అథ్లెటిక్స్‌ తొలి స్వర్ణం ఇథియోపియా ఖాతాలో | Ethiopian distance runner Selemon Barega first gold in athletics | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ తొలి స్వర్ణం ఇథియోపియా ఖాతాలో

Published Sat, Jul 31 2021 5:48 AM | Last Updated on Sat, Jul 31 2021 5:48 AM

Ethiopian distance runner Selemon Barega first gold in athletics  - Sakshi

టోక్యో: ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లో తొలి స్వర్ణ పతకం ఇథియోపియా ఖాతాలోకి వెళ్లింది. శుక్రవారం అథ్లెటిక్స్‌ ఈవెంట్స్‌ ప్రారంభంకాగా... పురుషుల 10,000 మీటర్ల ఫైనల్‌ జరిగింది. ఇందులో ఇథియోపియా అథ్లెట్‌ సెలెమన్‌ బరేగా అందరికంటే ముందుగా 27 నిమిషాల 43.22 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచాడు. వరల్డ్‌ చాంపియన్, వరల్డ్‌ రికార్డు తన పేరిట లిఖించుకున్న కెన్యా అథ్లెట్‌ జోషువా చెప్తెగె (ఉగాండా) రజతం పతకంతో సరిపెట్టుకున్నాడు. చెప్తెగె 27 నిమిషాల 43.63 సెకన్లలో గమ్యానికి చేరాడు. శనివారం మహిళల 100 మీటర్ల సెమీఫైనల్స్‌తోపాటు ఫైనల్‌ ను నిర్వహిస్తారు. మహిళల 100 మీటర్ల ఫైనల్‌ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు జరుగుతుంది. పురుషుల డిస్కస్‌త్రో, 4్ఠ400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే ఫైనల్స్‌ కూడా జరుగుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement