అందం సరే.. ముద్దులు ఎలా? | The tribal women from Ethiopia wears a large lip plate in their mouths | Sakshi
Sakshi News home page

అందం సరే.. ముద్దులు ఎలా?

Published Fri, May 6 2016 2:32 PM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

The tribal women from Ethiopia wears a large lip plate in their mouths

ముద్దు లేదా చుంబనం, ఆంగ్లంలో కిస్.. ప్రేమను వ్యక్తం చేసే ఒకానొక పద్ధతి. ఈ ప్రక్రియలో ప్రధాన పాత్రను పోషించేవి పెదవులు లేదా అధరములు. ప్రేమను వ్యక్తంచేసే ఓ తల్లి తన బిడ్డ నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెడుతుంది. కొన్ని దేశాల్లో స్వాగతం, వీడ్కోలు పలికేటప్పుడు ముద్దులు పెట్టుకోవడం సంస్కృతిలో భాగం. హ్యూమన్ ఎమోషన్స్ లో  ఇంత ప్రాముఖ్యమున్న ముద్దుల ప్రక్రియకు దూరంగా ఉంటూకూడా ఆప్యాయతను పంచడం ఎలాగో ఈ ఇథియోపియన్ గిరిజన మహిళలను చూసి నేర్చుకోవాల్సిందే.

అరుదైన ముర్సి తెగకు చెందిన కొన్ని కుటుంబాలు ప్రఖ్యాత మాంగో నేషనల్ పార్క్ లో జీవనం సాగిస్తున్నాయి. (వాళ్లు పార్క్ లో ఉండటంకాదు, వాళ్లు ఉంటోన్న ప్రదేశాన్నే పార్క్ గా మార్చారు). ఆ తెగ మహిళలు తమ పెదవులు ఎంత పొడవుగా సాగితే అంత అందంగా ఉంటామని నమ్ముతారు. అందుకే యుక్త వయసు రాగానే కింది పెదవిని సాగదీస్తూ లోహపు ప్లేట్లు ధరిస్తారు. పెదవిలో అమర్చిన ప్లేట్ ఎంత పెద్దగా ఉంటే అంత అందగత్తెలని వాళ్ల నమ్మకం. పోలండ్ కు చెందిన ప్రచారకర్త సెజారేఫిలే (54)  ఇటీవలే ఇథియోపియాలో పర్యటించిన సందర్భంలో తనకు కనిపించిన ముర్సీ మహిళలను చూసి ఆశ్చర్యపోయారట. వారి అనుమతితో అక్కడి అందగత్తెల ఫొటోలు తీశారు. వాటిలో కొన్ని ఇవి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement