాడే బెలేటే తదితరులున్నారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అధికారి వై.అనురాధ తదితరులు పాల్గొన్నారు. నేడు గొల్లపూడి ఆర్బీకే సందర్శన ఇథియోపియా ప్రతినిధి బృందం మంగళవారం గొల్లపూడి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించనుంది. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించి.. సంబంధిత సిబ్బంది, రైతులతో మాట్లాడనుంది. అనంతరం సమీప గ్రామాల్లో పర్యటిస్తుంది. బీమా కవరేజ్‌లో ఏపీ అద్భుతం సాక్షి, అమరావతి: కేంద్రం నోటిఫై చేసిన పంటలకు రైతులపై పైసా భారం పడకుండా.. సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర వ్యవసాయ కుటుంబ, సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) సీఈవో, నాఫెడ్ ఎండీ రితీశ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం ఆయన అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ పరిధిలోని దొడ్డిపల్లి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలను పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. ఈ–క్రాప్ నమోదు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు తీరుపై ఆరా తీశారు. ఈ–క్రాప్ నమోదుకు సంబంధించిన రశీదులను పరిశీలించి, ఎలా నమోదు చేస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గతంలో సాగు చేసిన పంటలకు కేంద్రం నిర్దేశించిన ప్రీమియం చెల్లించిన వారికే పరిహారం దక్కేదని రైతులు ఆయనకు తెలిపారు. అయితే తమ రాష్ట్రంలో ప్రస్తుతం నోటిఫై చేసిన ప్రతి పంటకు, ప్రతి ఎకరాకు బీమా సదుపాయం లభిస్తోందని చౌహాన్‌కు వివరించారు. దీంతో ఈ తరహా యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పించడం నిజంగా అద్భుతమని ఆయన కొనియాడారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకొని ఫసల్ బీమా యోజన నిబంధనల్లో పలు మార్పులు చేశామన్నారు. ఖరీఫ్–22 సీజన్ నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకంతో పీఎంఎఫ్‌బీవైను అనుసంధానం చేసి అమలు చేస్తున్నామని చెప్పారు. -
అదానీ షేర్ల బ్లడ్ బాత్: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన పరిశోధన నివేదిక సునామీతో అదానీ గ్రూప్ షేర్లన్నీ పతనం వరుసగా కొనసాగుతోంది. కంపెనీకి చెందిన 10 స్టాక్‌లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దీంతో ఆసియా కుబేరుడుగా నిలిచిన అదానీ చైర్మన్ గౌతం అదానీ, ప్రపంచ బిలియనీర్ల ర్యాంకు నుంచి 16 స్థానానికి పడిపోయారు. అదానీ నికర విలువ ఒక వారంలో దాదాపు సగానికి పడిపోయింది. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్ల వ్యవధిలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 8.76 లక్షల కోట్లు (107 బిలియన్ డాలర్లు) నష్టపోయాయి. ఇది (రూపాయి-డాలర్ మార్పిడి రేటు 81.80 వద్ద) ఇథియోపియా లేదా కెన్యా జీడీపీతో సమానమట. వీటి వార్షిక జీడీపీ 110-111 బిలియన్ల డాలర్లు (ప్రపంచ బ్యాంకు). అదానీ టోటల్ గ్యాస్ 6 రోజుల రూట్లో 29 బిలియన్ల డాలర్లు పైగా నష్టపోయింది. మార్కెట్ విలువలో 26.17బిలియన్ల డాలర్లను కోల్పోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం,గత సంవత్సరం సెప్టెంబర్‌లో గరిష్టంగా 150 బిలియన్ల డాలర్లున్న అదానీ వ్యక్తిగత సంపద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తరువాత ( జనవరి 24 నాటికి) 119 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. కాగా ఫోర్బ్స్ అదానీ సంపదను 64.6 బిలియన్ డాలర్లుగా గురువారం అంచనా వేసింది. దీని ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద 85 బిలియన్ డాలర్లు పతనం. ఇది బల్గేరియా వార్షిక జీడీపీకి సమానం! అదానీ పోర్ట్స్ మార్కెట్ క్యాప్ రూ. 65,000 కోట్లకు పైగా క్షీణించగా, అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ. 2.1 లక్షల కోట్లు హుష్ కాకి అయిపోయాయి. గత సంవత్సరం అదానీ కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, దాని m-క్యాప్ దాదాపు రూ. 29,000 కోట్లు పడిపోయింది, ఇది 29శాతం పతనం. అదానీ గ్రీన్ ఎనర్జీ (16.95 బిలియన్ డాలర్లు క్షీణత) అదానీ ట్రాన్స్మిషన్ (16.36 బిలియన్ డాలర్లు కోల్పోయింది) విలువపరంగా భారీ పెట్టుబడిదారుల సంపదను కోల్పోయిన అదానీ గ్రూప్ స్టాక్‌లు. ఇంకా అదానీ పోర్ట్స్ & SEZ (7.89 బిలియన్ డాలర్లు), అంబుజా సిమెంట్స్ (3.55 బిలియన్ డాలర్లు ) అదానీ విల్మార్ (2.4బిలియన్ డాలర్లు ) ఏసీసీ (1.13 బిలియన్ డాలర్లు) కోల్పోయాయి. ఇక ఎఫ్‌పీవో ఉపహసంహరణ తరువాత అదానీ షేర్లను కొనేవాళ్లకు లేక చాలా వరకు లోయర్ సర్క్యూట్ కావడం గమనార్హం. గురువారం అదానీ షేర్ల తీరు ఇలా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ఉపసంహరణ తరువాత ఈ స్టాక్ గురువారం రెండవ వరుస సెషన్లో 30శాతం క్రాష్ అయ్యింది. 1,494.75 వద్ద కొత్త 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం పడి, రూ. 1,707లోయర్ సర్క్యూట్ అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం కుప్పకూలి కొత్త 52 వారాల కనిష్టాన్ని తాకింది. అదానీ ట్రాన్స్మిషన్ కొత్త 52 వారాల కనిష్ట స్థాయి, 10శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 14.35 కుప్పకూలి , 52 వారాల కనిష్ట స్థాయి అదానీ పవర్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ అదానీ విల్మార్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. -
ఏపీలో ఆర్బీకేలు అద్భుతం
సాక్షి, అమరావతి/ఉయ్యూరు: ‘రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. మేము ఊహించిన దానికంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఆర్బీకేలు గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలు చాలా ఇన్నొవేటివ్‌గా ఉన్నాయి. కియోస్క్ ద్వారా రైతులే నేరుగా వారికి కావల్సిన ఇన్పుట్స్ బుక్ చేసుకోవడం, సకాలంలో వాటిని అందించడం అద్భుత విధానం. ల్యాబ్ టు ల్యాండ్ కాన్సెప్ట్ కింద పరిశోధన ఫలితాలు, విస్తరణ కార్యక్రమాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లడం నిజంగా మంచి ఆలోచన. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా సేవలందిస్తున్నట్టు వినలేదు. ఈ తరహా ఆలోచన చేసిన సీఎం వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నాం’ అంటూ ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ ప్రశంసించారు. రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ గురించి తెలుసుకున్న ఇథియోపియా ప్రభుత్వం, వాటిని తమ దేశంలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్బీకే వ్యవస్థ పరిశీలనకు ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమీర్ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపింది. ఆ బృందం బుధవారం తొలుత గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ), ఆర్బీకే చానల్‌ను, ఆ తర్వాత కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట ఆర్బీకే–2ను సందర్శించింది. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో రైతుల నుంచి వస్తున్న కాల్స్‌ను రిసీవ్ చేసుకుంటున్న తీరు, అక్కడున్న శాస్త్రవేత్తలు, అధికారులు బదులిస్తున్న తీరును పరిశీలించింది. ఆర్బీకే చానల్ ద్వారా రైతులకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారో తెలుసుకుంది. గండిగుంట ఆర్బీకేలోనే రెండున్నర గంటలు ఆర్బీకేల సేవలను తెలుసుకునేందుకు ఈ బృందం గండిగుంట ఆర్బీకేలో రెండున్నర గంటల పాటు గడిపింది. రైతులతో మమేకమైంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల స్టాల్స్‌ను లకించింది. కియోస్క్ ద్వారా రైతులు ఇన్పుట్స్ బుక్ చేసుకుంటున్న విధానాన్ని పరిశీలించింది. డిజిటల్ లైబ్రరీ, కొనుగోలు కేంద్రం, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రం, వెటర్నరీ అంబులెన్స్, రైతు రథం, పొలం బడి క్షేత్రం ఇలా ప్రతి ఒక్కటీ పరిశీలించి వాటి పనితీరు, సేవలను తెలుసుకుంది. వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, విధులు, బాధ్యతలపై బృందం సభ్యులు ఆరా తీసారు. మూడేళ్లుగా ఆర్బీకేలు అందిస్తున్న సేవలను వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకేలొచ్చిన తర్వాత వ్యవసాయ అవసరాల కోసం గ్రామం విడిచి వెళ్లడంలేదని రైతులు ఈ బృందానికి వివరించారు. అనంతరం విజయవాడలో అధికారులతో సమావేశమయ్యారు. శాఖలవారీగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ బృందానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తాం ఆర్బీకేలు నిజంగా రోల్ మోడల్‌గా ఉన్నాయని ఇథియోపియా వ్యవసాయ మంత్రి చెప్పారు. వీటి సాంకేతికతను అందిపుచ్చుకుంటామని, తమ దేశంలో కూడా ఈ సేవలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. వ్యవసాయాధార దేశమైన ఇథియోపియాలో రైతులకు నాణ్యమైన సేవలందించడమే లక్ష్యమని చెప్పారు. సౌత్సౌత్ కో ఆపరేషన్ సమావేశంలో భారతప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, సీఏం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. ఈ పర్యటనలో ఇథియోఫియా బృందం సభ్యులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, శ్రీధర్, కన్నబాబు, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ పాల్గొన్నారు. -
AP: రైతు భరోసా కేంద్రాలకు ఇథియోపియా బృందం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఇథియోపియా బృందంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ పర్యటనలో భాగంగా ముందుగా గన్నవరంలో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్‌ను ఇథియోపియా బృందం సందర్శించింది. తర్వాత కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆర్బీకే -2 కేంద్రాన్ని సందర్శించింది. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, సీఎం జగన్ దార్శనికత కనిపిస్తోందని ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి అన్నారు. ఆయన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయి. ఆర్బీకేల వ్యవస్థ రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఆర్బీకేల వ్యవస్థ విషయంలో ఈ ప్రభుత్వం నుంచి మేం నేర్చుకోవాల్సింది ఉంది. ఆర్బీకేల్లో వ్యవసాయరంగంలో వివిధ విభాగాల అనుసంధానం బాగుంది. డిజటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. వ్యవసాయరంగంలో మీకున్న పరిజ్ఞానాన్ని మేం వినియోగించుకుంటాం. అలాగే మాకున్న పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను మీతో పంచుకుంటాం. వ్యవసాయరంగంలో రైతుకు అండగా నిలవాలి, వారికి మంచి జరగాలన్న మీ అభిరుచి, సంకల్పం క్షేత్రస్థాయిలో మంచి మార్పులకు దారితీయడం మమ్మల్ని అబ్బురపరుస్తోందని’’ ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది, కొనసాగుతుంది. ఏ రూపంలో కావాలన్నా మేం తోడుగా ఉంటాం. అలాగే మీ సహాయాన్ని కూడా తీసుకుంటాం. ఆర్బీకేలను సందర్శించడం, అక్కడ రైతులతో మాట్లాడ్డం సంతోషకరం. ప్రతి గ్రామానికీ కూడా వ్యవసాయరంగంలో ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాలు చేరుకోవాలన్నది లక్ష్యం, దీంట్లో భాగంగానే ఆర్బీకేలు వచ్చాయి. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందులు, ఎరువుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం మార్గాన్వేషణ చేశాం. అదే సమయంలో రైతుకు సరైన మార్గనిర్దేశం, అవగాహన కల్పించాలన్నది ఉద్దేశం. పంట చేతికి వచ్చిన తర్వాత ధర లేకపోతే రైతులు ఇబ్బంది పడతారు. ఇవన్నీకూడా మిలియన్ డాలర్ల ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేశాం. అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపడితేం అర్హులందరికీ అది అందాలి. ఈ ఆలోచనల క్రమంలోనే ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది. గ్రామ సచివాలయానికి విస్తరణగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకేలో పెట్టాం. ఆక్వా ప్రాంతాల్లో ఆరంగంలో గ్రాడ్యుయేట్‌ను, హార్టికల్చర్ సంబంధిత గ్రాడ్యుయేడ్‌ను ఆర్బీకేల్లో ఉద్యోగాల్లో ఉంచాం. ఆర్బీకేల్లో కియోస్క్‌ను కూడా పెట్టాం. ఆర్డర్ ఇచ్చిన వాటిని రైతుల దగ్గరకే చేరుస్తున్నాం. తద్వారా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను నివారిస్తున్నాం. ఆర్బీకేల్లో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం. ఇ–క్రాపింగ్ కూడా చేస్తున్నాం జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాం ఇ– క్రాపింగ్‌ను రైతులు కూడా ఆధీకృతం చేస్తున్నారు. ఫిజికల్ రశీదు, డిజిటల్ రశీదును కూడా ఇస్తున్నాం. పంటలకు వచ్చే ధరలను నిరంతరం పర్యవేక్షించడానికి సీఎంయాప్‌ను కూడా వినియోగిస్తున్నాం. ఎక్కడైనా ధరలు తగ్గితే అలర్ట్ వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి జోక్యం చేసుకుని రైతులకు నష్టంరాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు కనీస మద్దతు ధరలు అందిస్తున్నాం. ప్రతిరోజూకూడా విలేజ్‌అగ్రికల్చర్ అసిస్టెంట్ల నుంచి పంటల ధరలపై నివేదికలు తీసుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా ఈ విధానాలను అనుసరిస్తున్నాం. అంకిత భావంతో పనిచేసే అధికారుల వల్ల ఇవన్నీకూడా సాకారమవుతున్నాయి. వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాలు వచ్చేలా కృషిచేస్తున్నాం. జీవనోపాధి కోసం పట్టణాలకు వచ్చే వలసలను నివారించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు వాడకుండా నివారించాలన్నది మరో లక్ష్యం. దీనికోసం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు కూడా నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాం. సాయిల్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు, రసాయనాలు వాడాలి? అన్నదానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దీనికి సంబంధించి రిపోర్టు కార్డులను కూడా ఇస్తాం. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి తీసుకు వస్తాం’’ అని సీఎం అన్నారు. ఆర్బీకేల్లో డిజిటల్ సొల్యూషన్స్ విషయంలో తమకు సహకారాన్ని అందించాల్సిందిగా ఇథియోపియా బృందం కోరగా, కచ్చితంగా సహకారం అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ భేటీలో ఇథియోపియా బృందంతో పాటు వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఏపీస్టేట్ సీడ్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ జి. శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఏపీకి ప్రపంచ బ్యాంక్ బృందం రాక
సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించనుంది. తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఆర్బీకే తరహాలో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక చేయూత అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం గత నెలలో ఇథియోపియాలో పర్యటించింది. ఏపీ వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న వినూత్న విధానాలను అధ్యయనం చేసేందుకు వరల్డ్ బ్యాంక్‌లోని అగ్రికల్చర్ అండ్ ఫుడ్ గ్లోబల్ ప్రాక్టీస్ సీనియర్ కన్సల్టెంట్ హిమ్మత్ పటేల్ నేతృత్వంలోని ఈ బృందం ఢిల్లీ నుంచి మంగళవారం ఉదయం 8.45 గంటలకు విజయవాడ చేరుకోనుంది. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శిస్తారు. అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరు చేరుకుని ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించి రైతులతో భేటీ అవుతారు. అనంతరం ఘంటసాలలోని కేవీకేని సందర్శిస్తారు. అనంతరం విజయవాడ చేరుకుని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో భేటీ అవుతారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తారు. -
ఇథియోపియాలో ఘర్షణలు.. 200 మందికిపైగా మృతి
నైరోబీ: ఇథియోపియాలో శనివారం రెండు జాతుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అమ్రాహా తెగకు చెందిన 200 మందికిపైగా జనం మృతిచెందారు. ఒరోమియా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. దేశంలో ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. తాను 230 మృతదేహాలను లెక్కించా నని గింబీ కౌంటీకి చెందిన స్థానికుడు అబ్దుల్–సయీద్ తాహీర్ చెప్పారు. మృతదేహాలను అధికారులు సామూహికంగా ఖననం చేశారు. పునరావాస పథకం కింద 30 ఏళ్ల క్రితం ఇక్కడ స్థిరపడిన అమ్రాహా తెగపై ఒరోమో లిబరేషన్ ఆర్మీ దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్‌క్రాప్ట్ డీల్ సాంకేతిక లోపం.. కేబుల్ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు -
మనం 2022లో ఉంటే.. ఇథియోపియా ఇంకా 2014లోనే!
ఇవాళ తేదీ 14–05–2022.. ఇది అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పేదేముంది అంటారా! అవును.. ఇది మనకైతే కరెక్టే. కానీ ఇథియోపియాలో మాత్రం కాదు. ఈ రోజు వాళ్ల తేదీ ఏమిటో తెలుసా.. 6–9–2014. ఇదేదో చిత్రంగా ఉందనిపిస్తోందా? ఈ వివరాలేమిటో తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వలస పాలన ప్రభావం తప్పించుకుని.. 16, 17, 18వ శతాబ్దాల్లో యూరప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా వలస పాలన నెలకొల్పడమే.. గ్రెగోరియన్ కేలండర్ విస్తృతికి ముఖ్య కారణం. అయితే ఇథియోపియా ఎన్నడూ వలస పాలనప్రభావానికి లోనుకాలేదు. 1935లో ముస్సోలినీ ఆధ్వర్యంలోని ఇటలీ నియంతృత్వ ప్రభుత్వం ఇథియోపియాను ఆక్రమించినా అది1941లోనే ముగియడంతో.. ప్రభావంపడలేదు.ఇథియోపియన్లు తమ సొంత కేలండర్, సమయం వంటివి కొనసాగించుకున్నారు. సొంత కేలండర్‌తో.. ప్రస్తుతం మన దేశంతోపాటు ప్రపంచమంతా వినియోగిస్తున్న తేదీ, సమయం విధానాన్ని గ్రెగోరియన్ కేలండర్ అంటారు. సుమారు రెండు శతాబ్దాలుగా ప్రపంచమంతా ఇదే అధికారిక కేలండర్‌గా కొనసాగుతోంది. కానీ ఇథియోపియా మాత్రం తమ దేశంలో భిన్నమైన సొంత కేలండర్‌ను వినియోగిస్తోంది. ఇది ప్రపంచదేశాల కంటే సుమారు ఏడున్నరేళ్లు వెనుక కొనసాగుతుంది. వారికి 13 నెలలు.. మనకు ఏడాదిలో 12 నెలలుంటే.. ఇథియోపియాలో 13 నెలలు ఉంటా యి. 12 నెలలపాటు ప్రతినెలా 30 రోజులు ఉంటాయి. 13వ నెల మాత్రం మామూలు సంవత్సరాల్లో ఐదు రోజులు, లీప్ సంవత్సరంలో ఆరు రోజులు ఉంటుంది. ఈ నెలను పగ్యూమ్గా పిలుస్తారు. పగ్యూమ్ అనే పేరు గ్రీక్ భాషలోని ‘ఎపగోమీన్’ నుంచి వచ్చిందని చెప్తారు.. ‘ఏడాదిలో సమయాన్ని లెక్కిస్తూ మరిచిపోయిన రోజులివి’ అని ఈ పదానికి అర్థమట. ఉదయం ఆరు తర్వాతే రోజు మొదలు.. ఇథియోపియాలో సమయాన్ని లెక్కించే విధానమూ భిన్నమే. మన కేలండర్లో అర్ధరాత్రి 12 తర్వాత మరుసటి రోజు ప్రారంభమవుతుంది. కానీ వారికి ఉదయం ఆరు గంటలకు మరుసటి రోజు మొదలవు తుంది. ూ ఉదాహరణకు మనం శనివారం పొద్దున ఐదున్నరకు నిద్రలేస్తే.. ఆ రోజంతా శనివారమే ఉంటుంది. ఇథియోపియాలో పొద్దున ఐదున్నరకు నిద్రలేస్తే.. అప్పటికి ఇంకా శుక్రవారమే. ఇంకో అరగంట గడిచి ఆరు దాటితేనే శనివారం మొదలైనట్టు. బైబిల్ ఆధారం.. ఆలోచనల సముద్రం! ఇథియోపియన్లు బైబిల్ ఆధారంగా తమ కేలండర్‌ను రూపొందించుకున్నారు. దీనిని వారు ‘సీ ఆఫ్ థాట్స్ (ఆలోచనల సముద్రం)’గా చెప్పుకొంటారు. దేవుడి తొలి సృష్టి అయిన ఆడమ్ అండ్ ఈవ్ ఇద్దరూ ఏడేళ్లపాటు గార్డెన్ ఆఫ్ ఈడెన్‌లో నివసించారని.. తర్వాత వారి పాపాల ఫలితంగా బయటికి పంపేయబడ్డారని.. వారు పశ్చాత్తాపడటంతో 5,500 ఏళ్ల తర్వాత వారిని రక్షిస్తానని దేవుడు మాటిచ్చాడని బైబిల్ లోని వాక్యాలను గుర్తుచేస్తారు. ఈడెన్ గార్డెన్లో ఆడమ్అండ్ ఈవ్ గడిపిన ఏడేళ్లను తమ కేలండర్ నుంచి తొలగించారని చెప్తారు. ప్రపంచమంతా జీసస్ పుట్టినది క్రీస్తుశకం 1వ సంవత్సరంలోనని గుర్తిస్తే.. ఇథియోపియన్లు మాత్రం అంతకు ఏడేళ్ల ముందు క్రీస్తుపూర్వం 7వసంవత్సరంలో జీసస్ జన్మించాడని నమ్ముతారు. ఇథియోపియా కేలండర్లో వారంలో మొదటిరోజును ‘ఎహుద్’గా పిలుస్తారు. బైబిల్ ప్రకారం దేవుడు భూమిని, స్వర్గాన్ని సృష్టించడం మొదలుపెట్టిన రోజు అని దీని అర్థం. ప్రపంచమంతా జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకొంటే.. ఇథియోపియన్లు సెప్టెంబర్ 11న (లీప్ సంవత్సరమైతే 12వ తేదీన) సంబరాలు చేసుకుంటారు. వారి వార్షిక కేలండర్ ఆ రోజు నుంచే మొదలవుతుంది. లీప్ సంవత్సరం వచ్చే ప్రతి నాలుగు ఏళ్లను బైబిల్ ఎవాంజలిస్టులు అయిన నలుగురి పేర్లతో పిలుస్తారు. మొదటి ఏడాదిని జాన్ ఇయర్‌గా, రెండో ఏడాదిని మ్యాథ్యూ ఇయర్, మూడో ఏడాదిని మార్క్ ఇయర్, నాలుగో ఏడాదిని ల్యూక్ ఇయర్‌గా వ్యవహరిస్తారు. ఈసారి వారి 2015 నూతన సంవత్సర వేడుకలు ‘2022 సెప్టెంబర్ 11’న జరగనున్నాయి. -
900 యేళ్లనాటి ఈ గ్రామానికి రెండే ద్వారాలు... కారణం అదేనట..
ఇంటింటికీ ఓ సందు.. సందుసందుకీ ఓ దారి సహజమే. అలాంటిది, కొన్ని వందల ఇళ్లు ఉండే ఊరంటే.. ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సందులు, దారులు, రహదారులు, అడ్డదారులు ఇలా చాలానే ఉంటాయి. కానీ ఆ గ్రామం మొత్తానికీ రెండే రెండు ద్వారాలు ఉన్నాయి. లోపల ఎన్ని సందుగొందులు తిరిగినా ఆ రెండు ద్వారాల నుంచే బయటికి రావాలి, లోపలికి పోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వందల కుటుంబాలు కలిగి, రెండు ద్వారాల ఇల్లులాంటి ఊరది. ప్రపంచంలోనే ఎల్తైన గ్రామాల్లో ఇదొకటి. ఇథియోపియాలోని అమ్హారా అనే ప్రాంతంలో షోంకే అనే ఎత్తైన పర్వతశిఖరంపైన ఈ ప్రాచీన గ్రామం ఉంది. ఆ ఊరు పేరు షోంకే. తొమ్మిదొందల ఏళ్ల క్రితమే అది ఏర్పడింది. ఈ గ్రామం సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ జీవించిన వారిలో 20 తరాలకు సంబంధించిన వివరాలు, లెక్కలతో కూడిన ఆధారాలు ఉన్నాయట. షోంకే ప్రజలను ‘అర్గోబా’ అని పిలుస్తారు. అంటే దాని అర్థం ‘అరబ్బులు లోపలకి వచ్చారు’ అని. మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతం ప్రారంభించినప్పుడు ఆయాప్రాంతాల్లో కొన్ని ఘర్షణలు జరిగాయి. ఆ సందర్భంలో దాడుల నుంచి కాపాడేందుకు.. కొందరిని ఇథియోపియాలోని ఈ ప్రాంతానికి పంపించారు అప్పటి పాలకులు. భద్రత కారణాలతో అప్పట్లోనే ఈ గ్రామానికి కేవలం రెండు ద్వారాలే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ద్వారాల ముందు గార్డులు కాపలా కాస్తుంటారు. ఇస్లాం బోధనలో అక్కడున్న షోంకే మసీదు పేరు గాంచినది. అక్కడ ప్రాచీన తరహా ఇస్లాంని బోధిస్తారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా దాదాపు సగానికి తగ్గిపోయింది. ఒకప్పుడు ఇక్కడ దాదాపుగా 500 కుటుంబాలకు పైగానే ఉండేవి. కానీ ప్రస్తుతం 250 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. చాలామంది గ్రామస్తులు వ్యవసాయం కోసం, కొండప్రాంతాలను ఆనుకుని ఉండే ఇతర ప్రాంతాలకు తరలిపోయారట. ‘ఇది మా పూర్వీకుల గ్రామం, అందుకే మేము దీన్ని వీడలేని జ్ఞాపకంగా భావిస్తాం. వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం మాకు ఇష్టంలేదు’ అంటున్నారు మిగిలిన స్థానికులు. ఇప్పటికీ స్థానికంగా లభ్యమయ్యే రాళ్లతోనే వాళ్లు ఇళ్లు కట్టుకుంటారు. నగరాల్లోని హంగులు, ఆర్భాటాలను వీళ్లు పెద్దగా ఇష్టపడరు. దాంతో ఈ గ్రామం పర్యాటక ఆకర్షణగా నిలిచింది. చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!! -
డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌గా టెడ్రోస్ ఏకగ్రీవ ఎన్నిక
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. నామినేషన్లకు గడువు ముగిసిన తర్వాత టెడ్రోస్ పేరు మొదట్లో ఉండగా ఆయన అభ్యర్థిత్వానికి ఫ్రాన్స్, జర్మనీ మద్దతునిచ్చాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ డబ్ల్యూహెచ్ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్. -
అథ్లెటిక్స్ తొలి స్వర్ణం ఇథియోపియా ఖాతాలో
టోక్యో: ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లో తొలి స్వర్ణ పతకం ఇథియోపియా ఖాతాలోకి వెళ్లింది. శుక్రవారం అథ్లెటిక్స్ ఈవెంట్స్ ప్రారంభంకాగా... పురుషుల 10,000 మీటర్ల ఫైనల్ జరిగింది. ఇందులో ఇథియోపియా అథ్లెట్ సెలెమన్ బరేగా అందరికంటే ముందుగా 27 నిమిషాల 43.22 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచాడు. వరల్డ్ చాంపియన్, వరల్డ్ రికార్డు తన పేరిట లిఖించుకున్న కెన్యా అథ్లెట్ జోషువా చెప్తెగె (ఉగాండా) రజతం పతకంతో సరిపెట్టుకున్నాడు. చెప్తెగె 27 నిమిషాల 43.63 సెకన్లలో గమ్యానికి చేరాడు. శనివారం మహిళల 100 మీటర్ల సెమీఫైనల్స్‌తోపాటు ఫైనల్ ను నిర్వహిస్తారు. మహిళల 100 మీటర్ల ఫైనల్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు జరుగుతుంది. పురుషుల డిస్కస్‌త్రో, 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే ఫైనల్స్ కూడా జరుగుతాయి. -
వైరల్: మృగాళ్ల బారి నుంచి బాలికను కాపాడిన సింహాలు
అడ్డిస్బాబా: బుద్ధి, జ్ఞానం విచక్షణా శక్తి ఉన్న మనుషులు మృగాళ్లలా మారినా వేళ.. నోరు లేని మూగ జీవాలు మానవత్వం చూపాయి. ఓ చిన్నారి జీవితాన్ని నాశనం చేయడననికి ప్రయత్నించిన మృగాళ్ల బారీ నుంచి మృగరాజుల కాపాడాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికా ఖండం, ఇథోపియా దేశ రాజధాని అడ్డిస్ బాబా అనే ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. తన కుమార్తె కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. మరోవైపు కిడ్నాపర్లు బాలికను చిత్రహింసలకు గురిచేశారు. లైంగికంగా వేధించి బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా, బాలిక కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని స్థానికంగా ఉన్న ఓ అడవిలోకి వెళ్లింది. చిన్నారి జాడ కోసం కిడ్నాపర్లు అడవిలోకి వెళ్లారు. అలా సగం దూరం అడవిలోకి వెళ్లిన బాలికకు సింహాలు అండగా నిలిచాయి. ఓ చెట్టుకింద 3 సింహాలు కిడ్నాపర్ల నుంచి రక్షించేందుకు బాధితురాల్ని రౌండప్ చేశాయి. దీంతో కిడ్నాపర్లు గుండెల్ని అరచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరారయ్యారు. కాగా గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. విచారణలో చిన్నారి సురక్షితంగా ఉందని, ఆమెను సింహాలు కాపాల కాస్తున్నాయని చెప్పారు. దాంతో షాక్ తిన్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనస్థలానికి వెళ్లారు. అక్కడ తీవ్రగాయాలతో షాక్‌కు గురైన చిన్నారిని అక్కున చేర్చుకొని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్పృహలోకి వచ్చిన చిన్నారి అడవిలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు సింహాలపై ప్రశంసల వర్షం కురిపించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుల్ని కటకటల్లోకి నెట్టారు. సింహాలు బాలికను రక్షించకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అటవీ శాఖ అధికారి వెండాజు తెలిపారు. ఈ ప్రాంతంలో చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతాయి. లైంగిక దాడుల అనంతరం బలవంతంగా పెళ్లిచేసుకుంటారు. ఒప్పుకోలేదంటే ప్రాణాలు తీసి పైశాచికానందం పొందుతారని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: నెల రోజుల్లో భార్యకు 3 సార్లు విడాకులిచ్చి.. -
మగాళ్లను భయపెట్టి సొంతిట్లో ఆడవాళ్లపై అత్యాచారం
న్యూయార్క్ : ఇథియోపియాలోని టిగ్రే జాతిపై సరిహద్దు దేశం ఎరిట్రియా సైనికులు దారుణాలకు పాల్పడుతున్నట్లు యునైటెడ్ నేషన్స్ ప్రతినిధి వాఫా గురువారం మీడియాకు వెల్లడించారు. దాదాపు 516 మంది అత్యాచారానికి గురయ్యారని, ఆ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉండొచ్చని ఆమె అన్నారు. వాఫా మాట్లాడుతూ.. ‘‘ ఎరిట్రియా సైనికులు టిగ్రే జాతి వారు నివసించే ప్రాంతాల్లోకి చొరబడి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. కుటుంబసభ్యుల కళ్లెదుటే ఈ దారుణానికి పాల్పడుతున్నారు. కుటుంబంలోని మగాళ్లను భయపెట్టి వారితోటే సొంతిట్లోని ఆడవాళ్లపై అత్యాచారం చేయిస్తున్నారు. మెకెల్లే, అడిగ్రట్, ఉక్రో, షిరేలోని మెడికల్ సెంటర్లలో దాదాపు 516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. చాలా వరకు మెడికల్ సెంటర్లు సరిగా పనిచేయటం లేదు’’ అని పేర్కొన్నారు. దీనిపై ఇథియోపియా యూన్ఎన్ అంబాసిడర్ టాయే అస్కేసెలస్సీ అంబ్డే స్పందించారు. ఈ అత్యాచార ఆరోపణలను తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పారు. నిజానిజాలు తేల్చటానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ ఘటనపై ఎరిట్రియా సమాచార శాఖ మంత్రి యమనె గెబ్రెమెస్కెల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అత్యాచార ఘటనలు ఎరిట్రియా సమాజానికి అసహ్యమన్నారు. అలాంటివి జరిగినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
ఇథియోపియాను చూసి నేర్చుకుందాం!
సాక్షి, హైదరాబాద్: ఆ దేశ జనాభా 11 కోట్లు.. అక్కడి ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వెంటిలేటర్లు 450.. ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి పోను, కరోనా బాధితుల కోసం కేటాయించినవి కేవలం 54 మాత్రమే. ఇలాంటి తరుణంలో ఆ వైరస్ విజృంభిస్తే పరిస్థితేంటి..? ఇది ఆఫ్రికా దేశం ఇథియోపియా ముందున్న భయం. సమస్య పెరిగితే తట్టుకోవటం కష్టం. అందుకే సమస్యను ఉన్నంతలో కట్టడి చేయాలని నిర్ణయించింది. అసలే అతి చిన్న ఆర్థిక వ్యవస్థ.. లాక్డౌన్ చేస్తే మరింత చితికిపోతామన్న ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కల్పించింది. కేవలం అవసరమున్నవారు తప్ప మిగతావారు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. బయటకు వచ్చిన వారు గుమి కూడకుండా కనీసం మీటరుకు ఒకరు చొప్పున దూరం పాటించాలని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు గుర్తించి జనం కూడా సహకరించటం ప్రారంభించారు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 65 మాత్రమే. ప్రజలు క్రమశిక్షణగా ఉన్నారు.. ‘భౌతిక దూరం పాటించటం ఒక్కటే కరోనాను నియంత్రించే మంత్రం. ఇప్పుడు ఇథియోపియా జనం అదే చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాన్ని పాటించటంలో క్రమశిక్షణ చూపుతున్నారు. ఈ పేద దేశాన్ని ఆ క్రమశిక్షణే గట్టునపడేస్తుందని మేం నమ్ముతున్నాం’అని డాక్టర్ రాజు రమేశ్‌రెడ్డి చెప్పారు. అర్బా మించ్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన.. కరోనాను ఎదుర్కొనేందుకు ఇథియోపియా అనుసరిస్తున్న తీరును ‘సాక్షి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు కరోనాను సకాలంలో నియంత్రించలేక అల్లకల్లోలమవుతోంది. మరి అమెరికా లాంటి దేశాల ఆర్థిక సాయంతో నెట్టుకొచ్చే పేద ఇథియోపియా తట్టుకోగలదా.. అందు కే మార్చి తొలివారంలోనే అక్కడి ప్రభుత్వం మేల్కొంది. సరిహద్దులను మూసేసింది, విమానాలను రద్దు చేసింది. రాజధాని నగరం అడిస్ అబాబాలో కఠిన ఆంక్షలు విధించింది. కేసుల సంఖ్య తక్కువగానే ఉండటంతో ఇప్పటికీ లాక్ డౌన్ విధించలేదు. కానీ విద్యాసంస్థలు మూసేసి, అవకాశం ఉన్న వారందరినీ ఇంటి నుంచే పనిచేయమని పురమాయించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదేశించింది. వాహనా ల్లో సీటుకు ఒకరే కూర్చోవాలని, ఆటోరిక్షాల్లో ఇద్ద రు మాత్రమే ఉండాలని ఆదేశించింది. ఇక ప్రజ ల్లో అవగాహన కోసం 35 వేల మందితో బృందా లు ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు చూసి ఆందోళన లో ఉన్న జనం ఆ నిబంధనలను బాగా పాటిస్తున్నారు. స్వీయ నియంత్రణతో క్రమశిక్షణగా ఉంటున్నారు. ఒక్కరోజే 8 కేసులు.. హెల్త్ ఎమర్జెన్సీ రాజధాని నగరంలో 44 పాజిటివ్ కేసులు మాత్రమే ఉండేవి. మంగళవారం ఒక్కరోజే 8 కేసులు పెరిగి ఆ సంఖ్య 52కు చేరుకుంది. దీంతో ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. 4 కేసులు మాత్రమే రాజధాని ఆవల ఉన్నాయి. ఇప్పటివరకు రాజధానిలోనే ఉన్న కఠిన ఆంక్షలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు. దేశమంతటా ప్రజల్లో క్రమశిక్షణ కనిపిస్తున్నందున సమస్యను పెరగకుండా చూసే అవకాశముంది. ఇంజీరాతో రోగనిరోధక శక్తి ఇథియోపియా ప్రజల సంప్రదాయ ఆహారం ఇంజీరా. గసాల ఆకారంలో ఉండే మిల్లెట్ (టెఫ్) పిండితో తయారు చేసే ఈ ఆహారం అక్కడి ప్రజల రోగ నిరోధకశక్తిని బాగా పెంచుతోంది. ఎన్నో వ్యాధుల నుంచి వారికి ఇది రక్షణగా ఉంటుంది. 80% గ్రామీణ జనాభాతో ఉండే ఈ దేశంలో కాలుష్యం చాలా తక్కువే. వెరసి ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇప్పుడు కరోనాను కూడా వారి శరీరం తట్టుకునే అవకాశముంది. ఇటు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇథియోపియా జనాన్ని చూసైనా భారతీయులు స్వీయ క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితి కుదుటపడే అవకాశముంది. అయితే భారత్‌తో పోలిస్తే మేం చాలా ధైర్యంగా ఉన్నామని డాక్టర్ రాజు రమేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.