ఒకవేళ ఆఫ్రికా ఖండం ముక్కలైతే ఇలా ఉండొచ్చు (ఊహాజనిత చిత్రం)
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా రెండుగా చీలిపోనుందా..? ఆఫ్రికా వాసుల మెదళ్లను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న ఇదే. కెన్యా రాజధాని నైరోబికి చేరువలోని హైవేపై ఏర్పడిన పగులు ఈ ఆందోళనలకు కేంద్ర బిందువు అయింది. టెక్టోనిక్ ప్లేట్లలో నైరుబీ వద్ద వస్తున్న కదలికలు ఆఫ్రికా రెండుగా విడిపోతుందనే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి.
నైరుతీ కెన్యాలో గల రిఫ్ట్ వ్యాలీ వద్ద భారీ పగులు ఏర్పడింది. కొన్ని మైళ్ల పాటు విస్తరించిన ఈ పగులు కారణంగా నైరోబీ-నరోక్ హైవే కూడా దెబ్బతింది. అంతేకాదు కొన్ని ఇళ్లు సగానికి చీలిపోయాయి కూడా. ఈ పగులు కారణంగా భవిష్యత్‌లో ఆఫ్రికా రెండు ముక్కలు అవుంతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని చెప్పారు.
నుబియన్ ప్లేట్ నుంచి సోమాలి టెక్టానిక్ ప్లేట్ విడిపోయే క్రమంలో ఈ చీలిక జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నెమ్మదిగా జరిగే ఈ ప్రక్రియ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పూర్తవుతుందని వివరించారు. ప్రకృతి బద్దంగా జరిగే ఈ ప్రక్రియను అడ్డుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు.
విడిపోయే ముక్కలో ఉండే సోమాలియా, కెన్యా, ఇథియోపియాలు హిందూ మహాసముద్రంలో ద్వీపాలుగా మారుతాయని చెప్పారు. దీనివల్ల ఆఫ్రికా ఖండం చిన్నగా మారుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment